రష్మిక డేరింగ్ యాక్షన్‌.. తొలి హీరోయిన్‌గా రికార్డ్..! | Rashmika Mandanna Daring Action Sequence for Mysaa Movie | Sakshi
Sakshi News home page

Rashmika: రష్మిక సాహసం.. తొలి హీరోయిన్‌గా రికార్డ్..!

Jul 9 2026 4:46 PM | Updated on Jul 9 2026 4:50 PM

Rashmika Mandanna Daring Action Sequence for Mysaa Movie

టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవలే కాక్‌టెయిల్-2 మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ బాలీవుడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రణబాలిలో నటిస్తోన్న రష్మిక.. ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తోంది. ఈ మూవీలో ఫుల్ యాక్షన్‌ మోడ్‌లో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌ మైసాపై ఆసక్తిని మరింత పెంచేశాయి.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్‌ అప్‌డేట్ వైరలవుతోంది. ఈ సినిమా కోసం రష్మిక సాహసం చేసింది. ఇండియన్ యాక్షన్ సినిమాలో ఇంతకుముందు ఎవరు ప్రయత్నించని అడ్వెంచరస్ ఫైట్ సీక్వెన్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే మొట్టమొదటి సారిగా హీరోయిన్‌పై చిత్రీకరించిన అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ సక్సెస్‌ఫుల్‌గా రష్మిక పూర్తి చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

ఈ యాక్షన్ సీక్వెన్స్‌ కోసం రష్మిక మందన్న ఎంతగానో శ్రమించినట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్‌ కోసం స్కూబా డ్రైవింగ్ కిట్ ధరించి నీటి అడుగున ఆమె చేసిన రిస్కీ స్టంట్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్ చూస్తుంటే అంచనాలు మరింత పెంచేసింది. ఇండియన్ సినీ చరిత్రలోనే మొట్టమొదటి హీరోయిన్ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్‌తో కొత్త అధ్యాయం క్రియేట్ చేసింది.

ఈ యాక్షన్ మూవీకి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే టీజర్ రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement