ఐదేళ్ల తర్వాత మరో ఓటీటీకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Director Marithi film Manchi Rojulochaie Streaming another OTT after 5 years | Sakshi
Sakshi News home page

OTT Movie: ఐదేళ్ల తర్వాత మరో ఓటీటీకి మారుతి మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aug 11 2026 5:14 PM | Updated on Aug 11 2026 5:23 PM

Director Marithi film Manchi Rojulochaie Streaming another OTT after 5 years

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన లవ్ అండ్ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్ 'మంచి రోజులు వచ్చాయి'. ఈ మూవీలో సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా నటించారు. 2021లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.

అయితే దాదాపు రిలీజైన ఐదేళ్ల తర్వాత ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ మూవీని ఎస్‌కేఎన్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సం‍గీతం అందించారు.  ఈ సినిమాలో వెన్నెల కిశోర్, స‌ప్త‌గిరి, వైవా హ‌ర్ష‌, అశిష్ ఘోష్ ముఖ్య‌పాత్ర‌ల్లో  నటించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement