పతి దేవునికి స్టార్ హీరోయిన్ పూజలు.. ఎందుకంటే? | Pranitha Subhash Performs Bheemana Amavasya Puja to Husband: Viral Photos | Sakshi
Sakshi News home page

Pranitha Subhash: పతి దేవునికి ప్రణీత పూజలు.. ఎందుకంటే?

Aug 12 2026 3:50 PM | Updated on Aug 12 2026 4:00 PM

tollywood actress Pranitha Subhash done Pooja with husband goes viral

అత్తారింటికి దారేది మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన కన్నడ బ్యూటీ ప్రణీత. ఈ చిత్రంలో తన అందమైన కళ్లతో అభిమానులను కట్టిపడేసింది. తెలుగులో హలో గురు ప్రేమకోసమే అనే చిత్రంలోనూ మెప్పించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ మెరిపింది ముద్దుగుమ్మ. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న భామ.. సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పేసింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

సినిమాల్లో లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను అభిమానులకు తన అప్‌డేట్స్ ఇస్తూ టచ్‌లోనే ఉంటోంది. తాజాగా ప్రణీత సోషల్ మీడియాలో ఓ పిక్‌ షేర్ చేసింది. ఇవాళ భీమన అమావాస్య కావడంతో తన భర్త కాళ్లకు ప్రత్యేక పూజలు చేసింది. పతిదేవునికి నమస్కరిస్తూ ఉన్న ఫోటోను ట్విట్‌ర్‌లో పంచుకుంది. ఇది చూసిన నెటిజన్స్‌ భర్త అంటే ఎంత గౌరవమో అని కామెంట్స్ చేస్తున్నారు.

భీమన అమావాస్య ఎందుకు చేస్తారంటే.. 
 
భీమన అమావాస్య అనేది కర్ణాటక, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో పాటిస్తారు. ఈ మాసం చివరి రోజైన అమావాస్య నాడు జరుపుకునే హిందూ సంప్రదాయ పండుగ. ఈ రోజు పవిత్రమైన ఉపవాసంలో ఉంటారు. ఈ రోజును శివపార్వతులకు అంకితంగా భావిస్తారు. ఈ సందర్భంగా మహిళలు తమ భర్తలకు, కుటుంబంలోని పురుషులకు ఆరోగ్యం, దీర్ఘాయువు, శ్రేయస్సుతో ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement