breaking news
Kattalan Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి ఇండిపెండెన్స్ డే-వీకెండ్ కలిసొచ్చింది. దీంతో పలు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అగధ, పళ్లబురుసు, అనకాపల్లి లాంటి తెలుగు మూవీస్ అలానే విశాల్ 'మకుటం' అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కానుంది. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు.(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)మరోవైపు ఓటీటీల్లో 22 వరకు సినిమాలు, సిరీస్ ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రష్మిక 'కాక్ టెయిల్ 2', భారతభాగ్య విధాత లాంటి హిందీ చిత్రాతో పాటు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే తెలుగు మూవీ కూడా ఉంది. ఉన్నంతలో ఇవే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. వీకెండ్లో ఏమైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్‌లు ఉండొచ్చు. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 10 నుంచి 16 వరకు)హాట్స్టార్హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10108 బేస్ హాస్పిటల్: ఉరి (హిందీ సిరీస్) - ఆగస్టు 15జీ5భారత భాగ్య విధాత (హిందీ మూవీ) - ఆగస్టు 14నిబ్బానిబ్బీ (మరాఠీ సినిమా) - ఆగస్టు 14సన్ నెక్స్ట్మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు సినిమా) - ఆగస్టు 14ఆహాచెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె-యూఎస్ఏ (తెలుగు కుకింగ్ షో) - ఆగస్టు 13నెట్ఫ్లిక్స్మిడ్ వింటర్ బ్రేక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 10రోరీ స్కోవెల్: షో మస్ట్ గో ఆన్ (ఇంగ్లీష్ షో) - ఆగస్టు 11మౌరిన్హో (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 11నాండో బిట్వీన్ టూ వరల్డ్స్ (బ్రెజిలియన్ సిరీస్) - ఆగస్టు 12ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 13డోంట్ సే గుడ్ లక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 13మై బ్రిలియంట్ కెరీర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13కాక్ టెయిల్ 2 (హిందీ సినిమా) - ఆగస్టు 14మోరియా (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 14ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్) - ఆగస్టు 14మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ మూవీ) - ఆగస్టు 14అమెజాన్ ప్రైమ్ద ట్రెయిటర్స్ సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 13సోనీ లివ్కౌన్ బనేగా కరోడ్‌పతి 18వ సీజన్ (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 10ఆపిల్ టీవీ ప్లస్ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12లయన్స్ గేట్ ప్లేఆఖరి సవాల్ (హిందీ సినిమా) - ఆగస్టు 14మనోరమ మ్యాక్స్కాట్టలన్ (మలయాళ మూవీ) - ఆగస్టు 13(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ) -
‘కాటాలన్’ కథ విని ఆశ్చర్యపోయా.. ఆ సీన్స్ మెస్మరైజ్ చేస్తాయి: సునీల్
‘‘పుష్ప’ సినిమా తర్వాత నా లైఫ్ ఒక సర్ప్రైజింగ్ మోడ్‌లో పడింది. ఏ భాష నుంచి ఎప్పుడు, ఎలాంటి క్యారెక్టర్ వస్తుందో తెలియడం లేదు (నవ్వుతూ). ‘కాటాలన్’ సినిమాలో నేను మారి అనే కీలక పాత్ర చేశాను. నాకు చాలా సంతృప్తినిచ్చిన పాత్ర ఇది’’ అని నటుడు సునీల్ తెలిపారు. ఆంటోనీ వర్గీస్, దుషార విజయన్, కబీర్ దుహాన్ సింగ్, సునీల్, పార్థ్ తివారీ, జగదీష్, సిద్ధిక్, హనన్ షా, రాపర్ బేబీ జీన్ కీలక పాత్రలు పోషించిన మలయాళ చిత్రం ‘కాటాలన్’. పాల్ జార్జ్ దర్శకత్వంలో షరీఫ్ మొహమ్మద్ నిర్మించిన ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నేడు విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సునీల్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ పాల్గారు ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి’’ అన్నారు కబీర్ దుహాన్ సింగ్. ‘‘మార్కో’ తర్వాత ‘కాటాలన్’ని మీ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది’’ అని ఆజాద్ పేర్కొన్నారు. -
'పుష్ప' లాంటి సెటప్.. 'మార్కో' స్టైల్ యాక్షన్.. ట్రైలర్ రిలీజ్
రీసెంట్ టైంలో అడవి బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా అనగానే చాలామందికి 'పుష్ప'నే గుర్తొస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో తీశారు. ఇప్పుడు ఈ తరహాలోనే ఏనుగు దంతాల స్మగ్లింగ్ నేపథ్య కథాంశంతో మలయాళంలో తీసిన పాన్ ఇండియా మూవీ 'కాటాలన్'. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: పోలీస్ కేసు.. యాంకర్ విష్ణుప్రియకే కలిసొచ్చింది!)ట్రైలర్ చూస్తే ఏనుగు దంతాల స్మగ్లింగ్ చేసే ముఠాల మధ్య ఆధిపత్య పోరు, ఇందులో హీరో ఏం చేశాడు అనేది కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. అయిత హీరోహీరోయిన్, సైడ్ క్యారెక్టర్స్.. ఇలా ప్రతి ఒక్కరి చేతిలో గన్ లేదంటే కత్తి కనిపించాయి. బుల్లెట్ పేల్చడం లేదంటే రక్తపాతం సృష్టించడం లాంటివి కనిపిస్తున్నాయి. అలానే ట్రైలర్‌కి మూడు డిఫరెంట్ థీమ్ మ్యూజిక్స్ అనే కొత్త ప్రయోగం చేశారు. ఇది కూడా ఆసక్తికరంగా అనిపించింది. 'మార్కో' లాంటి వయలెంట్ మూవీ తీసిన నిర్మాతలే దీన్ని తెరకెక్కించారు. తెలుగు నటుడు సునీల్.. ఇందులో ఓ విలన్‌గా చేయడం విశేషం.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)


