ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా | Heartin Movie OTT Release Date Latest | Sakshi
Sakshi News home page

OTT Movie: ఇద్దరు అమ్మాయిలతో ఒకేసారి ప్రేమ.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Aug 11 2026 2:58 PM | Updated on Aug 11 2026 3:23 PM

Heartin Movie OTT Release Date Latest

ఓటీటీలోకి ఈ వారం చాలానే సినిమాలు రాబోతున్నాయి. వాటిలో కాక్ టెయిల్ 2, భారతభాగ్య విధాత, కాటలన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు 20కి పైగా చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఓ తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)

సనత్, మడోన్నా సెబాస్టియన్, ఎమాయా ప్రధాన పాత్రలు చేసిన చిత్రం 'హార్టిన్'(Heartin Movie). జూన్ 26న తమిళం వరకు మాత్రమే రిలీజైంది. ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడీ సినిమా ఈ శుక్రవారం(ఆగస్టు 14) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకురానున్నారు. అలానే విదేశాల వరకు సింప్లీ సౌత్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.

'హార్టిన్' విషయానికొస్తే.. శివ(సనత్) కాలేజీ చదువుతున్నప్పుడు సాహిత్య(మడోన్నా సెబాస్టియన్)ని ప్రేమిస్తాడు. రిలేషన్‌షిప్ కూడా మెంటైన్ చేస్తాడు. తర్వాత కొన్నాళ్లకు సాధన(ఎమాయా)తో ప్రేమలో పడతాడు. ఇలా ఒకేసారి ఇద్దరిని లవ్ చేస్తాడు. తర్వాత ఏమైంది? ఈ ట్రయాంగిల్ ప్రేమకథలో ఎవరు ఒక్కటయ్యారు? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement