'ధురంధర్‌' సినిమా కోసం 3 కేరవాన్స్‌ అడిగిన హీరో? | Fact Check: Did Ranveer Singh Ask 3 vanity vans on Dhurandhar set? | Sakshi
Sakshi News home page

Ranveer Singh: సెట్‌లో మూడు కేరవాన్స్‌ అడిగాడా? అసలు విషయమిదే!

Feb 7 2026 9:52 PM | Updated on Feb 8 2026 12:08 PM

Fact Check: Did Ranveer Singh Ask 3 vanity vans on Dhurandhar set?

బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటించిన ధురంధర్‌ మూవీ సంచలన విజయం సాధించింది. 2025 డిసెంబర్‌ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి మూడు నెలల్లోనే సీక్వెల్‌ కూడా వచ్చేస్తోంది. ధురంధర్‌: ద రివేంజ్‌ మూవీ మార్చి 19న విడుదల కానుంది.

మూడు కేరవాన్స్‌
ఇదిలా ఉంటే ధురంధర్‌ సినిమా సెట్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ ఏకంగా మూడు కేరవాన్స్‌ అడిగాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తనకొక కేరవాన్‌, తన సిబ్బందికి మరో రెండు వానిటీ వ్యాన్స్‌ అడిగాడన్నది కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. 

అసలు నిజమిదే!
ధురంధర్‌ చిత్ర నిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో షూట్‌ చేసినప్పుడు అక్కడ రెండు కార్లు ఉపయోగించాం. ఒక వానిటీ వ్యాన్‌ హీరోకు కాగా మిగతా కార్లు సిబ్బందికి, సామాన్లకు వాడుకున్నాం. లొకేషన్స్‌ మార్చినప్పుడు ఈ కార్లనే వినియోగించాం. అంతే తప్ప హీరో మూడు వానిటీ వ్యాన్స్‌ డిమాండ్‌ చేశాడన్న ప్రచారంలో నిజం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. అలాగే సీక్వెల్‌ కోసం రణ్‌వీర్‌ సింగ్‌ రోజుకు 12-14 గంటల పాటు పనిచేశాడని.. దీని ఫలితంగా 15-25 కిలోల మేర బరువు తగ్గాడని పేర్కొన్నాడు.

 

 

చదవండి: నా కొడుకు చేసింది తప్పే.. అలా అని పెంపకాన్ని ప్రశ్నిస్తారా?: ప్రభాకర్‌

Advertisement
 
Advertisement
Advertisement