అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేశ్ కనగరాజ్,వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డీసీ’. తమిళ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఐదో రోజైన మంగళవారం ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల మార్క్‌ను దాటింది.
ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం.. మంగళవారం ఇండియాలో రూ.5.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. సోమవారం నమోదైన దాదాపు రూ.6 కోట్లతో పోలిస్తే ఇది 10శాతం తక్కువ. గడిచిన ఐదు రోజుల్లో దేశీయంగా రూ.32.35కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. భారత్‌లో గ్రాస్ కలెక్షన్లు రూ.37.21 కోట్లుగా ఉన్నాయి. ఓవర్సీస్‌లో రూ.14.50 కోట్లు రాబట్టడంతో ప్రపంచవ్యాప్తంగా రూ.51.71 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదయ్యాయి.
ఏపీ, తెలంగాణ నుంచి రూ.1.60 కోట్లు
ఐదో రోజు భారత్‌లో ‘డీసీ’ రూ.6.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేరళ నుంచి 1.85 కోట్లు, తమిళనాడు నుంచి 1.75 కోట్లు, ఏపీ, తెలంగాణ నుంచి రూ.1.60 కోట్లు, కర్ణాటక నుంచి రూ.65 లక్షలు, మిగతా ప్రాంతాల నుంచి రూ. 35 లక్షల వసూళ్లు వచ్చాయి.
| రోజు | కలెక్షన్లు (రూ. కోట్లలో) |
|---|---|
| 1 | 4.40 |
| 2 | 7.00 |
| 3 | 9.55 |
| 4 | 6.00 |
| 5 | 5.40 |
| మొత్తం | 32.35 |


