టాలీవుడ్ ప్రముఖ నటి మంచు లక్ష‍్మికి చెన్నైలో చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్లిన ఈమె.. గ్రీన్ పార్క్ అనే హోటల్‌కి వెళ్లింది. అయితే అక్కడి సిబ్బంది తనతో రూడ్‌గా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
చెన్నైలోని ఈ హోటల్‌లో రూమ్ అద్దెకు తీసుకున్న మంచు లక్ష‍్మి.. తనతో పాటు సిబ్బందిని కూడా తీసుకెళ్లింది. కానీ కెమెరామ్యాన్‌ని మాత్రం లోపలికి అనుమతించలేదని చెప్పుకొచ్చింది. చిన్న కెమెరాకు కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమని చెప్పుకొచ్చింది. దీని వల్ల చాలా అసంతృప్తికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు హాస్పిటాలిటీ ఇలా ఉండనేకూడదంటూ పేర్కొంది.
గత కొన్నాళ్లుగా యాక్టింగ్ బాగా తగ్గించేసిన మంచు లక్ష‍్మి.. అడపాదడపా మాత్రమే ఒకటి రెండు మూవీస్ చేస్తోంది. గతేడాది 'దక్ష' అనే చిత్రంతో వచ్చింది కానీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫ్లాప్ అయింది. అలానే ఓటీటీ రియాలటీ షో 'ద ట్రైటర్స్ ఇండియా'లోనూ పాల్గొంది కానీ విజేత కాలేకపోయింది. కాకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
Extremely disappointed with the experience at Green Park Hotels Chennai.
No rule was shown to me in writing, and no solution was offered, not even allowing a small camera with one person. This is not what hospitality should look like. pic.twitter.com/TeZRsFkyTu— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) February 7, 2026


