టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు తాజాగా తన డైరీలోని ఓ పేజీని సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాను సాధించాలనుకున్న విషయాలను ముందుగానే డైరీలో రాసుకుని.. వాటిని నిజం చేసుకునేందుకు ఎంతో కష్టపడ్డానని తెలిపారు.
‘నాకు నేను చేసుకున్న 1000 రోజుల వాగ్దానంలో ఇది 484వ రోజు. ఇంకా జీవితంలోకి రాని కలలను ముందే రాసుకోవడంలో ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. కొన్ని విషయాలను డైరీలో రాసుకున్నప్పుడు.. కొంత ఇబ్బందిగా అనిపించింది. అయినా రాశాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే.. అసాధ్యమనుకున్న వాటిలో ఎన్నో నిజమయ్యాయి’ అని సమంత పేర్కొన్నారు. కలలను రాసుకోవడం మాత్రమే సరిపోదు. వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం కష్టపడాలి. ఈ రోజు మీ జీవితం ఎలా ఉందో దానికంటే పెద్దగా కలలు కనండి. వాటిని నమ్మండి’ అని రాసుకొచ్చారు.
గతేడాది డిసెంబరులో దర్శకుడు రాజ్ నిడిమోరు, సమంత పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నిన్సీతో ఉంది. ఇటీవలే చిత్తూరులోని తన అత్తారింటిలో సీమంతం చేసుకుంది. ఈ ఏడాది డిసెంబరులో బిడ్డకు జన్మనిచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సమంత చివరిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’లో నటించారు. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.


