ప్రేమ కబుర్లు | Dulquer Salmaan DQ41 is officially titled Sri Sri | Sakshi
Sakshi News home page

ప్రేమ కబుర్లు

Jul 11 2026 6:12 AM | Updated on Jul 11 2026 6:12 AM

Dulquer Salmaan DQ41 is officially titled Sri Sri

ఇక్కడున్న ఫొటో చూస్తున్నారుగా...కాంపౌండ్‌ వాల్‌పై దుల్కర్‌ సల్మాన్, పూజా హెగ్డే ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటున్నారో!  ఈ ప్రేమ కబుర్లు విజువల్‌గా ‘శ్రీ శ్రీ’లో చూడొచ్చు. దుల్కర్‌ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘శ్రీ శ్రీ’ టైటిల్‌ ఖరారైంది. ‘లవ్‌ విల్‌ స్పార్క్‌ అగైన్‌’ అనేది  క్యాప్షన్‌. ఈ సినిమాను రవి నెలకుదిటి దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌  చేశారు. ‘‘ప్రేమ, వినోదం, మనసుని తాకే భావోద్వేగాలను చక్కగా మేళవించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. స్క్రీన్‌పై హీరో–హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement