స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ తొలిసారి హీరోగా చేసిన సినిమా 'డిసి'. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించాడు. వామిక గబ్బి హీరోయిన్. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. పెద్దగా హడావుడి లేకుండానే థియేటర్లలోకి వచ్చి అద్భుతమైన విజయం సాధించింది. వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. తొలి వీకెండ్ అయ్యేసరికి రూ.50 కోట్ల సొంతం చేసుకుంది. ఇదే అధికారికంగానూ ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా)
దీంతో 'డిసి'కి సీక్వెల్ తీయాలనే ఆలోచన మొదలైందని అనుకుంటున్నారు. లోకేశ్ కనకరాజ్, దర్శకుడు అరుణ్ కాంబో రిపీట్ కానుందనే ప్రచారం జరుగుతుంది. దీనికి కూడా అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నట్లు సమాచారం. అయితే డిసి చిత్రం తరహాలో ఇది కూడా హింసాత్మక ఘటనలతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందా ? లేక వేరే నేపథ్యంలో సాగే కథగా సాగుతుందా అనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం లొకేశ్ కనకరాజ్.. అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి చేసిన తర్వాతే హీరోగా రెండో మూవీ చేస్తాడా? డైరెక్షన్ చేస్తూ నటన కూడా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు.
(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ)


