గతంలో ఎన్నో సూపర్ హిట్ కామెడీ సినిమాల్లో కలిసి నటించిన శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ ఇప్పుడు మరోసారి కలిసి మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాలో నటిస్తున్నారు.
బాలు J క్రియేషన్స్ బ్యానర్ పై కామెడీ సినిమాల దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాలో లయ హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఇందులో రాజేంద్రప్రసాద్ వెంకటేశ్వరస్వామిగా, శ్రీకాంత్ ఆయన భక్తుడిగా కనిపించబోతున్నారు.


