కోలీవుడ్‌లో ఇప్పుడంతా త్రిష పేరే వినిపిస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె స్టార్‌డమ్ మరింత పెరిగిపోయింది. ఆమె పాలిటిక్స్‌లోకి రానుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ అలాంటిదేం జరగలేదు.. మరోవైపు ఆమెనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా తమిళనాడు రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవల ఉదయనిధి త్రిషపై అనుచిత కామెంట్స్ చేశారని ఆరోపణలు రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇది కాస్తా ఉదయనిధి అరెస్ట్ వరకు వెళ్లింది. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
తాజాగా ఈ వివాదంపై స్టార్ హీరో, నిర్మాత విశాల్ మరోసారి స్పందించారు. తన క్లాస్‌మేట్ అయిన ఉదయనిధికే తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. తాను దర్శకత్వం వహించిన మకుటం మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తమ రాజకీయ మార్గాలు వేరైనా సరే.. తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు ఉండవని విశాల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కళాశాల రోజులను గుర్తు చేసుకున్నారు. ఆయన కృతిగతో ప్రేమలో ఉన్నప్పుడే తన అభిమానం మొదలైందని విశాల్ వెల్లడించారు. మా మధ్య శత్రుత్వానికి ఆస్కారమే లేదని క్లారిటీ ఇచ్చారు.
విశాల్ మాట్లాడుతూ.. "నాకు ఉదయ, కృతిగ అంటే ఎప్పటికీ ఒకటే ప్రేమ. ఏది ఏమైనప్పటికీ ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా. ఉదయనిధి.. కృతిగను ప్రేమిస్తున్న దశలోనే అతనిపై అభిమానం మొదలైంది. మా మధ్య శత్రుత్వానికి ఆస్కారమే లేదు. రేపు నేను రాజకీయాల్లోకి ప్రవేశించినా.. అది కేవలం ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే అవుతుంది. మా మధ్య ఎప్పటికీ విభేదాలు ఉండవు," అని అన్నారు.
అంతకుముందు ఉదయనిధి అరెస్ట్‌పై రాజకీయాల్లో ఇవీ సహజమని విశాల్ ప్రకటించారు. ప్రస్తుతం విశాల్ తొలిసారి దర్శకత్వం వహించిన మకుటం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో అంజలి, దుషార విజయన్ కీలక పాత్రల్లో నటించారు.


