మహారాష్ట్రకు చెందిన జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్‌కర్ జీవితం ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘ఈఠా’. మహారాష్ట్రకు చెందిన సంప్రదాయ కళలు ‘లవానీ’, ‘తమాషా’లో అత్యంత ప్రావీణ్యురాలైన విఠాబాయిగా వెండితెరపై శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు. రణదీప్ హూడా ఓ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ‘ఛావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
దినేష్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మా శర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల వెల్లడించారు మేకర్స్. అయితే ఆ తేదీకి విడుదల చేయడం లేదని, ఈ ఏడాది డిసెంబరు 4న రిలీజ్ చేయనున్నామని మంగళవారం నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.


