'గేమ్ ఛేంజర్' ఫ్లాప్.. శంకర్‌కి నెక్స్ట్ హీరో దొరికాడా? | Director Shankar New Movie With Ajith | Sakshi
Sakshi News home page

Director Shankar: డైరెక్టర్ శంకర్ కొత్త ప్రాజెక్ట్ ఓకే అయిందా?

Aug 12 2026 10:30 AM | Updated on Aug 12 2026 10:40 AM

Director Shankar New Movie With Ajith

పాన్ ఇండియా ట్రెండ్ లేని టైంలోనే రోబో, శివాజీ, భారతీయుడు తదితర సినిమాలతో హిట్ కొట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. ప్రస్తుతం ఈయన పరిస్థితి ఏం బాగోలేదు. మెగాహీరో రామ్ చరణ్‌తో 'గేమ్ ఛేంజర్' తీస్తే ఇది ఘోరంగా డిజాస్టర్ అయింది. దీని తర్వాత శంకర్ ఏం మూవీ చేస్తాడా? అని అంతా అనుకున్నారు. ఇలాంటి టైంలోనే ఓ ప్రాజెక్ట్ సెట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.

'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' లాంటి హిట్ తర్వాత చాలానే గ్యాప్ తీసుకున్న తమిళ స్టార్ హీరో అజిత్.. ప్రస్తుతం 'డేర్ డెవిల్' మూవీ చేస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దీనికి దర్శకుడు. దీని తర్వాత వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో 'మంగాత్త 2'(తెలుగులో 'గ్యాంబ్లర్') చేస్తాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ హీరో.. శంకర్‌ దర్శకత్వంలోనూ నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

వేల్పారి అనే చారిత్రక కథతో భారీ సినిమా తీయాలని శంకర్ అనుకున్నారు. కానీ దీనికి చాలానే డబ్బులు, టైమ్ కావాలి. దీంతో దీనికంటే ముందు ఓ మూవీ తీసి సక్సెస్ అందుకోవాలని శంకర్ అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే అజిత్‌తో ప్రాజెక్ట్ సెట్ చేసే పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ కాంబో సెట్ అవుతుందో లేదా అనేది చూడాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement