బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో పోస్ట్! | Tv Actress Shireen Mirza Welcomes Baby Boy After 4 Years Of Marriage | Sakshi
Sakshi News home page

Shireen Mirza: పెళ్లై నాలుగేళ్లు.. మొదటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర భామ!

Jun 11 2025 6:37 PM | Updated on Jun 11 2025 6:56 PM

Tv Actress Shireen Mirza Welcomes Baby Boy After 4 Years Of Marriage

ప్రముఖ బుల్లితెర నటి  షిరీన్ మీర్జా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించిన షిరీన్.. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత మొదటి బిడ్డకు ఆహ్వానం పలికింది. జూన్ 9న తమకు బాబు పుట్టాడని దంపతులిద్దరూ ఈ శుభవార్తను పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.

కాగా.. షిరీన్ మీర్జా బాలీవుడ్‌లో యే హై మొహబ్బతేన్ సీరియల్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బోహోత్ ప్యార్ కర్తే హై, దై కిలో ప్రేమ్, యే హై ఆషికి, గుతుర్ గు, అన్హోనియోన్ కా అంధేరా లాంటి సీరియల్స్‌లో మెప్పించింది. షిరీన్ చివరిసారిగా యే హై చాహతేన్ షోలో కనిపించింది. షిరీన్ 2021లో హసన్ సర్తాజ్‌ను వివాహం చేసుకుంది. దాదాపు పెళ్లైన నాలుగేళ్ల తర్వాత బిడ్డ పుట్టడంతో బుల్లితెర దంపతులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement