నార్సింగి పరిధిలో వాటర్‌ ట్యాంకర్‌ బీభత్సం... | Youth Dies In Water Tanker Road Accident In Narsingi Area Hyderabad | Sakshi
Sakshi News home page

నార్సింగి పరిధిలో వాటర్‌ ట్యాంకర్‌ బీభత్సం...

Jul 23 2026 9:53 AM | Updated on Jul 23 2026 9:53 AM

Youth Dies In Water Tanker Road Accident In Narsingi Area Hyderabad

పుప్పాలగూడ టోల్‌గేట్‌ వద్డ ఘటన

హైదరాబాద్‌, మణికొండ: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కార్పెంటర్‌ను వాటర్‌ ట్యాంకర్‌ వెనకనుంచి ఢీకొనడంతో అక్కడికకకడే మృతి చెందాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ మునీందర్‌ తెలిపిన మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుశీల్‌కుమార్‌(28), సురేష్‌లు కాటేదాన్‌లోని లక్ష్మీగూడలో నివాసముంటున్నారు.

హఫీజ్‌పేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పని ముగించుకుని రాత్రి తమ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా పుప్పాలగూడ టోల్‌గేట్‌ వద్ద అతివేగంగా వచ్చిన నీటి ట్యాంకర్‌ వీరిని ఢీకొట్టింది. వెనుక కూర్చున్న సుశీల్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో కారు, మరొక స్కూటీలను కూడా ట్యాంకర్‌ఢీకొట్టింది. అయితే వారికి ఎవరికీ గాయాలు కాలేదు. ఖానాపూర్‌ గ్రామానికి చెందిన డ్రైవర్‌ రంజిత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement