టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. గతంలో ఆయనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను బెంగళూరు కోర్ట్ రద్దు చేసింది. ప్రకాష్ రాజ్ పలు రాష్ట్రాల్లో ఓటర్ గుర్తింపు కార్డులను కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో ప్రకాశ్ రాజ్‌కు బెయిల్ మంజూరూ చేసింది. గతంలో కోర్టు నోటీసులకు స్పందించడంలో ఫెయిల్ అయ్యారని నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
ఓటర్ ఐడి కేసులో శుక్రవారం బెంగళూరు కోర్టు ముందు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ రద్దు చేస్తూ ప్రకాష్ రాజ్‌కు బెయిల్ మంజూరు చేసింది. రూ. 4,000 నగదు పూచీకత్తు సమర్పించాలనే షరతు విధించింది. ఈ కేసులో ఎప్పుడూ సమన్లు అందలేదని ప్రకాష్ రాజ్ తరఫు న్యాయవాది వాదించారు.
ప్రకాష్ రాజ్ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడీ కార్డులు కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2019లో న్యాయవాది దిలీప్ కుమార్ హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయవాది కోర్టును ఆశ్రయించారు.


