వేర్వేరు జట్లకు కోచ్‌లను ప్రకటించిన హెచ్‌సీఏ
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ కొత్త సీజన్ (2026–27)లో పాల్గొనే వేర్వేరు హైదరాబాద్ జట్లకు కోచ్ బృందాలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. సీనియర్ టీమ్ హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ అనిరుధ్ సింగ్‌ను ఎంపిక చేశారు. 46 ఏళ్ల అనిరుధ్ 2000–2010 మధ్య 47 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత శిక్షణ వైపు వెళ్లిన అతను ఛత్తీస్‌గఢ్ రంజీ టీమ్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు.
సీనియర్ టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా మరో మాజీ బ్యాటర్ బావనక సందీప్‌ను హెచ్‌సీఏ ఎంపిక చేసింది. సందీప్‌కు కూడా 58 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం ఉంది. సీనియర్ టీమ్‌కు మాజీ పేసర్ ఆల్‌ఫ్రెడ్ అబ్సలమ్ బౌలింగ్ కోచ్‌గా, అభినవ్ కుమార్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు గత సీజన్‌లో సీనియర్ టీమ్‌కు కోచ్‌గా పని చేసిన డీబీ రవితేజకు ఈసారి హైదరాబాద్ అండర్–23 టీమ్ హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించారు.
ఈ టీమ్‌కు బెన్ జాన్సన్ బౌలింగ్, రొనాల్డ్ రోడ్రిగ్స్ ఫీల్డింగ్ కోచ్‌లుగా పని చేయనున్నారు. హైదరాబాద్ అండర్–19 టీమ్ కోసం కోచ్‌లనూ హెచ్‌సీఏ ప్రకటించింది. అభిజిత్ ఛటర్జీ హెడ్ కోచ్‌గా, పి.శశాంక్ నాగ్ బ్యాటింగ్, అబ్దుల్ ఖాదర్ ఫీల్డింగ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. హైదరాబాద్ అండర్–16 జట్టుకు ఎస్.కిరణ్ కుమార్ హెడ్ కోచ్‌గా, మొహమ్మద్ ముషారఫ్ ఖాన్ బౌలింగ్ కోచ్‌గా, నితిన్ ఆంథోనీ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు.


