గ్రూప్‌ దశలోనే ఆసీస్‌ ఔట్‌.. పాక్‌కు మంచి జరుగబోతుందా..? | T20 WC 20226: Australia bow out in group stage, Pakistan Fans dreaming for title | Sakshi
Sakshi News home page

T20 WC 2026: గ్రూప్‌ దశలోనే ఆసీస్‌ ఔట్‌.. పాక్‌కు మంచి జరుగబోతుందా..?

Feb 20 2026 6:32 PM | Updated on Feb 20 2026 6:47 PM

T20 WC 20226: Australia bow out in group stage, Pakistan Fans dreaming for title

టీ20 ప్రపంచకప్‌ 2026లో మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా గ్రూప్‌ స్టేజీలోనే నిష్క్రమించిన తర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానులు తెగ హడావుడి చేస్తున్నారు. సోషల్‌మీడియా వేదికగా ఓ రేంజ్‌లో బీరాలు పలుకుతున్నారు. ఆసీస్‌ వైదొలిగితే పాక్‌కు కలిగే లాభమేమిటి అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

పేరుకు జెంటిల్మెన్‌ క్రీడనే అయినా, క్రికెట్‌ లాంటి రియలిస్టిక్‌ గేమ్‌లోనూ సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత లభిస్తూ ఉంటుంది. తాజాగా పాక్‌ అభిమానులు హడావుడి చేయడానికి ఈ సెంటిమెంటే కారణం. ఏంటా సెంటిమెంట్‌ అంటే..?

ఐసీసీ మెగా టోర్నీల్లో, మరి ముఖ్యంగా ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆసీస్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన సందర్భాల్లో పాకిస్తాన్‌ విజేతగా నిలిచింది. 1992 వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించగా.. ఆ టోర్నీలో పాక్‌ విజేతగా నిలిచి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది.  

2009 టీ20 ప్రపంచకప్‌లోనూ ఆసీస్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించగా.. ఆ టోర్నీలోనూ పాకే విజేతగా నిలిచి, తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది.

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలోనూ ఆసీస్‌ గ్రూప్‌ దశలోనే వైదొలగగా.. ఆ టోర్నీలోనూ పాక్‌ ఛాంపియన్‌గా నిలిచింది.

తాజాగా ఆసీస్‌ టీ20 ప్రపంచకప్‌ 2026లోనూ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడంతో పాక్‌ అభిమానులు సెంటిమెంట్‌ రిపీట్‌ అవుతుందని తెగ సంబరపడిపోతున్నారు. ఈ సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకొని సంకలు గుద్దుకుంటున్నారు. 

వాస్తవానికి పాక్‌ సూపర్‌-8కు చేరడమే అతికష్టం మీద జరిగింది. ఇలాంటి దుర్బర పరిస్థితుల్లోనూ పాక్‌ అభిమానులు తాము ప్రపంచకప్‌ గెలుస్తామని బీరాలు పలకడం హాస్యాస్పదంగా ఉంది. ఏ జట్టైనా ఛాంపియన్‌గా నిలవాలంటే కనీస అర్హతలు ఉండాలి.

ప్రస్తుత పాక్‌ జట్టుకు ఆ అర్హతలు లేవనే విషయం అందరికీ తెలుసు. గ్రూప్‌ దశలో నెదర్లాండ్స్‌, యూఎస్‌ఏ లాంటి చిన్న జట్లపై అతికష్టం మీద గెలిచిన పాక్‌.. సూపర్‌-8లో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక లాంటి హేమాహేమీ జట్లను దాటుకొని ముందుకెళ్లాలి. 

వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే ఇది ముమ్మాటికి అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే పాక్‌ జట్టు ప్రపంచకప్‌ గెలిచేంత గొప్పగా ఏమీ లేదు. ఆ జట్టులో మ్యాచ్‌ విన్నర్‌ వెతికితే కూడా కనపడడు. పైగా ఆ జట్టు స్టార్లుగా చెప్పుకేనే వారంతా ఫామ్‌లో లేక మడతమంచం ఎక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ ప్రపంచకప్‌ గెలవడం​ జరిగే పని కాదు. పాక్‌ అభిమానులు సెంటిమెంట్లను నమ్ముకొని గాల్లో మేడలు కడుతుంటే, జింబాబ్వే లాంటి చిన్న జట్టు టాలెంట్‌ను నమ్ముకొని ముందుకు సాగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement