జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్ | Prashanth Neel new approach to make Jr Dragon Movie | Sakshi
Sakshi News home page

జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్'కు ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్

Feb 7 2026 11:59 PM | Updated on Feb 8 2026 12:01 PM

Prashanth Neel new approach to make Jr Dragon Movie

ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే కెజిఎఫ్, సలార్ గుర్తుకు వస్తాయి. ఆ సినిమాల్లో బ్లాక్ అండ్ గ్రే షేడ్ పిక్చరైజేషన్ ప్రత్యేకతగా నిలిచింది. వరుసగా మూడు సినిమాలు అదే స్టైల్‌లో రావడంతో ఆయన మరోలా తీయరా అనే సందేహం చాలా మందికి కలిగింది. కానీ ఇప్పుడు ఆ అనుమానాలు తీరిపోయే సమయం వచ్చినట్టు తెలుస్తోంది.  

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా ఫుల్ కలర్ ఫుల్‌గా ఉండబోతోందట. ఈసారి గ్రే, బ్లాక్ షేడ్ కాన్సెప్ట్ ఎక్కడా కనిపించదని ఓ టాక్‌ నడుస్తోంది. అంటే ప్రశాంత్ నీల్ కొత్త టేకింగ్‌ను ఎంచుకున్నారని చెప్పొచ్చు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.ఈ చిత్రం కోసం జూ.ఎన్టీఆర్ ప్రత్యేకంగా సన్నబడ్డ విషయం తెలిసిందే. బయట ఒకటి రెండు సార్లు ఆయనను చూసినప్పుడు అభిమానులు ఆశ్చర్యపోయారు. కానీ సినిమాలో మాత్రం ఆయన గెటప్ ఓ లెవెల్‌లో ఉందని అంటున్నారు. చూసిన వాళ్లు అదిరిపోయిందని చెబుతున్నారు.  

ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూట్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్‌ మరో సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే దేవర 2 కూడా లైన్‌లో ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. కెజిఎఫ్, సలార్ సినిమాల విజయాలతో ప్రశాంత్ నీల్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. డ్రాగన్‌ను గ్రే, బ్లాక్ షేడ్ కాన్సెప్ట్ కాకుండా కొత్త స్టైల్‌లో తీస్తున్నందుకు అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.  

Advertisement
 
Advertisement
Advertisement