breaking news
Dhurandhar Movie
-
బాక్సాఫీస్ హిట్‌గా దురంధర్.. ఓటీటీ డీల్ ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఏకంగా 2025లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 1100 కోట్ల మార్కును దాటేసింది. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దురంధర్ మూవీ ఓటీటీ డీల్‌పై చర్చ నడుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు రానుందనే విషయంపై సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండు పార్ట్స్‌కు కలిపి రూ.130 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కో పార్ట్‌కు రూ.65 కోట్లతో ఒప్పందం చేసుకుంది.అయితే ఈ సినిమా డీల్ మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఒప్పందం డబుల్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రూ.130 కోట్ల డీల్ చాలా తక్కువ అని బాలీవుడ్లో చర్చ మొదలైంది. దీంతో ఈ డీల్ విలువ రూ.275 కోట్ల వరకు చేరుకొవచ్చని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఒక హిందీ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్‌తో జరిగిన బిగ్ డీల్‌గా నిలవనుంది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన స్టార్ సినిమాలు రూ.150 కోట్లకు పైగా ఓటీటీ వసూళ్లు దక్కించుకున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వచ్చిన ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేష్ బేడి, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది. -
‘ధురంధర్’ కి రూ. 90 కోట్ల నష్టం!
రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది. అయితే, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ చిత్రం విడుదల కాకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా తెలిపారు.ఈ సినిమాలో పాకిస్తాన్ వ్యతిరేక సందేశం ఉందనే కారణంతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రైన్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాల్లో 'ధురంధర్'(Dhurandhar)పై బ్యాన్ విధించారు. ఈ ప్రాంతంలో భారతీయ యాక్షన్ సినిమాలు సాధారణంగా బాగా ఆడతాయని, ఈ బ్యాన్ వల్ల కనీసం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.90 కోట్లు) నష్టం వచ్చిందని ప్రణబ్ కపాడియా పేర్కొన్నారు.తాజాగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..‘మిడిల్ ఈస్ట్ మార్కెట్ యాక్షన్ సినిమాలకు చాలా ముఖ్యం. ఈ బ్యాన్ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్లు అయింది. అయినా, డిసెంబర్ హాలిడే సీజన్లో ప్రేక్షకులు ఇతర దేశాలకు ట్రావెల్ చేసి సినిమా చూస్తున్నారు’ అని కపాడియా తెలిపారు.ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. నార్త్ అమెరికా, యూరప్ మార్కెట్లలో బాగా ఆడినా, గల్ఫ్ బ్యాన్ వల్ల మరింత వసూళ్లు రావాల్సి ఉండగా... ఆ అవకాశం చేజారిపోయింది.ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది. వచ్చే ఏడాది మార్చి 19న ‘ధురంధర్ 2’ను రిలీజ్ చేస్తామని టీమ్ ఇప్పటికే ప్రకటించింది. -
సౌత్ సినిమాలను వణికిస్తున్న 'ధురంధర్'.. ఎడమ కాలితో తన్నేశాడు: ఆర్జీవీ
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ధురంధర్.. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 1100 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఆపై 2025లో భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగానూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా చాలాచోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మూవీ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌పై సౌత్ సినిమాల ఆధిపత్యానికి ఈ సినిమా గట్టి సమాధానం ఇచ్చిందని వర్మ అన్నారు. 2026 మార్చిలో రాబోయే 'ధురంధర్ 2' దక్షిణాదిని వణికించేలా ఉందని వర్మ అన్నాడు.దర్శకుడు ఆర్జీవీ తాజాగా ధురంధర్ సినిమా క్రేజ్ గురించి మరోసారి కామెంట్ చేశారు. వచ్చే ఏడాది రానున్న ధురంధర్ 2 దక్షిణాది సినిమాను భయపెడుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు బాలీవుడ్లో పుష్ప, కల్కి, కేజీఎఫ్, కాంతార వంటి దక్షిణాది చిత్రాల ప్రభావాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.దక్షిణాదిలో ధురంధర్ ప్రభావం ఎలా ఉందో వర్మ ఇలా అన్నారు. 'బాలీవుడ్ మీదకు సడెన్‌గా దూసుకొచ్చిన సౌత్ సినిమాల ఫైర్‌ను ధురంధర్ మూవీతో దర్శకుడు ఆదిత్య ధర్ తన ఎడమ కాలితో వెనక్కి తన్నాడు. ఇప్పుడు తన కుడి కాలుతో 'ధురంధర్ 2' ని రెడీ చేస్తున్నాడు. పార్ట్-2 గురించి నాకు తెలిసినంతవరకు మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుంది. పార్ట్-1 మిమ్మల్ని భయపెట్టి ఉంటే.., పార్ట్-2 మిమ్మల్ని వణికించేస్తుంది.' అని వర్మ ట్వీట్ చేశాడు.‘ధురంధర్ 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2026 మార్చి 19న సీక్వెల్ విడుదల కానుంది. హిందీతో పాటు, దక్షిణాది అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల కానుంది. ప్రస్తుతం సీక్వెల్‌కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. -
వివాదంలో 'అక్షయ్ ఖన్నా'.. నిర్మాత నోటీసులు జారీ
బాలీవుడ్ స్టార్ యాక్టర్ అక్షయ్ ఖన్నా వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఏడాదిలో ఛావా, ధురందర్ చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు దక్కింది. అయితే, బాలీవుడ్ సినిమా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం -3’ నుంచి ఆయన ఆకస్మికంగా తప్పుకోవడంతో అక్షయ్ ఖన్నాకు నిర్మాత మంగత్ పాఠక్ నోటిసులు పంపినట్లు తెలుస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.హిందీ ‘దృశ్యం -2’లో అక్షయ్ ఖన్నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందుకే పార్ట్-3లో కూడా ఆయనే నటించాలని ముందుగానే ఢీల్ సెట్ చేసుకున్నామని పాఠక్ చెప్పారు. ఆ మేరకు అక్షయ్ ఖన్నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చామన్నారు. అయితే, షూటింగ్ ప్రారంభం కావాల్సిన టైమ్‌లో అక్షయ్ ఖన్నా తమకు షాకింగ్ మెసేజ్ చేశాడని నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను నటించడం లేదంటూ ఒక టెక్స్ట్ మెసేజ్ పంపినట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తనను సంప్రదించాలని ప్రయత్నం చేసినప్పటికీ అక్షయ్ అందుబాటులోకి రాకపోవడంతో చేసేదేమీ లేక చట్టపరమైన చర్యలకు దిగాల్సి వచ్చిందని నిర్మాత చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మూవీ కోసం అక్షయ్ ఖన్నా రూ. 22 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.అక్షయ్ ఖన్నాకి సినిమా అవకాశాలు రానప్పుడు ‘సెక్షన్ 375’ మూవీతో మంగత్ పాఠక్ లైఫ్ ఇచ్చాడు. ఆ తర్వాతే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘దృశ్యం 2’ భారీ విజయం అందుకోవడంతో ఛావా, ధురంధర్ వంటి సినిమాలు దక్కాయి. ఇదే విషయాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. -
ధురంధర్ పాటకు రోబో డ్యాన్స్
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త హ్యుమానాయిడ్ రోబోలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే రోబోట్స్ ఎన్నెన్నో అద్భుతాలు చేశాయి. ఇప్పుడు తాజాగా ఒక రోబో డ్యాన్స్ వేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఐఐటీ బాంబేలో టెక్‌ఫెస్ట్ 2025లో.. ఒక హ్యూమనాయిడ్ రోబోట్ డ్యాన్స్ వేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీనిని బిద్యుత్ ఇన్నోవేషన్ (Bidyut Innovation) అభివృద్ధి చేసింది. ధురంధర్ సినిమాలోని పాటకు.. అద్భుతంగా డ్యాన్స్ వేసిన ఈ రోబోట్ ఎంతోమంది ప్రశంసలు అందుకుంది. పలువురు నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.టెక్‌ఫెస్ట్.. ఆసియాలో అతిపెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్‌గా ప్రసిద్ధి చెందింది. ఇందులో అనేక కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెడతారు. హ్యుమానాయిడ్ రోబోట్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇవన్నీ.. బ్యాలెన్స్ కంట్రోల్, మోషన్ ప్లానింగ్, రియల్-టైమ్ రెస్పాన్సిబిలిటీ వంటివి పొందుతాయి. View this post on Instagram A post shared by IIT NIT IIIT (@iit__nit__iiit) -
ధురంధర్ కలెక్షన్ల విధ్వంసం
-
ధురంధర్ మూవీ క్రేజ్‌తో వైరల్‌గా 'దూద్ సోడా'..! ఎలా తయారు చేస్తారంటే..?
డిసెంబర్లో వచ్చిన ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకారణంగా నెట్టింట దూద్ సోడా అనే పానీయం తెగ వైరల్‌గా మారింది. అసలేంటి పానీయం తాగొచ్చా, ఆరోగ్యానికి మంచిదేనా అంటే..ధురంధర్ సినిమాలో నటుడు గౌరవ్ గేరా ఒక భారతీయ గూఢచారిగా, మొహమ్మద్ ఆలం అనే సోడా విక్రేత వేషంలో కనిపిస్తారు. "డార్లింగ్ డార్లింగ్ దిల్ క్యూ తోడా.. పీలో పీలో ఆలం సోడా" అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఇప్పుడు వైరల్ కావడంతో పాటు, ఈ దూద్ పానీయం పై అందరి దృష్టి పడేలా చేసింది. ఒకరకంగా మరుగున పడిపోతున్నకొన్ని రుచులు మళ్లీ గుర్తుకుతెచ్చేలా ముందుకు తీసుకు వస్తాయి ఈ సినిమాలు. దూద్ సోడా అంటే..దూద్ సోడా అనేది పాకిస్తానీకి చెందిన ప్రసిద్ధ పానీయం . లాహోర్, కరాచీ వంటి నగరాల్లో రోజువారీ ఇష్టమైన పానీయం ఇది. చల్లటి పాలు, సోడా, తగినంత చక్కెర కలిపి దీనిని తయారు చేస్తారు. రుచి కోసం కొందరు ఇందులో రోజ్ ఎసెన్స్ లేదా జాజికాయ పొడిని కూడా జోడిస్తుంటారు. పాకిస్తానీ ఆహార సంస్కృతిలో ఒక జ్ఞాపకశక్తినిచ్చే, రిఫ్రెషింగ్ డ్రింక్‌గా పరిగణిస్తారు.తయారీ..ప్రముఖ ఫుడ్ బ్లాగర్ 'సాహిలోజీ' ఇటీవల లాహోర్‌లో ఈ పానీయాన్ని ఎలా తయారు చేస్తారో వివరిస్తూ ఒక వీడియోను షేర్ చేశారు. "ముందుగా ఒక గ్లాసులో కొద్దిగా చక్కెర వేసి, ఆపై వేడి వేడి పాలను పోస్తారు. పాకిస్థాన్‌లో మాత్రమే కనిపించే ఒక ప్రత్యేక పద్ధతిలో ఈ పాలను చల్లబరుస్తారు. ఆ తర్వాత, ఎరుపు రంగులో ఉండే కోకాకోలాను ఆ పాల మిశ్రమంలో కలుపుతారు. చివరగా సాంప్రదాయ పద్ధతిలో సోడాను బాగా మిక్స్ చేస్తే నోరూరించే దూద్ సోడా సిద్ధమవుతుంది" అని వీడియోలో ఆయన వివరించారు .చాలా మంది 1:1 లేదా 1.5:1 పాలు-సోడా నిష్పత్తిని ఉపయోగిస్తారు. ఇది పానీయాన్ని క్రీమీగా ఉంచుతుంది. అయితే ఎక్కువమంది ఈ పానీయాన్ని రూహ్ అఫ్జా, రోజ్ సిరప్, తులసి గింజలు లేదా ఏలకులు వంటి రుచులను కూడా జోడించి సేవిస్తారు.బ్రిటిష్ కాలం నాటిది..బ్రాండెడ్ కూల్ డ్రింక్స్ రాకముందే, ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో దూద్ సోడాకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఇది బ్రిటీష్ కాలం నాటిది. ఉత్తర భారతదేశంలో దీన్ని తయారు చేసేవారు కూడా. అప్పట్లో స్థానిక హకీంలు నిర్వహించే సోడా ఫౌంటైన్లలో రోజ్, ఖుస్, నిమ్మకాయతో పాటు ఈ పాల సోడాను కూడా ప్రయోగాత్మకంగా తయారు చేసేవారు.వాస్తవానికి ఈ పానీయం విక్టోరియన్ ఇంగ్లాండ్‌లో పుట్టి, బ్రిటిష్ సామ్రాజ్యం ద్వారా భారతదేశానికి చేరుకుంది. 1947 దేశ విభజన తర్వాత, పాకిస్థాన్‌లో ఇఫ్తార్ సమయంలో తాగే ప్రధాన పానీయంగా ఇది మారిపోయింది. అక్కడ దీనిని 'రూహ్ అఫ్జా'తో కలిపి ఎక్కువగా తీసుకుంటారు. అటు భారతదేశంలో పంజాబ్, పాత ఢిల్లీ, అమృత్సర్ వంటి ప్రాంతాల్లో ఈ పానీయం నేటికీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.ఎవరికి మంచిదకాదంటే..ఈ పానీయం కడుపులోకి వెళ్లగానే చాలామందికి కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం కలిగే అవకాశాల ఉంటాయి. ఒక్కోసారి గుండెల్లో మంట, అరుగుదలలో సమస్యలు వస్తుంటాయి. ఇందులో సోడా ఉపయోగించడం వల్ల ప్రేగులపై కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. పాలు తేలికపాటి ఆమ్లతను ఉపశమనం చేసినా..ఇందులో ఉపయోగించే సోడా వల్ల జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.లాక్టోస్ పడనివారు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS), ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నావారునివారించడమే ఉత్తమం అని చెబుతున్నారు. అతిగా తాగితే మాత్రం బరువు పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Gaurav Gera (@gauravgera)(చదవండి: హీరో మహేశ్ నేర్చుకుంటున్న కలరిపయట్టుతో..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!) -
దురంధర్ బాక్సాఫీస్.. యానిమల్ రికార్డ్ బ్రేక్..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. తాజాగా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.ఈ సినిమా విడుదలైన 21 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ దాటేసింది. క్రిస్మస్ రోజున రూ. 26 కోట్లతో కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. దేశవ్యాప్తంగా రూ. 668.80 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1006.7 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఏ రేటింగ్ చిత్రంగా ఘనత సాధించింది. అంతకుముందు ఈ రికార్డ్ రణబీర్ కపూర్ యానిమల్ పేరిట ఉంది.కాగా.. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ధురంధర్లో సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడి, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. వచ్చే ఏడాది మార్చి 19న దురంధర్ పార్ట్-2 విడుదల కానుంది. Entering the 1000 CR club, loud and proud.Book your tickets. (Link in bio)🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Frenzy Continues Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/wAk2IklWT5— Jio Studios (@jiostudios) December 26, 2025 -
కొత్త డాన్ తప్పుకున్నాడా?
‘ధురంధర్’ సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు హీరో రణ్వీర్ సింగ్. అయితే ‘డాన్ 3’ సినిమా నుంచి రణ్వీర్ సింగ్ తప్పుకుంటున్నారనే టాక్ బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ సినిమా రానున్నట్లుగా 2023 ఆగస్టు 9న ప్రకటన వచ్చింది. రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ ఈ ‘డాన్ 3’ సినిమాను నిర్మిస్తారని, 2025లో ఈ సినిమా విడుదలవుతుందనేది ఆ అనౌన్స్మెంట్ సారాంశం. కానీ వివిధ కారణాల వల్ల రణ్వీర్ సింగ్ హీరోగా ‘డాన్ 3’ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ‘ధురంధర్’ సినిమా తర్వాత రణ్వీర్ సింగ్ నెక్ట్స్ మూవీ ‘డాన్ 3’ అని అందరూ అనుకున్నారు. కానీ రణ్వీర్ సింగ్ ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటున్నారని బీ టౌక్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘డాన్ 3’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ‘డాన్’గా రణ్వీర్ సింగ్ వెండితెరపై కరెక్ట్ కాదన్నట్లుగా కొంతమంది షారుక్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శించారు (ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్లో వచ్చిన ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్ (2006), ‘డాన్ 2 (2011) చిత్రాల్లో షారుక్ ఖాన్ హీరోగా నటించారు). కానీ ‘డాన్ 3’లో యాక్టర్‌గా తాను ప్రేక్షకులను మెప్పిస్తానని రణ్వీర్ సింగ్ రెస్పాండ్ అయ్యారు. అయితే ఈ ్ర΄ాజెక్ట్ నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే... రణ్వీర్ సింగ్ కొత్త సినిమాకు ‘ప్రళయ్’ అనే టైటిల్ ఖరారైందని, ఇదొక జాంబీ ఫిల్మ్ అని, ఒక తండ్రి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్ టాక్. -
దురంధర్ తెలుగు వర్షన్.. రిలీజ్ కాకపోవడానికి అదే కారణమా?
డిసెంబర్లో వచ్చిన ఆ ఒక్క సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పెద్దగా బజ్ లేకుండానే వచ్చిన రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా కేవలం హిందీలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదుర్స్ అనిపిస్తోంది. కేవలం 18 రోజుల్లోనే రూ.872 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది.ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. కేవలం నార్త్ ఆడియన్స్‌కే పరిమితమైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వీక్షించాలని సౌత్ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. కానీ దురంధర్ డబ్బింగ్ వర్షన్ రిలీజ్‌పై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అసలు దురంధర్‌ను సౌత్ భాషల్లో విడుదల చేస్తారా? లేదా? అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరీ ముఖ్యంగా తెలుగు భాషలోనైనా ఈ మూవీని చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ దురంధర్ తెలుగు వర్షన్ రిలీజవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం ఓటీటీలో మాత్రమే అన్ని భాషల్లో తీసుకొస్తారా? థియేటర్లలో రిలీజ్ చేస్తారా? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.అదే కారణమా?అయితే తెలుగులో దురంధర్ రిలీజ్ చేయకపోవడానికి ఓ కారణముందని సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిసెంబర్ 19న ఈ మూవీని తెలుగు డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఫీడ్ బ్యాక్ ఆధారంగానే తెలుగులో విడుదలపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఎందుకంటే హైదరాబాద్‌లోని తెలుగు ప్రేక్షకులు హిందీలోనే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారని టాక్. అందుకే డబ్బింగ్ వర్షన్‌తో ఈ మూవీ ఒరిజినాలిటీ మిస్సవుతుందని మేకర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఓటీటీలో చూడాల్సిందేనా..?ఇక సౌత్ భాషల్లో దురంధర్‌ను థియేటర్లలో చూసే అవకాశం కనిపించట్లేదు. కేవలం ఓటీటీ రిలీజ్ అయిన తర్వాతే తెలుగుతో పాటు ఇతర భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దురంధర్ రిలీజై మూడోవారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్, సంక్రాంతి సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. అందువల్ల దురంధర్ డబ్బింగ్ వర్షన్ ఇక రిలీజయ్యేలా కనిపించడం లేదు. దీంతో తెలుగులో దురంధర్ వీక్షించాలనుకున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. -
17 రోజుల్లోనే కాంతార-2 రికార్డు బద్దలు.. ధురంధర్ కలెక్షన్స్ సంచలనం!
-
'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు వాటా ఇవ్వాలి: పాక్ ప్రజలు
'ధురంధర్' సినిమాని పాకిస్థాన్ కరాచీలోని లయరీ అనే ప్రాంతం బ్యాక్‌డ్రాప్‌లో తీశారు. 1990ల్లో అక్కడ జరిగిన గ్యాంగ్ వార్స్‌కి ఓ కల్పిత కథ జోడించి దర్శకుడు ఆదిత్య ధర్ ఈ మూవీ తెరకెక్కించాడు. ప్రస్తుతం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఉంది. అయితే వసూళ్లలో తమకు షేర్ ఇవ్వాలని ఇప్పుడు లయరీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?)ఈ వీడియోలో లయరీకి చెందిన పలువురు వ్యక్తులు మాట్లాడారు. తమ ప్రాంతాన్ని సినిమాలో చూపించారు కాబట్టి వసూళ్లలో ఎందుకు వాటా ఇవ్వకూడదు? అని అన్నాడు. మరో వ్యక్తి అయితే ఏకంగా 80 శాతం కలెక్షన్స్ తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మొత్తం ఇవ్వడం వల్ల దర్శకుడికి పెద్దగా పోయేదేం ఉండదని, తర్వాత కూడా ఎలానూ సినిమాల చేస్తాడు కదా అని చెప్పుకొచ్చాడు.మరో వ్యక్తి మాట్లాడుతూ.. 'ధురంధర్' వసూళ్లలో కనీసం సగానికి సగమైనా సరే లయరీ ప్రజలకు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరికొందరైతే రూ.5 కోట్లు, రూ.20 కోట్లు అని నోటికొచ్చినట్లు మొత్తాన్ని చెప్పారు. మరోవ్యక్తి మాత్రం కలెక్షన్స్‌లో కొంత మొత్తంతో ఆస్పత్రి కట్టించి ఇవ్వాలని అన్నాడు. ఇంకో వ్యక్తి అయితే ఒకవేళ దర్శకుడు ఇవ్వాలనుకున్నా సరే తమకు ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి ఉండదని తమ ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెప్పాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?)ఈ సినిమాని పాకిస్థాన్‌లో బ్యాన్ చేశారు. అయినా సరే అక్కడి ప్రజలు పైరసీ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు. అలా ఏకంగా 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలోని పాటలకు రీల్స్ చేస్తూ, పెళ్లిళ్లలో వీటినే ప్లే చేస్తూ పాక్ ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అలా దాయాది దేశంలోనూ ఈ మూవీ హాట్ టాపిక్ అయిపోయిందనే చెప్పొచ్చు.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాని.. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తీశారు. మన దేశానికి చెందిన ఓ ఏజెంట్.. రహస్యంగా పాక్ వెళ్లి అక్కడి గ్యాంగ్‌లో చేరి వాళ్లనే ఎలా తుదముట్టించాడు అనే కాన్సెప్ట్‌తో తీశారు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్స్ ఇందులో యాక్టింగ్ అదరగొట్టేశారు. మ్యూజిక్, సాంగ్స్ కూడా సూపర్ ఉండటంతో సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)BREAKING: Pakistanis want @AdityaDharFilms to give Lyari a portion of Dhurandhar's profits"Kam se kam yeh toh theek karwa lein"🤣🤣🤣🤣 pic.twitter.com/djlvJrLaJi— Sensei Kraken Zero (@YearOfTheKraken) December 22, 2025 -
బాక్సాఫీస్ వద్ద దురంధర్ క్రేజ్.. ఆ ట్యాగ్ బాగా కలిసొచ్చిందా?
ఈ ఏడాది కాంతారా చాప్టర్-1 రిషబ్ శెట్టిదే హవా అనుకున్నాం. ఆ మూవీనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డ్ చెదరదని ఫిక్సయిపోయాం. అంతేకాకుండా విక్కీ కౌశల్ ఛావాను కొట్టే చిత్రం ఈ ఏడాది బాలీవుడ్ రావడం కష్టమే అనుకున్నాం. మరికొద్ది రోజుల్లోనే ఈ సంవత్సరం ముగియనుందగా.. ఆ రెండు రికార్డ్స్ చెక్కు చెదరవని ఈ సినిమాలు తీసినవాళ్లు సైతం అనుకునే ఉంటారు. కానీ పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ను ఓ రేంజ్లో షేక్ చేస్తోంది ఆ సినిమా. డిసెంబర్ 5 తేదీకున్న మహిమో.. ఏమో గానీ ఈ ఏడాది బాక్సాఫీస్ లెక్కలను మాత్రం తారుమారు చేస్తూ దూసుకెళ్తోంది. ఇంతకీ ఆ సినిమాకు ఎందుకింత సక్సెస్ అయింది.. అదే ఈ సినిమాకు ప్లస్‌గా మారిందా? అనేది తెలుసుకుందాం.ఈ రోజుల్లో సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడమంటే మామూలు విషయం కాదు. ఓటీటీలు వచ్చాక చాలామంది థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. పెద్ద పెద్ద స్టార్స్ ఉంటే తప్ప థియేటర్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇక చిన్న సినిమాలైతే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన దురంధర్ మాత్రం బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం 17 రోజుల్లోనే రూ.845 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్ల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్న ఛావాను అధిగమించింది. ఇక మరో ఏడు కోట్లు వస్తే చాలు కాంతార చాప్టర్-1 రికార్డ్ బ్రేక్ చేయనుంది. సైలెంట్‌గా వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇంతలా దూసుకెళ్లడానికి కారణాలేంటి? గతంలో ఇలాంటి జోనర్లో చాలా సినిమాలు వచ్చినా దురంధర్ క్రేజ్ అందుకోలేకపోయాయి. కేవలం హిందీలో విడుదలై ప్రభంజనం సృష్టించడానికి అదొక్కటే ప్రధాన కారణమా? అనేది తెలుసుకుందాం.సాధారణంగా స్పై, గూఢచారి సినిమాలు యుద్ధాల నేపథ్యంలో తెరకెక్కిస్తుంటారు. వీటిలో కొన్ని ఫిక్షనల్.. అలాగే మరికొన్ని రియల్ వార్స్ కూడా ఉంటాయి. అలా వచ్చిన దురంధర్ డైరెక్టర్ కూడా పాకిస్తాన్ నేపథ్యంగా కథను ఎంచుకున్నారు. అక్కడ ఓ ప్రాంతంలోని ఉగ్రవాద నెట్వర్క్ ఆధారంగా దురంధర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు ఆదిత్య ధార్. ఈ మూవీలో భారతీయ ఏజెంట్ అయిన హంజా పాత్రలో రణ్వీర్ సింగ్ నటించారు. పాకిస్తాన్ టార్గెట్‌గా ఈ మూవీని తెరకెక్కించడం దురంధర్‌కు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ విమర్శలు..బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ ఈ సినిమాను పొగుడుతూనే విమర్శించారు. అంతా బాగుంది కానీ.. రాజకీయపరమైన అంశాలను చూపించడం తనకు నచ్చలేదంటూ మాట్లాడారు. ఆ తర్వాత చాలామంది ఈ మూవీని ప్రాపగండ సినిమా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఏకంగా బీజేపీ ప్రాపగండ మూవీ అంటూ ఆరోపించారు. ఇదే దురంధర్‌కు మరింత ప్లస్‌గా మారింది. సాధారణంగా పాజిటివ్ కంటే నెగెటివ్కే ఎక్కువ పవర్ ఉంటుందని దురంధర్తో నిజమైంది. ప్రాపగండ ట్యాగ్ ముద్ర వేయడం కూడా దురంధర్‌కు కలెక్షన్స్ పెరిగేందుకు మరింత ఉపయోగిపడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్‌లో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ పార్ట్- 2 మార్చి 2026లో విడుదల కానుంది. -
'ధురంధర్'లో తమన్నా ఉండాల్సింది.. కానీ రిజెక్ట్ చేశారు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తూ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయిన సినిమా 'ధురంధర్'. పాకిస్థాన్‌లోని గ్యాంగ్ వార్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ స్పై డ్రామాలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ లాంటి స్టార్స్ అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే ఈ మూవీలో తమన్నా కూడా నటించాల్సింది కానీ దర్శకుడు ఈమెని రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ బయటపెట్టాడు.'ధురంధర్' చిత్రం పూర్తిస్తాయి యాక్షన్ డ్రామాగా తెరకెక్కినప్పటికీ.. 'షరారత్' అంటూ సాగే ఓ స్పెషల్ (ఐటమ్) సాంగ్ కూడా ఉంది. హీరో పాత్రకు పెళ్లి జరిగే టైంలో ఇది వస్తుంది. ఇందులో ఆయేషా ఖాన్, క్రిస్టల్ స్టెప్పులేశారు. ఈ పాట కోసం తొలుత తమన్నానే అనుకున్నామని కొరియోగ్రాఫర్ చెప్పాడు. 'నా మైండ్‌లో తమన్నా పేరు మాత్రమే ఉంది. ఆమె అయితేనే పాటకు నిండుదనం తీసుకొస్తుంది. సరైన న్యాయం చేస్తుందని ఆదిత్యకు చెప్పాను. కానీ ఆయన చాలా క్లారిటీతో ఉన్నారు. ఇది రెగ్యులర్ ఐటమ్ సాంగ్లా ఉండకూడదని చెప్పేశారు' అని విజయ్ గంగూలీ తెలిపాడు.'సినిమా కథని డిస్టర్బ్ చేసేలా ఒక్క అంశం కూడా ఉండకూడదనేది ఆదిత్య ధర్ ఉద్దేశం. ఒకవేళ ఈ పాటలో తమన్నా ఉంటే అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది తప్ప స్టోరీపై ఉండదు. సినిమా నుంచి ప్రేక్షకులు పక్కదారి పట్టే అవకాశముంది. అలా ఒకరికి బదులు ఇద్దరు డ్యాన్సర్లని పెడదామని ఆదిత్య నన్ను ఒప్పించాడు. అలా ఆయేషా, క్రిస్టల్ వచ్చారు' అని విజయ్ చెప్పుకొచ్చాడు.గతంలో జైలర్, స్త్రీ 2, రైడ్ 2 తదితర సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసిన తమన్నా.. మంచి ఫేమ్ సొంతం చేసుకుంది. ఎంతల అంటే ఐటమ్ సాంగ్స్ అంటేనే ఈమె గుర్తొంచేంతలా. ఒకవేళ 'ధురంధర్'లో గనక ఐటమ్ సాంగ్ కోసం ఈమెని తీసుకుని ఉంటే.. కొరియోగ్రాఫర్ చెప్పినట్లు ప్రేక్షకుడి దృష్టి మారిపోయి ఉండేదేమో! -
'ధురంధర్' తెలుగు రిలీజ్ ఎప్పుడు? ఎందుకింత ఆలస్యం?
దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతున్న సినిమా 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ గానీ దక్షిణాదిలోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అయితే రిలీజై రెండున్నర వారాలు దాటిపోయినా సరే ఇప్పటికీ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ గురించి అస్సలు సౌండ్ లేదు. ఇంతకీ మన దగ్గర రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు?పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత బాలీవుడ్ చిత్రాల్ని కూడా తెలుగులో అప్పుడప్పుడు డబ్ చేసి వదులుతున్నారు. షారుఖ్, సల్మాన్, ఆమిర్ మూవీస్ ఒరిజినల్ వెర్షన్‌తో పాటు డబ్బింగ్ కూడా ఒకేసారి రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవి తక్కువే. కొన్ని సినిమాల విషయంలో తెలుగు ప్రేక్షకులు చాలా ఫీలవుతుంటారు.(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)ఈ ఏడాది ఫిబ్రవరిలో విక్కీ కౌశల్ 'ఛావా' మూవీ రిలీజైంది. తొలుత హిందీలో తీసుకొచ్చినప్పటికీ.. కాస్త ఆలస్యంగా అయినా సరే తెలుగులో రిలీజ్ చేశారు. తొలి వారం దాటేలోపే ఇది చేసి ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత రీచ్ ఉండేదనేది చాలామంది అభిప్రాయం. దీని విషయంలో చేసిన తప్పే ఇప్పుడు 'ధురంధర్' విషయంలోనూ మేకర్స్ చేస్తున్నారు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్'.. బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. చాలామంది తెలుగు మూవీ లవర్స్ దీన్ని ఒరిజనల్ వెర్షన్ చూసేశారు. మిగిలిన వాళ్లలో చాలామంది మాత్రం తెలుగు డబ్బింగ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.గత శుక్రవారమే(డిసెంబరు 19) ఇది తెలుగులో రిలీజ్ అయిపోతుందని సోషల్ మీడియాలో చాలా హడావుడి నడిచింది. తీరా చూస్తే అది రూమర్ అని తేలిపోయింది. ఈ వారమూ వచ్చే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే ఛాంపియన్, దండోరా, శంబాల, వృషభ, పతంగ్, ఈషా, బ్యాడ్ గర్ల్జ్, మార్క్.. ఇలా లైన్లో చాలానే థియేటర్ మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు వస్తే 'ధురంధర్'కి స్పేస్ దొరకడం కష్టం.మైత్రీ మూవీ మేకర్స్.. 'ధురంధర్' తెలుగు డబ్బింగ్‌ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం జనవరి 1వ తేదీని చూస్తున్నారట. ఇది నిజమా అబద్ధమా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది కూడా జరగకపోతే మాత్రం తెలుగు ఆడియెన్స్.. ఓటీటీలోకి వచ్చాక చూసుకోవాల్సిందే. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. (ఇదీ చదవండి: టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్) -
దురంధర్ మరో రికార్డ్.. ఆ లిస్ట్‌లో షారూఖ్ ఖాన్ జవాన్ కంటే..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ఈ చిత్రంలో విడుదలైన 16 రోజుల్లో ఏకంగా రూ. 785 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది.ఓవరాల్‌గా చూస్తే ఇండియాలో రూ. 500 కోట్ల మార్కును అధిగమించిన ఏడో హిందీ చిత్రంగా 'ధురంధర్' నిలిచింది. షారూఖ్ ఖాన్ 'జవాన్', శ్రద్ధా కపూర్ 'స్త్రీ -2' చిత్రాల కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే ఆదివారం రోజే ఛావా(రూ.807 కోట్లు) వసూళ్లను అధిగమించేలా కనిపిస్తోంది. అవతార్: ఫైర్ అండ్ యాష్ రిలీజ్ వల్ల దురంధర్ కలెక్షన్స్ కాస్తా తగ్గినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ హమ్జా పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. -
రేసులో 'అవతార్'.. కానీ 'ధురంధర్' కలెక్షనే ఎక్కువ!
విడుదలై రెండు వారాలు దాటిపోయినా సరే 'ధురంధర్' జోరు అస్సలు తగ్గట్లేదు. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ దేశవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రూ.600-700 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా థియేటర్లలోకి వచ్చిన హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీని కూడా వసూళ్లలో ఈ చిత్రం దాటేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఏంటి విషయం?జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్' ఫ్రాంచైజీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2009లో తొలి పార్ట్ రిలీజైనప్పుడు మూవీ లవర్స్ ఆశ్చర్యపోయారు. మన దేశంలోనూ వేల కోట్ల వసూళ్లు వచ్చాయి. 2022లో రెండు పార్ట్ విడుదలైతే ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే దక్కింది. రూ.400-500 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి. కానీ నిన్న(డిసెంబరు 19) థియేటర్లలోకి మూడో పార్ట్‌కి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. అదే స్టోరీ అదే విజువల్స్ ఉన్నాయని చూసొచ్చిన ఆడియెన్స్ అనుకుంటున్నారు. దీంతో తొలిరోజు దేశవ్యాప్తంగా రూ.20 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది.అదే టైంలో 'ధురంధర్'కి నిన్న(డిసెంబరు 19) రూ.22.50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అంటే రేసులో ఉన్న హాలీవుడ్ మూవీ 'అవతార్ 3'ని కూడా హిందీ మూవీ దాటేసిందనమాట. చూస్తుంటే ఈ వీకెండ్లోనూ 'ధురంధర్' హవా కనిపించేలా ఉంది. ఈ మూవీ దెబ్బకు ఇటు తెలుగులో రిలీజైన 'అఖండ 2'పై గట్టిగానే ఎఫెక్ట్ పడింది. ఎందుకంటే తెలుగు తప్ప మిగతా ఏ భాషలోనూ బాలకృష్ణ చిత్రం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అలా 'ధురంధర్' ఎఫెక్ట్.. తెలుగు, ఇంగ్లీష్ మూవీస్‌పై గట్టిగానే పడినట్లు తెలుస్తోంది. -
అక్షయ్ క్రేజ్‌పై అసూయ? మాధవన్ ఆన్సరిదే!
యానిమల్ సినిమాలో జమల్ కదు పాట ఎంత ఫేమస్ అయిందో ధురంధర్లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్ అంత ఫేమస్ అయింది. అతడి స్వాగ్, లుక్స్, స్టెప్పులు అన్నింటికీ జనం ఫిదా అయ్యారు. అలా అని అదేదో రిహార్సల్స్ చేసిన డ్యాన్స్ కూడా కాదు. అప్పటికప్పుడు తోచినట్లుగా స్టెప్పేశాడంతే! ఇప్పుడేమో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్షయ్ ఖన్నాయే ట్రెండ్ అవుతున్నాడు. సినిమాలో రణ్వీర్ సింగ్, ఆర్ మాధవన్ వంటి స్టార్స్ ఉన్నా సరే అక్షయ్‌నే ఎక్కువ కీర్తిస్తున్నారు.మాధవన్‌కు కుళ్లు?ఈ విషయంలో మాధవన్ కాస్త అప్సెట్ అయ్యాడట! ఓపక్క ధురంధర్ వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతున్నందుకు ఒకింత సంతోషంగా ఉన్నా.. అక్షయ్‌కే ఎక్కువ క్రెడిట్ రావడంతో హర్ట్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా మాధవన్ స్పందించాడు. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అక్షయ్‌కు మంచి గుర్తింపు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతే తప్ప బాధెందుకు ఉంటుంది? ఆయన ఎంతో ప్రతిభావంతమైన నటుడు, అలాగే ఎంతో నిరాడంబరంగా ఉంటాడు. తనకు కచ్చితంగా ఈ ప్రశంసలు దక్కి తీరాల్సిందే!నాకంటే గొప్పవాడుఆయన తల్చుకుంటే లక్షల ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు. కానీ తన కొత్తింట్లో తాపీగా కూర్చున్నాడు. విజయాన్ని నిశ్శబ్ధంగానే ఎంజాయ్ చేస్తున్నాడు. నేను పెద్దగా జనం అటెన్షన్ కోరుకునే వ్యక్తిని కాదు. ఈ విషయంలో అక్షయ్ ఖన్నా నాకంటే గొప్పవాడు. ఆయన అసలేదీ పట్టించుకోడు. జయాపజయాలన్నీ కూడా అతడి దృష్టిలో సమానమే అని మాధవన్ చెప్పుకొచ్చాడు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ధురంధర్ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.730 కోట్లు వసూలు చేసింది. కేవలం భారత్‌లోనే రూ.483 కోట్లు రాబట్టింది.చదవండి: బిగ్‌బాస్ 9కి ప్రాణం పోసిన రియల్ గేమర్.. సంజనా -
ధురంధర్.. బాలీవుడ్‌కి ఓ ప్రమాద హెచ్చరిక!
కొన్ని సినిమాలు సౌండ్ చేయకుండా వస్తాయి. థియేటర్లలో నెవ్వర్ బిఫోర్ అనేలా రీసౌండ్ చేస్తాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రకంపనలు ఆ రేంజులో ఉంటాయి. సెలబ్రిటీల నుంచి అవసరం లేని విమర్శలూ వినిపిస్తాయి. చాలామందికి నిద్రలేని రాత్రులే మిగులుతాయి. అవును ఇదంతా చెబుతున్నది 'ధురంధర్' కోసమే. ఇంతకీ ఈ సినిమా గురించి బాలీవుడ్లో ఏం మాట్లాడుకుంటున్నారు?'ధురంధర్'.. పదిహేను రోజుల క్రితం రిలీజైన హిందీ సినిమా. థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో మూవీ ఉందని కూడా పెద్దగా తెలియదు. ఎందుకంటే రెగ్యులర్ బాలీవుడ్ స్టార్స్ చేసే పీఆర్ షో దీనికి చేయలేదు. కట్ చేస్తే రిలీజైన రెండు వారాల్లో సీన్ మారిపోయింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ దక్కుతోంది. అదే టైంలో హిందీ చిత్రసీమలో ప్రకంపనలు వినిపిస్తున్నాయి. దక్షిణాదిలోనూ మంచి రెస్పాన్స్, వసూళ్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమా చూసి చాలామంది బాలీవుడ్ స్టార్స్ తట్టుకోలేకపోయారు. హీరో హృతిక్ రోషన్ మాట్లాడుతూ సినిమా అంతా బాగానే ఉంది గానీ పాలిటిక్స్ చూపించకపోయింటే బాగుండేదని అన్నాడు. ఎందుకంటే ఈ మూవీ హిట్ అయి, జనాలకు ఇది నచ్చేస్తే ఇతడు హీరోగా ఉన్న స్పై యూనివర్స్‌ని ఇక జనాలు చూడరేమో అని భయం కావొచ్చు?హీరోయిన్ రాధిక ఆప్టే.. ఈ మూవీలో వయలెన్స్ దారుణంగా ఉందని చెప్పింది. ఇలాంటి చిత్రాలు తన పిల్లలకు ఎలా చూపించాలి అన్నట్లు మాట్లాడింది. మరి ఈమె గతంలో పలు చిత్రాల్లో నగ్న సన్నివేశాల్లోనూ నటించింది. మరి వాటి సంగతేంటని నెటిజన్లు ఈమెని విమర్శిస్తున్నారు. పలువురు పేరు మోసిన హిందీ రివ్యూయర్లు కూడా ఇదేం మూవీ అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు.ఇన్నాళ్లు హిందీ సినిమాల్లో పాకిస్థాన్ని చాలా పవర్‌ఫుల్‌గా, భాయ్ భాయ్ దోస్తానా అన్నట్లు చూపించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ తీసిన స్పై యూనివర్స్‌లోని 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'పఠాన్', 'వార్', 'వార్ 2' సినిమాల్లో పాకిస్థాన్ని ఒకలా ప్రెజెంట్ చేశారు. ఉగ్రవాదులని ఒకలా చూపించారు. కానీ 'ధురంధర్' చూసిన తర్వాత జనాలకు కొన్ని విషయాలు క్లియర్‌గా అర్థమయ్యాయని చెప్పొచ్చు. దీని దెబ్బకు ఇకపై యష్ రాజ్ స్పై యూనివర్స్‌ని జనాలు ఆదరిస్తారా అనేది చూడాలి? ఎందుకంటే రాబోయే రోజుల్లో 'ధురంధర్' ఆ రేంజ్ ఎఫెక్ట్ చూపించబోతుంది.బాలీవుడ్లో గతంలోనూ నెపోటిజం ఉన్నప్పటికీ.. గత కొన్నేళ్లలో మాత్రం అది పీక్స్‌కి చేరింది. సదరు స్టార్ హీరో లేదా హీరోయిన్స్ ఉన్న సినిమాలు ఏ మేరకు ఆడుతున్నాయనేది అందరికీ తెలుసు. అయినా సరే వీళ్లు మాత్రమే స్టార్స్ అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు 'ధురంధర్' సినిమాతో వాటికి చెక్ పడటం గ్యారంటీలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రణ్వీర్ సింగ్, సంజయ్ దత్తో పాటు చాలామంది చిన్న పెద్ద యాక్టర్స్ మెరిశారు. ఇందులో యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత బాలీవుడ్ స్టార్స్ చేస్తున్నది కూడా యాక్టింగేనా అనిపించక మానదు.'ధురంధర్' సినిమాలో ఒక్కసారి కూడా మతం గురించి ప్రస్తావించలేదు. సామాన్య ప్రజలను రాక్షసులుగా చూపించలేదు. కేవలం దాయాది దేశంలోని ఓ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది అని మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. అలా అని దర్శకుడు ఆదిత్య ధర్ ఏదో పెద్ద పెద్ద మెసేజులు ఇవ్వలేదు. ఇది పరిస్థితి అని చూపించాడు. అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత అన్నట్లు వదిలేశాడు.దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా 'ధురంధర్'ని ప్రశంసిస్తూ చాలా పెద్ద ట్వీట్ చేశాడు. ప్రస్తుత దర్శకులు ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలని అన్నాడు. కొన్నాళ్ల ముందు కూడా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్లో 'కబీర్ సింగ్' తీసినప్పుడు ఇలానే చాలామంది చాలా విమర్శలు చేశారు. 'యానిమల్' రిలీజ్ టైంలోనూ ఇదే రిపీటైంది. కానీ వాళ్లందరికీ సందీప్.. తన సినిమాతో సమాధానమిచ్చాడు. ఇప్పుడు కూడా ఆదిత్య అలాంటి పంచ్ ఇచ్చాడు. బాలీవుడ్ పునాదులు కదిలించే ప్రయత్నం చేశాడు. చెప్పాలంటే బాలీవుడ్‌కి ఇదో ప్రమాద హెచ్చరిక లాంటిది! -
'ధురంధర్'కి భారీ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడు?
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ లేపుతున్న సినిమా 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ దక్షిణాదిలోనూ మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు నమోదవుతున్నాయి. చూసిన చాలామందికి ఇది నచ్చేస్తోంది. మరికొందరు మాత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. ఈ క్రమంలోనే 'ధురంధర్' డిజిటల్ డీల్ గురించి సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. 'ఉరి' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు. రిలీజ్‌కి ముందు ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రూ.700 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సీక్వెల్ కూడా ఉందని ప్రకటించారు. రాబోయే మార్చి 19న అది థియేటర్లో ఇది విడుదల కానుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' నటితో ముద్దు వీడియో.. ట్రోల్స్‌పై స్పందించిన నటుడు)అసలు విషయానికొస్తే.. 'ధురంధర్' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే రూ.130 కోట్లకు ఈ డీల్ జరిగిందని కొన్నిరోజుల క్రితం రూమర్స్ రాగా.. ఇప్పుడు ఏకంగా రూ.285 కోట్లతో ఒప్పందం జరిగిందని అంటున్నారు. ఏదేమైనా ఏదో ఒకలా సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి డిస్కషన్ నడుస్తోంది.'ధురంధర్' స్ట్రీమింగ్ విషయానికొస్తే థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే వచ్చే జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో ఇది వచ్చే ఛాన్స్ ఉంది. ఇకపోతే తెలుగు డబ్బింగ్ రిలీజ్ ఉందని మాట్లాడుకుంటున్నారు కానీ ఇంతవరకు ఈ విషయంపై క్లారిటీ అయితే రాలేదు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ) -
నటితో ముద్దు వీడియో.. ట్రోల్స్‌పై స్పందించిన నటుడు
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘ధురంధర్’.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, ఈ మూవీలో తండ్రీ కూతుర్లుగా నటించిన నటి సారా అర్జున్, సీనియర్ నటుడు రాకేశ్ బేడీ దురందర్ ఈవెంట్‌కు సంబంధించిన వేడుకలో కలుసుకున్నారు. అయితే, తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్ను రాకేశ్ బేడీ ముద్దుపెట్టుకోవడం నెట్టింట పెద్ద దుమారం రేగింది. దీంతో భారీగా ట్రోల్స్ వచ్చాయి. ఈ క్రమంలో రాకేశ్ బేడీ స్పందించారు.‘ధురంధర్’ సినిమాలో రాకేశ్, సారా కలిసి నటించడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది . ఈ క్రమంలోనే జరిగిన ఆ మూవీ వేడుకలో వారిద్దరూ కలిశారు. సారా వేదిక పైకి రాగానే రాకేశ్ ఆమెకు ఎదురెళ్లి పలకరించే క్రమంలో ఆమె భుజంపై ముద్దు పెట్టారు. ఈ ఘటన గురించి ట్రోల్స్ రావడం చాలా బాధాకరం అంటూ రాకేశ్ బేడీ రియాక్ట్ అయ్యారు. దీనిని తప్పుగా అర్ధం చేసుకోవడం తెలివితక్కువ పని అంటూ ఫైర్ అయ్యారు. సారా తనకంటే వయసులో చాలా చిన్నదని వివరణ ఇచ్చారు. మూవీ సెట్స్‌లో కూడా తామిద్దరం ఒకే కుటుంబంలానే ఉన్నామన్నారు. ఈ కారణంగానే ఆమె వేదికపై కనిపించగానే దగ్గరకు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఎక్కువమంది చెండాలంగా కథనాలు రాశారు. 20ఏళ్ల యువతిపై ముసలోడి ప్రేమ అంటూ రాశారు. కనీసం ఒక్కరు కూడా కుమార్తెపై ఉన్న ప్రేమ అనేలా రాయలేదని ఆవేదన చెందారు. సారా తనకు కూడా కూతురు లాంటిదేనని రాకేశ్ పేర్కొన్నారు. -
19 ఏళ్లకే బట్టతల.. 50 ఏళ్లు దాటినా సింగిల్‌గా!
అందాన్ని కాపాడుకునేందుకు సెలబ్రిటీలు పడే పాట్లు అంతా ఇంతా కాదు. కడుపు మాడ్చుకుంటారు, క్రీములు వాడతారు, జిమ్కెళ్తారు. అందం, శరీర సౌష్టవం కోసం ఏదైనా చేస్తారు. కానీ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికే జుట్టు రాలడం మొదలైతే ఇంకేమైనా ఉందా? అందులోనూ అబ్బాయిలు బట్టతలతో ఆడిషన్‌కు వెళ్తే ఎవరైనా తీసుకుంటారా? అక్షయ్ ఖన్నాకు కూడా ఇదే భయం. కానీ భయపడుతూ కూర్చుంటే ఏదీ మారదని అర్థమై ధైర్యంగా ముందడుగు వేశాడు. లుక్ కన్నా టాలెంట్ ముఖ్యమని నిరూపించాడు. ఈ ఏడాది ఛావా, ధురంధర్ సినిమాలతో సెన్సేషన్‌గా మారిన ఈ నటుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..19 ఏళ్లకే జుట్టు రాలడందివంగత నటుడు, రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా కుమారుడే అక్షయ్ ఖన్నా. స్కూల్, కాలేజీ డేస్‌లో చదువులో కన్నా ఆటల్లోనే ఎక్కువ రాణించేవాడు. కానీ చిన్నతనంలోనే హెయిర్ లాస్ సమస్యతో బాధపడ్డాడు. 19 ఏళ్లకే ఉన్న జుట్టంతా ఊడిపోతుంటే భరించలేకపోయాడు. తలపై ఎన్ని వెంట్రుకలు ఉంటే అన్ని ఆఫర్స్ వస్తాయనుకునేవాడు. తండ్రి సినిమాతో ఎంట్రీకానీ, జుట్టు రాలడాన్ని తగ్గించలేమన్న నిజాన్ని అర్థం చేసుకున్నాక తన టాలెంటే అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. తండ్రి హీరోగా నటించి, నిర్మించిన హిమాలయ పుత్ర (1997) మూవీతో తొలిసారి వెండితెరపై అడుగుపెట్టాడు. అయితే అక్షయ్ (Akshaye Khanna)కు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం తన రెండో మూవీ 'బోర్డర్'. ఈ చిత్రం తర్వాత అక్షయ్ వెనుదిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తనదైన మార్క్ సృష్టించాడు. వైరల్దిల్ చహ్తా హై, హమ్రాజ్, దీవాంగే, రేస్, తీస్ మార్ ఖాన్, ఇత్తేఫఖ్, సెక్షన్ 375, దృశ్యం 2 ఇలా హిందీలో సినిమాలు చేసుకుంటూ పోయాడు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఛావాతో తిరిగొచ్చాడు. ఔరంగజేబుగా అద్భుతంగా నటించి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ధురంధర్ చిత్రంలో తన యాక్టింగ్, డ్యాన్స్ క్లిప్‌తో మరోసారి వార్తల్లోకెక్కాడు. అయితే అక్షయ్‌కు అందరిలా పార్టీలు చేసుకుంటూ ఎప్పుడై లైమ్‌లైట్‌లో ఉండే అలవాటు లేదు. 50 ఏళ్లు దాటినా సింగిల్‌గానే..వచ్చామా? సినిమాలు చేసుకున్నామా? అయిపోయిందా? అంతే! అన్నట్లుగా ఉంటాడు. 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన ఈ హీరో గతంలో హీరోయిన్ కరిష్మా కపూర్‌తో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ ప్రేమకథ పెళ్లిదాకా రాకముందే ఆగిపోయింది. 28 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న అక్షయ్ ఆస్తి రూ.167 కోట్లు ఉంటుందని అంచనా! #AkshayeKhanna How on earth are you aging backwards, sharpening your features instead of softening them.? Akshay, you insane, precision-crafted monster of talent, how are you this god-level? It’s illegal at this point.He’s grown into a kind of dangerous handsomeness, the kind… pic.twitter.com/dExZhHFddH— sweeti singh vikram (@SweetiSghVikram) December 7, 2025 -
దురంధర్ క్రేజ్.. మూవీని వీక్షించిన టీమిండియా
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం హిందీ భాషల్లో విడుదలైనప్పటికీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.600 కోట్ల మార్క్‌ను చేరుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీకి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీని టీమిండియా సభ్యులు వీక్షించారు. లక్నోలోని ఫీనిక్స్ పలాసియో మల్టీప్లెక్స్ మాల్లో క్రికెటర్స్ దురంధర్ సినిమాను ఆస్వాదించారు. టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, తిలక్ వర్మ దురంధర్ మూవీని చూసినవారిలో ఉన్నారు. క్రికెటర్స్ థియేటర్లోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతోంది. రెండు జట్ల నాలుగో టీ20 లక్నో వేదికగా బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలోనే లక్నో చేరుకున్న టీమ్ దురంధర్‌ను వీక్షించింది.ధురందర్ రిలీజైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే సైయారా ఆల్‌టైమ్ కలెక్షన్స్‌ను అధిగమించింది. ప్రస్తుతం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది. దురంధర్ రెండో భాగం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Subodh Rambir Singh (@bollyfreaksofficial) -
ఇకపై కాంతార, ఛావా కాదు.. దురంధర్ పేరు రాసుకోండి..!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. తెలుగులో బాక్సాఫీస్ వద్ద అఖండ-2 రిలీజైన దురంధర్ వసూళ్లు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం 11 రోజుల్లోనే రూ.600 కోట్ల మార్క్‌ను దాటేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ సైతం మేకర్స్‌ను కొనియాడారు.సైయారాను దాటేసిన దురంధర్..డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ వస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ఏకంగా మూడో స్థానానికి చేరుకుంది. రెండవ సోమవారం కూడా కలెక్షన్లపరంగా దుమ్ములేపింది. మొదటి సోమవారం కంటే అధిక వసూళ్లు రాబట్టింది. ఈ లిస్ట్‌లో తొలి రెండు స్థానాల్లో రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1, విక్కీ కౌశల్ ఛావా ఉన్నాయి.కాంతార చాప్టర్-1 ను అధిగమించే ఛాన్స్..ఈ మూవీ రిలీజై ఇప్పటికి 11 రోజులు పూర్తి చేసుకుంది. కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దక్షిణాది భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అలా దురంధర్ తెలుగులోనూ రిలీజైతే ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన కాంతార చాప్టర్-1ను త్వరలోనే దురంధర్ అధిగమించే ఛాన్స్ ఉంది.అందుకే బజ్..పాకిస్తాన్ నేపథ్యంలో స్టోరీ కావడం దురంధర్‌కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ పాకిస్తాన్‌లోని లయారీ ముఠాలలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. ఈ మూవీలో కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనలు చూపించారు. అందువల్లో దేశవ్యాప్తంగా ఈ మూవీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలతో తెరకెక్కించడం.. రెండేళ్ల గ్యాప్ తర్వాత రణ్వీర్ సింగ్ మూవీ రావడం కూడా దురంధర్‌కు బాగా కలిసొచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండో వారం కూడా అత్యధిక వసూళ్లు సాధించింది.ఇప్పటివరకు 11 రోజుల్లోనే రూ.600.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో వారాంతంలో ఇండియాలో ఏకంగా రూ.140 కోట్లకు పైగా నికర వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా చూస్తే భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. తాజాగా రూ.600 కోట్ల మార్క్‌తో ఈ ఏడాది రొమాంటిక్ బ్లాక్‌బస్టర్ సైయారా (రూ.580) కోట్ల వసూళ్లను అధిగమించింది. అంతేకాకుండా పద్మావత్ (రూ.585 కోట్లు), సంజు (రూ.592 కోట్లు) వంటి పెద్ద హిట్ల రికార్డులను తుడిచిపెట్టేసింది.ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, రాకేష్ బేడీల నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కూడా నటించారు. ఈ సినిమా జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీకి కొనసాగింపుగా సీక్వెల్‌గా మార్చి 12, 2026న విడుదల కానుంది. -
'ధురంధర్' సినిమా రివ్యూ
గత కొన్నిరోజుల నుంచి సినీ ప్రేమికులు ఓ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అదే 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ.. సౌత్‌లోనూ దీని సౌండ్ గట్టిగానే ఉంది. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ ఇందులో నటించారు. పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజైంది. కలెక్షన్స్ కూడా ఇప్పటికే రూ.500 కోట్లు దాటేశాయి. మరి అంతలా ఈ సినిమాలో ఏముంది? ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)కథేంటి?1999లో కాందహార్ హైజాక్, 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత మన దేశ ఏజెంట్.. పాకిస్థాన్‌లో ఓ హై పొజిషన్లో ఉండాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (ఆర్.మాధవన్) భావిస్తారు. వెంటనే 'ఆపరేషన్ ధురంధర్' ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా హంజా అలీ (రణ్వీర్ సింగ్) పాక్‌లోని కరాచీకి స్పై ఏజెంట్‌గా వెళ్తాడు. తర్వాత లయరీ అనే ప్రాంతంలో రెహమాన్ బలోచ్(అక్షయ్ ఖన్నా) నడిపిస్తున్న లోకల్ గ్యాంగ్‌లో చేరతాడు. తర్వాత ఐఎస్ఐ లీడర్‌తోనూ స్నేహం చేసే స్థాయికి వెళ్తాడు. తర్వాత ఏమైంది? ఇందులో ఎస్పీ చౌదరి (సంజయ్ దత్) పాత్ర ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పటివరకు చాలా స్పై థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా దాదాపు ఒకే టైపులో ఉంటాయి. కానీ 'ధురంధర్' మాత్రం పేరుకే స్పై జానర్ గానీ కేజీఎఫ్ స్టైల్లో ఉంటుంది. అంటే ఊరమాస్ అనమాట. కాందహార్ హైజాక్ సీన్‌తో మొదలయ్యే ఈ మూవీని మొత్తం ఎనిమిది ఛాప్టర్లుగా చూపిస్తారు. 214 నిమిషాల నిడివి అంటే మూడున్నర గంటలపైనే ఉంటుంది. చూస్తున్నంతసేపు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.ఈ సినిమా అంతా పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్లోనే ఉంటుంది. 1990ల్లో కరాచీలోని లయరీ అనే ప్రాంతం, అక్కడి గ్యాంగ్ వార్స్‌ని కళ్లకు కట్టినట్లు చూపించారు. షూటింగ్ అంతా ఎక్కడ చేశారో గానీ మూవీ చూస్తున్నంతసేపు నిజంగా మనం పాకిస్థాన్‌లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి సీన్, ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్.. చాలా డీటైల్డ్‌గా చూపించారు. లయరీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్స్టర్స్ రెహమాన్ బలోచ్, అర్షద్ అప్పు నిజ జీవిత పాత్రలే. రెహమాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా జీవించేశాడు. పేరుకే రణ్వీర్ సింగ్ హీరో గానీ మూవీలో రెహమాన్ పాత్ర వేరే లెవల్లో ఉంటుంది.సినిమా నిడివి విషయంలో ఇబ్బంది అనిపించొచ్చు గానీ ఒక్కసారి మీరు మూవీలోలో లీనమైతే మాత్రం అదిరిపోయే సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ గ్యారంటీ. ఎందుకంటే ఓవైపు విజువల్స్, మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు.. ఇలా దేనికవే టాప్ నాచ్ ఉంటాయి. హీరోయిన్ పాత్ర అసలెందుకు ఉందా అని ప్రారంభంలో అనిపిస్తుంది గానీ ఆమె పాత్రని ఉపయోగించిన విధానం చూస్తే ఈమె క్యారెక్టర్ అవసరమే అనిపిస్తుంది. కాకపోతే రణ్వీర్ పక్కన హీరోయిన్ సారా చిన్నపిల్లలానే కనిపిస్తుంది. ఇది కాస్త మైనస్.ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా రియలస్టిక్‌గా ఉంటాయి. సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఓ మూడు నాలుగు సన్నివేశాలు ఉంటాయి. వీటిని చూడకపోవడమే బెటర్. అంత దారుణంగా ఉంటాయి. ఈ సినిమాలో హీరోతో పాటు కొన్ని కల్పిత పాత్రలు ఉంటయి గానీ మిగిలినవి మాత్రం నిజ జీవిత సంఘటనల నుంచి తీసుకున్నవే. మాధవన్ చేసిన అజయ్ సన్యాల్ పాత్ర చూస్తున్నంతసేపు అజిత్ ఢోబాల్ గుర్తొస్తారు.క్లైమాక్స్‌లో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. అది కూడా మరో మూడు నెలల్లో అంటే మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు. తొలిభాగంలో గ్యాంగ్‌స్టర్ గ్రూప్‌లో ఒకడిగా కనిపించిన భారత స్పై హంజా అలీ(రణ్వీర్).. సీక్వెల్లో మాత్రం ఏకంగా లయరీలోని గ్యాంగ్‌స్టర్స్‌లో ఒకడు అయిపోతాడు. మిగిలిన గ్యాంగ్‌స్టర్స్‌ని చంపేస్తాడు. ఇదంతా ఎండ్ క్రెడిట్స్‌లో చిన్నపాటి ట్రైలర్‌లా చూపించారు. తద్వారా సీక్వెల్‌పై ఆసక్తి పెంచారు.ఈ సినిమా ప్రస్తుతానికి హిందీలో మాత్రం థియేటర్లలో రన్ అవుతోంది. ఈ వీకెండ్ తెలుగులోనూ రిలీజ్ చేయొచ్చని అంటున్నారు గానీ దానిపై స్పష్టత లేదు. ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. డీల్ ప్రకారం 8 వారాల తర్వాత అంటే ఫిబ్రవరి తొలి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఒకవేళ అప్పటివరకు వెయిట్ చేయలేం అనుకుంటే మాత్రం 'ధురంధర్'ని థియేటర్లో ఎక్స్‌పీరియెన్స్ చేయండి. వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ) -
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఎవరీ బ్యూటీ!
కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన ‘నాన్న’ సినిమా గుర్తుందా? చూసిన వాళ్లు అయితే ఆ సినిమాను అంత ఈజీగా మార్చిపోరులేండి. ఇప్పుడీ సినిమా గురించి ఎందుకంటారా? అదే సినిమాలో విక్రమ్ కూతురుగా నటించిన ఓ చిన్నారు గుర్తుంది కదా? మతి స్థిమితం లేని నాన్నతో సైగలు చేస్తూ మాట్లాడి..మనకు కన్నీళ్లు తెప్పించింది. ఆ సినిమా విజయంలో విక్రమ్‌తో పాటు ఆ చిన్నారి పాత్ర కూడా చాలా ఉంది. ఆ చిన్నారు ఇప్పుడు హీరోయిన్గా కాదు కాదు.. ‘పాన్ ఇండియా హీరోయిన్’ మారిపోయింది. ఆమె పేరు సారా అర్జున్!రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్’లో హీరోయిన్గా నటించింది సారా. ప్రస్తుతం ఆమె వయసు 20 ఏళ్లు మాత్రమే. అప్పుడే పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ మూవీ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. పది రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరూ సారా అర్జున్ గురించి ఆరా తీయడం ప్రారంభించారు.ఏడాదిన్నరకే నటనబాలీవుడ్ నటుడు అర్జున్ కూతురే సారా అర్జున్. 2005లో ముంబైలో పుట్టింది. ఏడాదిన్నర వయసులోనే ఓ యాడ్‌లో నటించి మెప్పించింది. తొలి యాడ్‌కి మంచి స్పందన రావడంతో సారాకు వరుస ఆఫర్లు వచ్చాయి. చిన్నవయసులోనే దాదాపు 100పైగా వాణిజ్య ప్రకటనల కోసం నటంచింది. . మ్యాగీ, క్లినిక్ ప్లస్, మెక్ డొనాల్డ్స్, కల్యాణ్ జ్యువెలర్స్ వంటి బడా సంస్థల యాడ్స్‌లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.ఆరేళ్లకే వెండితెరపైకోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ఓ యాడ్ తీశాడు. అందులో సారా నటించింది. ఆమె అమాయకత్వం చూసి మురిసిపోయిన విజయ్.. తన మూవీ ‘దైవ తిరుమగల్’లో చాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులో ‘నాన్న’ టైటిల్‌తో రిలీజైంది. విక్రమ్ కూతురుగా నటించిన సారా.. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గాను చైల్డ్ ఆర్టిస్‌గా ఎన్నో అవార్డులను అందుకుంది. ఆ తర్వాత మణిరత్నం'పొన్నియన్ సెల్వన్'లో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి రోల్లో నటించింది. దీంతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా సారా చరిత్ర సృష్టించింది.అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ..సారాకి మెగా ఫోన్ పట్టాలనే కోరిక ఉంది. ఎప్పటికైనా సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటుంది. ‘డంకీ’ సినిమాకిగాను డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది.డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడే కథక్, హిప్మాప్ నేర్చుకుంది. కరాటేతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘యుఫోరియా’ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుంది. -
బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న దురంధర్.. రణ్వీర్ సింగ్ రియాక్షన్ ఇదే..!
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ములేపుతోంది. రిలీజైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్ల మార్కును దాటేసింది. దేశవ్యాప్తంగా నెట్ వసూళ్లపరంగా చూస్తే రూ.364.60 కోట్లు సాధించింది. రెండో ఆదివారం ఇండియాలో ఏకంగా రూ.58.20 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఒక హిందీ చిత్రానికి వచ్చిన రెండో ఆదివారం అత్యధిక వసూళ్లు కావడం విశేషం. కాగా.. ఈ మూవీపై ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ సైతం మేకర్స్‌ను కొనియాడారు.ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో రణ్వీర్ సింగ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అదృష్టానికి మంచి అలవాటు ఉంది. సమయానికి తగ్గట్టు అది మారుతూ ఉంటుంది. కానీ, ఓర్పు చాలా ముఖ్యం అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. 2025లో అత్యధిక కలెక్షన్స్ వచ్చిన ఇండియన్ చిత్రాల జాబితాలో ధురంధర్ ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ మూవీ కంటే ముందు కాంతార: చాప్టర్ 1 ఛావా, సైయారా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని రోజులు ఇదే జోరు కొనసాగితే దురంధర్ స్థానం మరింత మెరుగయ్యే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.దురంధర్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.430.20 కోట్లుగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్లో రూ.122.50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రెండో వీకెండ్లో శుక్రవారం రూ34.70 కోట్లు, శనివారం రూ.53.70 కోట్లు, ఆదివారం రూ.58.20 వసూళ్లతో అరుదైన మైలురాయిని చేరుకుంది. దీంతో బాలీవుడ్ సినీ చరిత్రలో రెండో వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దురంధర్ నిలిచింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని కందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి భౌగోళిక రాజకీయ, ఉగ్రవాద సంఘటనల నేపథ్యంలో సాగే రహస్య గూఢచార కార్యకలాపాల నేపథ్యంలో తెరకెక్కించారు. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించడంతో అరబ్ దేశాల్లో దురంధర్‌పై నిషేధం విధించారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించిన ఈ మూవీలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, ఆర్. మాధవన్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు.The story of The Unknown Men is now known globally.Book your tickets. 🔗 - https://t.co/cXj3M5DFbc#Dhurandhar Ruling Cinemas Worldwide.@RanveerOfficial #AkshayeKhanna @duttsanjay @ActorMadhavan @rampalarjun #SaraArjun @bolbedibol @AdityaDharFilms #JyotiDeshpande… pic.twitter.com/zvxEJqbrvv— Jio Studios (@jiostudios) December 15, 2025 -
'అఖండ 2'ని దెబ్బకొట్టిన 'ధురంధర్'!
గత వీకెండ్ తెలుగులో రిలీజైన 'అఖండ 2'కు మిశ్రమ స్పందన వచ్చింది. వీకెండ్‌కి ఏమైనా పికప్ అవుతుందనుకుంటే అలా జరిగినట్లు కనిపించలేదు. ఎందుకంటే తొలిరోజు వచ్చిన కలెక్షన్లకు.. శని-ఆదివారాల్లో వచ్చిన వసూళ్లకు పొంతన లేదు. దీనితో పాటు రిలీజైన 'మోగ్లీ' తేలిపోయింది. టాక్-కలెక్షన్స్ ఏ మాత్రం రావట్లేదు. అయితే బాలకృష్ణ సినిమాకు ఓ హిందీ చిత్రం దెబ్బకొట్టిందని చెప్పొచ్చు. అదే 'ధురంధర్'.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇది. స్పై బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. డిసెంబరు 5న థియేటర్లలో హిందీ వెర్షన్ మాత్రమే రిలీజైంది. విడుదలకు ముందు ఎలాంటి హైప్ లేదు. టికెట్స్ కూడా పెద్దగా బుక్ అవ్వలేదు. కానీ బిగ్ స్క్రీన్‌పైకి వచ్చిన ఒకటి రెండు రోజుల తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక్కసారిగా పికప్ అయిపోయింది. అలా 10 రోజుల్లోనే రూ.500 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. దీనితో పాటే రావాల్సిన 'అఖండ 2' వారం వాయిదా పడటం తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్'కి కలిసొచ్చిందనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: అఖండ2 సినిమాపై పవన్ కల్యాణ్ సైలెంట్.. ఎందుకు?)ఎందుకంటే డిసెంబరు 12న 'అఖండ 2' రిలీజైనప్పటికీ 'ధురంధర్' జోరు ఆగలేదు. హైదరాబాద్‌లో చాలాచోట్ల ఈ హిందీ సినిమాకు శని-ఆదివారం హౌస్‌ఫుల్స్ పడ్డాయి. అఖండ సీక్వెల్ ఈ విషయంలో కాస్త వెనకబడిపోయింది. సోమవారం బుకింగ్స్‌లోనూ బాలకృష్ణ మూవీ కంటే రణ్వీర్ చిత్రమే కాస్త ముందుంది. మరోవైపు 'ధురంధర్' తెలుగు డబ్బింగ్‌ని ఈ శుక్రవారమే(డిసెంబరు 19) థియేటర్లలో రిలీజ్ చేసే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే 'అఖండ 2' కలెక్షన్స్ కి ఇంకాస్త దెబ్బ పడటం గ్యారంటీ. ప్రస్తుతం 'అఖండ 2' చిత్రానికి రూ.50 కోట్ల మేర నెట్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.ధురంధర్ విషయానికొస్తే.. ఓ భారతీయ స్పై ఏజెంట్, పాకిస్థాన్ వెళ్లి అక్కడి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అనే విషయాల్ని చూపించారు. హీరో రణ్వీర్ సింగ్ అయినప్పటికీ.. కీలక పాత్ర చేసిన అక్షయ్ ఖన్నా యాక్టింగ్ ఇరగదీశాడని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఈ చిత్రాన్ని 'ఉరి' ఫేమ్ దర్శకుడు ఆదిత్య ధర్ తీశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
సినిమాలకు డిసెంబరు ఇలా కలిసి వచ్చేస్తుందేంటి?
సాధారణంగా డిసెంబరు నెల సినిమా ఇండస్ట్రీలకు సీజనే. కాకపోతే ఓ మాదిరి హిట్స్, కలెక్షన్స్ మాత్రమే వస్తుండేవి. కానీ గత కొన్నేళ్లలో చూసుకుంటే సీన్ పూర్తిగా మారిపోయింది. బాక్సాఫీస్‌కి తెగ కలిసొచ్చేస్తోంది. పాన్ ఇండియా మూవీస్ అయితే కొన్ని వారాల పాటు ఆడేసి వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇంతకీ డిసెంబరు సంగతేంటి? ఏయే సినిమాలకు ఎలా కలిసొచ్చిందనేది చూద్దాం.డిసెంబరు అంటే చలికాలం. క్రిస్మస్ పండగకు సెలవులు ఉంటాయి కాబట్టి చాలావరకు ఈ ఫెస్టివల్ టార్గెట్ చేసుకుని మూవీస్ రిలీజ్ చేస్తుంటారు. కానీ కొవిడ్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఇదే నెలలో వివిధ తేదీల్లో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్నాయి. కొవిడ్ తర్వాత ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. 2021 నుంచి ప్రతి ఏడాది ఏదో ఓ సినిమా ప్రేక్షకుల్ని అలరించి వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతూనే ఉంది.2020లో కరోనా రావడం వల్ల పెద్ద సినిమాల లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి. చాలా చిత్రాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. అలా 2021 డిసెంబరులో తొలుత 'పుష్ప' వచ్చింది. ఏ మాత్రం అంచనాల్లేకుండా రిలీజై పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దాదాపు నెలరోజుల పాటు సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఈ మూవీ ఒక ఊపు ఊపేసింది. వారం పదిరోజుల తర్వాత వచ్చిన రిలీజైన 'అఖండ' కూడా హిట్ అయింది. 2022లో పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం టాలీవుడ్ నుంచి రాలేదు.2023 డిసెంబరులోనూ టాలీవుడ్ బాక్సాఫీస్‌కి బాగా కలిసొచ్చింది. ఎందుకంటే నెల మొదట్లో సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' వచ్చి దుమ్ములేపింది. దర్శకుడు తప్ప మిగిలిన వాళ్లంతా హిందీ యాక్టర్సే అయినప్పటికీ తెలుగులోనూ అద్భుతమైన వసూళ్లు దక్కించుకుని ఆశ్చర్యపరిచింది. నెల చివరలో వచ్చిన ప్రభాస్ 'సలార్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రూ.600 కోట్ల మేర వసూళ్లు సొంతం చేసుకుంది.గతేడాది జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'పుష్ప' మేనియాని కొనసాగిస్తూ సీక్వెల్‌ని గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి పార్ట్ ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తే.. దీనికి మాత్రం అంతకు మించి అనేలా స్పందన వచ్చింది. తెలుగు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఉత్తరాదిలో వచ్చిన కలెక్షన్స్ చూసి అందరికీ కళ్లు చెదిరిపోయాయి. చెప్పాలంటే మూవీ టీమ్ కూడా ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్స్ వస్తాయని ఊహించి ఉండదు.ఈ ఏడాది కూడా డిసెంబరులో బాగానే కలిసొచ్చింది. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చిన బాలీవుడ్ మూవీ 'దురంధర్'.. అదిరిపోయే టాక్‌తో పాటు వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంది. హిందీ వెర్షన్ మాత్రమే ఉన్నప్పటికీ హైదరాబాద్ లాంటి చోట కూడా హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి. ఇక 'అఖండ 2' సీక్వెల్ తాజాగానే థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడే దీని ఫలితం గురించి చెప్పలేం. ఎందుకంటే తొలి భాగంతో పోలిస్తే ఇందులో కాస్త అతి ఎక్కువైందని అంటున్నారు. కొన్నిరోజులు ఆగితే రిజల్ట్ ఏంటనేది క్లారిటీ వస్తుంది. ఇలా కొవిడ్ తర్వాత పాన్ ఇండియా సినిమాలకు డిసెంబరు అనేది లక్కీగా మారిపోయింది. చెప్పాలంటే ఇది ఎవరూ ఊహించలేదు. చూస్తుంటే ఇకపై సంక్రాంతి, దసరాలానే డిసెంబరు కూడా సినిమాలకు సీజన్ అయిపోతుందేమో చూడాలి? -
దూసుకుపోతున్న దురంధర్.. పుష్ప 2 రికార్డు అవుట్
-
బాక్సాఫీస్ వద్ద దురంధర్.. దెబ్బకు పుష్ప-2 రికార్డ్ బ్రేక్..!
డిసెంబర్ తొలివారంలో రిలీజైన బిగ్ మూవీ దురంధర్. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆదిత్య ధర్ తెరకెక్కించారు. డిసెంబర్ 5న థియేటర్లలోకి ఈ మూవీ తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి రోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అలా మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటేసింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు రిలీజైన 9 రోజుల్లో ఏకంగా రూ.292 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆదివారం కలెక్షన్స్ కూడా కలిపితే రూ.300 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే మొదటి వారం కలెక్షన్స్ పెరగడం ఏ సినిమాకైనా సాధ్యమే. కానీ రెండో వారంలోనూ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకుండా దురంధర్ దూసుకెళ్తోంది. ఇదే క్రమంలో రెండో వారంలో ఈ మూవీ ఓ క్రేజీ రికార్డ్‌ను అందుకుంది. రెండో శుక్రవారం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ రోజు పుష్ప-2, ఛావా, యానిమల్ లాంటి బిగ్ హిట్స్ వసూళ్లను అధిగమించింది. హిందీలో ఈ సినిమాల రికార్డులను తిరగరాసింది. ఫ్రైడే ఒక్క రోజే ఈ మూవీ రూ.34.7 కోట్ల వసూళ్లు సాధించింది.ఈ లిస్ట్‌లో పుష్ప-2 రూ.27.50 కోట్లు, ఛావా రూ.24.03 కోట్లు, యానిమల్ రూ.23.53 కోట్లు, గదర్-2 రూ.20.50 కోట్లు, బాహుబలి2 రూ.19.75 కోట్లు సాధించాయి. తాజాగా ఈ రికార్డులను రణ్వీర్ సింగ్ దురంధర తుడిచిపెట్టేసింది. రెండో వారంలోనూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడంతో బాలీవుడ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద రాణిస్తుండడంతో దురంధర్ మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే జోరు కొనసాగితే దురంధర్ త్వరలోనే రూ.500 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తోంది.కాగా.. ఈ చిత్రంలో మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్ థ్రిల్లర్. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్‌గా రణ్వీర్ సింగ్.. ఐబీ చీఫ్‌గా మాధవన్ నటించారు. విలన్‌గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు. HISTORIC... 'DHURANDHAR' OVERTAKES 'PUSHPA 2', 'CHHAAVA', 'ANIMAL' ON *SECOND FRIDAY*... #Dhurandhar is rewriting the record books 🔥🔥🔥.First, take a look at the *second Friday* numbers...⭐️ #Pushpa2 #Hindi: ₹ 27.50 cr⭐️ #Chhaava: ₹ 24.03 cr⭐️ #Animal: ₹ 23.53 cr⭐️… pic.twitter.com/AYRjQia5sF— taran adarsh (@taran_adarsh) December 13, 2025 -
రణ్వీర్ సింగ్ దురంధర్.. ఐకాన్ స్టార్ రివ్యూ..!
రణ్వీర్ సింగ్ దురంధర్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. అత్యుత్తమ సాంకేతిక విలువలు, అద్భుతమైన సౌండ్ ట్రాక్‌తో నిర్మించారని బన్నీ కొనియాడారు. మై బ్రదర్ రణ్వీర్ సింగ్ తన టాలెంట్‌తో మరోసారి అభిమానులను ఊపేశారని అన్నారు. దురంధర్ మూవీని ఇప్పుడే చూశానని.. ఎక్స్ట్రార్డినరీగా అనిపించిందని బన్నీ ట్వీట్ చేశారు.బన్నీ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. 'దురంధర్ మూవీ ఇప్పుడే చూశా. అద్భుతమైన ప్రదర్శనలు, అత్యుత్తమ సాంకేతిక అంశాలు, సౌండ్‌ట్రాక్‌లతో నిర్మించిన చిత్రమిది. మై బ్రదర్ రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడు. అలాగే అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ తమ పాత్రల్లో మెప్పించారు. మొత్తంగా దురంధర్ టెక్నికల్ టీమ్, చిత్రబృందానికి నా ప్రత్యేక అభినందనలు. ఈ మూవీ కెప్టెన్ ఆదిత్య ధార్ అద్భుతంగా తీర్చిద్దారు. నాకు ఇది చాలా నచ్చింది. దీన్ని కూడా చూసి దురంధర్‌ను ఆస్వాదించండి గాయ్స్' అంటూ పోస్ట్ చేశారు.రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీని పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇందులో రణ్వీర్ సింగ్ యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా రూ.200 కోట్ల దిశగా ముందుకెళ్తోంది. Just watched #Dhurandhar. A brilliantly made film filled with fine performances, the finest technical aspects, and amazing soundtracks.Magnetic presence by my brother @RanveerOfficial, he rocked the show with his versatility.Charismatic aura by #AkshayeKhanna ji, and the…— Allu Arjun (@alluarjun) December 12, 2025 -
రణ్వీర్ సింగ్ దురంధర్.. ఆ దేశాల్లో బ్యాన్..!
రెండేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మూడు రోజుల్లోనే వందకోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పాకిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కించిన మూవీ కావడంతో ఒక్కసారిగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా ఈ చిత్రానికి అంతర్జాతీయంగా చిక్కులు ఎదురవుతున్నాయి. ఇందులో పాకిస్తాన్‌ను నెగెటివ్‌గా చూపించారంటూ అరబ్ దేశాలు దురంధర్‌పై నిషేధం విధించాయి. ఈ మూవీని బహ్రెయిన్, కువైట్, ఓమన్, ఖతార్, సౌదీ, యూఏఈ బ్యాన్ చేశాయి. దీంతో ఆయా దేశాల్లో దురంధర్ చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ చిత్రంలో పాక్‌కు వ్యతిరేకంగా ప్రస్తావనలు ఉన్నాయనే అరబ్ దేశాలు ఈ చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు కీలక మార్కెట్ అయిన గల్ఫ్ దేశాల్లోని థియేటర్లలో దురంధర్ విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నించారు. కానీ కొన్నిచోట్ల అసలు అనుమతులు కూడా రాలేదు. దీంతో చివరికీ కొన్ని థియేటర్స్‌కు మాత్రమే పరిమితం చేశారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తెరకెక్కించడం వల్లే ఆయా దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. రూ.200 కోట్ల దిశగా దురంధర్ దూసుకెళ్తోంది. -
పాకిస్తాన్లో అలాంటివేవి లేవు.. ‘దురంధర్’పై హిలేరియస్ రివ్యూ
రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ నిర్మించిన సినిమా ‘దురంధర్’ విడుదలై రోజులు గడుస్తోంది. పాకిస్థాన్‌లో ఉగ్రమూకలను తుదముట్టించేందుకు ఓ భారతీయ ఐబీ అధికారి చేసిన ప్రయత్నమే ఈ దురంధర్(Dhurandhar Movie) కథ. సినిమాపై పబ్లిక్ టాక్ భిన్నంగా ఉన్నప్పటికీ అదేదో బలూచిస్తాన్ పాటకు అక్షయ్ ఖన్నా చేసిన డ్యాన్స్‌పై మాత్రం ఇంటర్నెట్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌పై రకరకాల రీళ్లూ ప్రత్యక్షమవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ రివ్యూ చేశాడు. దురంధర్ సినిమా చూసిన పాకిస్థాన్ ఎలా రియాక్ట్ అవుతాడన్నది ఈ రివ్యూ సారాంశం... ఇంతకీ అతగాడు ఏమంటాడంటే...‘‘అయ్యా... దురంధర్ సినిమా ఇప్పుడే చూశా. బాబులూ ఒక్క విషయం చెప్పదలుచుకున్నా.. సినిమాలో మీరు చూపించినవి ఏవీ పాకిస్థాన్‌లో లేవు. ఒకొక్కటి.. ప్రతి ఒక్కటీ అబద్ధం. అందులో రణ్వీర్ సింగ్ ఓ మోటర్ సైకిల్ నడుపుతూంటాడు. అలాంటిది పాకిస్థాన్ మొత్తమ్మీద లేదంటే నమ్మండి. నాయనలారా! ఇంత అత్యాచారాలకు పాల్పడకండి సారూ. స్పె్లండర్ బైక్‌నే సూపర్ బైక్ అనుకునే రకాలం మేము. అట్లాంటిది.. మీరు ఆ సినిమాలో ఏమేమో చూపించేశారు. కరాచీలో అండర్‌పాస్ ఉన్నట్లు చూపారు. ఊహూ... ఎక్కడా అలాంటిది లేదయ్యా.. మాకున్న అండర్‌పాస్‌లు అన్నీ భారత్ సరిహద్దుల్లోనే.. అది కూడా ఉగ్రవాదులను ఇటు నుంచి అటుకు పంపేందుకు మాత్రమే. అయ్యో... స్క్రిప్ట్‌లో లేని విషయమూ చెప్పేశానే. కొంచెం మరచిపోండేం! మిగిలిన విషయాలంటారా?... మేజర్ ఇక్బాల్, రెహ్మాన్ డెకాయిట్, 26/11... వంటివేవీ మేము చేయలేదు. ఒట్టు. ఏంటి అవన్నీ నిజమే అంటావా? లేదు సారు.. అవన్నీ పచ్చి అబద్ధాలు.’’కోనసీమ వెటకారానికి మించిన హిలేరియస్ రివ్యూ ఇది. మీరూ ఒకసారి చూసేయండి మరి. View this post on Instagram A post shared by Sanchit Pulani (@sanchitpulani) -
బాక్సాఫీస్ వద్ద దురంధర్ దూకుడు.. మూడు రోజుల్లోనే సెంచరీ!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ మూవీకి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే దాదాపు రూ.30 కోట్లకు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లోనే సెంచరీ దాటేసింది. ఈ సినిమా ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా రూ. 103 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ఒక్క రోజే ఏకంగా రూ.43 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ.123.5 కోట్లు వసూలు చేసింది.ఇక ప్రపంచవ్యాప్తంగా దురంధర్ హవా కొనసాగుతోంది. మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.152 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే టైగర్ ష్రాఫ్ బాఘి 3 (రూ.137 కోట్లు), హృతిక్ రోషన్ విక్రమ్ వేద (రూ.135 కోట్లు), సన్నీ డియోల్ జాట్ (రూ.110 కోట్లు) చిత్రాలను అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే తొలి వారంలోనే ధురంధర్ రూ.250 కోట్ దాటేలా కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. దాదాపు రూ.140 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ నటించారు. ఈ చిత్రం పార్ట్-2 మార్చి 19, 2026న విడుదల కానుంది. -
దురంధర్ బాక్సాఫీస్.. అంచనాలను మించిపోయిన వసూళ్లు..!
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్. ఈ చిత్రం ఇటీవల డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ శుక్రవారం రిలీజైన దురంధర్ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది.ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలైన రెండు రోజుల్లో రూ.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు రూ.27 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు వీకెండ్ కలిసి రావడంతో రూ.33 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా రూ.72 కోట్ల గ్రాస్ రాగా.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. శనివారం రాత్రి షోల్లో 63 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఆదివారం రోజు వరల్డ్ వైడ్ వందకోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్ ఉహించినా దానికంటే అధిక కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రణవీర్ సింగ్ సరసన సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. పాకిస్తాన్ నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్ మూవీని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ గూఢచారి పాత్ర పోషించారు. -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘దురంధర్’.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
బాలీవుడ్లో ఈ వారం రిలీజ్ అయిన పెద్ద చిత్రం ‘దురంధర్’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆదిత్య ధర్ తెరకెక్కించారు. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య నిన్న (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. మూడున్నర గంటల నిడివితో వచ్చినప్పటికీ.. ఎంగేజ్ చేసేలా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముందు నుంచే భారీ అంచనాల ఉండడం.. రిలీజ్ తర్వాత హిట్ టాక్ రావడంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.తొలి రోజు ఈ చిత్రాని(Dhurandhar Box Office Collection)కి దాదాపు రూ. 27 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినిమాకు ఉన్న బజ్‌కి రూ. 15-18 కోట్ల వరకు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా..అంతకు మించి కలెక్షన్స్‌ని రాబట్టి.. హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత రణ్వీర్ సింగ్ ఖాతాలో హిట్ పడిందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. సినిమాకు వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. వీకెండ్‌లోగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్ థ్రిల్లర్. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్‌గా రణ్వీర్ సింగ్.. ఐబీ చీఫ్‌గా మాధవన్ నటించారు. విలన్‌గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు. -
రణవీర్ సింగ్ ‘దురంధర్’ మూవీ ట్విటర్ రివ్యూ
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దురంధర్’. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5)ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ డిసెంబర్ 4న తేది రాత్రే పడిపోయాయి. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. దురంధర్ ఎలా ఉంది? రణ్వీర్ ఖాతాలో హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి.ఎక్స్‌లో దురంధర్ చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బాగుందని, రణ్వీర్ వన్‌మ్యాన్ షో అంటూ అని పలువురు నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.Dhurandhar is a decent patriotic actiondrama with solid thrills. Ranveer Singh impresses as Major Mohit, and the action + BGM work well. Story familiar hai, par presentation engaging banati hai.⭐️⭐️⭐️/5 — Massy,emotional & good one-time watch.#Dhurandhar #DhurandharReview pic.twitter.com/RkGCCeOIur— Critixpro (@CritixPro999) December 5, 2025‘దురంధర్’ దేశభక్తిని రేకెత్తించే డీసెండ్ యాక్షన్ డ్రామా. అద్భుతమైన థ్రిల్లింగ్స్ అంశాలు ఉన్నాయి. మేజర్ మోహిత్ పాత్రలో రణవీర్ సింగ్ ఆకట్టుకున్నాడు. పోరాట ఘట్టాలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తెలిసిన కథే అయినా కథనం ఎంగేజింగ్‌గా ఉంటుందంటూ ఓ నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు. What a magnificent first half!🔥 Aditya Dhar has cooked with the intense scenes,Akshay Khanna is out of the box,R Madhavan delivers his best,trust me there are hardly action sequences in first half,still Dhar has managed to keep gripping screenplay just with convos #Dhurandhar https://t.co/6rfOSlsX7p pic.twitter.com/s0REydeUQp— Shahid (@CinephileScribe) December 5, 2025 ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. ఆదిత్య ధార్ కొన్నీ సీన్లను అద్భుతంగా తీర్చిదిద్దాడు. అక్షయ్ ఖన్నా, మాధవన్ కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చారు. ఫస్టాఫ్‌లో యాక్షన్ సన్నివేశాలు తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ ఆదిత్య ధార్ కేవలం డైలాగ్స్‌తోనే స్క్రీన్ ప్లేను అసక్తికరంగా మార్చాడు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.#Dhurandhar Interval: It was good, not Great, but theek hai 1st half Takes time to buildup & film lengthy feel hoti hai Bcoz of The film has been presented till now but let's see hoping for the better 2nd half 🫡I have fate in Aditya Dhar Hoping for the Best!🫡 pic.twitter.com/UmbzoQ7u5B— DEV KA REVIEW (@DEVKAREVIEW3180) December 5, 2025#Dhurandhar It’s INTERVAL🔥Mass Cinema + Solid Content = Mr.DHARPure Cinema Peaks Here @AdityaDharFilms Stay Away From Social Media Freaks, Book Seats & Enjoy Gripping Spy Thriller🇮🇳Stay Tuned For Full Review….#RanveerSingh @yamigautam #Madhvan— Bollywood Legacy Channel (@LegacyChannel_) December 5, 2025 -
రంగురంగుల సీతాకోకచిలుకలా సారా అర్జున్ (ఫొటోలు)
-
ఒళ్లు జలదరించేలా 'ధురంధర్' ట్రైలర్
గత కొన్నాళ్లుగా సినిమాలతై చేస్తున్నాడు గానీ బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్‌కి సరైన హిట్ పడట్లేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్సయినట్లు ఉన్నాడు. ఈ క్రమంలోనే 'ఉరి' మూవీ తీసిన ఆదిత్య ధర్‌తో కలిసి ఓ మూవీ చేశాడు. అదే 'ధురంధర్'. భారత్ vs పాక్ ఉగ్రవాదం అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రాన్ని డిసెంబరు 5న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ లాంచ్ చేశారు.(ఇదీ చదవండి: దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు)4 నిమిషాలకు పైగానే ఉన్న ట్రైలర్ చూడటానికి బాగుంది. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలు, ఒళ్లు జలదరించే కొన్ని సీన్స్‌తో నింపేశారు. రణ్వీర్ సింగ్ హీరో కాగా ఇతడికి జోడీగా సారా అర్జున్ నటించింది. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మరి ఈసారైనా రణ్వీర్ హిట్ కొడతాడేమో చూడాలి?(ఇదీ చదవండి: రజనీ, చిరంజీవి యాక్టింగ్ గురువు కన్నుమూత)


