అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తోన్నసినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే గత నెల రిలీజై సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న చిత్రం మా ఇంటి బంగారం. ఈ మూవీ వంద కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. సమంత లీడ్ రోల్లో వచ్చిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్‌తో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరో రూ.5 కోట్లు సాధిస్తే వందకోట్లు రాబట్టిన తొలి లేడీ ఓరియంటెడ్ మూవీగా ఘనత దక్కనుంది.
సమంతకు లెనిన్ ఎఫెక్ట్..
వందకోట్ల దిశగా దూసుకెళ్తోన్న మా ఇంటి బంగారానికి అఖిల్ లెనిన్ మూవీ ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఈ శుక్రవారం లెనిన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న వేళ.. సమంత మూవీ వసూళ్లు వందకోట్లు దాటడం కష్టమేననిపిస్తోంది. లెనిన్ చిత్రం టాక్ ఆధారంగా మా ఇంటి బంగారం కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశముంది. మరోవైపు వీకెండ్ సామ్‌కు కలిసొస్తే వంద కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. మరి బాక్సాఫీస్ రేసును తట్టుకుని సమంత సినిమా 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతుందో లేదో వేచి చూడాల్సిందే.


