బంగ్లాతో మూడో టీ20.. హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా | Team India reached Hyderabad ahead of the 3rd T20I | Sakshi
Sakshi News home page

IND vs BAN: బంగ్లాతో మూడో టీ20.. హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా

Oct 11 2024 7:47 AM | Updated on Oct 11 2024 8:42 AM

Team India reached Hyderabad ahead of the 3rd T20I

బంగ్లాదేశ్‌తో మూడో టీ20లో త‌ల‌ప‌డేందుకు టీమిండియా సిద్ద‌మైంది. శ‌నివారం ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని భార‌త జ‌ట్టు భావిస్తోంది. ఈ క్ర‌మంలో సూర్య‌కుమార్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు హైద‌రాబాద్‌కు చేరుకుంది.

గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన టీమిండియాకు అభిమానులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఇరు జ‌ట్లు త‌మ‌కు కేటాయించిన హోట‌ల్స్‌కు ప‌య‌న‌మ‌య్యారు. ఇందుకు స‌బంధించిన వీడియోలు, ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

ఇక భాగ్య‌న‌గరానికి చేరుకున్న భార‌త్‌, బంగ్లా జ‌ట్లు శుక్ర‌వారం ఉప్ప‌ల్‌లో ప్రాక్టీస్ చేయ‌నున్నాయి. కాగా తొలి రెండు టీ20ల్లో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్ప‌టికే సిరీస్‌ను 2-0 తేడాతో కైవ‌సం చేసుకుంది. మ‌రోవైపు ఈ మ్యాచ్ కోసం అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.
చదవండి: విండీస్‌ మహిళల ధనాధన్‌ విక్టరీ

Advertisement
 
Advertisement
Advertisement