బాలీవుడ్ స్టార్‌హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ మూవీ దురంధర్ (Dhurandhar ) బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. అంతేకాదు గ్లోబల్‌గా కూడా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ మూవీలో పాటల క్లిప్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా 'షరారత్' (Shararat) పాటతో ఒక పెళ్లి వేడుకలో పాకిస్తాన్ అమ్మాయిలు స్టెప్పులు నెట్టింట సందడిగా మారాయి.
పాకిస్తానీ మహిళలు సినిమాలోని పాటకు డ్యాన్స్ చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలుస్తోంది. ఈ క్లిప్‌లో, ఇద్దరు మహిళలు పెళ్లి వేదిక లోపల 'షరారత్' పాటకు డ్యాన్స్ చేస్తుండగా, ఇతర అతిథులు వారిని చూస్తూ ప్రోత్సహిస్తున్నారు.ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు స్పందిస్తూ, నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమా ఇంతటి ఆదరణ పొందడంపై కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. “నిషేధం ఉన్నప్పటికీ ఈ సినిమాకు ఇంత క్రేజ్.. వావ్,” అని ఒకరు, “పాకిస్తానీలు దురంధర్‌ను విపరీతంగా ఇష్టపడు తున్నారు. బహుశా ఈ మూవీ దర్శకుడు ఆదిత్య ధార్‌కు నిషాన్-ఎ-పాకిస్తాన్ ఇస్తారేమో అని మరొకరు వ్యాఖ్యానించారు. భారత ఉపఖండంపై బాలీవుడ్ సాంస్కృతిక ముద్ర ఉందని మరకొరు కమెంట్ చేశారు.
Pakistani girls dancing to Shararat despite the ban on Dhurandhar. https://t.co/l89mWhDEdH
— Abhishek Dhiman (@Abhi_dhiman8090) January 5, 2026
కాగా దురంధర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే పాకిస్తాన్‌తో పాటు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలలో ఈ మూవీ విడుదల కాలేదు. అయినా కూడా 2025లో విదేశాలలో అత్యంత విజయ వంతమైన భారతీయ చిత్రంగా నిలిచింది.
మరోవైపు ఆయేషా ఖాన్,క్రిస్టల్ డిసౌజా నటించిన 'షరారత్' డ్యాన్స్ నంబర్ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌లో 100 మిలియన్ల వీక్షణలను దాటింది. ఈ పాటకు శశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించగా, మధుబంతి బాగ్చి , జాస్మిన్ సాండ్లాస్ పాడారు. విజయ్ గంగూలీ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. ఇదొక గూఢచారి థ్రిల్లర్ చిత్రం. ఈ మూవీలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ ,సంజయ్ దత్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 2025లో భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీని రెండవ భాగం మార్చి 2026లో విడుదల కానుందని భావిస్తున్నారు.


