ఈ ఏడాది బాక్సాఫీస్‌ను రప్ప రప్పా ఆడించేసింది రష్మిక మందన్నా.. తను హీరోయిన్‌గా నటించిన ఛావా, థామా, కుబేర, ద గర్ల్‌ఫ్రెండ్ చిత్రాలు వందల కోట్లు రాబట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ మైసా అనే లేడీ ఓరియంటెడ్ ఫిలిం చేస్తోంది. బుధవారం (డిసెంబర్ 24న) ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
"నా బిడ్డ సచ్చిందన్నారు. కానీ మట్టే వణికిపోయింది.. నా బిడ్డ రక్తాన్ని దాసలేక, గాలే ఆగిపోయింది.. దాని ఊపిరి మోయలేక, అగ్గే బూడిదైంది.. మండుతున్న నా బిడ్డని సూడలేక.." అన్న సంభాషణతో వీడియో మొదలైంది. నా బిడ్డను సంపలేక సావే సచ్చిపోయింది.. నా బిడ్డ ఎవరో తెలుసా.. అంటూ రష్మికను పవరల్‌ఫుల్ లేడీ వారియర్‌గా చూపించారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిలింస్ నిర్మిస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2026లో విడుదల కానుంది.


