breaking news
ACC Womens Asia Cup Rising Stars 2026
-
క్రికెట్లో సంచలనం.. 'టైమ్డ్ అవుట్'గా వెనుదిరిగిన స్టార్ ప్లేయర్
భూటాన్ స్టార్ బ్యాటర్ రిత్షి చోడెన్ మహిళల క్రికెట్లో ‘టైమ్డ్ అవుట్’ అయిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఏసీసీ ఉమెన్స్ ప్రీమియర్ కప్‌లో భాగంగా గురువారం నేపాల్‌తో జరిగిన టి20 మ్యాచ్ సందర్భంగా ఇది చోటు చేసుకుంది. క్రీజ్‌లోకి రావడానికి రిత్షి 90 సెకన్లకంటే ఎక్కువ సమయం తీసుకుంది. దాంతో నేపాల్ ఫీల్డర్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్లు సున్ మెంగ్, అంకిత గుహ ఆమెను అవుట్‌గా ప్రకటించారు. భూటాన్ ఇన్నింగ్స్ తొలి నిమిషంలోనే ఈ ఘటన జరిగింది. ఓపెనర్ ఎన్గవాంగ్ తొలి బంతికే బౌల్డ్ కాగా... ఆ సమయానికి సిద్ధంగా లేని రిత్షి మెల్లగా తన హెల్మెట్, గ్లవ్స్ చేతిలో పట్టుకొని మైదానంలోకి వచ్చింది అంపైర్ నిర్ణయం తర్వాత రిత్షి ఎలాంటి నిరసన తెలపకుండా మౌనంగా నిష్క్రమించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (సీఏఎన్) తమ జట్టు తరఫున భూటాన్ క్రికెట్‌కు క్షమాపణ చెప్పింది. నేపాల్ టీమ్ క్రీడా స్ఫూర్తిగా వ్యవహరించలేదని, నిబంధనల ప్రకారం ‘టైమ్డ్ అవుట్’ సరైందే అయినా... నేపాల్ టీమ్ క్రీడా స్ఫూర్తితో వ్యవహరించలేదంటూ తమ అసంతృప్తిని వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా నేపాల్ 20 ఓవర్లలో 113 పరుగులు చేయగా, ఆ తర్వాత 20 ఓవర్లలో 8 వికెట్లకు 62 పరుగులే చేసిన భూటాన్ 51 పరుగులతో ఓడింది. -
ఆసియా కప్ 2026 విజేతగా భారత్
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్‌ను భారత్ వరుసగా రెండో ఎడిషన్‌లోనూ కైవసం చేసుకుంది. బ్యాంకాక్ వేదికగా జరిగిన 2026 ఎడిషన్‌లో భారత-ఏ జట్టు విజేతగా అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 22) జరిగిన ఫైనల్లో టీమిండియా 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్-ఏపై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి ఎడిషన్ (2023) ఫైనల్లోనూ భారత-ఏ జట్టు బంగ్లాదేశ్-ఏపైనే విజయం సాధించే టైటిల్‌ను చేజిక్కించుకుంది.నేటి ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. తేజల్ హసబ్నిస్ (51 నాటౌట్), కెప్టెన్ రాధా యాదవ్ (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల చేసింది. వీరిద్దరు కాకుండా భారత ఇన్నింగ్స్‌లో వ్రింద దినేశ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేసింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్ 1, ప్రేమా రావత్ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.బంగ్లా బౌలర్ ఫాహిమ ఖాతూన్ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌ను కట్టడి చేసింది. మరో బౌలర్ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేసింది. ఫర్జానా ఎస్మిన్ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు.. లతా మొండల్, సదియా అక్తర్ తలో ఓవర్ వేసి 14, 9 పరుగులిచ్చారు.అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్-ఏ జట్టు తడబడింది. భారత బౌలర్లు ప్రేమా రావత్ (4-0-12-3), తనూజా కన్వర్ (3.1-0-11-2), సోనియా మెంధియా (4-0-21-2), కెప్టెన్ రాధా యాదవ్ (4-0-16-1), సైమా ఠాకోర్ (2-0-11-1), మిన్నూ మణి (2-0-17-1) ధాటికి 19.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన షమీమా సుల్తానా టాప్ స్కోరర్‌గా నిలిచింది. సర్మిన్ సుల్తానా (18), కెప్టెన్ ఫాతిమా ఖాతూన్ (14), సదియా అక్తర్ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. ప్రేమా రావత్ 3 వికెట్లు తీయడంతో పాటు 3 క్యాచ్‌లు కూడా పట్టి భారత గెలుపులో కీలకపాత్ర పోషించింది. -
ఆసియా కప్ ఫైనల్.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీ ఫైనల్లో భారత-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్లు తలపడుతున్నాయి. బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల స్కోర్‌కు మాత్రమే పరిమితమైంది. బంగ్లా బౌలర్ ఫాహిమ ఖాతూన్ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్‌ను కట్టడి చేసింది. మరో బౌలర్ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్ చేసింది. ఫర్జానా ఎస్మిన్ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు.. లతా మొండల్, సదియా అక్తర్ తలో ఓవర్ వేసి 14, 9 పరుగులిచ్చారు.భారత్ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది తేజల్ హసబ్నిస్ (51 నాటౌట్), కెప్టెన్ రాధా యాదవ్ (36) చలవ వల్లే. వీరిద్దరు కాకుండా వ్రింద దినేశ్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్ 1, ప్రేమా రావత్ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ మాత్రమే కోల్పోయి 26 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 90 బంతుల్లో మరో 109 పరుగులు చేయాలి. కాగా, సెమీఫైనల్స్‌లో భారత్ శ్రీలంకపై, బంగ్లాదేవ్ పాకిస్తాన్‌పై విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించాయి. -
పాక్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఫైనల్లో భారత్‌తో అమీతుమీ
బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్-ఏ జట్టు ఫైనల్‌కు చేరింది. పాకిస్తాన్-ఏతో ఇవాళ (ఫిబ్రవరి 20) జరిగిన రెండో సెమీఫైనల్లో 54 పరుగుల తేడాతో గెలుపొంది, తుది పోరుకు అర్హత సాధించింది. ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో భారత-ఏ జట్టు శ్రీలంక-ఏపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, తొలి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారత్-ఏ, బంగ్లాదేశ్-ఏ జట్లు ఫిబ్రవరి 22న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కెప్టెన్ ఫహీమా ఖాతూన్ 40 పరుగులతో రాణించి, బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఫహీమాతో పాటు ఇష్మా తంజిమ్ (12), షమీమా సుల్తానా (13), సర్మిన్ సుల్తానా (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ హఫ్సా ఖలీద్ 2, వహీదా అక్తర్, మొమినా రియాసత్, అనోషా నాసిర్, ఒమైమా సొహైల్ తలో వికెట్ తీశారు.అనంతరం 111 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్.. బంగ్లా బౌలర్ల ధాటికి ఘోరంగా పతనమైంది. 16.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. సంజిద (3.4-0-6-3), ఫహీమా (3-0-6-2), ఫాతిమా (4-0-11-1), ఫరీహా (3-0-14-1), ఫర్జానా (1-0-6-1) పాక్ పతనాన్ని శాశించారు. పాక్ ఇన్నింగ్స్‌లో షావాల్ జుల్ఫికర్ (14), యుస్రా ఆమిర్ (11), హఫ్సా ఖలీద్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కాగా, పురుషుల టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బంగ్లా-పాక్ మధ్య చిగురించిన స్నేహం తర్వాత వచ్చిన ఫలితం కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. -
Asia Cup 2026: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్- 2026 టోర్నీలో భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. తొలి సెమీస్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా ఈ టీ20 టోర్నీ ఫిబ్రవరి 13న మొదలైంది.ఎనిమిది జట్లుగ్రూప్-ఎ నుంచి భారత్-ఎ, పాకిస్తాన్-ఎ.. యూఏఈ, నేపాల్ మహిళా జట్లు పాల్గొనగా.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ-ఎ, శ్రీలంక-ఎ, థాయ్‌లాండ్, మలేషియా మహిళా జట్లు బరిలో నిలిచాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-ఎ టాపర్లు భారత్, పాక్.. గ్రూప్-బి టాపర్లు బంగ్లాదేశ్, శ్రీలంక సెమీ ఫైనల్ చేరాయి.118 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు శుక్రవారం తలపడ్డాయి. టెర్థాయ్ స్టేడియంలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల ధాటికి తాళలేక 19.4 ఓవర్లలో కేవలం 118 పరుగులే చేసి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.రాధా యాదవ్‌కు నాలుగుఓపెనర్లు సంజనా కావింది (31), హన్సిమ కరుణరత్నె (14)లతో పాటు సత్య సందీపణి (15), షాశిని గిమ్హాని (22) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కెప్టెన్ రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. తనుజా కణ్వార్, ప్రేమా రావత్ చెరో రెండు వికెట్లు కూల్చారు. సైమా ఠాకూర్, మిన్ను మణి తలా ఒక వికెట్ పడగొట్టారు.బ్యాటింగ్‌లోనూ ఇరగదీసిన కెప్టెన్ ఇక లక్ష్య ఛేదనలోనూ భారత మహిళా జట్టు అదరగొట్టింది. ఓపెనర్లలో నందిని కశ్యప్ (13) నిరాశపరిచినా.. వ్రిందా దినేశ్ మెరుపు ఇన్నింగ్స్ (20 బంతుల్లో 42)తో ఆకట్టుకుంది. వన్‌డౌన్ బ్యాటర్ల అనుష్క శర్మ (18 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. రాధా యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (18 బంతుల్లో 31 నాటౌట్)తో మెరిసింది.𝐅𝐢𝐧𝐚𝐥𝐬, 𝐡𝐞𝐫𝐞 𝐰𝐞 𝐜𝐨𝐦𝐞 🇮🇳Radha Yadav seals it with a boundary as India book their place in the final 😍#SonySportsNetwork #GirlsRising | DP World Women’s Asia Cup Rising Stars 2026 pic.twitter.com/vuMvuCPhUH— Sony Sports Network (@SonySportsNetwk) February 20, 2026ఫైనల్లో భారత్మిగిలిన వాళ్లలో తేజల్ హసాబ్నిస్ (3), మిన్ను మణి (2) విఫలమయ్యారు. అయితే, వ్రిందా వేసిన పునాదిపై అనుష్క, రాధా ఇన్నింగ్స్ నిర్మించడంతో 13.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 119 పరుగుల టార్గెట్‌ను భారత్ పూర్తి చేసింది. తద్వారా శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.లంక బౌలర్లలో షాశిని రెండు వికెట్లు తీయగా.. యసాంతి నిమంతికకు ఒక వికెట్ దక్కింది. ఇక ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపిన రాధా యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్ ఆదివారం నాటి టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకుంటుంది. చదవండి: పాకిస్తాన్ క్రికెటర్లకు భారీ షాక్! -
సెమీస్‌లో భారత్, పాక్
బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరాయి. ఇవాళ (ఫిబ్రవరి 17) జరిగిన మ్యాచ్‌ల్లో భారత-ఏ జట్టు నేపాల్‌పై.. పాకిస్తాన్-ఏ జట్టు యూఏఈపై ఘన విజయాలు సాధించి, ఫైనల్ ఫోర్‌లోకి ప్రవేశించాయి. సెమీస్‌లో భారత్, పాక్ ఎదుర్కోబోయే ప్రత్యర్ధులు ఎవరో రేపు జరుగబోయే బంగ్లాదేశ్-ఏ, మలేషియా.. శ్రీలంక-ఏ, థాయ్‌లాండ్ మ్యాచ్‌లతో తెలుస్తుంది.ఈ టోర్నీలో భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో (ఏ) ఉన్నాయి. ఈ గ్రూప్ నుంచి భారత్, పాక్ మొదటి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఈ గ్రూప్‌లో యూఏఈ.. భారత్, పాక్‌కు గట్టి పోటీనిచ్చింది. ఆ జట్టు కూడా భారత్, పాక్‌తో సమానంగా మూడింట రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఇవాల్టి మ్యాచ్‌లో పాక్ చేతిలో ఓటమితో యూఏఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏలో మరో జట్టు నేపాల్, ఆడిన 3 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. గ్రూప్-బిలో బంగ్లాదేశ్-ఏ సెమీస్ బెర్త్ ఇదివరకే ఖరారైనప్పటికీ.. సెమీస్‌లో వారు ఎదుర్కోబోయే ప్రత్యర్ది ఎవరో మలేషియా మ్యాచ్ ఫలితంతో తెలుస్తుంది. ఎందుకంటే గ్రూప్-బిలో ఆ జట్టు స్థానాన్ని (1,2) మలేషియా మ్యాచ్ ఫలితం డిసైడ్ చేస్తుంది. గ్రూప్-బిలో మరో సెమీస్ బెర్త్ కోసం శ్రీలంక-ఏ, థాయ్‌లాండ్ పోటీపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య రేపటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే, ఆ జట్టుకే సెమీస్ బెర్త్ దక్కుతుంది. ప్రస్తుతం శ్రీలంక-ఏ, థాయ్‌లాండ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో మ్యాచ్ గెలిచి బంగ్లాదేశ్-ఏ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో మలేషియా ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడి నాలుగో స్థానంలో ఉంది.ఫిబ్రవరి 20న జరిగే వేర్వేరు సెమీఫైనల్స్‌లో భారత్, పాక్ పోటీపడతాయి. సెమీస్‌లో ఈ రెండు జట్లు గెలిస్తే.. ఫైనల్లో ఎదురెదురుపడతాయి. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 22న జరుగనుంది.నేపాల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. తనూజా కన్వర్ 4, మిన్నూ మణి 3, కెప్టెన్ రాధా యాదవ్ 2 వికెట్లతో సత్తా చాటడంతో నేపాల్ 18 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ ఇన్నింగ్స్‌లో సమ్జానా ఖడ్కా (22) టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ 7.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వ్రిందా దినేశ్ 39 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చింది.మరో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈని పాక్ 17.2 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని పాక్ 11 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. -
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టీ20 టోర్నీలో భారత్ పాక్‌పై ఘన విజయం సాధించింది. బ్యాంకాక్ వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 15) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను భారత బౌలర్లు 93 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూల్చారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా (10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి) ఛేదించారు. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో రెండో స్థానానికి చేరింది. దీనికి ముందు మ్యాచ్‌లో భారత అమ్మాయిలకు యూఏఈ చేతిలో ఊహించని పరాభవం ఎదురైంది.తాజా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. సైమా ఠాకోర్ (4-0-14-2), కెప్టెన్ రాధా యాదవ్ (3-0-11-2), ప్రేమా రావత్ (3-0-16-2), జింటిమణి కలిట (3-0-18-1), మిన్నూ మణి (2.5-0-10-1), తనూజా కన్వర్ (3-0-19-0) పాక్ ప్లేయర్ల భరతం పట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో షావల్ జుల్ఫికర్ (23), గుల్ రుఖ్ (21), అనోశా నాసిర్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ తొలి బంతికే వికెట్ (హుమైరా ఖాజీ డకౌట్) కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ వ్రింద దినేశ్ (55) అజేయ అర్ద సెంచరీతో సత్తా చాటి భారత్‌ను విజయతీరాలకు చేరింది. వ్రిందకు అనుష్క శర్మ (24), తేజల్ హసబ్నిస్ (12 నాటౌట్) సహకరించారు. పాక్ బౌలర్లలో వహీదా అక్తర్, మొమినా రియాసత్‌కు తలో వికెట్ దక్కింది. భారత్ గ్రూప్ దశలో తమ తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 17న జరుగనుంది. ఈ టోర్నీలో భారత్, పాక్, యూఏఈ, నేపాల్ గ్రూప్-ఏలో ఉండగా.. థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా గ్రూప్-బిలో ఉన్నాయి. -
IND vs PAK: పాకిస్తాన్ 93 పరుగులకే ఆలౌట్
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. దాయాదిని 93 పరుగులకే ఆలౌట్ చేశారు. ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్-2026 టోర్నమెంట్లో ఆదివారం నాటి మ్యాచ్‌లో భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లు తలపడుతున్నాయి.తొలుత బ్యాటింగ్బ్యాంకాక్లోని టెర్థాయ్ క్రికెట్ మైదానంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆది నుంచే భారత బౌలర్లు పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. చుక్కలు చూపించిన భారత బౌలర్లుఓపెనర్లలో యుస్రా ఆమిర్ (1)ను సైమా ఠాకూర్ అవుట్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఒమైమా సొహైల్ (1)ను జింతిమణి కలిత, కెప్టెన్ హఫ్సా ఖలీద్ (1)ను ఐమా, హురైనా సజ్జద్ (2)ను కెప్టెన్ రాధా యాదవ్ పెవిలియన్‌కు పంపించారు.Captain Radha Yadav steps up and shows the way! 💙 Watch the Girls in Blue in action vs Pakistan A, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #GirlsRising | DP World Women’s Asia Cup Rising Stars 2026 pic.twitter.com/kjeq0xl5i8— Sony Sports Network (@SonySportsNetwk) February 15, 2026ఎమాన్ నాజర్ (4)ను అనుష్క శర్మ రనౌట్ చేయగా.. వహీదా అక్తర్ (7)ను ప్రేమా రావత్, మొమినా రియాసత్ (4)ను మిన్ను మణి సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేశారు. ఇలాంటి తరుణంలో ఓపెనర్ షవాల్ జుల్ఫికర్ (23)తో పాటు గల్ రుఖ్ (21) పోరాడే ప్రయత్నం చేయగా.. షవాల్కు రాధా యాదవ్, గుల్కు ప్రేమా రావత్ చెక్ పెట్టారు.𝐓𝐡𝐫𝐨𝐰 𝐢𝐭 𝐥𝐢𝐤𝐞 𝐀𝐧𝐮𝐬𝐡𝐤𝐚 🎯🔥A direct-hit special sends Eman Naseer back to the pavilion in style 💙Watch the Girls in Blue in action vs Pakistan A, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #GirlsRising | DP World Women’s… pic.twitter.com/XmUJMqOQIR— Sony Sports Network (@SonySportsNetwk) February 15, 2026 93 పరుగులకే ఆలౌట్ఫలితంగా 18.5 ఓవర్లలో కేవలం 93 పరుగులే చేసి పాక్-ఎ జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సైమా ఠాకూర్, రాధా యాదవ్, ప్రేమా రావత్ తలా రెండు వికెట్లు తీయగా.. జింతిమణి కలిత, మిన్ను మణి చెరో వికెట్ పడగొట్టారు.కాగా ఆసియా కప్ రైజింగ్ టీ20 టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్- పాక్‌లతో పాటు యూఏఈ, నేపాల్ తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించి పాక్ అగ్రస్థానానికి చేరగా.. యూఏఈ చేతిలో ఓడిన భారత్ మూడో స్థానంలో ఉంది. తాజా మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి గెలుపు బోణీ కొట్టాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. చదవండి: వైభవ్ సూర్యంశీ సంచలన నిర్ణయం! -
పాక్‌తో భారత్ మ్యాచ్.. మధ్యాహ్నమే!
క్రికెట్ ప్రపంచంలో దాయాదులు భారత్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉన్న ఆదరణ వేరు. ఏ స్థాయిలోనైనా చిరకాల ప్రత్యర్థుల పోరుకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి వీరాభిమానులకు ఆదివారం (ఫిబ్రవరి 15) పండుగే. వారి కోసం భారత్- పాక్ మ్యాచ్ డబుల్ ధమాకా ఎదురుచూస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోఓ వైపు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా టీమిండియా- పాకిస్తాన్ శ్రీలంక వేదికగా తలపడనున్న విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్- సల్మాన్ ఆఘా బృందంతో అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు మహిళల ‘ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (ACC Women's Asia Cup Rising Stars 2026)’ టోర్నీలో కూడా ఈ రెండు జట్ల మధ్య నేడు (ఆదివారం) పోరు జరగనుంది.మధ్యాహ్నం 12.30 గంటలకు ఆరంభంభారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు దాయాది మహిళా జట్ల మధ్య మ్యాచ్ మొదలు అవుతుంది. బ్యాంకాక్‌లోని టెర్థాయ్ క్రికెట్ మైదానం ఇందుకు వేదిక. కాగా మహిళ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్-ఎ, పాకిస్తాన్-ఎ జట్లతో పాటు యూఏఈ, నేపాల్ తలపడుతున్నాయి.అగ్రస్థానంలో పాక్ఇక గ్రూప్-బి నుంచి ఆతిథ్య థాయ్‌లాండ్, బంగ్లాదేశ్-ఎ, శ్రీలంక-ఎ, మలేషియా జట్లు పోటీలో ఉన్నాయి. గ్రూప్-లో తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ నేపాల్‌పై 30 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు.. భారత్-ఎ జట్టు మాత్రం అనూహ్య రీతిలో పసికూన యూఏఈ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.రాధ యాదవ్ కెప్టెన్సీలోఫలితంగా గ్రూప్-ఎలో ప్రస్తుతానికి పాక్, యూఏఈ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్, నేపాల్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కాగా భారత మహిళల సీనియర్ జట్టు సభ్యురాలైన రాధ యాదవ్ కెప్టెన్సీలో భారత్-ఎ జట్టు ఈ టీ20 టోర్నీ బరిలో దిగింది. మన మహిళల బృందంలో అనుష్క శర్మ, తేజల్ హసబ్నిస్, మిన్ను మణి, నందిని శర్మవంటి ఉమెన్ ప్రీమియర్ లీగ్ స్టార్లు కూడా ఉన్నారు.ఎక్కడ చూడాలంటే?ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్- పాక్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానుండగా.. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో దాయాదుల పోరును సోనీ స్పోర్ట్స్ టీవీ నెట్వర్క్, సోనీ లివ్ ఇండియాలో వీక్షించవచ్చు.UPDATES: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్T20 World Cup 2026: భారత్ ‘రుద్ర’ రూపంచదవండి: T20 WC 2026: పాక్‌తో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరిపై వేటు -
యూఏఈ చేతిలో చిత్తుగా ఓడిన భారత జట్టు
భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2026 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేచింది.బ్యాంకాక్ వేదికగా సాగుతున్న ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ వుమెన్-‘ఎ’ జట్టు నేపాల్ మహిళా జట్టుపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక రెండో మ్యాచ్‌లో భాగంగా భారత మహిళల-‘ఎ’ జట్టు యుఏఈతో తలపడింది. టెఱ్‌థాయ్ స్టేడియంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.రాణించిన అనుష్క శర్మ, తనూజఓపెనర్లు హమైరా ఖాజీ (3), వ్రిందా దినేశ్ (16)లతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్ (1) కూడా విఫలమైంది. కెప్టెన్ రాధా యాదవ్ (7), మిన్ను మణి (8), వికెట్ కీపర్ బ్యాటర్ మమత మడివాలా (1) చేతులెత్తేశారు.Calm Under Fire 😌 Anushka Sharma’s gritty 47 pushed India A to a competitive total 💥Watch our Girls in Blue take on the UAE in the DP World Women’s Asia Cup Rising Stars 2026, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #GirlsRising pic.twitter.com/r5I8fqLrJo— Sony Sports Network (@SonySportsNetwk) February 13, 2026ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ అనుష్క శర్మ (45 బంతుల్లో 47), స్పిన్నర్ తనూజ కణ్వార్ (25 బంతుల్లో 34) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. మిగిలిన వారిలో ప్రేమా రావత్ (4), సైమా ఠాకూర్ (3 నాటౌట్) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన భారత్ కేవలం 130 పరుగులే చేసింది.యూఏఈ బౌలర్లలో సమైరా ధర్నిధార్క మూడు, వైష్ణవి మహేశ్, కెప్టెన్ ఇషా ఓజా తలా రెండు వికెట్లు తీశారు. మిగిలిన వారిలో సురక్ష కొట్టె, అతిగె సిల్వా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యూఏఈ కేవలం 19.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది.ఇషా ఓజా అజేయ హాఫ్ సెంచరీఓపెనర్లలో కెప్టెన్ ఇషా ఓజా అజేయ అర్ధ శతకం (61 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 72)తో చెలరేగగా.. వికెట్ కీపర్ బ్యాటర్ తీర్థ సతీశ్ (10) నిరాశపరిచింది. వన్‌డౌన్ బ్యాటర్ సమైరా (34) ఇషాతో కలిసి రెండో వికెట్‌కి 71 పరుగులు జోడించారు. మిగిలిన వారిలో రినిత రజిత్ (6) విఫలం కాగా.. హీనా హోచాందిని ఒక ఫోర్ బాది అజేయంగా నిలిచింది.ఈ క్రమంలో 19.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన యూఏఈ 131 పరుగులు సాధించింది. తద్వారా భారత మహిళా జట్టును ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న యూఏఈ కెప్టెన్ ఇషా ఓజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా యూఏఈ జట్టులో అధిక శాతం మంది భారత సంతతి ప్లేయర్లే ఉండటం విశేషం. UAE won by 7 wickets. India A will look to bounce back in the next game!Scorecard ▶️ https://t.co/L2wkjCKSKq#WomensRisingStarsAsiaCup pic.twitter.com/lGYXSFIDDD— BCCI Women (@BCCIWomen) February 13, 2026చదవండి: T20 WC 2026: టోర్నీ నుంచి ఆ జట్టు కెప్టెన్ అవుట్


