‘కాటాలన్‌’ కథ విని ఆశ్చర్యపోయా.. ఆ సీన్స్‌ మెస్మరైజ్‌ చేస్తాయి: సునీల్‌ | Sunil Excited About His Powerful Role In Kattalan, Says Never Expected This Phase After Pushpa | Sakshi
Sakshi News home page

‘కాటాలన్‌’ కథ విని ఆశ్చర్యపోయా.. ఆ సీన్స్‌ మెస్మరైజ్‌ చేస్తాయి: సునీల్‌

May 28 2026 8:48 AM | Updated on May 28 2026 9:22 AM

Sunil Talk About Kattalan Movie

‘‘పుష్ప’ సినిమా తర్వాత నా లైఫ్‌ ఒక సర్‌ప్రైజింగ్‌ మోడ్‌లో పడింది. ఏ భాష నుంచి ఎప్పుడు, ఎలాంటి క్యారెక్టర్‌ వస్తుందో తెలియడం లేదు (నవ్వుతూ). ‘కాటాలన్‌’ సినిమాలో నేను మారి అనే కీలక పాత్ర చేశాను. నాకు చాలా సంతృప్తినిచ్చిన పాత్ర ఇది’’ అని నటుడు సునీల్‌ తెలిపారు. 

ఆంటోనీ వర్గీస్, దుషార విజయన్, కబీర్‌ దుహాన్‌ సింగ్, సునీల్, పార్థ్‌ తివారీ, జగదీష్, సిద్ధిక్, హనన్‌ షా, రాపర్‌ బేబీ జీన్‌ కీలక పాత్రలు పోషించిన మలయాళ చిత్రం ‘కాటాలన్‌’. పాల్‌ జార్జ్‌ దర్శకత్వంలో షరీఫ్‌ మొహమ్మద్‌ నిర్మించిన ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నేడు విడుదల కానుంది. 

హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సునీల్‌ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌ పాల్‌గారు ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తాయి’’ అన్నారు కబీర్‌ దుహాన్‌ సింగ్‌. ‘‘మార్కో’ తర్వాత ‘కాటాలన్‌’ని మీ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది’’ అని ఆజాద్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement