తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ.. సుకుమారి. ఈ సినిమాకు భరత్‌దర్శన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూలై 17న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే మాస్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఐశ్వర్య రాజేశ్ యాక్షన్ ఫైట్స్ ఆకట్టుకుంటున్నాయి. కామెడీతో పాటు ఫుల్ యాక్షన్ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఝాన్సీ, మురళీధర్‌గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ కీలక పాత్రలు పోషించారు.


