ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్ | Here's The List Of 22 New Movies And Web Series Releasing In OTT In This August 2nd Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 22 మూవీస్.. మరి థియేటర్లలో?

Aug 10 2026 9:10 AM | Updated on Aug 10 2026 10:02 AM

Upcoming OTT Movies August Second Week 2026

మరో వారం వచ్చేసింది. ఈసారి ఇండిపెండెన్స్ డే-వీకెండ్ కలిసొచ్చింది. దీంతో పలు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అగధ, పళ్లబురుసు, అనకాపల్లి లాంటి తెలుగు మూవీస్ అలానే విశాల్ 'మకుటం' అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కానుంది. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు.

(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)

మరోవైపు ఓటీటీల్లో 22 వరకు సినిమాలు, సిరీస్ ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రష్మిక 'కాక్ టెయిల్ 2', భారతభాగ్య విధాత లాంటి హిందీ చిత్రాతో పాటు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే తెలుగు మూవీ కూడా ఉంది. ఉన్నంతలో ఇవే కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. వీకెండ్‌లో ఏమైనా సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్‌లు ఉండొచ్చు. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 10 నుంచి 16 వరకు)

హాట్‌స్టార్

  • హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10

  • 108 బేస్ హాస్పిటల్: ఉరి  (హిందీ సిరీస్) - ఆగస్టు 15

జీ5

  • భారత భాగ్య విధాత (హిందీ మూవీ) - ఆగస్టు 14

  • నిబ్బానిబ్బీ (మరాఠీ సినిమా) - ఆగస్టు 14

సన్ నెక్స్ట్

  • మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు సినిమా) - ఆగస్టు 14

ఆహా

  • చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె-యూఎస్ఏ (తెలుగు కుకింగ్ షో) - ఆగస్టు 13

నెట్‌ఫ్లిక్స్

  • మిడ్ వింటర్ బ్రేక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 10

  • రోరీ స్కోవెల్: షో మస్ట్ గో ఆన్ (ఇంగ్లీష్ షో) - ఆగస్టు 11

  • మౌరిన్హో (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 11

  • నాండో బిట్వీన్ టూ వరల్డ్స్ (బ్రెజిలియన్ సిరీస్) - ఆగస్టు 12

  • ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 13

  • డోంట్ సే గుడ్ లక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 13

  • మై బ్రిలియంట్ కెరీర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13

  • కాక్ టెయిల్ 2 (హిందీ సినిమా) - ఆగస్టు 14

  • మోరియా (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 14

  • ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్) - ఆగస్టు 14

  • మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ మూవీ) - ఆగస్టు 14

అమెజాన్ ప్రైమ్

  • ద ట్రెయిటర్స్ సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 13

సోనీ లివ్

  • కౌన్ బనేగా కరోడ్‌పతి 18వ సీజన్ (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 10

ఆపిల్ టీవీ ప్లస్

  • ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12

లయన్స్ గేట్ ప్లే

  • ఆఖరి సవాల్ (హిందీ సినిమా) - ఆగస్టు 14

మనోరమ మ్యాక్స్

  • కాట్టలన్ (మలయాళ మూవీ) - ఆగస్టు 13

(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement