breaking news
Mysaa Movie
-
యాక్షన్ స్టార్ట్
గోండు తెగల నేపథ్యంలో రష్మికా మందన్నా లీడ్ రోల్లో ‘మైసా’ చిత్రం ఆరంభమైంది. ఈ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో ఇప్పటివరకూ చేయని సరికొత్తపాత్రను రష్మిక చేస్తున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఈపాన్ ఇండియా మూవీని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది.ఆదివారం జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవంలో అతిథిగాపాల్గొన్న దర్శకుడు రవికిరణ్ కోలా కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత డి. సురేష్ బాబు క్లాప్ కొట్టారు. దర్శకుడు హను రాఘవపూడి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేసి, తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం చేశారు. ‘‘హై ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శ్రేయాస్ పి. కృష్ణ. -
గ్రాండ్‌గా రష్మిక 'మైసా' మూవీ లాంచ్ (ఫొటోలు)
-
గిరిజన మహిళలతో రష్మిక నృత్యం..వీడియో వైరల్
రష్మిక ఒకవైపు స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెండ్ చిత్రాలతోనూ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. దీంతో పాటు మైసా అనే మరో నాయికా ప్రధానమైన సినిమా కూడా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు(జులై 27) ఈ చిత్రం షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమంలో రష్మిక పాల్గొనడమే కాకుండా..గోండు పాటకు స్టెప్పులేసి అందరికి అలరించింది. సినిమా ఓపెనింగ్‌కి వచ్చిన గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.ఇక మైసా విషయానికొస్తే.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యన ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు. అన్‌ఫార్ములా ఫిలింస్ పతాకంపై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. స్వీడిష్, అరబిక్, జపనీస్, జార్జియన్ భాషల్లో ‘మైసా’ అనే పదానికి ‘తల్లి’ అని అర్థం. ఈ సినిమాలో గోండు జాతి హక్కులను కాపాడే యోధురాలిగా రష్మిక నటించబోతుందని సమాచారం. -
విజయ్ దేవరకొండకి కొత్త పేరు పెట్టిన రష్మిక.. ఎంత ముద్దుగా ఉందో!
విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ప్రేమలో ఉన్నారనే గాసిప్ గత కొనేళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. వాటిపై ఇటు రష్మిక కానీ అటు విజయ్ కానీ స్పందించడం లేదు కానీ..‘అవును మేం ప్రేమలోనే ఉన్నాం’ అన్నట్లుగా అప్పుడప్పుడు హింట్ అయితే ఇస్తున్నారు. కలిసి ట్రిప్స్‌కి వెళ్తున్నార.. ఒకరి సినిమాపై ఒకరు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఏదైనా సినిమా ఈవెంట్స్‌లో ప్రేమ, పెళ్లి ప్రస్తావన వస్తే.. పరోక్షంగా తాము రిలేషన్లో ఉన్నట్లుగానే ఒప్పుకుంటున్నారు. ఒకే లొకేషన్స్ ఉన్న ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ..తమ లవ్ మ్యాటర్‌ని కొంచెం కొంచెం రిలీల్ చేస్తున్నారు. తాజాగా రష్మిక విజయ్‌కి ముద్దుగా కొత్త పేరుతో పిలిచి.. మరోసారి ప్రేమ పుకార్లకు ఆజ్యం పోసింది.వారియర్‌గా రష్మిక.. ఇటీవల కుబేర చిత్రంలో ప్రేక్షకులను పలకరించిన రష్మిక..ఇప్పుడు మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే మైసా. రవ్రీంద పూలే దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో రష్మిక డిఫరెంట్ పాత్ర పోషిస్తుంది. తొలిసారి ఆమె వారియర్‌గా కనిపించబోతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో రష్మిక వారియర్ లుక్‌లో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేసింది. చాలా మంది సినీ తారలు మైసా పోస్టర్ లుక్‌పై ప్రశంసలు కురిస్తూ.. రష్మికకి ఆల్ ది బెస్ట్ చుబుతున్నారు. అలా విజయ్ దేవరకొండ కూడా మైసా ఫస్ట్‌లుక్ పోస్టర్ని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘ఈ సినిమా అద్భుతంగా ఉండనుంది’ అని రాసుకొచ్చాడు.విజ్జూ.. నువ్వు గర్వపడేలా చేస్తా విజయ్ పోస్ట్‌పై రష్మిక స్పందించింది. ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ.. ‘విజ్జూ.. ఈ సినిమాతో నువ్వు గర్వపడేలా చేయబోతున్నాను’ అంటూ రష్మిక రిప్లై ఇచ్చింది. విజయ్‌తో అలా ముద్దుగా విజ్జూ అని పిలవడంతో మరోసారి వీరి ప్రేమ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో విజయ్‌కి చాలా మంది హీరోయిన్లు స్నేహితులుగా ఉన్నప్పటికీ...ఎవరూ కూడా అలా పిలవలేదు. విజయ్‌తో రష్మికకు స్నేహానికి మించిన బంధం ఉంది కాబట్టే అలా ముద్దుగా పిలిచిందని చాలా మంది నెట్టింట పోస్టులు పెడుతున్నారు.