రాజకీయాల్లోకి అల్లు అర్జున్? | Allu Arjun Political Entry Rumours | Sakshi
Sakshi News home page

Allu Arjun: బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడా? లేటెస్ట్ రూమర్స్

Jul 10 2026 1:42 PM | Updated on Jul 10 2026 2:03 PM

Allu Arjun Political Entry Rumours

హీరో అల్లు అర్జున్.. రాజకీయాల్లోకి రాబోతున్నాడా? పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? అంటే టాలీవుడ్ వర్గాల్లో అవుననే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాకా, లోకేశ్ కనగరాజ్ సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ.. మరో ఎనిమిదేళ్ల తర్వాత అంటే 2034 ఎన్నికలపై దృష్టి పెట్టాలని, అందుకు తగ్గట్లే ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారని టాక్. ఇందులో భాగంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తోనూ సంప్రదింపులు జరుపుతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)

ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రశాంత్ కిశోర్.. తమిళ స్టార్ హీరో తళపతి విజయ్ వెనకుండి నడిపించారు. ఈయన తమిళనాడు ముఖ్యమంత్రి కావడంలో భాగమయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా విజయ్‌లా తన అభిమాన సంఘాలతో ప్రజలకు చేరువై, ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం గురించిన రూమర్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయాయి. ఒకవేళ ఈ రూమర్స్ గనుక నిజమై అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే.. ఆంధ్రా పాలిటిక్స్‌పై దృష్టి పెడతాడా? లేదంటే తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడతారా అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం.

(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement