breaking news
India vs Bangladesh
-
T20 WC: భారత్‌ను తొలగిస్తారా?: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఓవరాక్షన్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హొసేన్‌పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు మద్దతు ఇవ్వాలనుకుంటే పర్లేదని.. కానీ అనవసరంగా భారత్‌ను ఇందులోకి లాగితే సహించేది లేదని సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఆతిథ్య దేశమైన భారత్‌లో తమకు భద్రత లేదని.. పాక్‌తో పాటు తమ మ్యాచ్‌లను కూడా శ్రీలంకలో నిర్వహించాలని బంగ్లాదేశ్ కోరింది. అయితే, బంగ్లా ఆరోపణల్లో నిజం లేదని తేల్చిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పునరాలోచన చేయాల్సిందిగా బంగ్లాకు అవకాశం ఇచ్చింది.బంగ్లా మొండివైఖరికి భారీ మూల్యంఅయినప్పటికీ బంగ్లాదేశ్ మొండి వైఖరి వీడకపోవడంతో బంగ్లాను టోర్నీ నుంచి తొలగించిన ఐసీసీ.. రాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను టోర్నీలో చేర్చింది. ఈ నేపథ్యంలో తాము బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ చేస్తామని పాక్ ప్రకటించింది.భారత్‌ను తొలగిస్తారా?ఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హొసేన్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ద్వంద్వ వైఖరి మీకు మాత్రమే సాధ్యమంటూ టీమిండియా అభిమానులు అతడిని తిట్టిపోస్తున్నారు. స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. "ఒకవేళ టోర్నమెంట్ ఆరంభానికి నెల రోజుల ముందు.. ఇండియా.. 'మా ప్రభుత్వం ఆ దేశంలో వరల్డ్‌కప్ ఆడేందుకు ఒప్పుకోలేదు’ అని చెబితే..ఇదే ఐసీసీ.. 'మీకు నిబంధనలు తెలుసు కదా! బ్యాడ్ లక్.. మిమ్మల్ని టోర్నీ నుంచి తొలగిస్తున్నాం’ అని చెప్పగలదా?.. అందరినీ సమానంగా చూడాలని మాత్రమే నేను చెబుతున్నా. బంగ్లాదేశ్, పాకిస్తాన్, టీమిండియా.. అన్నింటినీ ఒకే విధంగా చూడాలి.మా దగ్గర డబ్బు ఉందిఇప్పుడు టీమిండియా అభిమానులు వచ్చి.. 'మాపై పడి ఏడవండి. మా దగ్గర డబ్బు ఉంది’ అంటే మనమేమీ చేయలేము. అధికారం ఉన్నవాళ్లే బాధ్యతగానూ ఉండాలి’’ అని నాసిర్ హొసేన్ అన్నాడు. అతడి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.అపుడేమో గర్వంగా ఉందన్నావ్!"బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లపై మీకు సానుభూతి ఎందుకో మాకు బాగా తెలుసు. అయినా గతంలో జరిగిన విషయాలు మీకు గుర్తున్నాయా?.. 2003లో జింబాబ్వే జట్టును బాయ్‌కాట్ చేసింది ఇంగ్లండ్ కాదా? అప్పుడు తమరే కెప్టెన్‌గా ఉన్నారు కదా!ఆ సమయంలో.. ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఉన్నందుకు గర్వంగా ఉంది. జింబాబ్వేకు వెళ్లకపోవడమే మంచిది అని మీరు అనలేదా? 2009 టీ20వరల్డ్‌కప్ సమయంలో జింబాబ్వే ఆటగాళ్లకు వీసాలు నిరాకరించి... వారిని టోర్నీ నుంచి తప్పుకొనేలా చేసింది మీరు కాదా?మీరు చేస్తే ఒప్పు.. వేరే వాళ్లు చేస్తే తప్పా? ఇప్పుడు శుద్ధపూసలాగా క్రికెట్- రాజకీయం కలపవద్దు అని సూక్తులు వల్లిస్తున్నారు. మరి ఆరోజు ఏమైంది మీ పెద్ద మనసు. నాడు ఇంగ్లండ్ ఏం చేసిందంటేబంగ్లాదేశ్, పాకిస్తాన్ ఎలాంటి పనులు చేసినా మీకు నచ్చుతుందేమో! అందరూ మీలా ఉండరు’’ అని చురకలు అంటిస్తున్నారు. కాగా 2003లో జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే పాలనను నిరసిస్తూ హరారేలో ఆడాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ బహిష్కరించింది. రాజకీయ, భద్రతాపరమైన కారణాలు చూపుతూ ఇలా చేసింది.అందుకే నాసిర్ హొసేన్‌కు ఆ విషయాన్ని గుర్తుచేస్తూ అతడి ద్వంద్వ వైఖరిని నెటిజన్లు ఎండగడుతున్నారు. కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై హత్యాకాండ జరుగగా.. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్‌ను బీసీసీఐ తొలగించింది. దీనిని సాకుగా చూపి భద్రతా కారణాలంటూ బంగ్లాదేశ్ రాగం ఎత్తుకుని మూల్యం చెల్లించింది. మరోవైపు.. పాక్‌లో గతంలో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.చదవండి: మాపై ఉగ్రదాడి జరిగింది: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ -
IND vs PAK: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగేలా శ్రీలంక లేఖ
టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్.. తమ నిర్ణయంపై పునరాలోచన చేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) విజ్ఞప్తి చేసింది. దాయాదులు పోరు కోసం తాము ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న లంక బోర్డు.. తమకు నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించవద్దని కోరింది.ఈ సందర్భంగా పాకిస్తాన్లో తమ జట్టుపై జరిగిన ఉగ్రదాడి (2009 Lahore Attack)ని ప్రస్తావిస్తూ.. పాక్‌కు దిమ్మతిరిగేలా చురకలు అంటించింది. కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. అయితే, బంగ్లాదేశ్ కూడా లంకలోనే మ్యాచ్‌లు ఆడతామని పట్టుబట్టగా ఆ జట్టును ఐసీసీ తొలగించింది.భారీ నష్టంభారత్లో బంగ్లా జట్టుకు పూర్తి భద్రత ఉంటుందని చెప్పినా వినకపోవడంతో ఐసీసీ ఈ మేర కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే బంగ్లాకు మద్దతుగా తాము భారత్‌తో బహిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రకటించాడు. అదే జరిగితే హైవోల్టేజీ మ్యాచ్ కోసం ఏర్పాట్లు చేసిన ఐసీసీ, బ్రాడ్కాస్టర్లు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఐసీసీ సభ్య దేశాలు సైతం ఆదాయం కోల్పోతాయి.అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయిఈ నేపథ్యంలో తమపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న శ్రీలంక బోర్డు.. పాకిస్తాన్‌కు లేఖ రాసింది. "కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఫిబ్రవరి 15న టీమిండియాతో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు మీడియా ద్వారా తెలిసింది. వరల్డ్‌కప్ టోర్నీలో మా దేశంలో జరగాల్సిన మ్యాచ్‌ల షెడ్యూల్ చాన్నాళ్ల క్రితమే ఖరారైంది.ఈ మ్యాచ్‌కు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, టికెట్ల అమ్మకం, ఆతిథ్య ఏర్పాట్లు, వాణిజ్య కార్యకలాపాలు.. ఇలా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి అన్నీ ఖరారైపోయాయి. ఈ సందర్భంగా.. మర్యాదపూర్వకంగా గౌరవంతో మీకో విషయాన్ని గుర్తుచేయాలని భావిస్తున్నాం.పాక్‌లో మాపై ఉగ్రదాడిభద్రతాపరంగా సున్నితమైన వాతావరణం నెలకొన్న వేళ పాకిస్తాన్లో మేమే మళ్లీ తొలుత పర్యటించాం. గతంలో మా జాతీయ జట్టు కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఫలితంగా మా శ్రీలంక ఆటగాళ్లు, అధికారులు గాయాలపాలయ్యారు. వారిలో కొంతమంది ఇప్పటికీ ఆ గాయాల తాలుకు నొప్పితో బాధపడుతున్నారు.ఇటీవల బాంబుల వర్షం కురుస్తున్నా.. మేము పాక్ పర్యటనను మధ్యలోనే నిలిపివేయకుండా మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాం. ఇప్పటికీ మేము పాక్ క్రికెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో పరస్పర ప్రయోజనాల కోసం పనిచేసేందుకు సిద్ధంగానే ఉన్నాము.పాకిస్తాన్‌కు వచ్చేందుకు సందేహించినాగతంలో విదేశీ జట్లన్నీ పాకిస్తాన్లో పర్యటించేందుకు సందేహిస్తున్న తరుణంలో మేమే ముందుగా అక్కడి వచ్చాము’’ అంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు సున్నితంగానే పాకిస్తాన్‌కు కర్రుకాల్చి వాతపెట్టినట్లుగా పాక్‌లో ఉన్న పరిస్థితుల గురించి తెలిసేలా చేసింది. తమ దేశంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌కు భద్రతా సమస్యలు ఉంటాయంటూ పాక్ బోర్డు చెప్పిన కారణం సరైంది కాదని పరోక్షంగా చురకలు అంటించింది.కాగా 2009లో గడాఫీ స్టేడియం నుంచి శ్రీలంక క్రికెట్ జట్టు బస్సులో వెళ్తున్న సమయంలో 12 మంది ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కొంతమంది అధికారులు మరణించగా.. ఆరుగురు శ్రీలంక క్రికెటర్లు గాయపడ్డారు. కెప్టెన్ మహేళ జయవర్ధనే సహా కుమార్ సంగక్కర కూడా గాయాలపాలయ్యారు. పాక్‌కు చెందిన అహ్సాన్ రజా అనే అంపైర్ కష్టంమీద ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా చాలాకాలం వరకు విదేశీ జట్లు అక్కడ పర్యటించిందేకు వణికిపోయాయి. ఇక ఇటీవల సైతం బాంబుల మోత నడుమ కూడా పాక్-లంక మ్యాచ్‌లు యథావిధిగా జరగగా.. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ లంక జట్టుకు చేతులు జోడించి నమస్కరించాడు.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్.. పొట్టకొట్టేలా.. -
వాళ్లు మా సోదరులు: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘాపై భారతీయ నెటిజన్లు భగ్గుమంటున్నారు. బంగ్లాదేశీయలు తమ సోదరులు అంటూ అతడు చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేస్తున్నారు. బంగ్లాదేశ్‌కు గట్టిగా బుద్ధి చెప్పిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) పాకిస్తాన్‌కు కూడా సరైన సమాధానం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.భారత్- బంగ్లా ఉద్రిక్తతలుకాగా 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. పశ్చిమ పాకిస్తాన్ ఆగడాలు తట్టుకోలేక విలవిల్లాడిన తూర్పు ప్రజలకు భారత సైన్యం అండగా నిలిచింది. ఫలితంగా బంగ్లాదేశ్‌కు స్వతంత్రత వచ్చింది. ఈ యుద్ధంలో సుమారుగా 3900 మంది భారతీయ సైనికులు ప్రాణత్యాగం చేశారు.ఇలా బంగ్లాదేశ్‌కు ఆది నుంచి భారత్ అండగా ఉంటోంది. అయితే, ఇటీవల కొంతమంది బంగ్లా నేతలు భారత్ భూభాగాల గురించి అవాకులు చెవాకులు పేలడమే కాకుండా.. ఉగ్రవాదులకు తాము ఆశ్రయమిస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మైనారిటీ హిందువులపై బంగ్లాలో హత్యాకాండ జరిగింది.టోర్నీ నుంచి అవుట్‌ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలో తమ ఆటగాళ్లకు భారత్‌లో భద్రత ఉండదంటూ టీ20 ప్రపంచకప్-2026లో తమ వేదికను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లా ఐసీసీని కోరింది.పాక్ ఓవరాక్షన్‌అయితే, బంగ్లా ఆరోపణలను కొట్టిపారేసిన ఐసీసీ.. తుదినిర్ణయం చెప్పాలని గడువు ఇచ్చింది. అయినప్పటికి బంగ్లా పట్టువీడకపోవడంతో టోర్నీ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న పాక్ సైతం టోర్నీ బహిష్కరిస్తామని తొలుత.. ఆ తర్వాత భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామని ప్రకటించింది.ఈ నేపథ్యంలో ‘థాంక్యూ పాకిస్తాన్’ అని బంగ్లాదేశ్ యువజన, క్రీడా శాఖ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్‌నకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌పై ప్రేమ ఒలకబోశాడు.చరిత్ర గుర్తు చేసుకో‘‘బంగ్లాదేశీయులు మా సోదరులు. పాకిస్తాన్‌కు మద్దతుగా ఉన్నందుకు వారికి రుణపడి ఉంటాము. కానీ వాళ్లు ఈసారి వరల్డ్‌కప్ టోర్నీ ఆడకపోవడం చూస్తుంటే బాధగా ఉంది’’ అంటూ సల్మాన్ ఆఘా పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటూ భారతీయ నెటిజన్లు అతడికి చురకలు అంటిస్తున్నారు. కాగా శనివారం నుంచి భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. పాక్ తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్.. పొట్టకొట్టేలా.. -
అందుకే టీమిండియాతో మ్యాచ్ బహిష్కరిస్తున్నాం: పాక్ ప్రధాని
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో టీమిండియాతో తమ జట్టు మ్యాచ్ ఆడబోదని పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ పునురుద్ఘాటించారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని.. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇస్లామాబాద్‌లో ఫెడరల్ క్యాబినెట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ..అందుకే టీమిండియాతో మ్యాచ్ ఆడము‘‘టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇండియాతో మ్యాచ్ ఆడవద్దని నిర్ణయించుకున్నట్లు మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే.. క్రీడా మైదానంలో రాజకీయాలకు తావు ఉండకూడదనేది మా వాదన. అందుకే మేము కచ్చితమైన నిర్ణయం తీసుకున్నాం.బంగ్లాదేశ్‌కు మద్దతుగా మేము ఈ పని చేస్తున్నాం. ఇది అత్యంత గొప్ప, సరైన నిర్ణయమని నేను భావిస్తున్నాను’’ అని షెబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) పేర్కొన్నారు. కాగా పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్‌గా పాక్ మంత్రి మొహ్సిన్ నక్వీ (Mohsing Naqvi) ఉన్న సంగతి తెలిసిందే.మీ వేషాలు మామూలుగా లేవండి!ఇప్పుడు వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్ బహిష్కరణ గురించి ఏకంగా ప్రధాని ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయాలను క్రీడలతో కలగలిపి దౌత్యపరంగా లబ్ది పొందాలని చూస్తుంది మీరేనంటూ షెబాజ్ షరీఫ్‌పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు లేని బాధ మీకు ఎందుకని.. ఉద్దేశపూర్వకంగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే నష్టపోయేది మీరేనంటూ చురకలు అంటిస్తున్నారు. ఏదేమైనా.. ‘‘మీ వేషాలు మామూలుగా లేవండి’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.తటస్థ వేదికపై దాయాదుల పోరుకాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా తటస్థ వేదికైన దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడింది. ఈ నేపథ్యంలో అప్పుడే భారత్- పాక్‌లలో ఒకటి ఆతిథ్య దేశంగా ఉంటే.. తటస్థ వేదికను ఏర్పాటు చేయాలనే ఒప్పందం జరిగింది. అందుకు తగ్గట్లే టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. పాక్ శ్రీలంకతో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ కొన్నాళ్లుగా భారత్‌ను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను బీసీసీఐ తొలగించింది. దీంతో భారత్‌తో తమకు భద్రత లేదని.. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని బంగ్లా బోర్డు ఐసీసీ దగ్గర పట్టుపట్టింది.బంగ్లాదేశ్‌కు గట్టిగానే షాక్ తగిలిందిఅయితే, భారత్‌లో భద్రత విషయంలో బంగ్లా జట్టుకు వచ్చిన ఎలాంటి ముప్పేమీ లేదని ఐసీసీ చెప్పగా.. బంగ్లా మొండివైఖరి వీడలేదు. దీంతో ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించింది. అయితే, పాకిస్తాన్ మాత్రం తమకు తటస్థ వేదిక ఉన్నా.. లంకలో భారత్‌తో మ్యాచ్‌కు భద్రతా సమస్యలు ఉన్నాయంటూ కొత్తరాగం ఎత్తుకుంది.అయితే, లీగ్ దశలో మిగిలిన మ్యాచ్‌లకు లేని భద్రతా కారణాలు.. భారత్‌తో మ్యాచ్‌కు మాత్రమే ఎందుకు ఉంటాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పాక్ ప్రధాని స్వయంగా మరోసారి ఈ విషయం గురించి ప్రకటన చేయడం విశేషం. ఒకవేళ పాక్ టీమిండియాతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఐసీసీ ఆదాయం తగ్గి.. ఇతర సభ్య దేశాల బోర్డులపై కూడా ప్రభావం పడుతుంది.చదవండి: IND vs PAK: పాక్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన బంగ్లాదేశ్.. పొట్టకొట్టేలా.. -
IND vs PAK: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్!
భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ ప్రకటనపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది. ఇలాంటి నిర్ణయాల వల్ల తాము కూడా నష్టపోయే ప్రమాదం ఉందంటూ.. పాక్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.బంగ్లా మొండి వైఖరి.. ఐసీసీ కఠిన చర్యలుఅయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు భారత్‌లో భద్రత లేదంటూ బంగ్లా ఆరోపించింది. తమ వేదికను లంకకు మార్చాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) వాదనలో నిజం లేదని కొట్టిపారేసిన ఐసీసీ ఇందుకు నిరాకరించి.. పునరాలోచించుకోవాల్సిందిగా గడువు ఇచ్చింది.పాక్ బోర్డు డ్రామాలుకానీ.. బీసీబీ మాత్రం మొండిపట్టు వీడలేదు. ఫలితంగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ స్థానంలో ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను చేర్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు తాము మద్దతుగా ఉంటామంటూ పాక్ క్రికెట్ బోర్డు (PCB) డ్రామాకు తెరతీసింది.తొలుత టోర్నీ మొత్తం బహిష్కరిస్తామని.. ఆ తర్వాత భారత్‌తో మ్యాచ్ మాత్రమే బాయ్‌కాట్ చేస్తామని పీసీబీ ఐసీసీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న భారత్- పాక్ మ్యాచ్ జరుగకపోతే దాదాపు రెండు వేల కోట్ల రూపాయాలకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.పాక్ పంతం వీడకపోతే ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే ఐసీసీ సభ్య దేశాల ఆదాయంలో కోత పడుతుంది. ముఖ్యంగా చిన్నస్థాయి బోర్డుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. పాక్‌తో పాటు ఇతర సభ్య దేశాలు ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.నష్టపరిచే విధానాలను కోరుకోవడం లేదుఈ నేపథ్యంలో పాక్ ప్రకటనపై బంగ్లాదేశ్ సీనియర్ డైరెక్టర్ ఒకరు స్థానిక మీడియా ప్రథోమ్ ఆలోతో మాట్లాడారు. ‘‘ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరుగకపోతే క్రికెట్ ప్రపంచం మొత్తం ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుంది. ఆదాయంలో మా వాటా కూడా తగ్గిపోతుంది. ఇలాంటి నష్టపరిచే విధానాలను మేము కోరుకోవడం లేదు’’ అని సదరు డైరెక్టర్ స్పష్టం చేశారు. పాక్ వైఖరి ఇతర బోర్డుల పొట్టకొట్టేలా ఉందని అభిప్రాయపడ్డారు.అయితే, అదే సమయంలో.. ‘‘భారత క్రికెట్‌కు గట్టి సందేశం ఇవ్వాలని పాకిస్తాన్ కోరుకుంటున్నట్లు ఉంది. క్రికెట్లో భారత్ ఆధిపత్యాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తోంది. ఆ కోణంలో పాక్ నిర్ణయం ఒక రకంగా సరైందే అయి ఉండవచ్చు’’ అని సదరు డైరెక్టర్ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.కాగా ఐసీసీకి దాదాపు తొంభై శాతానికి పైగా ఆదాయం భారత మార్కెట్ల నుంచే వస్తుందని పాక్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా గతంలో వ్యాఖ్యానించాడు. దీనిని బట్టి ఐసీసీకి ప్రధాన ఆదాయ వనరు భారత క్రికెట్ అని చెప్పడంలో సందేహం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వ్యవస్థ అతలాకుతలంఇలాంటి తరుణంలో పాక్ ఇలా పూటకో నాటకం ఆడుతూ ఇతర బోర్డులకు నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తిస్తోందని విమర్శలూ వస్తున్నాయి. బీసీబీకి చెందిన మరో సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘భారత్- పాక్ మ్యాచ్ వివాదం ఐసీసీ సెంట్రల్ రెవెన్యూ పూల్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మేము కూడా అందులో భాగమే. కెన్యా, ఉగాండా వంటి జట్లు పెద్దగా నష్టపోవు. ఒకవేళ ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం తగ్గితే మా వ్యవస్థ అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది’’ అని పేర్కొన్నారు. చదవండి: వరల్డ్‌కప్ టోర్నీకి ముందు టీమిండియాకు మరో షాక్! -
IND vs PAK: ఆ మూడు మ్యాచ్‌లు గెలుస్తాం: పాక్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో భారత్‌తో మ్యాచ్ బహిష్కరించడంపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా స్పందించాడు. తాము కేవలం కాంట్రాక్టు ఆటగాళ్లమని.. ప్రభుత్వం నిర్ణయానుసారమే నడుచుకుంటామని తెలిపాడు. వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియాతో మ్యాచ్ ఆడరాదని తమ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఇందులో ఆటగాళ్లు చేసేదేమీ లేదని పేర్కొన్నాడు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశానికి కట్టుబడి ఉండాల్సిందేనని సల్మాన్ ఆఘా వ్యాఖ్యానించాడు.ఆసీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి..అదే విధంగా.. గ్రూప్ దశలో మ్యాచ్ రద్దు కారణంగా పాయింట్లు కోల్పోయే అంశం మీద కూడా సల్మాన్ ఆఘా స్పందించాడు. లీగ్ దశలో మిగిలిన మ్యాచ్‌లలో గెలిచి ముందడుగు వేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా ప్రపంచకప్ టోర్నీకి ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆసీస్ జట్టు దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగగా.. పాక్ ఈ మేర విజయం సాధించింది.ప్రపంచకప్ అంటే భారత్‌తో మ్యాచ్ మాత్రమే కాదుఈ నేపథ్యంలో ఆసీస్‌తో మూడో టీ20లో విజయం తర్వాత సల్మాన్ ఆఘా (Salman Agha) భారత్‌తో మ్యాచ్ (IND vs PAK) రద్దు విషయం గురించి మాట్లాడాడు. ‘‘‘మేం బోర్డుతో కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లం. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి ఉండాల్సిందే. ప్రపంచకప్ అంటే భారత్‌తో మ్యాచ్ మాత్రమే కాదు కదా!..లీగ్ దశలో మరో మూడు మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ గెలిచి ముందంజ వేసేందుకు ప్రయత్నిస్తాం’ అని సల్మాన్ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో ఆడరాదనే పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్ మాజీ క్రికెటర్లు షాహిత్ ఆఫ్రిది, యూసుఫ్, రషీద్ లతీఫ్, మొయిన్ ఖాన్, సర్ఫరాజ్ అహ్మద్ సమర్థించారు.మిగిలిన మూడు జట్లు అవేకాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో భారత్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్తో పాటు పాకిస్తాన్ గ్రూప్-‘ఎ’లో ఉంది. అయితే, భారత్‌లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్.. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలంటూ ఓవరాక్షన్ చేయగా.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిరాకరించింది. దీంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్ కూడా ముందుగా టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలు పలికింది. చివరగా భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. అపుడు అమెరికా చేతిలో ఓడిఅయితే, ఈ విషయంపై ఐసీసీకి ఇంతవరకు అధికారికంగా తెలియజేయకపోవడం పాక్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024లో పసికూన అమెరికా చేతిలో లీగ్ మ్యాచ్‌లో పాక్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.చదవండి: IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! -
T20 WC: ఐసీసీ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. శ్రీలంకతో కలిసి భారత్ ఆతిథ్యం ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. బంగ్లాదేశ్- పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి తలనొప్పిగా మారాయి.ఇందుకు కారణం.. భారత్- బంగ్లాదేశ్ (IND vs BAN), భారత్- పాకిస్తాన్ (IND vs PAK) దౌత్య సంబంధాలలో ఉద్రిక్తతలు... పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్‌తో మెగా ఈవెంట్లలో తలపడే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోవైపు.. ఇన్నాళ్లు భారత్ సాయం పొందిన బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులతో పాటు భారత్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాయకుల సంఖ్య పెరిగిపోయింది.అప్పుడు మొదలుఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను తొలగించాలనే డిమాండ్లు పెరరగా.. బీసీసీఐ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు కూడా! అంతేకాదు.. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ క్రమంలో భారత్‌లో తమకు భద్రత లేదంటూ.. తమ మ్యాచ్‌ల వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లా పట్టుబట్టింది. అయితే, ఐసీసీ ఇందుకు నిరాకరించి.. గడువు ఇచ్చినా పంతం వీడకపోవడంతో బంగ్లాను తప్పించింది. ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది.బంగ్లాకు మద్దతుగా పాక్ఇక ఆ తర్వాత బంగ్లాకు మద్దతుగా తామూ టోర్నీని బహిష్కరిస్తామని బీరాలు పలికిన పాకిస్తాన్.. ఇప్పుడు కేవలం భారత్‌తో మ్యాచ్ ఆడబోమంటూ ప్రకటించింది. అయితే, ఇందుకు సంబంధించి ఐసీసీకి అధికారికంగా మెయల్ చేయలేదు. ఈ పరిణామాలపై ఐసీసీ కమ్యూనికేషన్స్ మాజీ హెడ్ సమీ ఉల్ హసన్ బర్నే స్పందిస్తూ.. తప్పంతా బీసీసీఐపైకి నెట్టాడు.బీసీసీఐ నిందలు‘‘ఈ విషయంలో క్రికెట్ బోర్డులు మరింత ఆచితూచి వ్యవహరించాల్సింది. ముఖ్యంగా ముస్తాఫిజుర్‌ను తొలగించిన విషయాన్ని బీసీసీఐ బహిరంగంగా చెప్పకుండా ఉండాల్సింది. కేకేఆర్‌కు ప్రైవేటుగా విషయం చెప్పి అతడిని రిలీజ్ చేయమని చెప్పాల్సింది.కొన్నిసార్లు ఇలాంటి చిన్న విషయాలే పెద్దగా మారతాయి. జనవరి 3న వాళ్లు (బీసీసీఐ) చేసిన ప్రకటనే వీటన్నిటికీ మూలం. అయితే, బంగ్లాదేశ్ విషయంలో పాక్ చేస్తున్న పోరాటం సరైంది కావచు... కాకపోనూ వచ్చు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే ఏ బోర్డు అయినా నడుచుకుంటుంది.ఏదేమైనా పాక్ తదుపరి పరిణామాలకు సిద్ధపడే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది. న్యాయ బృందంతో చర్చించి.. ఈ విషయంపై ఎలా ముందుకు సాగాలో వారు ఆలోచించుకునే ఉంటారు’’ అని సమీ ఉల్ హసన్ బర్నే పేర్కొన్నాడు. కాగా పాక్ కోసం శ్రీలంకను ఐసీసీ తటస్థ వేదికగా ఏర్పాటు చేసినప్పటికీ.. భద్రతా కారణాలు అంటూ పాక్ భారత్ మ్యాచ్‌ను బహిష్కరిస్తామనడం గమనార్హం. అందుకే ఐసీసీ ఈసారి పాక్‌కు గట్టిగానే బుద్ధి చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: పాక్ ఓవరాక్షన్.. ఐసీసీ కీలక సమావేశం! -
భారత్‌లో పర్యటించనున్న బంగ్లాదేశ్ జట్టు
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో జరిగిన హైడ్రామా తర్వాత కూడా బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే మీరనుకున్నట్లు ఇది బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కాదు. షూటింగ్ జట్టు. ఆసియా రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్ కోసం బంగ్లా టీమ్ భారత పర్యటనకు రానుంది. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో జరగనుంది. క్రికెట్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్.. షూటింగ్ పోటీల్లో ఎలా పాల్గొనబోతుందోనన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ మ్యాచ్‌లకు లభించని భద్రత షూటింగ్‌కు లభిస్తుందా అని భారత క్రీడాభిమానులు సెటైర్లు వేస్తున్నారు.కాగా, భారత్‌లో జరగాల్సిన తమ టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను భద్రతా కారణాలు సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడంతో భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదం మొదలైంది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. భారత్‌పై ప్రతీకార చర్యగా స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసింది. ఇంతటితో ఆగకుండా భద్రతా కారణాలను సాకుగా చూపుతూ, భారత్‌లో జరగాల్సిన తమ ప్రపంచకప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. ఐసీసీ ససేమిరా అనడంతో చివరికి ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. ఇప్పుడేమో తమ దేశ షూటింగ్ జట్టును భారత్‌కు పంపుతూ కొత్త చర్చకు తెరలేపింది. ఈ విషయంలో భారత షూటింగ్ సమాఖ్య ఎలా స్పందిచబోతుందోనన్నది ఆసక్తికరంగా మారింది. -
సొంత ప్రజల్నే ఫూల్స్ చేసిన పీసీబీ అధ్యక్షుడు నఖ్వీ
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొనడం ఖరారైంది. మొహిసిన్ నఖ్వీ నేతృత్వంలోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రపంచకప్‌లో పాల్గొనే తమ జట్టు కోసం కొలొంబోకు (పాక్ తమ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇక్కడే ఆడుతుంది) విమానం టికెట్లు బుక్ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అన్నీ సిద్దం చేసుకొని పాక్ డ్రామాలు ఆడుతుంది.ప్రపంచకప్‌లో పాల్గొనే అంశంపై తమ ప్రధాని ఫిబ్రవరి 2ను డెడ్‌లైన్‌గా విధించాడని మొహిసిన్ సొంత ప్రజల్నే ఫూల్స్ చేశాడు. పైకి డ్రామాలు ఆడుతూ, లోలోపల ప్రపంచకప్ బరిలోకి దిగేందుకు అన్నీ సిద్దం చేశాడు. పాక్ జట్టు ప్రస్తుతం తమ దేశంలో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుతో కలిసి (మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసిన తర్వాత) ప్రపంచకప్ కోసం కొలొంబోకు ప్రయాణించనుంది. ఈ విషయాన్ని టెలికామ్ ఏషియా బ్రేక్ చేసింది. ఇది తెలిసి పాక్ ప్రజలు నఖ్వీపై ఫైరవుతున్నారు.ప్రపంచకప్‌లో పాల్గొనే అంశం ఎందుకు గోప్యంగా ఉంచారని నిలదీస్తున్నారు. దీనికి ప్రధాని డెడ్‌లైన్ విధించారని ఎందుకు డ్రామాలాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ క్రికెట్‌కు నఖ్వీ వల్లే సగం దరిద్రం పట్టిందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.కాగా, పాక్ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు అన్నీ సిద్దం చేసుకున్నా, భారత్‌తో మ్యాచ్ ఆడుతుందా లేదా అన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు. నఖ్వీ కదలికలు చూస్తే భారత్‌తో మ్యాచ్ బహిష్కరణపై సందేహాలు కలుగుతున్నాయి. భద్రతా కారణాలు సాకుగా చూపుతూ టీమిండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్నది పాక్ వ్యూహంగా తెలుస్తుంది. ఇలా చేసి ఐసీసీ శిక్షల నుంచి తప్పించుకోవాలని పీసీబీ వ్యూహాలు రచిస్తున్నట్లు ఎన్డీటీవీ నివేదిక తెలిపింది. ఇదే జరిగితే పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భారత్-బంగ్లాదేశ్ మధ్య పేచీలో పాక్ ఎంటరై బంగ్లాదేశ్‌కు వత్తాసు పాడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో బంగ్లాదేశ్ ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. తదనంతరం పరిణామాల్లో పాక్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే ప్రపంచకప్ నుంచి తప్పుకుంటుందని ప్రచారం జరిగింది. తీరా చూస్తే పాక్ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు కొలొంబోకు టికెట్లు బుక్ చేసుకొని సొంత ప్రజల్నే ఫూల్స్ చేసింది. -
పాక్ క్రికెట్‌ని నాశనం చేస్తారా?: పీసీబీపై మాజీల ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమకు సంబంధం లేని అంశంలో తలదూర్చి కష్టాలు కొని తెచ్చుకొంటోంది. బంగ్లాదేశ్‌కు మద్దతు పలికే క్రమంలో తమ జట్టు ప్రయోజనాలను కూడా పణంగా పెట్టేందుకు సిద్ధమైంది. వెరసి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో పీసీబీ సంబంధాలు చెడిపోయే ప్రమాదం తలెత్తింది. ఐసీసీతో పెట్టుకోవద్దని వార్నింగ్ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్లేయర్లు, క్రీడాపాలకులు పీసీబీ తీరును విమర్శిస్తున్నారు. ఐసీసీతో సంబంధాలు చెడగొట్టుకోవడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఫిబ్రవరి 7- మార్చి 8న మధ్య టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ నుంచి ఐసీసీ బంగ్లాదేశ్‌ను తప్పించింది. బంగ్లాను తప్పిస్తూ కఠిన నిర్ణయం భారత్‌లో తమకు భద్రత లేదంటూ ఆరోపణలు చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు.. ఐసీసీ పరిశీలనా బృందం అదేమీ లేదని తేల్చినా పంతం వీడలేదు. ఫలితంగా బంగ్లాను తప్పిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ స్థానంలో స్కాట్లాండ్ను వరల్డ్‌కప్ టోర్నీలో చేర్చింది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు ఐసీసీ అన్యాయం చేసిందని.. తాము కూడా వరల్డ్‌కప్‌లో ఆడేదీ లేనిది ఈ వారంలోగా వెల్లడిస్తామని పీసీబీ చైర్మన్ మొహసిన్ నక్వీ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచకప్ నుంచి వైదొలగాల్సిన అవసరమైతే లేదని ఆ దేశ మాజీలు అంటున్నారు. చెడగొట్టుకోవద్దు‘బంగ్లాదేశ్‌కు అండగా నిలవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వరల్డ్‌కప్‌నకు జట్టును పంపకపోవడానికి కారణమేముంది. అనవసరంగా ఐసీసీతో సంబంధాలను చెడగొట్టుకోవద్దు’ అని పీసీబీ మాజీ కార్యదర్శి ఆరిఫ్ అలీ అన్నారు.‘వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించడానికి ముందు జరిగిన సమావేశంలో బంగ్లా బోర్డుకు కేవలం పాకిస్తాన్ మాత్రమే మద్దతు తెలిపింది. అయితే బంగ్లా ప్రతిపాదనను తిరస్కరించిన ఐసీసీ వరల్డ్‌కప్ నుంచి తప్పించింది’ అని పీసీబీ మాజీ చైర్మన్ ఖాలిద్ మహమూద్ తెలిపారు.పాక్ క్రికెట్ తీవ్రంగా నష్టపోతుందిపాక్ మాజీ చీఫ్ సెలెక్టర్ మొహసిన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘మనకు భారత్‌తో విబేధాలు ఉన్నాయి. కానీ మనం ఆడనున్న మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతున్నాయి కదా. మరి అలాంటప్పుడు వరల్డ్‌కప్ కోసం జట్టును పంపకపోవడానికి కారణమేముంది. అదే జరిగిన పాక్ క్రికెట్ తీవ్రంగా నష్టపోతుంది’ అని అన్నాడు. మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ... ‘పాకిస్తాన్ వరల్డ్‌కప్‌లో ఆడాలని కోరుకుంటున్నా. మన దగ్గర మంచి ప్లేయర్లు ఉన్నారు. మన జట్టు ప్రపంచకప్ వంటి పెద్ద వేదికలపై మెరుగైన ప్రదర్శన చేస్తుంటే చూడటం బాగుంటుంది’ అని అన్నాడు.పాకిస్తాన్ కోసంకాగా భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తటస్థ వేదికలపై ఇరు జట్లు ఐసీసీ ఈవెంట్లలో తలపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆతిథ్యం ఇస్తున్నా.. పాకిస్తాన్ కోసం శ్రీలంకను మరో వేదికగా ఎంపిక చేసింది ఐసీసీ. అయితే, పీసీబీ మాత్రం ఐసీసీ తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా.. బంగ్లాదేశ్ కోసమంటూ టోర్నీ నుంచి వైదొలుతామంటూ అతి చేస్తోంది. చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్! -
ICC: బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగేలా మరో షాక్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మొండి వైఖరి కారణంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండుసార్లు అవకాశం ఇచ్చినా తీరు మార్చుకోని కారణంగా.. బంగ్లా జట్టును టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి తప్పించారు.ఆటగాళ్లతో పాటు వారికీ సెగబంగ్లాదేశ్ ప్రభుత్వం, బీసీబీ నిర్ణయాల కారణంగా ప్రపంచకప్ ఆడాలన్న ఆటగాళ్ల కల ఈసారికి దూరమైంది. అంతేకాదు.. ఆ సెగ బంగ్లాదేశ్ జర్నలిస్టులకు కూడా తగిలినట్లు తెలుస్తోంది. భారత్- శ్రీలంక (India- Sri Lanka)వేదికలుగా జరిగే వరల్డ్‌కప్ టోర్నీ కవరేజ్ కోసం వంద మందికి పైగా జర్నలిస్టులు అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.అయితే, ఐసీసీ మాత్రం వీరి దరఖాస్తులు, అభ్యర్థనలను తిరస్కరించినట్లు (Were Denied visa and Accreditation) సమాచారం. దీంతో ఈసారి బంగ్లా జర్నలిస్టులు ఈ టోర్నీని ప్రత్యక్షంగా కవర్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయం గురించి ఆజ్‌కర్ ప్రతిక స్పోర్ట్స్ ఎడిటర్ రానా అబ్బాస్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు.చాలా బాధగా ఉంది‘‘బంగ్లాదేశ్‌లో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఘటన జరుగలేదు. 1999లో బంగ్లా జట్టు తొలిసారి ప్రపంచకప్ ఆడేకంటే ముందు నుంచే బంగ్లాదేశీ జర్నలిస్టులు ఈ ఈవెంట్‌ను కవర్ చేస్తున్నారు. భారత్- పాకిస్తాన్ వంటి కీలక మ్యాచ్‌లు.. ముఖ్యంగా భారత్‌లో జరిగిన మ్యాచ్‌లను కూడా కవర్ చేశారు.గతంలో ఎప్పుడూ ఇలా అందరు కరస్పాండెంట్ల దరఖాస్తులను తిరస్కరించిన దాఖలాలు లేవు. ఇదొక దురదృష్టకర ఘటన. నాకైతే చాలా బాధగా ఉంది’’ అని రానా అబ్బాస్ విచారం వ్యక్తం చేశాడు.దెబ్బ అదుర్స్ కదూ!ఈ నేపథ్యంలో ఎన్డీటీవీ ఐసీసీ అధికారి స్పందన కోరగా.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. ‘‘భారత్‌లో తమ వాళ్లకు రక్షణ ఉండదని బంగ్లాదేశ్ ప్రభుత్వం పదే పదే వాదించింది. అందుకే వాళ్లకు వీసాలు, అక్రిడేషన్లు ఇవ్వలేదు’’ అంటూ ఇచ్చిపడేశారు సదరు అధికారి. అయితే, నిబంధనల ప్రకారం నలభై మందికి మించకుండా అక్రిడేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.చెప్పినా వినలేదుకాగా తమ ఆటగాళ్లకు భారత్ సురక్షితం కాదని.. వేదికను శ్రీలంకకు మార్చాలంటూ బీసీబీ.. ఐసీసీని ఆశ్రయించింది. అయితే, పరిశీలనా బృందం నివేదిక మేరకు భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీ లేదని తేల్చింది ఐసీసీ. అయితే, బీసీబీ మాత్రం పట్టువీడలేదు. వేదిక మార్చకుంటే టోర్నీ నుంచి వైదొలుగుతామని బెదిరించింది.ఈ నేపథ్యంలో ఆఖరి అవకాశం ఇచ్చినా బీసీబీ తీరు మారకపోవడంతో.. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించింది ఐసీసీ. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చించింది. తాజాగా బీసీబీ చెప్పిన సాకునే కారణంగా చూపుతూ జర్నలిస్టులకు వీసాలు నిరాకరించినట్లు సమాచారం.చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్! -
ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొట్టి క్రికెట్ మజాను ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, అంతకంటే ముందుగానే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ల మధ్య వ్యవహారం ఈ ఐసీసీ ఈవెంట్‌పై మరింత చర్చకు దారితీసింది.భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఆటగాళ్లను భారత్‌కు పంపబోమని.. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడించాలని బీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించిన ఐసీసీఅయితే, భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పిన ఐసీసీ.. తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా బీసీబీకి గడువు ఇచ్చింది. అయితే, బీసీబీ మాత్రం మొండిపట్టు పట్టింది. తమ ప్రభుత్వం చెప్పినట్లుగానే తమ ఆటగాళ్లను భారత్‌కు పంపబోమని స్పష్టం చేసింది. ఇందుకు స్పందనగా బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్ను చేరుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.పీసీబీ ఓవరాక్షన్ఈ ఎపిసోడ్ మొత్తంలో బీసీబీ కంటే కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అతి చేసింది. బంగ్లాదేశ్‌కు ఐసీసీ అన్యాయం చేసిందంటూ.. బోర్డు మొత్తం ఒకవైపు ఉంటే.. పాక్ మాత్రం బంగ్లాకు అనుకూలంగా ఓటు వేసింది. అంతేకాదు బంగ్లాదేశ్‌ను ఆడించకపోతే తామూ టోర్నీ బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగింది. నిజానికి ముందుగా అనుకున్న ఒప్పందం (భారత్- పాక్ వేదికల హైబ్రిడ్ మోడల్) ప్రకారం.. పాక్‌కు ఇప్పటికే తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసింది ఐసీసీ.అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు వత్తాసు పలుకుతూ భారత్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని పాక్ బోర్డుపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఈ శుక్రవారం లేదంటే వచ్చే సోమవారం నాటికి టోర్నీలో ఆడే విషయంపై నిర్ణయం వెల్లడిస్తామంటూ పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ సోమవారం ట్వీట్ చేశాడు.ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పాక్ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ స్థానంలో బంగ్లాదేశ్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం..ఊహించని ట్విస్టు‘‘ఒకవేళ పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగాలని భావిస్తే.. గ్రూప్-ఎలో ఆ జట్టు స్థానాన్ని బంగ్లాదేశ్ భర్తీ చేసే అవకాశం ఉంది. పాక్ తప్పుకొంటే... బీసీబీ ముందు నుంచి కోరినట్లుగా పాక్ స్థానంలో బంగ్లాదేశ్ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడేందుకు వీలు కలుగుతుంది. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని సమస్యలు తలెత్తినా అంతిమంగా ఓ పరిష్కారం అయితే దొరుకుతుంది’’ అని ఐసీసీ సన్నిహిత వర్గాలు విశ్లేషించాయి.ఒప్పందం అతిక్రమిస్తే.అంతేకాదు.. ‘‘ఇప్పటికే భారత్- పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మ్యాచ్‌లకు తటస్థ వేదికలను ఐసీసీ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు కూడా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు బదులు శ్రీలంకలో పాక్ తమ మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు.అయినప్పటికీ పాక్ తప్పుకొంటే.. ఒప్పందాన్ని పాక్ బోర్డు ఉల్లంఘించినట్లే అవుతుంది. కాబట్టి వారికి మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఏదో చేయబోతే ఇంకేదో అయింది అన్నట్లు.. బీసీసీఐ మీదకు బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టే ప్రయత్నంలో తమ నెత్తి మీద తామే పిడుగు వేసుకున్నట్లు పాక్ పరిస్థితి మారిందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. బీసీబీ- పీసీబీ.. ఈ రెండింటిలో భస్మాసురహస్తం ఎవరిదో అంటూ నెటిజన్లు జోకులు వేస్తున్నారు. మరోవైపు.. పాక్‌ది మేకపోతు గాంభీర్యం మాత్రమేనని.. ఏదో ఓవరాక్షన్ చేసినా అంతిమంగా టోర్నీలో ఆడేందుకు మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోముICC vs Bangladesh: అసలేం జరిగింది.. కథనాల కోసం క్లిక్ చేయండి -
టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్.. కలకలం రేపుతున్న పీసీబీ చీఫ్ నఖ్వీ ట్వీట్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్-2026లో దాయాది పాకిస్తాన్ పాల్గొనడంపై సందిగ్దత ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐసీసీకి ధిక్కారస్వరం వినిపించి టోర్నీ నుంచి వైదొలిగిన బంగ్లాదేశ్ బాటలోనే పాక్ కూడా నడుస్తుందని గతకొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినా, దేశ ప్రధాని అనుమతి లభించాకే తుది నిర్ణయం వెలువడుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహిసిన్ నఖ్వీ స్పష్టం చేశాడు.ఈ నేపథ్యంలో నఖ్వీ ఇవాళ (జనవరి 26) వారి ప్రధాని షహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యాడు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలను అతను ట్విటర్ వేదికగా వెల్లడించాడు. అయితే నఖ్వీ చేసిన ఈ ట్వీట్లో ఓ పెద్ద తప్పిందం దొర్లడం, ప్రస్తుతం కలకలం రేపుతుంది. నఖ్వీ తన ట్వీట్లో ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ పేరుకు బదులు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరును ప్రస్తావించాడు. నఖ్వీ చేసిన ఈ తప్పిదం వివాదాస్పదంగా మారింది.ఇంతకీ నఖ్వీ చేసిన ట్వీట్లో ఏముందంటే.. ప్రధానమంత్రి మియాన్ మహ్మద్ నవాజ్ షరీఫ్‌తో ఫలప్రదమైన సమావేశం జరిగింది. ఐసీసీ అంశంపై వారికి వివరించాను. అన్ని అవకాశాలను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు. తుది నిర్ణయం శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని పేర్కొన్నారు.దేశ అధ్యక్షుడి పేరు తప్పుగా ప్రస్తావించిన విషయాన్ని పక్కన పెడితే, ఈ ట్వీట్‌తో టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ పాల్గొనడంపై త్వరలో స్పష్టత రాబోతోందన్న విషయంపై సంకేతాలు వెలువడ్డాయి. పాక్ ప్రభుత్వం సూచనప్రాయంగా పాక్ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ విషయంలో ఐసీసీ కఠినంగా వ్యవహరించడంతో పాక్ ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గినట్లు స్పష్టమవుతుంది.వివాదం ఎలా మొదలైందంటే..? బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నేపథ్యంలో ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించారు. దీన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో తమ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడబోమని మొండిపట్టు పట్టింది. ఈమేరకు ఐసీసీకి పలు మార్లు విజ్ఞప్తి చేసింది.బీసీబీ విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన ఐసీసీ భద్రతా బృందం భారత్‌లో ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. అయినా మొండిపట్టు వీడని బీసీబీ, చివరికి ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. దీంతో స్కాట్లాండ్ బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మద్దతు ఇస్తూ వచ్చింది. ఓ దశలో బంగ్లా బాటలోనే తాము కూడా నడుస్తామని చెప్పింది. చివరికి సమస్య పెద్దదిగా మారుతుండటంతో పీసీబీ బంగ్లాదేశ్‌ను మధ్యలోనే వదిలేసి యూటర్న్ తీసుకుంది. -
అలా అయితే వరల్డ్‌కప్ ఆడే ప్రసక్తే లేదు: పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి ధిక్కార స్వరం వినిపించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చెప్పినట్లు తాము నడుచుకోమని.. ప్రభుత్వం చెప్పినట్లు మాత్రమే వింటామంటూ అతి చేసింది. ఈ నేపథ్యంలో అసలు తమకు సంబంధం లేని అంశంలో తలదూర్చడమే కాకుండా.. ఐసీసీని కావాలనే చికాకు పెట్టే చర్యలకు పూనుకుంటోందని ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే, భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లా బోర్డు (BCB) తాము భారత్‌లో ఆడలేమని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. కానీ ఐసీసీ ఇందుకు నిరాకరించింది. భారత్‌లో తమకు భద్రత లేదన్న బంగ్లా వాదనను కొట్టిపారేసింది. అంతేకాదు తుది నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు కూడా ఇచ్చింది.బంగ్లాదేశ్‌కు అండగా పాక్అయితే, బంగ్లాదేశ్ మాత్రం తమ ప్రభుత్వం నిర్ణయానుగుణంగా టోర్నీ నుంచి వైదొలిగేందుకే మొగ్గుచూపింది. ఈ వ్యవహారంలో బంగ్లాదేశ్‌కు అండగా నిలిచిన పాక్.. తాము కూడా టోర్నీ నుంచి తప్పుకొంటామని బెదిరింపు ధోరణి అవలంబించింది. నిజానికి భారత్- పాక్ ఉద్రిక్తతల కారణంగానే తటస్థ వేదికలపై ఇరు దేశాల జట్లు ఐసీసీ ఈవెంట్లలో ముఖాముఖి తలపడుతున్నాయి.ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లోనూ పాకిస్తాన్ (Pakistan)కు శ్రీలంకను తటస్థ వేదికగా నిర్ణయించారు. తమకు అనుకూలంగానే నిర్ణయం ఉన్నా.. బంగ్లాదేశ్ కోసమంటూ పాకిస్తాన్ కొత్త రాగం ఎత్తుకుంది. ఈ క్రమంలోనే బంగ్లా మాదిరే పాక్‌ను కూడా టోర్నీ నుంచి తప్పించేందుకు ఐసీసీ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పాక్ తమ వరల్డ్‌కప్ జట్టును ప్రకటించింది.వరల్డ్‌కప్‌లో ఆడతామని చెప్పలేదుఫలితంగా ఈ ఐసీసీ (ICC) ఈవెంట్లో పాక్ పాల్గొంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందిస్తూ.. తాము జట్టును ప్రకటించినంత మాత్రాన వరల్డ్‌కప్‌లో ఆడతామని చెప్పినట్లు కాదని ఓవరాక్షన్ చేశాడు."ఈ విషయం గురించి మా ఆటగాళ్లతో చర్చించాము. బోర్డు, ప్రభుత్వ నిర్ణయమే తమకు శిరోదాఢ్యమని మా ఆటగాళ్లు కుండబద్దలు కొట్టారు. టోర్నీలో పాల్గొనే విషయంలో ప్రభుత్వ సలహా కోసమే మేము ఎదురుచూస్తున్నాం.అలా అయితే బహిష్కరిస్తాంప్రభుత్వం ఎలా చెబితే అలా నడుచుకుంటాము. ఒకవేళ వారు మమ్మల్ని వరల్డ్‌కప్ టోర్నీలో ఆడవద్దని చెబితే అలాగే చేస్తాము’’ అని పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే టీమిండియా మాదిరే తమకూ వెసలుబాటు కావాలని పాక్ కోరినట్లుగా ఐసీసీ శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేసింది. అయినప్పటికీ పీసీబీ బంగ్లాదేశ్ విషయంలో రాద్దాంతం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ సైతం పాక్ పట్ల కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా బంగ్లాదేశ్ మొండివైఖరి నేపథ్యంలో ఆ జట్టును తప్పించిన ఐసీసీ.. స్కాట్లాండ్ను టోర్నీలో చేర్చింది. మొత్తం 20 జట్లు వరల్డ్‌కప్ టోర్నీలో పాల్గొననున్నాయి. చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోము -
T20 WC 2026: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్
టీ20 ప్రపంచకప్-2026 నుంచి తమ జట్టును తప్పించడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సవాలు చేయబోవడం లేదు. ఈ మేరకు బీసీబీ మీడియా కమిటీ చైర్మన్ అంజాద్ హుస్సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. డీఆర్సీని సంప్రదించినా..వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఆతిథ్య భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బంగ్లాదేశ్‌ను తప్పించింది. బంగ్లాదేశ్ స్థానంలో ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీనిపై బంగ్లా బోర్డు ఐసీసీ వివాద పరిష్కారాల కమిటీ (డీఆర్సీ)ని సంప్రదించినా ఫలితం లేకపోయింది. అంగీకరిస్తున్నాంఈ క్రమంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (CAS)కు వెళ్లాలని ముందు అనుకున్న బీసీబీ... ప్రస్తుతం అలాంటి ప్రయత్నాలు విరమించుకుంది. ‘ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. ముందు నుంచి భారత్‌లో ఆడబోమని చెబుతూనే ఉన్నాం. అయినా మా వాదన వినిపించుకోలేదు. దీనిపై ఆర్బిట్రేషన్‌కు వెళ్లే ఉద్దేశం లేదు’ అని అంజాద్ అన్నారు. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొనే భారత్‌లో మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకున్నామని... ఇది తమ ప్రభుత్వ నిర్ణయమని పేర్కొన్నారు. ‘ఐసీసీ బోర్డు మీటింగ్ జరిగిన తర్వాత మంత్రివర్గ భేటీలో వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం భారత్‌లో పర్యటించే అంశంపై చర్చ జరిగింది. భారత్‌లో ఆడేందుకు క్యాబినెట్ అంగీకరించలేదు. అదే విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాం’ అని అంజాద్ వివరించారు. ICC vs Bangladesh: అసలేం జరిగింది.. కథనాల కోసం క్లిక్ చేయండి చదవండి: హరీస్ రవూఫ్‌పై వేటు -
టీ20 వరల్డ్‌కప్‌కు పాక్ జట్టు ప్రకటన.. కీలక మార్పులు
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనడంపై ఆనిశ్చితి కొనసాగుతుండగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (జనవరి 25) తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది ఆసియా కప్ జట్టులో లేని బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, నసీమ్ షా మళ్లీ జట్టులోకి వచ్చారు. ఈ ముగ్గురు తిరిగి రావడం పాకిస్తాన్ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. కెప్టెన్‌గా సల్మాన్ అలీ అఘా కొనసాగుతుండగా.. పలువుర స్టార్ ఆటగాళ్లపై వేటు పడింది. హరీస్ రౌఫ్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, హసన్ అలీ, హుస్సైన్ తలత్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ హరీస్, సుఫియాన్ ముఖీమ్ ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, సాహిబ్జాదా ఫర్హాన్, ఉస్మాన్ తారిక్ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.టీ20 ప్రపంచకప్ 2026 కోసం ఎంపిక చేసిన పాకిస్తాన్ జట్టు..సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖ్వాజా మొహమ్మద్ నఫాయ్ (wk), మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మిర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, షదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (wk), ఉస్మాన్ తారిక్మా పని మేము చేశాం.. మిగతాదంతా ప్రభుత్వం చూసుకుంటుంది..!ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించినా, పాక్ టోర్నీలో పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ అనుమతి లేనిదే ప్రపంచకప్‌లో పాల్గొనబోమని పాక్ సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పీసీబీ, పాక్ జట్టు హెడ్ కోచ్ గత కొద్ది రోజులుగా చెబుతూనే ఉన్నారు. “మేము సెలెక్టర్లం. మా పని జట్టును ఎంపిక చేయడం. పాల్గొనడం ప్రభుత్వ నిర్ణయం” అని సెలెక్టర్లు అన్నారు.నెదర్లాండ్స్‌తో ఢీఅన్నీ కుదిరితే పాక్ ఫిబ్రవరి 7న కొలంబోలో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌తో తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దీనికి ముందు పాక్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.ఇదిలా ఉంటే, భద్రత కారణాలను సాకుగా చూపుతూ ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరకారించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు, ఇతర సిబ్బందికి అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాటు చేస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.అయినా బీసీబీ మొండి పట్టు వీడలేదు. దీంతో చేసేదేమి లేక వరల్డ్‌కప్ నుంచి బంగ్లాను ఐసీసీ తప్పించింది. అయితే ఈ వివాదం ఆరంభం నుంచి బంగ్లాకు పీసీబీ మద్దతుగా నిలుస్తోంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్ మాత్రం ఆ జట్టుకు సపోర్ట్‌గా నిలిచింది. అంతకుముందు బంగ్లా మ్యాచ్‌లను ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్దమేనని పీసీబీ ప్రకటించింది. కానీ ఐసీసీ మాత్రం పీసీబీ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి బంగ్లా దేశ్ పట్ల పీసీబీ కపట ప్రేమ ఒలకపోస్తోంది."బంగ్లాదేశ్ పట్ల ఐసీసీ అనుసరించిన తీరు సరికాదు. ఇదే విషయాన్ని నేను ఐసీసీ బోర్డు సమావేశంలో కూడా చెప్పాను. ద్వంద్వ ప్రమాణాలు పాటించకూడదు. అందరికి ఒకే న్యాయం ఉండాలి. బంగ్లాదేశ్ లాంటి ప్రధాన వాటాదారుకు అన్యాయం జరిగితే మేము సైలెంట్‌గా ఉండలేము.పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే మేం వరల్డ్ కప్‌లో ఆడటం ఆధారపడి ఉంటుంది. మా పీఎం దేశంలో లేరు. ఆయన తిరిగొచ్చాకే దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తాం. ఐసీసీ ఆదేశాలను కాకుండా మేం ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తాం" అని పీసీబీ చీఫ్ నఖ్వీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.తదనంతర పరిణామాల్లో.. టీ20 వరల్డ్‌కప్-2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బంగ్లా స్ధానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్కు అవకాశం లభించింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ బాటలోనే పాకిస్తాన్ కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది.నేపథ్యంభారత్-బంగ్లాదేశ్ మధ్య పంచాయితీ (బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు, తదనంతర పరిణామాల్లో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించడం) నేపథ్యంలో పాకిస్తాన్ జోక్యం చేసుకొని ఓవరాక్షన్ చేస్తుంది. -
ICC: బై.. బై.. బంగ్లాదేశ్.. స్కాట్లాండ్ వచ్చేసింది
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్‌కు ఉద్వాసన తప్పలేదు. భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమంటూ పంతం పట్టిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) గట్టిషాకిచ్చింది. ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ప్రస్తుత టీ20 టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు ఐసీసీ ఈ అవకాశం ఇచ్చింది.కాగా గత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడి నుంచి మొదలుఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను (Mustafizur Rahman) ఐపీఎల్ నుంచి తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను కూడా నిరవధికంగా వాయిదా వేసింది.ఈ పరిణామాల క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడలేమని బీసీబీ.. ఐసీసీకి తెలియజేసింది. భద్రతాపరమైన ముప్పులు ఉన్నందున తమ వేదికను శ్రీలంకకు మార్చాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పరిశీలనా బృందం నుంచి వివరాలు తీసుకున్న ఐసీసీ. భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ముప్పేమీలేదని తేల్చింది.మొండి వైఖరి అయితే, బీసీబీ మాత్రం మొండి వైఖరి అవలంబించింది. తాము భారత్‌లో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని పంతం పట్టింది. ఐసీసీ గడువు ఇచ్చినప్పటికీ తమ నిర్ణయం ఇదేనంటూ సవాలు విసిరినట్లుగా మాట్లాడింది. అంతేకాదు ఆఖరి ప్రయత్నంగా వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశ్రయించింది.ముందుగా హెచ్చరించినట్లుగానేతాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్సీని బీసీబీ కోరింది. అయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేకపోయింది.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఐసీసీ.. ముందుగా హెచ్చరించినట్లుగానే బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్తో భర్తీ చేసినట్లు క్రిక్‌బజ్ తన కథనంలో వెల్లడించింది. ఈ విషయం గురించి బీసీబీకి ఐసీసీ లేఖ కూడా రాసినట్లు పేర్కొంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది. ఇందుకు భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక ఈసారి ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొంటుండగా. గ్రూప్-సిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీలతో కలిసి ఉంది బంగ్లాదేశ్. ఇప్పుడు ఆ స్థానంలో స్కాట్లాండ్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు -
ఐసీసీపై ‘ఫిర్యాదు’.. బంగ్లాదేశ్‌కు మరో షాక్ తప్పదు!
టీ20 ప్రపంచకప్-2026లో తమ మ్యాచ్‌ల వేదిక మార్పు విషయంలో బంగ్లాదేశ్ ఆఖరి ప్రయత్నం కూడా బెడిసికొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇప్పటికే ఈ విషయంలో తమ వైఖరి ఏమిటో తెలిపింది. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లు, సిబ్బందికి ఎలాంటి ముప్పు లేదని.. ఇక్కడే తమ మ్యాచ్‌లు ఆడాలని స్పష్టం చేసింది.అయినప్పటికీ పంతం వీడని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తమ విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి పట్టించుకోకపోవడంతో వివాద పరిష్కారాల కమిటీ (DRC)ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశ్రయించింది. తాము భారత్‌లో ఆడాల్సిందేనంటూ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలంటూ డీఆర్సీని బీసీబీ కోరింది.అది కుదరని పనిఅయితే ఐసీసీ ఆధ్వర్యంలోనే పని చేసే డీఆర్సీ వారి విజ్ఞప్తికి స్పందించే అవకాశం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం బోర్డు డైరెక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించే అధికారం డీఆర్సీకి లేదు. ఇక్కడా తమకు సానుకూల స్పందన లభించకపోతే చివరగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్)కు వెళ్లాలని కూడా బంగ్లాదేశ్ యోచిస్తోంది.మరోవైపు.. తమ జట్టు భారత్‌లో మ్యాచ్ ఆడదంటూ తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా ఐసీసీకీ చెప్పకుండా బీసీబీ చైర్మన్ అమీనుల్ ఇస్లామ్ మీడియా ముందు ప్రకటించడం కూడా ఐసీసీకి ఆగ్రహం కలిగించింది. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే బంగ్లాదేశ్‌ను తప్పించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అండర్–19 వరల్డ్ కప్ జరుగుతున్న నమీబియాలో ఉన్న ఐసీసీ చైర్మన్ జై షా బంగ్లాదేశ్‌ను వరల్డ్ కప్ నుంచి తప్పిస్తూ స్కాట్లాండ్కు అవకాశం ఇస్తున్నట్లుగా శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్ -
మీ కెప్టెన్ హిందువు: బంగ్లాదేశ్‌కు భారత మాజీ క్రికెటర్ సలహా
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం దాదాపుగా ఖాయమైనట్లే కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మాటను లెక్కచేయకుండా పంతానికి పోయినందుకు బంగ్లా టోర్నీలో ఆడే అవకాశం కోల్పోవడం లాంఛనమే అనిపిస్తోంది. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలుగతంలో తమకు చేదోడువాదోడుగా నిలిచిన భారత్‌పై కొంతమంది బంగ్లాదేశ్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై వరుస దాడులు ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను బీసీసీఐ తప్పించింది.ఐసీసీ మాట వినని బీసీబీఈ విషయాన్ని సాకుగా చూపుతూ టీ20 ప్రపంచకప్-2026లో భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడబోడమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) రచ్చకెక్కింది. తమ ఆటగాళ్లకు అక్కడ భద్రత ఉండదంటూ కొత్తగా రాగం ఎత్తుకుంది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించింది.ఈ క్రమంలో ఐసీసీ తమ పట్ల న్యాయంగా వ్యవహరించాలని.. ఏదేమైనా తాము భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ గురువారమే తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ బీసీబీకి ఓ సలహా ఇచ్చాడు.మీ కెప్టెన్ ఓ హిందువువార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. ‘‘నిజంగా ఐసీసీకి ఇదొక పీడకలలాంటిది. చాన్నాళ్ల క్రితమే టీ20 ప్రపంచకప్ టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. టోర్నీ ఆరంభానికి సమయం కూడా ఆసన్నమైంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఇలా చేయడం సరికాదు.భారత్‌లో భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయని నేను అనుకోను. అసలు ఇక్కడ గతంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇక్కడ సెక్యూరిటీకి వచ్చిన ఇబ్బంది ఏమీలేదు. మీ కెప్టెన్ (Litton Das) ఓ హిందువు.ఈ విషయాన్ని బంగ్లాదేశ్ తమకు సానుకూలంగా మలచుకోవచ్చే. టోర్నీలో పాల్గొనడం ద్వారా ప్రస్తుతం ఇరుదేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు’’ అని అతుల్ వాసన్ బంగ్లాదేశ్‌కు హితవు పలికాడు. కాగా భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు వరల్డ్‌కప్ టోర్నీ జరుగనుంది.టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి బంగ్లాదేశ్ జట్టులిట్టన్ దాస్ (కెప్టెన్), మహ్మద్ సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఇమోన్, తౌహిద్ హృదోయ్, షమీమ్ హొస్సేన్, నూరుల్ హసన్ సోహన్, మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, మహ్మద్ షైపుద్దీన్, షోరిఫుల్ ఇస్లాం. చదవండి: భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?: బంగ్లాదేశ్ ఆరోపణలు -
భారత్‌కు మాత్రమే అవకాశం ఇస్తారా?
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తీరు మారలేదు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తాము భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లు ఆడబోమని గురువారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)ని విమర్శించాడు. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందనేలా ఆరోపణలు చేశాడు.భద్రతాపరమైన కారణాలతో వేదికలు మార్చడం గతంలో చాలాసార్లు జరిగిందని, ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లోనే ఆడేలా భారత్‌కు అనుమతి ఇచ్చారని బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లామ్ గుర్తు చేశాడు. పాక్‌లో ఆడబోమని భారత్ చెబితే..‘ఐసీసీ ఎప్పుడో 1996, 2003లో జట్లు కొన్ని వేదికల్లో ఆడటానికి ఇష్టపడక పాయింట్లు చేజార్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఎప్పటి మాటలో ఎందుకు?2025 చాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్లో ఆడబోమని భారత్ చెబితే వారి మ్యాచ్‌లను తరలించలేదా? అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికపై ఆడి, ఒకే హోటల్లో జట్టు బస చేయడం వారికి కల్పించిన ప్రత్యేక సౌకర్యం కాదా? మేం పోరాడతాంశ్రీలంక పేరుకే సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది కానీ ఒక జట్టు కోసమే (పాకిస్తాన్) హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్‌లు అక్కడ పెట్టారు. ఐసీసీ స్థాయి సంస్థ 24 గంటల గడువు ఇవ్వడం అనేది అర్థరహితం. ఈ విషయంలో మేం పోరాడతాం’ అని అమీనుల్ స్పష్టం చేశాడు. కాగా గతంలో పాకిస్తాన్లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విదేశీ జట్లు అక్కడ పర్యటించడం మానేశాయి. పాక్‌లో పరిస్థితి వేరు.. వితండవాదంఇటీవలి కాలంలో మళ్లీ పర్యటనలు మొదలుపెట్టాయి. అయితే, బీసీసీఐ మాత్రం భద్రతా కారణాలతో టీమిండియాను అక్కడకు పంపడం లేదు. అందుకే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీకి తటస్థ వేదికను ఏర్పాటు చేసింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తున్నందున శ్రీలంకలో పాక్ మ్యాచ్‌లు ఆడిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరిన నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఏమాత్రం ముప్పులేదని పరిశీలన బృందం చెప్పినా బంగ్లాదేశ్ ఇలా వితండవాదానికి దిగడం గమనార్హం. లాంఛనమేకాగా టీ20 వరల్డ్ కప్‌నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం ఇక లాంఛనంగానే కనిపిస్తోంది! ఒకరోజు సమయమిచ్చి తుది నిర్ణయం తీసుకోవాలంటూ ఐసీసీ చేసిన హెచ్చరికను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదు. భద్రతా కారణాల వల్ల తాము భారత్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పునరుద్ఘాటించారు.‘ఇది మా దేశ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని స్పష్టంగా చెప్పదల్చుకున్నాం. భద్రత విషయంలో మా భయం వాస్తవం. ఐసీసీ నుంచి మాకు ఇప్పటి వరకైతే న్యాయం దక్కలేదు. మా ఆందోళనను వారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అని నజ్రుల్ వ్యాఖ్యానించాడు.చదవండి: వరల్డ్‌కప్-2027లో అతడిని ఆడించాలి: భారత మాజీ క్రికెటర్ -
ICC: మా తుది నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్ సంచలన ప్రకటన
బంగ్లాదేశ్ పంతం వీడలేదు. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 ఆడే విషయమై తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని మరోసారి పునరుద్ఘాటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తమ విషయంలో న్యాయంగా వ్యవహరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపింది.శ్రీలంకకు మార్చాలని కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలు సాకుగా చూపుతూ.. బంగ్లాదేశ్ తమ ప్లేయర్లను భారత్‌కు పంపడానికి నిరాకరిస్తోంది. భారత్‌కు బదులు తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లాదేశ్ చెప్పినట్లు భారత్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని ఐసీసీ బుధవారం స్పష్టం చేసింది.కుండబద్దలు బద్దలు కొట్టిన ఐసీసీమరో 24 గంటల సమయం ఇస్తున్నామని.. ఒకవేళ వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగానుకుంటే.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఆడిస్తామని ఐసీసీ కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో గురువారం బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందిస్తూ.. తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాడు.తాజా సమాచారం ప్రకారం.. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లు ఆడవద్దని బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లా జాతీయ జట్టు ఆటగాళ్లు, దేశ క్రీడా, యువజన శాఖ మంత్రి ఆసిఫ్ నజ్రుల్‌తో సమావేశం అనంతరం బోర్డు తమ వైఖరిని వెల్లడించింది.నమ్మకాన్ని కోల్పోవడం లేదుఈ మేరకు మీడియా సమావేశంలో నజ్రుల్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించేందుకు మా క్రికెటర్లు ఎంతగానో కష్టపడ్డారు. అయితే, ఇండియాలో మా భద్రతపై అనుమానాలు అలాగే ఉన్నాయి. ఏవో కొన్ని పరిశీలన (ఐసీసీ)లు చేసి ముప్పు లేదనే నిర్ణయానికి రాకూడదు.ఇప్పటికీ మేము నమ్మకాన్ని కోల్పోవడం లేదు. టోర్నీకి మా జట్టు సిద్ధంగా ఉంది. ఐసీసీ మా అభ్యర్థనను మన్నించి.. న్యాయమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. మమ్మల్ని శ్రీలంకలో ఆడేందుకు అనుమతిస్తారని ఆశాభావంతో ఉన్నాము’’ అని పేర్కొన్నాడు.కచ్చితంగా ఐసీసీ వైఫల్యమేఇక బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ‘‘మేము ఐసీసీతో మరోసారి చర్చలు జరుపుతాము. వరల్డ్‌కప్‌లో ఆడాలని మాకు ఉంది. కానీ భారత్‌లో మాత్రం ఆడబోము. ఈ విషయంపై పోరాటం చేస్తాం. ఐసీసీ బోర్డు మీటింగ్‌లో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ తొలగింపు విషయం చిన్నదేమీ కాదు. మా మ్యాచ్‌ల విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయం అన్నట్లుగా వ్యవహారం ఉంది. భారత్‌లో ఆడలేమని అంటే మా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఒలింపిక్స్ వరకు ఈ క్రీడ వెళ్లింది. కానీ మేము మాత్రం ఇక్కడే ఉండిపోయాము. ఇది కచ్చితంగా ఐసీసీ వైఫల్యమే’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే! -
షాకిచ్చిన ఐసీసీ.. స్పందించిన బంగ్లాదేశ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందించాడు. ఏదో ఒక అద్భుతం జరిగి ఐసీసీ తమ పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అదే సమయంలో మరోసారి భారత్ గురించి అవాకులు చెవాకులు పేలాడు.కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్-2026లో తమ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రాబోమని బంగ్లా బోర్డు (BCB) ఐసీసీకి తెలిపింది. తమ వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని విజ్ఞప్తి చేసింది.ఆడితే ఆడండి.. లేకపోతే పొండిఈ విషయంపై చర్చించిన ఐసీసీ బుధవారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. భారత్ నుంచి మ్యాచ్‌లను తరలించడం సాధ్యం కాదని... వరల్డ్ కప్‌లో ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్ తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం గురువారం నాటికి తుది గడువు విధించింది.ఒకవేళ బంగ్లాదేశ్ తమ పంతం వీడకపోతే ఆ జట్టును వరల్డ్ కప్ నుంచి తప్పిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్ జట్టును బంగ్లాదేశ్ స్థానంలో ఆడించాలని కూడా ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో దీనికి మద్దతుగా అత్యధిక డైరెక్టర్లు ఓటు వేశారు.ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు బీసీసీఐ తరఫున దేవజిత్ సైకియా ఇందులో పాల్గొన్నారు. 15 మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరు కాగా, ఒక్క పాకిస్తాన్ మాత్రమే బంగ్లాదేశ్‌కు అండగా నిలిచింది. ఇప్పటికే బంగ్లా డిమాండ్‌కు మద్దతు ప్రకటించిన పాకిస్తాన్ తమ దేశంలో ఆ జట్టు మ్యాచ్‌లను నిర్వహిస్తామని కూడా ప్రతిపాదించింది.ఎలాంటి ప్రమాదం లేదు..అయితే ఇవన్నీ సాధ్యం కాదని ఐసీసీ కొట్టిపారేసింది. ‘భద్రతాపరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. భారత్‌లోని ఏ వేదికపైన కూడా బంగ్లాదేశ్ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ఇతర అధికారులకు ఎలాంటి ప్రమాదం లేదు.టోర్నీ చేరువైన సమయంలో షెడ్యూల్ మార్పు ఏమాత్రం సాధ్యం కాదు. భద్రతా పరమైన కారణం అంటూ ఈసారి అలా చేస్తే ఇది చెడు సాంప్రదాయానికి దారి తీస్తూ ఐసీసీ ఈవెంట్లకు చెడ్డపేరు వస్తుంది. బంగ్లా బోర్డుకు ఇప్పటికే ఇవన్నీ పూర్తిగా వివరించాం.అయితే ఎంత చెప్పినా వరల్డ్ కప్‌తో ఏమాత్రం సంబంధం లేని ఒక దేశవాళీ లీగ్‌లో జరిగిన ఘటనను చూపిస్తూ బంగ్లా తమ డిమాండ్‌ను కొనసాగించింది. ఎన్నో అంశాలను బట్టి వరల్డ్ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికలు ప్రకటిస్తాం. ఇప్పుడు ఎలాంటి మార్పులూ చేయలేం’ అని ఐసీసీ తమ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇండియా మాకు భద్రం కాదుఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందిస్తూ.. ‘‘మా ప్రభుత్వంతో చర్చించేందుకు నాకు కొంత గడువు కావాలని ఐసీసీ బోర్డును అడిగాను. చివరి అవకాశం ఇమ్మని కోరాను. ఇది సరైనదేనని వారు భావించారు. 24 నుంచి 48 గంటలలోపు మా నిర్ణయం చెప్పాలన్నారు.అయితే, ఈ విషయంలో నేను మా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టదలచుకోలేదు. ఏదేమైనా ఇండియా మాకు భద్రమైన దేశం కాదు. శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడేందుకే మేము కట్టుబడి ఉన్నాము. ఐసీసీ మా అభ్యర్థనను తిరస్కరించిందని తెలుసు.అద్భుతం జరుగుతుందిప్రభుత్వంతో చర్చించిన తర్వాతే మా తుది నిర్ణయం వెల్లడిస్తాం. ఐసీసీ మా విషయంలో అద్భుతం చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్ టోర్నీలో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు!.. బంగ్లాదేశ్ ఆటగాళ్లంతా ఐసీసీ ఈవెంట్లో ఆడాలని కోరుకుంటున్నారు.బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా బంగ్లా క్రికెట్ జట్టు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనాలని ఆశిస్తోంది. అయితే, ముందుగా చెప్పినట్లు భారత్ మా ఆటగాళ్లకు సురక్షిత ప్రదేశం కాదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’ అంటూ ఓవైపు వరల్డ్‌కప్ టోర్నీలో ఆడాలనే కోరిక ఉందంటూనే.. మరోవైపు భారత్ గురించి అతిగా మాట్లాడాడు. కాగా అంతకుముందు తమ అభ్యర్థనను తిరస్కరిస్తే వరల్డ్‌కప్ బహిష్కరిస్తామంటూ బంగ్లా హెచ్చులకు పోయింది. ఇప్పుడు మాత్రం తమకు ఆడాలని ఉందంటూ తమదంతా మేకపోతు గాంభీర్యమేనని నిరూపించుకుంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికలుగా ప్రపంచకప్-2026 టోర్నీ జరుగనుంది. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్ -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. బీసీబీ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ
భారత్‌తో నెలకొన్న రాజకీయ ఉద్రికత్తల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్ మ్యాచ్‌ల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో పునఃపరిశీలనలు ఉండవని తేల్చి చెప్పింది.ఇవాళ (జనవరి 21) జరిగిన అత్యవసర బోర్డు సమావేశంలో ఓటింగ్ ద్వారా ఈమేరకు నిర్ణయించింది. మొత్తం 16 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా.. కేవలం ఇద్దరు మాత్రమే బంగ్లాదేశ్ అభ్యర్థనకు మద్దతు ఇచ్చారు. మిగతా సభ్యులు వ్యతిరేకించారు.భరోసా ఇచ్చినా..!భద్రతను సాకుగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ జట్టుకు ఐసీసీ పూర్తి భరోసా ఇచ్చింది. అయినా ఆ దేశ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేస్తుంది. తాజాగా జరిగిన సమావేశంలో స్వతంత్ర సంస్థలు చేసిన భద్రతా అంచనాలు, వేదికల వారీగా రూపొందించిన భద్రతా ప్రణాళికలు, ఆతిథ్య దేశం ఇచ్చిన హామీలన్నిటినీ ఐసీసీ క్షుణ్ణంగా పరిశీలించి, బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది.ముస్తాఫిజుర్ ఉదంతంతో సంబంధమే లేదు భారత్‌లో ఆడకుండా ఉండటానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చూపుతున్న సాకులకు, ముస్తాఫిజుర్ రహ్మాన్ ఉదంతంతో సంబంధమే లేదని ఐసీసీ పేర్కొంది. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడాన్ని భద్రతా సమస్యతో అనుసంధానం చేయడం సరి కాదని హితవు పలికింది. స్కాట్లాండ్కు అవకాశం ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే, వారి స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేస్తుంది. ప్రస్తుతం స్కాట్లాండ్ టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది. ప్రపంచకప్‌కు అర్హత సాధించని జట్లలో అత్యధిక ర్యాంక్ కలిగిన జట్టుగా స్కాట్లాండ్ ప్రపంచకప్‌కు ఎంపికవుతుంది.మరో 24 గంటల డెడ్లైన్ఇది జరగకుండా ఉండాలంటే బంగ్లాదేశ్ మరో 24 గంటల్లో ఏ విషయం తేల్చాలని ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈలోపు కూడా బంగ్లాదేశ్ ఏ విషయం తేల్చకపోతే డీఫాల్ట్‌గా స్కాట్లాండ్ ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్.. వెస్టిండీస్, ఇంగ్లండ్, నేపాల్, ఇటలీ జట్లతో కలిసి గ్రూప్-సిలో ఉంది. బంగ్లాదేశ్ తొలి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో ఆడి, చివరి గ్రూప్ మ్యాచ్‌ను ముంబైలో ఆడేలా షెడ్యూల్ ఉంది. -
భారత్‌లో మ్యాచ్‌లు.. బంగ్లాదేశ్ కెప్టెన్ స్పందన వైరల్
బంగ్లాదేశ్ మొండిపట్టు వీడటం లేదు. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లో ఆడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేసింది. తమ ఆటగాళ్ల భద్రతకు కట్టుబడి ఉన్నామని.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఒత్తిళ్లకు తలొగ్గమంటూ మరోసారి ఓవరాక్షన్ చేసింది.బంగ్లా బదులు ఆ జట్టుఫలితంగా వరల్డ్‌కప్ టోర్నీలో బంగ్లాదేశ్ ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. ఇప్పటికే షెడ్యూల్, వేదికలు ఖరారు కావడం.. అందుకు అనుగుణంగా ఆయా జట్ల విమానాల టికెట్లు బుక్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను ఐసీసీ శ్రీలంకకు మార్చే అవకాశం లేనట్లే కనిపిస్తోంది.ఒకవేళ బంగ్లాదేశ్ ఇలాగే పట్టుదలకు పోతే.. ఆ జట్టుకు బదులు ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ లిటన్ దాస్ (Litton Das) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదంలో తలదూరిస్తే తాను చిక్కుల్లో పడతానని ఆందోళన వ్యక్తం చేశాడు.దయచేసి అడగవద్దుబంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌తో బిజీగా ఉన్న లిటన్ దాస్ మీడియాతో మాట్లాడగా.. ‘‘మీరు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడతారా? లేదా?’’ అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నా వరకైతే ఈ విషయంపై స్పష్టత లేదు. జట్టులోని ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే.ప్రస్తుతం బంగ్లాదేశ్ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. తదుపరి మీరు ఏ ప్రశ్న అడుగబోతున్నారో నాకు తెలుసు. అది నాకు అంత సురక్షితమైనది కాదు. కాబట్టి సమాధానం చెప్పలేను’’ అని లిటన్ దాస్ పేర్కొన్నాడు. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.బీసీబీ వైఖరితో కష్టాల్లోకి ఆటగాళ్లుఈ నేపథ్యంలోనే భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు భద్రత అనే సాకు చూపి బంగ్లాదేశ్ నిరాకరిస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వైఖరి కారణంగా ఆటగాళ్లకు ఇప్పటికే కష్టాలు మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లా ప్లేయర్లలో చాలా మందికి బ్యాట్ స్పాన్సర్లుగా భారత కంపెనీలు ఉన్నాయి. బీసీబీ వైఖరితో ఆ కంపెనీలు తమ కాంట్రాక్టులు రద్దు చేసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.మరోవైపు.. బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్- 2026 టోర్నీలో ఆడకపోతే దేశానికి వచ్చే నష్టమేమీలేదని.. ఆటగాళ్లే నష్టపోతారంటూ బీసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు.. ఐసీసీ నుంచే ప్రధాన ఆదాయం వస్తున్నందున ఈ విషయంలో బీసీబీ ఆచితూచి వ్యవహరించాలని కోరినందుకు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌పై బీసీబీ అధికారి నజ్ముల్ ఇస్లాం ‘భారత ఏజెంట్’ అనే ముద్ర వేశాడు.ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ క్రికెటర్ల వెల్ఫేర్ అసోసియేషన్ నజ్ముల్‌ను సస్పెండ్ చేసేదాకా వదిలిపెట్టలేదు. ఇలా బోర్డు తీరుతో ఆటగాళ్లు వ్యక్తిగతంగా మాటలు పడుతూ.. ఆర్థికంగానూ నష్టపోయే ప్రమాదంలో పడ్డారు. అందుకే లిటన్ దాస్ సైతం ప్రపంచకప్ టోర్నీ ఆడే విషయమై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశాడు.చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టీ20.. మూడో స్థానంలో వచ్చేది అతడే..! -
T20 WC 2026: మా నిర్ణయం ఇదే: బంగ్లాదేశ్
భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లను ఆడబోమని బంగ్లాదేశ్ మరోసారి తెలిపింది. టోర్నీలో ఆడే విషయమై బుధవారం లోగా నిర్ణయాన్ని ప్రకటించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ (Asif Nazrul) మంగళవారం వెల్లడించారు. ఒక వేళ భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తే... ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్ను వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసే అవకాశాలున్నాయి. మా బదులు స్కాట్లాండ్ ఆడుతుందా?‘మా స్థానాన్ని స్కాట్లాండ్ భర్తీ చేస్తుందని తెలియదు. భారత క్రికెట్ బోర్డు ఒత్తిడికి తలొగ్గి... ఐసీసీ మాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తే మేము అంగీకరించము. గతంలో భారత్‌లో ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరిస్తే... వారి మ్యాచ్‌ల వేదికలను మార్చారు. మేం కూడా అదే కోరుతున్నాం’ అని ఆసిఫ్ అన్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుతం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో... భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు ఆ జట్టు నిరాకరిస్తోంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు గ్రూప్ దశ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబైలో ఆడాల్సి ఉంది. ఇటీవల ఐసీసీతో జరిగిన భేటీలో తమ మ్యాచ్‌లను మార్చాలని బీసీబీ కోరింది. స్పందించని ఐసీసీగ్రూప్ ‘బి’లో ఉన్న ఐర్లాండ్ జట్టు లీగ్ దశలోని మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగానే ఆడనుండగా... తమ జట్టును గ్రూప్ ‘బి’లో వేసి తమ స్థానంలో ఐర్లాండ్‌కు అవకాశం ఇవ్వాలని కోరింది. అయితే దీనిపై ఐసీసీ స్పందించలేదు. వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లండ్, నేపాల్‌తో కలిసి బంగ్లాదేశ్ గ్రూప్ ‘సి’లో ఉండగా... శ్రీలంక, ఆస్ట్రేలియా, ఓమన్, జింబాబ్వేతో కలిసి ఐర్లాండ్ గ్రూప్ ‘బి’లో ఉంది. చదవండి: న్యూజిలాండ్‌తో తొలి టీ20.. మూడో స్థానంలో వచ్చేది అతడే..! -
అబ్బే అదేం లేదు!.. మాట మార్చిన పాక్!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆడే విషయమై బంగ్లాదేశ్ ఇంత వరకు తమ నిర్ణయాన్ని స్పష్టం చేయలేదు. ఈ అంశంలో బుధవారం (జనవరి 21) వరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తమ వైఖరి ఏమిటో చెప్పాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది.ముదిరిన వివాదంకాగా భారత్- బంగ్లాదేశ్ దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. భారత్‌పై బంగ్లా నేతలు అవాకులు, చెవాకులు పేలడం.. ఆ దేశంలో మైనారిటీ హిందువులపై దాడులు జరగడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తొలగించింది.దీనిని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ బోర్డు.. ప్రపంచకప్ టోర్నీ ఆడేందుకు భారత్‌కు రాలేమని.. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ కొత్తరాగం ఎత్తుకుంది. తాము ఆడే మ్యాచ్‌లను మరో వేదికైన శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. కుదరదుఅయితే, ఇప్పటికే భారత్- శ్రీలంకలో జరిగే మ్యాచ్‌లకు ఆయా జట్లు టికెట్లు బుక్ చేసుకోవడం, టోర్నీ ఆరంభానికి తక్కువ సమయం ఉన్నందున బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చినట్లు సమాచారం.డెడ్లైన్అయినా సరే బంగ్లాదేశ్ మాత్రం తమ మొండి వైఖరి వీడటం లేదు. ఈ నేపథ్యంలోనే కఠిన చర్యలకు ఉపక్రమించేందుకు సంకల్పించిన ఐసీసీ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తలదూర్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. పాక్ మీడియా కథనాల ప్రకారం..బంగ్లాదేశ్ అభ్యర్థనను ఐసీసీ గనుక మన్నించకపోతే.. తాము సైతం టోర్నీ నుంచి వైదొలగాలని పాక్ బోర్డు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఐసీసీ వైఖరిని గట్టిగా వ్యతిరేకించేందుకు పాక్ సిద్ధమైనట్లు తెలిసింది. అయితే, పీసీబీ వర్గాలు తాజాగా ఈ విషయంపై స్పందించాయి.అబ్బే అదేం లేదు.. మాకేం అవసరంరెవ్స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. ‘‘అబ్బే అదేం లేదు. బంగ్లాదేశ్ విషయంలో అసలు పీసీబీ ఎలాంటి స్టాండ్ తీసుకోలేదు. అలా చేయడానికి పాకిస్తాన్‌కు అధికారం కూడా లేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం పాకిస్తాన్ ఇప్పటికే తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడేందుకు సిద్ధమైంది. మరి అలాంటపుడు మాకు వచ్చిన ఇబ్బంది ఏముంది?..తటస్థ వేదికలపైనే భారత్- పాక్ మ్యాచ్లుబంగ్లాదేశ్- బీసీసీఐ- ఐసీసీ మధ్య జరుగుతున్న విషయాలకు ఆజ్యం పోసేలా కొంతమంది కావాలని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు’’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదు.తటస్థ వేదికైన దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లు ఆడి చాంపియన్‌గా నిలిచింది. ఐసీసీ చెప్పిన ప్రకారం చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు తటస్థ వేదికను ఏర్పాటు చేసినట్లుగానే.. ఈసారి టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో పాక్ మ్యాచ్‌లకు శ్రీలంకను వేదికగా ఖరారు చేశారు. అంతకుముందు మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నీ భారత్‌లో జరుగగా.. పాక్ జట్టు తమ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7- మార్చి8 వరకు భారత్-శ్రీలంక వేదికలుగా టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీ జరుగనుంది.చదవండి: బంగ్లాదేశ్ T20 WC 2026లో ఆడకపోతే స్కాట్లాండ్కు అవకాశం! -
అలా అయితే మేమూ ఆడం.. బంగ్లాదేశ్‌కు వంత పాడుతున్న పాక్
2026 టీ20 ప్రపంచకప్‌కు ముందు ఆసియా క్రికెట్లో మరోసారి రాజకీయ-క్రీడా ఉద్రిక్తతలు పెరిగాయి. భద్రత కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) భారత్‌లో జరగబోయే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ఐసీసీ పలు సమీక్షలు జరిపిన అనంతరం భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని బీసీబీకి హామీ ఇచ్చింది. అయినా వెనక్కు తగ్గని బంగ్లా క్రికెట్ బోర్డు, భారత్‌లో పర్యటించేదే లేదంటూ భీష్మించుకు కూర్చుంది. దీంతో ఐసీసీ వేరే ప్లాన్స్ సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తే స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయ జట్టుగా ప్రపంచకప్‌లో ఆడించాలని కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. బంగ్లాదేశ్ ఏ విషయం తేల్చుకునేందుకు ఐసీసీ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తుంది. ఈ నెల 21 లోగా ఏ విషయం తేల్చాలని ఐసీసీ దూత బీసీబీకి సందేశం పంపినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో.. ఐసీసీ తమ డిమాండ్‌ను పరిష్కరించకపోగా, భారత్‌లో ఆడేందుకు ఒత్తిడి తెస్తుందని బీసీబీ అంతర్జాతీయ వేదికపై గగ్గోలు పెడుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సాయాన్ని కోరినట్లు సమాచారం. బీసీబీ అభ్యర్థన కోసం ఎదురుచూస్తూ ఉండిన పీసీబీ.. అడగటమే ఆలస్యమన్నట్లు రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌పై లేని ప్రేమను ఒలకబోస్తూ.. ఐసీసీ బీసీబీపై ఒత్తిడి పెంచితే, తాము కూడా ప్రపంచకప్ ఆడబోమని ఓవరాక్షన్ చేస్తుంది. బంగ్లాదేశ్ అభ్యర్థనలో న్యాయం ఉందని, ఐసీసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పెద్దన్నపాత్ర పోషించే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో పాకిస్తాన్ రాజకీయ నాయకులు కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తుంది.తాజాగా ఈ అంశంపై పాక్ క్రికెట్ బోర్డు, ఆ దేశ ముఖ్య రాజకీయ నాయకులు ఓ అత్యవసర సమావేశాన్ని నిర్వహించుకున్నట్లు సమాచారం. ఇందులో ఐసీసీ, బీసీసీఐకి వ్యతిరేకంగా.. బీసీబీ అనుకూలంగా చాలా తీర్మానాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.ఏ జట్టూ ఒత్తిడి లేదా బెదిరింపులకు గురి కాకూదు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లు భద్రతా వాతావరణంలో జరగాలి. అవసరమైతే బంగ్లాదేశ్ మ్యాచ్‌లను పాకిస్తాన్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీబీ తీర్మానించినట్లు సమాచారం. పాకిస్తాన్ ఎంట్రీతో ప్రపంచకప్‌లో బంగ్లా భవితవ్యం ఏ మలుపు తీసుకుంటోదనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.కాగా, గత కొంతకాలంగా బంగ్లాదేశ్-భారత్ మధ్య రాజకీయ ఉద్రిక్తలు నెలకొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ విడుదల చేయడంతో ఈ ఉద్రిక్తలు క్రికెట్‌కు పాకాయి. బంగ్లాలో హిందువులపై దాడులు పెరిగిపోతుండడంతో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకుంది.దీన్ని ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. తమ జట్టును వరల్డ్‌కప్ కోసం భారత్ పంపబోమని, వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో బ్యాన్ చేసింది.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. -
క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు..?
ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ 2026లో భాగంగా నిన్న (జనవరి 17) భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆసక్తికర సమరం జరిగింది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండా, గతంలో జరిగిన భారత్-పాక్ వివాదాస్పద 'నో హ్యాండ్ షేక్' ఉదంతాన్ని గుర్తు చేశారు.తాజా ఎపిసోడ్ తర్వాత క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టడం ఎంత వరకు సబబు అన్న ప్రశ్న మరోసారి ఉత్పన్నమైంది. క్రికెట్ సర్కిల్స్‌లో ఈ అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. మెజార్టీ శాతం క్రీడల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. కొందరేమో ఈ అంశానికి మద్దతిస్తున్నారు. ఒక దేశం పట్ల మరో దేశం క్రూరంగా ప్రవర్తిస్తే ఇలాగే బుద్ది చెప్పాలని అంటున్నారు.ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, క్రీడలను రాజకీయాలతో ముడి పెట్టి, నో షేక్ హ్యాండ్ లాంటి ఉదంతాలకు తావిస్తే, దేశాల మధ్య ఉద్రిక్తతల మరింత పెరుగుతాయి కానీ, ఎలాంటి ప్రజాప్రయోజనాలు ఉండవు. వాస్తవానికి క్రీడలు దేశాల మధ్య స్నేహ వారుధులుగా ఉంటాయి. అలాంటి వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు.ఆటగాళ్లు సైతం ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రవర్తించాలి. క్రీడలకు సంబంధం లేని విషయాలు మాకెందుకులే అనుకోవాలి. రాజకీయాలు చూసుకునే బాధ్యత నాయకులకు వదిలి పెట్టి, మైదానంలో క్రీడాస్పూర్తితో వ్యవహరించాలి. నో హ్యాండ్ షేక్ లాంటి ఉదంతాలకు తావివ్వకుండా హుందాగా ప్రవర్తించాలి.క్రీడల్లో హ్యాండ్‌షేక్ ఇవ్వడమనేది కేవలం ఫార్మాలిటీ మాత్రమే కాదు. ఇది ఆటగాళ్ల మధ్య పరస్పర గౌరవం. దేశాల మధ్య పోటీ జరిగేటప్పుడు సామరస్యతను ప్రతిబింబించే సంకేతం. ఇలాంటి వాటిలో రాజకీయాలకు అస్సలు తావివ్వకూడదు. ఈ విషయాన్ని ఆటగాళ్లు గమనించాలి. ప్రత్యర్దికి హ్యాండ్ షేక్ నిరాకరిస్తే.. అంతర్జాతీయ సమాజంలో వాళ్లే చిన్నచూపుకు గురవుతారు. అప్పటిదాకా వారిపై దేశాలకతీతంగా ఉండే అభిమానం పలచనవుతుంది.క్రికెట్‌కు జెంటిలెమన్ గేమ్ అనే పేరుంది. కాబట్టి క్రికెటర్లు జెంటిల్మెన్లలా ప్రవర్తించి క్రీడ గౌరవాన్ని పెంచాలి. దేశాల మధ్య సమస్యలు ఉన్నప్పుడు పరిణితి ప్రదర్శించవచ్చు. గతంలో ఏదైనా సమస్య కాని, అసంతృప్తి కాని ఉంటే, ఆటగాళ్లు ఆర్మ్ బ్యాండ్లు ధరించే వారు. దేశాల మధ్య ఉద్రిక్తతల విషయంలోనూ ఆటగాళ్లు ఇలా ప్రవర్తించవచ్చు. తమ దేశం పట్ల ప్రత్యర్ది దేశం అమానవీయంగా ప్రవర్తిస్తుందని అనుకున్నప్పుడు ఆర్మ్ బ్యాండ్లు ధరించి నిరసన వ్యక్తం చేయవచ్చు.కానీ హ్యాండ్ షేక్ ఇవ్వకుండా ఒకరినొకరు అవమానించుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల అభిమానుల్లోనే కాకుండా సహచర ఆటగాళ్లలోనూ అసహనం పెరుగుతుంది. ఇటీవల ఓ విండీస్ టీ20 దిగ్గజం భారత్-పాక్ మధ్య నో హ్యాండ్ షేక్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు అతను భారత ఆటగాళ్లనే బాధ్యులుగా భావిస్తున్నాడు.ఇందులో అతని తప్పేమీ లేదు. ఎందుకంటే, భారత్-పాక్ మధ్య నో హ్యాండ్ షేక్ ఉదంతాన్ని గమనించిన ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. గతేడాది ఆసియా కప్ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సమయంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు హ్యాండ్ షేక్ నిరాకరించాడు. మ్యాచ్ అనంతరం కూడా ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఈ ఉదంతం తర్వాత భారతీయుల్లో సూర్యకుమార్‌పై రెస్పెక్ట్ మరింత పెరిగింది. కానీ, ఓ క్రీడాకారుడిగా అంతర్జాతీయ సమాజంలో తన మర్యాదను పలచన చేసుకున్నాడు. ఏది ఏమైనా నో హ్యాండ్ షేక్ లాంటి ఉదంతాలు క్రీడల ప్రతిష్టను దిగజారుస్తాయే కానీ, గౌరవాన్ని పెంచవు. ఈ విషయాన్ని క్రీడాలోకమంతా గుర్తు పెట్టుకోవాలి. -
విహాన్ విజృంభణ
బులావాయో (జింబాబ్వే): అండర్–19 ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై అలవోక విజయం సాధించిన ఆయుశ్ మాత్రే సారథ్యంలోని యువ భారత జట్టు... రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం జరిగిన పోరులో భారత్ 18 పరుగుల తేడాతో (డక్‌వర్త్–లూయీస్ పద్ధతిలో) బంగ్లాదేశ్‌పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7), హర్వంశ్ పంగలియా (2) విఫలమైనా... యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (67 బంతుల్లో 72; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అభిజ్ఞాన్ కుందు (112 బంతుల్లో 80; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. ఒకవైపు వరుస వికెట్లు పడుతున్నా... వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ చక్కటి పోరాటం కనబర్చారు. ఫలితంగా యంగ్ ఇండియా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. గంటకు పైగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలుత భారత ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహద్ 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో మ్యాచ్‌కు మరోసారి వర్షం అడ్డుపడింది. దీంతో బంగ్లా లక్ష్యాన్ని 29 ఓవర్లలో 165గా నిర్ణయించారు. ఛేదనలో బంగ్లా 28.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అజీజుల్ హకీమ్ (72 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో పోరాడగా... మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఒక దశలో 106/2తో పటిష్ట స్థితిలో ఉన్న బంగ్లాదేశ్... భారత బౌలర్ల జోరుతో మరో 40 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విహాన్ మల్హోత్రా 4 వికెట్లతో సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్‌లో ఈ నెల 26న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.స్కోరు వివరాలు భారత అండర్–19 ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) కలామ్ (బి) ఫహద్ 6; వైభవ్ (సి) ఫహద్ (బి) ఇక్బాల్ 72; వేదాంత్ (సి) రిఫత్ (బి) ఫహద్ 0; విహాన్ (సి) అబ్రార్ (బి) అజీజుల్ 7; అభిజ్ఞాన్ (సి) ఫరీద్ (బి) ఫహద్ 80; హర్వంశ్ (సి) రిఫత్ (బి) ఇక్బాల్ 2; కనిష్క్ (సి) (సబ్) అబ్దుల్లా (బి) అజీజుల్ 28; అంబరీష్ (సి) ఫరీద్ (బి) పర్వేజ్ 5; ఖిలాన్ (సి) ఫరీద్ (బి) ఫహద్ 8; హెనిల్ (నాటౌట్) 7; దీపేశ్ (సి) రిజాన్ (బి) ఫహద్ 11; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 238. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–53, 4–115, 5–119, 6–173, 7–194, 8–208, 9–224, 10–238. బౌలింగ్: అల్ ఫహద్ 9.2–1–38–5; ఇక్బాల్ 8–1–45–2; పర్వేజ్ 10–1–46–1; అజీజుల్ 10–1–42–2; రిజాన్ 8–0–43–0; సాద్ ఇస్లామ్ 2.2–0–18–0; బషీర్ 1–0–6–0. బంగ్లాదేశ్ అండర్–19 ఇన్నింగ్స్: జవాద్ అబ్రార్ (సి) హెనిల్ (బి) దీపేశ్ 5; రిఫత్ (సి) అభిజ్ఞాన్ (బి) కనిష్క్ 37; అజీజుల్ (సి) కనిష్క్ (బి) ఖిలాన్ 51; కలామ్ (సి అండ్ బి) విహాన్ 15; పర్వేజ్ (సి) కనిష్క్ (బి) విహాన్ 7; రిజాన్ (సి) హెనిల్ (బి) విహాన్ 15; బషీర్ (సి) వైభవ్ (బి) విహాన్ 2; ఫరీద్ (సి) దీపేశ్ (బి) ఖిలాన్ 1; ఫహద్ (రనౌట్) 0; ఇక్బాల్ (సి) ఆయుశ్ (బి) హెనిల్ 2; ఇస్లామ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (28.3 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–6, 2–62, 3–106, 4–124, 5–126, 6–129, 7–138, 8–143, 9–144, 10–146. బౌలింగ్: దీపేశ్ 4–0–27–1; హెనిల్ 4.3–1–17–1; అంబరీష్ 3–0–18–0; కనిష్క్ 6–0–22–1; ఖిలాన్ 6–0–35–2; ఆయుశ్ 1–0–7–0; విహాన్ 4–0–14–4. -
బంగ్లాదేశ్‌పై భారత్ విజయం
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత్ జట్టు 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ టీమ్‌పై విజయం సాధించింది. సవరించిన 165 పరుగుల (29 ఓవర్లలో) లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ కుర్రాళ్ల టీమ్ తడబడింది. 146 పరుగులకు ఆలౌటైంది. విహాన్ మల్హోత్రా 14 పరుగులకు 4 వికెట్లు తీశాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 238 పరుగులు చేసింది. 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ 67 బంతుల్లో 72 పరుగులు చేశాడు. అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. యూత్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీని అధిగమించాడు. 17 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ అభిజ్ఞాన్ కుండు 80 పరుగులతో రాణించాడు. బంగ్లాదేశ్ తరఫున పేసర్ అల్ ఫహద్ ఐదు వికెట్లు తీశాడు. -
భారత్- బంగ్లా మ్యాచ్‌లో 'నో హ్యాండ్ షేక్'
నో హ్యాండ్ షేక్.. ఈ వివాదం గతేడాది క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆసియాకప్-2025 సందర్భంగా భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పెహల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు టీమిండియా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ ఫిర్యాదు చేయడం, పీసీబీ చీఫ్ మోహ్షిన్ నఖ్వీ చేతుల మీదగా భారత్ విన్నింగ్ ట్రోఫీని తీసుకోకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా మరోసారి ఇప్పుడు అదే సీన్ రీపీట్ అయింది. కానీ ఈసారి ప్రత్యర్ధి మారింది.ఏమి జరిగిందంటే?అండర్-19 ప్రపంచకప్ 2026లో బులవాయో క్రికెట్ క్లబ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. అయితే టాస్ భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ ఒకరికొకరు కనీసం చూసుకోలేదు. టాస్ గెలిచి బౌలింగ్ బంగ్లా బౌలింగ్ ఎంచుకున్న తర్వాత ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేసుకోకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా భారత్-బంగ్లాదేశ్ మధ్య గత కొంత కాలంగా దౌత్యపర్యమైన ఉద్రిక్తలు నెలకొన్నాయి.మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించిన మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై అక్కడి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు భారత్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటామని వ్యాఖ్యానించడం తీవ్ర దూమారం రేపింది. అంతేకాకుండా బంగ్లాలో హిందువలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతుండంతో రెండు పొరుగు దేశాల మధ్య వైర్యం తీవ్రస్థాయికి చేరుకుంది.అయితే ఈ రాజకీయ విభేదాల ప్రభావం క్రీడలపై కూడా పడింది. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి బీసీసీఐ తప్పించింది. అంతేకాకుండా 2026లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనను కూడా బీసీసీఐ వాయిదా వేసింది.దీంతో ఘోర అవమానంగా భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. భద్రత కారణాల దృష్ట్యా తమ జట్టును టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు పంపబోమని మొండి పట్టుతో ఉంది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ పరిస్థితుల కారణంగానే ఇరు జట్ల కెప్టెన్లు కరాచలానికి నిరాకరించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! -
జోరు మీదున్న భారత కుర్రాళ్లు
బులవాయో: అండర్–19 వరల్డ్ కప్‌లో ఐదు సార్లు చాంపియన్ భారత జట్టు మరో టైటిల్ వేటలో తమ జోరు కొనసాగించేందుకు రెండో మ్యాచ్ బరిలోకి దిగుతోంది. నేడు (శనివారం) జరిగే గ్రూప్ ‘బి’ పోరులో బంగ్లాదేశ్ అండర్–19తో భారత కుర్రాళ్లు తలపడతారు. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌ను నిలువరించడం బంగ్లాకు కూడా కష్టమే. కెపె్టన్ ఆయుశ్ మాత్రే, విధ్వంసక బ్యాటర్ వైభవ్ సూర్యవంశీలతో ఓపెనింగ్ బలంగా ఉండగా వేదాంత్, విహాన్ మల్హోత్రాలు కీలక బ్యాటర్లు. మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకునే అభిజ్ఞాన్ కుందు మిడిలార్డర్లో జట్టు బలం. దీపేశ్, హెనిల్, ఖిలాన్, అంబరీశ్‌లతో జట్టు బౌలింగ్ కూడా పదునుగా ఉంది. గత ఏడాది కాలంగా మన అండర్–19 టీమ్ అద్భుత ఫామ్‌లో ఉంది. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై సిరీస్‌లు నెగ్గడంతో పాటు ఆసియా కప్‌లో కూడా జట్టు ఫైనల్ చేరింది. గత 17 మ్యాచ్‌లలో భారత్ 14 గెలిచింది. తొలి మ్యాచ్‌లో అమెరికాను భారత్ చిత్తు చేయగా...టోర్నీలో బంగ్లాకు ఇదే తొలి మ్యాచ్. బంగ్లా టీమ్‌లో కెపె్టన్ అజీజుల్ హకీమ్ మినహా మిగతావారికి పెద్దగా అనుభవం లేదు. హకీమ్‌తో పాటు రెండేళ్ల క్రితం వరల్డ్ కప్‌లోనూ రాణించిన జవాద్ అబ్రార్‌ల, కలీమ్ సిద్దిఖీలపై బ్యాటింగ్ భారం ఉండగా... జింబాబ్వేలో పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై తమ బౌలర్లు ఇక్బాల్ హుస్సేన్, అల్ ఫహద్ రాణిస్తారని బంగ్లా ఆశిస్తోంది. సమీయుల్ బషర్ ప్రధాన స్పిన్నర్. భారత్ గెలుపు బోణీ... అండర్–19 వరల్డ్ కప్‌ను భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. గురువారం జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ)ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అమెరికా 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. నితీశ్ సూదిని (52 బంతుల్లో 36; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెనిల్ పటేల్ (5/16) ఐదు వికెట్లు తీశాడు. అనంతరం పదే పదే వాన అంతరాయం కలిగించడంతో భారత్ ల్యన్ని డక్‌వర్త్ – లూయీస్ ప్రకారం 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 17.2 ఓవర్లలో 4 వికెట్లకు 99 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (19), వైభవ్ సూర్యవంశీ (2) విఫలమైనా... అభిజ్ఞాన్ కుందు (41 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించాడు. -
ఐసీసీపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయీద్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేని ఐసీసీ ఉనికిలో ఉండి లాభం లేదన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తోందని ఆరోపించాడు.అతిపెద్ద మార్కెట్ క్రికెట్ ప్రయోజనాలకు పెద్ద పీట వేయలేని ఐసీసీ తన కార్యకలాపాలు ఆపేస్తే మంచిదంటూ సయీద్ అజ్మల్ (Saeed Ajmal) అతి చేశాడు. కాగా ప్రపంచంలోని క్రికెట్ బోర్డులన్నింటిలో బీసీసీఐ సంపన్న బోర్డు అన్న విషయం తెలిసిందే. భారత్‌లో మతంగా భావించే క్రికెట్‌కు ఉన్న ఆదరణే ఇందుకు కారణం.ఐపీఎల్ ప్రవేశపెట్టిన తర్వాత బీసీసీఐ ఆదాయం గణనీయంగా పెరిగింది. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న మార్కెట్ దృష్ట్యా బీసీసీఐకి ఐసీసీ నుంచి రెవెన్యూ భారీ మొత్తంలో అందుతుంది. ఇక ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా ఉన్నారు.శ్రీలంక క్రికెట్ జట్టుపై గతంలో ఉగ్రదాడిఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో ఇప్పటికే క్రికెటర్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. 2009లో గడాఫీ స్టేడియం నుంచి శ్రీలంక క్రికెట్ జట్టు బస్సులో వెళ్తున్న వేళ 12 మంది ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కొంతమంది అధికారులు మరణించగా.. ఆరుగురు శ్రీలంక క్రికెటర్లు గాయాలపాలయ్యారు. కెప్టెన్ మహేళ జయవర్ధనే సహా కుమార్ సంగక్కర ఈ జాబితాలో ఉన్నారు.పాకిస్తాన్‌కు చెందిన అహ్సాన్ రజా అనే అంపైర్ చచ్చిబతికాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా చాలాకాలం వరకు విదేశీ జట్లు అక్కడ పర్యటించలేదు. కొంతకాలం క్రితం నుంచే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక వంటి జట్లు మళ్లీ పాక్ పర్యటన మొదలుపెట్టాయి.భద్రతా కారణాల దృష్ట్యాఇక దాయాది దేశంలో ఉగ్రదాడుల భయంతో భద్రతా కారణాల దృష్ట్యా భారత్ టీమిండియాను అక్కడికి పంపడం లేదు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే దాయాదులు తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాక్ ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా అక్కడికి వెళ్లలేదు.ఐసీసీ నిర్ణయంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడి ట్రోఫీ గెలుచుకుంది. మరోవైపు ఆతిథ్య పాక్ చెత్త ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ టోర్నీలో పాక్ ఆటగాళ్లతో కరచాలనానికీ టీమిండియా నిరాకరించింది.ఇదిలా ఉంటే.. తాజాగా బంగ్లాదేశ్ కూడా భారత్‌తో కయ్యానికి కాలుదువ్వడం.. మైనారిటీలపై దాడులు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్‌ను తొలగించగా.. టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని బంగ్లాదేశ్ అంటోంది. భద్రతా కారణాలు అంటూ ఓవరాక్షన్ చేస్తోంది. ఈ పరిణామాల క్రమంలో పాక్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బీసీసీఐపై అక్కసు వెళ్లగక్కాడు.ఎలాంటి లాజిక్ లేదు.. కొంచమైనా బుద్ధి ఉందా?‘‘ఐసీసీ నిర్ణయాలు తీసుకునేందుకు ఇండియన్ బోర్డుపై ఆధారపడితే.. దాని ఉనికి ఉండి కూడా వృథానే. పాకిస్తాన్లో ఆడేందుకు భారత జట్టును పంపకపోవడంలో ఎలాంటి లాజిక్ లేదు.ఐసీసీ మాత్రం ఈ విషయంలో నిస్సహాయతను వ్యక్తం చేసింది. భారతీయులు ఐసీసీపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు’’ అని సయీద్ అజ్మల్ అన్నాడు. గతంలో శ్రీలంక జట్టుపై దాడి... తాజాగా భారత్‌లో పహల్గామ్ ఉగ్రదాడి వంటి ఘటనల తర్వాత కూడా అజ్మల్ టీమిండియా తమ దేశానికి రాకపోవడాన్ని ప్రస్తావించడాన్ని భారత జట్టు అభిమానులు తప్పుబడుతున్నారు. ‘కొంచమైనా బుద్ధి ఉందా?’’ అంటూ చురకలు అంటిస్తున్నారు.చదవండి: భారత్‌పై నిందలు!.. బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ! -
బంగ్లాదేశ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ!
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ భారత్‌పై మరోసారి నిందలు వేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మెగా ఈవెంట్లో ఆడేందుకు తమ ఆటగాళ్లను భారత్‌కు పంపలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి విజ్ఞప్తి కూడా చేసింది.ఐసీసీ చెప్పింది.. ఈ మూడు జరిగితే దాడులు!అయితే, ఈ విషయంపై ఐసీసీ స్పందించిందంటూ బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వేదికల మార్పు గురించి ఐసీసీకి మేము రెండు లేఖలు పంపించాము. ఇందుకు సమాధానం ఇంకా రాలేదు. అయితే, ఐసీసీ భద్రతా బృందం నుంచి మాకు లేఖ వచ్చింది.సెక్యూరిటీ టీమ్ ఇంఛార్జి మాకు రాసిన లేఖలో మూడు విషయాలు చెప్పారు. ఒకటి.. ఒకవేళ ముస్తాఫిజుర్ రహమాన్ బంగ్లాదేశ్ జట్టులో ఉంటే భద్రతా ముప్పు పెరుగుతుందని చెప్పారు. రెండోది.. ఒకవేళ బంగ్లాదేశ్‌కు మద్దతు ఇచ్చే ఆటగాళ్లు మా దేశ జెర్సీ వేసుకుని మైదానంలోకి వస్తే దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పారు.ఎన్నికలు సమీపిస్తున్నందున అది కూడా బంగ్లాదేశ్ జట్టుకు ముప్పును పెంచే అవకాశం ఉందని చెప్పారు. ఐసీసీ సెక్యూరిటీ టీమ్ హెడ్ ఇచ్చిన వివరాలను బట్టి.. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వెళ్లడం ఎంతమాత్రం సరికాదని అర్థమవుతోంది’’ అని నజ్రుల్ ఒక రకంగా నిందలు వేశాడు.దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఐసీసీఅయితే, నజ్రుల్ వ్యాఖ్యలకు ఐసీసీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఐసీసీ వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘పబ్లిక్‌గా కొంతమంది చేస్తున్న కామెంట్లు ఐసీసీ దృష్టికి వచ్చాయి. టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆడే విషయంలో కొంతమంది తమకు నచ్చినట్లుగా ఐసీసీ సెక్యూరిటీ రిస్క్ గురించి చెప్పిందని మాట్లాడుతున్నారు.అంతర్జాతీయ స్థాయి భద్రతా నిపుణులతో ఐసీసీ చర్చిస్తుంది. దీనర్థం భారత్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లు ఆడకూడదని కాదు. భారత్‌లో ఎలాంటి భద్రతా ముప్పు లేదు. ఒకవేళ సెక్యూరిటీ రిస్క్ ఉంటుందని భావించినా.. అది తక్కువ నుంచి అతి తక్కువగా ఉంది.భారత్‌లో ఇప్పటికే ఎన్నో ఐసీసీ, మెగా టోర్నీలు జరిగాయి. మా భద్రతా విభాగం ప్రత్యక్షంగా బంగ్లాదేశ్ ప్లేయర్లపై దాడులు జరుగుతుందని అస్సలు చెప్పలేదు’’ అని నజ్ముల్ వ్యాఖ్యలను ఖండించాయి. పచ్చి అబద్ధంఇక PTI అందించిన వివరాల ప్రకారం.. ‘‘భారత్‌లో భద్రత గురించి ఐసీసీ- బీసీబీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఆసిఫ్ నజ్రుల్ చెప్పింది పచ్చి అబద్ధం. ముస్తాఫిజుర్ సెలక్షన్ వల్ల బంగ్లాదేశ్ జట్టుకు ముప్పు ఉంటుందని చెప్పిందన్నదాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. ఇలాంటి ఒక విషయాన్ని లేఖలో అధికారికంగా రాయనేలేదు’’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి.కాగా బంగ్లాదేశ్‌లో కొన్నాళ్లుగా మైనారిటీలపై దాడులు పెరిగాయి. అందుకు తోడు భారత్‌పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో బంగ్లా కవ్వింపులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026లో ఉన్న ఒకే ఒక్క బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అంగీకరించింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని.. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉందంటూ బీసీబీ రాగం ఎత్తుకుంది.చదవండి: U19 WC 2026 IND vs ENG: వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ -
బంగ్లా మ్యాచ్‌ల వేదికలు మార్పు!.. స్పందించిన బీసీసీఐ
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ఆడే వేదికల మార్పు అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేసింది. కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.భద్రత విషయంలో.. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించిది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా భారత్‌లో తాము టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడబోమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పంతానికి పోయింది. తమ జట్టు ఆడే వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాల్సిందిగా ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.అయితే, టోర్నీ ఆరంభానికి కొద్ది రోజుల (ఫిబ్రవరి 7) సమయమే ఉన్నందున ఐసీసీ ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వేదికలను కోల్‌కతా, ముంబై నుంచి చెన్నై, తిరునవంతపురానికి మార్చినట్లు సోమవారం వార్తలు వచ్చాయి.స్పందించిన బీసీసీఐఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్వయంగా స్పందించారు. IANSతో మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికలను చెన్నై లేదంటే మరో చోటికి మార్చాలంటూ ఐసీసీ నుంచి బీసీసీఐకి ఎలాంటి సందేశమూ రాలేదు. అయినా ఈ విషయం మా ఆధీనంలో లేదు.బీసీబీ, ఐసీసీ మధ్య వ్యవహారం ఇది. ఐసీసీ పాలక మండలికే అన్ని అధికారాలు ఉంటాయి. ఒకవేళ వేదికలను మార్చాలని గనుక ఐసీసీ ఆదేశిస్తే.. ఆతిథ్య దేశంగా అందుకు తగ్గట్లుగా చర్యలు చేపడతాము. ఇప్పటికైతే ఈ అంశంలో మాకు ఎలాంటి సమాచారమూ లేదు’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.టీ20 ప్రపంచకప్-2026లో బంగ్లాదేశ్ షెడ్యూల్ఫిబ్రవరి 7- వెస్టిండీస్‌తో- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగాఫిబ్రవరి 9- ఇటలీతో- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగాఫిబ్రవరి 14- ఇంగ్లండ్‌తో- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగాఫిబ్రవరి 17- నేపాల్‌తో- ముంబైలోని వాంఖడే వేదికగా.చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు -
భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం
భారత్–న్యూజిలాండ్ మధ్య వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్‌గా బంగ్లాదేశ్‌కు చెందిన షరఫుద్దౌలా సైకత్ వ్యవహరించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సైకత్ టీమిండియా మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌లో జరుగబోయే మ్యాచ్‌లకు తమ అంపైర్లను పంపబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం ఆసక్తికర పరిణామం.భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంబంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించారు. 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది.ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలిగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసింది. భారత్‌లో తాము ఆడాల్సిన టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.ఐసీసీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో తమ దేశానికి చెందిన అంపైర్లను ప్రపంచకప్ విధుల నిమిత్తం భారత్‌కు పంపించబోమని నిర్ణయించింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ భవితవ్యంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ముందస్తు షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబై నగరాల్లో జరగాల్సి ఉంది. అయితే బీసీబీ విన్నపాన్ని పరిశీలిస్తున్న ఐసీసీ వేదికలను చెన్నై, తిరువనంతపురంకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.బోణీ కొట్టిన టీమిండియాతొలి వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62), డారిల్ మిచెల్ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్, ప్రసిద్ద్ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్ ఓ వికెట్ తీశారు.అనంతరం భారత్ విరాట్ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49), ఆఖర్లో ఎల్ రాహుల్ (29 నాటౌట్) హర్షిత్ రాణా (29) రాణించడంతో 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 4, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్‌కోట్ వేదికగా జనవరి 14న జరుగనుంది. -
మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బంగ్లాదేశ్ కెప్టెన్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ఆడుతుందా?.. బంగ్లా డిమాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది?.. ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వైఖరి ఎలా ఉండబోతోంది?.. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ అంశాల గురించే ప్రధానంగా చర్చ నడుస్తోంది.బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడుల నేపథ్యంలో భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహమాన్‌ను బీసీసీఐ తొలగించింది. ఈ క్రమంలో భద్రతా కారణాలు చూపుతూ వరల్డ్‌కప్ ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని.. శ్రీలంకలో తమ మ్యాచ్‌లు నిర్వహించాలని బంగ్లా బోర్డు.. ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.గందరగోళంలో ఆటగాళ్లుఅయితే, టోర్నీ ఆరంభానికి నెలరోజుల సమయం కూడా లేనందున ఈ మార్పు కుదరకపోవచ్చని ఐసీసీ బంగ్లా క్రికెట్ బోర్డు(BCB)కు సంకేతాలు ఇచ్చింది. అయినప్పటికీ బీసీబీ తమ పట్టువీడటం లేదు. దీంతో బంగ్లాదేశ్ లేకుండానే టోర్నీ నిర్వహించే పరిస్థితులు రావొచ్చనే ఆందోళనలు ఆ దేశ ఆటగాళ్లలో నెలకొన్నాయి.ఐసీసీతో పంచాయతీ వద్దని, తెగేదాక లాగవద్దంటూ బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ హితవు పలికితే.. బీసీబీ అధికారి అతడిని ‘ఇండియన్ ఏజెంట్’ అంటూ ఆరోపణలు చేశాడు. మరోవైపు.. బంగ్లా కీలక ఆటగాళ్ల బ్యాట్ స్పాన్సర్లుగా ఉన్న భారత కంపెనీలు తప్పుకొనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో నష్టపోతారు.అంగారక గ్రహంపైకి పంపించినాఅయినా సరే బీసీబీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ టీ20 వరల్డ్‌కప్ జట్టులో భాగమైన మెహదీ హసన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘ప్రపంచకప్ ఆడే విషయంలో యాజమాన్యం తరఫు నుంచి సందిగ్దం నెలకొంది. అధికారులే ఈ సమస్యను పరిష్కరించాలి.ప్లేయర్లుగా కేవలం ఆడటం మాత్రమే మా బాధ్యత. ఒకవేళ బోర్డు మమ్మల్ని అంగారక గ్రహంపైకి పంపించినా మేము ఆడి తీరాల్సిందే. ఈ విషయంలో ఆటగాళ్లు ఎక్కడా వెనక్కి తగ్గరు’’ అని పేర్కొన్నాడు.మేము నటిస్తున్నామని మాకూ తెలుసుఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్, గత టీ20 వరల్డ్‌కప్‌లో సారథిగా వ్యవహరించిన నజ్ముల్ హుసేన్ షాంటో సైతం బంగ్లా బోర్డు తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. ‘‘ప్రతి ప్రపంచకప్ టోర్నీకి ముందు మాకు ఇలాంటి సమస్య ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది.వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఆడిన ఆటగాడిగా నా అనుభవం గురించి చెబుతున్నా. ఇలాంటి పరిణామాలు కచ్చితంగా ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతాయి. మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. ఎలాంటి ప్రభావం లేదన్నట్లు పైకి చెబుతూ ఉంటాము.నిజానికి ఆ సమయంలో మేమంతా నటిస్తున్నామన్న మాట. ఆ విషయం మాకూ తెలుసు. అయితే, ఇదేమీ తేలికైన విషయం కాదు. ఇలాంటి పరిస్థితులు రానేకూడదు. ఒకవేళ వచ్చినా ఆటగాళ్లుగా మేము చేసేదేమీ లేదు’’ అంటూ బీసీబీ వ్యవహారశైలిని విమర్శించాడు.చదవండి: T20 WC 2026: భారత్‌లో ఆడబోము..! బంగ్లా డిమాండ్‌పై స్పందించిన బీసీసీఐ -
‘ఇండియన్ ఏజెంట్’: ఓవరాక్షన్ చేశాడు.. ఇచ్చిపడేశారు!
భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదం ముదురుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు తమ ఆటగాళ్లను వెనకేసుకొచ్చినట్లుగా కనిపించిన.. బంగ్లా క్రికెట్ బోర్డు (BCB) నిజ స్వరూపం తాజాగా తేట తెల్లమైంది. తమ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ పట్ల బీసీబీ అధికారి ఒకరు వ్యవహరించిన తీరే ఇందుకు కారణం.బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత, తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మైనారిటీ హిందూలపై దాడులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లా ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను తొలగించారు.తెగేదాకా లాగొద్దుఇందుకు ప్రతిగా టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు తాము హాజరు కాబోమని బీసీబీ పేర్కొంది. ఇందుకు సంబంధించి భద్రతా కారణాలు చూపిస్తూ.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి లేఖ రాసింది. ఈ విషయంలో తెగేదాకా లాగొద్దని మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ బీసీబీని హెచ్చరించాడు.ఐసీసీ నుంచే బంగ్లాదేశ్ క్రికెట్‌కు భారీ మొత్తంలో ఆదాయం వస్తోందని.. సున్నితమైన ఈ అంశంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. ఐసీసీతో సంబంధాలు చెడితే మొదటికే మోసం వస్తుందని పేర్కొన్నాడు. ఆటగాళ్లు, బంగ్లా క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని హితవు పలికాడు.ఇండియన్ ఏజెంట్ అంటూ..ఈ విషయంపై బీసీబీ ఆర్థిక వ్యవహారాల కమిటీ చైర్మన్ ఎం. నజ్ముల్ ఇస్లాం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తమీమ్ ఇక్బాల్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈసారి బంగ్లాదేశ్ ప్రజలు.. తాను ఇండియన్ ఏజెంట్‌ను అని నిరూపించుకున్న వ్యక్తి నిజ స్వరూపాన్ని కళ్లారా చూశారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.ఈ నేపథ్యంలో ‘క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్’ (CWAB) ఘాటుగా స్పందించింది. ‘‘బీసీబీ డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాం.. జాతీయ జట్టు మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి.తీవ్రంగా ఖండిస్తున్నాంఈ మాటలు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి. ఆందోళనకు గురిచేశాయి. పదహారేళ్లు జాతీయ జట్టు తరఫున ఆడిన, విజయవంతమైన ఆటగాడి పట్ల ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదు. ఏ కారణంగానూ ఇవి ఆమోదయోగ్యనీయం కాదు. సామాజిక మాధ్యమం వేదికగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.ఇది చాలా అవమానకరం. ఈ విషయాన్ని బీసీబీ అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్లాము. సదరు అధికారి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే’’ అని CWAB డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సైతం తమీమ్ ఇక్బాల్‌కు మద్దతుగా.. బీసీబీ అధికారి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.చదవండి: IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు! -
సొంత దేశంపై బంగ్లాదేశ్ క్రికెటర్ తిరుగుబాటు
భారత్-బంగ్లాదేశ్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్‌పై ఆ దేశ క్రికెటరే తిరుగుబాటు చేసినట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అయిన తమీమ్ ఇక్బాల్ భారత్‌తో అనుసరిస్తున్న విధానాలపై సొంత దేశ నాయకులను, క్రికెట్ బోర్డును హెచ్చరించినట్లు సమాచారం. పాక్ అండ చూసుకొని భారత్‌పై రెచ్చిపోవద్దని తమీమ్ స్వదేశీ క్రికెట్ బోర్డుకు సూచించినట్లు తెలుస్తుంది. అలాగే ఐసీసీతో విరోధం కూడా మంచి కాదని హెచ్చరించినట్లు సమాచారం. మీడియా కథనాల ప్రకారం తమీమ్ వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు వచ్చే ఆదాయంలో 90 నుంచి 95 శాతం ఐసీసీ నుంచే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీతో విరోధం బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుకు ప్రమాదం.టీ20 వరల్డ్‌కప్ విషయంలో ప్రజల్లో ప్రకటనలు చేసి రెచ్చగొట్టడం కంటే, బోర్డు లోపల చర్చించి సమస్యకు పరిష్కారం కనుగొంటే మంచిది. మాట్లాడుకోవడం ద్వారానే సమస్యలు తీరతాయి.భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన పాకిస్తాన్ మార్గాన్ని అనుసరించడం బంగ్లాదేశ్‌కు హానికరం. వారు చేశారని మనమూ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.ప్రపంచ కప్ నుంచి వైదొలగడం దేశ క్రికెట్ సంస్కృతిని దెబ్బతీస్తుంది.తమీమ్ చేసిన ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ నాయకులు, ఆ దేశ క్రికెట్ బోర్డు పెద్దలు అనురిస్తున్న విధానాలకు అద్దం పడుతున్నాయి. తమీమ్ మొదటి నుంచి విధానాల విషయంలో బీసీబీ పెద్దలను వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. తాజా పరిణామాలపై అతను మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమీమ్ వ్యాఖ్యల్లో క్రికెట్ ముందు, రాజకీయాలు తర్వాత అన్న విషయం స్పష్టమవుతుంది.భారత్-బంగ్లాదేశ్ ఉద్రిక్తతల నేపథ్యంషేక్ హసీనా స్థానంలో మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి కావడంతో భారత్‌తో సంబంధాలు క్షీణించాయి. తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించింది.ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం అతిగా స్పందించింది. ఇది తమ దేశ క్రికెటర్లను అవమానించడమేనని తెలిపింది. ముస్తాఫిజుర్ ఉదంతానికి ప్రతి చర్యగా భారత్‌లో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకుంది. అలాగే దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపివేయాలని తీర్మానించుకుంది. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లను భారత్‌కు బదులుగా శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ కోరింది. ఐసీసీ ససేమిరా అంటుండటంతో వాకౌట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతుంది. పాక్ అండ చూసుకొని, ఆ దేశానికి అవకాశం ఇచ్చినట్లే తమకు కూడా హైబ్రిడ్ విధానంలో మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. మొత్తంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్‌ను చూపిస్తూ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతుంది. -
పాకిస్తాన్ మాదిరే మేము కూడా!: బంగ్లాదేశ్ ఓవరాక్షన్
భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్ మరోసారి ఓవరాక్షన్ చేసింది. టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తమ క్రికెట్ జట్టును అక్కడికి పంపలేమని పేర్కొంది. అయితే, అదే సమయంలో తాము మాత్రం టోర్నమెంట్‌ను వైదొలిగేందుకు సిద్ధంగా లేమంటూ తమ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది.భారత్‌లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదుఈ విషయం గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘భారత్‌లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదని మేము ఇప్పటికే ఐసీసీకి అర్థమయ్యేలా చెప్పాము.మరింత స్పష్టంగా ఈరోజు రాత్రికో.. రేపు ఉదయమో మరోసారి ఇదే విషయాన్ని వారికి చెబుతాము. బంగ్లాదేశ్ భద్రత, గౌరవం, మర్యాద విషయంలో మేము ఎంతమాత్రము రాజీపడబోము. అయితే, మేము కచ్చితంగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటాము’’ అని నజ్రుల్ పేర్కొన్నాడు.మరోవైపు.. అమినుల్ పాకిస్తాన్ పేరును ప్రస్తావిస్తూ తమకు కూడా అలాంటి వెసలుబాటు కావాలని డిమాండ్ చేశాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అలాగే గత వరల్డ్‌కప్ ఆడేందుకు పాకిస్తాన్ భారత్‌కు రాలేదు.పాకిస్తాన్ మాదిరే మేము కూడాకాబట్టి మా విషయంలోనూ పాక్ మాదిరే ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్ టోర్నీల్లో హైబ్రిడ్ మోడల్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఇందుకు భద్రతే ప్రధాన కారణం. కాబట్టి మాకు సానుకూల స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని అమినుల్ అన్నాడు.కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై హత్యాకాండ నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాళ్లను బహిష్కరించాలనే డిమాండ్లు పెరిగాయి. అందుకు అనుగుణంగానే బీసీసీఐ.. ముస్తాఫిజుర్ రహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి తొలగించేలా ఆదేశాలు ఇచ్చింది.ఐసీసీ తిరస్కరించే అవకాశం?ఈ క్రమంలో భద్రత అనే కారణం చూపుతూ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ కోసం తాము భారత్‌కు రాలేమని బంగ్లాదేశ్ పేర్కొంది. అయితే, టోర్నీ ఆరంభానికి నెలరోజుల సమయమే ఉన్నందున ఈ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ కోరినట్లు శ్రీలంకలో వారి మ్యాచ్‌లు నిర్వహించడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో తొలుత తాము టోర్నీ నుంచి తప్పుకొంటామని బెదిరింపు ధోరణి కనబరిచిన బంగ్లా.. తాజాగా ఇలా మాట్లాడటం గమనార్హం.చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త -
ICC: అబ్బే అదేం లేదు!.. మా మాట విన్నారు!
తమ అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తిరస్కరించిందన్న వార్తలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఖండించింది. ఐసీసీ తమకు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఐసీసీ హామీ ఇచ్చింది‘‘మా విజ్ఞప్తిపై ఐసీసీ స్పందించింది. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌ల నేపథ్యంలో.. మా ఆటగాళ్ల భద్రత విషయంలో మేము లేవెనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంది. మ్యాచ్‌ల వేదికలను మార్చాలనే మా విజ్ఞప్తిపై కూడా బదులిచ్చింది.మేము ఈ టోర్నమెంట్లో కొనసాగేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని ఐసీసీ హామీ ఇచ్చింది. ఈ సమస్యలపై మా నుంచి ఇన్పుట్స్ తీసుకుని బీసీబీతో కలిసి పనిచేస్తామని తెలిపింది. భద్రత విషయంలో మాతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది.వరల్డ్‌కప్ ఆడతాంటోర్నీలో కొనసాగే విషయమై మాకు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదు. ఇందుకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఐసీసీతో పాటు ఈవెంట్ నిర్వహిస్తున్న వారితో మా బోర్డు ప్రొఫెషనల్‌గానే ముందుకు సాగుతుంది. వరల్డ్‌కప్‌లో మేము తప్పక పాల్గొంటాము.ఇందుకు సంబంధించిన ప్రక్రియ సజావుగా సాగేందుకు.. మా సమస్యకు సరైన పరిష్కారం వెదికేందుకు సిద్ధంగా ఉన్నాము. ఏదేమైనా మా ఆటగాళ్ల భద్రతే మాకు మొదటి ప్రాధాన్యం’’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తన ప్రకటనలో పేర్కొంది.ఆటగాడి తొలగింపు.. ఐపీఎల్ అక్కడ బ్యాన్!కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో.. భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదంలో ముదిరిన విషయం తెలిసిందే. మార్చి నుంచి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లను తమ దేశంలో ప్రసారం చేయరాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లా సమాచార, ప్రసార శాఖమంత్రి నిర్ధారించారు. ఐపీఎల్‌నుంచి తమ దేశం ఆటగాడు ముస్తఫిజుర్ రహమాన్‌ను అనూహ్యంగా తప్పించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ కనిపించరాదని నిర్ణయించింది.అంతేకాదు.. తమ ఆటగాళ్ల భద్రతపై సందేహాలు ఉన్నాయంటూ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్‌నుంచి శ్రీలంకకు మార్చాలంటూ ఐసీసీకి శనివారం విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో పంచాయితీ ఐసీసీ వద్దకు చేరింది. టోర్నీకి నెలరోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో వేదికలు మార్చడం కుదరని బీసీబీకి ఐసీసీ స్పష్టం చేసినట్లు బుధవారం వార్తలు వచ్చాయి. అందుకే యూటర్న్?ఒకవేళ బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి వైదొలగానుకున్నా ఫర్వాలేదని చెప్పినట్లు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్లు వెల్లడించాయి. అయితే, బీసీబీ మాత్రం వీటిని ఖండిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. టోర్నీ నుంచి తప్పుకొంటామని ముందుగా బెదిరింపు ధోరణి అవలంబించిన బీసీబీ.. తెగేదాకా లాగితే మొదటికే మోసం వస్తుందని భావించి యూటర్న్ తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ముఖం మీద కొట్టినట్లు.. యువీ దెబ్బకు అల్లాడినా.. నాలో కసి పెరిగి... -
బంగ్లాదేశ్ అంత పని చేసిందా?.. నేనే తప్పుకొన్నా!
భారత్- బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ వివాదం ముదురుతోంది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాళ్లను తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తమ జట్టులో ఉన్న ముస్తాఫిజుర్ రహమాన్‌ను విడుదల చేసింది.షాకిచ్చిన ఐసీసీఈ క్రమంలో బంగ్లాదేశ్ టీమిండియా టూర్‌కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయగా.. ఈ పర్యటనపై తాము నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తాము భారత్‌కు రాబోమంటూ బంగ్లా క్రికెట్ బోర్డు ప్రగల్భాలు పలకగా.. ఐసీసీ ఇందుకు విముఖత వ్యక్తం చేసింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైనందున యథావిధిగా మ్యాచ్‌లు సాగుతాయని స్పష్టం చేసింది.బంగ్లాదేశ్ అంత పని చేసిందా?ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) నుంచి భారత స్పోర్ట్స్ ప్రజెంటర్ రిధిమా పాఠక్ (Ridhima Pathak)ను తొలగించారనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై ఆమె స్వయంగా స్పందించింది. తనకు దేశమే మొదటి ప్రాధాన్యం అని.. అందుకే తానే లీగ్ నుంచి వైదొలిగినట్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసింది.దేశం కోసం నేనే తప్పుకొన్నా!‘‘నన్ను బీపీఎల్ నుంచి తొలగించారని గత కొన్ని గంటలుగా ప్రచారం జరుగుతోంది. అది వాస్తవం కాదు. ఈ లీగ్ నుంచి తప్పుకోవాలనే నేనే నిర్ణయించుకున్నాను. దేశ ప్రయోజనాలే నాకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం.అదే విధంగా ఆట పట్ల కూడా నాకు నిబద్ధత ఉంది. ఇన్నాళ్లుగా స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా నిజాయితీ, అంకితభావం, గౌరవం, ప్యాషన్‌తో పనిచేశాను. దీనిలో ఇక ముందు కూడా ఎలాంటి మార్పూ ఉండదు. క్రికెట్ సమగ్రత కోసం నేను ఎల్లప్పుడూ క్రీడాస్ఫూర్తితోనే ఉంటాను.ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. క్రికెట్ విషయంలో నిజం చెప్పడం ముఖ్యం. ఇకపై ఈ అంశం గురించి నేను స్పందించను. జై హింద్’’ అని రిధిమా పాఠక్ పేర్కొంది. చదవండి: సచిన్ కొడుకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ -
బంగ్లాదేశ్‌కు భారీ షాక్
భారత్‌లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో తమ మ్యాచ్‌లను ఇతర దేశానికి మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. షెడ్యూల్, వేదికల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. భారత్‌లో ఆడకపోతే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఈ విషయాలను ఐసీసీ వర్చువల్ సమావేశం ద్వారా బీసీబీకి తెలియజేసినట్లు సమాచారం. అసలేం జరిగిందంటే..?ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రతరమయ్యాయి. కొన్ని రాజకీయ ప్రేరేపిత శక్తులు ఏకంగా ఆరుగురు హిందువులను కిరాతకంగా చంపేశాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదేశీ ప్లేయర్‌ను ఐపీఎల్లో ఆడించకూడదని భారత్‌లో నిరసనలు వెల్తువెత్తాయి. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగి ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించాలని కేకేఆర్‌కు అల్టిమేటం జారీ చేసింది. తప్పేదేమీ లేక కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను కాంట్రాక్ట్ నుంచి తొలిగించింది.తమ దేశ ఆటగాడిని ఐపీఎల్ నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసింది. భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అలాగే తమ దేశానికి చెందిన అంపైర్లు భారత్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో పాల్గొనరని స్పష్టం చేసింది.ప్రపంచకప్ మ్యాచ్‌ల వేదికల మార్పుకు ఐసీసీ ససేమిరా అంటున్న నేపథ్యంలో బీసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ సాహసం చేసి భారత్‌లో మ్యాచ్‌లు ఆడకపోతే, ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. -
ముస్తాఫిజుర్ రహ్మాన్ సంచలన నిర్ణయం
ఐపీఎల్-2026 నుంచి తొలగించబడ్డ బంగ్లాదేశీ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాకపోతే పాకిస్తాన్ సూపర్ లీగ్ అని అంటున్నాడు. ముస్తాఫిజుర్ కేకేఆర్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ ఆదేశాలతో ఐపీఎల్ గవర్నింగ్ బాడీ రద్దు చేసిన తర్వాత ముస్తాఫిజుర్ పీఎస్ఎల్ డ్రాఫ్ట్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ముస్తాఫిజుర్ చివరిగా 2017-18 సీజన్లో పీఎస్ఎల్ ఆడాడు. ఆ సీజన్లో అతను లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.కాగా, ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రతరం కావడం.. ఈ నేపథ్యంలో బంగ్లాదేశీ ప్లేయర్ అయిన ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలిగించడం జరిగిపోయాయి. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలిగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసింది. భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.ఐసీసీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో తాజాగా తమ దేశానికి చెందిన అంపైర్లను ప్రపంచకప్‌కు పంపించబోమని అంటుంది. బంగ్లాదేశ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రపంచ వేదికపై ఆ దేశ క్రికెట్ జట్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. -
నలిగిపోతున్న క్రికెట్
దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా క్రీడలు బలి కావడం ఇటీవలికాలంలో ఎక్కువైపోయింది. వాస్తవానికి క్రీడలు దేశాల మధ్య బంధాలు బలపడటానికి దోహదపడతాయి. దురదృష్టవశాత్తు అలా జరగకపోగా, రాజకీయాలకు క్రీడలు బలైపోతున్నాయి. ఈ పోకడ జెంటిల్మెన్ గేమ్ క్రికెట్లో పతాక స్థాయికి చేరింది.తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య క్రికెట్ బలైపోయింది. ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు అంపశయ్యపైకెక్కాయి. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలిగించింది. ప్రతిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడమని భీష్మించుకు కూర్చుంది.బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసుకుంది. ఈ చర్య-ప్రతి చర్యల పర్వం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. భారత్-బంగ్లాదేశ్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో గతంలో క్రికెట్లో చోటు చేసుకున్న ఇలాంటి పరిణామాలపై ఓ లుక్కేద్దాం.భారత్-పాక్ఈ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకొచ్చేది భారత్-పాక్. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోవడానికి పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు, రాజకీయాలు ప్రధాన కారణాలు. ఈ కారణాల చేత 2012 తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.భారత్-బంగ్లాదేశ్తాజాగా భారత్-బంగ్లాదేశ్ పరిస్థితి కూడా భారత్-పాక్ తరహాలో మారిపోతుంది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో, ఆ దేశ ఆటగాడు ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించగా.. వారు భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఓ మెట్టు పైకెక్కి వారి దేశంలో ఐపీఎల్‌ను కూడా బ్యాన్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ ఇలాగే ఓవరాక్షన్ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం అసాధ్యం.దీని వల్ల భారత్‌కు ఎలాంటి నష్టం జరగదు. నష్టపోయేదంతా బంగ్లాదేశే. స్వదేశంలో ఐపీఎల్‌ను నిషేధించడం వల్ల కూడా భారత్‌కు పోయేదేమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్ ద్వారా వచ్చే రెవెన్యూ కోల్పోయి, ఆర్దికంగా బంగ్లాదేశే నష్టపోతుంది. ఇవన్నీ తెలిసి కూడా బంగ్లాదేశ్ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతుంది. దీని వల్ల భారత్‌కు నష్టమేమీ ఉండదు కానీ, క్రికెట్ బలైపోతుంది.ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నాయి. రాజకీయం, ఉగ్రవాదం, అంతర్గత అస్థిరతలు, సరిహద్దు వివాదాల కారణంగా మొదటి నుంచి ఈ ఇరు దేశాల మధ్య క్రికెట్ నలిగిపోతూ వస్తుంది. గతేడాది ఆఫ్ఘనిస్తాన్లోని పక్తికా ప్రావిన్స్‌పై పాక్ వైమానిక దాడులకు తెగబడటంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. ఈ దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు సహా 10 మంది పౌరులు చనిపోవడంతో ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్లో జరగాల్సిన టీ20 ట్రై సిరీస్ నుంచి తప్పుకుంది.పాకిస్తాన్-శ్రీలంక2009లో శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటిస్తుండగా.. లాహోర్‌లో ఆ జట్టు ప్రయాణిస్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ ఉదంతం తర్వాత చాలాకాలం పాటు శ్రీలంక పాక్‌తో క్రికెట్ సంబంధాలు తెంచుకుంది. ఇప్పుడిప్పుడే ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రోద్భలంతో పాక్‌లో పర్యటిస్తున్నా, లంక ఆటగాళ్లు బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు.ఆఫ్ఘనిస్తాన్-ఆస్ట్రేలియాఈ రెండు దేశాల మధ్య కూడా ఓ దశలో క్రికెట్ సంబంధాలు చెడిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తుండటంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆఫ్ఘనిస్తాన్‌తో క్రికెట్ ఆడటం నిలిపి వేసింది. ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినప్పటికీ.. నష్టపోయింది మాత్రం క్రికెటే.ఇంగ్లండ్-జింబాబ్వేజింబాబ్వేలో మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అస్థిరత కారణంగా ఇంగ్లండ్-జింబాబ్వే మధ్య ఓ దశలో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. 2003 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ జింబాబ్వేలో పర్యటించేందుకు నిరాకరించింది. నేటికీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు.సౌతాఫ్రికా-వెస్టిండీస్1970ల్లో సౌతాఫ్రికాలో జాతి వివక్ష అధికంగా ఉండేది. ఆ సమయంలో ఆ దేశంతో క్రికెట్ సంబంధాలు కొనసాగించేందుకు ఏ దేశం ఇష్టపడలేదు. వెస్టిండీస్ ఓ అడుగు ముందుకేసి సౌతాఫ్రికాతో క్రికెట్ సంబంధాలు తెంచుకుంది. 1970–1991 మధ్యలో సౌతాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరణకు గురైంది.ఇలా రాజకీయం, ఉగ్రవాదం, జాతి వివక్ష, మానవ హక్కుల ఉల్లంఘన వంటి కారణాల చేత క్రికెట్ నలిగిపోయింది. అభిమానులు ఈ క్రీడ మజాను ఆస్వాదించలేకపోయారు. ఆటగాళ్ల కెరీర్లు నాశనమయ్యాయి. క్రికెట్ బోర్డులు ఆర్దికంగా నష్టపోయాయి. -
బీసీసీఐ కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్!
భారత పురుషల క్రికెట్ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడు వన్డేలు, టీ20ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే మరోసారి ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత, హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో టీమిండియా పర్యటనను బీసీసీఐ తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు."బంగ్లాదేశ్ టూర్‌ను మేము ఇంకా ఖరారు చేయలేదు. గతేడాది కూడా మా జట్టు బంగ్లా పర్యటనకు వెళ్లలేదు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వదేశంలో జరిగే అంతర్జాతీయ సిరీస్ క్యాలెండర్‌ను విడుదల చేసినప్పటికి.. టీమిండియా పర్యటించేది మాత్రం అనుమానమే. ఈ టూర్‌పై తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నాము.ఎందుకంటే దేశం వెళ్లి ఆడాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసారి. ఇక టీ20 ప్రపంచకప్ విషయానికి వస్తే షెడ్యూల్ ప్రకారమే.. బంగ్లాదేశ్ మ్యాచ్‌లు భారత్‌లో జరగనున్నాయి" అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా భారత్-బంగ్లా జట్టు వైట్‌బాల్ సిరీస్ షెడ్యూల్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. కానీ అంతలోనే బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. వాస్తవానికి గతేడాది ఆగస్టులో జరగాల్సి ఉంది. కానీ అప్పట్లో అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత వల్ల అది ఈ ఏడాది సెప్టెంబర్‌కు వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు అదే కథ పునరావృతమయ్యేలా ఉంది. పొట్టి ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు ఫిబ్రవరిలో రానుంది. ముస్తాఫిజుర్ ఔట్..అదేవిధంగా బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బీసీసీఐ ఆదేశించింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో రూ.9.2 కోట్ల భారీ ధరకు ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో రోజు రోజుకు హిందువులపై దాడులు పెరిగిపోతుండడంతో బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్లో ఆడకుండా చాలా మంది డిమాండ్ చేశారు.అయితే కేకేఆర్ యాజమాని షారుఖ్ ఖాన్‌పై విమర్శలు వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ముస్తాఫిజుర్‌ను జట్టు విడుదల చేయాలని కేకేఆర్‌ను సూచించింది.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు -
బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. షెడ్యూల్ ఇదే
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తమ జట్టు 2026 సీజన్లో స్వదేశంలో ఆడే సిరీస్‌ల వివరాలను ప్రకటించింది. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరులో భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. షెడ్యూల్ ఇదేసెప్టెంబరు 1, 3, 6లలో వన్డేలు... 9, 12, 13 తేదీల్లో టీ20లు నిర్వహిస్తామని బీసీబీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు, భారత ప్రభుత్వంతో సంబంధాల నేపథ్యంలో ఈ పర్యటన ఎంత వరకు జరుగుతుందనేది చర్చనీయాంశం.ఒప్పందం ప్రకారంనిజానికి గత ఏడాది జులైలోనే భారత జట్టు బంగ్లాదేశ్ గడ్డపై ఆడాల్సి ఉంది. అయితే దీనిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరవధికంగా వాయిదా వేసింది. ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 2026లోగా ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ప్రకటించిన టూర్ వివరాలు బహుశా వాయిదా పడిన సిరీస్‌ను ఆడటం గురించే కావచ్చని సమాచారం. కాగా బంగ్లాదేశ్‌లో పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ ఈ షెడ్యూల్‌పై ఎలా స్పందిస్తుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది.బంగ్లా ఆటగాళ్లను నిషేధించాలనే డిమాండ్లుభారత్ను రెచ్చగొట్టే విధంగా బంగ్లాదేశ్‌లో కొంతమంది నేతలు విద్వేషపూరిత ప్రసంగాలు ఇవ్వడం సహా మైనారిటీ హిందూ వర్గంపై దాడుల నేపథ్యంలో.. ఇప్పటికే ఐపీఎల్లో బంగ్లా ఆటగాళ్లను నిషేధించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కొనుగోలు చేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ.. ‘‘భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో మాకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. ఇంతకుమించి దీని గురించి మాట్లాడేందుకు ఏమీలేదు’’ అని దాటవేశాయి.చాలా సమయం ఉంది ఇలాంటి తరుణంలో బీసీబీ ప్రకటించిన షెడ్యూల్లో టీమిండియాతో మ్యాచ్‌లు ఉండటం చర్చకు దారితీసింది. సిరీస్‌లకు చాలా సమయం ఉంది కాబట్టి అప్పటి పరిస్థితుల దృష్ట్యా బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. బంగ్లా బోర్డు ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆ జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా వెళ్లి వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. కాగా టీమిండియా జనవరి 11 నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీ కానుంది. అనంతరం టీ20 వరల్డ్‌కప్-2026 బరిలో దిగుతుంది.చదవండి: 2026లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లు ఇవే..! -
కొంప మునిగిన తర్వాత ఇంకేంటి?: కోచ్‌పై మాజీ క్రికెటర్ ఫైర్
ఏసీసీ పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడి జితేశ్ శర్మ సేన ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో బారత జట్టు యాజమాన్యం తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.ఇందుకు ప్రధాన కారణంగా సూపర్ ఓవర్లో భారత జట్టు అనుసరించిన వ్యూహమే. దోహా వేదికగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీ తొలి సెమీ ఫైనల్లో భారత్-‘ఎ’- బంగ్లాదేశ్- ‘ఎ’ జట్లు శుక్రవారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 194 పరుగులుబంగ్లా ఓపెనర్ హబీబుర్ రెహ్మాన్ సోహన్ (46 బంతుల్లో 65)తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎస్ఎం మెహెరాబ్ (18 బంతులు 48 నాటౌట్), యాసిర్ అలీ (9 బంతుల్లో 17 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 194 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ రెండు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే, సూయశ్ శర్మ, రమణ్‌దీప్ సింగ్, నమన్ ధిర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.సరిగ్గా అదే స్కోరుఇక భారీ లక్ష్య ఛేదనను భారత్ ఘనంగానే ఆరంభించింది. ఓపెనర్లులో వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో 38 పరుగులతో సత్తా చాటగా.. ప్రియాన్ష్ ఆర్య 23 బంతుల్లో 44 పరుగులు సాధించాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ నమన్ ధిర్ (7) మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఇలాంటి తరుణంలో కెప్టెన్ జితేశ్ శర్మ (23 బంతుల్లో 33), నేహాల్ వధేరా (29 బంతుల్లో 32 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. వీరికి తోడు రమణ్‌దీప్ సింగ్ (17), అశుతోశ్ శర్మ (13) ఫర్వాలేదనిపించగా.. విజయానికి ఆఖరి బంతికి నాలుగు పరుగులు అవసరం కాగా.. హర్ష్ దూబే మూడే పరుగులు తీశాడు.సూపర్ ఓవర్లో..దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. అయితే, సూపర్ ఓవర్లో కెప్టెన్ జితేశ్ శర్మ, అశుతోశ్ శర్మ బ్యాటింగ్‌కు వెళ్లారు. ఓపెనర్లు వైభవ్, ప్రియాన్షులను కాదని వీరిని పంపిన యాజమాన్యం అందుకు బదులుగా భారీ మూల్యమే చెల్లించింది. జితేశ్ తొలి బంతికే బౌల్డ్ కాగా.. రెండో బంతికి అశుతోశ్ పెవిలియన్ చేరాడు. ఇక సూయశ్ శర్మ బౌలింగ్‌లో వైడ్ రావడంతో పరుగు ఖాతాలో వేసుకున్న బంగ్లా గెలుపు జెండా ఎగురవేసి.. ఫైనల్‌కు దూసుకువెళ్లింది.ఈ నేపథ్యంలో సూపర్ ఓవర్లో భారత్ అనుసరించిన వ్యూహంపై టీమిండియా మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్-‘ఎ’ జట్టు కోచ్ అసలేం ఆలోచిస్తున్నాడంటూ సునిల్ జోషిపై మండిపడ్డాడు. వైభవ్ ఏం తప్పు చేశాడని బ్యాటింగ్‌కు పంపలేదంటూ ఫైర్ అయ్యాడు.ఇప్పటికే కొంప మునిగింది కదా!కామెంట్రీలో భాగంగా.. ‘‘ఇప్పటికీ భారత్-‘ఎ’ నాయకత్వ బృందం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఇంకా తామేదో చేస్తున్నట్లు వారు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీనికి ఎందుకు బ్యాటింగ్‌కు పంపలేదు?భారత్-‘ఎ’ హెడ్‌కోచ్ సునిల్ జోషి.. ఇప్పుడు డగౌట్లో కూర్చుకుని ఏం రాసుకుంటున్నాడు? ఇప్పటికే కొంప మునిగింది కదా!’’ అంటూ మణిందర్ సింగ్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా బంగ్లా చేతిలో ఓటమితో భారత్ నిష్క్రమించగా.. శ్రీలంకపై గెలిచి పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య ఆదివారం ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ -2025 టైటిల్ పోరు జరుగుతుంది. ఇందుకు దోహా వేదిక.చదవండి: అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ -
Asia T20 Cup: ఫైనల్‌కు దూసుకెళ్లిన పాకిస్తాన్
ఏసీసీ పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20-2025 టోర్నమెంట్లో పాకిస్తాన్‌కు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆఖరి ఓవర్ వరకు శ్రీలంక (Pak A vs SL A)తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఐదు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. దోహా వేదికగా నవంబరు 14న మొదలైన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది.శుక్రవారం నాటి తొలి సెమీ ఫైనల్లో భారత్-‘ఎ’ జట్టుపై గెలిచి బంగ్లాదేశ్-‘ఎ’ ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్- ‘ఎ’- శ్రీలంక- ‘ఎ’ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 153 పరుగుల నామమాత్రపు స్కోరు సాధించింది.దానియాల్ మెరుపు ఇన్నింగ్స్పాక్ ఓపెనర్లు మొహమ్మద్ నసీమ్ (16), మాజ్ సదాకత్ (23) ఫర్వాలేదనిపించగా.. వన్‌డౌన్ బ్యాటర్ యాసిర్ ఖాన్ (6), ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన మొహమ్మద్ ఫరీక్ (7), కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ (6) పూర్తిగా విఫలమయ్యారు. షహీద్ అజాజ్ (7) కూడా ఫెయిలయ్యాడు.ఇలాంటి దశలో వికెట్ కీపర్ బ్యాటర్ ఘాజి ఘోరి (36 బంతుల్లో 39 నాటౌట్), సాద్ మసూద్ (22) మెరుగ్గా రాణించగా.. అహ్మద్ దానియాల్ (8 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా పాక్ 153 పరుగులు స్కోరు చేయగలిగింది. లంక బౌలర్లలో ప్రమోద్ మధుషాన్ నాలుగు, త్రవీణ్ మాథ్యూ మూడు వికెట్లతో చెలరేగగా.. మిలాన్ రత్మనాయకె, కెప్టెన్ దునిత్ వెల్లలగే చెరో వికెట్ పడగొట్టారు.పేకమేడలా కుప్పకూలిందినామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక శుభారంభమే అందుకుంది. ఓపెనర్లు లసిత్ క్రూస్‌పులె (7 బంతుల్లో 27) వేగంగా ఆడగా.. విషేన్ హలాంబగే (27 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించాడు. అయితే, పాక్ బౌలర్ల ధాటికి లంక మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. నిషాన్ మధుష్క (6), నువానిడు ఫెర్నాండో (5), సాహన్ అరాచిగే (5), కెప్టెన్ వెల్లలగే (2), రమేశ్ మెండిస్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు.క్లిష్ట పరిస్థితుల్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్ మిలాన్ రత్ననాయకె పోరాట పటిమ కనబరిచాడు. 32 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 40 పరుగులు చేశాడు. కానీ మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. ప్రమోద్ (7), త్రవీణ్ మాథ్యూ (4 నాటౌట్), గరుక సంకేత్ (1) చేతులెత్తేశారు. విజయానికి ఐదు పరుగుల దూరంలోఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 148 పరుగులు చేసిన శ్రీలంక.. విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఫలితంగా పాక్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. బంగ్లాదేశ్-‘ఎ’- పాకిస్తాన్- ‘ఎ’ మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సెమీస్‌లో బ్యాట్, బాల్‌తో రాణించిన సాద్ మసూద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. పాక్ బౌలర్లలో మసూద్, సూఫియాన్ ముకీమ్ చెరో మూడు వికెట్లు కూల్చగా.. ఉబైద్ షా, షాహిద్ అజీజ్, అహ్మద్ దానియాల్ తలా ఒక వికెట్ తీసి.. పాక్ ఫైనల్ చేరడంలో తమ వంతు పాత్ర పోషించారు.చదవండి: IND vs BAN అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ -
అందుకే సూపర్ ఓవర్లో వైభవ్ సూర్యవంశీని పంపలేదు: జితేశ్ శర్మ
ఆసియా క్రికెట్ మండలి పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్-2025 టోర్నమెంట్లో భారత-‘ఎ’ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. బంగ్లాదేశ్-‘ఎ’ జట్టుతో శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో జితేశ్ శర్మ సేన ఓటమిపాలైంది. దీంతో ఈ టీ20 ఈవెంట్లో కనీసం ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన దుస్థితి వచ్చింది.బంగ్లా చేతిలో భారత్ ఓటమిదోహా వేదికగా ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు (IND A vs BAN A) ‘సూపర్ ఓవర్’ ద్వారా భారత్‌ను ఓడించింది. సూపర్ ఓవర్లో ఆడిన 2 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయిన భారత్ ‘0’కే పరిమితం కాగా... బంగ్లాదేశ్ 1 పరుగు చేసి విజయాన్నందుకుంది.వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. హబీబుర్ రహమాన్ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.... మెహ్రాబ్ హుసేన్ (18 బంతుల్లో 48 నాటౌట్; 1 ఫోర్, 6 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించాడు.సరిగ్గా 194 పరుగులేభారత బౌలర్లలో గుర్‌జీప్‌నీత్ సింగ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 194 పరుగులే సాధించింది. ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi- 15 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), జితేశ్ శర్మ (Jitesh Sharma- 23 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు.Top-class innings from Vaibhav Sooryavanshi! 💥Watch India A take on Bangladesh A in the semi-final, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #DPWorldAsiaCupRisingStars2025 pic.twitter.com/7rSQRproSI— Sony Sports Network (@SonySportsNetwk) November 21, 2025 నేహల్ వధేరా (29 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి 2 ఓవర్లలో భారత్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిపాన్ మోండోల్ (1/35) ఐదు పరుగులే ఇచ్చాడు.విజయం కోసం ఆఖరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన భారత్ తొలి 5 బంతుల్లో 12 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి హర్ష్ దూబే, వధేరా కలిసి కష్టంగా 2 పరుగులు పూర్తి చేశారు. అయితే కీపర్ అక్బర్ ఘోర వైఫల్యంతో భారత్‌కు మూడో పరుగు కూడా వచ్చింది.సూపర్ ఓవర్లో అంతా తలకిందులు.. చావోరేవో తేల్చుకోవాల్సిన సూపర్ ఓవర్లో భారత జట్టు యాజమాన్యం ఆశ్చర్యకరంగా వైభన్ సూర్యవంశీని కాదని జితేశ్ శర్మ, రమణ్‌దీప్‌ల సింగ్‌లతో ఓపెనింగ్ చేయించింది. మోండోల్ వేసిన తొలి బంతికి జితేశ్, రెండో బంతికి అశుతోష్ అవుట్ కావడంతో ఇన్నింగ్స్ ‘సున్నా’ వద్ద ముగిసింది.వైభవ్‌ను ఎందుకు పంపలేదు?ఆ తర్వాత తొలి బంతికి వికెట్ తీసిన సుయాశ్ శర్మ, తర్వాతి బంతిని వైడ్‌గా వేయడంతో బంగ్లాదేశ్ గెలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సూపర్ ఓవర్లో అనుసరించిన వ్యూహంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. విధ్వంసకర వీరుడైన వైభవ్‌ను ఓపెనర్‌గా ఎందుకు పంపలేదంటూ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు మండిపడ్డారు. భారత్ ఓటమికి ఒకరకంగా ఇదే ప్రధాన కారణమనే చర్చ లేవనెత్తారు.ఓటమికి బాధ్యత నాదేఈ నేపథ్యంలో భారత కెప్టెన్ జితేశ్ శర్మ స్పందించాడు. ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ.. ‘‘ఈ మ్యాచ్ ద్వారా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఓటమికి బాధ్యత నాదే. సీనియర్ ఆటగాడిగా మ్యాచ్‌ను సరైన రీతిలో ముగించి ఉండాల్సింది.నేర్చుకునే దశలో ఇదొక భాగమే కానీ.. ఓటమి కాదు. ఏదో ఒకరోజు ఈ జట్టులోని ఆటగాళ్లే భారత జట్టుకు ప్రపంచకప్ అందించవచ్చు. వాళ్ల ప్రతిభకు ఆకాశమే హద్దు. మాకు ఇదొక అనుభవం.ఇక్కడ వికెట్ కీలక పాత్ర పోషించింది. ఇలాంటి పిచ్‌లపై ఎలా ఆడాలో మాకు తెలుసు. అయితే, పందొమ్మిదో ఓవర్లో బంగ్లా బౌలర్ అద్భుతంగా బౌల్ చేశాడు. అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. 20 ఓవర్ల ఆట మా నియంత్రణలోనే ఉంది. కానీ ఆఖర్లో చేదు ఫలితం వచ్చింది’’ అని జితేశ్ శర్మ పేర్కొన్నాడు.డెత్ ఓవర్లలో మేము బెస్ట్ఇక సూపర్ ఓవర్లో రెగ్యులర్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్యలను పంపకపోవడంపై స్పందిస్తూ.. ‘‘వాళ్లిద్దరు పవర్‌ప్లేలో మాస్టర్లు అని నాకూ తెలుసు. అయితే, డెత్ ఓవర్లలో నేను, అశుతోశ్, రమణ్ హిట్టింగ్ ఆడగలము. అందుకే సూపర్ ఓవర్లో మేమే బ్యాటింగ్‌కు వెళ్లాలని భావించాం. ఇది జట్టు నిర్ణయం. పూర్తిగా నా నిర్ణయం’’ అని జితేశ్ శర్మ స్పష్టం చేశాడు.చదవండి: SMAT: హైదరాబాద్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
టీమిండియాతో సెమీఫైనల్.. బంగ్లాదేశ్ భారీ స్కోర్
ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో (ACC Men's Asia Cup Rising Stars 2025) ఇవాళ (నవంబర్ 21) తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది. దోహా వేదికగా భారత్-ఏ-బంగ్లాదేశ్-ఏ (India A vs Bangladesh A) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ హబిబుర్ రెహ్మాన్ సోహన్ (46 బంతుల్లో 65; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆఖర్లో మెహ్రబ్ (18 బంతుల్లో 48 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో జిషన్ ఆలమ్ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జవాద్ అబ్రార్ (13), యాసిర్ అలీ (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆ జట్టు కెప్టెన్ అక్బర్ అలీ 9, మహిదుల్ ఇస్లాం 1 పరుగు చేయగా.. అబూ హైదర్ డకౌటయ్యాడు.భారత బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్ (4-0-51-0) భారీ పరుగులు సమర్పించుకోగా.. గుర్జప్నీత్ సింగ్ (4-0-39-2), హర్ష్ దూబే (4-0-22-1), సుయాశ్ శర్మ (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. రమన్‌దీప్ సింగ్ (2-0-29-1), నమన్ ధిర్ (2-0-33-1) పర్వాలేదనిపించారు.వైభవ్ మెరుపులు కూడా మొదలయ్యాయి..!అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (12 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసాన్ని ప్రారంభించాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (7 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కూడా భారీ షాట్లు ఆడుతున్నాడు. ఫలితంగా భారత్ 3.3 ఓవరల్లో వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. -
భారత్-బంగ్లాదేశ్ సిరీస్ రద్దు..!
భారత్, బంగ్లాదేశ్ (India vs Bangladesh) మహిళా క్రికెట్ జట్ల మధ్య వచ్చే నెలలో (డిసెంబర్) జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) రద్దైనట్లు తెలుస్తుంది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్‌కు అనుమతి లభించలేదని బీసీసీఐ వర్గాల సమాచారం. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్‌లో (FTP) భాగమైన ఈ సిరీస్‌కు సంబంధించి ఖచ్చితమైన తేదీలు, వేదికలు ఖరారు కావాల్సి ఉండింది. ఈ లోపే రద్దు నిర్ణయం వెలువడిందంటూ ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ సిరీస్ జరగాల్సిన సమయంలో (డిసెంబర్ మూడో వారం) బీసీసీఐ ప్రత్యామ్నాయ హోమ్ సిరీస్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) దృష్ట్యా ఈ సిరీస్ చిన్నదిగా ఉండే అవకాశం ఉందని సమాచారం. డబ్ల్యూపీఎల్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా, కొద్ది రోజుల కిందట పురుషుల క్రికెట్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన సిరీస్ వాయిదా పడింది. ఆగస్టులో భారత పురుషుల జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉండింది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సిరీస్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌కు మార్చారు.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో చివరి జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించిన టీమిండియా.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించింది. భారత మహిళల జట్టుకు ఇదే తొలి ప్రపంచకప్. చదవండి: బాబర్ ఆజమ్‌కు భారీ షాక్ -
నేనేమీ హర్మన్‌ప్రీత్ కౌర్‌ని కాదు.. అలా ఎందుకు చేస్తా?: బంగ్లా కెప్టెన్ ఓవరాక్షన్
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ (Nigar Sultana)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఆరోపణలపై స్పందించే విధానం ఇది కాదని.. అనవసరంగా మా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) పేరు వివాదంలోకి లాగితే సహించేదిలేదని హెచ్చరిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. భారత్- శ్రీలంక వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. మొత్తంగా గ్రూప్ దశలో పదకొండు మ్యాచ్‌లకు గానూ బంగ్లా జట్టు కేవలం రెండే గెలిచి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానాపై విమర్శల వర్షం కురిసింది. జూనియర్లపై భౌతిక దాడిఅదే సమయంలో బంగ్లా పేసర్ జహనారా ఆలమ్.. నిగర్ సుల్తానాపై సంచలన ఆరోపణలు చేసింది. జట్టు సభ్యులపై నిగర్ భౌతిక దాడికి పాల్పడేదని.. జూనియర్లను ఎన్నోసార్లు గాయపరిచిందని ఆరోపించింది. ఇష్టారీతిన కొట్టేదని వాపోయింది.బంగ్లాదేశ్ డైలీతో మాట్లాడుతూ ఆలం ఈ మేరకు నిగర్పై ఆరోపణలు చేసింది. ‘‘ఇందులో కొత్తేమీ లేదు. జోటీ జూనియర్లను దారుణంగా కొట్టేది’’ అని పేర్కొంది. అయితే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆలం ఆరోపణలను కొట్టిపారేసింది. నిగర్ సుల్తానాపై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ ఆమెను సమర్థించింది.నేనేమైనా హర్మన్‌ప్రీత్‌నా?ఈ నేపథ్యంలో తాజాగా.. నిగర్ సుల్తానా స్వయంగా స్పందించింది. తనపై వచ్చిన ఆరోపణల గురించి కాకుండా.. భారత మహిళా జట్టు కెప్టెన్, వరల్డ్‌కప్ విజేత హర్మన్‌ప్రీత్ కౌర్ పేరును కూడా ఇందులోకి లాగింది. ‘‘నేను ఎవరినైనా ఎందుకు కొడతాను? అంటే.. నా బ్యాట్‌తో స్టంప్స్‌ను ఎందుకు కొడతాను?నేనేమైనా హర్మన్‌ప్రీత్‌నా? ఆమె మాదిరి స్టంప్స్‌ను బ్యాట్ కొట్టేదానిలా కనబడుతున్నానా? నేనెందుకు అలా చేస్తాను? నా వ్యక్తిగత విషయంలో ఏదైనా తప్పుగా అనిపిస్తే... అప్పుడు నా బ్యాట్‌ను తిప్పుతూ కోపం ప్రదర్శిస్తానేమో.. లేదంటే నా హెల్మెట్‌ను కొట్టుకుంటానేమో? అది నా ఇష్టం.వేరే వాళ్లను నేనెందుకు కొడతాను?కానీ వేరే వాళ్లను నేనెందుకు కొడతాను? భౌతికంగా ఎందుకు దాడి చేస్తాను? ఎవరో ఏదో అన్నారని అందరూ ఈ విషయం గురించి నన్ను అడగటం ఏమీ బాలేదు. నిజంగా నేను ఎవరినైనా కొట్టానేమో అడగండి. వాళ్లు చెప్పింది రాసుకోండి’’ అంటూ నిగర్ సుల్తానా డైలీ క్రికెట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.కాగా 2023లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా వన్డే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర అసంతృప్తికి లోనైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ బౌలర్ నహీదా అక్తర్ బౌలింగ్‌లో హర్మన్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బంతి బ్యాట్‌కు కాకుండా ప్యాడ్‌కు తాకింది. ఈ క్రమంలో బంగ్లా ఆటగాళ్లు అప్పీలు చేయగా.. అంపైర్ హర్మన్‌ను అవుట్‌గా ప్రకటించాడు.నాడు హర్మన్ అలాకానీ.. బంతి లెగ్స్టంప్నకు ఆవల పిచ్ అయిందని భావించిన హర్మన్.. తనను తప్పుడు నిర్ణయంతో బలిచేశారనే ఆవేదన, కోపంతో బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ బోర్డును కూడా హర్మన్ తప్పుబట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో హర్మన్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆమె మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత వేయడంతో పాటు రెండు డిమెరిట్ పాయింట్లు కూడా ఆమె ఖాతాలో జమచేసింది. రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల నిషేధం కూడా విధించింది.అయితే, ఎప్పుడో రెండేళ్ల క్రితం నాటి విషయాన్ని తాజాగా ప్రస్తావిస్తూ.. బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా హర్మన్‌ప్రీత్ పేరును తీయడంపై భారత జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల క్రికెట్లో భారత్‌కు మొట్టమొదటి వన్డే ప్రపంచకప్ అందించిన తమ సారథిని కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు. చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! స్టార్ ప్లేయర్‌కు మళ్లీ పిలుపు -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన బంగ్లాదేశ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 26) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో (India vs Bangladesh) టీమిండియా (Team India) బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బంగ్లాదేశ్‌ను 119 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది.బంగ్లా ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసిన షర్మిన్ అక్తర్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. శోభన మోస్తరి (26), రుబ్యా హైదర్ (13), రితూ మోనీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా వారిలో సుమయ్యా అక్తర్ 2, కెప్టెన్ నిగార్ సుల్తానా 9, షోర్నా అక్తర్ 2, నహీద అక్తర్ 3, రబేయా ఖాన్ 3, నిషిత అక్తర్ 4 (నాటౌట్), మరుఫా అక్తర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు.భారత బౌలర్లలో రాధా యాదవ్ 3 వికెట్లు తీయగా.. శ్రీచరణి 2, రేణుకా సింగ్, దీప్తి శర్మ, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీశారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌లు ఇదివరకే ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, భారత్ ఫైనల్ ఫోర్కు అర్హత సాధించాయి. అక్టోబర్ 29న జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా (గౌహతి).. 30వ తేదీ జరిగే రెండో సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా (నవీ ముంబై) తలపడతాయి. ఫైనల్ మ్యాచ్ (నవీ ముంబై) నవంబర్ 2న జరుగుతుంది. చదవండి: రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం -
బతికితే చాలనుకున్నా.. ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారు: తిలక్ వర్మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు తిలక్ వర్మ (Tilak Varma). 2022లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన తిలక్.. ఆ మరుసటి ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు.ఆసియా కప్ హీరోఅనతికాలంలోనే భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. ఇటీవల ఆసియా టీ20 కప్-2025 టోర్నీలోనూ అదరగొట్టాడు. పాకిస్తాన్‌తో ఫైనల్లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.ఇక ఇప్పటి వరకు టీమిండియా తరఫున 32 టీ20 మ్యాచ్‌లు, నాలుగు వన్డేలు ఆడిన తిలక్ వర్మ.. ఆయా ఫార్మాట్లలో 962, 68 పరుగులు చేశాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ సీజన్ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.ఈ నేపథ్యంలో కెరీర్‌లోని చేదు అనుభవాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు తిలక్ వర్మ. గాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేయిదాటిపోయిందని.. ఆ సమయంలో ముంబై ఫ్రాంఛైజీ సహ యజమాని ఆకాశ్ అంబానీ సాయం చేశారని తెలిపాడు. బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్‌తో మాట్లాడుతూ..బ్యాట్ ఎత్తేందుకు కూడా శక్తి సరిపోలేదు‘‘2022లో బంగ్లాదేశ్‌లో మ్యాచ్ ఆడుతున్నాం. నేను భారత్-‘ఎ’ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నా. బ్యాటింగ్‌కు వచ్చిన కాసేపటి తర్వాత నా కళ్లు చెమ్మగా మారాయి. బ్యాట్ ఎత్తేందుకు కూడా శక్తి సరిపోవడం లేదు. నా నరాల్లో జీవం లేనట్లే అనిపించింది.ఆకాశ్ అంబానీ హెల్ప్ చేశారువెంటనే రిటైర్డ్ హర్ట్‌గా వెనక్కి వచ్చేశాను. ఆ సమయంలో విషయం తెలుసుకుని ఆకాశ్ అంబానీ ఫోన్ చేశారు. బీసీసీఐ పెద్దలతో మాట్లాడి.. నా పరిస్థితి గురించి చెప్పారు. నాకు చాలా సాయం చేశారు.బతికి బయటపడితే చాలుఆస్పత్రిలో వైద్యులు నన్ను హెచ్చరించారు. ఒకవేళ ఇంకాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయేదన్నారు. నా శరీరంలోకి సూది కూడా దిగడం లేదు. అలాంటి పరిస్థితుల్లో బతికి బయటపడితే చాలు అనుకున్నా’’ అని తిలక్ వర్మ చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2022 సీజన్ తర్వాత తిలక్ వర్మ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయితే, కోలుకోవడంపై దృష్టి పెట్టకుండా వరుస మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి.. ఆస్పత్రిలో చికిత్స తీసుకునేంత వరకు వచ్చింది. అయితే, అదృష్టవశాత్తూ త్వరగానే కోలుకున్న 22 ఏళ్ల తిలక్ వర్మ.. ప్రస్తుతం టీమిండియా తరఫున సత్తా చాటుతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్.. ఆసియాలోనే తొలి క్రికెటర్‌గా రోహిత్ రికార్డు -
యువ భారత్ ఏడోసారి
చెన్నై: అండర్–17 దక్షణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (SAFF U17) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో భారత జట్టు పెనాల్టీ షూటౌట్లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడం ఇది ఏడోసారి. తుదిపోరు నిర్ణీత సమయంలో 2–2 గోల్స్‌తో సమం కాగా... అనంతరం విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన పెనాల్టీ షూటౌట్లో భారత్ 4–1తో ముందంజ వేసింది. భారత్ తరఫున డల్లామౌన్ గాంగ్టే (4వ నిమిషంలో), అజ్లాన్ షా (38వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. షూటౌట్లో భారత్ నుంచి డల్లామౌన్ గాంగ్టే, కొరో కొన్థోజమ్, ఇంద్ర రాణా, శుభమ్ పునియా విజయంవంతం అయ్యారు. బంగ్లా నుంచి మనిక్ మాత్రమే గోల్ చేశాడు. పసిడి గురిన్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో భారత షూటర్ల జోరు సాగుతోంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు స్వర్ణ, రజతాలు ఖాతాలో వేసుకున్నారు. రష్మిక సెహగల్–కపిల్ శర్మ అదిరిపోయే గురితో పసిడి పతకం ఖాతాలో వేసుకున్నారు.ఇటీవల ఆసియా చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన రష్మిక–కపిల్ జోడీ... శనివారం మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో 16–10 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన వన్షిక–జొనాథన్ గావిన్ ఆంటోనీ జంటపై గెలుపొందింది. ఒర్టెగా కాస్ట్రో–లూకాస్ సెంచెజ్ (స్పెయిన్) ద్వయం కాంస్యం ఖాతాలో వేసుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో రష్మిక–కపిల్ చెరో 291 పాయింట్లు స్కోరు చేసి 582 పాయింట్లతో అగ్రస్థానంతో ఫైనల్‌కు చేరారు.వన్షిక–జొనాథన్ ద్వయం 578 పాయింట్ల (287+291)తో రెండో స్థానం దక్కించుకుంది. ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జోడీలు పసిడి పతకం కోసం పోటీ పడగా... మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జంటల కాంస్య పతక పోరు జరిగింది. ఫైనల్లో ఆరంభం నుంచే రష్మిక–కపిల్ జంట ఆధిక్యం కొనసాగింది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం ఖాతాలో వేసుకున్న జొనాథన్... ఫైనల్లో విజృంభించినా... వన్షిక పలుమార్లు తడబడంతో ఈ జోడీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.జూనియర్ మహిళల స్కీట్ విభాగంలో ఒలింపియన్ రైజా ఢిల్లాన్ రజత పతకం కైవసం చేసుకుంది. ఇటలీకి చెందిన అరియానా 53 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఢిల్లాన్ 51 పాయింట్లతో రజతం నెగ్గింది. భారత్‌కే చెందిన మాన్సి రఘువంశీ 41 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకుంది. జూనియర్ మెన్స్ స్కీట్ విభాగంలో భారత షూటర్లు హర్మెహర్ సింగ్, అతుల్ సింగ్ రజావత్ వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచి పతకం కోల్పోయారు. మూడు రోజుల పోటీలు ముగిసేసరికి భారత్ 11 పతకాల (2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు)తో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటలీ (2 స్వర్ణాలు, 1 రజతం) రెండో స్థానంలో ఉండగా... తటస్థ అథ్లెట్స్ రెండు స్వర్ణాలు గెలిచి మూడో స్థానంలో ఉన్నారు. -
ఆసియా కప్-2025: ఇది కరెక్ట్ కాదు సూర్య!.. మేమిలాగే చేస్తాం
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా మరోసారి తమ బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు చేసింది. లీగ్ దశలో ఒమన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ దిగని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ (Abhishek Sharma)- శుబ్‌మన్ గిల్ (Shubman Gill)లను మినహా దాదాపుగా అందరి స్థానాలు మార్చాడు.అపుడు అలా.. ఇపుడు ఇలాసంజూ శాంసన్ (Sanju Samson)ను వన్‌డౌన్‌లో.. ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌లను బరిలోకి దించాడు. తాజాగా సూపర్-4లో బంగ్లాదేశ్‌తో కీలకమైన బుధవారం నాటి మ్యాచ్‌లోనూ భారత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరిగాయి.ఓపెనర్లుగా అభి (37 బంతుల్లో 75)- గిల్ (19 బంతుల్లో 29)లను కొనసాగించిన యాజమాన్యం.. ఆల్‌రౌండర్, ఫినిషర్ శివం దూబే (2)ను వన్‌డౌన్‌లో పంపగా విఫలమయ్యాడు. తనదైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య (5) కూడా విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా (38) ఐదు, తిలక్ వర్మ (5) ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయగా.. అక్షర్ పటేల్ (10 నాటౌట్) ఏడో ఆటగాడిగా వచ్చాడు.ఇక సంజూ శాంసన్‌ను ఎనిమిది.. ఆ తర్వాతి స్థానాల్లో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి బ్యాటింగ్ చేయాల్సింది. అయితే, నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. వీరంతా మైదానంలో అడుగుపెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.ఇదెలాంటి క్రికెట్ లాజిక్?అయితే, బంగ్లాదేశ్‌తో ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో భారత్ నామమాత్రపు స్కోరు చేయడం.. ఆ తర్వాత 41 పరుగుల తేడాతో గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలపై కెప్టెన్ సూర్యకుమార్‌పై విమర్శలు వచ్చాయి.ముఖ్యంగా ఓ వైపు వికెట్లు పడుతున్నా సంజూ శాంసన్ ఎనిమిదో స్థానంలో దింపాలనుకోవడంపై భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘సంజూ శాంసన్ ఎనిమిదో స్థానంలో రావడమా? ఇదెలాంటి క్రికెట్ లాజిక్. ఇది ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదు’’ అంటూ సూర్య నిర్ణయాన్ని తప్పుబట్టాడు.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌పై విజయానంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. విమర్శలకు బదులు ఇచ్చాడు. ‘‘ఈ టోర్నీలో మాకు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. ఒమన్‌పై మొదట బ్యాటింగ్ చేశాం. మళ్లీ ఇప్పుడు. సూపర్-4లో అనుకున్నట్లుగానే ముందుకు సాగుతున్నాం.మేమిలాగే చేస్తాంబంగ్లా బౌలింగ్ లైనప్ చూసిన తర్వాతే మా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకున్నాం. వారి జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ ఉన్నారు. దూబే స్పిన్ బాగా ఆడతాడనే అతడిని ముందుగా పంపించాం.కానీ ఈసారి అది వర్కౌట్ కాలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అంతమాత్రాన మా ప్రణాళికలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అవుట్‌ఫీల్డ్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే మేమే 180- 185 పరుగులు చేసేవాళ్లం. ఇక 12- 14 ఓవర్లు బాగా బౌలింగ్ చేసిన సందర్భాల్లోనూ మేము మెజారిటీ మ్యాచ్‌లలో గెలుపొందాం’’ అని తన నిర్ణయాన్ని సూర్య సమర్థించుకున్నాడు. కాగా బంగ్లాదేశ్‌పై విజయంతో టీమిండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఇక.. టీమిండియా తదుపరి శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఇందుకు దుబాయ్ వేదిక. The moment India stormed into the Asia Cup Final 🌟 Watch #DPWorldAsiaCup2025 from September 9-28, 7 PM onwards, Live on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvBAN pic.twitter.com/7VN6tJ0rwa— Sony Sports Network (@SonySportsNetwk) September 24, 2025చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన -
పాకిస్తాన్‌పై గెలుస్తాం.. ఫైనల్లో ఆడతాం: బంగ్లాదేశ్ కెప్టెన్
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా ఫైనల్ చేరింది. సూపర్-4లో తొలుత పాకిస్తాన్ (IND vs PAK)ను ఓడించిన భారత జట్టు.. బుధవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.ఈ క్రమంలో గురువారం (సెప్టెంబరు 25) జరిగే మ్యాచ్ ద్వారా మరో ఫైనలిస్టు ఖరారు కానుంది. దుబాయ్ వేదికాగా జరిగే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్- బంగ్లాదేశ్ (Pak vs Ban) చావో రేవో తేల్చుకోనున్నాయి.ఈ నేపథ్యంలో టీమిండియాతో మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ జాకిర్ అలీ (Jaker Ali) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌పై తప్పకుండా పైచేయి సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటాం‘‘టీమిండియాతో మ్యాచ్‌లో మా వాళ్లు మెరుగ్గా రాణించారు. ముఖ్యంగా పది ఓవర్ల తర్వాత మా బౌలర్లు అద్భుతం చేశారు. ఈ మ్యాచ్‌లో మాకెన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటాం.గురువారం మేము కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇందులో గెలిచి.. ఫైనల్లో ఆడాలనే కసితోనే బరిలో దిగాల్సి ఉంటుంది. మా ఆట ఎలా ఉంటుందో చూద్దాం. ఏదేమైనా అత్యుత్తమ ప్రదర్శన మాత్రం ఇస్తామని కచ్చితంగా చెప్పగలను.పాకిస్తాన్‌పై గెలుస్తాం.. ఫైనల్లో ఆడతాంమేము ఏ జట్టును తేలికగా తీసుకోము. మా బలాలు, సామర్థ్యాలపై పూర్తిగా దృష్టి పెడతాం. పాకిస్తాన్ గడ్డ మీద, స్వదేశంలో పాక్‌తో ఆడిన అనుభవం మాకు ఉంది. కచ్చితంగా మేము పని పూర్తి చేస్తాము’’ అని జాకిర్ అలీ పాక్‌ను ఓడించి.. టీమిండియాతో ఫైనల్ ఆడతామనే ధీమా వ్యక్తం చేశాడు.ముఖాముఖి పోరులో పాక్‌దే పైచేయికాగా ఈ ఏడాది మే నెలలో పాకిస్తాన్లో పర్యటించిన బంగ్లా జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. పాక్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఆ తర్వాత పాక్ జూలైలో బంగ్లా పర్యటనకు రాగా.. పర్యాటక జట్టుపై బంగ్లాదేశ్ 2-1తో గెలిచి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.ఇదిలా ఉంటే.. టీమిండియాతో ఆసియా కప్ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ లిటన్ దాస్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో 27 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ జాకిర్ అలీ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.ఇక టీ20 ఫార్మాట్లో బంగ్లాదేశ్- పాకిస్తాన్ ఇప్పటి వరకు 25సార్లు ముఖాముఖి తలపడగా.. పాక్ 20, బంగ్లాదేశ్ ఐదు సార్లు విజయం సాధించాయి.భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ స్కోర్లు👉భారత్: 168/6 (20)👉బంగ్లాదేశ్: 127 (19.3)👉ఫలితం: బంగ్లాదేశ్‌పై 41 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లో భారత్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75)చదవండి: BCCI: అభిషేక్ శర్మకు బంపరాఫర్! -
అసలు అక్కడ ఏం ఉంది?: అభిషేక్ శర్మపై గావస్కర్ ‘ఫైర్’
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) మరోసారి అదరగొట్టాడు. సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్ (IND vs BAN)తో బుధవారం నాటి మ్యాచ్‌లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 75 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లతో పాటు ఐదు సిక్సర్లు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 202.70.And just like that, Abhishek Sharma reaches his fifty 🤯 Watch #INDvBAN LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/fP1RpHC0Eu— Sony Sports Network (@SonySportsNetwk) September 24, 2025తొందరపాటు చర్యక్రీజులో కుదురుకున్న తర్వాత ధనాధన్ దంచికొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన అభిషేక్ శర్మ.. ఓ దశలో సెంచరీ చేసే దిశగా పయనించాడు. అయితే, తన తొందరపాటు చర్య కారణంగా ఊహించని రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు.టీమిండియా ఇన్నింగ్స్ పన్నెండో ఓవర్లో బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ బంతితో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఎదుర్కొన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా షాట్ కట్ చేశాడు. అయితే, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రిషాద్ హొసేన్ వేగంగా స్పందించాడు.సూర్య చెప్పినా కూడా..డైవ్ కొట్టి మరీ బంతిని ఆపాడు. అయితే, అప్పటికే అభిషేక్ శర్మ సింగిల్ కోసమని నాన్-స్ట్రైకర్ పొజిషన్ నుంచి ముందుకు కదిలాడు. ఈ విషయాన్ని గమనించిన సూర్య.. అభిషేక్‌ను వెనక్కి వెళ్లమని చెప్పాడు. దీంతో అతడు తిరిగి తన స్థానంలోకి వస్తుండగా.. రిషాద్.. బౌలర్ ముస్తాఫిజుర్ వైపు బంతిని త్రో చేయగా.. అతడు ఒడిసి పట్టాడు.అక్కకు హార్ట్బ్రేక్అభిషేక్ క్రీజులోకి వచ్చే కంటే ముందే బంతిని వికెట్లకు గిరాటేయడంతో అతడు రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో అభిషేక్ 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మైదానంలోని ప్రేక్షకులతో పాటు.. అభి అక్క కోమల్ కూడా తీవ్ర నిరాశకు గురైంది.సెంచరీ చేసే ఛాన్స్ మిస్.. గావస్కర్ ‘ఫైర్’ఇక కామెంటేటర్, టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం.. అభిషేక్ శర్మ తొందరపాటు చర్యను విమర్శించకుండా ఉండలేకపోయాడు. ‘‘అసలు అక్కడ పరుగు తీయాల్సిన అవసరమే లేదు. అక్కడ సింగిల్‌కు అసలు ఆస్కారమే లేదు. అసలు అక్కడ ఏం ఉంది?’’ అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫైనల్లో భారత్‌కాగా అభిషేక్ శర్మ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్ నెమ్మదించింది. హార్దిక్ పాండ్యా (38) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. అంతకు ముందు మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి టీమిండియా 168 పరుగులు చేయగలిగింది.అయితే, లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాను భారత బౌలర్లు 127 పరుగులకే ఆలౌట్ చేయడంతో.. 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఆసియా కప్-2025 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. విధ్వంసర బ్యాటింగ్‌తో చెలరేగిన అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. Unfortunate end! 💔 "Abhishek Sharma departs after an absolute power-packed show. Missed out on a well-deserved 💯 but what a knock! "🔥 Absolute cinema!!🚀#AbhishekSharma #AsiaCup2025 #INDvsBAN #TeamIndia pic.twitter.com/cgRQFUkQNh— ममता राजगढ़ (@rajgarh_mamta1) September 24, 2025చదవండి: BCCI: అభిషేక్ శర్మకు బంపరాఫర్!pic.twitter.com/SjXZnnshzK— The Game Changer (@TheGame_26) September 24, 2025 -
Asia cup 2025: అభిషేక్ విధ్వంసం.. ఫైనల్లో టీమిండియా
ఆసియా కప్ 2025లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్‌కు చేరడమే కాకుండా శ్రీలంకను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య రేపు జరుగబోయే మ్యాచ్‌లో విజేత ఫైనల్లో భారత్‌తో తలపడుతుంది.బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభాన్ని ఇచ్చినా టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది.అభిషేక్ క్రీజ్‌లో ఉండగా భారత్ స్కోర్ 200 పరుగులు దాటుతుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔట్ కావడంతో పరిస్థితి తారుమారైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతులు వృధా చేసి (11 బంతుల్లో 5) ఔటయ్యాడు. అంతకుముందే శివమ్ దూబే (2) నిరాశపరిచాడు.తిలక్ వర్మ (7 బంతుల్లో 5) కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. అక్షర్ పటేల్ (15 బంతుల్లో 10 నాటౌట్) దారుణంగా ఆడాడు. చివరి ఓవర్లో బంతులు వృధా చేసి భారత్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమయ్యేలా చేశాడు.తొలి 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన భారత్.. చివరి 9 ఓవర్లలో కేవలం 56 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.అనంతరం 169 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆది నుంచే ప్రత్యర్ధిపై ఒత్తిడి తెచ్చింది. బుమ్రా (4-0-18-2), వరుణ్ చక్రవర్తి (4-0-29-2), కుల్దీప్ యాదవ్ (4-0-18-3), అక్షర్ పటేల్ (4-0-37-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరి ధాటికి బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సైఫ్ హసన్ (69) ఒంటరిపోరాటం చేశాడు. అతనితో పాటు పర్వేజ్ హొస్సేన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సెప్టెంబర్ 26న జరిగే నామమాత్రపు మ్యాచ్‌లో భారత్.. శ్రీలంకతో తలపడుతుంది. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
Asia cup 2025: సూర్యకుమార్ యాదవ్‌పై ఫ్యాన్స్ ఫైర్
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో (India vs Bangladesh) టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నామమాత్రపు స్కోర్‌కు పరిమితమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) మంచి ఆరంభాన్ని ఇచ్చినా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులే చేసింది.అభిషేక్ క్రీజ్‌లో ఉండగా భారత్ స్కోర్ తప్పకుండా 200 పరుగులు దాటుతుందని అంతా అనుకున్నారు. అయితే అతను ఔట్ కావడంతో పరిస్థితితారుమారైంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya kumar Yadav) బంతులు వృధా చేసి (11 బంతుల్లో 5) ఔటయ్యాడు. అంతకుముందే శివమ్ దూబే (2) నిరాశపరిచాడు.తిలక్ వర్మ (7 బంతుల్లో 5) కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాడు. హార్దిక్ పాండ్యా (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడినా.. టీ20 స్థాయి తగ్గట్టుగా లేదు. అక్షర్ పటేల్ (15 బంతుల్లో 10 నాటౌట్) దారుణంగా ఆడాడు. చివరి ఓవర్లో బంతులు వృధా చేసి భారత్ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమయ్యేలా చేశాడు.తొలి 11 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన భారత్.. చివరి 9 ఓవర్లలో కేవలం 56 పరుగులే చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది.మంచి ఆరంభం లభించినా టీమిండియా నామమాత్రపు స్కోర్‌కు పరిమితమవడానికి అభిషేక్, గిల్ మినహా అంతా కారణమైనప్పటికీ.. భారత అభిమానులు మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను నిందిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఇన్ ఫామ్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను కాదని అక్షర్ పటేల్‌ను ముందుగా పంపడాన్ని తప్పుబడుతున్నారు. శివమ్ దూబే విషయంలోనూ (తిలక్ వర్మను కాదని దూబేను వన్‌డౌన్‌లో పంపారు) ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. వ్యక్తితంగా విఫలమవడాన్ని నిందిస్తున్నారు. మొత్తంగా బ్యాటింగ్ ఆర్డర్లో అనవసర మార్పులపై ఫైరవుతున్నారు.భారత బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల గురించి అటుంచితే, ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. భారత ఆటగాళ్ల వరుస విరామాల్లో ఔట్ చేసి ఒత్తిడి తెచ్చారు. ముస్తాఫిజుర్ తన అనుభవాన్నంతా రంగరించి చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రిషద్ హొసేన్, తంజిమ్ హసన్ కూడా భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.169 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బరిలోకి దిగిన భారత్.. ఆదిలోనే సత్ఫలితాన్ని రాబట్టగలిగింది. బుమ్రా తన తొలి ఓవర్లోనే తంజిద్‌ను (1) ఔట్ చేశాడు. ఆతర్వాత కుల్దీప్ ధాటిగా ఆడుతున్న పర్వేజ్ హొసేన్‌ను (21) పెవిలియన్‌కు పంపాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 57/2గా ఉంది. సైఫ్ హసన్ (24), తౌమిద్ హృదోయ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: Asia cup 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ -
Asia cup 2025: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
ఆసియా కప్ 2025లో (Asia cup 2025) అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసాల పర్వం కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో (India vs Bangladesh) మరో మెరుపు అర్ద సెంచరీ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ అభి'షేక్' (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేశాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించడంతో అభిషేక్ ఖాతాలో ఓ రికార్డు వచ్చి చేరింది.ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో విరాట్ కోహ్లి (Virat kohli) తర్వాత వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా అభిషేక్ చరిత్రకెక్కాడు. ప్రస్తుత ఎడిషన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న అభిషేక్ ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటిదాకా 5 మ్యాచ్‌లు ఆడిన అతను.. 206.67 స్ట్రయిక్‌రేట్‌తో 248 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి 3 ఓవర్లలో నిదానంగా ఆడినప్పటికీ.. ఆతర్వాత అభిషేక్ గేర్ మార్చడంతో ఒక్కసారిగా పుంజుకుంది. అభిషేక్, గిల్ క్రీజ్‌లో ఉన్నంత వరకు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు.. ఈ ఇద్దరు ఔట్ కావడంతో ఒక్కసారిగా నెమ్మదించింది.వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 15 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా (11), అక్షర్ పటేల్ (2) క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ 75, గిల్ 29, శివమ్ దూబే 2, సూర్యకుమార్ యాదవ్ 5, తిలక్ వర్మ 5 పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా బౌలరల్లో రిషద్ హొసేన్ 2, తంజిమ్ సాకిబ్, ముస్తాఫిజుర్ తలో వికెట్ తీశారు. అభిషేక్ శర్మ రనౌటయ్యాడు. చదవండి: సందిగ్దంలో సెలెక్టర్లు.. విండీస్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన వాయిదా -
Asia cup 2025: బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయం
బంగ్లాదేశ్‌పై టీమిండియా ఘన విజయంఆసియా కప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌటైంది.భారత్ తరఫున అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మరోసారి విధ్వంసం సృష్టించగా.. బంగ్లాదేశ్ తరఫున సైఫ్ హసన్ (69) ఒంటరిపోరాటం చేశాడు. ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్15.2వ ఓవర్- 109 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి సైఫుద్దీన్ (4) ఔటయ్యాడు. ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్12.3వ ఓవర్- 87 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ జాకిర్ అలీ (4) రనౌటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్10.4వ ఓవర్-74 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి షమీమ్ హొస్సేన్‌ను (0) క్లీన్ బౌల్డ్ చేశాడు. 11 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోర్ 75/4గా ఉంది. జాకిర్ అలీ (1), సైఫ్ హసన్ (40) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలవాలంటే 54 బంతుల్లో 94 పరుగులు చేయాలి.టార్గెట్ 169.. తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్1.2వ ఓవర్- 5 పరుగుల వద్దనే బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో శివమ్ దూబే క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (1) ఔటయ్యాడు. ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైన టీమిండియాటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (75), శుభ్‌మన్ గిల్ (29) క్రీజ్‌లో ఉన్నంత సేపు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు, ఆతర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులకే పరిమితమైంది. అభిషేక్, గిల్ తర్వాత హార్దిక్ పాండ్యా (38) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. అఖరి ఓవర్లో అక్షర్ పటేల్ (15 బంతుల్లో 10 నాటౌట్) బంతులు వృధా చేశాడు. శివమ్ దూబే (2), సూర్యకుమార్ యాదవ్ (5), తిలక్ వర్మ (5) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ 2, తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్, సైఫుద్దీన్ తలో వికెట్ తీశారు. నిదానించిన భారత స్కోర్వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో భారత స్కోర్ నిదానించింది. 16 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 135 పరుగులుగా ఉంది. హార్దిక్ పాండ్యా (12), అక్షర్ పటేల్ (4) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్11.6వ ఓవర్-114 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (5) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా11.1వ ఓవర్- 112 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న అభిషేక్ శర్మ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అనూహ్యంగా రనౌటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 96/210 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 96/2గా ఉంది. అభిషేక్ శర్మ 60 (32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా8.1వ ఓవర్-83 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రిషద్ హొసేన్ బౌలింగ్‌లో శివమ్ దూబే (2) ఔటయ్యాడు. అభిషేక్ మెరుపు అర్ద శతకంఅభిషేక్ శర్మ మరో సారి బ్యాట్ ఝులిపించాడు. 25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అర్ద సెంచరీ పూర్తి చేశాడు. 8 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 83/1గా ఉంది. అభిషేక్‌తో పాటు శివమ్ దూబే (2) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా6.2వ ఓవర్- 77 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. రిషద్ హోసేన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో శుభ్‌మన్ గిల్ (19 బంతుల్లో 29; 2 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. మరో ఎండ్‌లో అభిషేక్ 46 (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పూనకాలు ఎత్తి ఉన్నాడు. అతనికి జతగా శివమ్ దూబే క్రీజ్‌లోకి వచ్చాడు. గేర్ మార్చిన అభిషేక్, గిల్3 ఓవర్ల వరకు నిదానంగా ఆడిన భారత ఓపెనర్లు అభిషేక్, గిల్ ఆతర్వాత ఒక్కసారిగా గేర్ మార్చారు. 4,5,6 ఓవర్లలో ఏకంగా 55 పరుగులు పిండుకున్నారు. ఫలితంగా 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 72/0గా ఉంది. అభిషేక్ 46 (19 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ 25 (17 బంతుల్లో ఫోర్, సిక్స్) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆచితూచి ఆడుతున్న టీమిండియా ఓపెనర్లుభారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ తమ సహజ శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతున్నారు. ముఖ్యంగా అభిషేక్ నెమ్మదించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అభిషేక్ 8 బంతుల్లో కేవలం ఒకే బౌండరీతో 8 పరుగులు చేయగా.. గిల్ 10 బంతుల్లో బౌండరీలు లేకుండా 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. 3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 17/0గా ఉంది. ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్ దూరమయ్యాడు. ప్రాక్టీస్ సందర్భంగా అతను గాయపడినట్లు తాత్కాలిక కెప్టెన్ జాకిర్ అలీ తెలిపాడు.తుది జట్లు..భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్‌కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిబంగ్లాదేశ్: సైఫ్ హసన్, తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(వికెట్‌కీపర్/కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ -
ఆసియా కప్-2025: ఫైనల్ రేసు.. ఏ జట్లకు అవకాశాలు ఎక్కువ?
ఆసియా కప్ టీ20- 2025 టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంటోంది. సూపర్-4 దశలో భాగంగా ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంక (BAN vs SL)పై నాలుగు వికెట్ల తేడాతో గట్టెక్కగా.. టీమిండియా పాకిస్తాన్ (IND vs PAK)ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఇక తాజాగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్.. శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాలను సజీవం చేసుకుంది. మరోవైపు.. ఇప్పటికే సూపర్-4లో బంగ్లా చేతిలో ఓడిన శ్రీలంక.. తాజాగా పాక్ చేతిలోనూ ఓడి ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది.అయితే, ఇతర జట్ల ఫలితాల ఆధారంగా లంక జట్టుకు ఇంకా దింపుడుకళ్లెం ఆశలు మిగిలి ఉన్నట్లే!.. ఈ నేపథ్యంలో టైటిల్ పోరుకు అర్హత సాధించేందు (Asia Cup 2025 Final Scenarios)కు నాలుగు జట్లకు అవసరమైన సమీకరణలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం!ఫైనల్ రేసు.. ఏ జట్లకు అవకాశాలు ఎక్కువ?సూపర్-4లో టీమిండియా తొలి మ్యాచ్‌లో పాక్‌పై గెలిచి రెండు పాయింట్లు సాధించింది. నెట్ రన్‌రేటు పరంగానూ(+0.689) మెరుగ్గా ఉండటం వల్ల ప్రస్తుతం టాపర్‌గా ఉంది. ఇక పాకిస్తాన్ రెండింట ఒక విజయంతో రెండు పాయింట్లతో.. +0.226 నెట్ రన్‌రేటుతో రెండో స్థానంలో ఉంది.మరోవైపు.. బంగ్లాదేశ్ ఒక విజయంతో రెండు పాయింట్లు (+0.121) సాధించి మూడో స్థానంలో ఉండగా.. లంక రెండింటికి రెండు ఓడి ఆఖరి ప్లేస్‌లో నిలిచింది.టీమిండియాకు నల్లేరు మీద నడకేఇక బుధవారం నాటి మ్యాచ్‌లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టీ20 ఫార్మాట్లో ఇరుజట్లు ముఖాముఖి ఎదురుపడిన సందర్భాల్లో భారత్ 16 సార్లు గెలుపొందగా.. బంగ్లా ఒకే ఒక్కసారి విజయం సాధించింది. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితాన్ని తేలికగానే అంచనా వేయవచ్చు.బంగ్లాపై గెలిస్తే భారత్ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. ఆ తర్వాత శ్రీలంకను కూడా ఓడిస్తే.. టీమిండియా అజేయంగా ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు.. పాకిస్తాన్ తమకు మిగిలిన ఒక్క మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను తప్పక ఓడించాల్సి ఉంటుంది. లేదంటే పాక్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి.అలాంటపుడు టీమిండియా చేతిలో బంగ్లా ఓడినప్పటికీ.. పాక్, బంగ్లాలు పాయింట్ల పరంగా సమమవుతాయి. అప్పుడు నెట్ రన్ రేటుది కీలక పాత్ర. అలా కాకుండా.. పాక్ బంగ్లాపై గెలవడంతో పాటు.... టీమిండియా బంగ్లా, లంకలను ఓడించిందంటే.. పాక్ కూడా టైటిల్ పోరుకు నేరుగా అర్హత సాధిస్తుంది.ఇది టీ20 ఫార్మాట్ గురూ!ఒకవేళ ఊహించని రీతిలో బంగ్లాదేశ్ గనుక టీమిండియాపై గెలిస్తే.. అదే విధంగా శ్రీలంక చేతిలో భారత జట్టు ఓడితే అప్పుడు పాక్‌తో పాటు బంగ్లాకు అవకాశాలు మిగిలి ఉంటాయి. ఇది దాదాపు అసాధ్యం. ప్రస్తుత టీమిండియా పటిష్టంగా ఉంది కాబట్టి.. ఇది జరగకపోవచ్చు. ఏదేమైనా ఫైనల్ చేరే అవకాశాలు టీమిండియా, పాకిస్తాన్లకే ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఇది టీ20 ఫార్మాట్ కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. అయితే, చరిత్రను బట్టి భారత్- పాక్ ఫైనల్లో ఢీకొట్టుకునే అవకాశాలను మాత్రం కొట్టిపడేయలేము. ఇదిలా ఉంటే.. దాయాది పాక్‌ను లీగ్ దశలో, సూపర్-4లో టీమిండియా ఓడించిన విషయం తెలిసిందే.మరి శ్రీలంక పరిస్థితి ఏమిటి?శ్రీలంక ఫైనల్ రేసులోకి రావాలంటే.. బంగ్లాదేశ్.. టీమిండియా, పాకిస్తాన్‌లపై గెలవాలి. అంతేకాదు.. తమ ఆఖరి మ్యాచ్‌లో టీమిండియాపై శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించాలి. అప్పుడే లంక ఆశలు మిగిలి ఉంటాయి.చదవండి: వెక్కిరించిన పాక్ బౌలర్.. ఒకటి కాదు.. రెండుసార్లు ఇచ్చిపడేసిన హసరంగ -
ఏ జట్టైనా టీమిండియాను ఓడించగలదు.. బంగ్లాదేశ్ కోచ్ అహంకారపూరిత వ్యాఖ్యలు
ఆసియా కప్-2025లో (Asia cup 2025) బంగ్లాదేశ్ (Bangladesh) ఓ మోస్తరు ప్రదర్శనలతో ముందుకెళ్తుంది. గ్రూప్ దశలో హాంగ్‌కాంగ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న జట్లను ఓడించి సూపర్-4కు చేరిన ఆ జట్టు.. ఈ దశలో శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఆ జట్టు రేపు జరుగబోయే వారి రెండో సూపర్-4 మ్యాచ్‌లో పటిష్టమైన భారత జట్టును ఢీకొట్టాల్సి ఉంది (India Vs Bangladesh). ఈ మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ (Phil Simmons) టీమిండియాపై (Team India) అహంకారపూరిత వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకపై గాలివాటంగా లభించిన గెలుపును (వాపును) చూసుకొని బలుపులా భావిస్తున్న అతను.. ప్రపంచ నంబర్ వన్ టీ20 జట్టైన టీమిండియాతోనే మైండ్‌గేమ్ ఆడుతున్నాడు. ఇవాళ (సెప్టెంబర్ 23) జరిగిన ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ప్రతి జట్టుకి భారత్‌ను ఓడించే సామర్థ్యం ఉందంటూ అతి వ్యాఖ్యలు చేశాడు. ఆ రోజు ఆట ఎలా ఆడతామన్నదే ముఖ్యం కాని, రికార్డులు కాదంటూ బీరాలు పలికాడు.భారత్ ప్రపంచంలో నంబర్ వన్ టీ20 జట్టు అయ్యుండొచ్చు, మేము మా బెస్ట్ క్రికెట్ ఆడి వాళ్ల నుంచి తప్పులు రాబడతామని అతి విశ్వాసం ప్రదర్శించాడు. మేము శ్రీలంకను మాత్రమే ఓడించేందుకు కాదు, టోర్నీని గెలిచేందుకు వచ్చామని గొప్పలు పోయాడు.రేపు భారత్‌తో, ఆతర్వాతి రోజు (సెప్టెంబర్ 25) పాకిస్తాన్‌తో ఆడటంపై మాట్లాడుతూ.. బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్‌లు ఆడటం ఏ జట్టుకైనా కష్టమే అని అన్నాడు. మా పట్ల ఇలా జరగడం అన్యాయమని వ్యాఖ్యానించాడు.సిమ్మన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు తాహతకు మించినవిగానే అనిపిస్తున్నప్పటికీ.. వారిలోని ఆత్మ విశ్వాసాన్ని సూచిస్తున్నాయి. కొందరు భారత అభిమానలు ఈ వ్యాఖ్యలను తప్పుబడుతుంటే, చాలామంది లైట్‌గా తీసుకుంటున్నారు.ఆమాత్రం జోష్‌తో బరిలోకి దిగితేనే టీమిండియాకు కనీస పోటీ అయినా ఇవ్వగలదని అంటున్నారు. సిమ్మన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.కాగా, సూపర్-4లో జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంకపై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ మరో బంతి మిగిలుండగా లక్ష్యాన్ని చేరుకుంది. వాస్తవానికి బంగ్లాదేశ్‌కు ఈ గెలుపు అంత ఈజీగా ఏమీ దక్కలేదు. కాస్త అటు, ఇటు అయ్యుంటే శ్రీలంకనే గెలిచేది. చివరి ఓవర్లో గెలుపుకు 5 పరుగులు మాత్రమే చేయాల్సిన దశలో బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి ఒత్తిడికి లోనైంది. నసుమ్ అహ్మద్ ఐదో బంతికి రిస్క్ చేసి సింగిల్ తీయడంతో ఆ జట్టు గెలుపు ఖరారైంది. చదవండి: యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన -
కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..
అంతా ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్‌లో భారత జట్టు పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ధ్రువీకరించింది. ఇరు బోర్డుల అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ కమిట్మెంట్స్, రెండు జట్ల షెడ్యూల్‌ను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాము.ఈ సిరీస్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని భారత క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.వాయిదా ఎందుకంటే?కాగా ఈ ఏడాది ఆరంభం నుంచే బంగ్లా-భారత్ వైట్‌బాల్ సిరీస్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి. బంగ్లా పర్యటనకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూసింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా ఈ పర్యటనను వాయిదా వేసుకోమని భారత ప్రభుత్వం బీసీసీఐని సూచించినట్లు తెలుస్తోంది.మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలాక అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడికింది. ప్రస్తుతం తాత్కాళిక ప్రభుత్వ ఏర్పాటుతో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు కనబడుతున్నప్పటికీ, నివురుగప్పిన నిప్పులా మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తితే ఛాన్స్ ఉంది. అంతకుతోడు బంగ్లాదేశ్ మాజీ మంత్రులు, రాజకీయ నేతలపై అక్కడ తరచూ మూకదాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.వచ్చే ఏడాదికల్లా ఎన్నికలు పూర్తయితే పరిస్థితిలో మార్పుంటుందని బోర్డు భావిస్తోంది. వీటిన్నంటిని పరిగణలోకి తీసుకునే ఈ పర్యటను బీసీసీఐ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం.. భారత జట్టు ఆతిథ్య బంగ్లాతో వచ్చేనెల 17 నుంచి 31 వరకు చిట్టగాంగ్, ఢాకా వేదికలపై మూడేసి చొప్పున వన్డేలు, టి20లు ఆడాల్సి ఉంది. రోహిత్-కోహ్లి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..మరోవైపు తమ ఆరాధ్య క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను మైదానంలో చూడాలన్న ఆశపడ్డ అభిమానులు మరి కొన్న నెలలు వేచి చూడాల్సిందే. టెస్టు, టీ20లకు ప్రకటించిన రోహిత్, కోహ్లి కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నారు. ఈ క్రమంలో బంగ్లాతో జరిగే వన్డే సిరీస్‌లో వీరిద్దరని చూడవచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు టూర్ వాయిదా పడడంతో ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో రో-కో ద్వయం ఆడనున్నారు.చదవండి: సునామీ శతకంతో విరుచుకుపడ్డ వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్ -
భారత్-బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్‌లపై నీలినీడలు?
ఈ ఏడాది ఆగస్టులో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన వైట్‌బాల్ సిరీస్‌లపై అనిశ్చితి నెలకొంది. తాజాగా ఈ సిరీస్‌లకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ అమీనుల్ ఇస్లాం కీలక అప్డేట్ ఇచ్చారు. బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ(BCCI) ఇంకా ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తుందని అమీనుల్ ఇస్లాం తెలిపాడు.వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టులో భారత జట్టు మూడు టీ20, మూడు వన్డేల సిరీస్ కోసం బంగ్లాలో పర్యాటించాల్సి ఉంది. ఆగస్టు 17 నుంచి టీమిండియా టూర్ ప్రారంభమవ్వాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్-భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్‌లు జరగడం అసంభవం అన్పిస్తోంది.అయితే బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ మాత్రం ఈ సిరీస్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆగస్టులో వీలుకాకపోయినా, తర్వాతైనా భారత జట్టు తమ దేశానికి రావాలని అతడు ఆశిస్తున్నాడు. "ఈ పర్యటనకు సంబంధించి మేము బీసీసీఐతో నిరంతరం చర్చలు జరుపుతున్నాము. వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సిరీస్‌లను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాము. ఒకవేళ ఇప్పుడు వీలుకాకపోతే తర్వాతైనా భారత్‌కు ఆతిథ్యమిస్తామన్న నమ్మకం మాకు ఉంది. భారత్ ఇంకా అధికారికంగా టూర్‌ను వాయిదా వేయలేదు. భారత జట్టు బంగ్లా పర్యటన అనేది ప్రభుత్వం నుండి అనుమతి లభించడంపై ఆధారపడి ఉందని" బోర్డు మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో అమీనుల్ పేర్కొన్నారు. కాగా భారత జట్టు వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకపోతే, బీసీబీ ఐపీఎల్-2026 వేచి ఉండాల్సిందే. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరిలో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియా షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయింది. పొట్టి ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ జరగనుంది. కాబట్టి వచ్చే ఏడాది ఐపీఎల్ తర్వాతే భారత జట్టుకు కాస్త సమయం లభిస్తోంది. టీమిండియా చివరగా 2022లో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాలో పర్యటించింది.చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్! అతడికి పిలుపు? -
టీమిండియాకు శుభవార్త.. అతడు వచ్చేస్తున్నాడు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు సర్జరీ విజయవంతంగా పూర్తైంది. చాన్నాళ్లుగా ‘స్పోర్ట్స్ హెర్నియా’ (sports hernia)తో బాధ పడుతున్న ఈ పవర్ హిట్టర్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని సూర్యకుమార్ యాదవ్ స్వయంగా వెల్లడించాడు.కోలుకుంటున్నా‘‘స్పోర్ట్స్హెర్నియాకు సంబంధించి కుడివైపున పొట్ట దిగువ భాగంలో చేసిన సర్జరీ పూర్తైంది. శస్త్ర చికిత్స ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోయినందుకు సంతోషంగా ఉంది. కోలుకునే దశలో ఉన్నాను.బ్యాట్ పట్టి మళ్లీ మైదానంలో దిగేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని సూర్యకుమార్ యాదవ్ తన ఆరోగ్యం, పునరాగమనానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అప్డేట్ అందించాడు. ఆస్పత్రి బెడ్‌పై పడుకుని.. థంబ్స్ అప్ సింబల్ చూపిస్తున్న ఫొటో ఇందుకు జతచేశాడు.సరికొత్త రికార్డుకాగా ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ తరఫున సూర్యకుమార్ అదరగొట్టాడు. ఈ సీజన్లో మొత్తంగా 717 పరుగులతో దుమ్ములేపాడు. తద్వారా ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు రాబట్టిన ముంబై ఇండియన్స్ నాన్- ఓపెనర్‌గా ఈ మిడిలార్డర్ బ్యాటర్ నిలిచాడు.అంతేకాదు.. ఆడిన పదహారు మ్యాచ్‌లలో వరుసగా 25 కంటే ఎక్కువ స్కోరు చేసి సూర్య సరికొత్త రికార్డు సాధించాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ముంబై టీ20 లీగ్‌లో సైతం పాల్గొన్నాడు. అయితే ముంబై లీగ్‌లో మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో నొప్పి ఎక్కువవడంతో... ‘స్పోర్ట్స్ హెర్నియా’కు చికిత్స తీసుకోవాలని 33 ఏళ్ల సూర్య భావించాడు.‘సూర్య చాన్నాళ్లుగా నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. దీనికి సంబంధించిన వైద్యులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒకవేళ అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకుంటాడు’ అని బీసీసీఐ వర్గాలు గతంలో వెల్లడించాయి. ఇక ఈ ఏడాది ఆగస్టు వరకు భారత జట్టుకు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు లేవు.బంగ్లాదేశ్ పర్యటనఈ నేపథ్యంలో చికిత్సకు ఇదే సరైన సమయమని భావించిన సూర్య కోలుకునేందుకు తగినంత సమయం ఉండటంతో వైద్యులను సంప్రదించాడు. జర్మనీలోని మ్యూనిచ్‌లో సర్జరీ చేయించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఈ ఏడాది ఆగష్టులో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది.ఇందులో భాగంగా ఆతిథ్య జటుట్తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే, స్పోర్ట్స్ హెర్నియా కారణంగా సూర్య జట్టుకు దూరమవుతాడని.. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడనే వార్తలు వచ్చాయి.సూర్య వచ్చేస్తాడు!అయితే, తాను కోలుకుంటున్నానని.. త్వరలోనే మైదానంలో అడుగుపెడతానంటూ సూర్య తాజాగా చెప్పడంతో టీమిండియా అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా సూర్య బాధ్యతలు చేపట్టాడు. సూర్య సారథ్యంలో టీమిండియా టీ20 క్రికెట్ అద్భుత విజయాలు సాధించింది. శ్రీలంకలో 3-0తో క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు బంగ్లాదేశ్, సౌతాఫ్రికా తదితర జట్లపై గెలిచింది.చదవండి: Rohit Sharma On T20 WC: భయంతో వణికిపోయా.. అతడే గేమ్ ఛేంజర్ View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) -
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ పర్యటనకు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశముంది.సూర్యకుమార్ యాదద్ మరో శస్త్రచికిత్స లండన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. న్యూస్24 రిపోర్టర్ వైభవ్ భోలా ప్రకారం.. సూర్యకుమార్ కుడివైపున స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సూర్య తన గాయానికి శస్త్రచికిత్స చేసుకోవడానికి ఇప్పటికే లండన్‌కు వెళ్లినట్లు వైభవ్ భోలా ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కాగా ఈ ముంబై ఆటగాడు స్పోర్ట్స్ హెర్నియా బారిన పడడం ఇది రెండో సారి. గతేడాది జనవరిలో ఎడమ వైపున నొప్పి రావడంతో జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. కానీ ఫిట్నెస్ సాధించి ఐపీఎల్‌తో పాటు, టీ20 ప్రపంచకప్-2024లో భాగమయ్యాడు.ఇప్పుడు కుడివైపు నొప్పి రావడంతో మళ్లీ శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే మిస్టర్ 360 దాదాపు రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. బంగ్లా టూర్‌కు సూర్య సూర్యదూరమైతే భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించే అవకాశముంది. ఐపీఎల్-2025లో అద్బుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన అయ్యర్.. తిరిగి టీ20 జట్టులోకి రీఎంట్రీకి సిద్దంగా ఉన్నాడు.చదవండి: ICC Odi Rankings: వరల్డ్ నెం1 బ్యాటర్‌గా టీమిండియా స్టార్ ఓపెనర్ -
ఆసియా కప్, బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది స్వదేశంలో (సెప్టెంబర్) జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో పాకిస్తాన్ పాల్గొనాల్సి ఉండటంతో ఈ మేరకు నిర్ణయించినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.🚨 LIKELY NO ASIA CUP 2025 🚨- Asia Cup 2025 remains under a cloud because of the terror attack in Pahalgam. (Sahil Malhotra/TOI). pic.twitter.com/dji5zdwc5T— Tanuj (@ImTanujSingh) May 2, 2025కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్, పాక్ సహా 8 జట్లు పాల్గొనాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగుతుందని ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) నిర్ణయించింది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగాల్సి ఉంది. ఈ టోర్నీకి భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. హాంగ్‌కాంగ్, ఒమన్, యూఏఈ 2024 ఏసీసీ ప్రీమియర్ కప్ ద్వారా క్వాలిఫై అయ్యాయి.🚨 NO INDIA-BANGLADESH SERIES 🚨- Team India Unlikely to tour Bangladesh for the White ball series in August due to cross border tension. (Sahil Malhotra/TOI). pic.twitter.com/qsBdZO7ccE— Tanuj (@ImTanujSingh) May 2, 2025బంగ్లాదేశ్ పర్యటన కూడా రద్దు..?అక్రమ చోరబాట్లు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ బంగ్లాదేశ్ పర్యటనను కూడా క్యాన్సిల్ చేసుకోనుందని సమాచారం. ఎఫ్టీపీ ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ పర్యటన రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.షెడ్యూల్ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్ జరుగనుంది. ఆగస్ట్ 17న తొలి వన్డే, 20న రెండో వన్డే ఢాకా వేదికగా జరగాల్సి ఉంది. ఆతర్వాత ఆగస్ట్ 23న మూడో వన్డే, 26న తొలి టీ20 చట్టోగ్రామ్‌లో జరగాల్సి ఉన్నాయి. చివరి రెండు టీ20లు ఆగస్ట్ 29, 31 తేదీలోల ఢాకాలో జరగాల్సి ఉన్నాయి.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. పాకిస్తాన్‌కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో భారత్ పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. పాక్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ల రద్దును కొనసాగించింది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను బ్యాన్ చేసింది. పాక్‌కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్‌కు సూచించింది. -
బంగ్లాతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్‌గా గిల్! యువ సంచలనం రీ ఎంట్రీ?
భారత పురుషుల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటన ఖారరైంది. ఈ ఏడాది ఆగస్టులో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లలో తలపడేందుకు బంగ్లాదేశ్‌కు టీమిండియా వెళ్లనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మంగళవారం విడుదల చేసింది.ఆగస్టు 17న మిర్పూర్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్ట్ సిరీస్ ముగిసిన రెండు వారాలకే భారత జట్టు బంగ్లాకు పయనం కానుంది. ఈ క్రమంలో బంగ్లాతో వన్డే సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు గైర్హాజరు అయ్యే అవకాశం ఉంది.ఒకవేళ రోహిత్ శర్మ దూరమైతే బంగ్లాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌లో గిల్‌తో పాటు జైశ్వాల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ ప్లేయర్ ఆడే ఛాన్స్ ఉంది. కాగా వీరు ముగ్గురు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడనునున్నారు.కానీ సెలక్టర్లు మాత్రం బంగ్లా సిరీస్‌కు ఈ త్రయానికి విశ్రాంతి ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను బంగ్లాతో టీ20 సిరీస్‌లో మాత్రం ఆడేంచే అవకాశమున్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో టీ20 ఆసియా కప్-2025 జరగనుండడంతో బంగ్లా సిరీస్‌లో బుమ్రా ఆడడం దాదాపుగా ఖాయం. బుమ్రా ఇటీవలే గాయం నుంచి కోలుకుని ఐపీఎల్లో ఆడుతున్నాడు.మరోవైపు ఐపీఎల్లో దుమ్ములేపుతున్న గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయిసుదర్శన్ తిరిగి వన్డే, టీ20 జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్ 15) ప్రకటించింది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. రెండు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆగస్ట్ 17న వన్డే సిరీస్.. 26న టీ20 సిరీస్ మొదలవుతాయి.వన్డే సిరీస్ షెడ్యూల్..తొలి వన్డే – ఆదివారం, ఆగస్టు 17, మిర్పూర్రెండో వన్డే – బుధవారం, ఆగస్టు 20, మిర్పూర్మూడో వన్డే – శనివారం, ఆగస్టు 23, చట్టోగ్రామ్టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి T20I – మంగళవారం, ఆగస్టు 26, చట్టోగ్రామ్లరెండో T20I – శుక్రవారం, ఆగస్టు 29, మిర్పూర్లమూడు T20I – ఆదివారం, ఆగస్టు 31, మిర్పూర్కాగా, భారత క్రికెటర్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ మే 25న ముగుస్తుంది. అనంతరం భారత్ జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.ఇంగ్లండ్‌లో భారత పర్యటన షెడ్యూల్..తొలి టెస్ట్- జూన్ 20-24రెండో టెస్ట్- జులై 2-6మూడో టెస్ట్- జులై 10-14నాలుగో టెస్ట్- జులై 23-27ఐదో టెస్ట్- జులై 31-ఆగస్ట్ 3ఈ సిరీస్ తర్వాతే భారత్ బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరుతుంది.అనంతరం భారత జట్టు సెప్టెంబర్ నెలంతా ఖాళీగా ఉండి అక్టోబర్ 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది.వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్..తొలి టెస్ట్- అక్టోబర్ 2-6 (అహ్మదాబాద్)రెండో టెస్ట్- అక్టోబర్ 10-14 (కోల్‌కతా)ఈ సిరీస్ తర్వాత భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి.ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్‌అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్‌అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్‌నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత్ స్వదేశంలో సౌతాఫ్రికాతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. భారత్‌లో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..తొలి టెస్ట్- నవంబర్ 14-18 (న్యూఢిల్లీ) రెండో టెస్ట్- నవంబర్ 22-26 (గౌహతి)తొలి వన్డే- నవంబర్ 30 (రాంచీ)రెండో వన్డే- డిసెంబర్ 3 (రాయ్‌పూర్)మూడో వన్డే- డిసెంబర్ 6 (వైజాగ్)తొలి టీ20- డిసెంబర్ 9 (కటక్)రెండో టీ20- డిసెంబర్ 11 (ఛండీఘడ్)మూడో టీ20- డిసెంబర్ 14 (ధర్మశాల)నాలుగో టీ20- డిసెంబర్ 17 (లక్నో)ఐదో టీ20- డిసెంబర్ 19 (అహ్మదాబాద్) -
ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్.. రిషభ్ పంత్ భావోద్వేగం
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు(Laureus World Sports Awards)కు అతడి పేరును పరిశీలిస్తున్నట్లు లారెస్ స్పోర్ట్ వెల్లడించింది. అత్యుత్తమ పునరాగమనం(బెస్ట్ కమ్‌బ్యాక్ ఆఫ్ ది ఇయర్) విభాగంలో అతడిని నామినేట్ చేసినట్లు తెలిపింది. ఈ అవార్డు కోసం పంత్‌తో పాటు మరో ఐదుగురు పోటీపడుతున్నారు.పంత్ భావోద్వేగంఇక తన పేరు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అవడం పట్ల రిషభ్ పంత్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఆ దేవుడు మనకు ఇచ్చిన వాటి పట్ల కృతజ్ఞతతో ఉండాలని నేను విశ్వసిస్తాను. కారు ప్రమాదంలో దాదాపు చావు అంచుల దాకా వెళ్లిన నేను ఆ దేవుడి దయ వల్లే బయటపడ్డాను.ఆ తర్వాత నాలో చాలా పరివర్తన వచ్చింది. పిచ్‌పై తిరిగి పరుగుల వరద పారించాలనే కసి మరింతగా పెరిగింది. అదంత సులువు కాదని తెలుసు. అయినా.. సరే నేను పోరాడాలనే నిర్ణయించుకున్నా. తిరిగి ఫిట్నెస్ సాధించి టీమిండియాకు మళ్లీ ఆడాలనే కలను నెరవేర్చుకున్నాను.అయితే, నా ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో కఠిన సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. నాతో నేను ఓ యుద్ధమే చేశా. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నా. లారెస్ వరల్డ్ కమ్‌బ్యాక్ అవార్డుకు నామినేట్ కావడం నాకు దక్కిన గౌరవం.నేను మళ్లీ సాధారణ జీవితం గడపడానికి నా కుటుంబం, బీసీసీఐ, వైద్యులు, నా వైద్య బృందం, మా జట్టు సహాయక సిబ్బంది, ట్రెయినర్లు.. ముఖ్యంగా నా అభిమానులు కారణం. నాకు దక్కిన గొప్ప గౌరవంగా దీనిని భావిస్తున్నా. ఎప్పుడూ ఓటమిని అంగీకరించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలన్నది నేను నేర్చుకున్న పాఠం. మానసికంగా బలంగా ఉంటే మునుపటి సంతోషాలు అవే వెతుక్కుంటూ వస్తాయి’’ అని రిషభ్ పంత్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.తీవ్రంగా గాయపడి2022, డిసెంబరు 30న రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళ్తున్న క్రమంలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడినా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో డెహ్రాడూన్ ఆస్పత్రిలో ప్రాథమిక చికత్స అనంతరం బీసీసీఐ అతడిని ముంబైకి ఎయిర్‌లిఫ్ట్ చేసింది. ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందించింది.ఈ నేపథ్యంలో క్రమక్రమంగా కోలుకున్న 27 ఏళ్ల పంత్.. ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం బంగ్లాదేశ్‌తో టెస్టుల సందర్భంగా టీమిండియా తరఫున పునరాగమనం చేయడంతో పాటు టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్టులోనూ భాగమయ్యాడు. ఇక ఐపీఎల్-2025 మెగా వేలంలో ఏకంగా రూ. 27 కోట్లకు(లక్నో సూపర్ జెయింట్స్) అమ్ముడుపోయి క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడుతున్న భారత జట్టులో పంత్ భాగం. ఇదిలా ఉంటే పంత్‌తో పాటు బ్రెజిల్ జిమ్నాస్ట్ రెబెక ఆండ్రడే, అమెరికా స్విమ్మర్ సెలెబ్ డ్రెసెల్, స్విట్జర్లాండ్‌కు చెందిన లారా గట్- బెహ్రామీ, స్పెయిన్మోటార్ సైక్లిస్ట్ మార్క్ మార్కేజ్, ఆస్ట్రేలియా స్విమ్మర్ అరియానే టైట్మస్ కమ్‌బ్యాక్ అవార్డు పోటీలో నిలిచారు. ఇక భారత్ నుంచి లారెస్ వరల్డ్ స్పోర్ట్ అవార్డుకు నామినేట్ అయిన ప్లేయర్లలో సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానాన్ని పంత్ ఆక్రమించాడు. కాగా ఏప్రిల్ 21న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఈ అవార్డు వేడుక జరుగనుంది. చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్‌గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
మిస్టరీ గర్ల్‌తో శిఖర్ ధవన్.. సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి (Champions Trophy 2025) అఫీషియల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో అతను ఫిబ్రవరి 20న దుబాయ్‌లో జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా క్రికెటర్లతో కలియ తిరిగిన ధవన్.. ఆతర్వాత వీఐపీ గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ను వీక్షించాడు. Who is this lady with Shikhar Dhawan?🥲 #ShikharDhawan #IndvsBan #RohitSharma𓃵 #ChampionsTrophy pic.twitter.com/JqFTeY4kAp— lei 🌼 (@sakshimadik03) February 20, 2025ఆ సమయంలో ధవన్ పక్కనే ఓ విదేశీ యువతి తారసపడింది. ధవన్.. సదరు విదేశీ యువతి పక్కపక్కనే కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ధనవ్ కొత్త అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. Hahahha such a cute video 😆😆😆 #ShikharDhawan pic.twitter.com/P0PSrC9ydc— Prernaa (@theprernaa) February 21, 2025ఇంతకీ ఆ విదేశీ అమ్మాయి ఎవరని ఆరా తీయగా.. ఆమె పేరు సోఫీ షైన్ అని తెలిసింది. ఐర్లాండ్‌కు చెందిన ఈ యువతిని ధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కూడా చేస్తున్నట్లు బయటపడింది. దీంతో సోఫీ, ధవన్ మధ్య ఏదో నడుస్తుందని నెటిజన్లు కామెంట్లు గుప్పిస్తున్నారు. ధవన్ కొద్ది రోజుల కిందట ఇదే యువతితో ఎయిర్‌పోర్ట్‌లో కూడా కనిపించాడని అంటున్నారు.కాగా, 39 ఏళ్ల ధవన్.. తన మాజీ భార్య, ఆసీస్ పౌరురాలైన అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుని ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నాడు. ధవన్, ఆయేషాకు జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. అయేషాతో విడిపోయాక ధవన్ ఎక్కువగా తన కుమారుడి గురించి సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నాడు. అయేషా.. బిడ్డను తనతో కలువనివ్వట్లేదని ధవన్ పలు సందర్భాల్లో వాపోయాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక ధవన్ ప్రస్తుతం పలు ప్రైవేట్ లీగ్‌ల్లో పాల్గొంటున్నాడు. ధవన్ ఇటీవలే నేపాల్ క్రికెట్ లీగ్‌లో ఆడాడు. ధవన్ 2012లో అయేషాను పెళ్లాడాడు. వీరిద్దరికి సోషల్‌మీడియాలో పరిచయం ఏర్పడింది. అయేషా ధవన్ కంటే పదేళ్లు పెద్దది. ధవన్‌తో పెళ్లి కాక ముందే అయేషాకు వేరే వ్యక్తితో వివాహమైంది. అయేషా ఆ వ్యక్తితో ఇద్దరు కుమార్తెలను కనింది. అయేషా మాజీ కిక్ బాక్సింగ్ ఛాంపియన్.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్‌కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. -
ఆ జట్టేమైనా పాకిస్తానా? ఆసీసా?.. ముందే కొట్టేస్తారు అనుకున్నా: సెహ్వాగ్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. గురువారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. అయితే భారత్ విజయం సాధించినప్పటికి ఛేజింగ్‌లో మాత్రం కాస్త తడబడిందనే చెప్పాలి.ఎందకంటే 229 పరుగుల టార్గెట్‌ను చేధించేందుకు భారత్ ఏకంగా 46.3 ఓవర్ల సమయం తీసుకుంది. లక్ష్య చేధనలో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్‌లో స్పీడ్ తగ్గింది. 30 ఓవర్లు ముగిసే సరికి 144/4 స్కోరుతో భారత్ ఇబ్బందుల్లో పడేలా కనిపించింది.కానీ శుబ్‌మన్ గిల్(101), కేఎల్ రాహుల్(41) ఆచితూచి ఆడుతూ భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. తాజాగా ఈ స్లో రన్ ఛేజింగ్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఇంకాస్త ముందుగానే టార్గెట్‌ను చేధిస్తుందని భావించానని సెహ్వాగ్ అన్నాడు."బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అభిమానులు టెన్షన్ పడి ఉంటారు నేను అనుకోను. ఎందుకంటే ప్రత్యర్ధిగా ఉన్నది బంగ్లాదేశ్. మీరు బంగ్లాను చాలా అద్భుతమైన జట్టుగా నాతో పొగిడించు కోవాలనుకుంటున్నారా? అలా జరగాలంటే వారు ఆట తీరులో మార్పు రావాలి.బంగ్లాదేశ్‌తో ఆడేటప్పుడే నేను భయపడలేదు, ఇప్పుడు ఇంకా ఏమి భయపడతాను. టెన్షన్ పడడానికి ప్రత్యర్ది ఏమైనా పాకిస్తానా..? ఆస్ట్రేలియానా? ఇది చాలా ఈజీ మ్యాచ్. దాదాపు నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. గిల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.తొలుత దూకుడుగా ఆడిన గిల్.. ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా ఆడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేదా శ్రేయాస్ అయ్యర్ ఎక్కువసేపు క్రీజులో ఉండి ఉంటే, ఈ మ్యాచ్‌లో 35 ఓవర్లలోనే ముగిసి ఉండేదని" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు. -
గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్‌కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో గిల్ సెంచరీ అనంతరం సోషల్‌మీడియాలో ఓ టాపిక్ హైలైట్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీ పూర్తి చేసుకునేందుకు కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు. గిల్ సెంచరీ కోసం రాహుల్ చేసిన త్యాగాన్ని నెటిజన్లు ప్రశంశిస్తున్నారు. రాహుల్ స్వలాభం కోసం ఆడే ఆటగాడు కాదని కితాబునిస్తున్నారు. రాహుల్ గతంలో కూడా ఓ సందర్భంలో విరాట్ కోహ్లి సెంచరీ కోసం తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు హార్దిక్ పాండ్యాను విమర్శిస్తున్నారు. రాహుల్ స్థానంలో హార్దిక్ ఉంటే గిల్ సెంచరీ పూర్తయ్యేది కాదని అంటున్నారు. హార్దిక్ చాలా సెల్ఫిష్ ఆటగాడని.. మ్యాచ్ పూర్తి చేసేందుకు అతను తోటి వారి మైలురాళ్ల గురించి పట్టించుకోడని కామెంట్స్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వెస్టిండీస్‌లో తిలక్ వర్మ (49) హాఫ్ సెంచరీని పట్టించుకోకుండా హార్దిక్ సిక్సర్స్‌తో మ్యాచ్‌ను మిగించిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో గిల్ సెంచరీకి ముందు రాహుల్ ఎక్కడ ఔటవుతాడో, హార్దిక్ ఎక్కడ క్రీజ్‌లో వస్తాడో అని అని టెన్షన్ పడినట్లు చెబుతున్నారు. మొత్తానికి గిల్ అభిమానులు హార్దిక్‌ను ఏకి పారేసి, రాహుల్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో గిల్ సెంచరీకి సహకరించే క్రమంలో రాహుల్ చాలా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్.. గిల్‌తో కలిసి ఐదో వికెట్‌కు అజేయమైన 87 పరుగులు జోడించి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ ఏమాత్రం తేడాగా ఆడిన ఫలితం వేరేలా ఉండేది. అప్పటికే భారత్.. రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. పిచ్ నుంచి కూడా బ్యాటర్లకు ఎలాంటి సహకారం లేదు. ఇలాంటి తరుణంలో రాహుల్ చాలా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వ్యక్తిగత ప్రయోజనాన్ని పక్కన పెట్టి గిల్ సెంచరీకి కూడా సహకరించాడు. రాహుల్ సహకారంతో గిల్ వన్డేల్లో తన ఎనిమిదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కూడా చాలా బాధ్యతాయుతంగా ఆడాడు. గిల్ చివరి వరకు క్రీజ్‌లో నిలదొక్కుకోకపోయినా ఫలితం వేరేలా ఉండేది. బంగ్లాదేశ్ బౌలర్లు పిచ్ స్వభావానికి తగట్టుగా బౌలింగ్ చేసి భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ఏదిఏమైనా గిల్, రాహుల్ భాగస్వామ్యం భారత్‌ను గెలిపించింది. అంతకుముందు రాహుల్ కీపింగ్‌లోనూ అదరగొట్టాడు. మూడు అద్భుతమైన క్యాచ్‌లు పట్టుకుని బెస్ట్ ఫీల్డర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరుగనుంది. -
CT 2025: వారిద్దరు బాగా ఆడారు.. అయినా క్రెడిట్ మా వారికే దక్కుతుంది: రోహిత్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో (Champions Trophy) టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో నిన్న (ఫిబ్రవరి 20) జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించింది. ఫీల్డింగ్‌లో నిరాశపరిచినా బౌలర్లు, బ్యాటర్లు టీమిండియాకు విజయం చేకూర్చారు. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌ను ఓడించడంపై సంతృప్తి వ్యక్తం చేశాడు. బంగ్లా బ్యాటర్లు హృదయ్, జాకిర్ అలీ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. వారిద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారని అభినందించాడు. షమీ ఐదు వికెట్ల ప్రదర్శనను కొనియాడాడు. ఇలాంటి ప్రదర్శనల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నామని అన్నాడు. షమీ సామర్థ్యం గురంచి తెలుసని చెప్పాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి షమీ అద్భుత ప్రదర్శనలతో ముందుకొస్తాడని కితాబునిచ్చాడు. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌ను కూడా ప్రశంసించాడు. గిల్ నుంచి ఇలాంటి ప్రదర్శనలు ఆశ్చర్యానికి గురి చేయవని అన్నాడు. గిల్ స్థాయి ఏంటో తమకు తెలుసని తెలిపాడు. అతనో క్లాసికల్ ప్లేయర్ అని కొనియాడాడు. గిల్ చివరి వరకు క్రీజ్‌లో ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.అక్షర్ హ్యాట్రిక్‌ను నేలపాలు చేయడంపై స్పందిస్తూ.. అది చాలా సులభమైన క్యాచ్. నా స్థాయి క్రికెటర్ అలాంటి క్యాచ్‌ను తప్పక పట్టుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు అలా జరుగలేదు. సునాయాసమైన క్యాచ్‌ను వదిలేసినందుకు చింతిస్తున్నాను. అక్షర్ హ్యాట్రిక్ మిస్ అయినందుకు చాలా బాధేసింది. రేపు అతన్ని డిన్నర్‌కు తీసుకెళ్తానంటూ నవ్వులు పూయించాడు.పిచ్ తీరుపై స్పందిస్తూ.. ఊహించిన దానికంటే నిదానంగా ఉందని అన్నాడు. తర్వాతి మ్యాచ్‌లో కూడా పిచ్ ఇలాగే ఉంటుందని చెప్పలేమని తెలిపాడు. ఒక్క మ్యాచ్‌తోనే పిచ్‌ను అంచనా వేయడం కష్టమని పేర్కొన్నాడు. ముందుగా పిచ్ ఇలా ఉంటుందని చెప్పడానికి నేను క్యూరేటర్‌ను కాదని జోక్ చేశాడు. మొత్తంగా జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీల్లో ఒత్తిడి ఉంటుందని, జట్టుగా మేము దాన్ని అధిగమించగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉండిన బంగ్లాదేశ్‌కు ఈ ఇద్దరు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు.అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. భారత ఇన్నింగ్స్‌లో విరాట్ (22), శ్రేయస్ (15), అక్షర్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ మార్చి 23న దుబాయ్‌లోనే జరుగుతుంది. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా 100 విజయాలు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో (Ricky Ponting) కలిసి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు (బంగ్లాతో మ్యాచ్) 138 మ్యాచ్‌ల్లో భారత కెప్టెన్‌గా వ్యవహరించి 100 విజయాలు సాధించాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 33 మ్యాచ్‌ల్లో ఓడింది. మూడు మ్యాచ్‌లు డ్రా కాగా.. ఓ మ్యాచ్ టై అయ్యింది.కెప్టెన్‌గా రోహిత్ సాధించిన 100 విజయాల్లో 50 టీ20ల్లో వచ్చినవి కాగా.. 38 వన్డేల్లో, 12 టెస్ట్‌ల్లో వచ్చాయి. కెప్టెన్‌గా రోహిత్ విజయాల శాతం 70కి పైగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్‌కు ముందు రికీ పాంటింగ్ ఒక్కడే ఈ స్థాయి విన్నింగ్ పర్సంటేజీతో విజయాలు సాధించాడు. ఓ విషయంలో పాంటింగ్‌తో పోలిస్తే రోహితే గ్రేట్ అని చెప్పాలి. పాంటింగ్ 28 ఏళ్ల వయసులో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి ఈ స్థాయి విజయాలు సాధిస్తే.. హిట్ మ్యాన్ 30 ఏళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి విజయాల సెంచరీ పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 30 ఏళ్ల వయసు తర్వాత 100 విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్‌గానూ హిట్ మ్యాన్ రికార్డు నెలకొల్పాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రికీ పాంటింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. రికీ తన కెరీర్లో ఆసీస్‌కు 324 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 220 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 200కు పైగా విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్ పాంటింగ్ మాత్రమే. పాంటింగ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి దక్కుతుంది. ధోని 332 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్ వ్యవహరించి 178 మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ధోని తర్వాత విరాట్ కోహ్లి (135) అత్యధికంగా టీమిండియాను గెలిపించాడు.2017లో మొదలైన రోహిత్ ప్రస్తానం2017లో తొలిసారి టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్.. 2021-22లో టీమిండియా ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా గతేడాది టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. రోహిత్ టీమిండియాను 2023 వన్డే వరల్డ్‌కప్, 2021-2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేర్చాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తొలి విజయం సాధించింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. తౌహిద్ హృదయ్ వీరోచిత శతకంతో (100) పోరాడటంతో 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసింది. హృదయ్‌కు జాకిర్ అలీ (68) సహకరించాడు. ఈ మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. అనంతరం శుభ్‌మన్ గిల్ (101) అజేయ శతకంతో చెలరేగడంతో భారత్ మరో 3.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. రోహిత్ శర్మ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులింపించగా.. కేఎల్ రాహుల్ (41 నాటౌట్) సిక్సర్ కొట్టి భారత్‌ను గెలిపించాడు.11000 పరుగుల క్లబ్లో రోహిత్ఈ మ్యాచ్‌లో రోహిత్ వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. విరాట్ తర్వాత వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఘనతను కోహ్లి 222 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా.. రోహిత్‌కు 261 ఇన్నింగ్స్‌లు పట్టింది. -
IND Vs BAN: చాంపియన్స్ ట్రోఫీ తొలి పోరులో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
IND Vs BAN: శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ.. బంగ్లాపై భారత్ ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 229 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో చేధించింది. భారత యువ ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్‌ను గిల్ ఫినిష్ చేశాడు.తొలుత దూకుడుగా ఆడిన గిల్.. వరుసగా వికెట్ల పడడంతో కాస్త ఆచితూచి ఆడాడు. ఎప్పుడైతే లక్ష్యానికి జట్టు చేరువైందో గిల్ తన బ్యాటింగ్‌లో జోరును పెంచాడు. ఈ క్రమంలో 125 బంతుల్లో గిల్ తన ఎనిమిదవ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 129 బంతులు ఎదుర్కొన్న గిల్..9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు.హృదయ్ సూపర్ సెంచరీ..ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) సూపర్ సెంచరీతో కదం తొక్కగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌తో దుబాయ్ వేదికగా తలపడనుంది. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఫీట్‌ను చేరుకోవడానికి రోహిత్‌కు 261 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. తాజా మ్యాచ్‌తో లిటల్మాస్టర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్-మెషీన్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి 2019లో కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.రోహిత్ ధనాధన్ ఇన్నింగ్స్..కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రెండు ఓవర్లలో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్.. మూడో ఓవర్ నుంచి బౌండరీల మోత మొదలు పెట్టాడు. కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి హిట్‌మ్యాన్ తన వికెట్‌ను కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) విరోచిత సెంచరీతో చెలరేగగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..1 - విరాట్ కోహ్లి: 222 ఇన్నింగ్స్‌లు2 - రోహిత్ శర్మ: 261 ఇన్నింగ్స్3 - సచిన్ టెండూల్కర్: 276 ఇన్నింగ్స్4 - రికీ పాంటింగ్: 286 ఇన్నింగ్స్‌లు5 - సౌరవ్ గంగూలీ: 288 ఇన్నింగ్స్చదవండి: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. -
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. డబుల్ సెంచరీ కొట్టిన షమీ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు (43 ఓవర్ల వరకు) తీసిన షమీ.. వన్డేల్లో 200 వికెట్ల పూర్తి చేసుకున్నాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు. షమీకి 200 వికెట్లు తీసేందుకు 5126 బంతులు అవసరమయ్యాయి. షమీకి ముందు ఈ రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉండింది. స్టార్క్ 5240 బంతుల్లో 200 వన్డే వికెట్ల మైలురాయిని తాకాడు.బంతుల పరంగా అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు..షమీ-5126 బంతులుస్టార్క్- 5240సక్లెయిన్ ముస్తాక్- 5451బ్రెట్ లీ- 5640ట్రెంట్ బౌల్ట్- 5783వకార్ యూనిస్- 5883మ్యాచ్‌ల ప్రకారం చూస్తే.. షమీ.. మిచెల్ స్టార్క్ తర్వాత అత్యంత వేగంగా 200 వికెట్ల వన్డే మైలురాయిని తాకిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్‌ల ప్రకారం అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన ఆటగాళ్లు..స్టార్క్- 102షమీ/సక్లెయిన్ ముస్తాక్- 104ట్రెంట్ బౌల్ట్- 107బ్రెట్ లీ- 112అలన్ డొనాల్డ్- 117ఓవరాల్‌గా చూస్తే.. వన్డేల్లో 200 వికెట్లు పూర్తి చేసిన 43 బౌలర్‌గా షమీ రికార్డుల్లోకెక్కాడు. భారత తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. షమీకి ముందు అనిల్ కుంబ్లే (334), జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), హర్భజన్ సింగ్ (265), కపిల్ దేవ్ (253), రవీంద్ర జడేజా (226) భారత్ తరఫున 200 వికెట్లు తీశారు. జవగల్ శ్రీనాథ్ (315), అజిత్ అగార్కర్ (288), జహీర్ ఖాన్ (269), కపిల్ దేవ్ (253) తర్వాత 200 వికెట్ల క్లబ్లో చేరిన ఐదో భారత పేసర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆదిలో భారత బౌలర్లు చెలరేగడంతో 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ (68) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. 46.2 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 215/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (91 నాటౌట్), తస్కిన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు. -
రోహిత్ శర్మ మంచి మనసు.. ఫ్యాన్స్ ఫిదా! వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్‌మ్యాన్ తనదైన శైలిలో సహచర ఆటగాళ్లపై పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. అంతేకాకుండా ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్ల పట్ల కూడా రోహిత్ తన మంచి మనుసు చాటుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.తాజాగా రోహిత్ శర్మ మరో తన క్రీడా స్పూర్తిని ప్రదర్శించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్, భారత జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ జాకర్ అలీ షూ లేస్‌ను రోహిత్ కట్టాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.దీంతో సోషల్ మీడియా వేదికగా భారత కెప్టెన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శెభాష్ హిట్‌మ్యాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో జాకర్ అలీ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను రోహిత్ జారవిడిచాడు. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఏకంగా 68 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.హృదయ్ సూపర్ సెంచరీ..ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ హ్రిదయ్(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) విరోచిత సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు జాకర్ అలీ(68) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.35 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బంగ్లాను జాకర్ అలీ, హృదయ్ తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 154 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 5 వికెట్లతో చెలరేగగా.. హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs BAN: ఎంత పనిచేశావు రోహిత్..పాపం అక్షర్ పటేల్! వీడియో వైరల్ -
ఎంత పనిచేశావు రోహిత్..పాపం అక్షర్ పటేల్! వీడియో వైరల్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్(Bangladesh) కు ఆరంభంలోనే పేసర్లు మహ్మద్ షమీ, హర్షిత్ రాణా చుక్కలు చూపించగా.. ఆ తర్వాత అక్షర్ పటేల్ తన స్పిన్ మయాజాలంతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. అక్షర్ పటేల్ తృటిలో తన తొలి హ్యాట్రిక్‌ను కోల్పోయాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చేసిన తప్పిదం వల్ల అక్షర్ ఈ ఫీట్‌ను సాధించలేకపోయాడు.అసలేం జరిగిందంటే..?బంగ్లా ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. రెండో బంతికి తాంజిద్ హసన్, మూడో బంతికి ముష్ఫికర్ రహీంలను పెవిలియన్‌కు పంపాడు. దీంతో అక్షర్‌కు తొలి హ్యాట్రిక్ సాధించే అవకాశం లభించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జాకీర్ అలీకి రోహిత్ శర్మ క్లోజ్ ఫీల్డ్‌ను సెట్ చేశాడు.ఆ ఓవర్లో నాలుగో బంతిని అక్షర్.. అలీకి ఔట్‌సైడ్ ఆఫ్ దిశగా ఆఫ్ బ్రేక్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని జాకీర్ అలీ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ దిశగా వెళ్లింది. అయితే మొదటి స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. అందరూ రోహిత్ అందుకున్నాడని భావించినప్పటికి ఆఖరి నిమిషంలో బంతి అతడి చేతి నుంచి జారిపోయింది. అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. రోహిత్ క్యాచ్ విడిచిపెట్టిన వెంటనే అక్షర్‌కు సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక 25 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జాకీర్.. 31 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత కూడా జాకీర్ అలీకి రెండు ఛాన్స్‌లు లభించాయి. భారత బౌలర్లలో ఇప్పటివరకు అక్షర్ పటేల్, మహ్మద్ షమీ తలా రెండు వికెట్లు సాధించగా.. హర్షిత్ రాణా ఒక్క వికెట్ సాధించారు.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్చదవండి: CT 2025: ‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్‌కప్ వరకు అతడే కెప్టెన్’This moment could have put Axar's name in the record books for decades. But Rohit Sharma successfully ruined it 😒 pic.twitter.com/zDnFk83r0D— Mark. (@CheekuGang) February 20, 2025 -
Champions Trophy: టీమిండియాను వెంటాడుతున్న బ్యాడ్ లక్
టాస్ విషయంలో టీమిండియాను బ్యాడ్ లక్ వెంటాడుతుంది. 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ నుంచి భారత్ వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ప్రపంచ క్రికెట్లో ఒక్క నెదర్లాండ్స్ మాత్రమే భారత్‌లా వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ తాజాగా టాస్ ఓడింది.రోహిత్ సారథ్యంలో 8 రాహుల్ కెప్టెన్సీలో 3వన్డేల్లో భారత్ వరుసగా కోల్పోయిన 11 టాస్‌ల్లో.. ఎనిమిది రోహిత్ శర్మ సారథ్యంలో కాగా.. మూడు కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్.. రోహిత్ శర్మ నేతృత్వంలో టాస్ ఓడింది. ఆతర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. కేఎల్ రాహుల్ సారథ్యంలో టాస్ ఓడింది. అనంతరం శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టాస్‌లు ఓడింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో భారత్.. రోహిత్ సారథ్యంలో టాస్‌లు ఓడింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్.. రోహిత్ శర్మ సారథ్యంలో టాస్ ఓడింది.పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్.. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టిన షమీ.. బంగ్లా పతనానికి నాంది పలికాడు. ఆతర్వాత రెండో ఓవర్లో యువ పేసర్ హర్షిత్ రాణా వికెట్ తీశాడు. దీని తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చిన షమీ.. తిరిగి ఏడో ఓవర్లో మరో వికెట్ తీశాడు.అక్షర్‌కు హ్యాట్రిక్ మిస్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ మ్యాజిక్ చేశాడు. ఈ ఓవర్లో వరుసగా రెండు, మూడు బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. రోహిత్ శర్మ చేసిన తప్పిదం కారణంగా హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. ఈ ఓవర్ నాలుగో బంతికి స్లిప్స్‌లో జాకిర్ అలీ అందించిన సునాయాసమైన క్యాచ్‌ను రోహిత్ జారవిడిచాడు.13 ఓవర్లలో 50 పరుగులు13 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 50 పరుగులుగా ఉంది. తంజిద్ హసన్ 25, సౌమ్య సర్కార్ 0, కెప్టెన్ షాంటో 0, మెహిది హసన్ 5, ముష్ఫికర్ 0 పరుగులకు ఔట్ కాగా.. తౌహిద్ హృదోయ్ (10), జాకిర్ అలీ (7) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో షమీ, అక్షర్ తలో రెండు.. హర్షిత్ ఓ వికెట్ పడగొట్టారు. -
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
India Vs Bangladesh Match Live Updates And Highlights:భారత్ ఘన విజయం..ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ బోణీ కొట్టింది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో అందుకుంది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(129 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 నాటౌట్) సెంచరీతో మెరిశాడు. అతడితో పాటు రోహిత్ శర్మ(41), కేఎల్ రాహుల్(41) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ హొస్సేన్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముస్తఫిజుర్ రెహ్మన్, టాస్కిన్ ఆహ్మద్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. గిల్ సెంచరీ..శుబ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 125 బంతుల్లో గిల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారత్ విజయానికి ఇంకా 7 పరుగులు కావాలి.విజయానికి చేరువలో భారత్..44 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(88), కేఎల్ రాహుల్(33) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 19 పరుగులు కావాలి.34 ఓవర్లకు భారత్ స్కోర్: 158/434 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(65), కేఎల్ రాహుల్(5) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.భారత్ నాలుగో వికెట్ డౌన్..144 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. భారత్ విజయానికి ఇంకా 85 పరుగులు కావాలి.మూడో వికెట్ డౌన్..134 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ముస్తఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో శుబ్‌మన్ గిల్(56), అక్షర్ పటేల్(3) పరుగులతో ఉన్నారు. భారత విజయానికి ఇంకా 90 పరుగులు కావాలి.విరాట్ కోహ్లి ఔట్..టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రిషాద్ హొస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 24 ఓవర్లకు భారత్ స్కోర్: 118/2ఆచితూచి ఆడుతున్న గిల్-కోహ్లిరోహిత్ శర్మ ఔటయ్యాక భారత బ్యాటర్లు విరాట్ కోహ్లి(13), శుబ్‌మన్ గిల్(41) ఆచితూచి ఆడుతున్నారు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.టీమిండియా తొలి వికెట్ డౌన్..69 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్: 69/1దూకుడుగా ఆడుతున్న రోహిత్, గిల్..229 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(27), శుబ్‌మన్ గిల్(13) ఉన్నారు.ఐదేసిన షమీ.. బంగ్లాదేశ్ 228 ఆలౌట్ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయాడు. భారత బౌలర్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాశించాడు. హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైన సాధించిందంటే అది తౌహిద్ హృదోయ్ (100), జాకిర్ అలీ (68) చలువే. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ మినహా ఎవరూ రాణించలేదు. ఈ మ్యాచ్‌లో షమీ 200 వికెట్ల క్లబ్లో చేరాడు. రోహిత్ శర్మ సునాయాసమైన క్యాచ్ వదిలేయడంతో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. ఐదు వికెట్లు తీసిన షమీతౌహిద్ హృదోయ్ సూపర్ సెంచరీజట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన తౌహిద్ హృదోయ్.. అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి సూపర్ సెంచరీ చేశాడు. కండరాల సమస్యతో బాధపడుతూనే హృదోయ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. నాలుగో వికెట్ తీసిన షమీఈ మ్యాచ్‌లో షమీ ఖాతాలో నాలుగో వికెట్ పడింది. షమీ.. తంజిమ్ హసన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 47 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 221/8గా ఉంది. తౌహిద్ హృదోయ్ (96) , తస్కిన్ అహ్మద్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సూపర్‌గా బ్యాటింగ్ చేస్తున్న హృదోయ్ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్214 పరుగుల వద్ద బంగ్లాదేశ్ ఏడో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి రిషద్ హొసేన్ (18) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్హృదోయ్, జాకిర్ అలీ మధ్య భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. జాకిర్ అలీని (68) షమీ ఔట్ చేశాడు. 189 పరుగుల వద్ద (42.4 ఓవర్లు) బంగ్లాదేశ్ ఆరో వికెట్ కోల్పోయింది. తౌహిద్ హృదోయ్ (84), రిషద్ హొసేన్ క్రీజ్‌లో ఉన్నారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న జాకిర్ అలీ, హృదోయ్బంగ్లా మిడిలార్డర్ బ్యాటర్లు తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను వీరిద్దరూ ఆదుకున్నారు. ప్రస్తుతం జాకిర్ అలీ 54, హృదోయ్ 61 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 37.3 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 150/5గా ఉంది. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5తౌహిద్ హృదోయ్ (37), జాకిర్ అలీ (41) జాగ్రత్తగా ఆడుతూ బంగ్లాదేశ్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 78 పరుగులు జోడించారు. 31 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 113/5గా ఉంది.25 ఓవర్ల అనంతరం బంగ్లాదేశ్ స్కోర్ 92/535 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ మరో వికెట్ పడకుంగా జాగ్రత్తగా ఆడుతుంది.25 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 92/5గా ఉంది. తౌహిద్ హృదోయ్, జాకిర్ అలీ తలో 29 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. హ్యాట్రిక్ మిస్అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ మిస్ అయ్యింది. తొమ్మిదో ఓవర్లో వరుసగా 2, 3 బంతులకు వికెట్లు తీసిన అక్షర్.. నాలుగో బంతికి కూడా వికెట్ తీయాల్సింది. జాకిర్ అలీ ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌కు రోహిత్ శర్మ మిస్ కావడంతో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. 9 ఓవర్ల తర్వాత బంగ్లాదేశ్ స్కోర్ 36/5గా ఉంది. తౌహిద్ హృదోయ్ (4), జాకిర్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు.వరుస బంతుల్లో వికెట్లు తీసిన అక్షర్.. పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో అక్షర్ పటేల్ వరుస బంతుల్లో (2, 3) వికెట్లు తీశాడు. తొలుత తంజిద్‌కు పెవిలియన్‌కు పంపిన అక్షర్.. ఆతర్వాతి బంతికే ముష్ఫికర్‌కు ఔట్ చేశాడు.నాలుగో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్35 పరుగుల వద్ద బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో తంజిద్ హసన్ (25) పెవిలియన్ బాట పట్టాడు. మళ్లీ వికెట్ తీసిన షమీ.. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్బంగ్లాదేశ్ జట్టు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో షమీ తన రెండో వికెట్ తీశాడు. స్లిప్స్‌లో శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మెహిది హసన్ మిరాజ్ (5) పెవిలియన్‌కు చేరాడు. 6.2 ఓవర్ల అనంతరం బంగ్లా స్కోర్ 26/3గా ఉంది. తంజిద్ హసన్ (20) ధాటిగా ఆడుతున్నాడు. తౌహిద్ హృదోయ్ కొత్తగా క్రీజ్‌లోకి వచ్చాడు.రెండో ఓవర్లో మరో వికెట్బంగ్లాదేశ్ జట్టు రెండో ఓవర్లో మరో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి నజ్ముల్ హసన్ షాంటో డకౌటయ్యాడు. బంగ్లా ఖాతాలో ప్రస్తుతం 2 పరుగులకే ఉన్నాయి. తొలి ఓవర్లోనే వికెట్ తీసిన షమీటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ పట్టడంతో సౌమ్య సర్కార్ డకౌటయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 20) భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్) బరిలోకి దిగుతుంది. అర్షదీప్ స్థానంలో షమీ రీఎంట్రీ ఇస్తున్నాడు. షమీకి జతగా హర్షిత్ రాణా బరిలోకి దిగుతున్నాడు. వికెట్‌కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నాడు. మిస్టరీ స్నిన్నర్ వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోవైపు బంగ్లాదేశ్ సైతం ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతోనే బరిలోకి దిగుతుంది.తుది జట్లు..బంగ్లాదేశ్: తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(వికెట్‌కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మన్భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ -
‘టీమిండియా ఓడినా.. 2027 వరల్డ్‌కప్ వరకు అతడే కెప్టెన్’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2027 వరకు హిట్‌మ్యాన్ సారథిగా కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ అసాధారణ విజయాలు సాధించాడన్న కైఫ్.. అతడు సమీపకాలంలో రిటైర్ అయ్యే ప్రసక్తి లేదని పేర్కొన్నాడు.కాగా టీమిండియా ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వేదికగా బుధవారం ఈ మెగా టోర్నీ మొదలుకాగా.. దుబాయ్‌లో భారత జట్టు తమ మ్యాచ్‌లన్నీ ఆడనుంది. తొలుత గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనున్న రోహిత్ సేన.. ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్‌లతో మ్యాచ్‌లు ఆడుతుంది.ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ?ఇదిలా ఉంటే.. 37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ కానుందంటూ సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో టీమిండియా ఓడిపోయినా రోహిత్ శర్మ భవిష్యత్తుకు ఢోకా ఏమీ ఉండబోదని జోస్యం చెప్పాడు.కోచ్‌లకే ఇబ్బంది.. రోహిత్ సేఫ్ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా.. ‘‘కెప్టెన్‌గా రోహిత్ శర్మ సాధించిన విజయాలు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. వన్డే ప్రపంచకప్-2023 ఈవెంట్లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత మనవాళ్లు ఎక్కువగా వన్డే క్రికెట్ ఆడలేదు. ఆ దేవుడి దయ వల్ల ఇలా జరుగకూడదు.. కానీ ఒకవేళ టీమిండియా గనుక చాంపియన్స్ ట్రోఫీలో గొప్పగా రాణించకపోతే కోచ్‌లు మాత్రమే ఇబ్బందుల్లో పడతారు.అప్పటి దాకా అతడే కెప్టెన్అయితే, రోహిత్ శర్మకు మాత్రం ఎలాంటి సమస్యా ఉండదు. టెస్టుల్లో చోటు విషయంలో స్పష్టత లేదు గానీ.. వన్డేల్లో మాత్రం అతడి స్థానాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ప్రస్తుతం అతడు ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో వన్డేల్లో విధ్వంసర సెంచరీ బాదాడు.జట్టుకు అద్భుతమైన క్లీన్‌స్వీప్ విజయం అందించాడు. బ్యాటర్‌గా వన్డేల్లో అతడి రికార్డు గొప్పగా ఉంది. సారథిగా విజయాల శాతం కూడా ఎక్కువే. అందుకే ఈ టోర్నమెంట్లో టీమిండియా కాస్త చెత్తగా ఆడినా.. ఓడినా జట్టులో అతడి స్థానం పదిలంగానే ఉంటుంది. 2027 వన్డే వరల్డ్‌ప్ వరకు అతడు కొనసాగుతాడు’’ అని మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొంటున్న భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. రోహిత్‌ను ఊరిస్తున్న భారీ రికార్డులు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ ఇవాళ (ఫిబ్రవరి 20) తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 12 పరుగులు చేస్తే.. వన్డేల్లో 11,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా, ప్రపంచంలో 10వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. 2007 జూన్ 23న బెల్ఫాస్ట్ లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఇప్పటివరకు 268 మ్యాచ్‌లు ఆడి 10,988 పరుగులు చేశాడు.వన్డేల్లో 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 18,426కుమార్ సంగక్కర (శ్రీలంక)- 14,234విరాట్ కోహ్లీ (భారత్)- 13,963రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)-13,704సనత్ జయసూర్య (శ్రీలంక)- 13,430మహేల జయవర్ధనే (శ్రీలంక)- 12,650ఇంజమామ్-ఉల్-హక్ (పాకిస్థాన్)- 11,739జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 11,579సౌరవ్ గంగూలీ (భారత్)- 11,363ఈ మ్యాచ్‌లో రోహిత్ 11000 పరుగులు పూర్తి చేస్తే మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసకుంటాడు. సహచరుడు విరాట్ కోహ్లీ తర్వాత ప్రపంచంలో అత్యంత వేగంగా 11000 వన్డే పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయర్‌గా రికార్డుకెక్కుతాడు. విరాట్ 222 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకగా.. రోహిత్‌కు 260వ ఇన్నింగ్స్‌లో 11000 పరుగులు పూర్తి చేసే అవకాశం వచ్చింది.వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..విరాట్ కోహ్లీ (భారత్)- 222 ఇన్నింగ్స్లుసచిన్ టెండూల్కర్ (భారత్)- 276రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 286సౌరవ్ గంగూలీ (భారత్)- 288జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 293 నేటి మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో 10వ క్రికటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 49 సెంచరీలు చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..సచిన్ టెండూల్కర్ (భారత్)- 100విరాట్ కోహ్లీ (భారత్)- 81రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 71కుమార్ సంగక్కర (శ్రీలంక)- 63జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)- 62హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా)- 55మహేల జయవర్ధనే (శ్రీలంక)- 54బ్రియాన్ లారా (వెస్టిండీస్)- 53జో రూట్ (ఇంగ్లాండ్)- 52రోహిత్ శర్మ (భారత్)- 49ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. నేటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే..రోహిత్ ఖాతాలో 100 అంతర్జాతీయ విజయాలు నమోదవుతాయి. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో 99 విజయాలు (137 మ్యాచ్‌ల్లో) సాధించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్లు..ఎంఎస్ ధోనీ- 179విరాట్ కోహ్లీ- 137మొహమ్మద్ అజారుద్దీన్- 104రోహిత్ శర్మ- 99సౌరవ్ గంగూలీ- 97నేటి మ్యాచ్‌లో రోహిత్ 14 సిక్సర్లు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృస్టిస్తాడు. ప్రస్తుతం పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది (398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది. రోహిత్ ఇప్పటివరకు 268 మ్యాచ్‌ల్లో 338 సిక్సర్లు బాదాడు. -
Ind vs Ban: ‘నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం’
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ప్రయాణం గురువారం మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌లో రోహిత్ సేన తొలుత దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆరంభమయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియోహాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.గంభీర్‌తో జడ్డూ వాదన!ఇక తొలి మ్యాచ్‌లో భారత తుదిజట్టు ఎలా ఉంటుందన్న అంశంపై క్రికెట్ వర్గాల్లో ఆసక్తినెలకొంది. ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను సెలక్ట్ చేసిన భారత జట్టు యాజమాన్యం ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి చోటు ఇస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్లో భాగంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir)తో చర్చిస్తున్నట్లు కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో జడ్డూకు గౌతీ తుదిజట్టులో స్థానం ఇవ్వడం లేదని.. తనకు ఇష్టమైన వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మాజీ కోచ్ మైక్ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.నీకు తుదిజట్టులో చోటు లేదు.. అతడినే ఆడిస్తాం‘‘జడేజా ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు. అతడి బాడీలాంగ్వేజ్ చూస్తే ఇలాగే అనిపిస్తోంది. ‘నా నిర్ణయం ఇదే. నేను ఫిక్సైపోయాను. నువ్వు నా నిర్ణయంతో అంగీకరించకపోవచ్చు. అయినా మరేం పర్లేదు. థాంక్స్.. తదుపరి మ్యాచ్‌లో నువ్వే ఆడతావు. కానీ ఇప్పుడు మాత్రం మేము ఆఫ్ స్పిన్నర్‌తో బరిలోకి దిగుతాం’ అని గంభీర్ జడేజాకు చెప్పి ఉంటాడు’’ అని మైక్ హసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.వాళ్లిద్దరికి జట్టులో చోటుఅయితే, టీమిండియా మాజీ క్రికెటర్ పీయూశ్ చావ్లా మాత్రం.. ‘‘బంగ్లాదేశ్ తుదిజట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. గత కొద్ది రోజులుగా జడేజా, అక్షర్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి వాళ్లిద్దరికి జట్టులో చోటు ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా బంగ్లా జట్టులో తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్‌తో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో కూడా లెఫ్టాండర్ బ్యాటర్లేనన్న విషయం తెలిసిందే.ఇక చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ఎంపిక చేసిన జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐదుగురు స్పిన్నర్లకు చోటిచ్చింది. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్(ఇద్దరూ లెఫ్టార్మ్ స్పిన్నర్లే), వాషింగ్టన్ సుందర్(రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్)లతో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(రైటార్మ్ లెగ్ బ్రేక్)లను ఎంపిక చేసింది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్
మెగా క్రికెట్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. దుబాయ్ వేదికగా గురువారం చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) బరిలో దిగనుంది. తొలి పోరులో రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో శనివారమే దుబాయ్(Dubai)కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు కీలకమే కాబట్టి విజయంతో టోర్నమెంట్‌ను మొదలుపెట్టాలనే పట్టుదలతో ఉంది.మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) జట్టు ఎంపిక తీరుపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే ఎంపిక చేశాం. మరో ముగ్గురు బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్లు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయగల ప్లేయర్లు జట్టుకు అవసరం. ఈ ముగ్గురు జట్టుకు వైవిధ్యాన్ని అందిస్తారు. అయినా మేం మా బలాన్ని బట్టి ఆటగాళ్లను ఎంచుకుంటాం. జడేజా, అక్షర్, వాషీ జట్టులో ఉంటే మాకు భిన్న రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది. మాకు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆటగాళ్ల అవసరం ఉంది.టీమిండియా గురించి మాట్లాడేవారు ఇతర జట్లలో ముగ్గురు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఉంటే.. వారి వద్ద ఆరుగురు పేసర్లు ఉన్నారేంటి అని అడగరు’’ అంటూ రోహిత్ శర్మ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ ప్రధాన లక్ష్యం అని పేర్కొన్న హిట్‌మ్యాన్.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పైనే తమ దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉందని తెలిపాడు.కొత్తగా వరుణ్ చక్రవర్తికాగా చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల భారత జట్టులో స్పిన్ దళానికి ప్రాధాన్యం దక్కింది. ప్రాథమిక జట్టులో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌తో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నాడు. అయితే, ఫైనల్ టీమ్‌ను ఖరారు చేసే సమయంలో బీసీసీఐ సెలక్టర్లు ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌పై వేటు వేసి అతడి స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకువచ్చారు. ఫలితంగా జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు దక్కినట్లయింది.ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్, మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ సహా పలువురు మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరును విమర్శించారు. మెగా టోర్నీకి ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడం వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతినే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పైవిధంగా స్పందించాడు.ఇదిలా ఉంటే.. గ్రూప్-‘ఎ’ పోటీలో భాగంగా గురువారం తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమిండియా.. తదుపరి ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం లీగ్ దశలో ఆఖరిగా న్యూజిలాండ్‌తో మార్చి 2న మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ టోర్నీలో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ పోటీపడుతున్నాయి. కాగా మెగా ఈవెంట్లో తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
CT 2025 IND Vs BAN: శుభారంభంపై భారత్ గురి
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పోరు నేటి నుంచి మొదలవుతోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగే తమ తొలి మ్యాచ్‌లో గురువారం బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. బలాబలాలు, ఫామ్ పరంగా చూసుకుంటే రోహిత్ సేన ప్రత్యర్థికంటే ఎంతో బలంగా ఉంది. అయితే ఎప్పటిలాగే బంగ్లాదేశ్ తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చి సంచలనాన్ని ఆశిస్తోంది. బ్యాటింగ్‌తో పాటు స్పిన్ ప్రధాన బలంగా భారత్ బరిలోకి దిగుతుండగా... బంగ్లాదేశ్ తమ పేస్ బౌలింగ్‌పై ఆశలు పెట్టుకుంది. సమష్టిగా చెలరేగితే... భారత్ తుది జట్టు కూర్పు విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. ఓపెనర్లుగా రోహిత్, గిల్ శుభారంభం అందిస్తే ఆ తర్వాత కోహ్లి దానిని కొనసాగించగలడు. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో చక్కటి అర్ధసెంచరీ సాధించిన కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ కూడా రాణిస్తే తిరుగుండదు. గత సిరీస్‌లో వరుస ప్రయోగాలతో రాహుల్ స్థానం పదే పదే మారింది. అయితే ఈసారి మాత్రం అతనికి అచ్చొచ్చిన ఐదో స్థానంలోనే ఆడించే అవకాశం ఉంది. పాండ్యా, జడేజా, అక్షర్‌ల ఆల్‌రౌండ్ నైపుణ్యం జట్టుకు అదనపు బలం.కుల్దీప్ చాలా కాలంగా చక్కటి ఆటతీరు కనబరుస్తున్నాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో అతడిని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు సవాల్. అనుభవజు్ఞడైన షమీతో పాటు అర్ష్ దీప్ ఆరంభంలో బంగ్లాదేశ్‌ను కట్టిపడేయగల సమర్థులు. బలహీన బ్యాటింగ్... తమ దేశపు స్టార్ ఆటగాడు షకీబ్ లేకుండా 2004 తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఒక పెద్ద టోర్నీ ఆడుతోంది. లిటన్ దాస్ కూడా ఈ టోర్నీలో లేడు. అయితే ఇతర సీనియర్లు ముషి్ఫకర్, మహ్ముదుల్లా లాంటి ప్లేయర్లు మరోసారి జట్టు భారం మోయాల్సి ఉంది. యువ బ్యాటర్లలో తన్జీద్, తౌహీద్ ఇటీవల పెద్దగా ప్రభావం చూపలేదు.కెప్టెన్ నజు్మల్ చాలా కాలంగా ఫామ్‌లో లేడు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాటింగ్ లైనప్ భారత బౌలింగ్‌ను ఏమాత్రం సమర్థంగా ఎదుర్కోగలదనేది సందేహమే. పేసర్లు ముస్తఫిజుర్, నాహిద్ రాణా, తస్కీన్ రాణించాలని జట్టు కోరుకుంటోంది. స్పిన్ ఆల్‌రౌండర్ మెహదీ మిరాజ్ కీలకం కానున్నాడు. తుది జట్లు (అంచనా): భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, షమీ, అర్ష్ దీప్. బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్), తన్జీద్, సౌమ్య సర్కార్, తౌహీద్, ముషి్ఫకర్, మహ్ముదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, రిషాద్, తస్కీన్, నాహిద్, ముస్తఫిజుర్.పిచ్, వాతావరణంఈ వేదికపై వన్డేలు అరుదుగా జరుగుతున్నాయి. దాదాపు అన్ని మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. నెమ్మదైన పిచ్‌పై స్పిన్నర్ల ప్రభావం ఖాయం. వర్ష సమస్య లేదు.41 భారత్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 41 వన్డేలు జరిగాయి. భారత్ 32 మ్యాచ్‌ల్లో...బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. ఒక మ్యాచ్ రద్దయింది. చాంపియన్స్ ట్రోఫీలో ఒకే ఒక్కసారి 2017 సెమీఫైనల్లో ఇరు జట్లు తలపడ్డాయి. భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. -
ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం: రోహిత్ శర్మ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. గురువారం(ఫిబ్రవరి 19)న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రోహిత్ తెలిపాడు."దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్రతీ ఐసీసీ టైటిల్ కూడా మాకు ముఖ్యమైనదే. ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇక్కడకు వచ్చాము. అయితే ప్రస్తుతం మా దృష్టి బంగ్లాదేశ్ మ్యాచ్‌పైనే ఉంది. ఈ మెగా టోర్నీని విజయంతో ఆరంభించాలని భావిస్తున్నాము.మాపై ఎటువంటి ఒత్తడి లేదు. జట్టులోని ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఓ క్లారిటీ ఉంది. ఇంతకుముందు టోర్నీలో భారత్ తరపున ఎలా ఆడామో, ఇప్పుడు కూడా అలానే ఆడుతాము. ఈ టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మా కుర్రాళ్లు బాగా రాణించారు. అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. వారిని తక్కువ స్కోర్లకే పరిమితం చేశాము. కానీ ప్రతీ సిరీస్, వేదిక ఒక కొత్త సవాలు వంటిందే. గతంలో దుబాయ్‌లో మేము చాలా క్రికెట్ ఆడాము. పిచ్‌ను వీలైనంత త్వరగా అంచనా వేయడం చాలా ముఖ్యం. పరిస్థితులను బట్టి మన ప్లాన్స్‌ను మార్చుకోవాలి" అని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీ కోసం ఐదు రోజుల ముందే దుబాయ్‌కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.బుమ్రా లేకుండానే..ఇక ఈ మెగా ఈవెంట్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే ఆడనుంది. బుమ్రా వెన్ను గాయం కారణంగా ఈ మినీ వరల్డ్‌కప్‌నకు దూరమయ్యాడు. అతడి స్దానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అదేవిధంగా ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను జట్టు నుంచి రిలీజ్ చేశారు. అతడికి బదులుగా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని జట్టులోకి తీసుకున్నారు.బంగ్లాపై మనదే పై చేయి..కాగా వన్డేల్లో బంగ్లాదేశ్‌పై భారత్ మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు వన్డే ఫార్మాట్లో 41 సార్లు తలపడగా.. భారత్ 32 విజయాలు నమోదు చేయగా, బంగ్లా జట్టు కేవలం ఎనిమిదింట మాత్రమే గెలుపొందింది. ఇందులో మూడు విజయాలు చివరి ఐదు మ్యాచ్‌ల్లో రావడం గమనార్హం. చివరగా ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్-2023లో ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బంగ్లాను భారత్ చిత్తు చేసింది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ: ఈ జట్ల మధ్యే ప్రధాన పోటీ?.. కివీస్‌కు ఛాన్సులు ఎక్కువే! -
CT 2025: షెడ్యూల్, జట్లు, టైమింగ్స్, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) రూపంలో మెగా క్రికెట్ పండుగ అభిమానులకు కనువిందు చేయనుంది. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలయ్యే ఈ ఐసీసీ టోర్నమెంట్ మార్చి 9న ఫైనల్‌తో ముగియనుంది. ఈ ఈవెంట్లో ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి.ఇందులో భాగంగా గ్రూప్-‘ఎ’ నుంచి భారత్(India), పాకిస్తాన్(Pakistan), న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేదికలు,జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలు తెలుసుకుందామా?!చాంపియన్స్ ట్రోఫీ-2025 పూర్తి షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ ఆరంభ సమయం(భారత కాలమానం ప్రకారం)👉1. ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్- ఎ, నేషనల్ స్టేడియం, కరాచీ (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉2. ఫిబ్రవరి 20- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉3. ఫిబ్రవరి 21- అఫ్గనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉4. ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉5. ఫిబ్రవరి 23- ఇండియా వర్సెస్ పాకిస్తాన్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉6. ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉7. ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, గ్రూప్-బి, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉8. ఫిబ్రవరి 26- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉9. ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఎ, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉10. ఫిబ్రవరి 28- అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, గడాఫీ స్టేడియం, లాహోర్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉11. మార్చి 1- సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్, గ్రూప్-బి, నేషనల్ స్టేడియం, కరాచి (మధ్యాహ్నం 2:30 గంటలకు)👉12. మార్చి 2- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఎ, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(మధ్యాహ్నం 2:30 గంటలకు)👉సెమీ ఫైనల్ 1: మార్చి 4- దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే), 👉సెమీ ఫైనల్ 2: మార్చి 5- గడాఫీ స్టేడియం లాహోర్(పాకిస్తాన్ క్వాలిఫై అయితే)👉ఫైనల్ మార్చి 9: గడాఫీ స్టేడియం లాహోర్ లేదా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం, దుబాయ్(ఇండియా క్వాలిఫై అయితే).లైవ్ టెలికాస్ట్, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే..భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, స్పోర్ట్స్ 18లో లైవ్ టెలికాస్ట్. అదే విధంగా.. జియోహాట్‌స్టార్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్. స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియా(ఎక్స్) హ్యాండిల్లో ఉన్న వివరాల ప్రకారం.. జియోహాట్‌స్టార్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చు. టెలివిజన్, మొబైల్‌లలో ఈ వెసలుబాటు ఉంటుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్లుగ్రూప్-ఎఇండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్స్: యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, శివం దూబే.పాకిస్తాన్మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, ఉస్మాన్ ఖాన్, మహ్మద్ హస్నైన్, షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జెమీషన్.బంగ్లాదేశ్సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, నజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా, నసూమ్ అహ్మద్.గ్రూప్-బిఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షూయిస్, స్పెన్సర్ జాన్సన్.ట్రావెలింగ్ రిజ్వర్స్: కూపర్ కొనొలి.సౌతాఫ్రికాటెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డసెన్, వియాన్ ముల్దర్, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంసీ, కార్బిన్ బాష్ట్రావెలింగ్ రిజర్వ్: క్వెనా మఫాకా.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్.అఫ్గనిస్తాన్ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నంగ్యాల్ ఖరోటీ, నవీద్ జద్రాన్రిజర్వ్ ప్లేయర్లు: డార్విష్ రసూలీ, బిలాల్ సమీ.చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
Ind vs Ban: భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్!
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్‌కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగనున్న రోహిత్ సేనకు లీగ్ దశలోని మూడు మ్యాచ్‌లు కీలకమే. ఇందులో ఒక్కటి ఓడినా సెమీ ఫైనల్ చేరే అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra). టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్‌కు తన ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. పేసర్ల విభాగంలో మాత్రంజట్టులో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో పాటు ఓ స్పెషలిస్టు స్పిన్నర్ తప్పక ఉంటాడన్న ఆకాశ్ చోప్రా.. అయితే, ఈ విషయంలో కెప్టెన్, హెడ్‌కోచ్ ఎవరివైపు మొగ్గుచూపుతారన్నది చెప్పడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. ఇక పేసర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్య ఆటగాడిగా అర్ష్‌దీప్ సింగ్‌కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు.కాగా 2017 తర్వాత తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. పాకిస్తాన్(Pakistan) వేదికగా ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా... టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లు దుబాయ్‌లో ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం(ఫిబ్రవరి 20) రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-‘ఎ’లో ఉన్న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ- శుబ్‌మన్ గిల్.. కెప్టెన్, వైస్ కెప్టెన్.. ఓపెనర్లుగా వీరే ఉంటారు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ గురించి సందేహాలు అక్కర్లేదు. రన్ మెషీన్ కోహ్లి మూడో స్థానంలో వస్తాడు.ఇక నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నా అభిప్రాయం ప్రకారం.. అక్షర్ పటేల్ ఐదు, కేఎల్ రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. హార్దిక్ పాండ్యా ఏడు.. రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడతారు. ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో ఉంటాడు.నా ఓటు కుల్దీప్ యాదవ్కేఅలా కాకుండా గంభీర్ తన నిర్ణయానుగుణంగానే వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది. అయితే, నేను మాత్రం కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తాను. ఇక నా జట్టులో అర్ష్‌దీప్ సింగ్ తప్పక ఉంటాడు.అతడికి తోడుగా మహ్మద్ షమీ తుదిజట్టులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అలాగాక హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిల్, డెత్ ఓవర్లలో అతడు చక్కగా రాణించగలడు’’ అని పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్‌లకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్లు క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడిపితేనే భారీ స్కోర్లు చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత తుదిజట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్/వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ/హర్షిత్ రాణా.చదవండి: శివమ్ దూబే విజృంభణ.. కీలక మ్యాచ్‌లో ఐదు వికెట్లు -
'భారత జట్టులో అతడు లేడు.. మీకు ఇదే మంచి ఛాన్స్'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో బంగ్లాదేశ్ తమ తొలి మ్యాచ్‌లో పటిష్టమైన టీమిండియాను ఢీకొట్టనుంది. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా భారత్‌ను ఓడించాలని బంగ్లా టైగర్స్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న బంగ్లా జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. బంగ్లా క్రికెట్ జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది.ఈ టోర్నీకి ముందు వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. అదేజోరును ఈ మినీ వరల్డ్‌కప్‌లోనూ కనబరచాలని బంగ్లా జట్టు భావిస్తోంది. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ గాయం నుంచి కోలుకుని తిరిగి రావడం బంగ్లాకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ ఓపెనర్ ఇమ్రాల్ కైస్ తమ జట్టుకు పలు సూచనలు చేశాడు. భారత జట్టులో బుమ్రాలేని లోటును బంగ్లా సొమ్ముచేసుకోవాలని కైస్ అభిప్రాయపడ్డాడు."భారత్ బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌ను కలిగి ఉంది. టీమిండియాను ఓడించడం అంత సులువు కాదు. అయితే జట్టులో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం మా జట్టుకు కలిసొచ్చే ఆంశం. బుమ్రా గత రెండేళ్లలో భారత జట్టుకు ఎటువంటి విజయాలను అందించాడో మనకు మనందరికీ తెలిసిందే. అతడి గైర్హాజరును బంగ్లాదేశ్ సద్వినియోగం చేసుకోవాలి. బుమ్రా లేనప్పటికి మహ్మద్ షమీ వంటి స్పీడ్ స్టార్ జట్టులోకి వచ్చాడు. అయితే అతడు ప్రస్తుతం ఫిట్నెస్తో కొంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ అతడు తన రిథమ్‌ను తిరిగి పొందితే, బంగ్లాదేశ్‌కు పెనుముప్పులా మారుతాడని" పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కైస్ పేర్కొన్నాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బంగ్లాదేశ్ జట్టునజ్ముల్ హొసేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహమూద్ ఉల్లా, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హుసేన్ ఎమాన్, నాసుమ్ అహ్మద్, తాంజిమ్ హసన్ సకీబ్, నహీద్ రాణా.చదవండి: మా జట్టుకు గట్టి పోటీ తప్పదు.. సెమీస్ చేరే జట్లు ఇవే: చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్ -
బంగ్లాతో మ్యాచ్.. స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్! గంభీర్ సపోర్ట్ అతడికే?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. 1996 వరల్డ్‌కప్ తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు పాక్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. దీంతో ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.ఇక భారత్ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌తో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీని శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌కు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అదేవిధంగా తొలి మ్యాచ్ కోసం తుది జట్టు కూర్పుపై కూడా హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.హర్షిత్‌కు నో ఛాన్స్..బంగ్లాతో మ్యాచ్‌కు పేసర్ హర్షిత్ రాణాకు బదులుగా అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేయాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పీటీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా వెటరన్ మహ్మద్ సిరాజ్‌ను కాదని మరి అర్ష్‌దీప్‌ను సెలక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారు. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉందని అజిత్ అగార్కకర్ అండ్ కో సెలక్ట్ చేశారు.ఈ క్రమంలోనే హర్షిత్ కంటే అర్ష్‌దీప్‌కు టీమ్ మెనెజ్‌మెంట్ తొలి ప్రాధన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అర్ష్‌దీప్ అంచనాలకు తగ్గట్టు రాణించకపోతే రాణా తర్వాతి మ్యాచ్‌ల్లో ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. వాస్తవానికి తొలుత ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో రాణా లేడు.జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కావడంతో రాణాకు భారత జట్టులో చోటు దక్కింది. అయితే ఇంగ్లండ్‌పై వన్డే అరంగేట్రం చేసిన రాణా పర్వాలేదన్పించాడు. ఈ ఢిల్లీ పేసర్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్‌కు తీసుకు వెళ్లారు.బంగ్లాతో మ్యాచ్‌కు భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్చదవండి: IND vs PAK: షాకింగ్.. భారత్-పాక్ మ్యాచ్ టిక్కెట్ ధర రూ.4 లక్షలు -
చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్టార్ దూరం!?
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్(Rishabh Pant) గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya) షాట్ కారణంగా అతడి మెకాలి(Knee Injury)కి గాయమైంది. దీంతో పంత్ నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి అతడిని పరీక్షించాడు. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ దూరం కానున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.అయితే, పంత్ పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు సమాచారం. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో పంత్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్‌తో పాటు ఈ లెఫ్టాండర్ బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఎడమ మోకాలికి బలంగా తాకిన బంతిఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. ఆదివారం తొలి సెషన్ జరుగగా.. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో అతడు బలంగా బాదిన బంతి పంత్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో ఒక్కసారిగా కిందపడిపోయిన ఈ యువ ఆటగాడు నొప్పితో విలవిల్లాడాడు.ఇంతలో అక్కడికి చేరుకున్న ఫిజియో కమలేశ్ జైన్ పంత్‌ను పరీక్షించాడు. హార్దిక్ పాండ్యా సైతం పంత్ దగ్గరకు వచ్చి అతడి పరిస్థితి ఎలా ఉందో అడిగితెలుసుకున్నాడు. అయితే, కాసేపటి తర్వాత ఈ వికెట్ కీపర్ సాధారణ స్థితికి చేరుకున్నాడు. తొలి దఫాలో బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లు నిష్క్రమించిన తర్వాత తాను కూడా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీనిని బట్టి పంత్ గాయం అంత తీవ్రమైనదని కాదని తేలిపోయింది.కాగా 27 ఏళ్ల రిషభ్ పంత్ తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యాడు. అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్ జట్టులోనూ అతడికి స్థానం ఉన్నా.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. సీనియర్ కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యం ఇచ్చిన నాయకత్వ బృందం.. మూడు వన్డేల్లోనూ అతడినే ఆడించింది.పంత్ బెంచ్‌కే పరిమితం!ఫలితంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 తుదిజట్టులోనూ పంత్‌కు అవకాశం రాదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాదు.. కేఎల్ రాహుల్‌కు వన్డేల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అతడినే ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పంత్ బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి. కాగా కేఎల్ రాహుల్ చివరగా ఐసీసీస వన్డే వరల్డ్‌కప్-2023లో 500 పరుగులు సాధించాడు. అందుకే ఈ మెగా టోర్నీలోనూ అతడికే వికెట్ కీపర్‌గా మొదటి ప్రాధాన్యం దక్కనుంది.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ పోటీ పడనున్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. ఇక టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్‌లో తమ తొలిమ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్‌గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
CT 2025: రోహిత్ శర్మ ఇంకో 183 పరుగులు చేస్తే...
ఇంగ్లండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్(India vs England)ను ఘనంగా ముగించిన టీమిండియా తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)తో బిజీ కానుంది. బట్లర్ బృందాన్ని 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ సేన.. ఆత్మవిశ్వాసంతో ఈ ఐసీసీ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.ఇక ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఈ మెగా ఈవెంట్ ఆరంభం కానుండగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుంది. లీగ్ దశలో భాగంగా తొలుత బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న.. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో.. ఆ తర్వాత మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది.అరుదైన రికార్డు ముంగిట హిట్మ్యాన్ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఓ ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. దుబాయ్‌లో చరిత్ర సృష్టించేందుకు హిట్‌మ్యాన్ ఇంకా 183 పరుగుల దూరంలో ఉన్నాడు. కాగా గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమైన రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు.డెబ్బై ఆరు బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్న రోహిత్ శర్మ... తన వన్డే కెరీర్లోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కటక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్స్‌ల సాయంతో 119 పరుగులు చేశాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లో మాత్రం పేసర్ మార్క్ వుడ్ సంధించిన సూపర్ డెలివరీని ఆడలేక.. మళ్లీ విఫలమై ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.ఇంకో 183 పరుగులు జతచేశాడంటేఇక తదుపరి రోహిత్ శర్మ దుబాయ్ వేదికగా ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. కాగా దుబాయ్‌లో ఇప్పటి వరకు అతడు వన్డేల్లో 317 పరుగులు సాధించాడు. ఈ ఈవెంట్ సందర్భంగా ఇందుకు ఇంకో 183 పరుగులు జతచేశాడంటే.. దుబాయ్‌లో అత్యధిక వన్డే పరుగులు సాధించిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కుతాడు.ప్రస్తుతం ఈ ప్రపంచ రికార్డు స్కాట్లాండ్కు చెందిన రిచీ బెరింగ్టన్ పేరిట ఉంది. అతడు ఇప్పటి వరకు దుబాయ్‌లో వన్డేల్లో 424 పరుగులు సాధించాడు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 342 పరుగులతో భారత బ్యాటర్లలో టాప్‌లో కొనసాగుతున్నాడు.కాగా వన్డేల్లో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతడి అత్యధిక స్కోరు 264. ఇక మొత్తంగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 260 వన్డేలు పూర్తి చేసుకుని 10988 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 338 వన్డే సిక్సర్లు ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీ-2025కి టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చదవండి: రోహిత్, కోహ్లితో పాటు అతడికి ఇదే ఆఖరి ఐసీసీ టోర్నీ: భారత మాజీ క్రికెటర్ -
BCCI: బుమ్రా ఆడతాడా?.. రిస్క్ వద్దు!.. ఆ డాక్టర్ చేతిలోనే అంతా..
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో అంతా తానై ముందుండి నడిపించిన ఈ పేస్ దళ నాయకుడు ఆఖర్లో గాయపడిన విషయం తెలిసిందే. కంగారూ దేశ పర్యటనలో చివరిదైన సిడ్నీ టెస్టు సందర్భంగా బుమ్రా వెన్నునొప్పితో విలవిల్లాడాడు. మూడు వారాలుగా విశ్రాంతిమ్యాచ్ మధ్యలోనే మైదానం వీడిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. స్కానింగ్ అనంతరం జట్టుతో చేరినా మళ్లీ బంతితో బరిలోకి దిగలేకపోయాడు. ఈ క్రమంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుమ్రా ఆటకు దూరమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయింది. అయితే, అతడి ఫిట్నెస్ గురించి ఇంత వరకు స్పష్టత రాలేదు.ఇప్పటికే స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్(India vs England)కు దూరమైన బుమ్రా.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నాటికైనా జట్టుతో చేరాలని టీమిండియా యాజమాన్యం ఆశిస్తోంది. ఈ మెగా టోర్నీ నాటికి అతడు ఫిట్‌గా మారతాడనే ఆశాభావంతోనే జట్టుకు ఎంపిక చేసింది. ఒకవేళ బుమ్రా గనుక ఈ ఐసీసీ ఈవెంట్‌కు దూరమైతే.. జట్టుపై ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే.. అతడి విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేదు.న్యూజిలాండ్ స్పెషలిస్టుతో సంప్రదింపులుఇందులో భాగంగా.. ఇప్పటికే బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు బుమ్రా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అంతేకాదు.. వెన్నునొప్పి తీవ్రత, దాని తాలుకు ప్రభావాన్ని అంచనా వేసేందుకు న్యూజిలాండ్ స్పెషలిస్టు డాక్టర్ రొవాన్ షోటన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.అదొక అద్భుతమని తెలుసుఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ వైద్య బృందం షోటన్తో కాంటాక్టులో ఉంది. బుమ్రాను స్వయంగా అక్కడికి పంపాలని బోర్డు భావించింది. అయితే, ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. తనకు విధించిన గడువులోగా బుమ్రా గనుక వందశాతం ఫిట్నెస్ సాధిస్తే అదొక అద్భుతమని సెలక్టర్లకు కూడా తెలుసు.అదే జరగాలని యాజమాన్యం కోరుకుంటోంది కూడా! అందుకే బుమ్రా స్కానింగ్ రిపోర్టులను షోటన్కు పంపించి.. ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. ఏదేమైనా.. బుమ్రా వీలైనంత త్వరగా జట్టుతో చేరితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది. అతడు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.ఫిబ్రవరి 12 వరకు అవకాశంఈ నేపథ్యంలో జనవరి 18న బీసీసీఐ తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో బుమ్రాకు కూడా చోటు దక్కింది. అయితే, ఫిట్నెస్ ఆధారంగానే అతడి విషయంలో తుది నిర్ణయం ఉంటుందని.. జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది. కాగా భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు. తటస్థ వేదికైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తమ మ్యాచ్‌లు ఆడనుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనున్న రోహిత్ సేన.. మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది. చదవండి: షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్‌తో సమస్యా? -
‘నితీశ్ రెడ్డికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వాల్సిందే’
భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చంతా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) గురించే!.. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే టీమిండియాలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే ప్రాథమిక జట్లను ప్రకటించడానికి సోమవారమే(జనవరి 13) ఆఖరి తేదీ అయినా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని మరింత గడువు కోరింది.ఇందుకు ఐసీసీ నుంచి సానుకూల స్పందన రాగా.. జనవరి 18 లేదా 19న చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి ఈ మెగా టోర్నీకి తమ జట్టును ఎంచుకున్నారు.కెప్టెన్‌కు నో ఛాన్స్!టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు ఈ వన్డే ఫార్మాట్ జట్టులో గావస్కర్, పఠాన్ చోటివ్వలేదు. అయితే, అనూహ్యంగా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డిని మాత్రం తమ టీమ్‌లో చేర్చారు. ఈ విషయం గురించి స్టార్ స్పోర్ట్స్ షోలో గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో వన్డేల్లో ఎవరు అదరగొట్టారో వారిని మాత్రమే నేను ఎంచుకుంటాను. వన్డే ప్రపంచకప్-2023లో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు.సంజూను ఎలా కాదనగలం?ఇక శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. అతడు కూడా ప్రపంచకప్ టోర్నీలో మునుపెన్నడూ లేనివిధంగా దుమ్ములేపాడు. కాబట్టి తనకు సెలక్టర్లు మద్దతుగా నిలవాలి. గత కొన్ని నెలలుగా అతడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఫామ్‌లో ఉన్నా సరే అతడికి సెలక్టర్ల నుంచి పిలుపురావడం లేదు.నా అభిప్రాయం ప్రకారం వీరిద్దరికి కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడే జట్టులో చోటివ్వాలి. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఆడించాలి. ఆరో స్థానంలో రిషభ్ పంత్ ఆడాలి. ఇక సంజూ శాంసన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్(టీ20)లో వరుస శతకాలు సాధించాడు. అలాంటి ఆటగాడిని మనం ఎలా విస్మరించగలం?’’ అని పేర్కొన్నాడు.నితీశ్ రెడ్డికి చోటు ఇవ్వాల్సిందేఇక ఇర్ఫాన్ పఠాన్ ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు చెప్పింది బాగుంది. ఇక ఎనిమిదో స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఇక జట్టులో సమతూకం ఉండాలంటే.. బౌలింగ్ ఆప్షన్లు కూడా చూసుకోవాలి. జట్టులో కచ్చితంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు ఒక బ్యాకప్ ఆప్షన్ ఉండాలి. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో మనకు అద్భుతమైన ఆటగాడు అందుబాటులో ఉన్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కువ మందికి సాధ్యం కాని ఘనతను సెంచరీ ద్వారా అతడు సాధించాడు’’ అని పేర్కొన్నాడు.కాగా నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఇటీవల ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో శతకంతో ఆకట్టుకున్నాడు.ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ తప్పకుండా తుదిజట్టులో ఉంటారని అంచనా వేసిన ఇర్ఫాన్ పఠాన్.. బుమ్రా గాయం త్వరగా నయమైపోవాలని ఆకాంక్షించాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభం కానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ తిరస్కరించగా.. హైబ్రిడ్ విధానంలో భారత్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తటస్థ వేదికైన దుబాయ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ సేన తమ ప్రయాణం ఆరంభించనుంది.సునిల్ గావస్కర్- ఇర్ఫాన్ పఠాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: CT 2025: వరల్డ్‌కప్‌లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ: శ్రేయస్ అయ్యర్ -
BCCI: చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఆరోజే
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) సమయం సమీపిస్తోంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్ తదితర బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాత్రం ఇంత వరకు ఈ టోర్నీలో పాల్గొనే సభ్యుల పేర్లు వెల్లడించలేదు.ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా(Rajiv Shukla) కీలక అప్డేట్ అందించారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును ఈనెల 18 లేదా 19వ తేదీల్లో ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా 2017లో టైటిల్ గెలిచిన పాకిస్తాన్.. చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.భద్రతా కారణాల దృష్ట్యాఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో అనేక చర్చోపచర్చల అనంతరం ఐసీసీ ఆదేశాల మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది. దీని ప్రకారం భారత జట్టు తమ మ్యాచ్‌లను తటస్థ వేదికైన దుబాయ్‌లో ఆడనుంది.ఇక తమ తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్ ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. కాగా ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. ఇక వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా ఈవెంట్లో ఆసీస్‌తో పాటు టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా హాట్ ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నాయి. మరోవైపు.. భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో సెమీ ఫైనల్ కూడా చేరలేకపోయిన పాకిస్తాన్.. సొంతగడ్డపై జరిగే చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం భారీ అంచనాలతో ముందుకు రానుంది. ఆసీస్‌ను వారి స్వదేశంలో వన్డే సిరీస్‌లో ఓడించడంతో పాటు.. సౌతాఫ్రికా గడ్డపై ఇంత వరకూ ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో ప్రొటిస్ జట్టును వన్డే సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్ చేసి జోరు మీదుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025గ్రూప్-‘ఎ’- ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’- ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్డబ్ల్యూపీఎల్ వేదికలు ఎంపిక చేశాంఇదిలా ఉంటే..వచ్చే నెల 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభం కానుంది. గతేడాది రెండు (లక్నో, బరోడా) వేదికల్లో ఈ లీగ్ నిర్వహించగా... ఈ సారి నాలుగు నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి 2న డబ్ల్యూపీఎల్ ఫైనల్ జరగనుండగా... అదే నెల 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.ఇక మే 25న ఐపీఎల్ తుదిపోరుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యమివ్వనుంది. 2024 ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్రోఫీ చేజిక్కించుకోవడంతో... తొలిపోరు కూడా అక్కడే జరగనుంది.బీసీసీఐ కొత్త కార్యదర్శి అతడేఈ సమావేశంలో బోర్డు కార్యదర్శిగా దేవజిత్ సైకియా(Devjith Saikiya), కోశాధికారిగా ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు వీరిద్దరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక అవసరం లేకుండా పోయిందని... ఎన్నికల అధికారి వెల్లడించారు. మరోవైపు.. డబ్ల్యూపీఎల్ వేదికల ఎంపిక గురించి రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. అతి త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ సందర్భంగానే చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని కూడా రాజీవ్ శుక్లా తెలిపారు.చదవండి: CT 2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. తొలిసారిగా ఆ ఇద్దరు -
భారత క్రికెట్‌కు దుర్దినం.. ఒకే రోజు మూడు పరాభవాలు
భారత క్రికెట్‌కు సంబంధించి ఇవాళ (డిసెంబర్ 8) దుర్దినం అని చెప్పాలి. ఎందుకంటే.. ఈ రోజు భారత క్రికెట్ జట్లకు మూడు పరాభవాలు ఎదురయ్యాయి. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. మహిళల క్రికెట్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 122 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఇవాళే జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో యంగ్ ఇండియా ఘోర పరాభవం ఎదుర్కొంది. ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఇలా ఒకే రోజు భారత క్రికెట్ జట్లు మూడు పరాభవాలు ఎదుర్కోవడంతో సగటు భారత క్రికెట్ అభిమాని బాధ పడుతున్నాడు. భారత క్రికెట్‌కు ఇవాళ దుర్దినం అని అభిప్రాయపడుతున్నాడు.ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడో టెస్ట్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా జరుగనుంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. తద్వారా ఆసీస్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 11న జరుగనుంది.అండర్-19 ఆసియా కప్ విషయానికొస్తే.. ఇవాళ జరిగిన ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. -
ఆసియా కప్ ఫైనల్లో భారత్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్
ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్లో భారత్‌పై బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా బంగ్లాదేశ్ ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. యుద్ధజిత్ గుహా, చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కిరణ్ చోర్మలే, కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే తలో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో రిజాన్ హొసేన్ (47) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మొహమ్మద్ షిహాబ్ జేమ్స్ (40), ఫరీద్ హసన్ ఫైసల్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం 199 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అజీజుల్ హకీమ్ తమీమ్ (3/8), ఇక్బాల్ హొసేన్ ఎమోన్ (3/24), అల్ ఫహద్ (2/34), మరూఫ్ మ్రిద (/36), రిజాన్ హొసేన్ (1/14) దెబ్బకు 35.2 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. భారత ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (1), వైభవ్ సూర్యవంశీ (9) దారుణంగా విఫలమయ్యారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మొహమ్మద్ అమాన్ (26), హార్దిక్ రాజ్ (24), కేపీ కార్తికేయ (21), అండ్రే సిద్దార్థ్ (20), చేతన్ శర్మ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. -
ICC: తొలిసారి మెగా టోర్నీలోకి జింబాబ్వే.. భారత్ షెడ్యూల్ ఇదే
అంతర్జాతీయ మహిళా క్రికెట్‌కు సంబంధించిన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం(FTP) ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్‌తో పాటు మహిళల వన్డే ప్రపంచకప్ 2029కు సన్నాహకంగా ఈ షెడ్యూల్ ఉండబోతోందని పేర్కొంది. అంతేకాదు.. ఈసారి వరల్డ్‌కప్ టోర్నీలో అదనంగా మరో జట్టు కూడా చేరుతోందని తెలిపింది. జింబాబ్వే తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో అడుగుపెట్టనుందని ఐసీసీ పేర్కొంది.44 సిరీస్లుఇక 2025-29 మధ్యకాలంలో వుమెన్స్ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా 44 సిరీస్‌లు నిర్వహించబోతున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఇందులో 132 వన్డేలు ఉంటాయని.. ప్రతి సిరీస్‌లోనూ మూడు మ్యాచ్‌ల చొప్పున జట్లు ఆడతాయని తెలిపింది.కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాంలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో స్వదేశంలో మ్యాచ్‌లు ఆడనుంది. ఇక విదేశీ గడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లను ఎదుర్కోనుంది.ఇదిలా ఉంటే.. భారత్ వేదికగా 2025లో ఐసీసీ వుమెన్స్ వనన్డే వరల్డ్‌కప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అదే విధంగా.. యునైటెడ్ కింగ్డమ్లో 2026లో టీ20 ప్రపంచకప్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, 2028 టీ20 వరల్డ్‌కప్‌నకు మాత్రం ఇంకా వేదికను ప్రకటించలేదు.ఐసీసీ వుమెన్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోయే దేశాలుఆస్ట్రేలియా, ఇండియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే.ఆస్ట్రేలియా షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లతో.. అదే విధంగా భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక పర్యటన.ఇండియా షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లాండ్ పర్యటనబంగ్లాదేశ్ షెడ్యూల్స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ పర్యటనఇంగ్లండ్ షెడ్యూల్స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లతో.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక పర్యటనఐర్లాండ్ షెడ్యూల్స్వదేశంలో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, శ్రీలంక పర్యటనన్యూజిలాండ్ షెడ్యూల్స్వదేశంలో భారత్, సౌతాఫ్రికా, జింబాబ్వే, శ్రీలంకలతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐర్లాండ్ పర్యటనపాకిస్తాన్ షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్ పర్యటనసౌతాఫ్రికా షెడ్యూల్స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, జింబాబ్వే పర్యటనశ్రీలంక షెడ్యూల్స్వదేశంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఐర్లాండ్‌లతో... న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనవెస్టిండీస్ షెడ్యూల్స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంకలతో.. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వే, ఐర్లాండ్ పర్యటనజింబాబ్వే షెడ్యూల్స్వదేశంలో సౌతాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్‌లతో.. భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పర్యటన.చదవండి: ఉత్కంఠ పోరులో పాక్‌పై ఆస్ట్రేలియా గెలుపు -
Virat Kohli: ఎన్నాళ్లకెన్నాళ్లకు!.. ఎట్టకేలకు కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టుల్లో ఎట్టకేలకు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అర్ధ శతకం బాది.. తొమ్మిది నెలల నిరీక్షణకు తెరదించాడు. తనకు సొంత మైదానం(ఐపీఎల్- ఆర్సీబీ)లాంటి బెంగళూరు చిన్వస్వామి స్టేడియంలో.. చక్కని షాట్లతో అలరిస్తూ.. టెస్టుల్లో తన 31వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. డెబ్బై బంతుల్లో ఫిఫ్లీ పూర్తి చేసుకున్నాడు.అరుదైన మైలురాయికాగా సంప్రదాయ క్రికెట్లో కోహ్లి చివరగా గతేడాది డిసెంబరులో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో అరుదైన మైలురాయిని దాటాడు. టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో కోహ్లి నిరాశపరిచిన విషయం తెలిసిందే.బంగ్లాతో తొలి మ్యాచ్‌లో కేవలం 23 పరుగులే చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టులో 76(47, 29*) చేయగలిగాడు. అయితే, న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి పాత కథనే పునరావృతం చేశాడు. అయితే, శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు.ధీటుగా బదులిస్తున్న టీమిండియాఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 402 పరుగులు చేసింది. అయితే, రోహిత్ సేన ఇందుకు ధీటుగా బదులిస్తోంది. 40 ఓవర్ల ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ(52) చేయగా.. సర్ఫరాజ్ ఖాన్, కోహ్లి అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
టెస్టుల్లో త్వరలోనే ఎంట్రీ!.. గంభీర్ భయ్యా చెప్పారు: సంజూ
కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ త్వరలోనే టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడా? కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను రెడ్‌బాల్ క్రికెట్ ఆడించేందుకు సుముఖంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సంజూ శాంసన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించాడు.దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన సంజూ 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. జింబాబ్వేతో టీ20ల సందర్భంగా అరంగేట్రం చేసిన అతడికి ఆరేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం లభించింది. ఇప్పటి వరకు భారత్ తరఫున 16 వన్డేలు, 33 టీ20లు ఆడిన సంజూ శాంసన్.. ఆయా ఫార్మాట్లలో 510, 594 పరుగులు చేశాడు.టీమిండియా తరఫున టీ20 సెంచరీఇక వన్డేల్లో ఓ సెంచరీ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లో శతకం నమోదు చేశాడు. అయితే, పరిమిత ఓవర్ల జట్టులోనే ఇప్పటి వరకు సంజూకు నిలకడైన స్థానం లేదు. అయినప్పటికీ టెస్టుల్లోనూ ఆడాలని పట్టుదలగా ఉన్నాడు. మేనేజ్మెంట్ పిలిచి మరీ రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలని చెప్పడంతో లక్ష్యానికి చేరువవుతున్నాడు.మేనేజ్మెంట్ నుంచి మెసేజ్ వచ్చిందిఈ విషయాల గురించి సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే నేను పరిమితం కావాలనుకోవడం లేదు. రెడ్‌బాల్ క్రికెట్లో రాణించగలననే నమ్మకం నాకుంది. టీమిండియా తరఫున టెస్టు క్రికెట్ ఆడాలనేది నా చిరకాల కోరిక.దులిప్ ట్రోఫీ ఆరంభానికి ముందు నాకు నాయకత్వ బృందం(కెప్టెన్, కోచ్) నుంచి సందేశం వచ్చింది. రెడ్‌బాల్ క్రికెట్ జట్టులోనూ నా పేరును పరిశీలిస్తున్నామని మేనేజ్మెంట్లోని ముఖ్యులు చెప్పారు. రంజీ ట్రోఫీపై దృష్టి పెట్టి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని.. రెడ్‌బాల్ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు’’ అని పేర్కొన్నాడు.గంభీర్ భయ్యా మద్దతు ఉంది అదే విధంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గౌతం భయ్యా నాకెల్లప్పుడూ మద్దతుగా ఉంటాడు. కష్టకాలంలో నాకు అండగా నిలబడ్డాడు. నిజానికి టీమిండియాకు ఆడుతున్నపుడు బ్యాటింగ్ స్థానం సుస్థిరంగా ఉండదు. మూడు వారాల ముందే చెప్పారు!అయితే, బంగ్లాతో సిరీస్‌కు మూడు వారాల ముందే నేను ఓపెనర్‌గా రావాలని మేనేజ్మెంట్ చెప్పింది. కొత్త పాత్రలో ఇమిడిపోయేలా నేను మానసికంగా సిద్ధపడేందుకు తగిన సమయం ఇచ్చింది’’ అంటూ 29 ఏళ్ల సంజూ శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. స్పోర్ట్స్ స్టార్‌తో మాట్లాడుతూ సంజూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.సంజూకు అంత ఈజీ కాదుకాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సంజూ శాంసన్ ఇప్పటి వరకు 64 మ్యాచ్‌లు ఆడి 38.96 సగటుతో 3819 పరుగులు చేశాడు. ఇందులో 11 శతకాలు ఉన్నాయి. ఇక ఇటీవల దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా-డి జట్టుకు ఆడిన అతడు మెరుపు సెంచరీ(101 బంతుల్లో 106) సాధించాడు. అయితే, టెస్టుల్లో వికెట్ కీపర్ స్థానంలో రిషభ్ పంత్ పాతుకుపోగా.. ధ్రువ్ జురెల్ బ్యాకప్‌గా ఉన్నాడు. సంజూ కూడా రేసులోకి రావాలంటే వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో పాటు బ్యాటింగ్ పరంగానూ మరింత గొప్పగా రాణించాల్సి ఉంటుంది. అలా అయితే, జురెల్‌ను దాటుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.చదవండి: W T20 WC: ‘హర్మన్‌పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్’ -
Ind vs NZ: మా ఆటకు హద్దుల్లేవ్.. రోజుకు 400–500 పరుగులైనా..
టీమిండియా క్రికెటర్లు ఎవరైనా సరే తమ సహజ శైలిలో చెలరేగుతుంటే... జట్టు వ్యూహాల పేరుతో వారి దూకుడుకు హద్దులు పెట్టబోమని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ‘బ్యాటింగ్ కింగ్’ విరాట్ కోహ్లి ఫామ్‌పై తమకెలాంటి ఆందోళనా లేదని, అతని పరుగుల దాహం ఎప్పటికీ తీరదని గంభీర్ తెలిపాడు. అయితే, బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియాకు కఠిన సవాళ్లు తప్పవన్నాడు.ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్ సిరీస్ సహ కివీస్‌తో టెస్టులు, ఆస్ట్రేలియా పర్యటనలపై గంభీర్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించాడు. భవిష్యత్తులో జరిగే సిరీస్లకంటే ప్రస్తుత సిరీస్‌పైనే తమ దృష్టి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే...అడ్డు ఎందుకు? ‘‘భారత బ్యాటింగ్‌కు నిర్దిష్టమైన శైలి ఇదని, ఇలాగే ఆడాలనే కచ్చితమైన ప్రణాళికలేమీ లేవు. ఆటగాళ్లు దూకుడుగా ఆడితే ఆడని... చెలరేగితే చెలరేగని ఇందులో అడ్డుకట్టలెందుకు పెట్టాలి. వారి సహజశైలిని వారు కొనసాగించే స్వేచ్ఛ ఇవ్వాలి కదా! గట్టిగా చెప్పాలంటే... మేం ఒక రోజులో 400–500 పరుగులైనా చేయాలనుకుంటాం. తప్పదు అవసరమనుకుంటే రెండు రోజుల పాటు జిడ్డుగా ఆడి ‘డ్రా’ అయినా చేసుకోగలుగుతాం.ఎందుకంటే కొన్నిసార్లు 100 పరుగులకే ఆలౌటయ్యే ప్రమాదం రావొచ్చు. అప్పుడు క్రీజులో నిలబడే ఓపిక, గంటల తరబడి ఆడే సామర్థ్యం కూడా అవసరం. టీమిండియా ఇలా తయారుకావడమే ముఖ్యం. అప్పుడే దూకుడైన ఆటతో అభిమానులకు మజా దక్కుతుంది. పరిస్థితులను బట్టే నిర్ణయాలు ఈ సిరీస్‌లో ఇలా ఆడాలని, ఆ ప్రత్యర్థిని అలా ఎదుర్కోవాలనే ముందస్తు ప్రణాళికలపైనే ఆధారపడటం కుదరదు. వీలును బట్టి, అప్పటి పరిస్థితులు, పిచ్‌లో ఎదురయ్యే సవాళ్లు దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలుంటాయి. దీనికి పక్కా ప్రణాళికంటూ అమలు కాదు... అప్పటి పరిస్థితులే ప్రామాణికం. దాన్నిబట్టే ఆటతీరు మారుతుంది. ఆడే శైలి మరో దశకు చేరుకుంటుంది.కివీస్‌తో గట్టిపోటీ న్యూజిలాండ్ సాదాసీదా ప్రత్యర్థి కానేకాదు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా షాక్‌లు తప్పవు. సొంతగడ్డ అనే అనుకూలతలు, గత సిరీస్ గెలిచాం... ఇదీ గెలుస్తామనే ధీమా తప్పు. బంగ్లాదేశ్‌తో పోల్చితే కివీస్ పూర్తిగా భిన్నమైన ప్రత్యర్థి. ఆ జట్టు గట్టి పోటీ ఇస్తుంది. నాణ్యమైన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు.కాబట్టి ప్రతీ మ్యాచ్‌లోనూ మాకు సవాళ్లు తప్పవు. అయితే ప్రత్యర్థి కివీసా లేదంటే ఆసీసా అని చూడం. జట్టు గెలుపొందడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. వచ్చే నెలలో మొదలయ్యే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తాం. ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ బెర్తే లక్ష్యంగా కివీస్‌ను ఓడించేపనిలో ఉంటాం .వరల్డ్‌క్లాస్ ప్లేయర్కోహ్లిపై నా ఆలోచనలు సుస్పష్టం. అతనో విశ్వవిఖ్యాత క్రికెటర్. సుదీర్ఘకాలంగా గొప్పగా రాణిస్తున్న బ్యాటర్. కోహ్లి అరంగేట్రం చేసినపుడు ఎలాంటి పరుగుల దాహంతో ఉన్నాడో... ఇన్నేళ్లుగా ఆడుతున్నా ఇప్పటికి అలాంటి ఆకలితోనే ఉన్నాడు. కివీస్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో తప్పకుండా రాణిస్తాడనే ఆశిస్తున్నాను.ఇకపైనా అదే ఆటతీరును ఆస్ట్రేలియా పర్యటనలోనూ కొనసాగిస్తాడనే నమ్మకంతో ఉన్నాను. వరుసగా కొన్ని మ్యాచ్‌ల్లో... లేదంటే ఒకట్రెండు సిరీస్‌లలోనే విఫలమైనంత మాత్రాన అతడిబ్యాటింగ్లో సత్తా లేదని కాదు. ఆటగాళ్లు కదా... ఎవరికైనా వైఫల్యాలు సహజం. అలాగే వాటిని అధిగమించడం కూడా జరుగుతుంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు. చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
‘పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారు’
టీ20 క్రికెట్లో టీమిండియా దూకుడు మంత్రంతో దూసుకెళ్తోందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇందుకు కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్, నూతన సారథి సూర్యకుమార్ యాదవ్‌లే కారణమని పేర్కొన్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా పరుగుల విధ్వంసం సృష్టించేందుకు యంగిస్తాన్ సిద్ధమైందని.. మున్ముందు పొట్టి ఫార్మాట్లో భారత జట్టు మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయపడ్డాడు.లంక పర్యటనతో మొదలుకాగా టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని భర్తీ చేసిన గంభీర్.. శ్రీలంక పర్యటనతో తన ప్రయాణం ప్రారంభించాడు. సూర్యకుమార్ పూర్తిస్థాయి కెప్టెన్ అయిన తర్వాత జరిగిన పొట్టి సిరీస్‌లో లంకను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం వీరిద్దరి కాంబినేషన్లో స్వదేశంలో టీమిండియా ఇటీవలే బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడింది.బంగ్లా బౌలింగ్ ఊచకోతసొంతగడ్డపై యువ ఆటగాళ్లతో నిండిపోయిన సూర్యసేన ఆకాశమే హద్దుగా చెలరేగి.. బంగ్లానూ 3-0తో వైట్‌వాష్ చేసింది. అయితే, లంక పర్యటనతో పోలిస్తే ఈసారి మరింత వేగంగా, మరింత దూకుడుగా పరుగులు రాబట్టింది. తొలి టీ20లో 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. ఆఖరి రెండు మ్యాచ్‌లలో బంగ్లా బౌలింగ్‌ను ఊచకోత కోసింది. వరుసగా 221, 297 పరుగులు సాధించి వారెవ్వా అనిపించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్, సూర్యకుమార్ యాదవ్ జోడీ టీమిండియాకు సరికొత్త దూకుడు మంత్రాన్ని ఉపదేశించింది. మ్యాచ్ అయినపోయిన తర్వాత రింకూ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.పరుగుల విధ్వంసం తప్ప.. ఇంకోటి వద్దన్నారువిధ్వంసకరంగా బ్యాటింగ్ చేయడం తప్ప.. వేరే విషయాల గురించి ఆలోచించవద్దని తమకు ఆదేశాలు వచ్చాయన్నాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలని.. వికెట్ పడుతుందనే బెంగ వద్దని మేనేజ్మెంట్ చెప్పిందన్నాడు. దీనిని బట్టి కోచ్, కెప్టెన్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.నిజానికి పరుగులు రాబట్టాలనే తొందరలో వికెట్ పారేసుకుంటే జట్టులో చోటు దక్కదని ఆటగాళ్లు భయపడతారు. అయితే, స్వయంగా మేనేజ్మెంట్ రంగంలోకి దిగి ఫాస్ట్‌గా ఆడమని చెప్పటమే గాక.. ఆ క్రమంలో ప్రతికూల ఫలితాలు వచ్చినా అండగా ఉంటే.. అంతకంటే ఆటగాళ్లకు ఇంకేం కావాలి.బలహీన జట్లపై మాత్రమేనా?జట్టులో తమ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని ప్లేయర్లు భావిస్తే.. ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి మరి! ఈ యంగిస్తాన్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది’’ అని ప్రశంసలు కురిపించాడు. అయితే, ఇప్పటి వరకు యువ టీమిండియా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలహీన జట్లపై తమ బ్యాటింగ్ ప్రతాపాన్ని చూపిందన్న ఆకాశ్ చోప్రా.. పటిష్ట జట్లపై కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే కొన్నిసార్లు చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తమ బ్యాటింగ్.. ముఖ్యంగా పవర్ ప్లేలో ఎలా ఉంటుందో ఇప్పటికే చూపించిందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు 180కి పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశారు.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
India vs Bangladesh: దసరా ధమాకా
హైదరాబాద్‌లో విజయదశమి రోజున సాయంత్రం...పండగ సంబరాలను కాస్త పక్కన పెట్టి క్రికెట్ వైపు వచి్చన అభిమానులు అదృష్టవంతులు! అటు స్టేడియంలో గానీ ఇటు ఇంట్లో గానీ మ్యాచ్ చూసినవారు ఫుల్ దావత్ చేసుకున్నట్లే! అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చి భారత క్రికెటర్లు పారించిన పరుగుల ప్రవాహంతో పండగ ఆనందం రెట్టింపు అయిందంటే అతిశయోక్తి కాదు. 25 ఫోర్లు, 23 సిక్స్‌లు...ఈ 47 బౌండరీలతోనే ఏకంగా 232 పరుగులు...రెండు ఓవర్లు మినహా మిగతా 18 ఓవర్లూ పదికి పైగా పరుగులు వచి్చన పవర్‌ప్లే ఓవర్లే! 43 బంతులకే 100, 84 బంతులకే 200 వచ్చేశాయి...అలా వెళ్లిన స్కోరు 300కు కాస్త ముందు ఆగింది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులు బద్దలు...సరికొత్త రికార్డులు నమోదు. అంతర్జాతీయ టి20ల్లో 28 ఇన్నింగ్స్‌ల తర్వాత కూడా 2 అర్ధసెంచరీలు, ఇరవై లోపు లోపు 20 స్కోర్లతో తన సెలక్షన్‌పై సందేహాలు రేకెత్తిస్తూ వచి్చన సంజు సామ్సన్ ఎట్టకేలకు అద్భుతం చేశాడు. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సహా అతని మెరుపు సెంచరీ హైలైట్‌గా నిలిచింది. అతి భారీ లక్ష్యం ముందుండగా ముందు చేతులెత్తేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు ఆడి లాంఛనం ముగించింది. సాక్షి, హైదరాబాద్: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సమరాన్ని భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యంతో ముగించింది. టెస్టు సిరీస్‌ను 2–0తో గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు టి20 సిరీస్‌ను కూడా 3–0తో సొంతం చేసుకుంది. గత మ్యాచ్‌లోనే 86 పరుగుల ఓటమి తర్వాత సిరీస్ కోల్పోయి కునారిల్లిన బంగ్లాకు చివరి పోరులో అంతకంటే పెద్ద దెబ్బ పడింది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి టి20లో భారత్ 133 పరుగుల తేడాతో బంగ్లాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ముందుగా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజు సామ్సన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా, కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఎప్పటిలాగే చెలరేగాడు. సామ్సన్, సూర్య రెండో వికెట్‌కు 70 బంతుల్లోనే 173 పరుగులు జోడించడం విశేషం. వీరిద్దరికి తోడు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కూడా దూకుడు కనబర్చడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులే చేయగలిగింది. తౌహీద్ హృదయ్ (42 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), లిటన్ దాస్ (25 బంతుల్లో 42; 8 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. 6, 6, 6, 6, 6... అభిషేక్ (4)ను తొందరగా అవుట్ చేయడం ఒక్కటే బంగ్లాకు దక్కిన ఆనందం. ఆ తర్వాత 69 బంతుల పాటు వారికి సామ్సన్, సూర్య చుక్కలు చూపించారు. తస్కీన్ ఓవర్లో సామ్సన్ వరుసగా 4 ఫోర్లు కొట్టగా, తన్జీమ్ ఓవర్లో సూర్య వరుసగా 3 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్‌ప్లేలోనే జట్టు 82 పరుగులు చేసింది. 22 బంతుల్లో సామ్సన్ అర్ధసెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత బంగ్లా స్పిన్నర్ రిషాద్ బాధితుడయ్యాడు. రిషాద్ తొలి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన సామ్సన్...అతని తర్వాతి ఓవర్లో విధ్వంసం సృష్టించాడు. తొలి బంతికి పరుగు తీయని సామ్సన్ తర్వాతి ఐదు బంతుల్లో 6, 6, 6, 6, 6తో చెలరేగాడు. మరో వైపు 23 బంతుల్లో సూర్య హాఫ్ సెంచరీ పూర్తయింది. మహేదీ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ తొలి బంతికి నేరుగా ఫోర్ కొట్టడంతో సామ్సన్ 40 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఎట్టకేలకు సెంచరీ తర్వాత సామ్సన్ను ముస్తఫిజుర్ వెనక్కి పంపడంతో బంగ్లా ఊపిరి పీల్చుకుంది. తర్వాతి ఓవర్లోనే సూర్య అవుటయ్యాడు. ఆ తర్వాతా భారత్‌ను నిలువరించడం బంగ్లా వల్ల కాలేదు. పాండ్యా తన జోరును చూపిస్తూ తన్జీమ్ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 కొట్టగా...మహేదీ ఓవర్లో పరాగ్ వరుసగా 6, 4, 6 బాదాడు. వీరిద్దరు 26 బంతుల్లోనే 70 పరుగులు జత చేశారు. మూడు బంతులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచి్చన నితీశ్ కుమార్ రెడ్డి (0) తొలి బంతికే వెనుదిరగ్గా...300కు 3 పరుగుల ముందు భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తౌహీద్, దాస్ నాలుగో వికెట్‌కు 38 బంతుల్లో 53 పరుగులు జోడించి కాస్త పోరాడటం మినహా చెప్పుకునేందుకు ఏమీ లేకపోయింది. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) మహేదీ (బి) ముస్తఫిజుర్ 111; అభిషేక్ (సి) మహేదీ (బి) తన్జీమ్ 4; సూర్యకుమార్ (సి) రిషాద్ (బి) మహ్ముదుల్లా 75; పరాగ్ (సి) దాస్ (బి) తస్కీన్ 34; పాండ్యా (సి) రిషాద్ (బి) తన్జీమ్ 47; రింకూ (నాటౌట్) 8; నితీశ్ (సి) మహేదీ (బి) తన్జీమ్ 0; సుందర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 297. వికెట్ల పతనం: 1–23, 2–196, 3–206, 4–276, 5–289, 6–289. బౌలింగ్: మహేదీ 4–0–45–0, తస్కీన్ 4–0–51–1, తన్జీమ్ 4–0–66–3, ముస్తఫిజుర్ 4–0–52–1, రిషాద్ 2–0–46–0, మహ్ముదుల్లా 2–0–26–1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: పర్వేజ్ (సి) పరాగ్ (బి) మయాంక్ 0; తన్జీద్ (సి) వరుణ్ (బి) సుందర్ 15; నజ్ముల్ (సి) సామ్సన్ (బి) బిష్ణోయ్ 14; లిటన్‌దాస్ (సి) (సబ్) తిలక్ (బి) బిష్ణోయ్ 42; తౌహీద్ (నాటౌట్) 63; మహ్ముదుల్లా (సి) పరాగ్ (బి) మయాంక్ 8; మహేదీ (సి) పరాగ్ (బి) నితీశ్ 3; రిషాద్ (సి) అభిషేక్ (బి) బిష్ణోయ్ 0; తన్జీమ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–0, 2–35, 3–59, 4–112, 5–130, 6–138, 7–139. బౌలింగ్: మయాంక్ 4–0–32–2, పాండ్యా 3–0–32–0, సుందర్ 1–0–4–1, నితీశ్ 3–0–31–1, రవి 4–1– 30–3, వరుణ్ 4–0–23–0, అభిషేక్ 1–0–8–0. -
శాంసన్ సరికొత్త చరిత్ర.. ధోనికి కూడా సాధ్యం కాలేదు
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి రెండు టీ20ల్లో 29, 10 పరుగులతో నిరాశపరిచిన సంజూ.. ఆఖరి టీ20లో మాత్రంలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బంగ్లా బౌలర్లకు శాంసన్ చుక్కులు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ కేరళ స్టార్ క్రికెటర్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111 పరుగులు చేసాడు. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సంజూ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. శాంసన్ సాధించిన రికార్డులు ఇవే..➔అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాల్గవ బ్యాటర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2017లో బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో మిల్లర్ సెంచరీ సాధించాడు. అదే విధంగా భారత్ తరపున ఈ ఘనత అందుకున్న రెండో ప్లేయర్‌గా శాంసన్ నిలిచాడు. ఈ లిస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ శ్రీలంకపై 35 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.➔ఈ మ్యాచ్‌లో బంగ్లా స్పిన్నర్ రిషద్ హోస్సేన్‌ను సంజూ ఊతికారేశాడు. హోస్సేన్ వేసిన 10 ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది 30 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్స్‌లు పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా శాంసన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువీ ఆరు సిక్స్‌లు బాదాడు.➔భారత్ తరఫున టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజు శాంసన్ సంజూ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోర్ 89 పరుగులు మాత్రమే. 2022లో శ్రీలంకతో జరిగిన టీ20లో ఇషాన్ కిషన్ 89 పరుగులు చేశాడు.➔బంగ్లాదేశ్‌పై టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన భారత క్రికెటర్‌గా సంజూ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2019లో రాజ్‌కోట్ వేదికగా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 23 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. తాజా మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు.చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్ -
'టీమ్ కంటే ఏదీ ఎక్కువ కాదు.. జట్టులో నిస్వార్థ క్రికెటర్లు ఉండాలి'
టీ20ల్లో తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో 133 పరుగుల తేడాతో భారత్ విజయ భేరి మ్రోగించింది. తద్వారా టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 297 పరుగులు చేసిన టీమిండియా.. ఆ తర్వాత బౌలింగ్‌లో 164 పరుగులకే ప్రత్యర్ధిని కట్టడి చేసింది. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. తమ కుర్రాళ్ల ఆటతీరు పట్ల సూర్య సంతోషం వ్యక్తం చేశాడు."బంగ్లాతో టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము ఒక జట్టుగా చాలా సాధించాము. నా జట్టులో నిస్వార్థమైన క్రికెటర్లు ఉండాలని కోరుకుంటా. హార్దిక్ చెప్పినట్లుగా ఫీల్డ్‌లోనైనా, ఆఫ్‌ది ఫీల్డ్‌లోనైనా ఒకరి ప్రదర్శనలను ఒకరు ఆస్వాదించాలనుకుంటున్నాము.వీలైనంత ఎక్కువ సమయం సరదగా గడపాలని అనుకుంటున్నాము. మైదానంలో కూడా మా స్నేహాన్ని కొనసాగిస్తాము. ఇక గతంలో శ్రీలంకతో సిరీస్‌కు వెళ్లినప్పుడు గౌతీ భాయ్(గౌతమ్ గంభీర్) ఏం చెప్పాడో.. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు కూడా అదే సలహా ఇచ్చాడు. జట్టు కంటే ఏది ముఖ్యం కాదు. ఎవరైనా 99 లేదా 49 మీద ఉన్నప్పుడు షాట్ ఆడే ఆవకాశం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా ఆడేయాలి. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ అదే చేశాడు. నిజంగా అతడి ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. జట్టుకు బ్యాటింగ్, బౌలింగ్ విషయంలో ఖచ్చితంగా ఆప్షన్స్ ఉండాలి. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో మా జట్టు ప్రదర్శన నాకు సంతృప్తినిచ్చింది. జట్టు విజయాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావడం చాలా అనందంగా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్యకుమార్ పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
సంజూకు ఊపు వచ్చింది.. ఉప్పల్‌లో ఊచకోత! వీడియో వైరల్
సంజూ శాంసన్.. ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచిన సంజూ.. ఒకే ఒక ఇన్నింగ్స్‌తో తనపై విమర్శల చేస్తున్న వారి నోరు మూయించాడు. తను బ్యాట్‌కు పని చెబితే ఏ విధంగా ఉంటుందో క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. బంగ్లాదేశ్‌తో తొలి రెండు టీ20ల్లో పెద్దగా రాణించకపోయిన శాంసన్.. హైదరాబాద్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఉప్పల్‌లో బంగ్లా బౌలర్లను ఈ కేరళ బ్యాటర్ ఊచకోత కోశాడు. ఓపెనర్‌గా వచ్చిన సంజూను అపడం ఎవరూ తరం కాలేదు. అతడు బౌండరీలు బాదుతుంటే ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర పోషించారు. మైదానం నలుమూలల సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. రోహిత్ శర్మ తర్వాత వేగవంతమైన సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు. రోహిత్ శ్రీలంకపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న సంజూ 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111 పరుగులు చేసి ఔటయ్యాడు.ఒకే ఓవర్లో 5 సిక్స్లుఇక ఈ మ్యాచ్‌లో బంగ్లా స్పిన్నర్ రిషాద్ హుస్సేన్‌ను సంజూ ఊతికారేశాడు. 10 ఓవర్ వేసిన రిషాద్ బౌలింగ్‌లో వరుసగా అయిదు సిక్స్‌లు బాది అదరహో అనిపించాడు. ఈ ఓవర్ తొలి బంతిని డాట్ చేసిన సంజూ శాంసన్.. ఫుల్‌టాస్‌గా వచ్చిన రెండో బంతిని సిక్సర్‌గా తరలించాడు.మూడో బంతిని లాంగాఫ్ దిశగా... నాలుగో బంతిని స్ట్రైట్‌గా.. ఐదో బంతిని లాంగాన్ దిశగా.. చివరి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా మలిచాడు. అతడి విధ్వంసం చూసి బంగ్లా ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Sanju Samson - you beauty!🤯#IDFCFirstBankT20ITrophy #INDvBAN #JioCinemaSports pic.twitter.com/JsJ1tPYKgD— JioCinema (@JioCinema) October 12, 2024 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా జూలు విధిల్చింది. ఈ ఆఖరి టీ20లో బంగ్లాను 133 పరుగుల తేడాతో భారత జట్టు చిత్తు చేసింది. దీంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతులు మాత్రమే ఎదుర్కొన్న 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన భారత జట్టు పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.భారత్ సాధించిన రికార్డులు ఇవే..➔అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఈ రికార్డు సాధించిన జాబితాలో నేపాల్ ఉంది. ఆసియా క్రీడలు-2023లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ 314 పరుగులు చేసింది. కాగా ఈ 297 పరుగులే భారత్‌కు టీ20ల్లో అత్యధిక స్కోర్ కావడం విశేషం. అంతకుముందు 260 పరుగులు భారత అత్యధిక స్కోర్‌గా ఉండేది.➔ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు నమోదు చేసిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సాధించింది. బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ ఏకంగా 47 బౌండరీలు బాదింది. అందులో22 సిక్స్‌లు, 25 ఫోర్లు ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డు చెక్ రిపబ్లిక్(43 పేరిట ఉండేది.➔వరల్డ్ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 200కు పైగా పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటివరకు భారత జట్టు టీ20ల్లో 37 సార్లు 200 ప్లస్ స్కోర్లు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ జట్టు సొమర్సెట్ పేరిట ఉండేది. సొమర్సెట్ 36 సార్లు 200 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది. తాజా మ్యాచ్‌తో సొమర్సెట్ ఆల్‌టైమ్ రికార్డును టీమిండియా బ్రేక్ చేసింది.➔టీ20ల్లో వేగంగా 100 పరుగుల మార్క్ అందుకున్న జట్టు కూడా టీమిండియానే. ఈ మ్యాచ్‌లో భారత్ 7.1 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద దాటింది. ఇప్పటివరకు ఈ రికార్డు 7.6 ఓవర్లతో భారత్ పేరిటే ఉండేది.➔ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌ల బాదిన జాబితాలో భారత్ మూడో స్ధానంలో నిలిచింది. బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ 22 సిక్స్‌లు కొట్టింది.చదవండి: IND vs BAN: చెలరేగిన సంజూ, సూర్య.. బంగ్లాను చిత్తు చేసిన భారత్ -
చెలరేగిన సంజూ, సూర్య.. బంగ్లాను చిత్తు చేసిన భారత్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో 133 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. బంగ్లాదేశ్ బౌలర్లను ఊతికారేశారు.అభిషేక్ శర్మ మినహా మిగితా అందరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారత బ్యాటర్లలో ఓపెనర్ సంజూ శాంసన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; ఫోర్, 4 సిక్సర్లు) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగుల భారీ స్కోర్ చేసింది. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు.3 వికెట్లతో చెలరేగిన బిష్ణోయ్..అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లతో మెరిశాడు. అతడితో పాటు మయాంక్ యాదవ్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో తహిద్ హృదాయ్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్.. అయినా..! 🚨 ONE OF THE MOST RIDICULOUS SHOTS EVER 🚨- Sanju Samson is a beast...!!!! pic.twitter.com/e3hblLeXyA— Johns. (@CricCrazyJohns) October 12, 2024 -
సంజూ శాంసన్ విధ్వంసకర శతకం.. టీమిండియా అతి భారీ స్కోర్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా భారత్ అంతర్జాతీయ టీ20 చరిత్రలో రెండో భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.సంజూ శాంసన్ (47 బంతుల్లో 111; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో, సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో 75; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిపోయారు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రియాన్ పరాగ్ (13 బంతుల్లో 34; ఫోర్, 4 సిక్సర్లు) కూడా తలో చేయి వేయడంతో భారత్ రికార్డు స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 4, రింకూ సింగ్ 8, నితీశ్ రెడ్డి 0, వాషింగ్టన్ సుందర్ ఒక్క పరుగు చేశారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, మహ్మదుల్లా తలో వికెట్ దక్కించుకున్నారు. -
IND VS BAN 3rd T20: మరోసారి విఫలమైన అభిషేక్ శర్మ
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అభిషేక్ ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 16, 15, 4 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ల గైర్హాజరీలో జట్టులో చోటు దక్కించుకున్న అభిషేక్ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక ఉసూరుమనిపించాడు. ఇటీవలే జింబాబ్వేపై మెరుపు సెంచరీ చేసిన అభిషేక్‌పై భారీ అంచనాలు ఉండేవి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించగలడని మేనేజ్మెంట్ అతనిపై విశ్వాసం ఉంచింది. అయితే అభిషేక్ అందరి అంచనాలను వమ్ము చేస్తూ తేలిపోయాడు. ప్రస్తుతమున్న కాంపిటీషన్లో అభిషేక్‌కు మరోసారి జట్టులో చోటు దక్కడం కష్టమే.కాగా, హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా 23 పరుగుల వద్దే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. అయితే సంజూ శాంసన్ (25 బంతుల్లో 59; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడుతున్నారు. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిసున్నారు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 113/1గా ఉంది. చదవండి: దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్.. అయినా..! -
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మూడో టీ20 లైవ్ అప్డేట్స్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్ జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
రోహిత్, కోహ్లి సరసన చేరేందుకు 31 పరుగుల దూరంలో ఉన్న సూర్య
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల్లో మరో అరుదైన మైలురాయికి చేరువయ్యాడు. బంగ్లాదేశ్‌తో ఇవాళ (అక్టోబర్ 12) జరుగబోయే మ్యాచ్‌లో స్కై మరో 31 పరుగులు చేస్తే 2500 పరుగుల క్లబ్లో చేరతాడు. భారత్ తరఫున కేవలం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మాత్రమే 2500 పరుగుల మార్కును దాటారు. స్కై నేటి మ్యాచ్‌లో 31 పరుగులు సాధిస్తే.. కోహ్లి, రోహిత్ సరసన చేరతాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో 2469 పరుగులు ఉన్నాయి. భారత్ తరఫున అత్యధిక టీ20 పరుగుల రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ పొట్టి ఫార్మాట్లో 4231 పరుగులు చేశాడు. రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక పరుగుల రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. కోహ్లి 125 మ్యాచ్‌ల్లో 4188 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్‌కప్-2024 విజయానంతరం రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, భారత్-బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా ఇవాళ మూడో టీ20 జరుగనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుంటే భారత్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు టీమిండియానే గెలిచింది. మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. గ్వాలియర్‌లో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైనా టీమిండియాకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. హైదరాబాద్ అభిమానులు మాత్రం చాలా నిరాశ చెందుతారు. ఈ మ్యాచ్ కోసం నగర వాసులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్: ఉప్పల్ స్టేడియం వద్ద హైటెన్షన్ -
IND VS BAN: మూడో టీ20కి వర్షం ముప్పు..?
భారత్, బంగ్లాదేశ్ మధ్య హైదరాబాద్ వేదికగా ఇవాళ (అక్టోబర్ 12) జరగాల్సిన మూడో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు సంభవించవచ్చని వారు పేర్కొన్నారు. నగరంలో ఇవాళ సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడవచ్చని అంచనా.నిన్న సాయంత్రం కూడా నగరంలో భారీ వర్షం కురిసింది. నిన్నటి నుంచి మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ మ్యాచ్ రద్దైనా టీమిండియాకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. హైదరాబాద్ అభిమానులు మాత్రం చాలా నిరాశ చెందుతారు. ఈ మ్యాచ్ కోసం నగర వాసులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గ్వాలియర్‌లో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్.. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం నుంచి ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చదవండి: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
బంగ్లాతో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తాము: టీమిండియా కోచ్
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా అన్నివిధాల సిద్దమైంది. శనివారం సాయంత్రం 7:00 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకున్న టీమిండియా.. ఆఖరి టీ20లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్‌టెన్ డోస్చేట్ విలేకరుల సమావేశంలో పాల్గోన్నాడు.ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్నదే మా జట్టు, అభిమానుల కోరిక. కచ్చితంగా అలాగే ముగించేందుకు ప్రయత్నిస్తాము అని చెప్పుకొచ్చాడు. అదే విధంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మనస్తత్వం గురించి మాట్లాడాడు.దేశం తరపున ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని గంభీర్ భావిస్తాడు. ప్రతీసారి ఆటగాళ్లని కూడా ఒత్తిడికి గురిచేస్తాడన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్‌కు కూడా అన్ని మ్యాచ్‌లకు సన్నద్దమైనట్లే సిద్దమయ్యాము. ప్రస్తుతం భారత జట్టు అద్బుతంగా ఆడుతోంది. కుర్రాళ్లు కూడా బాగా రాణిస్తున్నారు. తొలిసారి భారత జట్టు తరపున ఆడుతున్న కుర్రాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జితేష్ శర్మ, తిలక్ వర్మ, హర్షిత్ రానాలకు ఆడే అవకాశం ఇంకా రాలేదు. మూడో టీ20 జట్టు ఎంపిక కు ఈ యంగ్ ప్లేయర్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము. కుర్రాళ్లందరికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం వచ్చేలా ప్రయత్నిస్తున్నామని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ర్యాన్‌టెన్ డోస్చేట్ పేర్కొన్నాడు.చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్ ఉతప్ప -
ఉప్పల్‌లో గెలుపెవరిదో!
ఉప్పల్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం జరగనున్న భారత్– బంగ్లాదేశ్ టీ20 క్రికెట్ మ్యాచ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ సు«దీర్ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2,600 మంది బలగాలతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో 300 సీసీ కెమెరాలతో నిఘా ఉంచినట్లు చెప్పారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం, పరిసర ప్రాంతాలను తమ అ«దీనంలోకి తీసుకున్నామన్నారు. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ గదికి అనుసంధానం చేసినట్లు తెలిపారు. 3 గంటల ముందే అనుమతి.. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు 3 గంటల ముందుగానే స్డేడియంలోకి అనుమతిస్తారు. ఈవ్‌టీజింగ్‌లను అరికట్టేందుకు ప్రత్యేకంగా షీ టీం బృందాలు అందుబాటులో ఉంటాయి. స్టేడియంలోకి బయటి వస్తువులు, తినుబండారాలను తీసుకురావద్దు. కారు పాస్ ఉన్న వారు రామంతాపూర్ నుంచి వచ్చి గేట్ నంబర్ 1, 2 ద్వారా తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చు. దివ్యాంగులు రామంతాపూర్ గేట్– 3 ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. గేట్ నంబర్ –4 నుంచి 10కి వచ్చే వారు తమ వాహనాలను ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద, రామంతాపూర్ చర్చి గ్రౌండ్లో పార్క్ చేసుకోవాలి. క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మెట్రో, ఆర్టీసీ సేవలను రాత్రి ఒంటి గంట వరకు పొడిగించనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ నుంచి స్టేడియం వైపు, సికింద్రాబాద్ నుంచి స్టేడియం వైపు వచ్చే అన్ని దారులను మళ్లించనున్నారు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్ రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ నుంచి వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి చెంగిచర్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు సైతం నాచారం పారిశ్రామిక వాడ ద్వారా చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. -
భారత్– బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 12న (శనివారం) భారత్– బంగ్లాదేశ్‌ల మధ్య టీ–20 క్రికెట్ మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు.మ్యాచ్ జరిగే సమయాల్లో ఉప్పల్ స్టేడియంవైపు భారీ వాహనాలను అనుమతించరు. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐఓసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ మీదుగా తమ గమ్యాలను చేరుకోవాలి.వరంగల్ వైపు నుంచి ఎల్బీనగర్ వెళ్లాల్సిన వారు ఉప్పల్ ఏషియన్ ధియేటర్ ఎదురుగా భగాయత్ రోడ్డు నుంచి నాగోల్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రోస్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి ఏషియన్ ధియేటర్ మీదుగా బోడుప్పల్ చేరుకోవాలి. సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ చౌరస్తా నుంచి నాచారం పారిశ్రామిక వాడ ద్వార చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: ఒక్కసారిగా వాతావరణం.. హైదరాబాద్‌లో భారీ వర్షంరామంపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ వీధి నంబర్–8 మీదుగా హబ్సిగూడ మెట్రో పిల్లర్ 972 వద్ద యూ టర్న్ తీసుకుని ఉప్పల్ ఎక్స్ రోడ్డుకు చేరుకోవాలి. -
బంగ్లాతో మూడో టీ20 ఆడే భారత జట్టు ఇదే..! అతడి అరంగేట్రం?
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత జట్టు 2-0 తేడాతో సొంతం చేసుకుంది. బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. మరో పొట్టి క్రికెట్ సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.అయితే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు నామమాత్రపు మూడో టీ20లో పర్యాటక జట్టుతో తలపడనుంది. శనివారం హైదరాబాద్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో ప్రయోగాలకు సిద్దమైనట్లు భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమచారం. తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌తో ఢిల్లీ పేసర్ హర్షిత్ రాణా భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా తొలి రెండు టీ20లకు బెంచ్‌కే పరిమితమైన తిలక్ వర్మ, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లు ఆఖరి టీ20లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మూడో టీ20కు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, పేసర్ మయాంక్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.బంగ్లాదేశ్‌తో ఆఖరి టీ20 ఆడే భారత జట్టు (అంచనా)సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా -
ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గతేడాది వన్డే ప్రపంచకప్ నుంచి పాక్ జట్టు దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. వన్డే ప్రపంచకప్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టిన పాక్.. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లోనూ అదే తీరును కనబరిచింది.ఆఖరికి బంగ్లాదేశ్ చేతిలో కూడా టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఘోర పరాభావాన్ని మూటకట్టుకుంది. ఇప్పుడు ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కూడా పాక్ ఓటమి అంచున నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. ఇంకా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 115 పరుగుల వెనకబడింది. ఆఖరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. తొలి సెషన్లో పాక్ ఏమైనా మరో రెండు వికెట్లు కోల్పోతే ఓటమి ఖాయమవ్వక తప్పదు.ఈ క్రమంలో తమ జట్టుపై పాక్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ విమర్శలు వర్షం కురిపించాడు. ఇప్పటికైనా టీమిండియాను చూసి నేర్చుకోండి అంటూ పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్కు చురకలు అంటించాడు. "ఏ జట్టు అయినా విజయ పథంలో ముందుకు వెళ్లాలంటే సరైన ప్లానింగ్, ఆలోచన విధానం చాలా ముఖ్యం. కానీ ఆ రెండు విషయాలే పాకిస్తాన్ క్రికెట్లో లేవు. దయచేసి భారత్‌ను చూసి నేర్చుకోండి. వారి ద్వితీయ శ్రేణి జట్టుతో కూడా అద్బుతాలు చేస్తున్నారు. శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు విశ్రాంతి ఇచ్చారు. అయినప్పటకి మరో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. అదే పాక్ జట్టుకు మాత్రం అందరు సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవరు. పాక్ జట్టు మెనెజ్‌మెంట్ ఆలోచన విధానంలో మార్పు రావాలి. యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి.ప్రస్తుతం బారత జట్టు మెన్జ్మెంట్ అదే పనిచేస్తుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో యువ ఆటగాళ్లు నితీష్ కుమార్, రింకూ సింగ్ అదరగొట్టారు. నితీష్ కొట్టి సిక్సర్ల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. పవర్ ఫుల్ షాట్లు ఆడాడు. మరోవైపు రింకూ మైఖల్ బెవాన్‌లా చెలరేగాడు. అయితే వీరిద్దరి విధ్వసంకర ఇన్నింగ్స్‌ల వెనక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గంభీర్ అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచిస్తాడు. ఒకవేళ ఆటగాళ్లు విఫలమైనా కూడా సపోర్ట్‌గా ఉంటాడు. అత్యుత్తమ ఆటగాళ్లను తాయారు చేసే పనిలో గంభీర్ ఉన్నాడు. అందుకు ఊదహరణే నితీష్" అని తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు. -
బంగ్లాతో మూడో టీ20.. హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా
బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. శనివారం ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు హైదరాబాద్‌కు చేరుకుంది.గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన టీమిండియాకు అభిమానులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇరు జట్లు తమకు కేటాయించిన హోటల్స్‌కు పయనమయ్యారు. ఇందుకు సబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక భాగ్యనగరానికి చేరుకున్న భారత్, బంగ్లా జట్లు శుక్రవారం ఉప్పల్‌లో ప్రాక్టీస్ చేయనున్నాయి. కాగా తొలి రెండు టీ20ల్లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మరోవైపు ఈ మ్యాచ్ కోసం అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.చదవండి: విండీస్ మహిళల ధనాధన్ విక్టరీ -
వారెవ్వా హార్దిక్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! వీడియో
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో బంగ్లాను టీమిండియా చిత్తు చేసింది.దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే సిరీస్‌ను 2-0 తేడాతో యంగ్ ఇండియా కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో బంగ్లా బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను పాండ్యా పెవిలియన్‌కు పంపాడు.సూపర్ మ్యాన్‌లా..221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిషద్ హొస్సేన్ భారత బౌలర్లను ఆడటానికి కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వరుసగా రెండు బౌండరీలు బాది టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు.ఈ క్రమంలో బంగ్లా ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి మూడో బంతిని రిషద్‌కు ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆబంతిని రిషద్ లాంగాన్ దిశగా సిక్స్ కోసం ప్రయత్నించాడు. అయితే దాదాపు డీప్ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా మెరుపు వేగంతో తన ఎడమవైపు పరుగెత్తుకుంటూ వచ్చి ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. క్యాచ్ అందుకునే క్రమంలో పాండ్యా బ్యాలెన్స్ కోల్పోయినప్పటికి బంతిని మాత్రం విడిచిపెట్టలేదు.అతడి క్యాచ్ చూసిన బంగ్లా బ్యాటర్ బిత్తర పోయాడు. మైదానంలో ప్రేక్షకులు సైతం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ పాండ్యాను అభినంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Athleticism at its best! 😎An outstanding running catch from Hardik Pandya 🔥🔥Live - https://t.co/Otw9CpO67y#TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/ApgekVe4rB— BCCI (@BCCI) October 9, 2024 -
రియాన్ పరాగ్ ఓవరాక్షన్.. షాకిచ్చిన అంపైర్(వీడియో)
ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ వింత బౌలింగ్ యాక్షన్‌తో అందరిని ఆశ్యర్యపరిచాడు. కొత్త బౌలింగ్ యాక్షన్‌ను ప్రయత్నించి నవ్వుల పాలయ్యాడు.అసలేం జరిగిందంటే?బంగ్లా ఇన్నింగ్స్ 11వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పార్ట్ టైమ్ స్పిన్నర్ రియాన్ పరాగ్ చేతికి బంతి అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రియాన్ వేసిన మొదటి బంతినే బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లా భారీ సిక్సర్‌గా మలిచాడు.తద్వారా పరాగ్ కాస్త నిరాశచెందాడు. ఈ క్రమంలో కొత్తగా ఏదైనా ప్రయత్నించి బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. దీంతో లసిత్ మలింగ స్టైల్లో బౌలింగ్ చేయాలని ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని రియాన్.. మహ్మదుల్లాకు స్లింగ్లింగ్ డెలివరీగా సంధించాడు. అతడి బౌలింగ్ యాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడి బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం వచ్చిన ఫీల్డ్ అంపైర్ మధన్ గోపాల్ థర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు. రిప్లేలో బ్యాక్‌ఫుట్ నో బాల్‌గా తేలింది. డెలివరీ సంధించే క్రమంలో పరాగ్ బ్యాక్ ఫుట్ ట్రామ్‌లైన్ వెలుపల ఉంది. అందుకునే థర్డ్ అంపైర్ బ్యాక్‌ఫుట్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో మహ్మదుల్లాకు ఫ్రీ హిట్ లభించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. What was that Riyan Parag ? 🤣🤣#INDvsBAN pic.twitter.com/JAOTn2mLZM— sajid (@NaxirSajid32823) October 9, 2024 -
నితీష్ రెడ్డి ఒక అద్భుతం.. నేను అనుకున్నదే జరిగింది: భారత కెప్టెన్
టీ20ల్లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో యంగ్ ఇండియా అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)ల హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్, మయాంక్ యాదవ్, రియాన్ పరాగ్ తలా వికెట్ పడగొట్టారు.ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు."మరో టీ20 సిరీస్ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా టాపార్డర్ బ్యాటర్ల విఫలమైనందుకు మేము నిరాశ చెందలేదు. నిజంగా చెప్పాలంటే నేను కోరుకున్నది కూడా అదే. ఎందుకంటే మిడిలార్డర్ బ్యాటర్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాలని నేను భావించాను. క్లిష్ట సమయంలో ఎలా ఆడుతారో పరీక్షించాలనకున్నాము. ముఖ్యంగా ఐదు, ఆరు, ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చే వారు ఆటగాళ్లు జట్టుకు చాలా ముఖ్యం. ఒకవేళ టాపర్డర్ విఫలమైనా వారు జట్టును ఆదుకునే విధంగా ఉండాలి. అయితే ఈ మ్యాచ్‌లో నేను కోరుకున్న విధంగానే మా మిడిలార్డర్ బ్యాటర్లు బ్యాటింగ్ చేశారు.రింకూ, నితీష్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. బౌలర్లను కూడా టెస్టు చేయాలనుకున్నాను. ప్రస్తుత తరం క్రికెట్లో జట్టులో పార్ట్‌టైమ్ బౌలర్లు ఉండటం చాలా ముఖ్యం. జట్టుకు అవసరమైనప్పుడు బౌలింగ్ చేసేందుకు సిద్దంగా ఉండాలి. అందుకే ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో సూర్య పేర్కొన్నాడు.చదవండి: IND vs BAN: టీమిండియా అరుదైన రికార్డు.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే -
టీమిండియా అరుదైన రికార్డు.. 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలోనే
ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే భారత్ సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు అదరగొట్టింది.నితీష్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)ల హాఫ్ సెంచరీలతో మెరవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది.చరిత్ర సృష్టించిన భారత్..ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మార్క్‌ను చూపించాడు. ఏకంగా ఏడుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించి ఔరా అన్పించాడు. అర్ష్‌దీప్ సింగ్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ బంతిని పంచుకున్నారు. అయితే ఆ ఏడుగురు బౌలర్లలో ప్రతీ ఒక్కరు వికెట్ సాధించారు. కాగా 92 ఏళ్ల భారత క్రికెట్ హిస్టరీలో ఒక ఇన్నింగ్స్‌లో ఏడుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా తీయడం ఇదే తొలిసారి. 1932లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన భారత జట్టు.. ఢిల్లీ టీ20 ముందు వరకు ఏ ఫార్మాట్(వన్డే, టీ20, టెస్టు)లో కూడా భారత జట్టు ఈ అరుదైన ఫీట్ నమోదు చేయలేదు. ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్లో టెస్టుల్లో 4 సార్లు, వన్డేల్లో 10 సార్లు, టీ20ల్లో 4 సార్లు ఈ ఫీట్ నమోదు అయింది.చదవండి: కోహ్లి కేవలం రెండు సెంచరీలు చేస్తే రూట్ ఏకంగా 18 సెంచరీలు బాదాడు..! -
బంగ్లాదేశ్‌తో రెండో టీ20.. నితీశ్ కుమార్ ఊచకోత.. టీమిండియా భారీ స్కోర్
న్యూఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి బంగ్లాదేశ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 74; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రింకూ సింగ్ (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 108 పరుగులు జోడించారు.హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ 10, అభిషేక్ శర్మ 15, సూర్యకుమార్ యాదవ్ 8, రియాన్ పరాగ్ 15, వరుణ్ చక్రవర్తి 0. సుందర్ 0 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 6, మయాంక్ యాదవ్ ఒక్క పరుగు (నాటౌట్) చేశారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్ తలో రెండు వికెట్లు తీశారు. తుది జట్లు..భారత్: సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్బంగ్లాదేశ్: పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిట్టన్ దాస్(వికెట్‌కీపర్), నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకెర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్ -
బంగ్లాతో రెండో టీ20.. అరుదైన రికార్డుపై కన్నేసిన సూర్య భాయ్
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాను చిత్తు చేసి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లా కూడా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది.కోహ్లి రికార్డుపై కన్నేసిన సూర్య.. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. రెండో టీ20లో సూర్య మరో 39 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా విరాట్ కోహ్లితో సమంగా నిలుస్తాడు.కోహ్లి 73 మ్యాచ్‌ల్లో ఈ రేర్ ఫీట్ అందుకోగా.. ఇప్పుడు సూర్యకుమార్ కూడా ఢిల్లీ టీ20లో 39 పరుగులు చేస్తే సరిగ్గా 73 మ్యాచ్‌ల్లోనే అందుకుంటాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం అగ్రస్ధానంలో ఉన్నాడు. బాబర్ 67 మ్యాచ్‌ల్లోనే 2500 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.రెండో టీ20కు భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్. -
Ind vs Ban మెదడు సరిగ్గా వాడితేనే: యువీ ఘాటు విమర్శలు
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరోసారి ‘చురకలు’ అంటించాడు. బ్యాటింగ్ చేసేటపుడు మెదడును కాస్త అదుపులో పెట్టుకుంటేనే రాణించగలమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయమేమిటంటే.. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన ద్వితీయ శ్రేణి జట్టులో అభిషేక్ తొలిసారి చోటు దక్కించుకున్నాడు.మరోసారి టీమిండియా సెలక్టర్ల పిలుపుఈ క్రమంలో ఆతిథ్య జట్టుతో జరిగిన టీ20 సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ పంజాబీ బ్యాటర్.. డకౌట్ అయ్యాడు. అయితే, మరుసటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి తనను తాను నిరూపించుకున్నాడు. ఈ సిరీస్ ముగిసిన దాదాపు రెండు నెలల తర్వాత అభిషేక్ శర్మ మరోసారి టీమిండియా సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.రనౌట్‌గా వెనుదిరిగిస్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో గ్వాలియర్ వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్‌తో కలిసి అభిషేక్ శర్మ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే, దూకుడుగా ఆడుతున్న క్రమంలో అనూహ్య రీతిలో రనౌట్‌గా వెనుదిరిగాడు.టీమిండియా ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ వేసిన టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి సంజూ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడాడు. ఈ క్రమంలో సింగిల్‌కు ఆస్కారం ఉందని భావించిన సంజూ, అభిషేక్ పరుగుకు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే ప్రమాదాన్ని గ్రహించిన సంజూ.. అభిషేక్‌ను వెనక్కి వెళ్లమని సూచించాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.బంతిని అందుకున్న బంగ్లాదేశ్ ఫీల్డర్ తౌహీద్ హృదోయ్..నేరుగా స్టంప్స్ వైపునకు విసిరాడు. దీంతో.. నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి ముందుకు వెళ్లిపోయిన అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16 పరుగులు) పెవిలియన్‌కు చేరకతప్పలేదు. అయితే, మిగతా బ్యాటర్లు రాణించడంతో మ్యాచ్ ఫలితంపై ప్రతికూల ప్రభావం పడలేదు. సంజూ శాంసన్(29), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(29), హార్దిక్ పాండ్యా(39 నాటౌట్) రాణించడంతో టీమిండియా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.ప్రతీ పరుగు, ప్రతీ బంతి.. జట్టు కోసమే! ఈ నేపథ్యంలో విజయానంతరం అభిషేక్ శర్మ ఇన్‌స్టాలో టీమిండియా ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ప్రతీ పరుగు, ప్రతీ బంతి.. జట్టు కోసమే! సిరీస్‌లో మాకు శుభారంభం’’ అని క్యాప్షన్ జతచేశాడు. ఇందుకు బదులుగా ఓ నెటిజన్.. అభిషేక్ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నామని పేర్కొన్నాడు. అయితే, ఆ కామెంట్‌కు యువీ.. ‘‘కేవలం మెదడు ఉపయోగిస్తే మాత్రమే అది సాధ్యం’’ అన్న అర్థంలో జవాబు ఇచ్చాడు.కాగా అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఎదుగుదలలో యువీది కీలక పాత్ర. ఈ విషయాన్ని అభిషేక్ చాలా సందర్బాల్లో స్వయంగా వెల్లడించాడు. అయితే, బాగా ఆడినపుడు ప్రశంసించడమే కాదు.. అనవసర తప్పిదాలు చేసినపుడు కాస్త ఘాటుగానే విమర్శించడం యువీకి అలవాటు. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదారాబాద్ తరఫున అభి వీరబాదుడు బాది.. నిర్లక్ష్యపు షాట్‌కు అవుటైనపుడు.. ‘నీ కోసం స్లిప్పర్ ఎదురు చూస్తోంది’ అంటూ యువీ చొరవగా ట్వీట్ చేశాడు. చదవండి: Pak vs Eng: ‘హైవే రోడ్డు మీద కూడా బ్యాటింగ్ చేయలేవు’ -
బంగ్లాతో రెండో టీ20.. తెలుగోడికి నో ఛాన్స్! అతడి అరంగేట్రం
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో టీ20కు సిద్దమైంది. ఆక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టీ20లో బంగ్లాతో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలోని భారత జట్టు సోమవారం ఢిల్లీలో అడుగుపెట్టింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సూర్య సేనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.నితీష్ కుమార్‌కు నో ఛాన్స్..ఇక రెండో టీ20లో అదే జోరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓ కీలక మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన నితీష్ కుమార్ రెడ్డికి రెండో మ్యాచ్‌కు పక్కన పెట్టాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది.అతడి స్ధానంలో పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇదొక్కటి మినహా భారత జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోకపోవచ్చు. కాగా అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్ అనుకూలించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఒకవేళ టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ నమోదు కావడం ఖాయం.రెండో టీ20కు భారత తుది జట్టు(అంచనా)సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, అర్షదీప్ సింగ్.చదవండి: అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్ అదే: మంధాన -
అలా ఎలా కొట్టావు హార్దిక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే( వీడియో)
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.తొలుత బౌలింగ్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టిన పాండ్యా.. తర్వాత బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హార్దిక్.. 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. అయితే హార్దిక్ ఆడిన ఓ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది.పాండ్యా నో లుక్ షాట్.. భారత ఇన్నింగ్స్ 12 ఓవర్లో మూడో బంతిని హార్దిక్‌కు బంగ్లా పేసర్ టాస్కిన్ అహ్మద్ షార్ట్ పిచ్ బాల్ డెలివరీగా సంధించేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం తను ఆశించిన మేరకు బౌన్స్ కాలేదు. అయితే ఇక్కడే హార్దిక్ తన యూటిట్యూడ్ను చూపించాడు. బంతిని చూడకుండానే నో లుక్ ర్యాంప్ షాట్ ఆడాడు.ఆడిన తర్వాత కనీసం బంతి ఎటువైపు వెళ్లింది అన్నది కూడా పాండ్యా చూడలేదు. బంతి కీపర్ తలపై నుంచి మెరుపు వేగంతో బౌండరీకి దూసుకెళ్లింది. ఆ తర్వాత బౌలర్ వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు. పాండ్యా షాట్ చూసిన బంగ్లా ఆటగాళ్లు సైతం ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు షాట్ ఆఫ్ ది ఇయర్‌గా అభివర్ణిస్తున్నారు. 𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎!The shot. The reaction. The result ➡️ EPIC 😎WATCH 🎥🔽 #TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank https://t.co/mvJvIuqm2B— BCCI (@BCCI) October 6, 2024 -
ఇది టీమిండియా కాదు.. ఐపీఎల్ హీరోల జట్టు: పాక్ మాజీ క్రికెటర్
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత జట్టు.. బంగ్లాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బౌలింగ్‌లో ప్రత్యర్ధిని కేవలం 127 పరుగులకే కట్టడి చేసిన సూర్య సేన.. అనంతరం లక్ష్యాన్ని కేవలం 11.5 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఈ నేపథ్యంలో యువ భారత జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు.ఇది కేవలం భారత జట్టు కాదని, ఐపిఎల్ స్టార్లతో కూడిన జట్టు అని అలీ కొనియాడాడు. కాగా బంగ్లాతో సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ మినహా మిగితా సీనియర్ ఆటగాళ్లంతా దూరమయ్యారు. ఈ క్రమంలో ఐపీఎల్లో అదరగొట్టిన మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి యువ ఆటగాళ్లకు బంగ్లాతో టీ20 సిరీస్‌కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. వీరితో పాటు గత రెండు ఐపీఎల్ సీజన్లో సంచలన ప్రదర్శన కనబరిచిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కూడా మూడేళ్ల తర్వాత భారత జట్టులో చోటు దక్కింది. అయితే వీరు ముగ్గురూ తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకున్నారు. వరుణ్, మయాంక్ బౌలింగ్‌లో అదరగొట్టగా.. నితీష్ బ్యాటింగ్‌లో 16 పరుగులతో పర్వాలేదన్పించాడు."ఇది భారత్ టీమ్ కాదు, యువకులతో కూడిన ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్. ఈ సిరీస్‌కు యశస్వీ జైశ్వాల్, గిల్, అక్షర్ పటేల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్‌లకు విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా తొలి టీ20లో ఆడలేదు. అయినప్పటకి భారత్ 11.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగించింది. హార్దిక్ సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అస్సలు పాకిస్తాన్‌ను వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్ జట్టు ఇదేనా? భారత్‌పై టెస్టు సిరీస్‌లో ఘోర ఓటమిని చవిచూశారు. ఇప్పుడు టీ20ల్లో కూడా అదే ఆటతీరును కనబరుస్తున్నారు. భారత్ గత కొంత కాలంగా వరల్డ్ క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మరోసారి బంగ్లా దేశ్ భారత్ ముందు తలొగ్గక తప్పదు. మరోవైపు మయాంక్ యాదవ్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.తొలి ఓవర్‌నే మెయిడెన్‌గా మలిచాడు. 149.8 kmph వేగంతో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి బ్యాటర్లను భయపెట్టాడు. అతడు 150 కి.మీ పైగా వేగంతో అతడు బౌలింగ్ చేయగలడు. కానీ అతడు ఇప్పుడే గాయం నుంచి కోలుకుని రావడంతో ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. కచ్చితంగా అతడు బుమ్రా, షమీ, సిరాజ్‌ల సరసన చేరుతుడాని" తన యూట్యూబ్ ఛానల్లో అలీ పేర్కొన్నాడు.చదవండి: టీమిండియా అరుదైన ఘనత.. పాకిస్తాన్ వరల్డ్ రికార్డు సమం -
హార్దిక్ పాండ్యా విధ్వంసం.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రతిభతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. సిక్సర్ బాది టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు.విరాట్ కోహ్లి అరుదైన రికార్డు బద్దలుఈ క్రమంలో ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లి పేరిట ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. టీమిండియా తరఫున అత్యధిక సార్లు సిక్సర్‌తో మ్యాచ్ ఫినిష్ చేసిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా ఆదివారం గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచిన సూర్యకుమార్ సేన తొలుత బౌలింగ్ చేసింది.ఈ క్రమంలో.. బ్యాటర్లు విఫలం కావడంతో 19.5 ఓవర్లలో 127 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి మూడేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.ధనాధన్ దంచికొట్టారుఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఓపెనర్లు సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(ఏడు బంతుల్లో 16) వేగంగా ఆడగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(14 బంతుల్లో 29) ధనాధన్ దంచికొట్టాడు.ఇక నాలుగో స్థానంలో వచ్చిన నితీశ్ రెడ్డి 16(నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని చూడకుండానే వికెట్ కీపర్ తల మీదుగా పాండ్యా ఆడిన ర్యాంప్ షాట్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.పాండ్యా మెరుపు ఇన్నింగ్స్.. సిక్సర్‌తో ముగింపుఈ క్రమంలో పాండ్యా కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 39 పరుగులతో 243కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. పన్నెండవ ఓవర్ ఐదో బంతికి.. టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.కాగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో ఛేజింగ్‌లో హార్దిక్ పాండ్యా టీమిండియా తరఫున ఇలా మ్యాచ్ ఫినిష్ చేయడం ఐదోసారి. అంతకు ముందు విరాట్ కోహ్లి నాలుగుసార్లు ఈ ఘనత సాధించాడు. అర్ష్‌దీప్ సింగ్‌ను అధిగమించిఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్న హార్దిక్ పాండ్యా.. భారత్ తరఫున 87 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా అర్ష్‌దీప్ సింగ్(86)ను అధిగమించి.. టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో స్పిన్నర్ యజువేంద్ర చహల్ 96 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
టీమిండియా ప్రపంచ రికార్డు.. పాకిస్తాన్‌తో పాటు టాప్‌లో
అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో టీమిండియా అరుదైన ఘనత సాధించింది. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసి.. పాకిస్తాన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు సమం చేసింది. కాగా భారత జట్టు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది.127 పరుగులకు బంగ్లా ఆలౌట్తొలుత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0తో రోహిత్ సేన పర్యాటక జట్టును క్లీన్‌స్వీప్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ టీ20లలోనూ శుభారంభం చేసింది. గ్వాలియర్‌లోని మాధవ్‌రావ్ సింధియా కొత్త క్రికెట్ స్టేడియంలో టీమిండియా ఆదివారం బంగ్లాదేశ్‌తో తలపడింది.టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేయగా.. బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలో 127 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్ మూడు(3/14), హార్దిక్ పాండ్యా(1/26), మయాంక్ యాదవ్(1/21) ఒక్కో వికెట్ తీయగా.. స్పిన్నర్లలో రీ ఎంట్రీ వీరుడు వరుణ్ చక్రవర్తి మూడు(3/31), వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్(1/12) తీశారు.పాకిస్తాన్ ప్రపంచ రికార్డు సమంఈ క్రమంలో టీమిండియా.. అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థిని అత్యధిక సార్లు ఆలౌట్ చేసిన జట్టుగా నిలిచింది. తద్వారా పాకిస్తాన్ ప్రపంచ రికార్డును సమం చేసింది. ఈ జాబితాలో భారత్- పాకిస్తాన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్, ఉగాండా, వెస్టిండీస్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ టీ20లలో ప్రత్యర్థిని అత్యధికసార్లు ఆలౌట్ చేసిన జట్లు👉టీమిండియా- 42 సార్లు👉పాకిస్తాన్- 42 సార్లు👉న్యూజిలాండ్- 40 సార్లు👉ఉగాండా- 35 సార్లు👉వెస్టిండీస్- 32 సార్లుఇదిలా ఉంటే.. తొలి టీ20లో బంగ్లా విధించిన స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 11.5 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు సంజూ శాంసన్(29), అభిషేక్ శర్మ(16) ధనాధన్ దంచికొట్టగా.. సూర్యకుమార్ యాదవ్(29) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన అరంగేట్ర ఆటగాడు నితీశ్ రెడ్డి 16.. హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 39) పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో విజయం భారత్ సొంతమైంది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్Hardik Pandya finishes off in style in Gwalior 💥#TeamIndia win the #INDvBAN T20I series opener and take a 1⃣-0⃣ lead in the series 👌👌Scorecard - https://t.co/Q8cyP5jXLe@IDFCFIRSTBank pic.twitter.com/uYAuibix7Q— BCCI (@BCCI) October 6, 2024 -
నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్
ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ టీమిండియా తరఫున అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో తన తొలి ఓవర్లోనే మెయిడెన్ వేసి ఔరా అనిపించాడు. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో.. మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టగలిగాడు. అయితే, గాయం నుంచి కోలుకున్న తర్వాత నేరుగా టీమిండియాలో అడుగుపెట్టి మయాంక్ ఈ మేర రాణించడం విశేషం.కాస్త ఆందోళనగానే ఉన్నాఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయానంతరం మయాంక్ యాదవ్ మాట్లాడుతూ.. అరంగేట్రానికి ముందు తన మనఃస్థితి ఎలా ఉందో వివరించాడు. ‘‘మ్యాచ్‌కు ముందు నేను కాస్త ఆందోళనగానే ఉన్నా. ఎందుకంటే.. గాయం తర్వాత నేను కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు.డైరెక్ట్‌గా అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాను. అయితే, మా కెప్టెన్ వచ్చి నాతో మాట్లాడాడు. బౌలింగ్‌లో వైవిధ్యం ప్రదర్శించాలనే ఆతురత వద్దని.. సహజమైన శైలిలో ఆడాలని సూచించాడు. గ్వాలియర్ వికెట్ కూడా మరీ అంత బౌన్సీగా లేదు.అందుకే స్లో బాల్స్ వేశానుకాబట్టి నేను మరీ ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయలేదు. ఐపీఎల్‌లోనూ నేను కొన్ని స్లో బాల్స్ వేశాను. ఇక గంభీర్ భయ్యా కూడా మ్యాచ్ ఆరంభానికి ముందే నాతో మాట్లాడారు. ఇది అంతర్జాతీయ మ్యాచ్ అనే విషయం మరిచిపోతేనే ఒత్తిడి నుంచి బయటపడగలనని చెప్పారు.ఆందోళన చెందకుండా కూల్‌గా ఉండాలని.. ప్రయోగాలకు వెళ్లకుండా సహజమైన శైలినే అనుసరించాలని చెప్పారు. కెప్టెన్, కోచ్ సూచనలు పాటించడం వల్లే సానుకూల ఫలితం వచ్చింది’’ అని మయాంక్ యాదవ్ పేర్కొన్నాడు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టీ20వేదిక: శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం.. గ్వాలియర్టాస్: టీమిండియా.. బౌలింగ్బంగ్లాదేశ్ స్కోరు: 127 (19.5)టీమిండియా స్కోరు: 132/3 (11.5)ఫలితం: బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపుప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అర్ష్‌దీప్ సింగ్(3/14).చదవండి: మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్ View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) -
మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే: సూర్యకుమార్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. కొత్త మైదానంలో తొలుత బంగ్లాను 127 పరుగులకే పరిమితం చేసిన భారత్.. మరో 49 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.ఇక యువ ఆటగాళ్లతో నిండిపోయిన జట్టు ముందు కూడా చతికిల పడిన బంగ్లాదేశ్ మరోసారి చేతులెత్తేసింది. ఈ గెలుపు ద్వారా భారత టీ20 జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో నాలుగో విజయం నమోదైంది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.మా బ్యాటింగ్ గొప్పగా ఉంది.. ఆ తలనొప్పి మంచిదే‘‘జట్టు సమావేశమైన సమయంలో మా నైపుణ్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకున్నాం. వాటిని పక్కాగా అమలు చేయడంలో సఫలమయ్యాము. మా వాళ్లు పట్టుదలగా ఆడారు. కొత్త గ్రౌండ్లో మేము బ్యాటింగ్ చేసిన విధానం గొప్పగా అనిపించింది.ఇక ఎవరితో బౌలింగ్ చేయించాలో తెలియనన్ని మంచి ఆప్షన్లు ఉండటం మాకు ఒక రకంగా తలనొప్పి కలిగించేదే. అయితే, అంతకంటే మంచి విషయం మరొకటి ఉండదు. ప్రతి మ్యాచ్‌లోనూ మేము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. అయితే, ఎప్పటికప్పుడు లోపాలు సరిచేసుకుంటూ ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం. తదుపరి మ్యాచ్ కోసం జట్టు సభ్యులతో కూర్చుని చర్చించి వ్యూహాలు సిద్ధం చేసుకుంటాం’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.నజ్ముల్ షాంటో బృందం విలవిలకాగా గ్వాలియర్‌లో కొత్తగా ప్రారంభించిన ‘శ్రీమంత్ మాధవ్‌రావ్ సింధియా క్రికెట్ స్టేడియం’లో టాస్ గెలిచిన టీమిండియా.. బంగ్లాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్ల దెబ్బకు నజ్ముల్ షాంటో బృందం పరుగులు రాబట్టడానికి ఆపసోపాలు పడింది. 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఓపెనర్లు పర్వేజ్ హొసేన్ ఎమాన్(8), లిటన్ దాస్(4) రూపంలో కీలక వికెట్లతో పాటు.. టెయిలెండర్ ముస్తాఫిజుర్(1) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇతర పేసర్లలో అరంగేట్ర బౌలర్ మయాంక్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టాడరు. ఇక స్పిన్నర్లలో వరుణ్ చకవర్రి(3/31), వాషింగ్టన్ సుందర్(1/12) కూడా మెరవగా.. అరంగేట్ర ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సైతం రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు.మెరుపు ఇన్నింగ్స్లక్ష్య ఛేదనలో టీమిండియాకు బంగ్లా బౌలర్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. కొత్త ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్(19 బంతుల్లో 29), అభిషేక్ శర్మ(7 బంతుల్లో 16) సహా వన్‌డౌన్‌లో వచ్చిన సూర్య(14 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. నితీశ్ రెడ్డి 15 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. హార్దిక్ పాండ్యా ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. సిక్సర్‌తో టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు. ఇక బంగ్లాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ 2-0తో క్లీన్‌స్వీప్ అయిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లోనూ 1-0తో వెనుకబడింది. ఇరుజట్ల మధ్య బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది.చదవండి: IND Vs BAN 1st T20I: పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా? 𝙎𝙈𝘼𝘾𝙆𝙀𝘿 with power and timing!@hardikpandya7 dispatches one over deep extra cover 🔥Live - https://t.co/Q8cyP5jXLe#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/kNaZjSl1Tq— BCCI (@BCCI) October 6, 2024 -
తొలి టీ20.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్
బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఊదిపడేసింది. కేవలం 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా ( 39 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సూర్యకుమార్ యాదవ్(29), సంజూ శాంసన్(29) పరుగులతో రాణించారు. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.ఇక బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మాన్, మెహాది హసన్ మిరాజ్ తలా వికెట్ సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా, సుందర్, మయాంక్ యాదవ్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ మెహదీ హసన్(35 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు. -
చెలరేగిన భారత బౌలర్లు.. 127 పరుగులకే బంగ్లా ఆలౌట్
గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు నిప్పులు చేరిగారు. టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లా జట్టు కేవలం 127 పరుగులకే ఆలౌటైంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తలా 3 వికెట్ల పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు.వీరిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా, సుందర్, మయాంక్ యాదవ్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ మెహదీ హసన్(35 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ షాంటో(27) పరుగులతో పర్వాలేదన్పించాడు. వీరిద్దరూ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణ ప్రదర్శన కనబరిచాడు. వచ్చినవారు వచ్చినట్టుగానే పెవిలియన్‌కు చేరారు.చదవండి: IND vs BAN: చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్.. -
చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్..
టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మయాంక్.. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.తన ఇంటర్ననేషనల్ కెరీర్‌ను మెయిడెన్ ఓవర్‌తో యాదవ్ ప్రారంభించాడు. బంగ్లా ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన మయాంక్.. ఎటువంటి పరుగులు ఇవ్వకుండా మెయిడిన్‌గా ముగించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను మెయిడెన్ చేసిన మూడో భారత బౌలర్‌గా ఈ ఢిల్లీ పేస్ సంచలనం రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో భారత ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.అగార్కర్ 2006లో సౌతాఫ్రికాపై, అర్ష్‌దీప్ 2022లో ఇగ్లండ్‌పై ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్.. 21 పరుగులిచ్చి ఓ కీలక వికెట్ సాధించాడు. -
పాపం బిష్ణోయ్..కావాలనే పక్కన పెట్టారా? కారణం గౌతీనా?
టీమిండియా మణికట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దాదాపు మూడేళ్ల తర్వాత భారత జెర్సీలో కన్పించాడు. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భారత తుది జట్టులో వరుణ్ చోటు దక్కించుకున్నాడు.86 మ్యాచ్‌లు గ్యాప్ తర్వాత మళ్లీ అతడు భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే చక్రవర్తి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటిచ్చిన భారత జట్టు మెనెజ్‌మెంట్ మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను మాత్రం బెంచ్‌కే పరిమితం చేసింది.గంభీర్ ఎఫెక్ట్.. కాగా వరుణ్ చక్రవర్తి పునరాగమనం వెనక గంభీర్ మార్క్ ఉంది. చక్రవర్తికి గంభీర్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. గత సీజన్లో కేకేఆర్ మెంటార్‌గా గంభీర్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చక్రవర్తి తన ప్రదర్శనతో గౌతీని ఆకట్టుకున్నాడు.అంతేకాకుండా ఈ తమిళనాడు స్పిన్నర్ రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్-2023, 24 సీజన్లలో మొత్తంగా వరుణ్ 41 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే అతడిని గంభీర్ రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.పాపం బిష్ణోయ్బిష్ణోయ్ గత కొన్నాళ్లగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇప్పటికే తన సత్తా ఏంటో బిష్ణోయ్ నిరూపించుకున్నాడు. గతంలో నెం1 టీ20 బౌలర్‌గా రవి నిలిచాడు. అయితే టీ20 వరల్డ్‌కప్-2024కు మాత్రం అతడిని సెలక్ట్ చేయలేదు. ఆ తర్వాత ఈ లెగ్ స్పిన్నర్‌ను జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు ఎంపిక చేశారు. ఈ రెండు పర్యటనలలోనూ బిష్ణోయ్ సత్తాచాటాడు. జింబాబ్వేపై 6 వికెట్లు పడగొట్టిన బిష్ణోయ్..శ్రీలంకపై 6 కూడా 6 వికెట్లు సాధించాడు. అయినప్పటకి బంగ్లాతో తొలి టీ20కు బిష్ణోయ్‌ను పక్కటన పెట్టడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. -
IND Vs BAN: బంగ్లాతో తొలి టీ20.. మయాంక్, నితీష్ అరంగేట్రం
భారత్-బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 గ్వాలియర్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌తో ఆంధ్రా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, ఢిల్లీ యువ పేసర్ మయాంక్ యాదవ్ భారత తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ చేతుల మీదగా వీరిద్దరూ భారత క్యాప్‌లను అందుకున్నారు. ఐపీఎల్లో సంచలన ప్రదర్శన చేయడంతో ఈ యువ ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు దక్కింది. కాగా గ్వాలియర్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగడం 14 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.తుది జట్లుబంగ్లాదేశ్: లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, షోరీఫుల్ ఇస్లాంభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ -
బంగ్లాతో టీ20 సిరీస్.. టీమిండియా ఓపెనర్లు వాళ్లే: సూర్య
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా కొత్త ఓపెనింగ్ జోడీతో ముందుకు వెళ్లనున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ భారత ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపాడు. అంతేకాదు.. మయాంక్ యాదవ్ ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు.సూర్యకుమార్ సారథ్యంలోకాగా రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో చెన్నై, కాన్పూర్ టెస్టుల్లో గెలుపొందిన రోహిత్ సేన.. సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ క్రమంలో సూర్యకుమార్ సారథ్యంలో టీమిండియా టీ20లకు సిద్దమైంది. ఇరుజట్ల మధ్య ఆదివారం గ్వాలియర్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. టీ20 మ్యాచ్‌కు సరిపోయే పిచ్ ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ తమ ప్రణాళికల గురించి వెల్లడించాడు. ‘‘ఈసారి అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇక మేము ఇక్కడ రెండు రోజులు ప్రాక్టీస్ చేశాం. అయితే, వికెట్ మరీ లోగా, స్లోగా ఏమీ లేదు. కొంతమంది మూడు రోజులు కూడా ఇక్కడ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.వికెట్లో ఎవరికీ పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు. టీ20 మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్ ఇది. అయితే, మ్యాచ్ ఏకపక్షంగా మాత్రం ఉండబోదనే అనుకుంటున్నాం’’ అని సూర్య తెలిపాడు. ఇక తొలిసారిగా టీమిండియాకు ఎంపికైన యువ పేసర్ మయాంక్ యాదవ్ గురించి ప్రస్తావనకు రాగా.. అతడిని ‘ఎక్స్ ఫ్యాక్టర్’గా సూర్యకుమార్ అభివర్ణించాడు.అతడొక ఎక్స్ ఫ్యాక్టర్‘‘ప్రస్తుతం జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. వారిలో ఎవరి ప్రత్యేకత వారిది. ఇక మయాంక్ విషయానికొస్తే.. అతడు ఎక్కువగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేయలేదు. అయితే, మయాంక్ ఆట తీరు ఎలా ఉంటుందో అందరూ ఇప్పటికే చూశారు.అతడి రాక వల్ల జట్టు బౌలింగ్ విభాగానికి అదనపు బలం చేకూరుతుందనడంలో సందేహం లేదు. అతడొక ఎక్స్ ఫ్యాక్టర్‌గా కనిపిస్తున్నాడు. ఫ్రాంఛైజీ క్రికెట్లో అతడి ఎక్స్ ట్రా పేస్‌ను మనం చూశాము. కాబట్టి మయాంక్‌పైనే అందరి దృష్టి ఉంది. జట్టులోని మిగతా యువ ఆటగాళ్లు కూడా తమను తాము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా మయాంక్ జట్టుతో చేరడం శుభసూచకం. టీమిండియాకు అతడి వల్లే మేలు జరుగుతుందని భావిస్తున్నా’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకునికాగా ఈ ఏడాది ఐపీఎల్-2024లో అరంగేట్రం చేశాడు ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన రెండు మ్యాచ్‌లలో గంటకు 150కి పైగా కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అతడు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన అతడు ప్రస్తుతం పూర్తిస్థాయిలో కోలుకుని ఆటలో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. చదవండి: ‘టీమిండియా డ్రెస్సింగ్‌రూంలో గడపడం వల్లే ఇలా’ 🗣️ It's a good opportunity for the youngsters & newcomers.#TeamIndia Captain @surya_14kumar ahead of the T20I series against Bangladesh.#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/T7kM6JO02o— BCCI (@BCCI) October 5, 2024 -
ఐపీఎల్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా సూర్య?.. స్పందించిన ‘స్కై’
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో విజయాలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఆదివారం(అక్టోబరు 6) గ్వాలియర్ వేదికగా తొలి టీ20కి షెడ్యూల్ ఖరారైంది.అది సానుకూలాంశమేఈ నేపథ్యంలో టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. జట్టులో కనీసం రెండు ఓవర్లు బౌలింగ్ చేయగల బ్యాటర్లు ఉండటం సానుకూలాంశమని తెలిపాడు. శ్రీలంక పర్యటనలోనూ ఈ తరహా ప్రయోగం చేశామని.. ఆటగాళ్లలో ఉన్న భిన్న నైపుణ్యాలను ఉపయోగించుకోవడంలో తప్పులేదన్నాడు. అందుకే బ్యాటర్ల చేతికీ బంతిని ఇచ్చేందుకు వెనుకాడమని తెలిపాడు.రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడుతున్నపుడు కూడాఈ క్రమంలో సూర్యకుమార్ ఐపీఎల్ భవితవ్యం, ఫ్రాంఛైజీ క్రికెట్ కెప్టెన్సీ గురించి విలేఖరులు ప్రశ్నించారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు నన్ను ఇరుకున పెట్టేశారు(నవ్వుతూ). ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌గా ఉండటాన్ని ఆస్వాదిస్తున్నా. ముంబై ఇండియన్స్‌లో రోహిత్ భాయ్ కెప్టెన్సీలో ఆడుతున్నపుడు కూడా.. అవసరమైనపుడు సలహాలు ఇచ్చేవాడిని. మీకే తెలుస్తుందిఇక టీమిండియా విషయానికొస్తే.. ఇటీవల శ్రీలంకతో పాటు.. గతంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో సిరీస్‌లలోనూ నేను కెప్టెన్‌గా వ్యవహరించాను. జట్టును ఎలా ముందుకు నడిపించాలో ఇతర కెప్టెన్లను చూసి నేర్చుకోవడానికి సందేహించను.జీవితం ఇలా ముందుకు సాగుతోంది. కాలం గడుస్తున్న కొద్దీ ఏం జరుగబోతుందో మీకే తెలుస్తుంది’’ అని సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ కెప్టెన్సీ అంశంపై సంకేతాలు ఇచ్చాడు. కాగా సుదీర్ఘకాలంగా సూర్య ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు.పాండ్యా సారథ్యంలో ముంబైకి ఘోర పరాభవంకాగా ముంబై ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జట్టును ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించి.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అయితే, పాండ్యా సారథ్యంలో ముంబై ఘోర పరాభవం చవిచూసింది. ముంబై ఇండియన్స్ సారథిగా సూర్య?ఈ ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడగున పదో స్థానంలో నిలిచింది. ఇక ఇదే జట్టులో ఉన్న సూర్య గతంలో అతడి గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అంతేకాదు.. టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను రీప్లేస్ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టులోనూ ఇదే తరహా మార్పు జరుగనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూర్య వ్యాఖ్యలు కూడా వాటికి కాస్త ఊతమిచ్చేలాగానే ఉన్నాయి.చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
బంగ్లాతో టీ20 సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ప్లేయర్ దూరం
గ్వాలియర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టీ20కు టీమిండియా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే గాయం కారణంగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. దూబే ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.ఈ క్రమంలోనే అతడు బంగ్లాతో వైట్‌బాల్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. వెన్ను గాయం కారణంగా దూబే బంగ్లాతో మూడు టీ20ల సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని తిలక్ వర్మతో సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. ఆదివారం ఉదయం గ్వాలియర్‌లో తిలక్ జట్టుతో చేరనున్నాడని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. తిలక్ వర్మ భారత్ తరపున ఇప్పటివరకు 16 టీ20లు ఆడి 336 పరుగులు చేశాడు. కాగా ఐపీఎల్-2024 తర్వాత ఈ హైదరాబాదీ గాయ పడ్డాడు. దీంతో అతడిని జింబాబ్వే, శ్రీలంకతో టీ20లకు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో మరోసారి అతడికి భారత జట్టులో చోటు దక్కింది.భారత టీ20 జట్టుసూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, తిలక్ వర్మచదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
Ind vs Ban: హైదరాబాద్ టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం షురూ
సాక్షి, హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హైదరాబాద్‌లో ఈ నెల 12న మూడో టి20 మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం గం. 2:30 నుంచి ఆన్లైన్లో టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అభిమానులు paytm insider వెబ్సైట్/యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ప్రారంభ ధర రూ. 750 కాగా, గరిష్ట ధర రూ. 15 వేలు. ఆన్లైన్లో కొన్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు జింఖానా గ్రౌండ్స్‌లో మార్పిడి చేసుకొని మ్యాచ్ టికెట్లను పొందాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏదైనా ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుంది. అన్ని టికెట్లను పూర్తిగా ఆన్లైన్లోనే అమ్ముతున్నామని...ఆఫ్‌లైన్‌లో/కౌంటర్ల వద్ద ఎలాంటి టికెట్లూ విక్రయించడం లేదని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు గతంలో రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2019లో వెస్టిండీస్‌పై, 2022లో ఆ్రస్టేలియాపై జరిగిన ఈ మ్యాచ్‌లలో టీమిండియానే విజయం సాధించింది. ఈ ఏడాది జనవరిలో భారత్–ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇచి్చంది. -
టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్
టీమిండియాతో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు అదే జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్దమైంది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్‌కు చేరుకున్న ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.మొదటి టీ20లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరు జట్లు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. కాగా తొలి టీ20కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత్‌పై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంటామని శాంటో థీమా వ్యక్తం చేశాడు."భారత్‌తో టీ20 సిరీస్‌కు మేము అన్ని విధాల సన్నద్దమయ్యాం. ఈ సిరీస్‌ను గెలిచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తాము. దూకుడుగా ఆడాలనుకుంటున్నాము. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరేందుకు మాకు మంచి అవకాశం లభించింది. కానీ దురదృష్టవశాత్తూ మేము సెమీస్‌కు చేరుకోలేకపోయాము.మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లందరూ భారత్‌పై సత్తాచాటుతారని భావిస్తున్నాను. మేము భారత్‌తో టెస్ట్‌లలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. మేము ప్రస్తుతం ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. టెస్టు క్రికెట్‌కు టీ20 పూర్తిగా భిన్నం. ఆ రోజున ఎవరూ మెరుగైన ప్రదర్శన చేస్తే వారిదే విజయమని" షాంటో పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2024: ఓపెనర్లే కొట్టేశారు.. వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా బోణీ -
భారత్-బంగ్లా తొలి టీ20.. స్టేడియం వద్ద మూడంచెల భద్రత
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్ కన్నేసింది. ఆక్టోబర్ 6న గ్వాలియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాలియర్‌కు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టాయి.అయితే మొదటి టీ20కు ఇవ్వనున్న గ్వాలియర్ ఇప్పుడు హై సెక్యూరిటీ జోన్‌గా మారింది. న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వద్ద పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు బస చేసే హోటల్ వద్ద కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.కాగా మ్యాచ్ జరిగే అక్టోబర్ 6న హిందూ మహాసభ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందుస్తు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ మహాసభ ఆదివారం నల్లజెండాలతో ర్యాలీని నిర్వహించాలని ప్లాన్ చేసింది. దీంతో ఎటువంటి అవాంఛీనయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రతమత్తమయ్యారు.తుది జట్లు అంచనాభారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్


