‘‘స్టార్ ముఖం చూసి ప్రేక్షకులు టిక్కెట్లు కొంటున్నారు. కోట్లాది రూపాయల బిజినెస్ స్టార్ మూలంగా జరుగుతున్నప్పుడు సహజంగానే వారి డామినేషన్ ఉండటం తప్పు కాదు. అయితే ఆ సినిమాకు సంబంధించిన స్టార్‌ను కన్విన్స్ చేసే సత్తా డైరెక్టర్‌కు ఉందా? లేదా అన్నదే ముఖ్యం’’ అని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు. సూర్య, వివేక్ ఒబెరాయ్, ప్రియమణి, రాధికా ఆప్టే ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘రక్త చరిత్ర’.
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న ఈ చిత్రం రీ రిలీజ్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘రాయలసీమ ఫ్యాక్షనిజంలోని వాస్తవ ఘటనలను ఆధా రంగా చేసుకుని ‘రక్త చరిత్ర’ తీశాను. నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా ఇది.
శాంతికి, యుద్ధానికి మధ్య ఉన్న అంతరాన్ని చర్చిస్తూ, యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని ఇందులో చూపిం చాం. ‘రక్త చరిత్ర’ పార్ట్ 3 తీసే చాన్స్ లేదు. నా జీవితంలో ఫ్యామిలీ, సెంటిమెంట్ సినిమాలు ఎప్పటికీ తీయను. పౌరాణిక సినిమాలు తీసే ఓపిక నాకు లేదు. రియలిస్టిక్ డ్రామాలు మాత్రమే తీస్తాను. ప్రస్తుతం హిందీలో పోలీస్ స్టోరీతో ఓ సినిమా చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.


