మెగాస్టార్- బాబీ కాంబో.. టైటిల్ లీక్ చేసిన చిరు | Chiranjeevi Revealed Mega158 Movie Title at Event goes Viral | Sakshi
Sakshi News home page

Chiranjeevi: మెగాస్టార్- బాబీ కాంబో.. టైటిల్ లీక్ చేసిన చిరు

Aug 11 2026 7:44 PM | Updated on Aug 11 2026 8:47 PM

Chiranjeevi Revealed Mega158 Movie Title at Event goes Viral

చిరంజీవి- బాబీ కాంబోలో మరో చిత్రం రానుంది. వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. ఈ మూవీని మెగా 158 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తుండగా..గతంలో ఈ సినిమాకు కాకాజీ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే చిరు తన సినిమాలకు సంబంధించి అప్పుడప్పుడు అభిమానులకు అప్‌డేట్స్ ఇస్తుంటారు. చిరు లీక్స్‌ పేరుతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం ఆయనకు సరదా. తాజాగా మెగా158 మూవీ టైటిల్‌ కూడా అలాగే లీక్‌ చేశారు. కొరియన్ కనకరాజు ఈవెంట్‌కు హాజరైన మెగాస్టార్.. యాంకర్ ప్రశ్నకు అప్‌డేట్ ఇవ్వబోయాడు. అదే ఫ్లోలో తమన్‌ను అడుగుతూ.. సేమ్ టైటిల్‌ కదిరిలాగా అంటూ సగంలోనే ఆపేశారు. దీంతో ఈ మూవీకి టైటిల్‌ కదిరి నరసింహుడు అనే టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. చిరంజీవి మరోసారి చిరు లీక్స్‌ పేరుతో తన సినిమా టైటిల్‌ బయటపెట్టేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement