ఆసియా కప్‌ ఫైనల్‌.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన టీమిండియా | ACC Women's Asia Cup Rising Stars 2026: Bangladesh bowlers restricted team india to 134 runs in final | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌ ఫైనల్‌.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన టీమిండియా

Feb 22 2026 3:03 PM | Updated on Feb 22 2026 3:10 PM

ACC Women's Asia Cup Rising Stars 2026: Bangladesh bowlers restricted team india to 134 runs in final

ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ 2026 టోర్నీ ఫైనల్లో భారత-ఏ, బంగ్లాదేశ్‌-ఏ జట్లు తలపడుతున్నాయి. బ్యాంకాక్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల స్కోర్‌కు మాత్రమే పరిమితమైంది. 

బంగ్లా బౌలర్‌ ఫాహిమ ఖాతూన్‌ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత్‌ను కట్టడి చేసింది. మరో బౌలర్‌ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్‌ చేసింది. ఫర్జానా ఎస్మిన్‌ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్‌ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు..  లతా మొండల్‌, సదియా అక్తర్‌ తలో ఓవర్‌ వేసి 14, 9 పరుగులిచ్చారు.

భారత్‌ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది తేజల్‌ హసబ్నిస్‌ (51 నాటౌట్‌), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (36) చలవ వల్లే. వీరిద్దరు కాకుండా వ్రింద దినేశ్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్‌ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్‌ 1, ప్రేమా రావత్‌ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.

అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్‌ మాత్రమే కోల్పోయి 26 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ గెలవాలంటే 90 బంతుల్లో మరో 109 పరుగులు చేయాలి. కాగా, సెమీఫైనల్స్‌లో భారత్‌ శ్రీలంకపై, బంగ్లాదేవ్‌ పాకిస్తాన్‌పై విజయాలు సాధించి తుది పోరు​కు అర్హత సాధించాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement