పాక్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌.. ఫైనల్లో భారత్‌తో అమీతుమీ | ACC Women's Asia Cup Rising Stars 2026: Bangladesh A beat Pakistan A by 54 Runs | Sakshi
Sakshi News home page

పాక్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌.. ఫైనల్లో భారత్‌తో అమీతుమీ

Feb 20 2026 3:55 PM | Updated on Feb 20 2026 4:01 PM

ACC Women's Asia Cup Rising Stars 2026: Bangladesh A beat Pakistan A by 54 Runs

బ్యాంకాక్‌ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీలో బంగ్లాదేశ్‌-ఏ జట్టు ఫైనల్‌కు చేరింది. పాకిస్తాన్‌-ఏతో ఇవాళ (ఫిబ్రవరి 20) జరిగిన రెండో సెమీఫైనల్లో 54 పరుగుల తేడాతో గెలుపొంది, తుది పోరుకు అర్హత సాధించింది. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో భారత-ఏ జట్టు శ్రీలంక-ఏపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. భారత్‌-ఏ, బంగ్లాదేశ్‌-ఏ జట్లు ఫిబ్రవరి 22న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఫహీమా ఖాతూన్‌ 40 పరుగులతో రాణించి, బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఫహీమాతో పాటు ఇష్మా తంజిమ్‌ (12), షమీమా సుల్తానా (13), సర్మిన్‌ సుల్తానా (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ హఫ్సా ఖలీద్‌ 2, వహీదా అక్తర్‌, మొమినా రియాసత్‌, అనోషా నాసిర్‌, ఒమైమా సొహైల్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం 111 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌.. బంగ్లా బౌలర్ల ధాటికి ఘోరంగా పతనమైంది. 16.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. సంజిద (3.4-0-6-3), ఫహీమా (3-0-6-2), ఫాతిమా (4-0-11-1), ఫరీహా (3-0-14-1), ఫర్జానా (1-0-6-1) పాక్‌ పతనాన్ని శాశించారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో షావాల్‌ జుల్ఫికర్‌ (14), యుస్రా ఆమిర్‌ (11), హఫ్సా ఖలీద్‌ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. 

కాగా, పురుషుల టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో బంగ్లా-పాక్‌ మధ్య చిగురించిన స్నేహం తర్వాత వచ్చిన ఫలితం కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement