Coach
-
వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..
మగవాళ్లకు కుదిరినట్లుగా మహిళలకు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడం సాధ్యం కాదనేది చాలామంది వర్కింగ్ మహిళల వాదన. ఎందుకంటే, పొద్దున లేచినప్పటి నుంచి పిల్లలు, కుటుంబ బాధ్యతలే సరిపోతాయి. ఇంకెక్కడ టైం ఉంటుంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి..?. అలాంటి బిజీ వర్కింగ్ విమెన్స్ ఫిట్నెస్ కోచ్ అకన్నీ సలాకో సింపుల్ టిప్స్ ఫాలోఅయ్యి, ఈజీగా బరువు తగ్గండి. మరి ఇంకెందుకు ఆలస్యం హెల్ప్ అయ్యే ఆ చిట్కాలేంటో చూసేద్దామా..!.అత్యంత బిజీగా ఉండే మహిళలు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేలా ప్లాన్ చేసుకోవాలో వెయిట్ లాస్ కోచ్ డాక్టర్ అకన్నీ సలాకో ఇన్‌స్టా వేదికగా వీడియోలో వెల్లడించారు. పనులు వేగవంతంగా చేయాలన్న ధ్యాసలో ఆకలి ఆటోమేటిగ్గా ఎక్కువ అవుతుంది. దాంతో తెలియకుండానే స్వీట్స్, జంక్ఫుడ్స్ స్పీడ్‌గా లాగించేస్తుంటారని చెబుతున్నాడు అకన్నీ. అందుకే వ్యాయమాలు చేయడం కష్టం అనుకున్న మహిళలు వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ దరిచేరనీయకూడదు. సౌకర్యమంతమైన ఆరోగ్యదాయకమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వమని సూచించారు. పోనీ ఇది కష్టం అనుకుంటే ఓ రెండు రోజులు స్వీట్లు ముట్టనని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వండిచాలు అంటున్నారు అకన్నీ. దీంతోపాటు ఏదోలా చిన్నపాటి వ్యాయామాలు చేసుకునేలా ప్లాన్ చేయాలి. ఇక్కడ ఉద్యోగం, పిల్లలు కుటుంబం తోపాటు ఆరోగ్యం కూడా ప్రధానమే అన్న విషయం గుర్తించండి. ముందు మీరు బాగుంటేనే కదా ఈ పనులన్నీ సవ్యంగా పూర్తి చేయగలరు. కాబట్టి ఎలాగైన చిన్న చిన్న వ్యాయామాలు చేద్దాం. పోనీ అలా కాదు నో ఛాన్స్ అంటే.. వారంలో రెండు లేదా మూడు రోజులు కనీసం 30 నిమిషాలు వ్యాయామాలకి కేటాయించండి చాలు. అప్పుడు ఆటోమేటిగ్గా నెమ్మదిగా మనంతట మనమే రోజులు పెంచుకునే ఛాన్స్ ఉంటుందని అన్నారు. భోజనం విషయంలో సమయాపాలన పాటించండి. పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండని చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకి మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్. అలాగే సాయంత్రం 6 గంటకి, మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్లతో పూర్తి చేయండి. స్నాక్స్ జోలికిపోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రోటీన్, కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్ వంటి సమతుల్య భోజనానికి ప్రాధాన్యత ఇస్తే ఆకలి నియంత్రణలో ఉంటుంది, అలాగే బరువు పెరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు ఫిట్నెస్ కోచ్ అకన్నీ. అలాగే ఇది పోషకాహారం, ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చే సమసర్థవంతమైన డైట్‌ప్లాన్ అని అన్నారు ఫిట్నెస్ నిపుడు అకన్నీ.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Dr. Akanni Salako | Women’s Weight Loss Coach (@dr.salako) (చదవండి: పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..? అధ్యయనంలో అవాక్కయ్యే విషయాలు..) -
ఉన్ని దుప్పటి... ఉతికేది నెలకోసారే!
సాక్షి, హైదరాబాద్: చూడ్డానికి అందంగా ఉంటాయి.. తాకితే మెత్తగా ఉంటాయి.. కానీ, కప్పుకొంటే మాత్రం కంపు కొడుతుంటాయి. రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందిస్తున్న దుప్పట్ల పరిస్థితి ఇది. ఈ ఉన్ని దుప్పట్లను వరు సగా 30 రోజులపాటు 30 మంది ప్రయాణికులు వాడుకున్నాకగానీ ఉతకడం లేదు. అయితే, వాటిని నిత్యం మడత నలగకుండా బ్రౌన్ కలర్ కవర్లో పెట్టి అందిస్తుండటంతో శుభ్రం చేసినవే అని ప్రయాణికులు భ్రమపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని శుభ్రం చేయకుండా 30 రోజులకంటే ఎక్కువే వాడాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేసే లాండ్రీ వ్యవస్థ లేకపోవటమే దీనికి కారణం.మూడు నెలల నుంచి నెలకోసారి..గతంలో ఉన్ని దుప్పట్లను మూడు నెలలకోసారి ఉతికేవారు. 2010లో దాన్ని రెండు నెలలకు మార్చారు. అవి అపరిశుభ్రంగా ఉంటున్నాయన్న ఫిర్యాదులతో కనీసం నెలకోసారి ఉతకాలన్న నిర్ణయం తీసుకుని అమలులోకి తెచ్చారు. ఉన్ని దుప్పట్లను కనీసం పక్షం రోజులకోమారైనా ఉతకాలన్నది రైల్వే బోర్డు సూచన. కానీ దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. పాడయ్యే అవకాశం.. ⇒ ఉన్ని దుప్పట్లను నిత్యం ఉతకటం సాధ్యం కాదు. అలా చేస్తే అవి వెంటనే పాడైపోతాయి. రెండు నెలలకోసారి ఉతికే పద్ధతి ఉన్న సమయంలో ఉన్ని దుప్పటి జీవితకాలాన్ని నాలుగేళ్లుగా లెక్కగట్టారు. నెలకోసారి ఉతకటంతో రెండేళ్లకు తగ్గించారు. 15 రోజులకోమారు ఉతికితే ఏడాదే మన్నుతుంది. ఈ కారణంతో ఉతకటం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే, డ్రైక్లీనింగ్తోపాటు ఇతర ఆధునిక పద్థతుల్లో నాణ్యత దెబ్బతినకుండా తరచూ శుభ్రం చేయాలన్న సూచనలను రైల్వే అధికారులు పట్టించుకోవటం లేదు. త్వరలో సమస్యకు పరిష్కారం: దక్షిణ మధ్య రైల్వే ⇒ భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో బెడ్‌రోల్స్ వినియోగించాల్సి రానున్నందున, వాటిని ఎప్పటికప్పుడు ప్రమాణాల మేరకు శుభ్రం చేసే వ్యవస్థను అందుబాటులోకి తేబోతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొత్తగా బీఓఓటీ పద్ధతిలో భారీ సామర్థ్యంతో ఆధునిక లాండ్రీలను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్/సికింద్రాబాద్, కాచిగూడల్లో 48 టన్నుల సామర్థ్యంతో, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నర్సాపూర్‌లలో 10 టన్నుల సామర్థ్యంతో, తిరుపతిలో 22 టన్నులు, కాకినాడలో 6 టన్నులు, నాందేడ్, పూర్ణాలలో 8 టన్నుల సామర్థ్యంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.‘సాధారణ బెడ్‌రోల్స్‌ను నిత్యం ప్రమాణాల ప్రకారం శుభ్రం చేసి అందిస్తున్నాం. శుభ్రపరిచే క్రమాన్ని సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నాం. ఉన్ని దుప్పట్లను మాత్రం నెలకోసారి శుభ్రం చేస్తున్నాం. అవి దుర్వాసనతో ఉన్నా, ఇతర అపరిశుభ్రతతో కనిపించినా వెంటనే శుభ్రం చేస్తున్నాం. రెండు బెడ్ïÙట్లు ఇస్తున్నందున.. వాటిల్లో ఒకదాన్ని ఈ దుప్పటితో కలిపి వాడటం వల్ల ఉన్ని దుప్పటి అంత తొందరగా అపరిశుభ్రంగా మారదు’అని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. శుభ్రమైన బెడ్ రోల్స్‌ను అందించేందుకు వాటి చార్జీని రైలు టికెట్ ధరలో భాగంగా వసూలు చేస్తుండటం కొసమెరుపు. ఎందుకీ పరిస్థితి?దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నిత్యం 116 రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ఈ బెడ్ రోల్స్ సరఫరా చేయాల్సి ఉంది. నిత్యం ప్రతి బెర్త్‌కు రెండు బెడ్ïÙట్లు, ఒక టవల్, దిండు కవర్ అందిస్తారు. నిత్యం 38 వేల దుప్పట్లు, 1, 52,000 బెడ్‌షీట్స్ సరఫరా చేస్తున్నారు. వీటిని ఉతికించి శుభ్రపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏడు చోట్ల మెకనైజ్డ్ లాండ్రీలున్నాయి. రోజుకు 2 టన్నుల బెడ్‌రోల్స్‌ను శుభ్రపరిచే సామర్థ్యంతో సికింద్రాబాద్‌లో డిపార్ట్మెంటల్ లాండ్రీ ఉంది. ఇది రైల్వే సొంత లాండ్రీ. కాచిగూడలో 12 టన్నుల సామర్థ్యం, తిరుపతిలో 2.5 టన్నులు, కాకినాడలో 4 టన్నులు, విజయవాడలో 1.5 టన్నులు, నాందేడ్‌లో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన లాండ్రీలున్నాయి. ఇవన్నీ ప్రైవేట్ సంస్థలు బీఓఓటీ (బిల్ట్ ఓవన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) పద్ధతిలో ఏర్పాటు చేసినవి. అయితే, ఇవి దక్షిణ మధ్య రైల్వే అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇటీవల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే నడిపిన కొన్ని ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌లలో బెడ్ రోల్స్ సరఫరా చేయలేదు. ఈ విషయాన్ని ముందుగానే రైల్వేశాఖ ప్రకటించింది. క్రమంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో రైళ్ల సంఖ్య కూడా పెంచాల్సి వస్తోంది. ఇటీవల థర్డ్ ఏసీ ఎకానమి పేరుతో కొత్త క్లాస్‌ను సృష్టించటంతో రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్య పెరిగింది. ఫలితంగా బెడ్ రోల్స్ సంఖ్య కూడా పెంచాల్సి వచి్చంది. కానీ, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచే సామర్థ్యం లేకుండాపోయింది. -
నాగపూర్ కోచ్‌లు రానట్లే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రో రైళ్లలో నిత్యం రద్దీ నెలకొంటోంది. ఏ స్టేషన్లో చూ సినా ప్రయాణికులు మెట్రో కోసం ఎదురుచూస్తూ కనిపిస్తున్నారు. కానీ అందుకు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచటం లేదు. ప్రయాణికుల రద్దీ మేరకు మెట్రో సర్వీసులను ఒక్కో రైలుకు 3 కోచ్‌ల నుంచి 6 కోచ్‌లకు పెంచేందుకు ఏడాది క్రితమే ప్రణాళిక రూపొందించారు. మహారాష్ట్రలోని నాగపూ ర్ మెట్రో నుంచి కోచ్‌లను తెప్పించాలనుకు న్నా.. ఆ దిశగా ఎలాంటి పురోగతి లేదు. రోజంతా రద్దీనే రద్దీ ఎక్కువగా ఉన్న రాయదుర్గం–నాగోల్, మియాపూర్–ఎల్బీనగర్ రూట్లలో ప్రతి 3 నుంచి 5 నిమిషాలకు ఒకటి చొప్పున రైళ్లు నడుస్తున్నా ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో మాత్రమే కాదు, అన్ని సమయాల్లోనూ ఈ కారిడార్లలో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. దీంతో ఐటీ కారిడార్లలో పనిచేసే ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసేవారు సకాలంలో కార్యాలయాలకు చేరుకోలేకపోతున్నారు. సాధారణంగా రద్దీ కారణంగా ఒక రైలు ఎక్కలేకపోయినా మరో రైలు ఉందిలే అనే భరోసా ఉంటుంది. కానీ ఆ తరువాత వచ్చే మరో రెండు రైళ్లలోనూ ప్రయాణం భారంగానే ఉంటుందని హబ్సిగూడ నుంచి నిత్యం హైటెక్‌సిటీకి ప్రయాణించే శ్రీకాంత్ వాపోయాడు. పెరిగిన ప్రయాణికులు ప్రస్తుతం మూడు కారిడార్లలో 59 మెట్రో రైళ్లు రోజుకు సుమారు 1,065 ట్రిప్పుల వరకు తిరుగుతున్నాయి. ప్రతి రోజూ సుమారు 5 లక్షల మంది మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఈ సంఖ్య 5.10 లక్షల వరకు కూడా ఉంటున్నది. నగరంలో మెట్రో సేవలను ప్రారంభించినప్పటి నుంచి 40 కోట్లకుపైగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకున్నారు.2017 నవంబర్‌లో మెట్రోరైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దశలవారీగా మెట్రో విస్తరణతో పాటే ప్రయాణికుల రద్దీ పెరిగింది. అందుకు అనుగుణంగా ట్రిప్పులు కూడా పెంచారు. కానీ కోచ్‌ల కొరత వల్ల ఎన్ని ట్రిప్పులు తిరిగినా ప్రయాణికుల రద్దీ మా త్రం తగ్గటంలేదు. ప్రస్తుత ప్రయాణికుల్లో ప్రతి రోజూ 1.20 లక్షల మంది విద్యార్థులు, 1.40 లక్షలకుపైగా సాఫ్ట్వేర్ నిపుణులు, ఐటీ ఉద్యోగులు ఉంటున్నట్లు అంచనా. నష్టాల నెపంతో... మెట్రో రైళ్ల నిర్వహణలో భారీగా నష్టాలొస్తున్నాయనే కారణంతో కొత్త కోచ్‌ల కొనుగోలుపై వెనుకడుగు వేసినట్లు సమాచారం. ఒక కోచ్‌ను కొనాలంటే సుమారు రూ.10 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ లెక్కన 59 రైళ్లకు అదనంగా 3 చొప్పున కొనుగోలు చేయాలంటే రూ.500 కోట్లకుపైగా ఖర్చవుతుందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోచ్‌ల కొనుగోలు అసాధ్యమని అంటున్నారు. మెట్రో నిర్వహణలో నష్టాలు వస్తున్నాయని చెప్తూ మెట్రో నిర్వహణ సంస్థ ఎల్అండ్టీ కోచ్‌ల పెంపుపై దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ప్రభుత్వానికి సైతం ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.500 కోట్లు వెచి్చంచడం సాధ్యం కాకపోవచ్చునని అధికారులు అంటున్నారు. అద్దె ప్రాతిపదికన నాగపూర్ మెట్రో నుంచి అదనపు కోచ్‌లను తెప్పించే అవకాశం ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. -
కరాటే వచ్చినా కాపాడుకోలేకపోయాడు..
బంజారాహిల్స్: పాత కక్షలతో ఓ కరాటే కోచ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..దమ్మాయిగూడకు చెందిన ఎండీ జహంగీర్ కరాటే కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న అతను యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ నిర్వహిస్తుండగా అక్కడికి వచ్చిన పహాడీషరీఫ్‌కు చెందిన హఫీజ్, ఎజాజ్, ఒమర్బిన్, అహ్మద్, షేక్ సల్మాన్ తడితో గొడవపడ్డారు. హఫీజ్ పాత కక్షలతో జహంగీర్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. మిగతా వారు కూడా అతడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన జహంగీర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్వియాటెక్ కొత్త కోచ్‌గా విమ్ ఫిసెట్
వాషింగ్టన్: మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) కొత్త కోచ్‌ను నియమించుకుంది. వచ్చే నెలలో సౌదీ అరేబియా వేదికగా జరగనున్న సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో విమ్ ఫిసెట్ మార్గనిర్దేశకత్వంలో స్వియాటెక్ బరిలోకి దిగనుంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్ పరాజయం అనంతరం చైనా ఓపెన్, కొరియా ఓపెన్‌కు దూరంగా ఉన్న స్వియాటెక్... త్వరలో తిరిగి కోర్టులో అడుగు పెట్టనుంది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు, గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన నయోమి ఒసాకా (జపాన్), సిమోనా హాలెప్ (రొమేనియా), అజరెంకా (బెలారస్), ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) వంటి మేటి ప్లేయర్లకు కోచ్‌గా వ్యవహరించిన ఫిసెట్... ఇకపై స్వియాటెక్‌కు శిక్షణ ఇవ్వనున్నాడు. ‘కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతం డబ్ల్యూటీఏ ఫైనల్స్ కోసం రెడీ అవుతున్నా. దీర్ఘ కాలిక ప్రణాళికలో భాగంగా కొత్త కోచ్‌ను ఎంపిక చేసుకున్నా. ఫిసెట్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అత్యుత్తమ ప్లేయర్లకు శిక్షణ ఇచ్చిన అనుభవం ఫిసెట్ సొంతం’ అని స్వియాటెక్ శుక్రవారం వెల్లడించింది. సుదీర్ఘ కాలంగా విక్టరోస్కీ వద్ద శిక్షణ తీసుకున్న స్వియాటెక్ తొలిసారి విదేశీ కోచ్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్వియాటెక్ కెరీర్లో ఇప్పటి వరకు ఐదు గ్రాండ్‌స్లామ్స్ టోర్నీలలో విజేతగా నిలిచింది. అందులో యూఎస్ ఓపెన్ (2022), ఫ్రెంచ్ ఓపెన్ (2020, 2022, 2023, 2024) టైటిళ్లు ఉన్నాయి. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో స్వియాటెక్ కాంస్య పతకం గెలుచుకుంది. -
సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్
పారిస్ ఒలింపిక్స్ తర్వాత మరో టోర్నీ ఆడని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మళ్లీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. వచ్చేనెలలో జరిగే ఫిన్లాండ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్లతో పాటు ఆ తర్వాత యూరోప్ సర్క్యూట్లో వివిధ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా మాజీ ఆటగాడు లీ హ్యూన్ ఇల్‌ను కన్సలి్టంగ్ కోచ్‌గా సింధు ఎంచుకుంది. ఇప్పటికే భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ సింధు తాత్కాలిక కోచ్‌గా పని చేస్తున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం పతకం సాధించడంలో విఫలమైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చైనా ప్లేయర్ బింగ్జియావో చేతిలో ఆమె ఓటమి పాలైంది. అంతకు కొంత కాలం ముందునుంచి కూడా సింధు చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు. 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచిన తర్వాత మరే టైటిల్ నెగ్గని సింధు... గత రెండేళ్ల వ్యవధిలో రెండు టోర్నీల్లో రన్నరప్‌గా మాత్రమే నిలవగలిగింది. రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన సమయంలో సింధు కోచ్‌గా ఉన్న పార్క్ సంగ్ కాంట్రాక్ ముగిసి 2023 ఆరంభంలోనే వెళ్లిపోగా... తాత్కాలికంగా ‘సాయ్’ కోచ్ విధి చౌదరితో కలిసి ఆమె పని చేసింది. దిగ్గజ ఆటగాడు హాఫిజ్ హషీమ్‌ను కోచ్‌గా తీసుకున్నా అదీ కొద్ది రోజులకే ముగిసింది.దాంతో బెంగళూరుకు వెళ్లి సింధు... ప్రకాశ్ పడుకోన్ వద్ద పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమైంది. ప్రస్తుత సీజన్ ఇంకా పూర్తి కాకపోగా... కోచ్‌గా పని చేసిన ఆగస్ సాంటోసో కాంట్రాక్ట్ ఒలింపిక్స్‌తోనే ముగిసింది. దాంతో ఈ సీజన్ చివరి వరకు సింధుకు కొత్త కోచ్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు శ్రీధర్‌తో పాటు ఇటు లీ హ్యూన్తో కలిసి పని చేసేందుకు ఆమె సిద్ధమైంది. వీరిద్దరు డిసెంబర్ 2024 వరకు సింధుకు శిక్షణనిస్తారు. ‘నా కెరీర్ కీలక దశలో అనూప్, లీ హ్యూన్లు కోచ్‌గా రావడం పట్ల సంతోషంగా ఉన్నా. భారత బ్యాడ్మింటన్‌పై అనూప్‌కు ఉన్న అవగాహన, ఆయన వ్యూహాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. లీ హ్యూన్‌కు అపార అనుభవం ఉండటం నాకు కలిసొచ్చే అంశం. ఆటకు సంబంధించి ప్రతీ విషయంలో ఆయన సూక్ష్మ పరిశీలన నాకు మేలు చేస్తుంది. రాబోయే కొన్ని వారాల పాటు వీరిద్దరితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సింధు వ్యాఖ్యానించింది. మాజీ వరల్డ్ నంబర్‌వన్ లీ హ్యూన్ అంతర్జాతీయ ఆటగాడిగా మంచి రికార్డు ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన అతను సుదిర్మన్ కప్‌లో స్వర్ణం, 3 కాంస్యాలు గెలిచిన... థామస్ కప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాలు గెలిచిన కొరియా జట్లలో సభ్యుడు. ఆసియా క్రీడల్లో లీ హ్యూన్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, కాంస్యం గెలవడంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం అందుకున్నాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లో సింధు జట్టులో సభ్యుడిగా కలిసి ఆడాడు. ఐదేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికిన అనంతరం అతను కోచింగ్ వైపు మారాడు. -
India vs Bangladesh: ‘భారత్‌తో ఆడటమే సవాల్’
చెన్నై: భారత్ లాంటి పెద్ద జట్టుతో టెస్టు సిరీస్ ఆడటమే సవాల్ వంటిదని బంగ్లాదేశ్ హెడ్ కోచ్ చందిక హతురసింఘా అన్నాడు. ఇటీవల పాకిస్తాన్‌పై 2–0తో సిరీస్ గెలిచి మంచి జోరు మీద ఉన్న బంగ్లాదేశ్ జట్టు గురువారం నుంచి టీమిండియాతో తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. ‘భారత్‌లో భారత్‌ను ఎదుర్కోవడం అంటే కఠినమైన సవాల్. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుతో ఆడబోతున్నాం. అలాంటప్పుడే మన అసలు సత్తా బయట పడుతుంది. పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ కీŠల్న్స్వీప్ చేయడం మా ప్లేయర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పరిస్థితులకు తగ్గట్లు ఆడితే మంచి ఫలితాలు వస్తాయని అది నిరూపించింది. ప్రస్తుత బంగ్లాదేశ్ జట్టు సమతూకంగా ఉంది. మంచి పేసర్లు అందుబాటులో ఉన్నారు. ఇక స్పిన్ విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాటింగ్‌లో కూడా చాలా మంది అనుభవజు్ఞలు ఉన్నారు. బంగ్లాదేశ్ క్రికెట్లో షకీబ్ అల్ హసన్ పాత్ర కీలకం. అతడి ఆల్‌రౌండ్ నైపుణ్యం, అనుభవం జట్టుకు మరింత స్వేచ్ఛను ఇస్తుంది. గత కొన్నాళ్లుగా మెహదీ హసన్ మిరాజ్ ఎంతో పరిణతి సాధించాడు. అది జట్టుకు అదనపు ప్రయోజనం చేకూర్చుతోంది’ అని హతురసింఘా మంగళవారం పేర్కొన్నాడు. -
లక్నో మెంటార్‌గా జహీర్ ఖాన్!
న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌ను మెంటార్‌గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ప్రయత్నాలు చేస్తోంది. మెగా వేలం ప్రారంభానికి ముందే జహీర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని లక్నో జట్టు యాజమాన్యం భావిస్తోంది. ముంబై ఇండియన్స్ గ్లోబల్ డెవలప్మెంట్ హెడ్‌గా పనిచేస్తున్న జహీర్ ఖాన్.. ఐపీఎల్లో 10 సీజన్లపాటు మూడు జట్ల తరఫున 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టాడు.2017లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్... అప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ 2023 సీజన్ అనంతరం లక్నోను వీడి కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టుకు మారాడు. ఈ సీజన్లో గంభీర్ మార్గదర్శకత్వంలో కోల్‌కతా జట్టు అద్వితీయ ప్రదర్శన కనబర్చి మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ‘టీమ్ మెంటార్‌గా జహీర్ ఖాన్‌ను నియమించేందుకు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది.గంభీర్ నిష్క్రమణతో అతడి స్థానాన్ని జహీర్‌తో భర్తీ చేయాలని అనుకుంటున్నారు’ అని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. గంభీర్ మెంటార్షిప్లో 2022, 2023లో ప్లేఆఫ్స్‌కు చేరిన లక్నో... ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా లక్నో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఆ జట్టును వీడి... భారత జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. దీంతో లక్నో జట్టు ఐపీఎల్ మెగా వేలానికి ముందు సహాయక సిబ్బంది ఎంపిక పూర్తి చేయాలని భావిస్తోంది.మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు కూడా కోచ్ కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. హెడ్ కోచ్ ట్రేవర్ బేలిస్ స్థానంలో భారత ఆటగాడికే ఈ బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఈ జాబితాలో వీవీఎస్ లక్ష్మణ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆటపై అపార అనుభవం ఉన్న లక్ష్మణ్ ప్రధాన కోచ్ పదవికి సరైన ప్రత్యామ్నాయం అని పంజాబ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.అయితే గత కొన్నాళ్లుగా బీసీసీఐతో కొనసాగుతున్న వీవీఎస్.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్‌గా వ్యవహరిస్తున్నాడు. మరో ఏడాది కాలం లక్ష్మణ్ ఎన్సీఏ హెడ్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రయత్నాలు ఫలిస్తాయా చూడాలి! -
అదృష్టం కలిసొస్తేనే...
ముంబై: మెగా ఈవెంట్లలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లకు కొన్నిసార్లు ప్రదర్శనతో పాటు కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలని భారత మాజీ కెపె్టన్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ‘సియెట్’ సంస్థ అందించే వార్షిక క్రికెట్ అవార్డుల్లో ద్రవిడ్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ పురస్కారం లభించింది. ఈ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ద్రవిడ్ తన అనుభవాలను వివరించాడు. ద్రవిడ్ ఏమన్నాడంటే‘గతేడాది భారత్ వన్డే ప్రపంచకప్‌లో అజేయంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియాకు అనూహ్యంగా టైటిల్ పోరులో ఆ్రస్టేలియా చేతిలో పరాజయం ఎదురైంది. ఓ ఆరు నెలల తిరిగేసరికి... ఈ ఏడాది జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ డెత్ ఓవర్లలో కనబరిచిన అద్భుత పోరాటంతో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి టి20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు సందర్బాల్లోనూ కెపె్టన్‌గా రోహిత్, కోచ్‌గా నేను ఉన్నాను. మాకు టి20 ప్రపంచకప్ టైటిల్‌కు మధ్య దక్షిణాఫ్రికా అడ్డుగా ఉంది. అయితే ఆటతోపాటు కొంచెం అదృష్టం కలసిరావడంతో కప్‌తో ఆనందం మా వశమైంది. ఎంత చేసినా ఆ రోజు మనది కావాలంటే రవ్వంత అదృష్టం కూడా మనతో ఉండాలి.దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 30 బంతుల్లో 30 పరుగుల సమీకరణం ప్రత్యరి్థకే అనుకూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత చిత్తంతో అనుకున్న ప్రణాళికను కెపె్టన్ రోహిత్ అమలు చేయాలి. ఎవరో ఒకరు మా ప్రయత్నాలకు కలిసి రావాలి. చివరకు సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ రూపంలో అదృష్టం మా పక్షాన నిలిచింది. ఈ క్యాచ్ తుది ఫలితాన్ని మావైపునకు తిప్పింది. కానీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరిగిన నవంబర్ 19న మాత్రం ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ శతకం శతకోటికిపైగా భారతీయుల కలల్ని కల్లలు చేసింది.టి20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు రిటైర్మెంట్ ఇచి్చనప్పటికీ యువ బ్యాటర్లు వారి స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇకముందు కూడా భారత క్రికెట్ వెలిగిపోతుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన అకాడమీలు, మెరుగైన మౌలిక వసతులు, లీగ్‌లతో అపార అవకాశాలు యువ క్రికెటర్ల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తున్నాయి’ అని ద్రవిడ్ వివరించారు. -
పాకిస్తాన్ టెస్ట్ జట్టు కోచ్‌గా ఆసీస్ మాజీ కోచ్
పాకిస్తాన్ టెస్ట్ జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ కోచ్ టిమ్ నీల్సన్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. నీల్సన్ పేరును పాక్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ జేసన్ గిలెస్పీ ప్రతిపాదించాడు. గిలెస్సీ, నీల్సన్ కలిసి గతంలో సౌత్ ఆస్ట్రేలియా క్రికెట్ అకాడమీలో పని చేశారు. ఈ పరిచయంతోనే గిలెస్పీ నీల్సన్ పేరును ప్రతిపాదించాడు. గిలెస్పీ, నీల్సన్ త్వరలో బంగ్లాదేశ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌తో బాధ్యతలు చేపడతారు.ఈనెల 21 నుంచి బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో బంగ్లాదేశ్, పాక్‌లు రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి టెస్ట్ ఆగస్ట్ 21 నుంచి 25 వరకు రావల్పిండి వేదికగా జరుగనుండగా.. రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు కరాచీలో జరుగనుంది. ఈ సిరీస్ కోసం పాక్ జట్టును ప్రకటించగా.. బంగ్లాదేశ్ జట్టును ప్రకటించాల్సి ఉంది.బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..షాన్ మసూద్ (కెప్టెన్), సైమ్ అయూబ్, మహ్మద్ హురైరా, బాబర్ ఆజమ్, అబ్దుల్లా షఫీక్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, కమ్రాన్ గులామ్, ఆమెర్ జమాల్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, నసీం షా, అబ్రార్ అహ్మద్, ఖుర్రమ్ షెహజాద్, షాహీన్ అఫ్రిది -
మథియాస్ బో గుడ్‌బై
పారిస్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ కోచ్ పదవి నుంచి మథియాస్ బో తప్పుకున్నాడు. సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి జోడీని గొప్పగా తీర్చిదిద్ది వారి విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతను పారిస్ ఒలింపిక్స్‌లో భారత ద్వయం వైఫల్యం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత కొంత కాలంగా అద్భుత ప్రదర్శనతో వరుసగా ట్రోఫీలు నెగ్గి పారిస్ ఒలింపిక్స్‌లో పతకంపై ఆశలు రేపిన సాతి్వక్–చిరాగ్ జంట క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. 2012 లండన్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో రజతం గెలిచిన మథియాస్ భారత జట్టుకు నాలుగేళ్ల క్రితం డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్‌గా వచ్చాడు. ‘నా కోచింగ్ రోజులు ముగిశాయి. ఇకపై నేను భారత్‌లో గానీ, మరెక్కడా గానీ కోచింగ్ ఇవ్వబోవడం లేదు. చాలా సమయం బ్యాడ్మింటన్ కోర్టుల్లో తీవ్ర ఒత్తిడి మధ్య గడిపిన నేను బాగా అలసిపోయాను. నాకు అండగా నిలిచిన, ఎన్నో జ్ఞాపకాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు’ అని మథియాస్ బో స్పష్టం చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కష్టపడి భారీ అంచనాలతో ఒలింపిక్స్ బరిలోకి దిగి పతకం సాధించలేకపోయిన సాత్విక్ –చిరాగ్‌ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నానని, భవిష్యత్తులో వారిద్దరు ఎన్నో విజయాలు సాధిస్తారని మథియాస్ ఆకాంక్షించాడు. డెన్మార్క్‌కు చెందిన 44 ఏళ్ల మథియాస్ ఈ ఏడాది మార్చిలోనే సినీ నటి తాప్సీని పెళ్లి చేసుకున్నాడు. -
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత (ఫొటోలు)
-
‘ఏసీ’ భారం.. జనరల్ ‘ఘోరం’
ఏ దేశంలో అయినా ఆయా ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఆదాయం దృష్టితో కాకుండా బాధ్యతతో వ్యవహరిస్తాయి. ప్రధానంగా మన దేశంలో పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చి నప్పుడు ఎక్కువగా ప్రయాణించేది రైళ్ల లోనే. అదీ స్లీపర్, జనరల్ కోచ్‌ల్లోనే. తక్కువ చార్జీతో గమ్యస్థానం చేరొచ్చనేదే పేదల ఆశ. అయితే కొంత కాలంగా రైల్వే శాఖ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ.. జనరల్, స్లీపర్ కోచ్ లను తగ్గించేస్తూ.. ఏసీ కోచ్‌లను పెంచేస్తూ ‘పక్కా వ్యాపారం’ చేస్తోంది. పర్యవసానంగా ఏ రైలులోని జనరల్ కోచ్‌ల్లో చూసినా పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు పడిపోయి.. ఒంటి కాలిపై నిల్చొని.. టాయ్‌లెట్స్ ముందు ఇరుక్కుని.. మెట్లపై వేలాడుతూ.. చెమటలు కార్చుకుంటూ.. చిన్నారుల ఏడుపుల మధ్య ప్రయాణం సాగించాల్సి వస్తోంది. 70–80 మంది ప్రయాణించాల్సిన కోచ్‌లో దాదాపు 500 మంది వెళుతున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుంది. హౌరా, పూరి, గౌహతి–బెంగళూరు ఎక్స్‌ప్రెస్, వివేక్ ఎక్స్‌ప్రెస్, గోదావరి ఎక్స్‌ప్రెస్.. ఇలా ఒక్కటేమిటి రైళ్లన్నింటిలోనూ ఇదే దుస్థితి. ‘ఊరికి ఎలా వెళ్లాలి దేవుడా..’ అంటూ పేదలు వణికిపోతున్నారు.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడు.. అనే నానుడికి ఇప్పుడు రైల్లో జనరల్ బోగీ ఎక్కిచూడు.. అనే వాక్యం కలుపుకోవాలి. రైలు ఎక్కాలంటే జేబులు గుల్ల చేసుకోవాల్సిందేనని సామాన్యులు హడలి పోతుండటం నేటి వాస్తవం. ఏసీ కోచ్‌లో వెళ్లాలంటే ఆరి్థక భారం.. స్లీపర్ కోచ్‌లు అందుబాటులో ఉండవు.. జనరల్ కోచ్‌లలో కాలు పెట్టేందుకే చోటుండదు.. ఇదీ సగటు రైల్వే ప్రయాణికుల దుస్థితి. రైల్వేల ఆధునికీకరణ, మెరుగైన సౌకర్యాల పేరుతో రైల్వే శాఖ పన్నిన మాయోపాయం పేద, దిగువ మధ్యతరగతి ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. ధనిక, ఎగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా రైళ్లను తీర్చిదిద్దడమే ఆధునికీకరణని రైల్వే శాఖ వక్రభాష్యం చెబుతోంది. సామాన్య, పేద, దిగువ మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండటం.. వారికి మెరుగైన వసతులు సమకూర్చడం అనే వాస్తవాన్ని విస్మరిస్తోంది. దాదాపు అయిదేళ్లుగా పక్కా పన్నాగంతో జనరల్, స్లీపర్ కోచ్‌ల సంఖ్యను తగ్గిస్తూ ఏసీ కోచ్‌ల సంఖ్యను పెంచుతోంది. కోచ్‌ల సంఖ్యే కాకుండా ఏకంగా దేశంలో జనరల్, స్లీపర్ కోచ్‌ల ఉత్పత్తిని కూడా తగ్గిస్తూ... రాబోయే కాలమంతా ఏసీ రైలు ప్రయాణమేనని తేల్చి చెబుతోంది. కేవలం ఏసీ కోచ్‌లే అందుబాటులో ఉండేలా చేసి భారీగా టికెట్ల రాబడి పెంచుకోవాలన్న ఉద్దేశంతో సామాన్య ప్రయాణికులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ అంశంపై ‘సాక్షి’ దృష్టి సారించింది. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని జిల్లా కేంద్రాల మీదుగా ప్రయాణించే ప్రధాన రైళ్లలో పరిస్థితిని పరిశీలించింది. యశ్వంత్‌పూర్, వాస్కోడిగామా, కోరమండల్, హౌరా–చెన్నై మెయిల్, గౌతమి, శేషాద్రి, పద్మావతి, ఎల్టీటీ, అల్లెప్పి–ధన్‌బాద్, తిరుపతి–పూరి, నవ జీవన్, తిరుపతి –హౌరా, ప్రశాంతి.. ఇలా ఏ రైలు చూసినా ఏమున్నది గర్వ కారణం.. సమస్త రైళ్లలో తీవ్ర అవస్థల మయం.. అన్నట్లుంది జనరల్, స్లీపర్ కోచ్‌లలో ప్రయాణికుల పరిస్థితి. జనరల్, స్లీపర్ కోచ్‌ల కోత రైల్వే శాఖ ఓ ప్రణాళిక ప్రకారం నాలుగేళ్లుగా వందే భారత్ వంటి ఏసీ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. తద్వారా అధిక చార్జీలు ఉండే ఏసీ కోచ్‌ల వైపు ప్రయాణికులను మళ్లించడం ద్వారా అధిక ఆదాయ సముపార్జనకే పెద్దపీట వేస్తోంది. మరోవైపు దిగువ మధ్య తరగతి, పేద ప్రయాణికులు ప్రయాణించే స్లీపర్, జనరల్ కోచ్‌ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తోంది. 2019లో మొదలుపెట్టిన ఈ ప్రక్రియను మూడేళ్లుగా వేగవంతం చేసింది. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రాయాణికుల కోసం సగటున 22 కోచ్‌లతో నిర్వహిస్తున్నారు. గతంలో రైళ్లలో జనరల్ కోచ్‌లు నాలుగు, స్లీపర్ కోచ్‌లు 12 వరకు ఉండగా.. థర్డ్ ఏసీ కోచ్‌లు మూడు, సెకండ్ ఏసీ కోచ్‌లు రెండు, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉండేవి. కానీ మూడేళ్లుగా రైలు కోచ్‌ల కూర్పును రైల్వే శాఖ అమాంతం మార్చేసింది. ప్రస్తుతం జనరల్ కోచ్‌లు రెండు, స్లీపర్ కోచ్‌లు 10కి తగ్గించింది. థర్డ్ ఏసీ కోచ్‌లు ఆరు, సెకండ్ ఏసీ కోచ్‌లు మూడు, ఫస్ట్ ఏసీ కోచ్ ఒకటిగా చేసింది. దాంతో ఒక్కో రైలులో స్లీపర్ కోచ్‌లలో దాదాపు 150 బెర్త్‌లు, జనరల్ కోచ్‌లలో 150 వరకు సీట్లు తగ్గిపోయాయి. పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఆధారపడే 300 సీట్లలో కోత పడింది. మరోవైపు ఏసీ కోచ్‌ల సంఖ్య పెరగడంతో వాటిలో 280 నుంచి 300 బెర్త్‌లు పెరిగాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే దసరా, దీపావళి, సంక్రాంతి, వేసవి సెలవుల స్పెషల్ రైళ్లలో అయితే స్లీపర్ కోచ్‌ల సంఖ్య కేవలం ఆరింటికే పరిమితం చేస్తూ థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇటీవల ప్రధానమైన 40 రైళ్లలో ఏకంగా 100 ఏసీ కోచ్‌లను పెంచింది. వాటిలో థర్డ్ ఏసీ కోచ్‌లు 75, సెకండ్ ఏసీ కోచ్‌లు 20, ఫస్ట్ ఏసీ కోచ్‌లు 5 ఉన్నాయి. కొత్తగా ఎల్‌హెచ్‌బీ సాంకేతిక విధానంతో ఉత్పత్తి చేస్తున్న కోచ్‌లను ప్రవేశపెడుతున్నామనే సాకుతో స్లీపర్ కోచ్‌లను తగ్గిస్తూ ఏసీ కోచ్‌ల సంఖ్యను పెంచుతోంది. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. కోచ్‌ల ఉత్పత్తిలోనూ అదే వివక్ష కొత్త రైల్వే కోచ్‌ల ఉత్పత్తిలోనూ కేంద్ర ప్రభుత్వం పేద, సామాన్య ప్రయాణికుల పట్ల వివక్ష కనబరుస్తోంది. అయిదేళ్లుగా రైల్వే శాఖ ఉత్పత్తి చేస్తున్న కోచ్‌ల విధానమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలోని చెన్నై, కపుర్తలా, రాయ్‌బరేలీలోని కోచ్ ఫ్యాక్టరీలలో జనరల్, స్లీపర్ కోచ్‌ల ఉత్పత్తిని రైల్వే శాఖ క్రమంగా తగ్గిస్తూ... ఏసీ కోచ్‌ల ఉత్పత్తిని పెంచుతోంది. ఆ మూడు ఫ్యాక్టరీలలో 2019–20లో 997 ఏసీ కోచ్‌లను ఉత్పత్తి చేశారు. కాగా 2024–25లో ఏకంగా 2,571 ఏసీ కోచ్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. మరోవైపు ఆ ఫ్యాక్టరీలలో 2019–20లో 1,925 జనరల్, స్లీపర్ కోచ్‌లను ఉత్పత్తి చేశారు. ఆ ఉత్పత్తిలో 85 శాతం కోత విధించి 2024–25లో కేవలం 278 కోచ్‌లే ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం గమనార్హం. అంటే జనరల్, స్లీపర్ కోచ్‌ల స్థానంలో క్రమంగా ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టాలనే కార్యచరణ అమలు చేస్తోంది. 22 కోచ్‌లు ఉన్న రైళ్లలో కనీసం 18 ఏసీ కోచ్‌లే ఉండేట్టుగా చేయాలన్నది రైల్వే శాఖ అంతిమ లక్ష్యమని రైల్వే వర్గాలు చెప్పడం గమనార్హం. ‘స్లీపర్’లో దొరకదు.. ‘జనరల్’లో చోటు ఉండదు రైల్లో ప్రయాణం అంటేనే పేదలు, సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. స్లీపర్ కోచ్‌లో ప్రయాణం చేద్దామంటే రిజర్వేషన్లు దొరకడం లేదు. బెర్త్‌లు తగ్గిపోవడంతో రెండు నెలల ముందే రిజర్వేషన్ చేసుకోవాలి. లేదంటే రిజర్వేషన్ దొరకదు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ విధానంలో రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ ధర తడిసి మోపెడవుతోంది. జనరల్ కోచ్‌లో వెళ్లడం అంటే ప్రాణాలకు తెగించి సాహసం చేసినట్టే. ఒక జనరల్ కోచ్‌లో 72 నుంచి 80 వరకు సీట్లు ఉంటాయి. కానీ ఏ సమయంలో ఏ రైలులో జనరల్ కోచ్ చూసినా కనీసం 100 నుంచి 150 మంది వరకు ఉంటారు. ముగ్గురు కూర్చునే బెర్త్‌లో ఆరుగురు కూర్చోవడమే కాదు.. సీట్ల మధ్య ఖాళీల్లోనూ చివరికి లగేజీ పెట్టే రాక్ల మీద కూడా కూర్చొని కనిపిస్తారు. టాయిలెట్ల పక్కన ఒకరిని నెట్టుకుంటూ ఒకరు కూర్చోనో, నిలబడో పరస్పరం ఘర్షణ పడుతూ ప్రయాణిస్తుండటం అన్నది మన రైళ్లలో సర్వసాధారణమైంది. కనీసం నీళ్లు తాగుదామన్నా అవ్వదు.. టాయిలెట్‌కు వెళ్దామంటే కుదరదు.. కాలు కదుపుదామన్నా సాధ్యం కాదు.. మెట్లపైన సైతం వేలాడుతూ ప్రాణాలకు తెగించి ప్రయాణించే ప్రయాణికుల దృశ్యాలు మన రైళ్లలో నిత్యం ప్రతి రైల్వే స్టేషన్లోనూ కనిపిస్తాయి. అధిక రాబడే రైల్వే శాఖ లక్ష్యం అధిక రాబడే లక్ష్యంగా రైల్వే శాఖ ఏసీ కోచ్‌లకు పరిమితికి మించి ప్రాధాన్యమిస్తోంది. జనరల్, స్లీపర్ కోచ్‌లను తగ్గించి ఏసీ కోచ్‌లను పెంచితే అధిక రాబడి వస్తుందన్నది రైల్వే శాఖ ఉద్దేశం. ఉదాహరణకు గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి విశాఖపట్నంకు స్లీపర్ కోచ్‌లో టికెట్ రూ.255. అదే థర్డ్ ఏసీ అయితే 660, సెకండ్ ఏసీ అయితే 910, ఫస్ట్ ఏసీ అయితే రూ.1,551. ఈ లెక్కన స్లీపర్ కోచ్ కంటే థర్డ్ ఏసీ 100 శాతానికి పైగా, సెకండ్ ఏసీ 200 శాతంపైగా, ఫస్ట్ ఏసీ ఏకంగా 400–500 శాతం అధికం. రైల్వే శాఖ స్లీపర్ కోచ్‌లను తగ్గిస్తూ ఏసీ కోచ్‌లను పెంచడం వెనుక లోగట్టు అధిక రాబడే అని ఈ గణాంకాలు బట్టబయలు చేస్తున్నాయి. రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా 22 వేల రైళ్లను నిర్వహిస్తుండగా వాటిలో రోజుకు సగటున 13,500 రైళ్లు నిర్వహిస్తోంది. వాటిలో రోజూ 2.4 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఆ లెక్కన జనరల్, స్లీపర్ కోచ్‌లను తగ్గించి ఏసీ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉండేట్టు చేస్తే టికెట్ల ద్వారా భారీ రాబడి సాధించవచ్చనద్ని రైల్వే శాఖ ఉద్దేశం. అంటే కేంద్ర ప్రభుత్వానికి లాభం.. సామాన్య ప్రయాణికులకు భారం. ఇదే రైల్వే శాఖ లెక్క.అమ్మో వందే భారత్ అత్యధిక చార్జీలతో పూర్తిగా ఏసీ కోచ్‌లతో నిర్వహించే వందే భారత్ రైళ్లకే కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తుండటం సామాన్యులకు భారంగా మారింది. దేశంలో కొత్తగా ప్రవేశపెట్టబోయే రైళ్లన్నీ వందేభారత్ రైళ్లేనని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. రైల్వే శాఖ ప్రస్తుతం దేశంలో 41 వందేభారత్ రైళ్లను నిర్వహిస్తోంది. వాటిలో ఏపీలో నాలుగు నిర్వహిస్తున్నారు. కాగా 2030 నాటికి 800 వందేభారత్ రైళ్లను పట్టాలు ఎక్కించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఇతర ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని 40 వేల కోచ్‌లను కూడా వందేభారత్ కోచ్‌ల స్థాయికి ఆధునికీకరిస్తామని కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఈ రైళ్లను నిర్ధిష్ట సమయంలో నడిపేందుకు పలు రైళ్లను రద్దు చేస్తున్నారు.కాళ్లు కింద మోపలేం విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే గౌహతి–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ మంగళవారం కిక్కిరిసి విశాఖపట్నం చేరుకుంది. ఈ రైలులో జనరల్, స్లీపర్క్లాస్లలో కనీసం కాలు మోపేందుకు కూడా ఖాళీ లేదు. ఈ రైలులో జనరల్4, స్లీపర్7, ఏసీ కోచ్‌లు 8 ఉన్నాయి. జనరల్ కోచ్‌లలో 200 మంది చొప్పున ఉన్నారు. స్లీపర్ కోచ్‌లో కేవలం 78 బెర్తుల చొప్పున మాత్రమే ఉన్నప్పటకీ రెట్టింపు ప్రయాణికులు కనిపించారు. డిబ్రూగడ్–కన్యాకుమారి వివేక్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇదే విధంగా కిక్కిరిసి వెళ్లింది. ఈ రైలులో జనరల్ బోగీలు మూడు మాత్రమే ఉన్నాయి. ఉత్తరాంద్ర వాసుల ప్రధాన రైలు గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న రెండు జనరల్ కోచ్‌లలో పరిస్థితి కనీసం కాలు మోపలేని విధంగా ఉంది. రెండు బోగీల్లో వెయ్యి మంది! ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడే తిరుపతి నగరం మీదుగా రోజూ పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తుంటాయి. ఈ రైళ్లలోని జనరల్ బోగీలన్నీ కిక్కిరిసి ఉంటాయి. హౌరా ఎక్స్‌ప్రెస్ రైల్లోని జనరల్ బోగీలో అయితే ఒకరిపై ఒకరు కూర్చొని, నిల్చొని ప్రయాణిస్తుండటం రోజూ కనిపిస్తుంది. బెంగళూరు నుంచి కాటా్పడి, తిరుపతి, రేణిగుంట, ఒంగోలు, విజయవాడ, శ్రీకాకుళం, పలాస మీదుగా హౌరాకు చేరుకునే ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసి నడిచింది. ఇందులో జనరల్ బోగీలు కేవలం రెండే ఉన్నాయి. ఈ రెండు బోగీల కెపాసిటీ 180 మంది. మంగళవారం సుమారు వెయ్యి మంది ప్రయాణించి ఉండొచ్చని అధికారుల అంచనా. అనేక మంది ఒంటి కాలుపై నిల్చుని ఉండటం కనిపించింది.ఉన్న వాటికీ ఎసరు ఏలూరులో మంగళవారం ఈస్ట్‌కోస్ట్ రైలు మధ్యాహ్నం 3.50 గంటలకు వచి్చంది. రెండే జనరల్ బోగీలున్నాయి. అప్పటికే ఆ బోగీ కిక్కిరిసి ఉంది. ఒక్క ఏలూరులోనే ఈ రెండు జనరల్ బోగీల్లో 60 మంది ఎక్కారు. ఒక్కో బోగీలో 150–200 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బాత్రూమ్ల వద్ద, నడిచే మార్గంలో, వాకిట్లో కూర్చున్నారు. మరి కొంతమంది రెండు బోగీలను కలిపే మార్గంలో టాయిలెట్లను ఆనుకుని కూడా కూర్చోనుండటం కని్పంచింది. కరోనా సమయంలో రద్దు చేసిన పలు ప్యాసింజర్ రైళ్లను నేటికీ పునరుద్ధరించలేదు. మహిళలు, దివ్యాంగులు ప్రయాణించేందుకు ప్రత్యేకంగా ఉండే బోగీ ఇప్పుడు కనిపించడం లేదు. ఉన్న రైళ్లనూ రద్దు చేస్తున్నారు.ఇదీ లెక్కరాష్ట్రంలో రోజూ సగటున ప్రయాణిస్తున్న రైళ్లు 340350ఇందులో విజయవాడ మీదుగా వెళ్తున్న రైళ్లు 280విజయవాడ నుంచి రోజూ రాకపోకలుసాగిస్తున్న ప్రయాణికులు 1,00,000మొత్తం ప్రయాణికుల్లో జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నవారు 40%స్లీపర్ క్లాసులో ప్రయాణిస్తున్నవారు 20%ఒక రైల్లో జనరల్ బోగీలు 10% -
ఇంగ్లండ్ కోచ్ పదవికి సౌత్‌గేట్ రాజీనామా
గత ఎనిమిదేళ్లుగా ఇంగ్లండ్ పుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా ఉన్న గ్యారెత్ సౌత్‌గేట్ తన పదవికి రాజీనామా చేశారు. బెర్లిన్‌లో జరిగిన యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్ 1–2 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. 2016 నుంచి సౌత్‌గేట్ శిక్షణలో ఇంగ్లండ్ రాటుదేలింది. 2018 ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరుకోవడంతోపాటు 2021, 2024 యూరో టోర్నీ ల్లో రన్నరప్‌గా నిలిచింది. ‘మార్పు కోసం సమయం ఆసన్నమైంది. కొత్త అధ్యాయానికి తెర లేవనుంది’ అని సౌత్‌గేట్ వ్యాఖ్యానించారు. -
‘సర్.. నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)
-
క్రికెట్ గాడ్ సచిన్‌కు అత్యంత అపురూపమైన 13 నాణేల గురించి తెలుసా?
క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌ను 24 ఏండ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలి క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. చిన్నతనంలోనే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి లెజెండ్‌గా ఎదిగిన సచిన్ రమేశ్ టెండూల్కర్ పుట్టినరోజు ( ఏప్రిల్, 24) ఈ రోజు. ఈ సందర్భంగా ఒక విషయం ఫ్యాన్స్ మధ్య ఆసక్తికరంగా మారింది.ఒక ఇంటర్వ్యూలో మీరు సొంతంచేసుకున్న దాంట్లో దేన్ని మీరు ఉన్నతంగా భావిస్తారు అని అడిగినపుడు సచిన్ సమాధానం తెలుస్తే క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోవాల్సిందే. మహ్మద్ అలీ సంతకం చేసిన బాక్సింగ్ గ్లోవ్స్, డైర్ స్ట్రెయిట్స్ మార్క్ నాప్ఫ్లెర్ సంతకం చేసిన గిటార్, సర్ డాన్ బ్రాడ్‌మాన్ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ వీటిల్లో ఏది అపురూపంగా అనిపిస్తుంది అని అడిగినపుడు "నా కోచ్ అచ్రేకర్ సార్ నుండి పొందిన 13 నాణేలు నాకు చాలా ముఖ్యమైన జ్ఞాపకాలు’’ అని సమాధాన మిచ్చాడట సచిన్. ఇంతకీ ఆ నాణేల కథ ఏంటి అంటే.‘క్రికెట్ దేవుడు'గా అవతరించిన సచిన్ టెండూల్కర్ ప్రయాణంలో ఎత్తుపల్లాలుకూడా ఉన్నాయి. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ రాటుదేలేలా కీలక పాత్ర పోషించిన గురువు రమాకాంత్ అచ్రేకర్. శివాజీ పార్క్ జింఖానా మైదానంలోట్రైనింగ్ సెషన్లో కోచ్ అచ్రేకర్ అద్భుతమైన శిక్షణలో సచిన్ రాటు దేలాడు. ఆయన శిక్షణలో ఉన్నప్పుడు సచిన్ అలసిపోయినట్లు అనిపించినప్పుడల్లా అచ్రేకర్ ఒక ట్రిక్ వాడేవారట. క్రికెట్ స్టంప్ పైన ఒక రూపాయి నాణెం ఉంచేవారట. ఆ నాణెం గెలవాలంటే సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేయమని బౌలర్లను సవాలు చేశాడు. బౌలర్లు అతనిని అవుట్ చేయడంలో విఫలమైతే, అచ్రేకర్ సచిన్‌కు నాణెం ఇచ్చేవాడు. అలాగే ఆ నాణెం దక్కించు కోవాలంటే.. అవుట్ కాకుండా ఆడాలని సచిన్‌కు సవాల్ విసిరే వారట. అలా అటు బౌలర్లకూ ఇటు తనకూ ఇద్దరికీ ప్రేరణగా నిలిచేదనీ, ఇది భవిష్యత్తులో తన ఆటకు చాలా ఉపయోగపడిందని ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు సచిన్.'ద్రోణాచార్య' లేకపోతే నేను లేను2023, జనవరిలో సచిన్ టెండూల్కర్ ఎక్స్ ద్వారా కోచ్ అచ్రేకర్కి కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన్ని 'ద్రోణాచార్య' అభివర్ణించాడు. తనను ప్రపంచ స్థాయి ఆటగాడిగా ఎలా మార్చాడో కూడా పంచుకున్నాడు. ‘‘టెక్నిక్, క్రమశిక్షణ, ముఖ్యంగా ఆటను గౌరవించడం నేర్పించారాయన. నేను ప్రతిరోజూ ఆయన గురించే ఆలోచిస్తాను. ఈ రోజు, ఆయన వర్ధంతి సందర్భంగా, నా జీవితంలోని ద్రోణాచార్యుడికి వందనం చేస్తున్నాను. ఆయన లేకపోతే. క్రికెటర్‌గా నేను లేను’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు సచిన్.He taught me technique, discipline and most importantly, to respect the game.I think of him every day. Today, on his death anniversary, I salute the Dronacharya of my life. Without him, I wouldn’t have been the same cricketer. pic.twitter.com/JQ8uijHD9Y— Sachin Tendulkar (@sachin_rt) January 2, 2023కాగా సచిన్ టెండూల్కర్‌కు తొలుత టెన్నిస్‌పై ఆసక్తి ఉండేది. లెజెండరీ టెన్నిస్ ఆటగాడు జాన్ మెకెన్రోకి పెద్ద ఫ్యాన్ కూడా అయితే, తరువాతి కాలంలో సచిన్ సోదరుడు, అజిత్ టెండూల్కర్ అతనిని క్రికెట్‌కు పరిచయం చేయడంతో క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. దీంతో అజిత్ ప్రఖ్యాత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ వద్దకు సచిన్‌ను తీసుకెళ్లాడు. సచిన్ ఆటతీరు చేసిన అచ్రేకర్ అకాడమీకి ఎంపిక చేశాడు. లేదంటే క్రికెట్ ప్రపంచం, ఒక లెజెండ్‌ను మిస్ అయ్యేదేమో! -
కోచ్‌గా స్టిమాక్ కొనసాగింపు!
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు మైదానంలో నిరాశాజనక ఫలితాలు సాధిస్తున్నప్పటికీ... కోచ్‌గా ఐగర్ స్టిమాక్ కొనసాగనున్నారు. 2026 ఫిఫా ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో అఫ్గానిస్తాన్లాంటి చిన్న జట్టుతో ఓటమి పాలవడం ఆయన కోచ్ పదవికి ఎసరు తెచ్చింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సాంకేతిక కమిటీ కూడా హెడ్ కోచ్‌ను తప్పించాలనే సిఫార్సు చేసింది. అయితే ఒప్పంద నిబంధనలు ఆయన్ని ఉన్నపళంగా తప్పిస్తే భారీ మూల్యం చెల్లించేలా ఉన్నాయి. దీంతో వేటు కంటే కొనసాగించడమే మేలని ఏఐఎఫ్ఎఫ్ భావిస్తోంది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టిమాక్ ఇన్చార్జ్గా జూన్ వరకు జట్టుతో కలిసి పనిచేస్తారు’ అని ఏఐఎఫ్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. జూన్‌లో ఆసియా క్వాలిఫయర్స్‌కు సంబంధించిన రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్... కువైట్, ఖతర్లతో తలపడాల్సివుంటుంది. ఈ ఫలితాలను బట్టే తదుపరి మూడో రౌండ్‌కు అర్హత సాధించేది లేనిది తేలుతుంది. అఫ్గానిస్తాన్‌తో ఇంటా బయటా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ నిరాశపరిచింది. అఫ్గాన్‌కు సంబంధించిన హోమ్ మ్యాచ్ సౌదీలో జరగ్గా భారత్ డ్రా చేసుకుంది. -
సివంగివే సివంగివే... నీ త్యాగమే గుర్తించగా.. సాహో అంటూ మోకరిల్లదా లోకమే
పాటలు అంటే సరదాగా పాడుకునేవే కావు శక్తి మాత్రలు కూడా. తాజా విషయానికి వస్తే ఇండియన్ ఉమెన్ కబడ్డీ కోచ్ కవితా సెల్వరాజ్ ‘రెయిన్ డ్రాప్ ఫౌండేషన్’ నిర్వహించిన సమావేశంలో విజయ్ ‘బిగిల్’ (తెలుగులో విజిల్) సినిమాలో ఏఆర్ రెహమాన్ పాడిన ‘సివంగివే’ పాట ఎంత ఇన్స్పైర్ చేసిందో చెప్పింది. స్వయంగా ఆ పాట పాడింది. డెబ్బై వేలకు పైగా వ్యూస్‌తో ఈ వీడియో దూసుకుపోతోంది. అట్లీ డైరెక్షన్లో వచ్చిన ‘బిగిల్’ సినిమాలో విజయ్ మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా నటించాడు. మహిళా క్రీడాకారులలో స్ఫూర్తి, ధైర్యం నింపి విజయం వైపు తీసుకువెళ్లే క్రమంలో వినిపించే పాట సివంగివే. ఈ పాట (తెలుగు)లో నుంచి కొన్ని లైన్లు... ‘అడుగులే జలిపించు/ పిడుగులై ఒళ్లు విరుచుకో/ విను వీధి దారిన మెరుపులా/ భూమిని బంతాడు సివంగివే సివంగివే/ తలవంచె మగజాతి నీకే/ నీ త్యాగమే గుర్తించగా/సాహో అంటూ మోకరిల్లదా లోకమే -
ఈజీగా బరువు తగ్గేందుకు సులభమైన మూడు మార్గాలు ఇవే!
ప్రతి ఒక్కరిని వేధించే సమస్య అధిక బరువు. పెద్దగా తినకపోయినా కూర్చొని గంటలు, గంటలు పనిచేయడం వల్ల వచ్చేస్తుంటుంది. మరికొందరికీ తిండి కంట్రోల్ లేకపోవడం వల్లే వచ్చేస్తుంటుంది. దీంతో జిమ్మ్ల్లో గంట తరబడి వర్కౌట్లతో మునిగిపోతుంటారు. తొందరగా బరువు తగ్గాలన్న భావనతో చాలా తక్కువ తినేలా డైట్ ప్లాన్ చేస్తుంటారు. కానీ బరువు తగ్గుతారా అంటే? లేదనే చెప్పాలి. పైగా బాబోయ్ మావల్ల కాదంటూ మధ్యలో వదిలేస్తుంటారు. మళ్లీ యథావిధిగా బరువు పెరిగిపోవడం షరా మాములైపోతుంది. అయితే ఇలాంటి సమస్యకు ప్రముఖ విమెన్ వెయిట్ లాస్ ఫిట్నెస్ కొచ్చ్ తాను చెప్పే ఆ మూడే పద్ధతులతో చెక్ పెట్టొచ్చు అంటోంది. అవేంటో చూద్దామా!. జార్జియాకు చెందిన ప్రముఖ కోచ్ జెన్నా రిజ్జో వేసవి సమీపించేలోపు బరువు తగ్గాలనుకుంటే ఈ మూడింటిని ఫాలో అయితే చాలని చెబుతుంది. అలాగే తొందరగా తగ్గాలన్న తాపత్రయం కంటే నిధానంగా తగ్గడమే మేలని చెబుతోంది రిజ్జో. అంతేగాదు జిమ్‌లో ఎక్కువ వర్కౌట్లతో గడపాల్సిన పనిలేదంటోంది. ముఖ్యంగా ఆహ్లాదభరితంగా చేయాలనే సన్నద్ధంతో ఉండమని చెబుతోంది. జస్ట్ 30 నిమిషాలు తాను చేయగలిగే సింపుల్ వ్యాయామాలు జోష్‌ఫుల్‌గా చేయమని చెబుతుంది. అదేలా ఉండాలంటే.. అబ్బా రేపు ఈ వ్యాయామం చేయాలి అనే ఉత్సుకతను రేకెత్తించేలా చేస్తే చాలట. దశల వారిగా ఒక్కో వ్యాయామాన్ని పెంచండి. మనసుకి ఇష్టం లేకపోతే కొద్దిగా చేసి స్కిప్ చేయమంటోంది. ఏదో భారంగా లేదా దాన్నో పెద్ద పనిలా చేస్తే.. ఎప్పుడూ మానేద్దామా? అనే ఫీల్ ఆటోమేటిగ్గా మనలో వస్తే మాత్రం చేసిందంతా.. వేస్ట్ అని ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పేస్తోంది. ముఖ్యంగా డైట్ విషయంలో కూడా మరీ నోటిని కుట్టేసుకునేలా కాకుండా నచ్చినవన్నీ ఆస్వాదిస్తూ కొంచెం అంటూ మనసుకు చెప్పుకునేలా రెడీ అవ్వాలి. అలాగే ఆ డైట్లో ఒక్కో ఫ్రూట్ వెరైటీని యాడ్ చేసుకుంటూ పోతూ తినే భోజనం పరిమాణం తగ్గేలా చేయాలి. చివరిగా అతి ముఖ్యమైనది నిద్ర. ఇది కంటి నిండా ఉండాలని చెబుతోంది. కనీసం ఏడు గంటలు తప్పనిసరిగా నిద్రపోతేనే ఎన్ని వ్యాయామాలు చేసినా మంచి ఫలితం ఉండేదని బల్లగుద్ది మరీ చెబుతోంది రిజ్జో. ఈ మూడింటిని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఫాలో అయితే బరువు ఇట్టే తగ్గిపోతారని అంటోంది. ఈ మూడింటి కారణంగా మంచి ఫిట్నెస్గా, ఆరోగ్యంగా ఉంటారు. పైగా శరీరంపై ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవ్వవు, మంచి యాక్టివ్‌గా ఉంటారని చెబుతోంది రిజ్జో. అంతేగాదు అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. పైగా స్పీడ్‌గా బరువు తగ్గడం అనేది అనారోగ్య సమస్యలకు మూలం అవుతుందని హెచ్చరిస్తోంది. సో..! మీరు కూడా సింపుల్‌గా ఈజీగా ఉండే ఈ మూడు మార్గాలను అనుసరించి బరువు తగ్గిపోండి మరీ..! View this post on Instagram A post shared by Jenna Rizzo | Women’s Weight Loss Coach (@jennaaaamariee) (చదవండి: ఆ ఒక్క ఎక్క్ర్సైజుతో..అధిక బరువుకి చెక్ పెట్టిన నర్సు!) -
భారత బాస్కెట్‌బాల్ జట్టు కోచ్‌గా సంతోష్
ఆసియా కప్ సీనియర్ పురుషుల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు కోచ్‌గా తెలంగాణకు చెందిన పి.ఎస్.సంతోష్ ఎంపికయ్యాడు. ఈ టోర్నీ కజకిస్తాన్‌లో ఈనెల 23 నుంచి 26 వరకు జరుగుతుంది. గ్రూప్ ‘ఇ’లో భారత్‌తోపాటు ఖతర్, కజకిస్తాన్, ఇరాన్ జట్లున్నాయి. భారత జట్టులో విశేష్, అరవింద్, ముయిన్ బెక్, ప్రణవ్ ప్రిన్స్, అమృత్‌పాల్, గుర్బాజ్, పల్‌ప్రీత్, అమరేంద్ర, వైశాఖ్, ప్రిన్స్‌పాల్ సింగ్, సహజ్‌ప్రతాప్ సింగ్, బాలదానేశ్వర్ సభ్యులుగా ఉన్నారు. -
మహిళా క్రికేటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కోచ్ పై వేటు
-
వందే భారత్‌కు తప్పని రాళ్ల దెబ్బలు
ఇది సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైలు పరిస్థితి. ఏకంగా ఆరు కోచ్‌ల అద్దాలను ఆకతాయిలు పగలకొట్టేశారు. ఇటీవల ప్రారంభమై ప్రయాణికుల ఆదరణ చూరగొంటూ దాదాపు 115 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తున్న ఈ రైలును ఆకతాయిలు టార్గెట్‌గా చేసుకుంటున్నారు.– సాక్షి, హైదరాబాద్ వందేభారత్ రైళ్లపైనే కసిగా.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైళ్లపై రాళ్ల దాడులు జరగటం ముందు నుంచీ ఉంది. కానీ వందేభారత్ రైళ్లు పట్టాలెక్కిన తర్వాత అది మరింతగా పెరిగింది. గత ఏడు నెలల్లో రాష్ట్రంలో దాదాపు 300 పర్యాయాలు రైళ్లపై దాడులు జరిగితే, అందులో వందేభారతపై జరిగినవే 50కి పైగా ఉండటం గమనార్హం. వెడల్పాటి అద్దాలుండటంతో వందేభారత్ రైళ్లకు ఈ రాళ్లదాడి తీవ్ర నష్టం చేస్తోంది. సాధారణంగా రైలు అద్దాలు పగిలితే, మెయింటెనెన్స్ సమయంలో వాటిని మార్చేస్తారు. కానీ, వందేభారత్ రైళ్ల అద్దాలు తరచూ పగిలిపోతుండటంతో వాటిని మార్చటం ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం దక్షిణ మధ్య పరిధిలో సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో విశాఖపట్నం రైలు విశాఖలో మెయింటెయిన్ అవుతుండగా,తిరుపతి రైలు సికింద్రాబాద్‌లో అవుతోంది. వారానికి ఒక రోజు వీటికి సెలవు ఉండటంతో ఆ రోజు పూర్తిస్థాయిలో నిర్వహణ పనులు చేపడుతూ పగిలిన అద్దాలను మారుస్తున్నారు. బాగా పగిలితే మాత్రం వెంటనే మార్చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో అద్దాలను స్థానికంగా నిల్వ చేసుకుంటున్నారు. సికింద్రాబాద్ డివిజన్‌లోనే ఎక్కువగా.. తాజాగా తిరుపతి రైలులో ఆరు కోచ్‌ల అద్దాలు పగలగా, విశాఖ రైలుకు మూడు కోచ్‌ల అద్దాలు పగిలాయి. ఈ ఏడాది రైళ్లపై జరిగిన 300 రాళ్ల దాడుల్లో ఎక్కువ సికింద్రాబాద్ డివిజన్‌లోనే చోటు చేసుకున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రైళ్లపై దాడుల విషయంలో నిందితులపై తీవ్రచర్యలుంటాయి. రైళ్లపై దాడి చేయటాన్ని జాతి ఆస్తి విధ్వంసంగా పరిగణిస్తూ కఠిన సెక్షన్లు దాఖలు చేస్తారు. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం పోతుంది. దాడి చేసి అలాంటి కేసులుకొని తెచ్చుకోవద్దని ఎంతగా ప్రచారం చేసినా ఆకతాయిలు వినటం లేదు. దీంతో ఆ సెక్షన్ల కింద గరిష్ట జైలు శిక్షలు విధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి పట్టుబడిన వారికి వీలైనంత ఎక్కువ కాలం జైలు శిక్ష పడే ప్రమాదం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
మెట్రో లేడీస్ కోచ్‌లోకి యువకుడి ఎంట్రీ.. ఆ తర్వాత..
ఢిల్లీ: వివాదాలతో, చిత్రవిచిత్రాలతో తరచూ వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రోలో తాజాగా మరో ఘటన జరిగింది. అసభ్య డ్యాన్సులు, ఫైటింగ్‌లు, వైరల్ కావడానికి కొందరు చేసే పిచ్చి పనులతో ఢిల్లీ మెట్రో యాజమాన్యం కఠిన నిబంధనలు విధించింది. మెట్రో ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. అయినప్పటికీ ప్రయాణికులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు మహిళా కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. మహిళ విభాగంలోకి పురుషులకు అనుమతి ఉండదు.. అయినప్పటికీ నియమాలను ఉల్లంఘిస్తూ వెళ్లడంపై రైలులో ఓ యువతి ప్రశ్నించింది. యువకునికి తోడుగా వచ్చిన మరో మహిళ.. ఆ యువతిపై దురుసుగా ప్రవర్తించింది. బూతులు తిడుతూ కొట్టేంత పని చేసింది. Kalesh b/w Ladies and a Guy over He Stepped up Into ladies Coach in Delhi Metro pic.twitter.com/wzks795oqW — Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2023 ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళ, యువకుడిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే.. తాను తోడుగా ఉన్న మహిళకు సహాయంగా మాత్రమే మహిళల విభాగంలోకి వెళ్లానని, అంతకు మించి వేరే ఉద్దేశం లేదని ఆ యువకుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇదీ చదవండి: చంద్రయాన్ 3: 'విక్రమ్ ల్యాండర్ నేనే తయారు చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి.. -
ఎక్స్‌ట్రూజన్‌పై హిందాల్కో దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ రవాణా వ్యాగన్లు, కోచ్‌ల తయారీకి వీలుగా ఎక్స్‌ట్రూజన్ సౌకర్యాలపై పెట్టుబడులకు సిద్ధపడుతోంది. దీంతోపాటు కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లపై మొత్తం రూ. 4,000 కోట్లవరకూ వెచి్చంచేందుకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తాజాగా పేర్కొన్నారు. ప్రధానంగా వందే భారత్ రైళ్ల కోచ్‌లకోసం ఎక్స్‌ట్రూజన్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు మరో రూ. 2,000 కోట్లు పెట్టుబడులు కేటాయించనున్నట్లు కంపెనీ 64వ వార్షిక వాటాదారుల సమావేశం(ఏజీఎం)లో తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే అధిక వేగం, అధిక లోడ్‌కు వీలున్న పూర్తి అల్యూమినియంతో తయారయ్యే తేలికపాటి రేక్‌ల నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. ఇక సిమెంట్ బ్యాగులు, ఆహారధాన్యాలు తదితరాల కోసం మరో మూడు డిజైన్లతో రవాణా వ్యాగన్లను రూపొందించేందుకు ప్రణాళికలు వేసింది. మరోవైపు దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇతర సంస్థల సహకారంతో బ్యాటరీ ఎన్‌క్లోజర్స్, మోటార్ హౌసింగ్స్ తదితర కీలక విడిభాగాల తయారీ, అభివృద్ధిని చేపట్టనున్నట్లు బిర్లా వివరించారు. -
ఏఐ కోచ్.. మీకు త్వరగా జాబ్ వచ్చేలా చేస్తుంది!
ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్.. జాబ్ కోసం వెతుకుతున్న యూజర్లకు సహాయం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాధనంపై పని చేస్తోంది. ‘ఏఐ కోచ్’ పేరుతో పిలుస్తున్న ఈ కొత్త టూల్ ఉద్యోగార్థులకు మరింత సమర్థవంతమైన పద్ధతిలో ఉద్యోగాలను కనుగొని దరఖాస్తు చేసుకోవడానికి సహాయం చేస్తుంది. ఈ విషయాన్ని లింక్డ్ఇన్ యాప్ రీసెర్చర్ నిమా ఓవ్జీ ట్విటర్లో షేర్ చేశారు. లింక్డ్ఇన్ ఏఐ కోచ్‌పై పని చేస్తోందని, ఇది జాబ్లకు దరఖాస్తు చేయండం, నైపుణ్యాన్ని పెంచుకోవడం, వృత్తిపరమైన నెట్‌వర్క్‌ను విస్తరించే మార్గాలను అన్వేషించడంలో ఉద్యోగార్థులకు సహాయపడుతుందని అందులో రాసుకొచ్చారు. ఓవ్జీ షేర్ చేసిన లింక్డ్ఇన్ ఏఐ కోచ్ స్క్రీన్‌షాట్‌ను చూస్తే ఇంచుమించు మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్‌బాట్‌ను పోలి ఉంది. ఇందులో ఏఐ కోచ్ ఎలా పని చేస్తుంది.. కంపెనీల వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది.. తదితర వివరాలను మీరు ఏఐ కోచ్ నుంచి ఆరా తీయవచ్చు. ఇది మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని కంపెనీ అయినందున దాని ఏఐ సాంకేతికతతోనే దీన్ని రూపొందించే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి ➤ బ్యాంకు ఉద్యోగాలు చేదయ్యాయా? అలా చేరుతున్నారు.. ఇలా మానేస్తున్నారు! ప్రస్తుతం అన్నింట్లోనూ ఏఐ ఆధారిత సాధనాలు వస్తున్నాయి. వివిధ పనుల కోసం ప్రత్యేకంగా వీటిని అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ అన్వేషణలోనూ ఇవి సహాయం చేయనున్నాయి. ఈ దిశలో ‘ఏఐ కోచ్’ ఒక ప్రధాన అడుగు కాబోతోంది. ఇది ఉద్యోగార్థుల సమయం, శ్రమను ఆదా చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఇప్పటివరకు తన బింగ్ చాట్‌ను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ యాప్‌లు, ఎడ్, గిట్హబ్లకు పరిచయం చేసింది. మైక్రోసాఫ్ట్ ముఖ్యమైన ఉత్పత్తులలో లింక్డ్ఇన్ కూడా ఒకటి కావడం వల్ల ‘ఏఐ కోచ్’ ద్వారా ఇందులోనూ ఏఐ టెక్నాలజీని పరిచయం చేయబోతోందని చెప్పవచ్చు. #Linkedin is working on LinkedIn Coach! It's an AI ASSISTANT that helps you apply for JOBS, learn new SKILLS, and find more ways to CONNECT with your network! pic.twitter.com/jKBrPmEFJt — Nima Owji (@nima_owji) July 27, 2023 -
తప్పుడు వీడియో షేర్ చేస్తావా? అంటూ మహిళా అథ్లెట్‌పై కోచ్ భార్య దాడి
కర్ణాటక: కోచ్ భార్య మహిళా అథ్లెట్‌పై దాడి చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. బిందురాణి అనే అథ్లెట్ ప్రాక్టీస్ కోసం కంఠీరవ స్టేడియం వెళ్లారు. అక్కడ శ్వేత అనే మహిళ బిందురాణిని నోటికొచ్చినట్లు తిట్టి చేయి చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. కోచ్‌ల గ్రూప్‌లో ప్రైవేట్ కార్యక్రమం వీడియోను బిందు షేర్ చేసిందని, తప్పుడు వీడియోను షేర్ చేస్తావా అంటూ కోచ్ యతీశ్ భార్య శ్వేత దాడి చేసినట్లు తెలిసింది. ఆమైపె తాను అథ్లెటెక్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బిందురాణి తెలిపింది. -
రైలు మొత్తం బుకింగ్ చేసుకోవచ్చని తెలుసా?.. ఎంత ఖర్చవుతుందంటే!
భారతీయ రైల్వే.. దేశంలో సామాన్యులకు ప్రధాన రవాణా వ్యవస్థ. ప్రతిరోజు సుమారు కొన్ని కొట్ల మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద రైలు నెట్వర్క్ కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. నేడు భారతీయ రైల్వే దేశంలోని ప్రతీ ప్రాంతానికీ విస్తరించింది. అయితే రోజూ వేలాది రైళ్లు నడుస్తున్న రైలు టికెట్ పొందడం మాత్రం కష్టతరంగా మారుతోంది. రైలు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం, జనాభాకు సరిపడా రైళ్లు అందుబాటులో లేకపోవడం వంటి తదితర కారణాలతో నెల రోజుల ముందు బుక్ చేసుకున్నా టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇక అత్యవసరంగా బుక్ చేస్తే తప్పక వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోతుంది. ఒకటి రెండు టికెట్ల బుకింగ్ కోసమే అష్టకష్టాలు ఎదుర్కొంటున్న ఈ రోజుల్లో ఏకంగా కొన్ని కోచ్‌లు, లేదా రైలు మొత్తం బుక్ చేసుకోనే సదుపాయం ఉన్నదన్న విషయం అందరికీ తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసినా దాన్ని ఎలా బుక్ చేసుకోవాలనే దానిపై అవగాహన ఉండకపోవచ్చు.. అయితే రైలు, కోచ్‌లను ఎలా బుక్ చేసుకోవాలి, ఏ నిబంధనలు పాటించాలి, ఏ డాక్యుమెంట్లు అందించాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ రైల్వే సంస్థకు చెందిన IRCTC FTR యాప్ ద్వారా మొత్తం రైలు, లేదా కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ ఎఫ్‌టీఆర్‌లో రైలు బుక్ చేసుకుంటే అన్ని రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణించవచ్చు. కేవలం కోచ్ మాత్రమే బుక్ చేసుకోవాలనుకుంటే.. రైలు 10 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ ఆగిన స్టేషన్లలో మాత్రమే ప్రత్యేక కోచ్‌ను యాడ్ చేయడం, తొలగించడం జరుగుతుంది. అన్ని రైళ్లలో ఈ కోచ్‌లను జోడించడం సాధ్యం కాదు. బుకింగ్ వ్యవధి.. FTR రిజిస్ట్రేషన్ ప్రయాణ తేదికి గరిష్టంగా 6 నెలల ముందు.. కనీసం 30 రోజుల ముందు చేసుకోవచ్చు కోచ్ బుకింగ్.. సాంకేతిక సదుపాయాలను అనుసరించి FTRలో ఒక రైలులో కనిష్టంగా రెండు కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. రెండు స్లీపర్ కోచ్‌లు..అదే గరిష్టంగా 24 కోచ్‌లు బుక్ చేసుకోవచ్చు. చదవండి: ఆ దేశంలో వాడుకలో 840 భాషలు.. భారత్‌లో ఎన్ని భాషలంటే.. సెక్యూరిటీ డిపాజిట్.. ఆన్లైన్ బుకింగ్‌లో ప్రయాణానికి సంబంధించిన ప్రతి వివరాలను నమోదు చేయాలి. ప్రయాణ వివరాలు, కోచ్ వివరాలు, రూట్, ఇతర వివరాలను ఆన్లైన్ ఫామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఒక్కో కోచ్‌కు రూ. 50,000/- సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఒకవేళ 18 కోచ్‌ల కంటే తక్కువ ఉన్న రైలు బుకింగ్ కోసం కూడా 18 కోచ్‌లకు రిజిస్ట్రేషన్ మొత్తాన్ని..అంటే రూ. 9 లక్షలు చెల్లించాల్సిందే. ఏడు రోజుల వరకు కోచ్‌ను బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత, రోజుకు/కోచ్‌కి అదనంగా రూ. 10,000 చెల్లించాలి. బుకింగ్ విధానం ►రైలు లేదా కోచ్‌ని బుక్ చేసుకోవడానికి, ముందుగా IRCTC అధికారిక FTR వెబ్సైట్ www.ftr.irctc.co.in కి వెళ్లాలి. ►ఇప్పుడు మీ ఖాతాను ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి. ఇప్పటి వరకు మీకు అకౌంట్ లేకపోతే కొత్తగా నమోదు చేసుకోవాలి. ►పూర్తి కోచ్ బుకింగ్ కోసం FTR సర్వీస్ ఎంపికను ఎంచుకోండి. ►ఆ తర్వాత అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేయండి. ►ఆ తర్వాత ఫీజు చెల్లించాలి.. అంతే మీ ప్రయాణం బుక్ అయినట్లే. గుర్తుంచుకోవాల్సిన విషయాలు.. IRCTCలో మొత్తం రైలు లేదా కోచ్‌ను బుక్ చేసేటప్పుడు మీ ప్రయాణ తేదీకి కనీసం ఆరు నెలల ముందుగానే బుక్ చేసుకోవడం ఉత్తమం. అయితే మీరు సెక్యూరిటీ డిపాజిట్‌గా అందించిన మొత్తాన్ని ప్రయాణం పూర్తయిన తరువాత తిరిగి రిఫండ్ చేస్తారు. అంతేగాక IRCTC మొత్తం రైలు, కోచ్ కోసం క్యాటరింగ్ సేవలను సైతం అందిస్తుంది.. దీనిని ముందుగానే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా కారణం చేత మీ బుకింగ్‌ను రద్దు చేస్తే, మీకు రిజిస్ట్రేషన్ డబ్బులు అందవు. -
నీకో దణ్డం ద్రవిడ్ ....ఇక నుండి ధోని టైమ్
-
ధోని వల్లే ఇలా మారాల్సి వచ్చింది..!
-
WTC ఫైనల్ కి ముందు కోహ్లి గాయం...అడతాడ లేదా..
-
హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మృతి
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ క్రికెట్లో దూకుడైన ఓపెనర్‌గా పేరొందిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ అబ్దుల్ అజీమ్ మంగళవారం కన్నుమూశారు. 62 ఏళ్ల అజీమ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. 80, 90 దశకాల్లో హైదరాబాద్ మేటి ఓపెనర్‌గా వెలుగొందారు. 1986లో తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో అజీమ్ ట్రిపుల్ సెంచరీ సాధించారు. 1980 నుంచి 1995 వరకు క్రికెట్ కెరీర్ కొనసాగించిన ఆయన 73 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 4644 పరుగులు చేశాడు. ఇందులో 12 శతకాలున్నాయి. అనంతరం హైదరాబాద్ జట్టుకు కోచ్‌గా, సెలక్టర్‌గా సేవలందించారు. -
PV Sindhu: కోచ్ పార్క్‌తో సింధు కటీఫ్!
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్‌లో తాను రెండో పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌తో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెగదెంపులు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన పార్క్ టే సంగ్ వద్ద ఇకపై సింధు ప్రాక్టీస్ చేయబోవడం లేదు. ఇటీవల తాను ఆశించిన విజయాలను సింధు అందుకోలేకపోవడమే అందుకు కారణం. తమ భాగస్వామ్యం ముగిసిందనే విషయాన్ని పార్క్ స్వయంగా ధ్రువీకరించాడు. సింధు పరాజయాల్లో తన పాత్ర కూడా ఉందని అతను పేర్కొనడం విశేషం. గాయంతో ఐదు నెలలు ఆటకు దూరమైన సింధు జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్‌తో మళ్లీ బరిలోకి దిగింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిన ఆమె, సొంతగడ్డపై జరిగిన ఇండియా ఓపెన్‌లోనూ అనూహ్యంగా మొదటి రౌండ్లోనే పరాజయం పాలైంది. టీమ్ ఈవెంట్ అయిన ఆసియా మిక్స్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక మ్యాచ్ గెలవగలిగినా... ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో దిగువన ఉన్న గావో ఫాంగ్ జి చేతిలో పరాజయం ఊహించనిది. 2019 నుంచి సింధుకు పార్క్ వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరించాడు. ఈ నాలుగేళ్లలో మూడు బీడబ్ల్యూఎఫ్ టైటిల్స్‌తో పాటు కామన్వెల్త్ క్రీడల్లో కూడా సింధు స్వర్ణం సాధించింది. అన్నింటికి మించి టోక్యో ఒలింపిక్స్‌లో సింధు కాంస్యం సాధించడం పార్క్‌కు పేరు తీసుకొచి్చంది. ఈ విజయం తర్వాత అన్ని వేదికల్లోనూ తన పతక సాధనకు పార్క్‌నే కారణంగా చూపిస్తూ సింధు ప్రశంసలు కురిపించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధన ల ప్రకారం పార్క్ ఇప్పటికే గచ్చిబౌలిలో భారత జూని యర్ జట్టుతో చేరి వర్ధమాన ఆటగాళ్ల కోచింగ్‌లో నిమగ్నమయ్యాడు. సుచిత్ర అకాడమీలో... భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ నుంచి విడిపోయిన తర్వాత సింధు ‘సుచిత్ర అకాడమీ’లోనే సాధన చేస్తోంది. భారత ప్రభుత్వం వారి టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం ప్రకారం తన వ్యక్తిగత కోచ్‌ను ఎంచుకునే అవకాశం సింధుకు ఉంది. భారత జట్టు కోచ్‌గా వచ్చిన పార్క్‌ను ఈ సౌలభ్యం కారణంగానే తన వ్యక్తిగత కోచ్‌గా మార్చుకొని ‘సుచిత్ర’లో సింధు ప్రాక్టీస్ కొనసాగించింది. ఇటీవల తమ అకాడమీలోని దాదాపు 35 మంది షట్లర్ల శిక్షణ కోసం ‘సుచిత్ర అకాడమీ’ మలేసియా మాజీ ఆటగాడు హఫీజ్ హషీమ్‌తో మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. దాంతో సింధు కూడా హఫీజ్ వద్ద శిక్షణ తీసుకోవడం ఖాయమైంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ టోర్నీ (మార్చి 14–19)కి ముందు కనీసం రెండు వారాలు హఫీజ్ వద్ద సింధు ప్రాక్టీస్ చేయనుంది. అయితే హఫీజ్‌ను పూర్తి స్థాయిలో అధికారికంగా ‘వ్యక్తిగత కోచ్’గా సింధు నియమించుకుంటుందా అనే విషయంపై స్పష్టత లేదు. హఫీజ్ 2003లో ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో విజేతగా నిలిచాడు. సింధుతో నా భాగస్వామ్యం గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇటీవల ఆమె ప్రదర్శన బాగాలేదు. ఒక కోచ్‌గా నేను కూడా అందుకు బాధ్యుడనే. అందుకే ఆమె మార్పు కోరుతుంది. కొత్త కోచ్ కావాలని ఆశిస్తోంది. ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. వచ్చే ఒలింపిక్స్ వరకు సింధుతో లేకపోవడం కొంత బాధగా ఉన్నా మరో రూపంలో సింధుకు సహకరిస్తా. ఆమెతో కోచింగ్‌లో పాల్గొన్న ప్రతీ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. –పార్క్ టే సంగ్ -
లైంగిక వేధింపుల కేసులో జూడో కోచ్‌పై కేసు నమోదు
విజయవాడ: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జూడో స్పోర్ట్స్ కోచ్ శ్యామ్యూల్స్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .తమను లైంగికంగా వేధించాడంటూ పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో శ్యామ్యూల్స్ రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మద్యం మత్తులో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై కేసు నమోదైంది. తమపై బెదిరింపు చర్యలకు కూడా దిగాడని విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరికైనా చెబితే జీవితం నాశనం చేస్తానని తమను కోచ్ శ్యామ్యూల్స్ రాజు బెదిరించినట్లు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. జూడో నేషనల్ మ్యాచ్‌లో భాగంగా చెన్నైకు వెళుతున్న క్రమంలోనే కోచ్ వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. మెడికల్ టెస్టుల కోసం విజయవాడలో ఆగగా ట్రైన్ మిస్ అయిన క్రమంలో స్టేట్ జూడో ఇన్సిస్ట్యూట్‌కు తీసుకువెళ్లి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. -
పిలిప్పీన్స్‌లో భారత కబడ్డీ కోచ్ దారుణ హత్య!
మనీలా: పిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణం సంఘటన వెలుగు చూసింది. భారత్‌లోని పంజాబ్, మోగా ప్రాంతానికి చెందిన కబడ్డీ కోచ్ గుర్ప్రీత్ సింగ్ గిండ్రూ(43)ను దుండగులు కాల్చి చంపినట్లు మనీలా పోలీసులు తెలిపారు. గుర్ప్రీత్ నాలుగేళ్ల క్రితం పిలిప్పీన్స్ వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన క్రమంలో బుధవారం ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో తలలో తూటాలు దిగి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కబడ్డీ కోచ్‌ను దుండగులు ఎందుకు హత్య చేశారు, దాడికి గల కారణాలేంటనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. కెనడాలో మరో ఘటన.. కెనడాలోని ఒంటారియాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. పంజాబ్‌కు చెందిన మోహిత్ శర్మ(28) నిర్మాణుష్య ప్రాంతంలో కారు వెనకసీటులో మృతి చెంది కనిపించాడు. కొద్ది రోజులుగా విదేశాల్లో భారత సంతతి వ్యక్తులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయి. భారతీయులపై దాడులు పెరిగిన క్రమంలో కెనడాలో ఉన్న పౌరులు అప్రమతంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ మార్గదర్శకాలు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం సిగ్గుచేటు’.. రిపబ్లికన్లపై బైడెన్ విమర్శలు! -
‘కేసు వాపస్ తీసుకుంటే నెలకి రూ.1 కోటి ’.. మహిళా కోచ్ సంచలన ఆరోపణ
చండీగఢ్: హరియాణా క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన జూనియర్ మహిళా అథ్లెటిక్ కోచ్ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. కేసు వాపసు తీసుకోవాలని లేదంటే చంపేస్తామని తనను బెదిరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, తాను చావుకు భయపడనని, సందీప్ సింగ్‌కు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. తనను దేశం విడిచి వెళ్లిపోవాలని, అందుకు నెలకి రూ.1 కోటి చొప్పున ఇస్తామని బేరమాడినట్లు వెల్లడించారు. ‘నా నోరు మూయించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను చావుకు భయపడను. బెదిరింపులు వస్తున్నా వెనక్కి తగ్గను. నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. నాకు నచ్చిన దేశానికి వెళ్లిపోతే నెలకి రూ.1 కోటి అందుతాయని ఆఫర్ చేశారు. నా ఫిర్యాదును వెనక్కి తీసుకుని, వేరే దేశానికి వెళ్లమని నన్ను అడిగారు. నాకు తెలుసు ఆయన(సందీప్ సింగ్) మంత్రివర్గం నుంచి తొలగించబడతాడు, జైలుకు వెళతాడు, నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.’అని మహిళా కోచ్ తెలిపినట్లు ఏఎన్ఐ నివేదించింది. అలాగే.. ఈ కేసును హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మంగళవారం మాట్లాడారు సీఎం ఖట్టర్. క్రీడాశాఖ మంత్రిపై వచ్చిన లైంగిక ఆరోపణలు అంసబ్ధమైనవని, ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన దోషిగా మారడని స్పష్టం చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అథ్లెట్ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా! -
Team India: 3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్‌లు..!
Anil Kumble: టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో టీమిండియా సక్సెస్ సాధించేందుకు తోడ్పడే కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఫాలో అవుతున్న.. '3 ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు' అనే ఫార్ములాను టీమిండియా కూడా ఫాలో అవ్వాలని సూచించాడు. 2021లో ఆసీస్.. తాజాగా ముగిసిన వరల్డ్‌కప్ (2022)లో ఇంగ్లండ్ సక్సెస్ మంత్ర ఇదేనని పేర్కొన్నాడు. టెస్ట్‌ల్లో , పరిమిత ఓవర్ల క్రికెట్లో వేర్వేరు కోచ్‌లు, వేర్వేరు కెప్టెన్లతో ఇంగ్లండ్ జట్టు అద్భుత ఫలితాలు సాధిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న చర్చపై కుంబ్లే తన అభిప్రాయాన్ని ఈమేరకు వెల్లడించాడు. మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు, ముగ్గురు కోచ్‌లు ఉండాలని కచ్చితంగా చెప్పలేను కానీ, జట్టు మాత్రం డిఫరెంట్‌గా (ఆయా ఫార్మాట్లలో స్పెషలిస్ట్‌లతో కూడిన జట్టు) ఉంటే తప్పక సత్ఫలితాలు వస్తాయని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. ముఖ్యంగా టీ20లకు ప్రత్యేక జట్టు చాలా అవసరమని, ఈ ఫార్మాట్లో హార్డ్ హిట్టర్లు, ఆల్‌రౌండర్లు, టీ20 స్పెషలిస్ట్‌ల పాత్ర చాలా కీలకమని, 2021 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, తాజాగా ముగిసిన వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ ఈ ఫార్ములా అమలు చేసే విజయాలు సాధించాయని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టులో లివింగ్‌స్టోన్, ఆసీస్ టీమ్‌లో స్టొయినిస్ లాంటి ఆటగాళ్లు 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తున్నారంటే, ఆయా జట్ల కూర్పు ఎలా ఉందో ఇట్టే అర్ధమవుతుందని ఉదహరించాడు. కుంబ్లే చేసిన ఈ ప్రతిపాదనకు ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ కూడా మద్దతు పలికాడు. అన్ని జట్లు ఈ విషయం గురించి సీరియస్‌గా ఆలోచించాలని సూచించాడు. కాగా, విశ్వవిజేత ఇంగ్లండ్ జట్టుకు టెస్ట్‌ల్లో, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వేర్వేరు కోచ్‌లు, కెప్టెన్లు, జట్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ జట్టుకు టెస్ట్‌ల్లో బ్రెండన్ మెక్కల్లమ్ కోచ్‌గా, బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాథ్యూ మాట్ కోచ్‌గా, జోస్ బట్లర్ కెప్టెన్‌గా ఉన్నాడు. టీ20ల్లో మాజీ ఛాంపియన్ అయిన ఆసీస్‌కు టెస్ట్‌ల్లో, లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో వేర్వేరు కోచ్‌లు లేనప్పటికీ.. కెప్టెన్లు (కమిన్స్, ఫించ్), జట్టు పూర్తిగా వేరుగా ఉంది. టీమిండియా విషయానికొస్తే.. మన జట్టు మూడు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ (రోహిత్ శర్మ), ఒకే కోచ్ (ద్రవిడ్), ఇంచుమించు ఒకే జట్టు కలిగి ఉంది. అప్పుడప్పుడు అంతగా ప్రాధాన్యత లేని సిరీస్‌లకు రెస్ట్ పేరుతో కెప్టెన్‌కు, కోచ్‌కు రెస్ట్ ఇస్తుంది. ఆ సమయంలో కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తుంటాడు. కెప్టెన్ల మాట చెప్పనక్కర్లేదు. రోహిత్ గైర్హాజరీలో ఒక్కో సిరీస్‌కు ఒక్కో ఆటగాడు కెప్టెన్‌గా పని చేశాడు. గత ఏడాది కాలంలో భారత్ ఏకంగా ఏడుగురు కెప్టెన్లను మార్చింది. చదవండి: ఐపీఎల్ 2023కు ముగ్గురు ఆసీస్ స్టార్లు డుమ్మా.. దేశ విధులే ముఖ్యమంటూ..! -
రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతి.. టీమిండియా కోచ్ ఎవరంటే..?
న్యూజిలాండ్‌లో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం పర్యటించే భారత జట్టుకు మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టి20 వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి కోరడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 18నుంచి జరిగే ఈ పర్యటనలో భారత్, కివీస్ మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. లక్ష్మణ్‌తో పాటు హృషికేశ్ కనిత్కర్, సాయిరాజ్ బహుతులే కూడా కోచింగ్ బృందంలో భాగంగా ఉంటారు. ఈ ఏడాది ఆరంభంలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లలో కూడా భారత జట్టు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్, అండర్–19 ప్రపంచ కప్‌లో కూడా భారత యువ జట్టుకు మార్గనిర్దేశనం చేశాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా విశ్రాంతి తీసుకోవడంతో వన్డేలకు శిఖర్ ధావన్, టి20లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. న్యూజిలాండ్ పర్యటనలో భారత్ తొలుత టీ20లు ఆడనుంది. నవంబర్ 18, 20, 22 తేదీల్లో టీ20లు, ఆతర్వాత నవంబర్ 25, 27, 30 తేదీల్లో వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ పర్యటనకు భారత టీ20 జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టు.. శిఖర్ ధవన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ -
రైల్వే కోచ్ రెస్టారెంట్.. ఎంత బావుందో చూశారా!
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దక్షిణమధ్య రైల్వే పరిధిలోనే తొలి వినూత్న ప్రయోగానికి గుంటూరు రైల్వేస్టేషన్ వేదికైంది. అధునాతన హంగులతో ఇక్కడ రైల్వే శాఖ ఫుడ్ ఎక్స్‌ప్రెస్ పేరుతో కోచ్ రెస్టారెంట్‌ను ముస్తాబు చేసింది. గుంటూరు తూర్పు నియోజక వర్గ పరిధిలో దీనిని రైల్వే డీఆర్ఎం మోహన్‌రాజా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్‌రాజా మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో అధునాతనంగా తీర్చిదిద్దిన ఈ కోచ్ రెస్టారెంట్ ప్రయాణికులతోపాటు గుంటూరు ప్రజలకు మంచి అనుభూతినిస్తుందన్నారు. 24 గంటలూ రెస్టారెంట్ పనిచేస్తుందని, రుచికరమైన వేడివేడి వంటకాలు లభిస్తాయని చెప్పారు. ఈ రైల్వే కోచ్ రెస్టారెంట్‌ను పాత అన్‌సర్వీస్‌బుల్ కోచ్‌ని ఉపయోగించడం ద్వారా రైలు ప్రయాణికులకు ప్రీమియం అనుభవాన్ని అందించడానికి డివిజన్లో ఈ వినూత్న ఆలోచనను రూపొందించడం జరిగిదన్నారు. ఈ కోచ్‌ను రెస్టారెంట్ అవసరాలకు రీడిజైన్ చేసి లైసెన్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ వినూత్న కాన్సెప్ట్ ద్వారా రైలు ప్రయాణికులు అందమైన ఇంటీరియర్స్‌తో పూర్తి ఎయిర్ కండిషన్డ్ మోడిఫైడ్ రైల్ కోచ్‌లో ప్రీమియం డైనింగ్ అనుభావాన్ని పొందుతారన్నారు. కార్యక్రమంలో డివిజన్ సీనియర్ డీసీఎం వి.ఆంజనేయులు, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ టి.హెచ్.ప్రసాదరావు, సిబ్బంది, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: విద్యార్థులను యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు..) -
తొమ్మిది నెలల్లో 40 కేజీల బరువు తగ్గి...
అంతవరకు సన్నగా... నాజుగ్గా ఉన్న అమ్మాయిలలో చాలామంది పెళ్లి అయ్యాక శరీరంలో చోటు చేసుకునే మార్పులతో ఒక్కసారిగా బరువు పెరిగిపోతుంటారు. కొంతమంది వ్యాయామం, క్రమబద్ధమైన ఆహారం ద్వారా బరువుని నియంత్రణలో ఉంచుకుంటే, అవేమీ చేయకుండా ఆకృతి మారిన శరీరాన్ని చూసి నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు మరికొందరు. అధిక బరువుతో నిరాశకు గురైన వారు అంత త్వరగా ఆ నిరాశ నుంచి బయటకు రాలేరు. గుమ్మం దాటి బయటకొస్తే తనని చూసి అందరూ నవ్వుతారు అని భయపడిన తులికా సింగ్.. ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో నలభై కేజీల బరువు తగ్గి, తనే ఫిట్నెస్కోచ్గా రాణిస్తోంది. వారణాసికి చెందిన తులికాసింగ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకుని 2004లో జర్నలిజం చదివేందుకు నోయిడాకు వెళ్లింది. జర్నలిజం కోర్సు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగం దొరకలేదు. తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితి. పొట్టకూటికోసం కొన్నాళ్లపాటు పరాటాలు విక్రయించింది. తరువాత ఓ ప్రొడక్షన్ హౌస్‌లో పనిదొరకడంతో మూడు వేలరూపాయల జీతానికి చేరింది. ఇలా రెండేళ్లు కష్టపడ్డాక 2007లో ఓ న్యూస్ చానల్లో్ల ఉద్యోగం దొరికింది. చక్కగా పనిచేస్తూ కెరీర్లో నిలదొక్కుకుంది. కొంతకాలానికి దిగ్విజయ్ సింగ్‌ను పెళ్లిచేసుకుంది. జోకులు వినలేక... పెళ్లివరకు అనేక కష్టాలు పడినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగిన తులికాకు పెళ్లి తరువాత కొత్తరకం కష్టాలు మొదలయ్యాయి. చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్న ఆమె పెళ్లి, పిల్లలతో హార్మోన్లలో ఏర్పడిన అసమతుల్యత కారణంగా ఒక్కసారిగా బరువు పెరిగింది. అంత బరువున్నా, ఎప్పుడూ నీరసంగా ఉండేది. దీనికితోడు చుట్టుపక్కల వాళ్లు ఆమె శరీరం మీద రకరకాల జోకులు వేస్తూ, గేలిచేసేవారు. దీంతో తనకు తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్లింది. ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చోని దిగులు పడుతుండేది. ముంబై నుంచి ఢిల్లీకి మారాక కూడా చానల్లో పనిచేసేది. కానీ అధిక బరువు కారణంగా ఏకాగ్రత పెట్టలేక ఆర్టికల్స్‌ను రాయలేకపోయేది. రోజురోజుకి పెరుగుతోన్న బరువుని నియంత్రించలేక, జనాల ఈసడింపు చూపులు తట్టుకోలేకపోయేది. మరోవైపు పీసీఓడీ సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. తొమ్మిది నెలల్లో నలభై కేజీలు... నాలుగో అంతస్థులో ఉండే తులికా, తాను కిందకి దిగితే చూసినవాళ్లు నవ్వుతారన్న భయంతో భర్త, కొడుకు, స్నేహితులు మోటివేట్ చేయడంతో దగ్గర్లో ఉన్న చిన్న పార్క్‌లోకి రాత్రి సమయాల్లో వెళ్లి రహస్యంగా వాకింగ్, రన్నింగ్ చేయడం మొదలు పెట్టింది. రెండు నెలలపాటు రన్నింగ్, వాకింగ్‌లతో పదమూడు కేజీలు బరువు తగ్గింది. ఈ ఉత్సాహంతో ఆహారంలో మార్పులు, జిమ్‌లో చేరి వర్క్ అవుట్లు, యోగా చేయడంతో తొమ్మిది నెలల్లోనే నలభై కేజీలు బరువు తగ్గింది. జిమ్ ట్రైనర్‌ను చూసి... ఒకపక్క డిప్రెషన్‌కు కౌన్సెలింగ్ తీసుకుంటూనే, జిమ్‌లో క్రమం తప్పని వ్యాయామంతో బరువు తగ్గిన తులికా.. తను కూడా జిమ్‌లోని ఫిట్నెస్ కోచ్ కావాలనుకుంది. దీంతో వ్యాయామాలన్ని చక్కగా నేర్చుకుని ఆన్లైన్ తరగతుల ద్వారా శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం చక్కని ఫిట్నెస్ కోచ్‌గా రాణించడమేగాక, నేషనల్ గేమ్స్ ఆస్పిరెంట్స్‌కు శిక్షణ ఇస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో నలుగురిలో కలవలేనప్పటికీ.. మనలో ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే ఎంతటి బరువునైనా దింపేసుకుని ముందుకు సాగవచ్చనడానికి తులికా జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. (క్లిక్: పుష్ప.. 66 వయసులోనూ తగ్గేదేలే..!) మనల్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతాం. శరీరమే మనకు సర్వస్వం. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కెరీర్ మీద దృష్టిపెడుతూనే ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకుంటే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాము. మన రోజువారి పనుల్లో హెల్దీ లైఫ్‌స్టైల్ భాగం కావాలి. నా స్టూడెంట్స్‌కు ఇదే నేర్పిస్తున్నాను. – తులికా సింగ్ -
Asia Cup 2022: బంగ్లాదేశ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్!
Asia Cup 2022- T20 World Cup 2022: ఆసియా కప్-2022, టీ20 ప్రపంచకప్-2022 టోర్నీల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ల కోసం టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను కోచ్‌గా నియమించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ వెల్లడించినట్లు ది డైలీ స్టార్ తన కథనంలో పేర్కొంది. ‘‘అవును.. ప్రపంచకప్ ఈవెంట్ వరకు మేము శ్రీరామ్‌తో కలిసి పనిచేయబోతున్నాం. ఆసియా కప్ నుంచి సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ప్రధాన లక్ష్యం టీ20 ప్రపంచకప్. నిజానికి... వరల్డ్‌కప్ టోర్నీ సమయంలో ఈ నియామకం జరిగినట్లయితే.. అప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని జట్టుతో మమేకమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. ఆసియా కప్ ఈవెంట్ నుంచే జట్టుతో కలిసేలా ప్రణాళికలు వేశాం’’ అని సదరు అధికారి పేర్కొన్నట్లు డైలీ స్టార్ తెలిపింది. మరి పాత కోచ్? అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు శ్రీరామ్ నియామకం నేపథ్యంలో ప్రస్తుత కోచ్ రసెల్ డొమింగో బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు మార్గదర్శనం చేస్తాడని తెలిపినట్లు పేర్కొంది. కాగా చెన్నైకి చెందిన శ్రీధరన్ శ్రీరామ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా ఎదిగాడు. 2000- 2004 మధ్య కాలంలో టీమిండియా తరఫున ఎనిమిది వన్డేలు ఆడిన అతడు కోచింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఆసీస్‌ను విజేతగా నిలపడంలో! ఈ క్రమంలో ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించి.. అష్టన్ అగర్, ఆడం జంపా వంటి యువకులకు స్పిన్ బౌలింగ్‌లో మెళకువలు నేర్పించాడు. టీ20 ప్రపంచకప్-2021 గెలిచిన ఆసీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. అదేవిధంగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. గతంలో పంజాబ్ బౌలింగ్ కోచ్‌గానూ శ్రీధరన్ శ్రీరామ్ పనిచేశాడు. ఘోర పరాభవం! కాగా ఇటీవల బంగ్లాదేశ్.. జింబాబ్వే చేతిలో ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. జింబాబ్వేలో పర్యటించి వన్డే, టీ20 సిరీస్‌లను 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఆసియా కప్-2022కు ముందుకు ఇలాంటి పరాభవం ఎదురైన నేపథ్యంలో బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోచ్‌గా శ్రీధరన్ శ్రీరామ్ నియామకం జరిగినట్లు సమాచారం. చదవండి: Ind Vs Zim: అతడిని ముట్టుకున్నా.. జింబాబ్వే యువతి సంతోషం! ఫిదా చేసిన భారత క్రికెటర్! LLC 2022: గంభీర్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న గౌతీ! -
టీమిండియా మెంటల్ హెల్త్ కోచ్‌గా మళ్లీ అతనే..!
టీమిండియా మెంటల్ హెల్త్ కండీషనింగ్ కోచ్‌గా ప్యాడీ అప్టన్ మళ్లీ నియమితుడయ్యాడు. గతంలో పలు సందర్భాల్లో టీమిండియా తరఫున ఈ బాధ్యతలు నిర్వహించిన అప్టన్‌ను ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసింది. అప్టన్ ఎంపిక తక్షణమే అమల్లోకి వస్తుందని, అతను విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాతో జాయిన్ అవుతాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అప్టన్ 2011లో టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. అటగాళ్ల మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో అప్టన్‌కు నిపుణుడిగా మంచి పేరుంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో అప్టన్‌కు మంచి సంబంధాలు ఉండటంతో ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ద్రవిడ్ టీమిండియాలో సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి వీరిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ ఐపీఎల్లో (ద్రవిడ్-రాజస్థాన్ రాయల్స్, అప్టన్-ఢిల్లీ డేర్‌డెవిల్స్) కూడా వివిధ ఫ్రాంచైజీలకు పని చేశారు. చదవండి: 'అతడిని సరిగ్గా ఉపయోగించుకోండి.. మరో ఏడేళ్ల పాటు భారత్‌కు' -
ప్రధాని మోదీకి జిమ్ కోచ్‌గా మంచిర్యాల జిల్లా వాసి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీకి జిమ్ కోచ్‌గా మంచిర్యాల జిల్లా వాసిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో మోదీ పర్యటించే రోజుల్లో ట్రెడ్మిల్, జిమ్ సైకిల్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండేందుకు జిల్లా కేంద్రానికి చెందిన గడప రాజేశ్‌ను నియమిస్తూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేశ్ ప్రస్తుతం జింఖానా గ్రౌండ్స్‌లో అథ్లెటిక్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. చదవండి: (కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మలా మిగిలిపోయారు: బాల్కసుమన్) -
పంత్ తీవ్ర భావోద్వేగం.. ఆయన వల్లే ఇదంతా అంటూ
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ భావోద్వేగానికి గురయ్యాడు. పంత్ ఐపీఎల్‌లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కూడా టీమిండియా తరపున అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2021 సీజన్‌కు గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ దూరం కావడంతో అతడి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలును పంత్ చేపట్టాడు. గతే ఏడాది సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ప్లేఆప్స్‌కు చేర్చాడు. కాగా తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్ తన కోచ్, తండ్రి గురించి మాట్లాడూతూ ఎమోషనల్ అయ్యాడు. తన విజయంలో తండ్రి, కోచ్ తారక్ సిన్హా కీలక పాత్ర పోషించారని అతడు తెలిపాడు. కాగా పంత్ 2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో ఉన్నప్పడు అతడి కోచ్ తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. "నేను ప్రపంచకప్ ముగిసిన తర్వాత నా కోచ్‌ను కలవాలి అనుకున్నాను. కానీ అంతలోనే అతను మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. అప్పుడు నేను ఇంగ్లండ్‌లో ఉన్నాను. అదే విధంగా మా నాన్నను నేను చాలా మిస్ అవుతున్నాను. మా నాన్న నన్ను వదిలి వెళ్లినప్పుడు కూడా నేను క్రికెట్ ఆడుతూ బిజీగా ఉన్నాను. అతడి చివరి చూపుకు కూడా నోచుకోలేదు. నేను ఈ రోజు ఈ స్ధాయిలో ఉన్నాను అంటే కారణం వీరిద్దరే. నా కోచ్ నాకు ఒక్క మాట చెప్పాడు. 'నీ జీవితంలో ఏమి జరిగినా, నీవు క్రికెట్‌ను మాత్రం వదలకు" అని అతను నాతో చెప్పారు. అదే విధంగా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి అని నా కోచ్ చెప్పేవారు. చివరగా నా జీవితంలో మా నాన్న , నా కోచ్ లేని లోటును ఎవరూ పూడ్చలేరు" అని పంత్ పేర్కొన్నారు. చదవండి: IPL 2022: అతడి కెప్టెన్సీ భేష్ ఈసారి ఐపీఎల్ టైటిల్ వాళ్లదే: టీమిండియా దిగ్గజం -
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌కు కీలక పదవి..
కొలొంబో: శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ అయిన మహేళ జయవర్దనేకు కీలక పదవి దక్కింది. అతన్ని ఏడాది కాలం పాటు శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది శ్రీలంక బిజీ షెడ్యూల్ కలిగి ఉన్న నేపథ్యంలో జయవర్దనేకు కీలక బాధ్యతలు అప్పచెబుతున్నట్లు లంక క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో ఆష్లే డిసిల్వా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. Sri Lanka Cricket wishes to announce the appointment of former Sri Lanka Captain Mahela Jayawardena as the ‘Consultant Coach’ for the National Teams, effective 1st January 2022. READ:https://t.co/8Kry3xwm62 #LKA #SLC— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) December 13, 2021 కాగా, జయవర్దనే ముంబై ఇండియన్స్ కోచింగ్ బాధ్యతలతో పాటు శ్రీలంక అండర్-19 జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా లంక క్రికెట్ బోర్డు నిర్ణయంతో జయవర్దనేకు ప్రమోషన్ లభించింది. నూతన బాధ్యతల్లో జయవర్దనే.. శ్రీలంక హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్‌తో పాటు ఇతర శిక్షణా సిబ్బందికి సలహాలిస్తారు. చదవండి: ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు ఎంపికైన ఆసీస్ స్టార్ ఓపెనర్ -
క్రికెట్ చరిత్రలో సంచలనం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్
Sarah Taylor Becomes First Woman Coach In Mens team: క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి టీమ్ అబుదాబి శ్రీకారం చుట్టింది. తొలిసారిగా ఓ పురుషుల జట్టుకు మహిళా క్రికెటర్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ఫ్రాంచైజీ తెలిపింది. అబుదాబీ టీ10 లీగ్‌లో మాజీ ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ట్విటర్లో వెల్లడించింది. దీంతో మెన్స్ ఫ్రాంఛైజీ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి ఫీమేల్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ సారా టేలర్ చరిత్ర సృష్టించింది. కాగా ఇంతకుముందు ఇంగ్లండ్ మెన్స్ కౌంటీ టీమ్ ససెక్స్ జట్టుకి స్పెషలిస్ట్ కోచ్(వికెట్ కీపింగ్ కోచ్)గా నూ సారా టేలర్ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇక ఇంగ్లండ్ సాధించిన రెండు వన్డే వరల్డ్ కప్‌లు, ఒక టీ20 వరల్డ్ కప్ జట్లలో ఆమె సభ్యురాలిగా ఉంది. కాగా నవంబర్ 19 నుంచి అబుదాబి టీ10 లీగ్ ప్రారంభం కానుంది. చదవండి: T20 World Cup 2021 Pak Vs Afg: భేష్.. ఇలాంటి జట్టును ఎన్నడూ చూడలేదు: ఇమ్రాన్ ఖాన్ -
కోచ్ కాదు కామాంధుడు.. మసాజ్ పేరుతో మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులు
చెన్నై: శిక్షణ ఇవ్వాల్సిన ఓ కోచ్ కామంతో కళ్లు మూసుకుపోయి, మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన అథ్లెటిక్స్ కోచ్ పి. నాగరాజన్‌పై ఓ జాతీయ స్థాయి మహిళా అథ్లెట్(19) లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఈ ఏడాది మే నెలలో ఫిర్యాదు చేసింది. మసాజ్ పేరుతో కోచ్ తనను తాకరాని చోట తాకి పైశాచికత్వాన్ని ప్రదర్శించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. భయం కారణంగా కోచ్‌కు ఎదురు చెప్పలేకపోయానని, చాలా సందర్భాల్లో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాని పేర్కొంది. ఈ కేసులో నాగరాజన్‌ను విచారించిన పోలీసులు అతనిపై పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి, ఛార్జిషీట్ ఓపెన్ చేశారు. కాగా, ఈ ఉదంతం వెలుగు చూసాక మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఫిర్యాదు చేసిన వారిలో కొందరు గతంలో నాగరాజన్ వద్ద శిక్షణ తీసుకున్న వారు కాగా, మరికొందరు ప్రస్తుతం జూనియర్లుగా శిక్షణ పొందుతున్నవారున్నారు. వీరందరూ కామ కోచ్ ఆకృత్యాలను ఒక్కొకటిగా బయటపెట్టడంతో పోలీసులు నివ్వెరపోతున్నారు. ఎంతో మంది అథ్లెట్లను జాతీయ స్థాయిలో ఛాంపియన్లుగా తీర్చిదిద్దిన నాగరాజన్.. ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడని తెలిసి ముక్కున వేలేసుకుంటున్నారు. నాగరాజన్ వెదవ వేశాలపై మరికొందరు ట్విటర్ ద్వారా తమను సంప్రదించారని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: ఈ విషయంలో కేంద్రానికి ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం -
కోచ్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. భారత స్టార్ ప్లేయర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ నేషనల్ కోచ్ సౌమ్యదీప్ రాయ్‌పై స్టార్ ప్లేయర్ మనికా బత్రా సంచలన ఆరోపణలు చేసింది. దోహా వేదికగా ఈ ఏడాది మార్చిలో జరిగిన ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో జాతీయ కోచ్ తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమన్నాడని ఆమె ఆరోపించింది. అయితే అందుకు తాను అంగీకరించలేదని, టోక్యో ఒలింపిక్స్‌లో అందుకే అతని సహాయం తీసుకోలేదని టీటీ సమాఖ్యకు నివేదించింది. ఫిక్సింగ్ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఇందుకు కావాల్సిన సాక్షాధారాలు తన దగ్గరున్నాయని, సరైన సమయంలో వాటిని అధికారుల ముందుంచుతానని పేర్కొంది. మ్యాచ్ ఫిక్సింగ్ అంశంపై మాట్లాడేందుకు కోచ్ నా వ్యక్తిగత హోటల్ గదికి వచ్చాడని, తాను మాట వినకపోవడంతో బెదిరింపులకు దిగాడని, ఓ శిష్యురాలు కోసమే ఆయన ఇదంతా చేశాడని వెల్లడించింది. కాగా, జాతీయ కోచ్‌పై మనికా బత్రా చేసిన ఆరోపణలపై టీటీఎఫ్ఐ విచారణ చేపట్టకపోవడం పలు అనుమానలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే, భారీ అంచనాల మధ్య టోక్యో ఒలింపిక్స్ బరిలోకి దిగిన ప్రపంచ 56వ ర్యాంకర్ మనికా బాత్రా మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఒలింపిక్స్ సందర్భంగా నేషనల్ కోచ్ సేవలను తిరస్కరించడంపై అప్పట్లో టేబుల్ టెన్నిస్ సమాఖ్య మనికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. చదవండి: వారెవ్వా క్యా సీన్ హై.. ట్రాక్‌పైనే అంధ అథ్లెట్‌కు లవ్ ప్రపోజల్ -
ఏసీ ఎకానమీ కోచ్.. ఛార్జీ తక్కువ సౌకర్యాలు ఎక్కువ
సరికొత్త బిజినెస్ పాఠాలతో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వేను పరుగులు పెట్టించారు. మట్టిపాత్రల్లో టీలు, ఎక్స్ట్రా బెర్తులతో పాటు పేదల కోసం ప్రత్యేకంగా గరీబ్‌రథ్ పేరుతో ఏసీ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సామాన్యులకు ఏసీ ప్రయాణం అందుబాటులోకి తేవడం కోసం ఏసీ ఎకానమీ కోచ్‌లను రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఏసీ ఎకానమీ కోచ్‌లు ప్రస్తుతం రైల్వేలో ఏసీ ఫస్ట్‌క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కేటగిరీలు ఉన్నాయి. వీటితో పాటు గరీబ్‌రథ్ ఏసీ రైళ్లు, కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ చెయిర్‌కార్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏసీ చెయిర్ కార్, థర్డ్ క్లాస్ ఏసీల టిక్కెట్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు వాటికంటే తక్కువ ధరకే ఏసీ ప్రయాణం అందుబాటులోకి తేనుంది రైల్వే శాఖ. దీనికి ఏసీ ఎకానమీ కోచ్‌లుగా పేరు పెట్టింది. ధర ఎంతంటే ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ఏసీ థర్డ్ క్లాస్ టిక్కెట్ ఛార్జీల కంటే 8 శాతం తక్కువగా వీటికి ఛార్జీలుగా నిర్ణయించారు. దీని ప్రకారం స్లీపర్ క్లాస్ టిక్కెట్ బేస్ ఫేర్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ధర చెల్లించి ఏసీ ప్రయాణం చేయడం వీలవుతుంది. ఈ కోచ్‌లలో కనీస ఛార్జీ రూ. 440గా నిర్ణయించారు. తొలి ట్రైన్ ఇక్కడే అందులో నార్త్ సెంట్రల్ రైల్వే జోన్ మొదటి కోచ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. 2021 సెప్టెంబరు 6న ప్రయాగ్‌రాజ్ నుంచి జైపూర్‌కి వెళ్లే రైలులో ఈ కోచ్‌ను తొలిసారిగా ప్రవేశ పెడుతున్నారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. సౌకర్యాలు సూపర్ వివిధ కోచ్ ఫ్యాక్టరీలో ఇప్పటికే 50కి పైగా ఏసీ ఎకానమీ కోచ్‌లు తయారై రెడీగా ఉన్నాయి,. వీటిని వివిధ జోన్లకు కేటాయించారు. వీటిని లింకే హఫ్‌మన్ బుష్ టెక్నాలజీతో తయారు చేశారు. ఇంటీరియర్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏసీ కోచ్‌ల కంటే ఎకానమీ కోచ్‌లలో సౌకర్యాలు బాగున్నాయి, మన దగ్గర ఎప్పుడు ఏసీ ఎకామని కోచ్‌లు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ప్రవేశపెడతారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. తొలి విడత కేటాయింపులో దక్షిణ మధ్య రైల్వేకు ఈ కోచ్‌లు కేటాయిస్తే అతి త్వరలోనే ఈ సౌకర్యం తెలుగు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా ఈ ఏసీ ఎకానమీ కోచ్‌లను రెండు జోన్ల మధ్య తిరిగే రైళ్లలో ఎక్కువగా ప్రవేశ పెడుతున్నారు. చదవండి : ‘కరోనా’తో ఆన్లైన్ వ్యసనం!..సర్వేలో భయంకర నిజాలు -
క్రీడా దిగ్గజం కన్నుమూత: విషాదంలో అథ్లెటిక్స్ ప్రపంచం
తిరువనంతపురం: పరుగుల రాణి పీటీ ఉష గురువు, అథ్లెటిక్స్ దిగ్గజం ఓమ్ నంబియార్ (89) గురువారం కన్నుమూశారు. తనకు శిక్షణనిచ్చిన గురువు కన్నుమూయడంతో ఆమె దిగ్ర్భాంతి చెందారు. ఈ విషయాన్ని చెబుతూ ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గురువుతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. కేరళకు చెందిన నంబియార్ 1980- 90 కాలంలో పీటీ ఉషకు శిక్షణ ఇచ్చారు. ఆయన శిక్షణలోనే పీటీ ఉష రాటుదేలారు. 1985లో ఆయనకు ద్రోణాచార్య అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది పద్మశ్రీతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ( చదవండి: పసిపాప కోసం ‘ఒలింపిక్ మెడల్’ వేలానికి ) కోచ్ కాక ముందు నంబియార్ 1955-70 మధ్య భారత వాయుసేనలో పని చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ క్రీడా సంస్థలో కోచింగ్ కోర్సు పూర్తి చేశారు. అనంతరం కేరళ క్రీడా మండలిలో చేరారు. తిరువనంతపురంలో తొలిసారిగా పీటీ ఉష నంబియార్‌ను కలిసింది. పీటీ ఉషతో పాటు షైనీ విల్సన్, వందనా రావు అంతర్జాతీయ పతకాలు సాధించడంలో నంబియార్ పాత్ర మరువలేనిది. గురువు మృతిపై పీటీ ఉష ట్వీట్ చేశారు. ‘నా గురువు, శిక్షకుడు, మార్గదర్శిని కోల్పోవడం తీరని లోటు. నా జీవితానికి ఆయన చేసిన మేలు మాటల్లో చెప్పలేనిది. మిమ్మల్ని మిస్సవుతున్నాం నంబియార్ సార్. మీ ఆత్మకు శాంతి చేకూరుగాక’ అని చెబుతూ పోస్టు చేశారు. ఈ సందర్భంగా గురువు నంబియార్‌తో ఉన్న ఫొటోలను ఉష పంచుకుంది. The passing of my guru, my coach, my guiding light is going to leave a void that can never be filled. Words cannot express his contribution to my life. Anguished by the grief. Will miss you OM Nambiar sir. RIP 🙏🏽 pic.twitter.com/01ia2KRWHO — P.T. USHA (@PTUshaOfficial) August 19, 2021 నంబియార్ మృతిపై భారత అథ్లెటిక్స్ ఫెడరేషన్ (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు అడిలి జె. సుమారివల్ల సంతాపం ప్రకటించారు. భారత అథ్లెటిక్స్ నంబియార్ సేవలను మరువలేరని పేర్కొన్నారు. 1984 లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పీటీ ఉష నంబియార్ సారథ్యంలోనే సత్తా చాటింది. అథ్లెటిక్స్ తరఫున వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు. Sad to inform that Dronacharya Awardee coach OM Nambiar sir passed away a while back. He was coach of @PTUshaOfficial RIP Nambiar Sir, You gave us the Golden Girl. Your contribution to sports in India has been tremendous. Our condolences to the family- AFI President @Adille1 pic.twitter.com/VBVNqBPhzT — Athletics Federation of India (@afiindia) August 19, 2021 చదవండి: తనయుడి గిఫ్ట్‌కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి -
బతుకు చిత్రం : పతకాల సాధనలో కోచుల పాత్ర
-
షారుక్ ట్వీట్ వైరల్: లేటైనా నో ప్రాబ్లం.. వచ్చేటప్పుడు గోల్డ్‌తో రండి
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతమే చేసింది. క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను కట్టడి చేసి సెమీ ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఒలింపిక్స్‌లో తొలిసారిగా సెమీస్ చేరింది. తాజాగా ఈ విజయంపై బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. అంచనాలను తారుమారు చేస్తూ భారత మహిళల హాకీ జట్టు సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో మహిళల జట్టుపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. చారిత్రాత్మక సందర్భాన్ని కోచ్ సోయెర్డ్ మరీన్ రియల్ లైఫ్ చక్ దే ఇండియాతో పోల్చాడు. ఎందుకంటే ఆ సినిమా కూడా మహిళల హాకీ కథాంశంతోనే తెరకెక్కింది కనుక. ఈ ఆనందాన్నీ కోచ్ సోషల్‌మీడియాలో పంచుకుంటూ.. సారీ ఫ్యామిలీ.. నేను రావడం ఆలస్యమవుతుందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్రంలో కోచ్ కబీర్‌ఖాన్ పాత్ర పోషించిన షారుక్ దీనికి స్పందిస్తూ.. సరే ఏం ప్రాబ్లం లేదు. మీరు వచ్చేటప్పుడు భారత్‌లోని లక్షల కుటుంబాల కోసం గోల్డ్ తీసుకురండి చాలు.. మీ మాజీ కోచ్ కబీర్ ఖాన్ అని రిప్లై ఇచ్చాడు. కాగా ఉత్కంఠ సాగుతున్న మ్యాచ్‌లో గుర్జీత్ సంచలన గోల్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో భారత మహిళల హాకీ జట్టు తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. అటు 49 ఏళ్ల తర్వాత తొలిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. Haan haan no problem. Just bring some Gold on your way back….for a billion family members. This time Dhanteras is also on 2nd Nov. From: Ex-coach Kabir Khan. https://t.co/QcnqbtLVGX — Shah Rukh Khan (@iamsrk) August 2, 2021 -
ఒలింపిక్స్: కాలర్ పట్టి ఆటగాడి చెంపలు వాయించిన కోచ్
టోక్యో: విశ్వ క్రీడా పోటీలు జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతుండగా క్రీడాకారులు ప్రతిభ చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రీడా పోటీల్లో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ క్రీడాకారుడిని కోచ్ రెండు చెంపలు వాయించి పోటీలకు పంపించాడు. కోచ్ కొడుతుంటే ప్లేయర్ ఏమనకుండా ఓకే అంటూ బరిలోకి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అసలు కోచ్ ఎందుకు కొట్టారు? అనే సందేహం అందరిలో ఆసక్తి రేపుతోంది. మీరు చదివి తెలుసుకోండి.. ఎందుకో.. ఒలింపిక్స్‌లో జూడో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో జర్మనీకి చెందిన జూడో స్టార్ మార్టినా ట్రాడోస్ పాల్గొంది. రింగ్‌లోకి వెళ్లేముందు కోచ్ క్లాడియో పుస రెండు చేతులతో కాలర్ పట్టుకుని చెంపలపై వేగంగా కొట్టాడు. అక్కడున్న వారికి షాకింగ్ అనిపించింది. అయితే మార్టినా మాత్రం ఒకే అనుకుంటూ రింగ్‌లోకి వెళ్లింది. బరిలో దిగేముందు కోచ్ క్లాడియో ఇలా చేయడం ఆమెకు అలవాటు అని మార్టినా తెలిపింది. ప్రత్యర్థితో తలపడేలా ఉత్సాహంగా ఉండేందుకు ఇలా చేశారని పేర్కొంది. ఇది తనకు తప్పక అవసరమని చెప్పుకొచ్చింది. రెండు చెంపలు కొట్టడంతో నిద్రమబ్బు వదిలి బరిలో పతకం కొట్టేలా గురి ఉండేందుకు ఇలా కోచ్ చేశారు. A czo tu się odpoliczkowało w ogóle?! pic.twitter.com/mX2r9rMMTA — Mischa Von Jadczak (@michaljadczak) July 27, 2021 -
లైవ్‌లోనే లవ్ ప్రపోజల్: ఓడిన ప్లేయర్‌కు షాకిచ్చిన కోచ్!
టోక్యో (జపాన్): విశ్వ క్రీడా సంబరం జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరుగుతోంది. ప్రపంచ దేశాల క్రీడాకారులు తమ ప్రతిభ నిరూపించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందరూ గెలుపు కోసం ప్రయత్నిస్తారు. కానీ అందులో కొందరికీ మాత్రమే విజయం వరిస్తుంది. ఇక మిగిలిన వారు ఓటమి చెందుతారు. గెలుపోటములనేవి సమానంగా తీసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తిస్తే ఆటలోనైనా.. జీవితంలోనైనా మానసికంగా సిద్ధమైతే ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనవచ్చు. అలా బాధలో ఉన్న ఓ ప్లేయర్‌కు ఆమె కోచ్ ఊహించని షాక్ ఇచ్చాడు. ఇన్నాళ్లు నీ వెంట నేనున్నా.. ఇకపై నా వెంట నువ్వుంటావా? అని మీడియా వేదికగా లవ్ ప్రపొజల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అర్జెంటీనా ఫెన్సర్ మారియా బెలెన్ పెరెజ్ మారిస్ టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొని తొలి రౌండ్లోనే పరాజయం పొంది నిరాశకు గురయ్యింది. తన ప్రదర్శనపై మీడియాతో మాట్లాడుతోంది. ఈ సమయంలో ఆమె కోచ్ లుకాస్ ససిడో వెంట నిలబడి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని వారి మాతృ భాషలో రాసిన ఒక పేపర్ పట్టుకుని నిలబడ్డారు. వీటిని చూసిన మీడియా ప్రతినిధులు గట్టిగా నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో తెలియక ఆమె వెనకకు తిరిగి చూసింది. కోచ్ చేసిన ప్రేమ అభ్యర్థనను చూసి ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. వెంటనే అతడి ప్రేమ అభ్యర్థనను అంగీకరించింది. బెలెన్ మూడుసార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొంది. బెలెన్కు లుకాస్ కొన్నేళ్లుగా కోచ్‌గా ఉన్నారు. 2010లో పారిస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లోనూ కోచ్ లుకాస్ ఇదే విధంగా ప్రపోజ్ చేశాడు. అయితే అప్పుడు ‘నువ్వు జోక్ చేస్తున్నావా?’ అని చెప్పి లైట్‌గా తీసుకుంది. ఇప్పుడు 2021లో అదే విధంగా ప్రపోజ్ చేయడంతో ఆమె చివరకు లుకాస్‌ను అంగీకరించింది. తాము పెళ్లి చేసుకుంటామని మీడియా ముఖంగానే ప్రకటించారు. ఈ లైవ్ లవ్ ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మరింత విలాసవంతంగా రైలు ప్రయాణాలు..!
న్యూ ఢిల్లీ: రానున్న రోజుల్లో రైలు ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా ఉండనున్నాయి. త్వరలోనే సరికొత్త ‘ఎసీ ఎకానమీ' కోచ్‌లను ఇండియన్ రైల్వేస్ ప్రారంభించనుంది. కోవిడ్ రాకతో ఈ కోచ్‌ల తయారీకి ఆటంకం ఏర్పడింది. ఈ కోచ్‌లను కపుర్తాలా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది. ప్రస్తుతం ఉన్న ఎసీ 3-టైర్ కంటే తక్కువగా, నాస్ ఎసీ స్లీపర్ కంటే ఎక్కువగా ఎసీ ఎకానమీ కోచ్ ధరలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కోచ్‌ల రాకతో ప్రయాణికులకు తక్కువ ధరలో ఎసీ ప్రయాణాలను ఇండియన్ రైల్వేస్ అందించనుంది. కాగా ఎసీ ఎకానమీ కోచ్‌ల అధికారిక పేరును, లాంచ్ డేట్లను ఇండియన్ రైల్వేస్ ఇంకా నిర్ణయించలేదు. కపుర్తాలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తయారుచేసిన కోచ్‌లను దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. ఎసీ ఎకానమీ కోచ్‌ల ఫీచర్లు ప్రతి కోచ్‌లో కనిపించే 72 బెర్తులకు బదులుగా 83 బెర్తులను కలిగి ఉంటుంది. ఇది ప్రయాణీకుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ప్రతి బెర్త్‌లో వ్యక్తిగత రీడింగ్ లైట్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లతో పాటు బెర్త్‌లకు స్వంత ఎసీ వెంట్ల ఏర్పాటు ఉంది. ప్రతి కంపార్ట్మెంట్లో ఫోల్డబుల్ స్నాక్ టేబుల్, వాటర్ బాటిళ్ల హోల్డర్లు, మ్యాగజైన్స్, మొబైల్ ఫోన్ల హోల్డర్లను అమర్చారు. ఈ ఎసీ ఎకానమీ కోచ్‌లు దివ్యాంగులకు అనువుగా ఉంటాయి. కంపార్ట్మెంట్లకు వీల్ చైర్ యాక్సెస్‌ను ఏర్పాటు చేశారు. Despite Covid-19 restrictions affecting production in workshops, Rail Coach Factory, Kapurthala rolls out 15 coaches of 3 Tier AC Economy class with updated design, divyangjan friendly doors & toilets, with a plan to produce 248 such coaches this fiscal. pic.twitter.com/CFijKEVWdl — Ministry of Railways (@RailMinIndia) June 2, 2021 -
శ్రీలంక పర్యటనకు కోచ్‌గా ద్రవిడ్
ముంబై: భారత ‘ఎ’, అండర్–19 జట్లకు కోచ్‌గా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తొలి సారి సీనియర్ టీమ్‌తో కలిసి పని చేయనున్నాడు. వచ్చే జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. భారత ద్వితీయ శ్రేణి జట్టుగా గుర్తించబడుతున్న ఈ టీమ్‌లో పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌లు అయిన పలువురు యువ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. టూర్లో భాగంగా భారత్, లంక మధ్య 3 వన్డేలు, 3 టి20లు మ్యాచ్‌లు జరుగుతాయి. అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఇంగ్లండ్‌తో టెస్టుల్లో తలపడుతున్న సమయంలోనే ఈ సిరీస్ జరగనుంది. హెడ్ రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా అక్కడే ఉంటారు. దాంతో మరో ప్రత్యామ్నాయం కోసం చూసిన బీసీసీఐ...ద్రవిడ్‌ను అందుకు సరైన వ్యక్తిగా గుర్తించింది. పైగా జట్టులో ఎంపికయ్యే అవకా శం ఉన్న యువ ఆటగాళ్లందరూ ఇప్పటి వరకు అండర్–19, ‘ఎ’ టీమ్ సభ్యులుగా ద్రవిడ్ మార్గనిర్దేశనంలోనే తమ ఆటను మెరుగపర్చుకున్నవారే. దాంతో జట్టు పని మరింత సులువవుతుందని బోర్డు భావించింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) హెడ్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్... కొన్నాళ్ల క్రితమే అండర్–19, ‘ఎ’ టీమ్ బాధ్యతలనుంచి తప్పుకున్నాడు. శ్రీలంక పర్యటనకు భారత మాజీ పేసర్, యూత్ కోచ్ పారస్ మాంబ్రే బౌలింగ్ కోచ్‌గా వెళ్లే అవకాశం ఉంది. -
చరిత్రలో తొలిసారి.. పురుషుల జట్టుకు కోచ్‌గా ఎవరో తెలుసా?
లండన్: ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ సారా టేలర్ అరుదైన ఘనత సాధించింది. తొలిసారి ఒక పురుషులు జట్టుకు వికెట్‌కీపింగ్ కోచ్‌గా ఎంపికైంది. ఇంగ్లండ్‌లోని దేశవాలీ జట్టైన ససెక్స్‌కు టేలర్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. సమకాలీన క్రికెట్లో పురుషులతో సమానంగా అత్యున్నత క్రికెటర్‌గా టేలర్ పేరు పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''ససెక్స్‌కు వికెట్ కీపింగ్ కోచ్‌గా పనిచేయనుండడం సంతోషంగా ఉంది. ఆ జట్టులో ప్రతిభావంతమైన క్రికెటర్ల బృందం ఉంది. వారితో పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నా అనుభవం.. నైపుణ్యాలను వారికి పంచి నా వంతు సహకారం అందిస్తా. వికెట్ కీపింగ్‌లోని ప్రాథమిక సూత్రాలపై ఎక్కువగా దృష్టి సారించి ఆటగాళ్లకు మెళుకువలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చింది. సారా టేలర్ ఇంగ్లండ్ తరపున 10 టెస్టుల్లో 300 పరుగులు, 126 వన్డేల్లో 4056 పరుగులు, 90 టీ20ల్లో 2177 పరుగులు సాధించింది. ఇక వికెట్‌కీపర్ మూడు ఫార్మాట్లు కలిపి 104 స్టంపింగ్స్.. 128 క్యాచ్‌లు అందుకుంది. ఇంగ్లండ్ జట్టు 2017 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్ గెలవడంలో సారా టేలర్ కీలకపాత్ర పోషించింది. 2019లో టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. చదవండి: కరోనా కలకలం.. బీసీసీఐ కీలక నిర్ణయం -
షాకింగ్ : కోచ్‌లు, మహిళా రెజ్లర్ల దారుణ హత్య
సాక్షి, చండీగఢ్ : హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. రోహ్తక్లో రెజ్లింగ్ అకాడెమీలో దుండగులు మారణహోమం సృష్టించారు. సాయుధులైన కొంతమంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు రెజర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు కోచ్‌లు కాగా, మరో ఇద్దరు మహిళా రెజ్లర్లు ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, రెజ్లింగ్ కోచ్‌ల మధ్య వ్యక్తిగత శత్రుత్వమే కాల్పులకు దారితీసినట్టు తెలుస్తోంది. బరోడా గ్రామానికి చెందిన రెజ్లింగ్ కోచ్ సుఖ్వీందర్, మరికొందరు ఈ కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసి, వివరాలను పరిశీలిస్తున్నామని పోలీసుల అధికారులు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన రోహతక్ ఎస్పీ రాహుల్ శర్మ మాట్లాడుతూ (మనోజ్, సాక్షి) దంపతుల మూడేళ్ల కుమారుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. మృతులు ఐదుగురిలో కోచ్ దంపతులు సోనిపట్ లోని సరగ్తాలా గ్రామానికి చెందిన మనోజ్ కుమార్, అతని భార్య సాక్షి, ఉత్తరప్రదేశ్ కు చెందిన రెజ్లింగ్ కోచ్ సతీష్ కుమార్, మహిళా రెజ్లర్పూ జా, ప్రదీప్ మాలిక్‌గా గుర్తించారు. 5 people have died & 3 hospitalised. Main accused, a wrestling coach named Sukhwinder, was terminated by one of the deceased after a complaint. Prima facie, anger seems to be the motive. Postmortem & probe underway. Accused carries Rs 1 lakh bounty on him: Rahul Sharma, SP Rohtak https://t.co/wE3cAu1hH8 pic.twitter.com/IzOHAUDVO3 — ANI (@ANI) February 13, 2021 -
ముంబై కోచ్‌గా రమేశ్ పొవార్ నియామకం
సాక్షి, ముంబై: ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు ప్రధాన కోచ్‌గా భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పొవార్‌ను ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) మంగళవారం నియమించింది. భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన 42 ఏళ్ల పొవార్.. గతంలో భారత మహిళా క్రికెట్ జట్టుకి కోచ్‌గా వ్యవహరించాడు. పొవార్ నియామకం ప్రస్తుతానికి తాత్కాలికమే(ప్రస్తుత సీజన్) అయినప్పటికీ.. జట్టు అవసారాల దృష్ట్యా భవిష్యత్త్‌లో కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తామని ఎంసీఏ సెక్రెటరీ సంజయ్ నాయక్ తెలిపారు. కాగా, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై జట్టు పేలవ ప్రదర్శన కారణంగా అమిత్ పాగ్నిస్ ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. కోచ్ పదవికి ముంబై మాజీ కెప్టెన్ అమోల్ ముజుందార్, రమేశ్ పొవార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. సెలక్టర్లు రమేశ్ పొవార్వైపే మొగ్గు చూపారు. -
కోచ్ పదవికి వసీం జాఫర్ రాజీనామా
ముంబై: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. గతేడాది కరోనా పరిస్థితుల నడుమ(మార్చి నెలలో) కోచ్ బాధ్యతలు చేపట్టిన ఈ దేశవాళీ పరుగుల యంత్రం.. ఏడాది తిరిగేలోపే పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతని ఆకస్మిక నిర్ణయానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతను జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయడం ఉత్తరాఖండ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి. జాఫర్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ధ్రువీకరించినప్పటికీ.. అతని రాజీనామాను మాత్రం ఆమోదించలేదు. కాగా, వసీం జాఫర్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ జట్టు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఉత్తరాఖండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్క విజయం సాధించింది. రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు(12000 పై చిలుకు పరుగులు) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన వసీం జాఫర్.. భారత జట్టు తరఫున 31 టెస్టుల్లో 2 ద్విశతాకాలు, 5 శతకాలు, 11 అర్ధ శతకాల సాయంతో 1944 పరుగులు సాధించాడు. -
ఇంకా మెరుగ్గా నిర్వర్తించాల్సింది: కుంబ్లే
ముంబై: భారత క్రికెట్(టీమిండియా)లో మంచి సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న క్రికెటర్లలో అనిల్ కుంబ్లే ఒకడు. టీమిండియా జట్టు కెప్టెన్‌గానే కాకుండా ప్రధాన కోచ్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు కుంబ్లే. అయితే తాజాగా జింబాంబ్వే మాజీ క్రికెటర్ పొమ్మి మాంగ్వా నిర్వహించిన ఆన్లైన్ సెషన్లో తన కోచ్ పదవిపై కుంబ్లే స్పందించారు. ఆయన స్పందిస్తూ.. టీమిండియాకు ప్రధాన కోచ్‌గా తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహించానని, కానీ తన కోచ్ పదవిని చివర్లో ఇంకా మెరుగ్గా నిర్వహిస్తే బాగుండేదని తెలిపాడు. తాను కోచ్ పదవిని మెరుగ్గా నిర్వర్తించానని కుంబ్లే అన్నాడు. అయితే ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో విభేదాలు కారణంగానే కుంబ్లే తన పదవిని అర్థాంతరంగా వదులుకోవాల్సి వచ్చిందని పలువురు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్లో కూడా కుంబ్లే కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు మెంటార్‌గా కుంబ్లే వ్యవహరించాడు. కేవలం కెప్టెన్‌గా, కోచ్‌గా మాత్రమే కాకుండా తన బౌలింగ్ నైపుణ్యంతో టీమిండియాకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను కుంబ్లే అందించాడు. (చదవండి: అప్పుడు కుంబ్లేను కోహ్లి వద్దన్నాడు.. ఇప్పుడైతే?) -
కపిల్ సలహాతోనే కోచ్‌నయ్యా
న్యూఢిల్లీ: ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాక తదుపరి ఏం చేయాలనే విషయంపై సందిగ్ధత నెలకొన్నప్పడు దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ సలహాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత అండర్–19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కెరీర్ చివరి దశలో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్, కోచ్‌గానూ వ్యవహరించిన తాను అదృష్టవశాత్తు ఇంకా కోచింగ్‌తోనే కొనసాగుతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. భారత మహిళల జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో జరిపిన సంభాషణలో ద్రవిడ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘ఆటగాడిగా కెరీర్ ముగించాక తదుపరి నాకు చాలా దారులు కనబడ్డాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో పాలుపోలేదు. అప్పుడే కపిల్ దేవ్ మంచి సలహా ఇచ్చారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు రాహుల్... కొన్నేళ్లు అన్నీ ప్రయత్నించి నీకు ఏది నచ్చుతుందో చివరకు దానికే కట్టుబడి ఉండు అని చెప్పారు. ఆ మాటలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. కొన్నాళ్లు వ్యాఖ్యాతగా పనిచేశాను. కానీ ఆటకు దూరంగా వెళ్తున్నట్లు అనిపించింది. అందుకే సంతృప్తినిచ్చే కోచింగ్ వైపే మొగ్గు చూపాను. అండర్–19, భారత ‘ఎ’ జట్లకు కోచ్‌గా అవకాశం వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరించా’ అని ‘ది వాల్’ వివరించాడు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వన్డే జట్టుకు తాను సరితూగననే అభద్రతా భావానికి గురయ్యానని ద్రవిడ్ గుర్తుచేసుకున్నాడు. నిజానికి తాను టెస్టు ప్లేయర్‌ని అని పేర్కొన్న ద్రవిడ్ తన శిక్షణ కూడా టెస్టు క్రికెటర్‌లాగేó సాగిందన్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో 344 వన్డేలు ఆడిన ద్రవిడ్ 10889 పరుగులు సాధించాడు. -
జొకోవిచ్ కోచ్ ఇవానిసెవిచ్కూ కరోనా
బెల్గ్రేడ్: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఆడించిన ఆటతో కోవిడ్–19 పాజిటివ్ బాధితులు పెరిగిపోతున్నారు. అడ్రియా టూర్ ఎగ్జిబిషన్ సిరీస్ ద్వారా తాజాగా క్రొయేషియా టెన్నిస్ గ్రేట్, జొకోవిచ్ కోచ్ అయిన గొరాన్ ఇవానిసెవిచ్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. పది రోజుల క్రితం రెండుసార్లు కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని... తాజాగా మూడోసారి పాజిటివ్ వచ్చిందని గొరాన్ తెలిపాడు. లక్షణాలు లేకపోయినా తాను వైరస్ బారిన పడ్డానని చెప్పాడు. తనతో ఇటీవల సన్నిహితంగా మెలిగిన వారు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచించాడు. అడ్రియా టూర్లో సెర్బియా అంచె పోటీలు ముగిశాక.. క్రొయేషియాలో రెండో అంచె పోటీలు నిర్వహిస్తుండగా ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఫైనల్ మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇప్పటికే నిర్వాహకుడు, ఆటగాడు జొకోవిచ్ సహా, మరో ముగ్గురు ప్లేయర్లు దిమిత్రోవ్, బోర్నా చోరిచ్, విక్టర్ ట్రయెస్కీలకు వైరస్ సోకింది. -
4 రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్‌లు
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్‌లను ఏర్పాటుచేసింది. అందులో 54 కోచ్ లను ఢిల్లీలోని షకుర్బస్తి రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో 500 కోచ్‌లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో 70 కోచ్‌లు, తెలంగాణలో 60 కోచ్‌లు (సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్‌లలో 20 చొప్పున), ఆంధ్రప్రదేశ్ (విజయవాడ)లో 20 కోచ్‌లను ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ 240 కోచ్‌లు కావాలని, తెలంగాణ 60 కోచ్‌లు కావాలని గతంలో రైల్వే శాఖను కోరాయి. -
ప్రతికూలమే...కానీ ప్రాణాలేం పోవులే
న్యూఢిల్లీ: తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్న ఢిల్లీ నగరంలో మ్యాచ్ నిర్వహణకు వచ్చే ముప్పేమీ లేదని బంగ్లాదేశ్ కోచ్ రసెల్ డొమింగో అన్నారు. ‘వాతావరణం ప్రతికూలమే అయినా... ప్రాణాలు పోయేంత కష్టమేమీ లేదు. ఇది కేవలం మూడు గంటల ఆటే. మ్యాచ్ సజావుగానే జరుగుతుంది. కళ్లకు, గొంతుకు కాస్త ఇబ్బంది కలగొచ్చేమో కానీ అంతకుమించిన ముప్పేమీ ఉండదు’ అని అన్నారు. గతంలో ఇక్కడ శ్రీలంకకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందన్న సంగతి తెలుసని, బంగ్లాదేశ్‌లోనూ వాతావరణ కాలుష్యం ఉంటుందని చెప్పారు. ఇదేమీ తీవ్రంగా పరిశీలించాల్సిన అంశం కానేకాదని... ఆటగాళ్లు మ్యాచ్‌పై దృష్టి పెడితే సరిపోతుందని అన్నారు. షకీబ్ సస్పెన్షన్ ఉదంతం జట్టుపై ప్రభావం చూపుతుందని కోచ్ అంగీకరించారు. స్టార్ ఆటగాడు కీలకమైన సిరీస్‌కు లేకపోవడం లోటేనన్నారు. -
స్విమ్మింగ్ కోచ్‌పై ‘రేప్’ ఆరోపణలు!
పనాజీ: గురుపూజోత్సవం రోజున దేశంలోని ప్రముఖ ఆటగాళ్లెందరో తమకు ఓనమాలు నేర్పిన శిక్షకులను స్మరించుకుంటున్న వేళ... ఒక క్రీడా గురువు ఆ బాధ్యతకు మచ్చ తెచ్చే పని చేశాడు. తన వద్ద శిక్షణ పొందుతున్న ఒక 15 ఏళ్ల అమ్మాయిని లైంగికంగా వేధించి ఛీ కొట్టించుకున్నాడు! గోవా రాజధాని పనాజీలో ఈ ఘటన జరిగింది. బెంగాల్‌కు చెందిన సురజిత్ గంగూలీ అనే స్విమ్మింగ్ కోచ్ ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. రెండున్నరేళ్లుగా అతను పనాజీలో కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. బాధిత అమ్మాయి కూడా బెంగాల్‌కు చెందినదే. ఈ ఘటనకు సంబంధించినదిగా భావిస్తున్న ఒక వీడియో బయటకు రావడంతో గంగూలీ నిర్వాకం తెలిసింది. సదరు అమ్మాయి ఫిర్యాదుపై కోల్‌కతా పోలీసులు ముందుగా కేసు నమోదు చేసి దానిని గోవా పోలీసులకు బదిలీ చేశారు. సురజిత్‌పై వేర్వేరు సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో రేప్ (376) కూడా ఉంది. ప్రస్తుతానికి సురజిత్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు వెళ్లినట్లుగా తెలిసింది. అతడిని వెతికేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించారు. దీనిపై స్పందించిన కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
భారత హాకీ కోచ్‌గా గ్రాహం రీడ్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా దిగ్గజం గ్రాహం రీడ్ భారత పురుషుల హాకీ జట్టు కొత్త కోచ్‌గా ఎంపికయ్యారు. ఆయన 2020 ముగిసే వరకు కోచ్ పదవిలో ఉంటారని హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం అనంతరం హరేంద్ర సింగ్‌ను అనూహ్యంగా తప్పించిన తర్వాత కోచ్ పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు రీడ్ ఆ స్థానంలో బాధ్యతలు చేపడతారు. గత నెలలోనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) భారత కోచ్‌గా ఆయన పేరును సిఫారసు చేసింది. రీడ్‌కు నెలకు 15 వేల డాలర్లు (సుమారు రూ. 10 లక్షలు) వేతనంగా లభిస్తుంది. కుటుంబంతో సహా స్థిరపడిపోయి బెంగళూరు ‘సాయ్’ సెంటర్ కేంద్రంగా ఆయన పని చేయనున్నారు. ప్రత్యేక శిక్షణా శిబిరం కోసం 60 మంది ఆటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. భారత జట్టు మంచి ఫలితాలు సాధిస్తే రీడ్ కాంట్రాక్ట్‌ను 2022 ప్రపంచ కప్ వరకు పెంచే అవకాశం కూడా ఉంది. ఘనమైన రికార్డు... క్వీన్స్‌లాండ్‌కు చెందిన 54 ఏళ్ల గ్రాహం రీడ్ 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడు. నాలుగు సార్లు చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమ్‌లో కూడా ఆయన భాగంగా ఉన్నారు. డిఫెండర్, మిడ్‌ఫీల్డర్‌గా 130 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రీడ్ 36 గోల్స్ చేశారు. 2009లో కోచింగ్‌లో అడుగు పెట్టిన ఆయన 2014లో ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ నంబర్‌వన్ కావడంలో కీలక పాత్ర పోషించారు. గత ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన నెదర్లాండ్స్ టీమ్‌కు కూడా రీడ్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. ‘భారత హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. హాకీలో భారత్‌కు ఉన్నంత గొప్ప చరిత్ర మరే దేశానికి లేదు. చాలా కాలంగా భారత హాకీని దగ్గరినుంచి చూశాను. నాతో పాటు ఆటగాళ్లకు కూడా సానుకూల వాతావరణం ఉండేలా చేయడం నా పని. చాలా దూరంలో ఉన్న ఒలింపిక్స్, వరల్డ్ కప్లకంటే కూడా త్వరలో జరగనున్న టోర్నీలపైనే దృష్టి పెడతా. భారత హాకీ కోచ్ బాధ్యత చాలా ఒత్తిడితో కూడుకున్నదని నేనూ విన్నా. కానీ దానిని పట్టించుకోను’ –గ్రాహం రీడ్ -
కోచ్‌తో ఒసాకా తెగదెంపులు
టోక్యో: ప్రపంచ మహిళల టెన్నిస్ నంబర్‌వన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా (జపాన్) అనూహ్య నిర్ణయం తీసుకుంది. వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించేలా తనను తీర్చిదిద్దిన కోచ్ సషా బాజిన్‌తో (జర్మనీ) తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే దీనికి కారణాలు ఆమె వెల్లడించలేదు. ‘అందరికీ హాయ్. ఇక నుంచి కోచ్ సషా బాజిన్‌తో కలిసి నేను పనిచేయడంలేదు. ఇన్నాళ్లు ఆయన అందించిన తోడ్పాటుకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఆయనకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని 21 ఏళ్ల ఈ జపాన్ క్రీడాకారిణి తెలిపింది. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌తోపాటు గ్రాండ్‌స్లామ్ చాంపియన్స్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్), విక్టోరియా అజరెంకా (బెలారస్)లకు హిట్టింగ్ పార్ట్నర్గా వ్యవహరించిన సషా బాజిన్ 2018 ఆరంభంలో నయోమి ఒసాకాకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి వరకు కెరీర్లో ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయిన ఒసాకా... బాజిన్ శిక్షణలో రాటు దేలింది. 2018 మార్చిలో ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ ఓపెన్ టైటిల్ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనా విలిమయ్స్ను మట్టికరిపించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌నూ గెల్చుకొని ఆసియా నుంచి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ‘ధన్యవాదాలు నయోమి. నీతో కలిసి పని చేసిన కాలం అద్భుతంగా సాగింది. దీంట్లో నన్నూ భాగం చేసినందుకు కృతజ్ఞతలు’ అని సషా బాజిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. -
మో‘డిమ్’ జిమ్స్!
సాక్షి నెట్వర్క్: ఖరీదైన జిమ్ సెంటర్లకు వెళ్లిలేని వారికోసం జీహెచ్ఎంసీ మంచి ఆశయంతో ప్రారంభించిన మోడర్న్ జిమ్‌లు ఆలనాపాలనా లేక అధ్వానంగా మారాయి. పట్టించుకునే నాథుడు లేక కోట్ల రూపాయల విలువైన పరికరాలు తుప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. కనీస నిర్వహణకు నోచుకోక, ఆసక్తి ఉన్న వారికి ఉపకరించక కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. మొత్తం జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 150 జిమ్‌లు ఏర్పాటు చేయాలనుకున్నారు. 135 జిమ్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో జిమ్‌కు దాదాపు రూ.4లక్షల వంతున దాదాపు రూ.5.50 కోట్లు ఖర్చు చేశారు. అంతే కాకుండా వీటిని ఏర్పాటు చేసే హాళ్లలో మౌలిక సదుపాయాల కోసం ఆయా కమ్యూనిటీ హాళ్లు తదితర ప్రాంతాల్లో ఒక్కోదానికి రూ.5 లక్షల వంతున దాదాపు మరో రూ.7కోట్లు వెరసి జిమ్‌ల పేరిట దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేశారు. ఆధునిక జిమ్‌లు బస్తీల్లోని యువతకు ఉపకరిస్తాయని ఏర్పాటు చేసినప్పటికీ, కొద్దికాలం బాగానే పని చేసిన తర్వాత అవి మూణ్నాళ్ల ముచ్చటే అయ్యాయి. 2016లో ఏర్పాటు చేసిన ఈ జిమ్‌లు దాదాపు ఏడాదిన్నర కాలానికే ఆనవాళ్లు లేకుండాపోయాయి. చాలా వాటిల్లో పరికరాలు పాడయ్యాయి. కొన్ని చోట్ల పరికరాలు స్థానిక నేతల ఇళ్లకు చేరాయి. ఇంకొన్ని చోట్ల అసలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొంది. స్వల్ప మరమ్మతులు చేసేవారు సైతం లేక కొన్ని మూలనపడ్డాయి. ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన జిమ్‌లు పనికిరాకుండా పోయాయి. జిమ్‌లలో ట్రైనర్లు లేకపోవడంతోనూ వీటి ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదు. ఇక కొన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారో, ఎప్పుడు మూసేస్తున్నారో తెలియని దుస్థితి. దూరప్రాంతాలకు వెళ్లలేని మహిళలకు ఈ జిమ్‌లు ఎంతో సదుపాయంగా ఉంటాయని భావించినా అమలుకు నోచుకోలేదు. జిమ్‌లలో ఉచిత వైఫై సదుపాయాన్ని సైతం కల్పిస్తామని ప్రకటించినప్పటికీ తాగునీరు, టాయ్లెట్ల వంటి కనీస సదుపాయాల్లేవు. స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తప్ప వాటిని పట్టించుకుంటున్నవారు లేరు. సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేసుకోవాలని కాలనీ సంఘాలకు సూచించినా, అసలు పట్టించుకునేవారు లేక చాలాచోట్ల వెలవెలబోతున్నాయి. కొన్ని సెంటర్లలో నాసిరకం పరికరాలు ఉంచారనే ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల నాణ్యమైనవి ఇతర ప్రాంతాలకు తరలించారనే విమర్శలున్నాయి. కోట్లు వెచ్చించిన జీహెచ్ఎంసీ నిర్వహణ పట్టించుకోకపోవడంతో ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసిన జిమ్‌సెంటర్ల దుస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన.. పరికరాలు మాయం.. ఒక్కో జిమ్‌లో అత్యంత ఆధునిక సైక్లింగ్, త్రెడ్మిల్, ప్లేట్‌స్టాండ్, త్రిస్టర్, డంబెల్స్ సదుపాయాలతో సహా మొత్తం 21 పరికరాలను ఉంచినట్లు పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత వాటిని పట్టించుకోలేదు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో సీతాఫల్మండి ఇందిరానగర్, తార్నాక, మాణికేశ్వర్‌నగర్, మెట్టుగూడ, బౌద్ధనగర్లలోని జిమ్‌లకు నెలల తరబడి తాళాలు వేసి ఉండడంతో పాటు శిక్షకులు అందుబాటులో లేకపోవడంతో జిమ్‌కు వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. కొన్ని వ్యాయామ పరికరాలు విరిగిపోగా, మరికొన్ని తుప్పు పట్టి పనికిరాకుండా పోయాయి. జీడిమెట్ల డివిజన్ శ్రీనివాస్‌నగర్‌లోని జిమ్ పరికరాలు మూలనపడి తుప్పు పడుతున్నాయి. కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి అంబేడ్కర్‌నగర్ కమిటీ హాల్లోని జిమ్ ఎక్కడికి తరలిపోయిందో తెలియని పరిస్ధితి. జగద్గిరిగుట్ట డివిజన్ జగద్గిరినగర్‌లో, సూరారం డివిజన్ పరిధి నెహ్రూనగర్ కమిటీ హాల్లో ఉన్న జిమ్‌లు మూత పడ్డాయి. చింతల్ డివిజన్ భగత్‌సింగ్‌నగర్ కమ్యూనిటీ హాల్లో జిమ్ పరికరాల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. కొన్ని డివిజన్లలో ఉండాల్సిన వాటికన్నా తక్కువగా జిమ్ పరికరాలు ఉన్నాయని, స్థానికంగా ఉన్న చోటామోటా లీడర్లు ఆయా పరికారాలను సొంతానికి వాడుకుంటున్నట్లు తెలియవచ్చింది. ఇదీ పరిస్థితి... ⇔ గాజులరామారం సర్కిల్ పరిధి రంగారెడ్డినగర్ డివిజన్ ఆదర్శనగర్ కమిటీ హాల్, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి సుభాష్‌నగర్ డివిజన్ అపురూప కాలనీ కమిటీ హాల్లో ఉన్న మోడ్రన్ జిమ్‌లో నెల రుసుము వసూలు చేస్తున్నారు. మోడ్రన్ జిమ్‌లు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంచాల్సి ఉండగా ఈ రెండు జిమ్‌లలో మాత్రం నెలకు రూ.200 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ⇔ జియాగూడ ఎంసీహెచ్ క్వార్టర్స్ అంబేద్కర్ భవన్లో మొదటి అంతస్తులో జిమ్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ప్రారంభించడంతో సామగ్రి జిమ్ కేంద్రంలో ఉంచుతున్నారు. వాటిలో చాలా వరకు చోరీకి గురయ్యాయని యువకులు ఆరోపిస్తున్నారు. రహీంపురాలోని జిమ్‌ను కేవలం ఉదయం వేళల్లో మాత్రమే తెరుస్తున్నారని స్థానికులు తెలిపారు. ⇔ శాస్త్రినగర్‌లో ఏర్పాటు చేసిన జిమ్‌లోని పరికరాలు దుమ్ముకొట్టుకుపోయాయి. గదినిండా చెత్తాచెదారం పేరుకుపోయింది. రాంనగర్ డివిజన్ హరినగర్ కమ్యూనిటీ హాల్లో పరికరాలు వృథాగా పడి ఉన్నాయి. బండమైసమ్మ నగర్‌లోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన జిమ్ తాళం తీసే నాథుడే లేడు. ⇔ ఉప్పల్ సర్కిల్లో నాణ్యత లేని పరికరాలు ఎక్కడికక్కడ జామ్ అయిపోయాయి. కొన్ని చోట్ల వంగిపోయాయి. మరికొన్ని చోట్ల సీట్లు ఊడి చెదలు పట్టాయి. బాడీ గ్రోత్ యంత్రం వైర్లు తెగిపడి మూలన పడ్డాయి. జిమ్‌లలో కోచ్‌లు లేకపోవడంతో చాలామంది ప్రైవేట్ జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఉప్పల్ లక్ష్మారెడ్డి కాలనీలోని వార్డు కార్యాలయంలో రెండో అంతస్తులో ఏర్పాటు చేసిన జిమ్‌కు రోజుకు ఒకరిద్దరు మాత్రమే వచ్చి పోతున్నారు. ⇔ చిలుకానగర్ డివిజన్లో బీరప్పగడ్డలోని కమ్యూనిటీహాలులో ఏర్పాటు చేసిన జిమ్‌లో కనీస వసతులు లేవు. దీంట్లో ట్రేడ్మిల్ మాత్రమే పనిచేస్తోంది. మిగిలిన యంత్రాలన్నీ మూలనపడ్డాయి. రామంతాపూర్ ప్రగతినగర్ జిమ్‌లో పరికరాలు పాడైనా మరమ్మతులు చేసేవారు లేరు. ⇔ రామ్‌రెడ్డినగర్‌లోని జిమ్ గత రెండు నెలలుగా మూతపడింది. సర్కిల్లో వినియోగంలో ఉన్న జిమ్‌లలో రూ.300 ఫీజులు వసూలు చేస్తుండటంతో ఎవరూ ఆసక్తి చూపడం లేరు. ఏఎస్‌రావునగర్ డివిజన్ కమలానగర్ కమ్యూనిటీ హల్లో ఏర్పాటు చేసిన జిమ్‌ను యువకులు, మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. స్ధానిక కార్పొరేటర్‌కు, కాలనీ అసోసియేషన్ నాయకులకు మధ్య ఉన్న విభేదాల కారణంగా ఇప్పటికీ జిమ్‌ను అధికారికంగా ప్రారంభించలేదు. కాలనీ అసోసియేషన్‌పై అంతస్థులోని హాల్లో పరికరాలుంచారు. మోయలేని భారం.. ⇔ జిమ్‌ల నిర్వహణను కాలనీవాసులకు వదిలేసి చేతులు దులుపుకోవడంతో అవి ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరడం లేదు. ఎల్బీనగర్ సర్కిల్లో పలుచోట్ల సౌకర్యాలు, కోచ్‌లు లేక జిమ్‌లు మూతపడగా, మరికొన్ని చోట్ల కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో భారంగా నడుస్తున్నాయి. కోచ్ జీతం, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, స్వీపింగ్, యంత్రాల సర్వీసింగ్ ఖర్చులు తడిసి మోపడవుతుండడంతో ‘జిమ్‌లు మాకొద్దు బాబంటూ..’ కాలనీ సంక్షేమ సంఘాలు వాపోతున్నాయి. ⇔ హయత్‌నగర్ డివిజన్లో శారదానగర్ కాలనీ సంక్షేమ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన జిమ్ కేంద్రానికి రోజుకు 10 మంది మాత్రమే వస్తున్నారని, వారి వద్ద వసూలు చేస్తున్న రూ.3వేలు దేనికీ సరిపోవడం లేదని కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పేర్కొంటున్నారు. కోచ్ జీతం రూ.8వేలు, ఇతర ఖర్చులు కలుపుకొని నెలకు రూ.12వేల వరకు ఖర్చవుతోందని, జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి సహకారం లేదని కాలనీ కార్యదర్శి కేఎల్‌ఎన్‌రావు పేర్కొన్నారు. తమకు గుదిబండగా మారిన జిమ్‌ను ఇక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని ఆయన కోరారు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లో విజయపురి ఫేజ్–2కాలనీ సంక్షేమ సంఘం భవనంలోని జిమ్‌కు కోచ్, నీటి వసతి, టాయ్లెట్ల సౌకర్యం లేకపోవడంతో జిమ్ నిరుపయోగంగా మారింది. -
రాయల్స్ కోచ్‌గా ఆప్టన్
ముంబై: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ కోచ్‌గా మళ్లీ ప్యాడీ ఆప్టన్‌ను నియమించారు. గతంలో నాలుగేళ్ల పాటు రాయల్స్‌కు ఆయన కోచ్‌గా పనిచేశారు. 2013 ఐపీఎల్లో శ్రీశాంత్ సహా ముగ్గురు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన సీజన్లో ఆప్టనే కోచ్‌గా ఉన్నారు. అలాగే భారత జట్టు మెంటల్ కండిషనింగ్ కోచ్‌గా విజయవంతమైన పాత్ర పోషించారు. టీమిండియా వన్డే ప్రపంచకప్ (2011) ఘనతలో అప్పటి హెడ్ కోచ్ కిర్‌స్టెన్‌తో పాటు ఈయనకు భాగముంది. ఐపీఎల్‌తో పాటు బిగ్‌బాష్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌ల్లోనూ పలు జట్లకు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆప్టన్ మార్గదర్శనంలోనే సిడ్నీ థండర్స్ 2016లో బిగ్‌బాష్ విజేతగా నిలిచింది. అప్టన్ మళ్లీ తమ జట్టుతో కలవడం సంతోషంగా ఉందని రాయల్స్ సహయజమాని మనోజ్ తెలిపారు. -
ఆ ఒక్కరు ఎవరో?
ముంబై: డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, ప్రచారానికి ప్రచారం వస్తుండటంతో భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి ఇప్పుడొక హాట్ కేక్‌లా మారిపోయింది. ఒకప్పుడు హడావుడే లేకుండా, చాలా సాదాసీదాగా సాగిపోయి, ఎవరిని ఎంపిక చేశారో మీడియాలో వస్తేగాని తెలియనంతగా సాగిన ప్రక్రియ... నేడు స్వదేశీయులతో పాటు దిగ్గజాలనదగ్గ విదేశీ మాజీ కోచ్‌లు కూడా పోటీ పడే స్థాయికి వచ్చింది. పదుల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను పది మందికి కుదించి, కమిటీ ఏర్పాటు చేసి వారిలో ఒకరిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసే దశకు చేరింది. దరఖాస్తులు 28... మహిళల క్రికెట్ జట్టు కొత్త కోచ్ ఎవరో తేల్చే బాధ్యతను దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల అడ్‌హక్ కమిటీ చేతుల్లో పెట్టారు. మాజీ క్రికెటర్లు అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి ఈ కమిటీలోని ఇతర సభ్యులు. రెండేళ్ల కాల వ్యవధి ఉండే ఈ పదవికి మొత్తం 28 దరఖాస్తులు రాగా 10 మందిని (గ్యారీ కిర్‌స్టెన్, హెర్షల్ గిబ్స్, ట్రెంట్ జాన్స్టన్, మార్క్ కోల్స్, దిమిత్రి మస్కరెనాస్, బ్రాడ్ హగ్‌తో పాటు తాజా మాజీ కోచ్ రమేశ్ పొవార్, భారత మాజీ క్రికెటర్లు మనోజ్ ప్రభాకర్, డబ్ల్యూవీ రామన్, వెంకటేశ్ ప్రసాద్) షార్ట్‌లిస్ట్ చేశారు. కపిల్ కమిటీ వీరికి గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. రాయ్ అలా.. ఎడుల్జీ ఇలా.. మరోవైపు కోచ్ ఎంపికపై సుప్రీంకోర్టు నియమిత క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) సభ్యులు వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ పూర్తి భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించాలని రాయ్... బీసీసీఐని ఆదేశించగా, పొవార్‌ను వచ్చే నెలలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ పర్యటన వరకైనా కొనసాగించాలని ఎడుల్జీ కోరుతున్నారు. ఎవరి అవకాశం ఎంత? రమేశ్ పొవార్: తాత్కాలిక ప్రాతిపదికపై ఇటీవలి ప్రపంచ కప్ వరకు ఇతడు బాధ్యతలు నిర్వర్తించాడు. గత నెల 30తో ఒప్పందం పూర్తయింది. ప్రపంచకప్ సెమీస్‌లో సీనియర్ బ్యాటర్ మిథాలీరాజ్‌ను ఆడించకపోవడంతో తీవ్రంగా వివాదాస్పదుడయ్యాడు. కోచ్ వ్యవహార శైలిపై మిథాలీ నేరుగా ధ్వజమెత్తింది. మొదట రేసులో లేకున్నా టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కోరడంతో మళ్లీ పోటీలో నిలిచానంటున్నాడు. ఎడుల్జీ మద్దతు కూడా ఉంది. అయితే... ఇంత జరిగాక, ఆటగాడిగానూ గొప్ప రికార్డులు లేని పొవార్‌ను మళ్లీ ఎంపిక చేస్తారా? అన్నది సందేహమే. గ్యారీ కిర్‌స్టెన్: గొప్ప బ్యాట్స్‌మన్, అంతేస్థాయిలో కోచ్‌గానూ ఫలితాలు రాబట్టాడు. భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించడంలో కిర్‌స్టెన్ పాత్ర అందరికీ తెలిసిందే. స్నేహభావంతో ఉంటూనే ఆటగాళ్ల నుంచి ఫలితాలను రాబట్టుకోగల నేర్పరి. ప్రొఫెషనల్‌గా చెప్పాలంటే ఈ దశలో మహిళల జట్టుకు కావాల్సిన కోచ్. వెంకటేశ్ ప్రసాద్: టీమిండియా మాజీ పేసర్. మన జాతీయ, అండర్–19 జట్లతో పాటు బంగ్లాదేశ్, ఐపీఎల్‌లోనూ కోచ్‌గా వ్యవహరించిన అనుభవం ఉంది. నెమ్మదస్తుడు. అయితే, కోచ్‌గా గొప్ప ఫలితాలు రాబట్టిన రికార్డు లేదు. 2009లో పురుషుల జట్టు బౌలింగ్ కోచ్‌గా ఉన్న వెంకటేశ్ ప్రసాద్‌ను బీసీసీఐ అర్ధంతరంగా తొలగించింది. అయితే, వివాదాలకు దూరంగా ఉండే స్వదేశీ కోచ్ కావాలనుకుంటే మొగ్గు ఇతడివైపే ఉంటుంది. మనోజ్ ప్రభాకర్: కపిల్‌దేవ్‌తో ఒకప్పుడు కొత్త బంతిని పంచుకున్న భారత మాజీ ఆల్ రౌండర్. తర్వాత కపిల్‌తో తీవ్ర విభేదాలు తలెత్తాయి. మ్యాచ్ ఫిక్సింగ్‌లో నిషేధానికి గురయ్యాడు. రెండేళ్ల క్రితం భారత్‌లో టి20 ప్రపంచకప్ ఆడిన అఫ్గానిస్తాన్ కోచ్ ప్రభాకరే. ఢిల్లీ రంజీ జట్టు బౌలింగ్ కోచ్‌గా, రాజస్తాన్ హెడ్ కోచ్‌గా పనిచేశాడు. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా గతంలో ఢిల్లీ ఇతడికి ఉద్వాసన పలికింది. గిబ్స్: మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతాల్లో తీవ్ర వివాదాస్పదుడు. బ్యాట్స్‌మన్ అయినప్పటికీ కోచ్‌గా రికార్డేమీ లేదు. ఆటలోలాగే ప్రవర్తనలోనూ దూకుడైన గిబ్స్‌ను మహిళల జట్టు శిక్షకుడిగా నియమించడం అంటే... కొత్త రకం వివాదాలను కోరి తెచ్చుకోవడమే. డబ్ల్యూవీ రామన్: టీమిండియా మాజీ ఓపెనర్. ఆటగాడిగా కంటే కోచ్‌గానే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. భారత అండర్–19తో పాటు బెంగాల్, తమిళనాడు రంజీ జట్లకు, ఐపీఎల్లో కోల్‌కతా, పంజాబ్ జట్లకు శిక్షకుడిగా వ్యవహరించాడు. క్రికెట్‌పై విశేష పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఇంటర్వ్యూలో మెప్పించగలిగితే అవకాశం ఉండొచ్చు. -
చాపెల్‌కు చేత కాలేదు!
న్యూఢిల్లీ: గ్రెగ్ చాపెల్ భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్న కాలంలో సీనియర్ ఆటగాళ్లతో ఏర్పడిన విభేదాల గురించి క్రికెట్ ప్రపంచం మొత్తానికి తెలుసు. సచిన్, గంగూలీ తదితరులు తాము ఆ సమయంలో ఎలా ఇబ్బంది పడ్డామో గతంలోనే చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తన ఆటోబయోగ్రఫీ ‘281 అండ్ బియాండ్’లో అతను ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఒక అగ్రశ్రేణి జట్టుకు కోచ్‌గా ఎలా వ్యవహరించాలో చాపెల్‌కు తెలీదని లక్ష్మణ్ విమర్శించాడు. ‘అతని పదవీకాలం మొత్తం ఒక చేదు జ్ఞాపకం. ఒక అంతర్జాతీయ క్రికెట్ జట్టును ఎలా నడిపించాలో అతనికి తెలియదు. మైదానంలో ఆడాల్సింది క్రికెటర్లు మాత్రమేనని కోచ్ కాదనే విషయాన్ని అతను మరచిపోయినట్లు అనిపించేది. చాలా మంది మద్దతుతో భారత జట్టుకు కోచ్‌గా వచ్చిన అతను జట్టును ఇబ్బందుల్లో నెట్టేసి వెళ్లిపోయాడు. నా కెరీర్లో ఘోరంగా విఫలమైన దశలో అతని పాత్ర కూడా ఉంది. అతని ఆలోచనలు సఫలమయ్యానని ఆ సమయంలో వచ్చిన కొన్ని ఫలితాలు చూస్తే అనిపిస్తుంది కానీ నిజానికి వాటికి అతనికి ఎలాంటి సంబంధం లేదు. ముందే ఒక అభిప్రాయం ఏర్పరుచుకొని దాని ప్రకారమే పని చేసేవాడు తప్ప పరిస్థితికి తగినట్లుగా మారలేదు. అప్పటికే సమస్యల్లో ఉన్న జట్టులో అతను మరిన్ని విషబీజాలు నాటాడు. కోచ్ కొంత మందినే ఇష్టపడుతూ వారి గురించే పట్టించుకునేవాడు. మిగతావారంతా ఎవరి బాధలు వారు పడాల్సిందే. మా కళ్ల ముందే జట్టు ముక్కలైంది’ అని వీవీఎస్ తన పుస్తకంలో వివరించాడు. -
పొవార్ చాలు ఇక.. పో?
సాక్షి, ముంబై: టీమిండియా మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రమేశ్ పొవార్‌ను సాగనంపేందుకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. కోచ్‌గా నేటి(శుక్రవారం)కి పొవార్ కాంట్రాక్టు పూర్తవనుండటంతో టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తులు కోరుతూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆహ్వానించింది. అయితే.. మళ్లీ కోచ్ కోసం పొవార్ దరఖాస్తు చేసుకునే వెసులబాటు ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అతడి కాంట్రాక్టును పొడిగించేందుకు బీసీసీఐ అంత సుముఖంగా లేన్నట్లు తెలుస్తోంది. మిథాలీ రాజ్‌ని తప్పిం చడం గురించి టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రస్తావిస్తూ, విరాట్ కోహ్లికి కూడా ఇలాగే చేస్తారా అని ప్రశ్నించడంతో బీసీసీఐ సమాలోచనలో పడినట్టు సమాచారం. (అడుగడుగునా అవమానించారు ) వెస్టిండీస్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్‌ను పక్కకు పెట్టడం వివాదస్పదమైన విషయం తెలిసిందే. మంచి ఫామ్ మీదున్న మిథాలీని తప్పిస్తూ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, కోచ్ రమేష్ పొవార్, సెలెక్టర్ సుధా షా నిర్ణయం పట్ల అటు ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. (ఇది నా జీవితంలో చీకటి రోజు: మిథాలీ) ఇక కోచ్ తనను అవమానించినట్లు మిథాలీ రాజ్ ఆవేదన వ్యక్తం చేయడం, సీనియర్లతో భేదాభిప్రాయాలు, విపరీతమైన ఈగో, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు గెలిచిన జట్టునే కొనసాగించాలని పట్టుబట్టడం వంటి కారణాలు పొవార్‌కు వ్యతిరేకంగా మారాయి. అటు సోషల్ మీడియాలో మిథాలీకి పెద్ద ఎత్తున మద్దతు పెరగటం, రమేష్ పొవార్‌ను ట్రోల్ చేస్తుండటం తెలిసిందే. (మిథాలీ బెదిరించింది: పొవార్) -
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ హెడ్ కోచ్‌గా హెసన్
మొహాలి: వచ్చే ఏడాది ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కొత్త కోచ్‌తో బరిలోకి దిగనుంది. ఇప్పటివరకు హెడ్ కోచ్‌గా ఉన్న బ్రాడ్ హాడ్జ్ (ఆస్ట్రేలియా)ను తప్పించి అతని స్థానంలో న్యూజిలాండ్ జట్టు మాజీ కోచ్ మైక్ హెసన్‌ను నియమించింది. ఈ మేరకు అతనితో రెండేళ్లపాటు ఒప్పందం చేసుకున్నామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సీఈఓ సతీశ్ మీనన్ తెలిపారు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ జట్టును ఫైనల్‌కు చేర్చిన హెసన్ ఈ ఏడాది జూన్‌లో తన పదవికి రాజీనామా చేశారు. -
క్రీడాకుసుమం రమాదేవి
పశ్చిమగోదావరి, ఏలూరు రూరల్ : ఒకనాడు గల్లీ క్రికెట్ ఆడిన ఓ బాలిక నేడు ఆంధ్ర క్రికెట్ మహిళ జట్టుకు కోచ్‌గా రాణిస్తోంది. అంతే కాదు గ్రామీణ బాలికలను క్రికెటర్లుగా తీర్చిదిద్ది జిల్లా జట్టుకు అద్భుత విజయాలు అందిస్తోంది. జెంటిల్మెన్ క్రీడను జెంటిల్‌ఉమెన్ క్రీడగా మార్చేస్తోంది. ఆమె భీమవరం మండలం రాయలం గ్రామస్తులు రాజు, వెంకటలక్ష్మీ కుమార్తె సంపాద రమాదేవి. ప్రాణంగా బావించిన క్రికెట్‌ను జీవనంగా మార్చుకుంది. నేడు జిల్లా బాలికల క్రికెట్ జట్లు సాధిస్తున్న విజయాల వెనక కోచ్ రమాదేవి కృషి దాగి ఉంది. ఆమె వద్ద శిక్షణ పొందుతున్న అనేకమంది జిల్లా బాలికలు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. జిల్లా, జోన్, రాష్ట్రస్థాయి పోటీల్లో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. ఆంధ్ర జట్టులో సైతం చోటు సాధించారు. జెంటిల్మెన్ క్రీడగా పేరు పొందిన క్రికెట్‌ను జెంటిల్ ఉమెన్ క్రీడగా మార్చేస్తోంది. 2017లో అండర్–19 ఆలిండియా చాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్ర జట్టును విజయపథంలో నిలిపి రూ.10 లక్షల నగదు బహుమతిని అందించింది. గత నాలుగేళ్లుగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ దేవరపల్లి, దుద్దుకూరు, ఏలూరు, గూటాల, రామన్నపాలెంలో సుమారు 61 మంది గ్రామీణ బాల బాలికలను క్రికెటర్లుగా తీర్చిదిద్దింది. మహిళా కోచ్‌గా ఈమె సాధిస్తున్న విజయాలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సైతం గుర్తించి ఇటీవల ఆ«ంధ్ర మహిళల టీ20 జట్టుకు శిక్షకురాలుగా నియమించింది. ఇప్పటికే రమాదేవి ఏసీఎ లెవెల్–1 ఎ గ్రేడ్, ఎన్సీఎ లెవెన్–1లో పాల్గొంది. క్రీడాకారిణిగా విజయాలు చిన్నప్పుడు అన్నయ్యతో కలిసి గల్లి క్రికెట్ ఆడిన రమాదేవి క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణిస్తూ జిల్లాస్థాయి నుంచి ఆంధ్ర జట్టు స్థాయికి ఎదిగింది. అండర్–16, అండర్–19, అండర్–23, సీనియర్ విభాగాల్లో ఆంధ్ర జట్టుకు అనేకసార్లు ప్రాతినిధ్యం వహించింది. జిల్లా సీనియర్ జట్టుకు 13 ఏళ్ల పాటు కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించింది. అండర్–19 రాష్ట్ర జట్టులో 3 ఏళ్లు, సీనియర్ జట్టులో–8 ఏళ్ల పాటు క్రీడాకారిణిగా కొనసాగడం విశేషం. 5 వికెట్లు చొప్పున 9 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు తీసి అభిమానులను అబ్బురపరిచింది. 700 వికెట్లు, 75కు పైగా హాఫ్‌సెంచరీలు, 4 సెంచరీలు చేసి బాలికల్లో స్ఫూర్తి నింపి ఆటపై మక్కువ కలిగేలా చేసింది. నా శిష్యులనుజాతీయజట్టులో చూడాలి కనీసం 5గురు జిల్లా బాలికలు జాతీయజట్టులో చోటు సాధించేలా కృషి చేయడమే నా జీవిత లక్ష్యం. అందుకోసమే నేను కోచింగ్‌ను వృత్తిగా చేసుకున్నాను. జిల్లా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో నా లక్ష్యం నెరవేర్చుకుంటా. క్రికెట్ అంటే కేవలం మగపిల్లలకే కాదు. ఆడపిల్లలు కూడా ఆడేలా పెద్దలు ప్రోత్సహించాలి.– రమాదేవి -
గమ్మత్తయిన కోచ్
ఏదైనా సినిమాలో తమ పాత్రకు అనుగుణంగా డ్యాన్సింగ్‌కో, కొత్త భాష నేర్చుకోవడానికో నటీనటులు ట్రైనర్స్‌ని పెట్టుకుంటారు. అయితే హాలీవుడ్ యాక్టర్ నికొలస్ కేజ్ మాత్రం తాగడం కోసం ఓ కోచ్‌ను పెట్టుకున్నారు. ‘లీవింగ్ లాస్‌వేగాస్’ అనే చిత్రంలో మద్యానికి బానిసైన రచయితగా నికొలస్ నటించాలి. ఆ పాత్ర కోసం డ్రింకింగ్ కోచ్‌ని పెట్టుకోవల్సి వచ్చింది. సినిమా షూటింగ్ చేసే రోజులన్నీ అతన్ని సెట్లోనే ఉండమని, అతని ఆహార్యాన్ని గమనిస్తూ ఈ సినిమాను పూర్తి చేశారట. ఈ విషయాన్ని ఇటీవల నికొలస్ తెలిపారు. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్‌గా కేజ్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్నారు. అన్నట్లు.. నికొలస్‌కు మద్యం అలవాటు లేక కోచ్‌ని పెట్టుకున్నారను కుంటున్నారా? అదేం లేదు. అయితే బానిస అయిన వ్యక్తిగా నటించాలి కదా.. అందుకే. -
ఆర్సీబీ కోచ్‌గా కిర్‌స్టెన్
బెంగళూరు: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించారు. హెడ్ కోచ్‌గా వ్యవహరించిన డానియెల్ వెటోరి స్థానంలో కిర్‌స్టెన్‌కు బాధ్యతలు అప్పగించారు. ప్లేయర్‌గా 2014లో జట్టులోకి వచ్చిన వెటోరి తదనంతరం హెడ్ కోచ్‌గా ఈ సీజన్ వరకు పని చేశారు. వెటోరి కోచ్‌గా ఉన్న సమయంలో ఆర్సీబీ పెద్దగా ప్రభావం చూపలేకపోగా, ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయింది. గ్యారీ శిక్షణలోనే భారత్ 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్‌గా ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. -
జింబాబ్వే కోచ్‌గా రాజ్‌పుత్
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ జింబాబ్వే జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నారు. మూడేళ్ల కాలానికి రాజ్‌పుత్‌ను కోచ్‌గా నియమించినట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడిన 56 ఏళ్ల రాజ్‌పుత్ రంజీల్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ‘కోచ్‌గా ఎంపికైనందుకు ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని ఆయన అన్నారు. తొలి టి20 వరల్డ్‌కప్ చేజిక్కించుకున్న ధోని సేనకు రాజ్‌పుత్ మేనేజర్‌గా వ్యవహరించారు. గతంలో ఆయన అఫ్గానిస్తాన్ జట్టుకు హెడ్ కోచ్‌గాను పనిచేశారు. -
ఆ గందరగోళం పోయింది
న్యూఢిల్లీ: విదేశీ కోచ్‌ల భాషతో ఇబ్బంది ఉండేదని... మ్యాచ్ విరామ సమయాల్లో వారు ఇచ్చే సూచనలు అర్థం చేసుకోవడానికి చాలా కష్ట పడాల్సి వచ్చేదని భారత హాకీ జట్టు సీనియర్ ఆటగాళ్లు సర్దార్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మే నుంచి భారత పురుషుల హాకీ జట్టుకు హరేంద్ర సింగ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి భాష ఇబ్బందులు తొలగిపోయాయని ఇప్పుడు కోచ్ చెప్పే విషయంపై దృష్టి పెడితే సరిపోతోందని... దాన్ని అనువదించుకోవాల్సిన పనిలేకుండా పోయిందని అన్నారు. ‘హరేంద్రతో 16 ఏళ్ల క్రితం నుంచే పరిచయం ఉంది. ఆయనతో ఏ విషయాన్నైనా చర్చించే అవకాశం ఉంటుంది. విదేశీ కోచ్‌లు ఉంటే మ్యాచ్ మధ్య లభించే రెండు నిమిషాల విరామ సమయాల్లో వారు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. ఒక్కోసారి సరిగ్గా అర్థంకాక గందరగోళానికి గురయ్యే వాళ్లం. స్వదేశీ కోచ్ ఆధ్వర్యంలో ఆడటంతో ఆ తేడా స్పష్టమవుతోంది’ అని సర్దార్ సింగ్ తెలిపారు. ‘ఆటగాళ్ల బలాబలాల విషయంలో హరేంద్రకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన ప్లేయర్ల ఆటతీరును మార్చుకోమని చెప్పడు... చిన్న చిన్న సర్దుబాట్లతో వారిని మరింత రాటుదేలేలా చేస్తారు’ అని మన్‌ప్రీత్ పేర్కొన్నాడు. ఈ నెల 18 నుంచి జకార్తా వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గాలనే ధృడ సంకల్పంతో భారత జట్టు ప్రాక్టీస్ కొనసాగిస్తోంది. ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిస్తే 2020 (టోక్యో) ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందనుంది. -
రేసులో సునీల్ జోషి, రమేశ్ పవార్
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ స్పిన్నర్లు సునీల్ జోషి, రమేశ్ పవార్లు పోటీపడుతున్నారు. 2017 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చిన కోచ్ తుషార్ అరోథె... సీనియర్ క్రీడాకారిణులతో వచ్చిన విభేదాల కారణంగా తన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో బీసీసీఐ కొత్త కోచ్ కోసం ప్రకటన విడుదల చేసింది. దీనికి 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాలో మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా, విజయ్ యాదవ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ మమత మాబెన్, సుమన్ శర్మ, న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ మారియా ఫహే తదితరులు ఉన్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం సునీల్ జోషి, రమేశ్ పవార్ల మధ్య ఉండనుంది. జోషి టీమిండియా తరఫున 15 టెస్టులు, 69 వన్డేలు ఆడగా... పవార్ 2 టెస్టులు, 31 వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. పవార్ ప్రస్తుతం మహిళా జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తుండగా... జోషి మొన్నటి వరకు బంగ్లాందేశ్‌కు కోచ్‌గా పనిచేశాడు. శుక్రవారం ముంబైలో సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ, బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జీఎం సబా కరీమ్, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. -
హిమదాస్ కోచ్‌పై లైంగిక ఆరోపణలు
న్యూఢిల్లీ : ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించి హిమదాస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే హిమదాస్ వంటి అద్బుతమైన అథ్లెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ నిపన్దాస్పై లైంగిక ఆరోపణలు రావడం సంచలనం రేపింది. తనను లైంగికంగా వేధించాడని ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న ఓ మహిళా క్రీడాకారిణి గత నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత మే నేలలో నిపన్ దాస్ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో ఎంతో మంది అథ్లెట్లకు నిపన్‌దాస్ శిక్షణనిస్తున్నాడు. హిమదాస్ సైతం ఆయన శిక్షణలోనే రాటుదేలింది. ఆ ఆరోపణలు అవాస్తవం.. ఈ ఆరోపణలను నిపన్‌దాస్ ఖండిచారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆమె చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి., కల్పితమైనవి. ఆమె నా దగ్గర 100మీ, 200 మీటర్ల విభాగాల్లో శిక్షణ తీసుకునేది. రాష్ట్ర జట్టులో చోటు కల్పించాలని ప్రాధేయపడేది. కానీ ఆమె కన్నా వేగంగా పరుగెత్తే వారు ఉండటంతో నేను సహకరించలేదు. జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా రాష్ట్ర జట్టులో చోటు దక్కలేదు. దీంతోనే ఆమె అసత్య ఆరోపణలు చేస్తుంది. ప్రస్తుతం పోలీస్ విచారణ కొనసాగుతున్నది. నాతో పాటు సహాయక కోచ్‌లు, కొంత మంది అథ్లెట్లను విచారించారు. దర్యాప్తులో ఎలాంటి మచ్చలేకుండా బయటపడుతానన్న నమ్మకం ఉంది’ అని నిపన్ చెప్పుకొచ్చాడు. చదవండి : టాలెంట్‌కి ప్రశంసలేనా.. ఇంకేం లేదా? కన్నీళ్లురాని ఇండియన్ ఉండరు.. వైరల్ -
టీ10 లీగ్‌లో కోచ్‌గా సెహ్వాగ్
దుబాయ్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరో జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం సెహ్వాగ్ వ్యాఖ్యాతగా విధులు నిర్వర్తించడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్‌గా వ్యవహారిస్తున్నాడు. అయితే, తాజాగా సెహ్వాగ్ మరో జట్టుతో బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నాడు. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన టీ10 క్రికెట్ లీగ్‌లో మరాఠా అరేబియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సెహ్వాగ్.. ఈ ఏడాది అదే జట్టుకు బ్యాటింగ్ కోచ్ బాధ్యతల్ని చేపట్టనున్నాడు. ఈ మేరకు బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు సెహ్వాగ్ అంగీకరించిన విషయాన్ని మరాఠ అరేబియన్స్ సహ యజమాని పర్వేజ్ ఖాన్ వెల్లడించారు. ఈ లీగ్ రెండో సీజన్ నవంబర్‌లో జరగనుంది. -
క్రీడాకారిణిపై కోచ్ అఘాయిత్యం
చండీగఢ్ : తనపై కోచ్ రెండున్నరేళ్ల నుంచి అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ వాలీబాల్ క్రీడాకారిణి ఫిర్యాదు చేయడం హరియాణాలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని రివారీ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక వాలీబాల్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమెపై కన్నేసిన కోచ్ గౌరవ్ దేశ్వాల్ గత రెండున్నరేళ్లుగా అనేక సార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆమె మౌనంగా ఉన్నారు. తన భవిష్యత్తు దృష్ట్యాలో ఉంచుకొని ఆ బాలిక ఇన్ని రోజులు వేధింపులను భరించారు.. అయితే ఇటీవలే కోచ్ నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో క్రీడాకారిణీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుర్గావ్, రోహతక్‌తో పాటు పలు ప్రాంతాలకు తనను తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. గౌరవ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనిని ఇంత వరకు అరెస్ట్ చేయలేదు. దీనిపై వివరణ కోరగా.. విచారణ పూర్తయిన తర్వాత కోచ్‌ను అరెస్ట్ చేస్తామని తెలిపారు. -
ఆ క్షణం అద్భుతం
చియాంగ్ రాయ్: థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుని 18 రోజుల తర్వాత బయటపడిన 12 మంది బాలురు, వారి ఫుట్‌బాట్ కోచ్ బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జయి ఇళ్లకు చేరుకున్నారు. ఆస్పత్రి బయట ఈ సందర్భంగా వారు తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. గుహ నుంచి బయటపడటం ఓ అద్భుతమని పిల్లలు వ్యాఖ్యానించారు. రెండు వారాలకుపైగా గుహలో ఉండటంతో ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకి ఉంటాయేమోనన్న అనుమానంతో వారిని చియాంగ్రాయ్లోని ఓ ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచడం తెల్సిందే. తొలుత పిల్లలను గురువారం ఇళ్లకు పంపాలని నిర్ణయించినప్పటికీ ఒకరోజు ముందుగానే వారిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అందరు పిల్లలతోపాటు, వారి కోచ్ కూడా పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. కాగా, ఇళ్లకు వెళ్లాక నెలపాటు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా పిల్లలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేలా చూడాలని వైద్యులు సూచించారు. ఆ గుహలోని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడం వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడగనున్న ప్రశ్నలను ప్రభుత్వం ముందుగానే తెప్పించుకుని, మానసిక వైద్యులకు చూపించి, బాలుర ఆరోగ్యానికి ఏ ఇబ్బందీ ఉండదనుకున్న ప్రశ్నలనే అనుమతించారు. పిల్లలు ఇళ్లకు రావడంతో అమితానందంగా ఉందని, ఈ రోజు ఓ శుభదినమని బాలుర కుటుంబ సభ్యులు చెప్పారు. -
తాత్కాలిక కోచ్‌గా మాజీ స్పిన్నర్!
న్యూఢిల్లీ: ఇటీవల భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ పదవికి తుషార్ అరోథి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో తాత్కాలిక కోచ్‌గా మాజీ ఆఫ్ స్పిన్నర్ రమేశ్ పవార్‌కు బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా మహిళా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ బిజూ జార్జ్‌తో కలిసి పవార్ పని చేసేందుకు రంగం సిద్దమైంది. జూలై 25 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ బెంగళూరులో జరిగే భారత మహిళా క్రికెట్ జట్టు శిక్షణా శిబిరంలో పవార్ పాల్గొనున్నాడు. ఈ క్రమంలోనే పవార్‌కు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. ఇప్పటికే మహిళా క్రికెట్ కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దరఖాస్తులు స్వీకరించడానికి ఆఖరి తేదీ జూలై 20. దరఖాస్తు చేసుకునే వ్యక్తికి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడిన అనుభవంతో పాటు 55 ఏళ్లలోపు వయసు కల్గి ఉండాలి. ఈ విషయాన్ని బీసీసీఐ తన వెబ్సైట్లో పొందుపరిచింది. అయితే కోచ్‌ను ఎంపిక చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా నియమించినట్లు తెలుస్తోంది. -
మీ పిల్లలు క్షేమం.. నన్ను క్షమించండి
మే సాయ్ (థాయ్‌లాండ్): గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ జట్టులోని పిల్లల తల్లిదండ్రులకు వారి కోచ్ ఎకపోల్ ఛంథవాంగ్ క్షమాపణలు తెలిపారు. తామంతా క్షేమంగానే ఉన్నామనీ, తమ కుటుంబ సభ్యులు బాధపడకుండా ధైర్యంగా ఉండాలని బాలురు కూడా కోరారు. గుహలో చిక్కుకుపోయిన తర్వాత తొలిసారిగా కోచ్, పిల్లలు కలిసి తల్లిదండ్రులకు లేఖలు రాశారు. ఈ లేఖలను సహాయక బృందంలోని డైవర్లు తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ‘బాలుర తల్లిదండ్రులకు నా క్షమాపణలు. పిల్లలంతా క్షేమంగానే ఉన్నారు. సహాయం చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు’ అని ఎకపోల్ తన లేఖలో పేర్కొన్నారు. మరో బాలుడు రాసిన లేఖలో ‘నేను ఇక్కడ బాగానే ఉన్నాను. నా పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేయడం మరచిపోకండి’ అని ఉంది. టున్ అనే మరో బాలుడు ‘అమ్మా, నాన్న! దయచేసి బాధపడకండి. నేను బాగున్నా. నేను రాగానే ఫ్రైడ్ చికెన్ తినడానికి బయటకు వెళదాం’ అని రాశాడు. ఓ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన 12 మంది బాలురు, కోచ్‌తో కలసి థామ్ లువాంగ్ గుహలో జూన్ 23న సాహసయాత్రకు వెళ్లగా అప్పుడే కురిసిన భారీ వర్షాలకు లోపలే చిక్కుకుపోవడం తెలిసిందే. ఇప్పటికిప్పుడు తీసుకురాలేం.. పిల్లలందరికీ ఈత సరిగ్గా రాకపోవడం, అదీ గుహలో కావడంతో ఇప్పటికిప్పుడు వారందరినీ నీటి కింద నుంచే బయటకు తీసుకొచ్చే సాహసం ఏదీ చేయబోమని చియాంగ్ రాయ్ గవర్నర్ నరోగ్సక్ చెప్పారు. ఇప్పటికే నైపుణ్యవంతుడైన డైవర్ నీటి కింద నుంచి వస్తూ చనిపోయాడనీ, పిల్లలను తీసుకురావడం సురక్షితం కాదని ఆయన చెప్పారు. మళ్లీ భారీ వర్షాలు మొదలైతే సహాయక సిబ్బంది గుహ లోపలికి చేరుకోవడానికి కూడా అవకాశం ఉండదనీ, వర్షాలు తగ్గినందున ఇప్పుడు వారిని కాపాడాలని కొందరు అంటున్నారు. 100కు పైగా రంధ్రాలతో ప్రయత్నం.. కొండకు వందకుపైగా రంధ్రాలు చేసి వారంతా ఎక్కడున్నారో కనిపెట్టేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కొన్ని రంధ్రాలను 400 మీటర్ల లోతుకు వేసినా పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయారు. గుహలో ఆక్సిజన్ స్థాయులు తగ్గకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. -
మా క్రికెట్ కోచ్ ఓవర్ చేస్తున్నాడు..!
ముంబై: భారత మహిళా క్రికెట్ జట్టు ఆన్ ఫీల్డ్ వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చుతున్న ప్రధాన కోచ్ తుషార్ అరోథిని తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా జట్టు సెలక్షన్ విషయాలతో పాటు ఫీల్డ్‌లో ఆడేటప్పుడు తుషార్ అతిగా వ్యవహరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ మేరకు బుధవారం భారత మహిళా క్రికెట్ జట్టు బృందం బీసీసీఐని కలిసి కోచ్ తుషార్‌పై ఫిర్యాదు చేశారు. ప్రధానంగా కొన్ని నిర్ణయాలు కెప్టెన్ మాత్రమే తీసుకోవాల్సి ఉండగా, కోచ్‌గా తుషార్ మాత్రం ఓవర్ చేస్తూ విపరీతమైన స్వేచ్ఛను తీసుకుంటున్నాడంటూ ఆరోపించారు. ముందుగా సెలక్షన్ కమిటీకి తమ సమస్యను విన్నవించిన క్రీడాకారిణులు.. ఆపై బీసీసీఐతో సమావేశమయ్యారు. గతవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియాకప్ ఫైనల్లో ఓడిపోవడానికి తుషార్ ఎలా కారణమయ్యాడనేది బీసీసీఐ సమావేశంలో ప్రస్తావించారు. తుది జట్టును ఎంపిక చేసేటప్పుడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను పూర్తిగా పక్కకు పెట్టిన కోచ్.. ఏకపక్షం నిర్ణయాలు తీసుకున్నాడని ఆరోపించారు. ఫైనల్ మ్యాచ్‌కు జట్టు ఎంపిక బాలేదని హర్మన్ చెప్పినా, తుషార్ వినలేదని బీసీసీఐ పెద్దలకు విన్నవించినట్లు సమాచారం. దీనిలో భాగంగా తుషార్ అరోథిని కోచ్‌గా కొనసాగించవద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. -
స్పెయిన్ కోచ్ లొపెటెగుపై వేటు
ప్రపంచ కప్‌కు ముందు స్పెయిన్ జట్టు కోచ్ జులెన్ లొపెటెగుని తప్పించి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో ఫెర్నాండో హైరోను కొత్త కోచ్‌గా నియమించింది. ఒకవైపు స్పెయిన్ జట్టు ప్రపంచ కప్ సన్నాహాల్లో ఉండగా... టోర్నీ ముగిసిన తర్వాత లొపెటెగు తమ జట్టు కోచ్‌గా వ్యవహరిస్తాడని ప్రఖ్యాత స్పెయిన్ క్లబ్ రియల్ మాడ్రిడ్ మంగళవారమే ప్రకటించడం అతని తొలగింపునకు కారణమని వినిపిస్తోంది. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తాము సరైన చర్య తీసుకున్నట్లు ప్రకటించింది. -
ప్రపంచకప్‌కు ఒక్కరోజు ముందు సంచలనం
ఫిఫా ప్రపంచ కప్ ఆరంభానికి ఒక్కరోజు ముందు స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఆర్ఎఫ్ఈఎఫ్) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కోచ్ జులెన్ లోపెటిగుయ్ను తప్పించి ఫెర్నాండో హియర్రోను నియమించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం(జూన్ 15న) పోర్చుగల్‌తో తలపడబోతున్న స్పెయిన్ జట్టు ఆటపై ఈ అనూహ్య నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత నెలలోనే ప్రధాన కోచ్‌గా నియమితులయిన జులెన్ 2020 వరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అర్ధంతరంగా కోచ్ పదవి నుంచి తప్పించారు. జులెన్ను స్థానిక క్లబ్ రియల్ మాడ్రిడ్ జట్టు మేనేజర్‌గా ఆర్ఎఫ్ఈఎఫ్ నియమించింది. 2010 ఫిఫా చాంపియన్ అయిన స్పెయిన్ ఈసారి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కోచ్ జులెన్ నిష్ర్కమణతో దిగ్గజ జట్టు ఎలా ఆడుతుందో వేచి చూడాలి. -
బౌలింగ్ కోచ్ కోసం బీసీసీఐ అన్వేషణ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) బౌలింగ్ కోచ్ కోసం అన్వేషిస్తోంది. అయితే బీసీసీఐ అన్వేషించేది పురుషుల క్రికెట్ జట్టు కోసం కాదులెండీ.. భారత మహిళా క్రికెట్ జట్టు బౌలింగ్ వనరులు మెరుగుపరచడం కోసం. ఈ మేరకు మహిళా జట్టు మేనేజ్మెంట్ బీసీసీఐకి ఒక ప్రతిపాదన పంపింది. దాంతో త్వరలోనే మహిళ జట్టు బౌలింగ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తుల్ని ఆహ్వానించనుంది. ప్రస్తుతం భారత మహిళా జట్టుకు తుషార్ అర్థో జట్టుకు ప్రధాన కోచ్‌గా, బిజు జార్జ్ ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ‘బౌలింగ్ కోచ్ కావాలని మహిళా క్రికెట్ జట్టు మేనేజ్మెంట్ విన్నవించింది. అందుకోసం త్వరలోనే అన్వేషణ ప్రారంభమవుతుంది’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. భారత్‌కు చెందిన వారే కోచ్‌గా దరఖాస్తు చేసుకునే కానక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్టులో ఫీల్డింగ్ లోపాలు బాగా కనిపించాయి. దాంతో మహిళా క్రికెట్ జట్టు భవిష్యత్తులో ఆడే టోర్నీలను దృష్టిలో పెట్టుకుని కూడా బీసీసీఐ ఫీల్డింగ్ కోచ్ ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని భావిస్తోంది. -
ప్రముఖ జిమ్నాస్టిక్స్ కోచ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ‘శాట్స్’ జిమ్నాస్టిక్స్ కోచ్ ఎన్. బ్రిజ్ కిశోర్ కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1993లో శాట్స్‌లో కోచ్‌గా చేరిన బ్రిజ్‌కిశోర్ ఎంతో మంది జాతీయ స్థాయి జిమ్నాస్ట్‌లను తీర్చిదిద్దారు. ఇటీవల జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన బుద్ధా అరుణా రెడ్డి కూడా ఆయన శిష్యురాలే. ఆయన మృతి పట్ల ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సంతాపసభను ఏర్పాటు చేసి రెండు నిమిషాల మౌనం పాటించింది. అధ్యక్షుడు కె. రంగారావు, కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ ఆయన సేవలను కొనియాడారు. బ్యాడ్మింటన్ కార్యదర్శి కె. ఫణిరావు, జిమ్నాస్టిక్స్ కార్యదర్శి కె. మహేశ్వర్, హాకీ కార్యదర్శి భీమ్‌సింగ్ సంతాపసభలో పాల్గొన్నారు. కోచ్ బ్రిజ్ కిషోర్‌కు శాట్స్ చేయూత -
ఇర్ఫాన్ పఠాన్ కొత్త ఇన్నింగ్స్
జమ్మూ కశ్మీర్: భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆల్ రౌండర్ ఇర్పాన్ పఠాన్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇక నుంచి కోచ్ పాత్రలో మెరిసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌తో ఒప్పందం చేసుకున్నాడు. 2018-19 సీజన్‌కు ఇర్ఫాన్ పఠాన్‌ను కోచ్, మెంటార్‌గా నియమించిన విషయాన్ని జేకేసీఏ వెల్లడించింది. తమ జట్టుకు ఏడాది పాటు ఇర్పాన్ కోచ్‌గా, మెంటార్‌గా సేవలందించనున్నట్లు జేకేసీఏ సీఈవో ఆషిక్ బుఖారి తెలిపారు.గత రెండు దేశవాళీ సీజన్లో బరోడాకు కెప్టెన్‌గా చేసిన ఇర్పాన్.. 2003-12 కాలంలో భారత్ తరపున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. -
కోచ్ పదవి నుండి తప్పుకున్న డారెన్ లీమన్
-
ఆసీస్‌కు మరో షాక్.. కోచ్ కూడా..!
బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తూనే ఉంది. ఈ కుంభకోణానికి బాధ్యులైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ ఇప్పటికే నిషేధానికి గురయ్యారు. ఈ వివాదంతో కుంగిపోయిన ఆసీస్ జట్టుకు మరో షాక్ తగిలింది. తాజాగా ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ కూడా జట్టుకు దూరం కాబోతున్నారు. బాల్ ట్యాంపరింగ్ స్కాంతో ప్రమేయం లేకపోయినప్పటికీ.. తాను రాజీనామా చేస్తున్నట్టు లీమన్ ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టు ముగిసిన తర్వాత తాను కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని తెలిపారు. ‘ఈ ప్రస్థానంలో ఎన్నిసార్లు ప్రియమైన వారికి దూరంగా ఉంటామో ఇక్కడ ఉండేవారికి తెలుసు. కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాత నేను రాజీనామా చేయడానికి ఇదే మంచి సమయమని నిర్ణయించుకున్నా’ అంటూ కంటతడి పెడుతూ లీమన్ మీడియాతో తెలిపారు. బాల్ ట్యాంపరింగ్ విషయంలో లీమన్ ప్రమేయం లేదని, తాము బాల్ ఆకారాన్ని మార్చాలనుకున్న విషయం ఆయనకు తెలియనే తెలియదని స్టీవ్ స్మిత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మైదానంలో బాల్ ఆకారాన్ని మార్చేందుకు బెన్‌క్రాఫ్ట్ ప్రయత్నిస్తున్న సమయంలో ‘ఏం జరుగుతోంది. అసలేం జరుగుతోంది’ అంటూ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు పీటర్ హ్యాంద్స్కంబ్తో లీమన్ వాకీటాకీలో పేర్కొనడంతో.. ఆయన ఈ వివాదం నుంచి బయటపడ్డారు. ‘ఆటగాళ్లతో మాట్లాడి.. వారికి వీడ్కోలు చెప్పడం చాలా కష్టమైన పని. కానీ నేను వెళ్లిపోక తప్పదు. గత కొన్నిరోజులుగా ఎన్నో పరిణామాలు.. ఎన్నో దుర్భాషలు ఎదుర్కొన్నాను. దీనికి ఎవరో ఒకరు మూల్యం చెల్లించాలి. వాళ్లు (స్టీవ్‌స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్) తప్పు చేశారు. ఆస్ట్రేలియా జట్టు మళ్లీ బలోపేతం అవుతుందని, ఈ యువ ఆటగాళ్లను ఆస్ట్రేలియా ప్రజలు మన్నిస్తారని, వారు తిరిగి జట్టులోకి వస్తారని ఆశిస్తున్నా’ అని లీమన్ మీడియాతో తెలిపాడు. -
అసిస్టెంట్ కోచ్‌గా పాంటింగ్
సిడ్నీ:వచ్చే నెలలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో జరుగనున్న ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగాంగా ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్‌గా మాజీ సారథి రికీ పాంటింగ్ ఎంపికయ్యాడు. ఫలితంగా ఇప్రధాన కోచ్ డారెన్ లీమన్ కోచింగ్ స్టాప్ బృందంలో పాంటింగ్ చేరిపోయాడు. ఈ మేరకు గత కొంతకాలంగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తో చర్చలు జరిపిన పాంటింగ్ అందుకు తాజాగా అంగీకారం తెలిపాడు. తన అసిస్టెంట్ కోచ్ బాధ్యతపై స్పందించిన పాంటింగ్.. ' ఇంగ్లండ్-న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం మరోసారి ఆసీస్ జట్టుతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గత ఏడాది జట్టుతో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. టీ20 ఫార్మాట్లో సత్తా చాటేందుకు మా వద్ద చాలామంది ఆటగాళ్లు ఉన్నారు' అని పాంటింగ్ తెలిపాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో ముంబై ఇండియన్స్ కోచ్‌గా పనిచేసిన పాంటింగ్.. ఈ ఏడాది ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్‌గా సేవలందించనున్నాడు. -
'అందుకే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు'
కొలంబో:శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్‌గా ఏంజెలో మాథ్యూస్‌ను తిరిగి ఎంపిక చేశారు. ఈ మేరకు మాథ్యూస్‌ను 2019 వన్డే వరల్డ్ కప్ వరకూ సారథిగా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) మంగళవారం ప్రకటించింది. గతేడాది జూలై నెలలో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ పదవికి గుడ్ బై చెప్పిన మాథ్యూస్‌ను మళ్లీ వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.అయితే దీనిపై స్పందించిన మాథ్యూస్..' గతంలో సారథిగా తప్పుకున్నప్పుడే ఇక ఎప్పుడూ ఆ బాధ్యతల్ని మీద వేసుకోవాలని అనుకోలేదు. కాకపోతే ఎస్ఎల్సీ, ప్రధాన కోచ్, శ్రీలంక సెలక్టర్లు నా నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పట్టుబట్టారు. అందుకే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తున్నా. వచ్చే వరల్డ్ కప్‌కు సమతుకంతో కూడిన జట్టును తయారు చేయాల్సి ఉంది. ఆ మెగా ఈవెంట్‌కు 18 నెలలు కంటే తక్కువ సమయం మాత్రమే ఉంది. నేను తిరిగి కెప్టెన్సీ చేపట్టడంలో మెంటర్ చందికా హతురసింఘా పాత్ర కీలకం. అతని ప్రేరణతోనే మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడానికి అంగీకరించా'అని మాథ్యూస్ తెలిపాడు. -
కీచక కోచ్‌పై కేసు
బరేలి : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన అథ్లెటిక్ కోచ్‌పై పోస్కో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మీరాగంజ్లో ఓ టోర్నమెంట్ సందర్భంగా కోచ్ ఆలం తనను లైంగిక వేధింపులకు గురిచేశారని, లైంగిక దాడికి యత్నించగా తాను ప్రతిఘటించానని మహిళా అథ్లెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు గతనెలలో నైనిటాల్లో జరిగిన మాన్సూన్ మారథాన్ సమయంలో ఆలం తనపై లైంగిక దాడికి యత్నించాడని మరో మైనర్ అథ్లెట్ ఫిర్యాదు చేశారు. తొలుత బాలికకు అభ్యంతరకర చిత్రాలు చూపి ఆపై లైంగిక దాడికి యత్నించాడు. నైనిటాల్ నుంచి తిరిగివచ్చిన తర్వాత ఈ విషయాన్ని బాధితురాలు తల్లితండ్రులకు వివరించగా, బాధిత బాలికలిద్దరూ తల్లితండ్రల సూచన మేరకు కోచ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీచక కోచ్‌పై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్‌గా పాంటింగ్
ముంబై: ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. గతేడాది వరకు ఢిల్లీ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం కారణంగా వైదొలిగాడు. అతడి స్థానంలో పాంటింగ్‌ను నియమించినట్లు డేర్ డెవిల్స్ సీఈవో హేమంత్ దువా తెలిపాడు. పాంటింగ్ 2015, 2016లలో ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. -
శ్రీలంక క్రికెట్ జట్టుకు కొత్త కోచ్
కొలంబో:శ్రీలంక క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చేశాడు. శ్రీలంక మాజీ క్రికెటర్, బంగ్లాదేశ మాజీ కోచ్ చందికా హతురుసింఘాను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ప్రకటించింది. భారత్‌తో మూడు ట్వంటీ 20ల సిరీస్‌లో చందికా హతరురుసింఘా బాధ్యతలు చేపట్టనున్నాడని స్పష్టం చేసింది. హతరుసింఘాను కోచ్‌గా ఎంపిక చేసే క్రమంలో అతను కోచ్‌గా ఎంతవరకూ సక్సెస్ అయ్యాడనే దానిపై తీవ్రంగా చర్చించిన పిదప నిర్ణయం తీసుకున్నారు. చివరకు హతురుసింఘా నియామకంలో ఏకగీవ్ర ఆమోదం లభించడంతో అతనికి ఎంపికలో ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్ కోచ్ పదవికి హతురసింఘా రాజీనామా చేశారు. అతని పర్యవేక్షలో బంగ్లాదేశ్ అనేక సంచలన విజయాలు సాధించింది. ప్రధానంగా అతని మూడేళ్ల పదవి కాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్లను బంగ్లాదేశ్ ఓడించింది. 2006లో శ్రీలంక-ఎ జట్టకు హతురసింఘా కోచ్‌గా సేవలందించాడు. మరొకవైపు 2009లో శ్రీలంక జాతీయ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన అనుభవం అతని సొంతం. -
‘మహిళల క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్తు’
రానున్న కాలంలో మహిళల క్రికెట్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉండబోతోందని.. త్వరలోనే ఐపీఎల్ తరహా పోటీలను మహిళా క్రికెట్లో సైతం చూడవచ్చని భారత మహిళా క్రికెట్ జట్టు పూర్వపు క్రీడాకారిణి, ఆంధ్రా మహిళల సీనియర్ జట్టు కోచ్ డయానాడేవిడ్ పేర్కొన్నారు. కడప నగరంలో నవంబర్ 19 నుంచి నిర్వహిస్తున్న సీనియర్ మహిళల క్రికెట్ సన్నాహక శిబిరంలో ఆంధ్రా సీనియర్ మహిళలకు నైపుణ్యాలను, మెలకువులను నేర్పుతూ రంజీ మ్యాచ్‌లకు సన్నద్ధం చేస్తున్న ఆమెను సాక్షి పలుకరించగా పలు విషయాలను పంచుకుంది. – కడప స్పోర్ట్స్ భారత మహిళా క్రికెట్ జట్టుకు మీరందించిన సేవలు? భారత మహిళల క్రికెట్ జట్టుకు 2012 వరకు సేవలందించా. వన్డే మ్యాచ్‌లు, టీ–20 మొత్తం కలిపి 28 మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించా. అనంతరం 2015 వరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాను. హైదరాబాద్ జట్టు నుంచి ప్రాతినిథ్యం వహించా. దేశంలో మహిళా క్రికెట్ పరిస్థితి ఎలా ఉంది? ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఫైనల్‌కు భారత మహిళా జట్టు వెళ్లడంతో దేశప్రజల్లో మహిళల క్రికెట్ పట్ల సానుకూల ధోరణి ఏర్పడింది. రానున్న కాలంలో పురుషుల క్రికెట్‌తో సమానంగా మహిళల క్రికెట్ అభివృద్ధి సాధిస్తుంది. మహిళల క్రికెట్‌కు ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి? మహిళల క్రికెట్‌కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చక్కటి ప్రోత్సాహం ఇస్తోంది. జోన్‌స్థాయిలో ఆడితే ఏడాదికి రూ.24 వేలు, రాష్ట్రస్థాయిలో ఆడితే రూ.48 వేల చొప్పున చెల్లిస్తోంది. దీనికి తోడు దేశంలోనే ప్రప్రథమంగా ఏసీఏ ఆధ్వర్యంలో మూలపాడులో మహిళల కోసం అకాడమీ ఏర్పాటు చేశారు. ఇది మహిళా క్రికెట్‌కు మేలు చేస్తుంది. ఆంధ్రా మహిళల జట్టు పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రా సీనియర్ మహిళల జట్టు చక్కటి కూర్పుతో ఉంది. సన్నాహక శిబిరం బాగా సాగుతోంది. ఈనెల 4 నుంచి హైదరాబాద్‌లో నిర్వహించే పోటీల్లో చక్కటి ప్రదర్శన చేస్తారని భావిస్తున్నాం. మహిళా క్రికెట్లోకి రావాలనుకునే క్రీడాకారిణులకుమీరిచ్చే సందేశం? గతంతో పోల్చితే మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. దీంతో పాటు ఓ స్థాయి క్రికెట్ ఆడినా చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలు సైతం లభిస్తుండడంతో క్రమేణా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరుగుతోంది. నిబద్ధత, అంకితభావంతో సాధన చేస్తే చక్కటి ఫలితాలు సాధించవచ్చు. -
కోచ్.. లేడోచ్!
మహబూబ్‌నగర్ క్రీడలు: తెలంగాణలో క్రీడాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్నిరంగాల్లో అభివృద్ధికి పాలసీలతో ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంపై వివక్ష చూపుతుందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాల్లో క్రీడాశాఖ(ప్రస్తుతం జిల్లా యువజన, క్రీడల కార్యాలయం) ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్టేడియాల్లో కోచ్‌ల కొరత ఉంది. కొన్నేళ్లుగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ద్వారా కోచ్‌లను నియమించలేదు. కేవలం స్పోర్ట్స్ హాస్టల్, స్కూళ్లలో మాత్రమే ఒకరిద్దని నియమించిన స్పోర్ట్ అథారిటీ.. జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్టేడియాల్లో సరిపడా కోచ్‌లను నియమించలేదు. దీంతో స్టేడియాలు ఉన్నా శిక్షకులు లేక ఔత్సాహిక క్రీడాకారులు ప్రోత్సాహం అందడం లేదు. కోచ్‌లు లేని కొన్ని స్టేడియాల్లో సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపా«ధ్యాయులు స్వచ్ఛందంగా శిక్షణ ఇస్తున్నారు. 13 స్టేడియాలు.. 8మంది శిక్షకులు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జిల్లా క్రీ డాశాఖ పరిధిలో 13 స్టేడియాలు ఉం డగా కేవలం 8మంది కోచ్‌లు మాత్రమే ఉన్నారు. క్రీడాశాఖ పరిధిలో మహబూబ్‌నగర్‌లో స్టేడియం, జడ్చర్ల, మక్తల్, నారాయణపేట, వనపర్తి జిల్లా వనపర్తిలో ఒకటి క్రీడాశాఖ, మరొకటి గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం ఉన్నాయి. ఇక ఆత్మకూర్‌లో ఒ క స్టేడియం, నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి(గ్రీన్‌ఫీల్డ్), అచ్చంపేట, కొల్లాపూర్ (గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం), గద్వాల జిల్లా కేంద్రంలో డీఎస్ఏ స్టేడియం, మరో గ్రీ న్‌ఫీల్డ్, అలంపూర్ (గ్రీన్‌ఫీల్డ్) సేŠ?ట్డయా లు ఉన్నాయి. వీటిలో మహబూబ్‌నగర్ స్టేడియంలో ఐదుగురు, జడ్చర్ల, వనప ర్తి, అచ్చంపేట, గద్వాల స్టేడియాల్లో ఒ క్కరి చొప్పున కోచ్‌లు ఉన్నారు. మిగతా స్టేడియాల్లో ఒక్కకోచ్ కూడా లేకపోవడంతో క్రీడలపై శిక్షణ ఇచ్చేవారే కరువయ్యారు. వెంటనే స్టేడియాలకు కోచ్‌ల ను నియమించాలని సీనియర్ క్రీడాకారులు కోరుతున్నారు. ఎంత మంది ఉండాలి? వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్, ఖోఖో, అథ్లెటిక్స్ క్రీడలను పాపుల ర్ గేమ్స్‌గా పేరుంది. ఈ క్రీడల్లో శిక్షణ పొందేందుకు ప్రతి జిల్లాలో ఔత్సాహిక క్రీడాకారులు వందల సంఖ్యలో ఉంటా రు. ఈ మేరకు వీటిలో శిక్షణ ఇచ్చేందుకు తప్పనిసరిగా ప్రతి జిల్లాలో కోచ్‌లను నియమించాలి. క్రీడాకారుల సంఖ్యను బట్టి ఒకరు లేదా అంతకు మించి ఎక్కువ సంఖ్యలోనూ కోచ్‌లను నియమించాల్సి ఉంటుంది. ఇక మిగతా క్రికెట్, సెపక్ త క్రా, బేస్‌బాల్ తదితర క్రీడాంశాలు కొన్ని జిల్లాల్లో ప్రాధాన్యతకు నోచుకుంటాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఏయే జిల్లాలో ఏయే క్రీడాంశానికి ఆదరణ ఉందో గుర్తించి కోచ్‌లను ప్రభుత్వం నియమించాలి. వీటికి కోచ్‌ల మాట దేవుడెరుగు పాపులర్ గేమ్స్‌కు సంబంధించి కూడా సరిపడా కోచ్‌లను నియమించకపోవడంతో జిల్లాల్లో ఔత్సాహిక క్రీడాకారులు నిరాదరణకు గురవుతున్నారు. ‘శాట్’ దృష్టికి తీసుకెళ్లాం బడ్జెట్లో క్రీడా నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తున్నారు. కానీ నేరుగా కోచ్‌ల నియమాకాన్ని చేపట్టడం లేదు. అన్ని స్టేడియంల్లో ఎన్ఐఎస్ చేసిన వారిని రెగ్యులర్ కోచ్‌లుగా నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ మేరకు గతంలో పలుసార్లు స్పోర్ట్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – రాజేంద్రప్రసాద్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఫుట్‌బాల్ కోచ్‌ను నియమించాలి జిల్లా స్టేడియంలో ఫుట్‌బాల్ కోచ్‌ను నియమించాలి. ఈ విషయమై పలు సార్లు శాట్ చైర్మన్, ఉన్నతాధికారులకు వినతులు అందజేశాం. జిల్లాలో నైపుణ్యమున్న పుట్‌బాల్ క్రీడాకారులు ఉన్నా కోచ్ లేకపోవడంతో మెరుగైన శిక్షణ అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాపులర్ గేమ్‌లకు కోచ్‌లను నియమించాలి. – నాగేశ్వర్, సీనియర్ క్రీడాకారుడు ప్రతిపాదనలు పంపించాం.. స్టేడియాల్లో కోచ్‌ల నియామకంపై గతంలో స్పోర్ట్స్ అథారిటీకి ప్రతిపాదనలు పంపించాం. కనీసం పాపులర్ గేమ్‌లకు కోచ్‌లు వస్తే ఔత్సాహిక క్రీడాకారులకు మెరుగైన శిక్షణ లభిస్తుంది. అయితే, త్వరలోనే అన్ని స్టేడియాల్లో కోచ్‌లను నియమించే అవకాశం ఉందని మాకు సమాచారం ఉంది. – టీవీఎల్ సత్యవాణి, డీవైఎస్ఓ, మహబూబ్‌నగర్ -
శాయ్ నుంచి శాప్ దాకా అదే వేదన
ఏఎన్‌యూ: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆయా దేశాలు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నాయి. జమైకా వంటి అతి పేద దేశంతో పాటు ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న చైనా కూడా క్రీడారంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారత్‌లో మాత్రం క్రీడలు ఎప్పుడూ చిన్నచూపేనని క్రీడాకారులు, కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడలకు అంతర్జాతీయ ఖ్యాతి తెస్తామని పాలకులు, అధికారులు చెబుతున్నారే తప్ప వాస్తవానికి జరుగుతున్నది అందుకు విరుద్ధమైన పనులేనని వాపోతున్నారు. ఈ విషయంలో జాతీయ స్థాయి క్రీడారంగ సంస్థ అయిన శాయ్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి శాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) వరకూ అంతటా ఒకటే తీరు అని చెబుతున్నారు. అభిప్రాయాలు వారి మాటల్లోనే.. ఇచ్చే నగదు తిండికే సరి.. అత్యున్నత ప్రమాణాలు, అంకిత భావం ఉన్న కోచ్‌లు, నైపుణ్యం ఉండి లక్ష్యం సాధించాలనే క్రీడాకారులతోనే విజయాలు సాధ్యమవుతాయి. అలాంటి పరిస్థితి లేనప్పుడు విజయాలు సుదూరం. ప్రభుత్వం వారిని ప్రోత్సహించకుండా జాతీయ, అంతర్జాతీయ పోటీలకు పంపినా నిష్ప్రయోజనం. నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఎందరో ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లేక క్రీడారంగానికి దూరవవుతున్నారు. ప్రస్తుతం శాయ్ ఒక్కో క్రీడాకారుడికి ఒక రోజుకు రూ.250 వెచ్చిస్తోంది. అది తిండికి సరిపోతుంది. ఇక ఇతర పరికరాలు, బట్టలు, షూస్ కొనుగోలు ఎలా? సరైన వనరులు ఉండాల్సిందే..! – డీఏ వినాయక ప్రసాద్, శాయ్ కోచ్ ప్రోత్సహిస్తేనే విజయాలు ఇతర దేశాల క్రీడా విధానం, ప్రోత్సాహకాలతో మన దేశ విధానాన్ని పోల్చుకోవడం సరికాదు. గతంలో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. అంతర్జాతీయ పతకాలను సాధించే అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇంకా పెరగాలి. క్రీడారంగంలోని అధికారులు, కోచ్‌లు, విధాన రూపకర్తలు అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించొచ్చు. మన దేశంలో ఎంతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఉన్నారు. వారికి అన్ని అంశాల్లో ప్రోత్సాహం అందిస్తేనే ఆశించిన లక్ష్యాన్ని చేరుకోగలం. చైనా, రష్యా వంటి దేశాల్లో స్కూల్లోనే ట్రాక్‌లు, ప్రత్యేకమైన స్పోర్ట్స్ అకాడమీలు ఉన్నాయి. – పీటీ ఉష, అర్జున అవార్డు గ్రహీత, కోచ్ నైపుణ్యం ఉన్నా ప్రోత్సాహం కరువు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాల్లో ఎందరో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారు. వారికి మూడుపూటలా తిండిపెట్టి వసతులు కల్పిస్తే వారు మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది. వారిని గుర్తించి ప్రాథమిక దశ నుంచే ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణతో రూపొందించాలి. ప్రస్తుతం ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఆశించిన స్థాయిలో లేదు. సాధనకు పరికరాలు కనీసం కాళ్లకు షూస్ కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పరిస్థితి మారాలి. – సుబ్బారావు, శాయ్ కోచ్ , ఔరంగాబాద్ -
హెచ్‌సీఏ సెలక్టర్ల రాజీనామా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో గురువారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ సెలక్షన్ కమిటీలోని ముగ్గురు సభ్యులలో చైర్మన్ రమేశ్ కుమార్, శ్రీనివాస చక్రవర్తి తమ పదవులకు రాజీనామా చేశారు. రంజీ ట్రోఫీ, అండర్–23 జట్ల ఎంపికలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్ అతిగా జోక్యం చేసుకోవడం, ఈ విషయంలో ఆయనతో తలెత్తిన విభేదాలే రాజీనామాకు కారణమని సమాచారం. మరోవైపు అండర్–23 జట్టు కోసం కొత్తగా క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ పదవిని సృష్టించి, అన్ని విషయాల్లో ఆయనకు జవాబుదారీగా ఉండాలంటూ హెచ్‌సీఏ నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా జట్టు కోచ్ అనిరుధ్ సింగ్ కూడా తన పదవి నుంచి తప్పుకున్నారు. హైదరాబాద్ రంజీ జట్టు ప్రస్తుతం ఢిల్లీలో రైల్వేస్‌తో తలపడుతుండగా... నేటినుంచి హైదరాబాద్, ఒడిషా మధ్య అండర్–23 మ్యాచ్ జరగనుంది. -
బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్?
న్యూఢిల్లీ: గతంలో భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా పని చేసిన భరత్ అరుణ్ కు మరోసారి ఆ బాధ్యతల్ని అప్పజెప్పేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఇటీవల భారత జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రిని నియమించిన తరువాత భరత్ అరుణ్ పేరు ప్రధానంగా వినిపించింది. బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ఎంపికపై రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) సైతం దిగివచ్చింది. జహీర్ పూర్తిస్థాయి కోచ్ కాదని, కేవలం 150 రోజుల పాటు మాత్రమే బౌలింగ్ కన్సల్టెంట్ గా సేవలందిస్తాడని మాట మార్చింది. మరొకవైపు విదేశాల్లో మాత్రమే జహీర్ సేవల్ని ఉపయోగించుకుంటామని కూడా తెలిపింది. ఇందుకు కారణం బీసీసీఐ పాలకుల కమిటీ(సీవోఏ)నే. భారత ప్రధాన కోచ్ ఎంపిక బాధ్యతల్ని మాత్రమే సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీకి అప్పచెపితే, బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్ ను సైతం ప్రకటించడంపై వినోద్ రాయ్ నేతృత్వంలో సీవోఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో ఆ ఇద్దరి ఎంపికపై నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది. ఇక్కడ కేవలం రవిశాస్త్రి ఎంపికను మాత్రమే సీవోఏ పూర్తిస్థాయి సమర్ధించింది. సహాయక సిబ్బందిని ఎంపిక చేసుకునే బాధ్యతను ప్రధాన కోచ్ కు అప్పచెప్పాలంటూ సీఏసీకి సూచించింది. మరొకవైపు జహీర్ పూర్తిస్థాయిలో బౌలింగ్ సేవల్ని అందించడానికి కూడా సుముఖంగా లేడు. కాగా, రవిశాస్త్రి మాత్రం తనకు ఫుల్ టైమ్ కోచ్ కావాలంటూ పట్టుబడుతున్నాడు. దాంతో బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ ఎంపిక ఖాయమైనట్లే కనబడుతోంది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ పాలకుల కమిటీతో రవిశాస్త్రి సమావేశమై తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసే అవకాశాలు కనబడుతున్నాయి.మరి రవిశాస్త్రి పంతం నెగ్గుతుందో లేదో చూడాలి. -
'టీమిండియా కోచ్ గా చేయాలని ఉంది'
సిడ్నీ: భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేస్తానని ఆసీస్ మాజీ బౌలర్ జాసన్ గిలెస్పీ స్పష్టం చేశాడు. భారత్ కోచ్ గా రవిశాస్త్రి ఎంపికైన తరువాత గిలెస్పీ తన మనసులో మాటను వెల్లడించాడు. భారత క్రికెట్ కోచ్ గా చేయడమనేది చాలా గొప్పదిగా అభివర్ణించిన గిలెస్పీ.. తాజాగా ఆ బాధ్యతను తీసుకున్న రవిశాస్త్రికి అభినందనలు తెలియజేశాడు. 'కోచ్ గా ఎంపికైన రవిశాస్త్రికి అభినందనలు. టీమిండియా కోచ్ అనేది చాలా పెద్ద జాబ్. నాకు కూడా భారత జట్టుకు కోచ్ గా చేయాలని ఉంది. ఈసారి అందుకోసం దరఖాస్తు చేసే అంశంపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయా. దీనిపై కుటుంబ సభ్యులతో చాలా తీవ్రంగా చర్చించాను కూడా. అయితే నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యా. భవిష్యత్తులో టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసే అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తా. ఏదొక రోజు భారత క్రికెట్ కోచ్ అవుతాననే నమ్మకం కూడా ఉంది' గిలెస్పీ అన్నాడు. 1996 నుంచి 2006 వరకూ ఆసీస్ తరపున గిలెస్పీ కీలక పాత్ర పోషించాడు. ఈ కుడి చేతివాటం బౌలర్ 71 టెస్టు మ్యాచ్ ల్లో 259 వికెట్లు సాధించగా, 97 వన్డేల్లో 142 వికెట్లు తీశాడు. -
'కుంబ్లే కోచింగ్ బాగుండేది'
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా పనిచేసి, ఇటీవల ఆ పదవి నుంచి వైదొలిగిన అనిల్ కుంబ్లే పర్యవేక్షణకు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మద్దతుగా నిలిచాడు. అత్యధిక మంది భారత క్రికెట్ సభ్యులకు కుంబ్లే కోచింగ్ నచ్చలేదనే వార్తల నేపథ్యంలో సాహా స్పందించాడు. అసలు కుంబ్లే కోచింగ్ తో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశాడు. భారత క్రికెటర్ల పట్ల కుంబ్లే 'హెడ్ మాస్టర్' లా ఉంటూ కఠినంగా ప్రవర్తించేవాడనే వార్తలను సాహా ఖండించాడు. 'కుంబ్లే పర్యవేక్షణలో డ్రెస్సింగ్ రూమ్ లో ఆహ్లాదకరమైన వాతావారణం ఉండేది. నేను చూసినంత వరకూ మేమంతా జోక్‌లు వేసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్లం. నాతో పాటు ప్రతీ ఒక్కరితోనూ కుంబ్లే సరదాగా ఉండేవాడు. ముఖ్యంగా కుంబ్లే కోచ్ అయిన తరువాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాం. అక్కడ నాకు అతని అనుభవం బాగా ఉపయోగపడింది. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడమని కుంబ్లే చెప్పేవాడు. దాంతో పాటు చక్కటి సలహాలు కూడా ఇచ్చేవాడు. ఇది నేను టెస్టులు ఆడేటప్పుడు నాకు తెలిసిన అనిల్ గురించి చెబుతున్న విషయాలు. మరి వన్డేల్లో కుంబ్లే ఎలా ఉండేవాడో నాకైతే తెలియదు. కుంబ్లే పర్యవేక్షణలో ఉన్న సరదా సరదా వాతావరణం కొత్త కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో కూడా ఉంటుందని అనుకుంటున్నా'అని సాహా పేర్కొన్నాడు. -
రవిశాస్త్రి 'పేచీ' దేనికి?
న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రిని ఎంపిక చేసిన తరువాత అతి పెద్ద సస్పెన్స్ కు తెరపడింది. అయితే జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ గా ఎంపిక చేయడం రవిశాస్త్రికి రుచించలేదు. తొలుత జహీర్ ఖాన్ ఎంపికను స్వాగతించిన రవిశాస్త్రి.. ఉన్నపళంగా మాటమార్చాడు. అసలు జహీర్ అనుభవం కోచ్ గా సరిపోదంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. దాంతో బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) నిర్ణయాన్ని నేరుగా ప్రశ్నించినట్లయ్యింది. మరొకవైపు జహీర్ తో పాటు రాహుల్ ద్రవిడ్ ను సైతం భారత కోచింగ్ స్టాఫ్‌లో చేర్చడాన్ని క్రికెట్ పాలకుల కమిటీ(సీవోఏ) కూడా తప్పుబట్టింది. ఆ ఇద్దర్ని ఎంపిక చేయడంలో సీఏసీ ఆంతర్యం ఏమిటని సీవోఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. బీసీసీఐ అడ్వైజరీ కమిటీకి అప్పజెప్పిన పని ఒకటైతే, మరో ఇద్దరి అభ్యర్ధుల్ని కోచింగ్ విభాగంలో ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ కోచ్ గా రవిశాస్త్రి అభ్యర్ధిత్వాని మాత్రమే స్వాగతించిన సీవోఏ.. జహీర్, ద్రవిడ్ ల ఎంపికపై అయిష్టత కనబరిచింది. ఆపై రవిశాస్త్రి కూడా .. జలింగ్ కోచ్ గా నియమించాలనే అభ్యర్ధను తెరపైకి తీసుకొచ్చాడు.హీర్ బౌలింగ్ కోచ్ గా సరిపోడు అంటూ వివాదానికి మరింత ఆజ్యం పోశాడు. ఈ క్రమంలోనే తనకు ఇష్టమైన భరత్ అరుణ్ ను బౌలింగ్ కోచ్ గా నియమించాలనే అభ్యర్ధను తెరపైకి తీసుకొచ్చాడు. దాంతో జహీర్ 150 రోజుల పాటు మాత్రమే బౌలింగ్ విభాగంలో సేవలందిస్తాడంటూ సీఏసీ స్పష్టం చేసింది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా రవిశాస్త్రి తన పంతాన్ని దాదాపు నెగ్గించుకున్నట్లయ్యింది. అనిల్ కుంబ్లేను అవమానకర రీతిలో కోచ్ పదవి నుంచి సాగనంపడాన్ని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కుంబ్లేపై సహజమైన అభిమానంతో పాటు, కోచ్ గా కూడా జట్టును ముందుకు తీసుకెళ్లడం.. వివాద రహితుడు కావడం చేత కుంబ్లేపై అభిమానులకు మంచి అభిప్రాయం ఉంది. ఇక్కడ కుంబ్లే వైదొలగడానికి కారణమైన కెప్టెన్ విరాట్ కోహ్లి తీరును కూడా అభిమానులు తప్పుబట్టారు. ఇదంతా ముగిసిన అధ్యాయం అయినప్పటికీ భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి వచ్చేశాడు. అనేక సందిగ్ధతల మధ్య రవిశాస్త్రిని కోచ్ గా సీఏసీ ఎంపిక చేసింది. ఇది పూర్తిగా కోహ్లి ఇష్టానుసారంగానే రవిశాస్త్రి ఎంపిక జరిగిందనేది అందరికీ తెలిసిన సత్యమే. తొలుత కోచ్ ప్రకటనకు సంబంధించి కొన్ని రోజులు కావాలని తెలిపిన సీఏసీ.. ఆ మరసటి రోజే రవిశాస్త్రి పేరును ఖరారు చేసింది. ఇందుకు కారణం సీవోఏ. కోచ్ ఇంటర్వ్యూలు జరిగిన తరువాత జాప్యం చేయాల్సిన అవసరం ఏమిటని సీవోఏ ప్రశ్నించడంతో చేసేదిలేక కోహ్లికి ఇష్టమైన రవిశాస్త్రినే ఆ పదవి కట్టబెట్టింది. ఇదే సమయంలో జహీర్, ద్రవిడ్ లను కూడా కోచింగ్ స్టాఫ్ లో చేర్చింది. దాన్ని రవిశాస్త్రి ఘనంగా స్వాగతించాడు కూడా. మరి ఇప్పుడు తనకు బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ కావాలంటూ రవిశాస్త్రి 'పేచీ' పెట్టడానికి కారణం ఏమిటనేది సస్పెన్స్. వచ్చే వరల్డ్ కప్ వరకూ జట్టుకు ప్రధాన కోచ్ గా ఉండే రవిశాస్త్రికి వివాదం అవసరమా?, ఆటగాళ్లతో నవ్వుతూ సర్ధుకుపోతేనే మంచి ఫలితాలు వస్తాయనే రవిశాస్త్రి కొత్త వివాదం ఎందుకు?, సీఏసీలో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీపై ఇది పరోక్ష ప్రతీకారామా?.. ప్రస్తుతం వీటికి సమాధానం దొరకపోయినా తనను కోచ్ గా ఎంపిక చేసిన సీఏసీని సవాల్ చేయడం రవిశాస్త్రి భవిష్యత్‌ను ప్రశ్నార్ధకం చేసే అవకాశం కూడా లేకపోలేదు. మరి దీనికి కాలమే సమాధానం చెప్పాలి. -
కోచ్ ఎంపికలో మరో ట్విస్ట్
న్యూఢిల్లీ : భారత క్రికెట్ కోచ్ ఎంపికలో బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. కోచ్‌పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ ప్రకటించింది. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అందరూ ఊహించినట్లుగానే రవిశాస్త్రినే వరించిందంటూ మంగళవారం జోరుగా ప్రచారం జరిగింది. గత కొన్నిరోజుల నుంచి కొనసాగుతున్న సందిగ్ధతకు ముగింపు పలుకుతూ మాజీ డైరెక్టర్ రవిశాస్త్రినే కోచ్ గా బీసీసీఐ నియమించిందంటూ ఓ వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఈ వార్తను బీసీసీఐ ఖండించింది. తామింకా తుది నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే కోచ్ ఎంపిక పై అధికారికంగా ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. మంగళవారమే కోచ్ ఎవరన్నదీ తెలుస్తుందని తానూ భావిస్తున్నట్లు చెప్పారు. -
రవిశాస్త్రికే అందలం..
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కోచ్ ఎంపిక డ్రామాకు మంగళవారం తెరపడింది. కోచ్ ఎంపికలో అనూహ్యం ఏమీ జరగలేదు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అందరూ ఊహించినట్లుగానే రవిశాస్త్రినే వరించింది. అయితే, మీడియాలో ముందుగా రవిశాస్త్రి పేరు బయటకు వచ్చినా.. అదేం లేదు ఇంకా సమయం ఉందంటూ బీసీసీఐ ఊదరగొట్టింది. గత కొన్నిరోజుల నుంచి కొనసాగుతున్న సందిగ్థతకు ముగింపు పలుకుతూ మాజీ డైరెక్టర్ రవిశాస్త్రినే కోచ్ గా నియమించింది. రవిశాస్త్రి కోచ్ పదవి రేసులోకి వచ్చిన మరుక్షణమే విరాట్ కోహ్లి కొత్త గురువు అనే దానికి దాదాపు సమాధానం దొరికినప్పటికీ, తాజాగా దానికి ఫుల్ స్టాప్ పడింది. దరఖాస్తులు, ఇంటర్వ్యూలు అంటూ బీసీసీఐ హడావిడి చేసినా... రవిశాస్త్రి అడుగు పెట్టడంతోనే ఈ ప్రక్రియ లాంఛనమేనని అర్థమైంది. ఇప్పుడు దానికి అధికారిక ముద్ర పడింది. ఈ మేరకు సచిన్ టెండూల్కర్ , సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణలతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ(సీఏసీ) రవిశాస్త్రి పేరును సూచించగా, అందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో 55 ఏళ్ల రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా ఎంపికయ్యారు. మొత్తంగా ఆరుగురు అభ్యర్ధులు ఇంటర్య్వూలు చేయగా రవిశాస్త్రి వైపు సీఏసీ మొగ్గు చూపింది. అడ్వైజరీ కమిటీ ముందు రవిశాస్త్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. గతంలో టీమిండియా డైరెక్టర్ గా పనిచేయడమే రవిశాస్త్రికి బాగా కలిసొచ్చిన అంశం. శ్రీలంక పర్యటనతో రవిశాస్త్రి తన బాధ్యతల్నిచేపట్టే అవకాశం ఉంది. టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి పని చేసిన సమయంలో భారత్.. ఆస్ట్రేలియాలో తొలిసారి పరిమిత ఓవర్ల సిరీస్ ను ఖాతాలో వేసుకుంది. టీ 20 సిరీస్ ను 3-0 తో గెలిచింది. దాంతో పాటు టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకును సైతం సొంతం చేసుకుంది భారత జట్టు. మరొకవైపు 2015 వన్డే వరల్డ్ కప్, 2016 టీ 20 వరల్డ్ కప్‌ల్లో సైతం సెమీస్ కు చేరుకుంది. సుమారు రెండేళ్ల తన పదవీ కాలంలో డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని పంచుకున్న రవికి జట్టు ఆటగాళ్లపై మంచి అవగాహన ఉంది. మరొకవైపు వ్యాఖ్యాతగా వివిద జట్లను దగ్గర్నుంచి పరిక్షీంచిన అనుభవం కూడా శాస్త్రిది. టీమిండియా బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ఖాన్, బ్యాటింగ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సీకే ఖన్నా ప్రకటించారు. ఈ ముగ్గురు 2019 వరల్డ్ కప్ పూర్తయ్యే వరకూ ఆయా పదవుల్లో కొనసాగనున్నారు. సచినే కారణం..! అనిల్ కుంబ్లే ఆకస్మింగా కోచ్ పదవి నుంచి వైదొలిగిన తరువాత ఒక్కసారిగా రవిశాస్త్రి వెలుగులోకి వచ్చాడు. కోచ్ పదవి కోసం బీసీసీఐ మొదటిసారి దరఖాస్తులు కోరగా అందుకు రవిశాస్త్రి దూరంగా ఉండిపోయాడు. గతేడాది కోచ్ ఎంపికకు సంబంధించి సీఏసీలో సభ్యుడైన సౌరవ్ గంగూలీతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో రవిశాస్త్రి ఆ పదవి కోసం పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే రవిశాస్త్రి కోచ్ గా వస్తే బాగుంటుందని విరాట్ కోహ్లి కూడా సూచయగా చెప్పడంతో అతని పేరు తెరపైకి వచ్చింది. దానిలో భాగంగానే బీసీసీఐ రెండోసారి దరఖాస్తుల్ని ఆహ్వానించిందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈసారి తాను మళ్లీ క్యూలో నిలబడి దరఖా స్తు ఇవ్వబోనన్న రవిశాస్ర్తి మనసు మార్చుకోవడం వెనుక దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడట. కోచ్ గా పనిచేసిన కుంబ్లే నిష్క్రమణ తరువాత బీసీసీఐపై తీవ్ర విమర్శల నేపథ్యంలో సచిన్ ముందడుగు వేశాడట. కోహ్లి కూడా రవిశాస్త్రిని కోరుకోవడంతో అతన్ని ఒప్పించేందుకు సచిన్ రంగంలోకి దిగి ఆ మేరకు సక్సెస్ అయ్యాడనేది సమాచారం. -
కొత్త కోచ్ ను ప్రకటించాల్సిందే!
ముంబై:భారత క్రికెట్ ప్రధాన కోచ్ అభ్యర్ధిని మంగళవారం సాయంత్రంలోగా ప్రకటించాల్సిందేనని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పరిపాలక కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కోచ్ అభ్యర్దికోసం ఇంటర్య్వూలు నిర్వహించినప్పటికీ, ఆ ప్రకటనను మాత్రం వాయిదా వేయడానికి వినోద్ రాయ్ తప్పుబట్టినట్లు సమాచారం..ఈ రోజు సాయంత్రానికల్లా కోచ్ అభ్యర్ధిని ప్రకటించాల్సిదేనని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. ఈ మేరకు బీసీసీఐకి కోచ్ ప్రకటనకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారని సమాచారం. దానిలో భాగంగా బీసీసీఐ సీఈఏ రాహుల్ జోహ్రి, బీసీసీఐ కార్యదర్శి అమితామ్ చౌదరిలతో వినోద్ రాయ్ సమావేశమై కోచ్ అభ్యర్ధి ప్రకటించడంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సోమవారంగంగూలీతో పాటు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ (లండన్ నుంచి స్కైప్ ద్వారా) ఇంటర్వ్యూలు నిర్వహించారు. ‘కోచ్ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదు. కొన్ని రోజుల సమయం ఇంకా అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. ఎంపికకు తొందరేమీ లేదని మా అభిప్రాయం. ఈసారి ఎవరి పేరును ప్రకటించినా వారు 2019 వరల్డ్ కప్ వరకు కొనసాగుతారు’ అని గంగూలీ స్పష్టం చేశారు. కోచ్ పేరును ప్రకటించే ముందు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో కచ్చితంగా చర్చిస్తామని గంగూలీ వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు మాత్రం కోహ్లి తమ పనిలో కలగజేసుకోలేదని, కోచ్‌గా ఎవరు ఉండాలనే పేరును కూడా సూచించలేదని ఆయన అన్నారు. ‘కోచ్ ఎవరితో కలిసి పని చేయాల్సి ఉంటుందో అలాంటి వారితో మాట్లాడటం కూడా చాలా అవసరం'అని గంగూలీ తెలిపాడు. -
కోచ్ ఎవరు? కోహ్లితో మాట్లాడిన తర్వాతే..: గంగూలీ
ముంబై: టీమిండియా తదుపరి కోచ్ ఎవరన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి సోమవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో క్రికెట్ అడ్వయిజరీ కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం ఆరుగురు సీనియర్ క్రికెటర్లను సీఈసీ ఇంటర్వ్యూ చేసినట్టు సమాచారం. టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రినే కోచ్‌గా నియమించనున్నట్టు ఊహాగానాలు వచ్చినప్పటికీ సచిన్ టెండూల్కర్ , సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణలతో కూడిన సీఏసీ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కోచ్ ఎంపిక కోసం మరికొంత సమయం తీసుకుంటామని గంగూలీ సోమవారం విలేకరులకు తెలిపారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు మరికొంత మందితో మాట్లాడాల్సి ఉందని, వారందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత కొత్త కోచ్ ఎవరు అనేది ప్రకటిస్తామని గంగూలీ స్పష్టం చేశారు. కోచ్ రేసులో ముందున్నట్టు భావిస్తున్న రవిశాస్త్రకి కెప్టెన్ కోహ్లి మద్దతు పుష్కలంగా ఉందని, ఆయననే కోచ్‌గా నియమించాలంటూ కోహ్లి కోరుతున్నట్టు కథనాలు రాగా గంగూలీ వీటిని తోసిపుచ్చారు. కోచ్ ఎంపికకు కోహ్లి పూర్తిగా దూరంగా ఉన్నారని, ఈ విషయంలో ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వలేదని గంగూలీ తెలిపారు. -
కోచ్‌గా అతని ఎంపిక లాంఛనమేనా?
ముంబై: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లితో పొసగక అనిల్ కుంబ్లే రాజీనామా చేయడం.. ఒక ఫ్రెండ్లీ కోచ్ కావాలని కోహ్లి చెప్పడం.. ఆ మేరకు బీసీసీఐ రెండోసారి దరఖాస్తులు ఆహ్వానించడం.. ఇక కోచ్ గా రానంటూనే అప్పటివరకూ భీష్మించుకుని కూర్చొన్న రవిశాస్త్రి ఒక్కసారిగా దరఖాస్తు చేయడం.. అందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెనుక ఉండటం.. ఇవన్నీ గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలు. దీన్ని బట్టి చూస్తుంటే రవిశాస్త్రి ప్రధాన కోచ్ గా ఎంపిక కావడం లాంఛనంగా కనబడుతోంది. సోమవారం(జూలై 10)వ తేదీన టీమిండియా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం సెలక్షన్ జరుగుతున్న క్రమంలో రవిశాస్త్రి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. గతంలో టీమిండియా డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉన్న రవిశాస్త్రి కోచ్ అభ్యర్ధుల్లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. మొత్తంగా చూస్తే రవిశాస్త్రితో పాటు సెహ్వాగ్, టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేష్, లాల్ చంద్ రాజ్‌పుత్, లాన్స్ క్లూసెనర్, రాకేశ్ శర్మ, సిమన్స్, ఉపేంద్ర నాథ్ బ్రహ్మాచారిల నుంచి బీసీసీఐకి దరఖాస్తులు అందగా, స్క్రూట్నీ తరువాత రేసులో నిలిచింది మాత్రం ఆరుగురు మాత్రమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానంగా శాస్త్రితో పాటు సెహ్వాగ్, మూడీ, సిమన్స్, పైబస్, రాజ్‌పుత్‌లను మాత్రమే బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) ఇంటర్య్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, కుంబ్లే రాజీనామా తరువాత ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ సైతం రవిశాస్త్రి వైపు మొగ్గుచూపాడు. కోహ్లి సేనను కుంబ్లే కంటే కూడా రవి బాగా నడిపించగలడని చెప్పడం అతని ఎంపిక లాంఛనమనే అభిప్రాయం కలుగుతోంది. ఇక రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఆసీస్ పర్యటనలో టీ 20 సిరీస్ ను తొలిసారి గెలిచింది. రవిశాస్త్రి పర్యవేక్షణలో భారత జట్టు నంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంది. 2015 వరల్డ్ కప్ లో సెమీస్ వరకూ చేరడంలో కూడా రవిశాస్త్రి పాత్ర ఉంది. మరొకవైపు ఆటగాళ్ల పట్ల 'హెడ్ మాస్టర్' లా వ్యవహరించకుండా తగిన స్వేచ్ఛనివ్వడం కూడా రవికి కలిసొచ్చే అంశం. ఏమైనా అద్భుతాలు జరిగితే తప్పితే రవిశాస్త్రి కోచ్ కావడం ఖాయంగా కనబడుతోంది. ఇప్పటికే విండీస్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు కూడా రవికే ఓటేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కోచ్ ఎంపికకు సంబంధించి విండీస్ పర్యటనలో ఉన్న విరాట్ సేననుబీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) రాహుల్ జోహ్రి అభిప్రాయం కోరగా, అక్కడ రవికే మనోళ్లు ఓటేసినట్లు తెలుస్తోంది. -
రవిశాస్త్రి, సెహ్వాగ్ లు పోటీ కాదు..
న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ రాబోతున్న సంగతి తెలిసిందే. జూలై 10వ తేదీన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) నూతన కోచ్ ను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ తరుణంలో అసలు కోచ్ పదవి ఎవర్ని వరించబోతున్నది అనే దానిపై ఆసక్తి నెలకొంది. ప్రధానంగా టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఇద్దరికి బీసీసీఐలోని పెద్దల అండదండలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో కోచ్ పదవి అనేది ఇద్దరిలో ఒకరికి ఖాయంగా కనబడుతోంది. అయితే కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసిన మరో మాజీ భారత ఆటగాడు లాల్‌చంద్ రాజ్‌పుత్ కూడా రేసులోకి వచ్చాడు. గతంలో భారత జట్టుతో కలిసి పని చేసిన అనుభవం ఉన్న రాజ్ పుత్.. కోచ్ పదవిపై స్పందించాడు. 'ఇక్కడ రవిశాస్త్రి, సెహ్వాగ్‌ల నుంచి మాత్రమే పోటీ ఉందని అనుకోవడం లేదు. వారిద్దరికీ నేను పోటీ కూడా కాదు. కోచ్ ను ఎంపిక చేసే సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీ ఎవరు బెస్ట్ అనేది నిర్ణయిస్తుంది. నా వరకూ అయితే నాపై నమ్మకం ఉంది. నా రికార్డులే నా గురించి చెబుతాయి. నేను భారత క్రికెటర్లతో కలిసి పని చేసిన 2007వ సంవత్సరమే అందుకు ఉదాహరణ. నాకొక సొంత గుర్తింపు కూడా. ఇక్కడ నాలాగే కోచ్ గా దరఖాస్తు చేసిన అందరికీ సొంత గుర్తింపు ఉంది. కోచ్ గా ఎవరైతే అర్హలని సీఏసీ భావిస్తుందో వారికే ఇవ్వండి. అంతేకానీ కొంతమంది నుంచి పోటీ ఉందని అనడం సబబు కాదు.'మేమంతా కోచ్ కాంపిటేషన్ లో ఉన్నాం. దొడ్డ గణేష్, రిచర్డ్ పైబస్, టామ్ మూడీలు కూడా పోటీలో ఉన్నారు' అని లాల్ చంద్ రాజ్‌పుత్ పేర్కొన్నాడు. 2007లో రాజ్‌పుత్ పర్యవేక్షణలోని భారత జట్టు వన్డే సిరీస్ ను, టెస్టు సిరీస్‌ను గెలవగా, 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. -
కోచ్ గా షేన్ వార్న్?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నాటికి రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని తిరిగి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బరిలో అడుగుపెట్టబోతున్న జట్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్. ఈ రెండు జట్లు మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని 2016లో బహిష్కరణకు గురయ్యాయి.అయితే తమ పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలని భావిస్తున్న ఇరు జట్లు తమ ప్రయత్నాలను ఇప్పట్నుంచే ఆరంభించాయి. దీనిలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్ అభ్యర్ధి కోసం అన్వేషణ చేపట్టింది. గతంలో తమ జట్టుకు కెప్టెన్ గా చేసిన షేన్ వార్న్‌ను కోచ్ గా ఎంపిక చేసేందుకు కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వార్న్ తో చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. షేన్ వార్న్ వైపు రాజస్థాన్ రాయల్స్ మొగ్గుచూపడానికి ప్రధాన కారణం అతని సక్సెస్. 2008 ఐపీఎల్ ఆరంభపు టైటిల్ ను రాజస్థాన్ సాధించడంలో షేన్ వార్న్ పాత్ర వెలకట్టలేనిది. అతను సారథిగా జట్టును ముందుండి నడిపించి యాజమాన్యం విశ్వాసాన్ని చూరగొన్నాడు. ఆ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ మరోసారి వార్న్ సేవల్ని వినియోగించుకోవాలనే యోచనలో ఉన్నట్లు కనబడుతోంది. కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను ఎంపిక చేయాలని రాయల్స్ యాజమాన్యం తొలుత భావించిందట. గతంలో రాజస్థాన్ తరపున ఆడిన ద్రవిడ్ ను కోచ్ గా తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నారు. కాగా, అండర్-19, భారత-ఎ జట్లకు కోచ్ గా రెండేళ్ల మొత్తం సమయం ఉండేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)తో ద్రవిడ్ ఇటీవల ఒప్పందం చేసుకున్నాడు. అదే సమయంలో ఐపీఎల్ జట్లతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. అంతకుముందు రెండేళ్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ గా పని చేసిన ద్రవిడ్ పాత్ర ఇక నుంచి ఐపీఎల్ కనిపించదు -
కోచ్‌గా ఎవరు కావాలో చెప్పండి..
ఆంటిగ్వా: మరొకొద్ది రోజుల్లో భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ రాబోతున్న సంగతి తెలిసిందే. జూలై 10వ తేదీ నాటికి టీమిండియా ప్రధాన కోచ్‌ను ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడైన సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. భారత జట్టుకు కోచ్ గా పని చేసిన అనిల్ కుంబ్లే ఇటీవల ఆకస్మికంగా తప్పుకున్న నేపథ్యంలో కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తోంది. భారత్ కోచ్ కోసం రెండుసార్లు దరఖాస్తులు ఆహ్వానించి మరీ తగిన అభ్యర్ధి కోసం అన్వేషణ ప్రారంభించింది. దానిలో భాగంగా కోచ్‌గా ఎవరైతే బాగుండుందో ఆటగాళ్ల సలహా మేరకే ఎంపిక చేస్తే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. టీమిండియా కోచ్ ఎంపికపై తమను సంప్రదిస్తే మాత్రం జట్టు తరఫున సభ్యులంతా అభిప్రాయం చెబుతామని కోహ్లి పేర్కొన్నాడు. ఈ విషయంలో తమందరిదీ ఒకే మాట ఉంటుందని కోహ్లి చెప్పాడు. కోచ్ ఎంపికపై బహిరంగ చర్చ అనవసరమని అతను వ్యాఖ్యానించాడు.ఈ మేరకు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) రాహుల్ జోహ్రి జమైకాకు వెళ్లనున్నారు. అక్కడ విరాట్ కోహ్లితో పాటు ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోనున్నారు. గురువారం సాయంత్రం భారత క్రికెటర్లతో సమావేశమై కోచ్ ఎంపికపై అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇప్పటికే కోచ్ అభ్యర్ధిగా రవిశాస్త్రి ముందు వరుసలో ఉన్నాడు. గతంలో టీమిండియా డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం రవిశాస్త్రికి లాభించనుంది. మరొకవైపు కోహ్లి కూడా రవిశాస్త్రి వైపే మొగ్గుచూపుతున్నారు. కాగా, కోచ్ పదవి కోసం రవిశాస్త్రికి వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీల నుంచి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కోచ్ అభ్యర్ధుల జాబితాను టీమిండియా ఆటగాళ్ల ముందుంచి అందుకు తగిన వ్యక్తి కోసం ఫీడ్ బ్యాక్‌ను తీసుకోనున్నారు. -
కోచ్ లేనందుకే కోహ్లి అలా ఔటయ్యాడు!
అంటిగ్వాలో వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 93 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ వన్డేలో భారత్ బ్యాటింగ్ విభాగం ఆశించినమేరకు రాణించలేదు. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. అజింక్యా రహానే మరోసారి అద్భుతంగా ఆడి 72 పరుగులు చేయగా.. మహేంద్రసింగ్ ధోనీ ఫామ్‌ను అందిపుచ్చుకొని అజేయంగా 78 పరుగులు చేశాడు. అనంతరం బౌలర్లు అద్భుతంగా రాణించడంతో వెస్టిండీస్ 158 పరుగులకే చేతులేత్తేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి 11 పరుగులకే ఔటయ్యాడు. ఇదే అదనుగా భావించిన ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్, ప్రస్తుత కామెంటేటర్ డేవిడ్ లాయిడ్ కోహ్లిపై ట్విట్టర్లో విమర్శనాస్త్రాలు సంధించాడు. కోచ్ లేకపోవడం వల్లే కోహ్లి ఇలా బ్యాటింగ్ విఫలమయ్యాడని ఎద్దేవా చేశాడు. కోహ్లితో విభేదాల కారణంగా కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, డేవిడ్ లాయిడ్ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు, విరాట్ కోహ్లి అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. మొదట మీ సొంత జట్టు ఇంగ్లండ్ పరిస్థితి చూసుకోవాలని, పెద్ద టోర్నమెంటుల్లో విఫలమవ్వడం ఆ జట్టుకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కోచ్ పదవి కోసం క్యూలో నిలబడి.. కోహ్లిని ప్రసన్నం చేసుకోవాలని, అప్పుడైనా కోచ్‌గా అవకాశం దక్కవచ్చునని అతనికి సూచించారు. . -
ఈనెల 10న భారత జట్టు కోచ్ ఇంటర్వ్యూ: గంగూలీ
అనిల్ కుంబ్లే రాజీనామాతో ఖాళీ అయిన భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి ముంబైలో ఈనెల 10న ఇంటర్వ్యూ నిర్వహిస్తామని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. ఈ నెల 3,4 తేదీల్లో లండన్‌లో జరిగే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ వరల్డ్ క్రికెట్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు గంగూలీ శనివారం బయలుదేరి వెళ్లారు. రవిశాస్త్రి, సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేశ్ కోచ్ పదవి రేసులో ఉన్నారు. -
కోచ్‌గా ద్రవిడ్‌కు రెండేళ్లు పొడిగింపు
న్యూఢిల్లీ: భారత్ ‘ఎ’, అండర్–19 క్రికెట్ జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలాన్ని బీసీసీఐ మరో రెండేళ్లకు పొడిగించింది. 2015లో ద్రవిడ్ తొలిసారిగా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన శిక్షణలో రాటుదేలిన కుర్రాళ్లు ఆ వెంటనే అండర్–19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌గా నిలిచారు. అలాగే భారత్ ‘ఎ’ జట్టు నాలుగు దేశాల సిరీస్‌లో విజేతగా నిలవగలిగింది. ‘క్రమశిక్షణ, అంకితభావంతో యువ ఆటగాళ్లను ద్రవిడ్ ముందుకు తీసుకెళుతున్నారు. గత రెండేళ్లుగా వర్థమాన ఆటగాళ్లను సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే రెండేళ్లు కూడా ఇలాంటి ఫలితాలతోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’ అని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. మరోవైపు రెండేళ్ల పూర్తి స్థాయి కోచింగ్ బాధ్యతలు తీసుకోనుండటంతో ద్రవిడ్ ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. గతంలో పది నెలల పాటు జాతీయ జట్లకు కోచ్‌గా చేసి రెండు నెలల పాటు ఐపీఎల్లో భాగస్వామిగా ఉండేందుకు బోర్డు అనుమతిచ్చింది. అలాగే నిబంధనల ప్రకారమే కోచ్ కోసం ఇతర అభ్యర్థులను పిలవకుండా ద్రవిడ్‌కు పొడిగింపునిచ్చినట్టు బోర్డు పేర్కొంది. -
సెహ్వాగ్.. నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే!
న్యూఢిల్లీ:భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసే క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ రెండు లైన్ల రెజ్యూమ్ పై విపరీతమైన చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ఆ రెండు లైన్ల రెజ్యూమ్ ను బీసీసీఐ పెద్దలు చూసి ఆశ్చర్యపోయినట్లు మీడియాలో కథనాలు వెలుగుచూశాయి. ఒక హై ప్రొఫైల్ జాబ్ కు దరఖాస్తు చేసేటప్పుడు సెహ్వాగ్ ప్రవర్తనను కొంతమంది తప్పుబట్టారు కూడా. అయితే అఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని సెహ్వాగ్ ఖండించడంతో అది కాస్తా సద్దుమణిగింది. అసలు రెండు లైన్ల రెజ్యూమ్ అనేదిపేరుకే సరిపోతుందని, అటువంటప్పుడు ఆ తరహా రెజ్యూమ్ ను ఎందుకు పంపుతానంటూ ఎదురుప్రశ్నించాడు. ఇదిలా ఉంచితే, టీమిండియా ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే నిష్క్రమణ తరువాత ఆ బాధ్యతలు ఎవరు చెపట్టబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ముందుగా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు రెండోసారి బీసీసీఐ దరఖాస్తుల్ని ఆహ్వానించిన తరువాత ఆప్లై చేసిన రవిశాస్త్రిల మధ్యే తీవ్ర పోటీ నెలకొందని విశ్లేషకులు అంచనా. ఒకవైపు బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి నుంచి సెహ్వాగ్ కు మద్దతు లభిస్తుండగా, మరొకవైపు రవిశాస్త్రికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మద్దతు ఉంది. అయితే సెహ్వాగ్ ను ప్రధాన కోచ్ గా ఎంపిక చేస్తే మాత్రం అతను నోరు అదుపులోకి పెట్టుకోకతప్పదని అనిరుధ్ చౌదరి పేర్కొన్నట్లు సమాచారం. 'అవును.. వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఒకవేళ అతను కోచ్ గా ఎంపికైతే మాత్రం కొన్ని షరతులు తప్పవు. ఏది పడితే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ భారత జట్టు మ్యాచ్ ఓడిపోయినా లేక సిరీస్ కోల్పోయినా మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. నేను ఇలానే ఉంటా అనే రీతిలో ఉంటే కష్టాలు తప్పవు. ఆ విషయంలోనే సెహ్వాగ్ గురించి ఆందోళగా ఉంది' అని అనిరుధ్ చౌదరి అభిప్రాయపడినట్లు విశ్వసనీయ సమాచారం. -
కోచ్ రేసులో మరో మాజీ క్రికెటర్
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే వైదొలిగిన తర్వాత ఆ పదవి కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) రెండో సారి దరఖాస్తుల్ని ఆహ్వానించిన తరువాత కోచ్ పదవి కోసం ముందుగా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి రేసులోకి రాగా, తాజాగా వెంకటేశ్ ప్రసాద్ కూడా పోటీలో నిలిచారు. 1996లో భారత్ క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసిన వెంకేటేశ్ ప్రసాద్.. 33 టెస్టులు, 162 వన్డేలను ఆడాడు. ప్రస్తుతం జూనియర్ క్రికెట్ జట్టుకు వెంకటేశ్ ప్రసాద్ పని చేస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ తో అతని మూడేళ్ల పదవి కాలం ముగియనుంది. దాంతో భారత జట్టుకు కోచ్ గా చేసేందుకు మొగ్గుచూపుతున్న వెంకటేశ్ ప్రసాద్ దరఖాస్తు చేసుకున్నాడు. అంతకుముందు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసిన వారిలో టామ్ మూడీ, సెహ్వాగ్, రిచర్డ్ పైబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్‌లు ఉన్నప్పటికీ రవిశాస్త్రి, వెంకటేశ్ ప్రసాద్ లు వారితో కలిశారు. -
మళ్లీ దరఖాస్తులు ఎందుకోసం?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి కోసం బీసీసీఐ తిరిగి దరఖాస్తుల్ని ఆహ్వానించడంపై కోచ్ రేసులో ఉన్న లాల్ చంద్ రాజ్‌పుత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకసారి కోచ్ పదవి కోసం గడువు ముగిసినా, మళ్లీ దరఖాస్తుల్ని ఆహ్వానించాల్సిన అవసరం ఏమొచ్చిందని రాజ్‌పుత్ మండిపడ్డారు. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్స్ ను మాటను పక్కకు పెట్టి, తాజా దరఖాస్తులంటూ కొత్త పల్లవి అందుకోవడం ఎవరి కోసమని ప్రశ్నించాడు. 'ఇది కచ్చితంగా మంచి పరిణామం కాదు. కోచ్ పదవి కోసం దరఖాస్తుల గడువు ముగిసింది. అయినప్పటికీ మళ్లీ కోచ్ పదవి కోసం దరఖాస్తులంటూ బీసీసీఐ ముందుకొచ్చింది. అసలు బీసీసీఐ ఉద్దేశం ఏమిటి. ఎవరి ప్రయోజనాల కోసం కోచ్ దరఖాస్తుల్ని తిరిగి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు అభ్యర్ధులు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేశారు. వారిపై మీకు నమ్మకం లేదనేది అర్ధమవుతోంది. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ప్రజల్ని ఎందుకు అయోమయంలో పడేస్తున్నారో నాకైతే అర్ధం కావడం లేదు. కోచ్ గా చేసే వాడికి ఆటగాడిగా భారీ రికార్డు అవసరం లేదనేది బీసీసీఐ తెలుసుకోవాలి. ఫలాన వ్యక్తితో సక్సెస్ సాధిస్తామనేది గ్యారంటీ లేనిది. కేవలం టెక్నికల్ నాలెడ్జ్ మాత్రమే ఇక్కడ అవసరం. ఇక్కడ ఇంగ్లిష్ క్రికెట్ బోర్డును పరిశీలించండి. ఇంగ్లండ్ జట్టును కోచ్ ట్రెవర్ బెయిలిస్ ఎలా ముందుగా తీసుకువెళుతున్నాడో చూడండి. అతనికి ఆటగాడిగా మెరుగైన రికార్డు లేదు. టెక్నికల్ గా మంచి పరిజ్ఞానం ఉంది. ఈ విషయాన్ని బీసీసీఐ అర్దం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కానీ, కొత్తగా దరఖాస్తులు ఆహ్వానించాల్సిన అవసరం లేదు'అని రాజ్ పుత్ పేర్కొన్నాడు. -
కోచ్ పదవిపై రవిశాస్త్రి షరతులు..?
న్యూఢిల్లీ:గతేడాది అనిల్ కుంబ్లేను టీమిండియా ప్రధాన కోచ్ గా చేసినప్పుడు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, బీసీసీఐ క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీల మధ్య తీవ్రస్థాయిలో జరిగిన వాగ్వాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. తనకు కోచ్ పదవి రాకపోవడానికి గంగూలీనే కారణమని రవిశాస్త్రి తీవ్రస్థాయిలో విమర్శలకు దిగాడు. దానికి దాదాను కూడా ఘాటుగానే రిప్లే ఇచ్చాడు కూడా. అయితే ఇదంతా జరిగి అప్పుడే ఏడాది అయిపోయింది. కోచ్ గా అనిల్ కుంబ్లే కూడా రాజీనామా చేశాడు. భారత క్రికెట్ జట్టులో అంతర్గత విభేదాల కారణంగా కుంబ్లే తన పదవి నుంచి భారంగా వైదొలిగాడు. ఇదే సమయంలో రవిశాస్త్రి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)సైతం మరోసారి దరఖాస్తుల్ని ఆహ్వానించకుండా రవిశాస్త్రి కోసమే అనే వాదన వినిపించింది. ఇక్కడ రవిశాస్త్రి అయితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కోహ్లి చెప్పిన కారణంగానే కోచ్ కోసం మళ్లీ దరఖాస్తులు కోరినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే,తన కోచ్ పదవిపై రవిశాస్త్రి కొన్ని షరతులు పెట్టాడనేది సమాచారం. తనను కోచ్ గా చేస్తానని హామీ ఇస్తేనే దరఖాస్తు విషయంలో ముందడుగు వేస్తానని రవిశాస్త్రి చెప్పినట్లు తెలుస్తోంది. కోచ్ ఎంపికలో క్యూలో ఉండదల్చుకోలేదని బీసీసీఐకి తెగేసి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవమే రవిశాస్త్రి చేత అలా చెప్పించి ఉండవచ్చు. ఇటీవల బీసీసీఐ ముందుగా దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు రవిశాస్త్రి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. తనను బీసీసీఐ అవమానించిందని భావించిన రవిశాస్త్రి.. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో రవిశాస్త్రిని కోచ్ పదవి వరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే రవిశాస్త్రి కోచ్ దరఖాస్తు కంటే కూడా షరతులతో కూడిన ఒక మెయిల్ ను పంపినట్లు విశ్వసనీయ సమాచారం. -
అనిల్ కుంబ్లే సంచలన నిర్ణయం!
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. బీసీసీఐ తీరుపై తీవ్ర మనస్తాపంతో ఆయన మంగళవారం సాయంత్రం కోచ్ పదవికి రాజీనామా చేశాడు. మంగళవారం టీమిండియాతోపాటు ఆయన వెస్టిండీస్ పర్యటనకు వెళ్సాల్సి ఉంది. అయినా, ఈ పర్యటనకు దూరంగా భారత్‌లోనే ఉండిపోయిన కుంబ్లే ఎవరూ ఊహించనిరీతిలో తన రాజీనామాను ప్రకటించాడు. గత కొన్నాళ్లుగా కెప్టెన్ విరాట్ కోహ్లితో కుంబ్లేకు తీవ్ర విభేదాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా కుంబ్లే రాజీనామా చేయడం గమనార్హం. అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్ పదవి చేపట్టి ఏడాది మాత్రమే అయింది. సహజంగానే ఈ స్పిన్ దిగ్గజానికి కోచ్‌గా మరో ఏడాది పొడిగింపు ఇస్తారని అంతా భావించారు. కోచ్‌గా జట్టుకు కుంబ్లే అద్భుతమైన విజయాలు అందించాడు. అయినప్పటికీ కెప్టెన్ కోహ్లితోపాటు ఇతర జట్టు సభ్యులు కుంబ్లేను వ్యతిరేకించడంతో ఆయనకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. కోచ్ పదవి కోసం మళ్లీ ఇంటర్వ్యూలు చేపడుతున్నట్టు ప్రకటించింది. కొత్త కోచ్‌ను నియమించబోతున్నట్టు చెప్పకనే చెప్పింది. అయినా.. కుంబ్లే మరోసారి కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకు దరఖాస్తు చేసుకున్నాడు. భారత జట్టుకు కోచ్‌గా సేవలు అందించేందుకు తాను సుముఖంగా ఉన్నట్టు మరోసారి చాటాడు. అయినా టీమిండియాలో తిరుగులేని పట్టు కలిగిన కెప్టెన్ కోహ్లి పంతమే నెగ్గింది. కుంబ్లే కోచ్ పదవి నుంచి వైదొలగక తప్పలేదు. చదవండి: కుంబ్లేతో పెట్టుకొని.. భారీ మూల్యమే చెల్లించాడు! చదవండి: ధోనీ, యువీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు! -
ద్రవిడ్ పదవీ కాలం పొడిగింపు!
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత అండర్ -19 , భారత్ -ఎ క్రికెట్ జట్లకు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అండర్ -19, భారత్ -ఎ క్రికెట్ జట్టు కోచ్ ను ఎంపిక చేసే క్రమంలో కూడా ఇంటర్య్వూలో నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ద్రవిడ్ పదవీ కాలాన్ని పొడిగించే క్రమంలో ఎటువంటి ఇంటర్వ్వూలో నిర్వహించకుండానే అతన్ని ఎంపిక చేయాలని చూస్తున్నారు. భారత్ యువ క్రికెటర్లకు ద్రవిడ్ మార్గదర్శకం అవసరమని బీసీసీఐ భావిస్తోంది. దాంతో అతన్నే తిరిగే ఎంపిక చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కాగా, భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కోచ్ పదవిలో కుంబ్లేను కొనసాగిస్తారా లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
'రెండు లైన్ల రెజ్యూమ్'పై సెహ్వాగ్ ఇలా..
న్యూఢిల్లీ: తాను భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసిన క్రమంలో ముందుగా రెండు లైన్ల రెజ్యూమ్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కు పంపానంటూ మీడియాలో వెలుగుచూసిన వార్తలపై వీరేంద్ర సెహ్వాగ్ ఎట్టకేలకు స్పందించాడు. ఆ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, అదంతా మీడియా సృష్టేనని తాజాగా వివరణ ఇచ్చుకునే యత్నం చేశాడు. అసలు రెండు లైన్ల రెజ్యూమ్ అనేదిపేరుకే సరిపోతుందని, అటువంటప్పుడు ఆ తరహా రెజ్యూమ్ ను ఎందుకు పంపుతానంటూ ఎదురుప్రశ్నించాడు. తాను పంపిన రెజ్యూమ్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిబంధనలకే లోబడే ఉందంటూ స్పష్టం చేశాడు. 'మీడియా చెప్పినట్లు రెండు లైన్ల రెజ్యూమ్ పంపి ఉంటి నిజంగా చాలా సంతోషించేవాణ్ని. ఒకవేళ కోచ్ పదవికి రెండు లైన్లలో రెజ్యూమ్ పంపి ఉంటి అది కేవలం నా పేరుకే సరిపోతుంది. అటువంటప్పుడు నా వివరాలు ఎలా పంపగలను'అని సెహ్వాగ్ ప్రశ్నించాడు.ఇదిలా ఉంచితే, తన క్రికెట్ కెరీర్ నిలకడగా సాగడానికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీనే కారణమని సెహ్వాగ్ తెలిపాడు. మైదానంలో ఓపికగా ఎలా ఆడాలో నేర్చుకున్నది గంగూలీ నుంచి అంటూ కితాబిచ్చాడు. తనకు నచ్చిన ఆల్ టైమ్ ఫేవరెట్ కెప్టెన్ గంగూలీనే అంటూ సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనలో నమ్మకాన్ని పెంచిన ఆటగాడన్నాడు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఫోర్లు కొట్టడం సచిన్ నుంచి అలవర్చుకున్నదేనని సెహ్వాగ్ తెలిపాడు. -
ముంబై రంజీ జట్టు కోచ్‌గా సమీర్ దిఘే
ముంబై: భారత మాజీ వికెట్ కీపర్ సమీర్ దిఘే, ముంబై రంజీ జట్టు కోచ్‌గా నియమితులయ్యారు. 2017–18 సీజన్లో రంజీ జట్టుకు సమీర్ కోచ్‌గా వ్యవహరిస్తారని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిట్ స్థానంలో సమీర్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ పదవికి మరో భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే పోటీపడగా అజిత్ అగార్కర్ సారథ్యంలోని ఎంసీఏ క్రికెట్ అభివృద్ధి కమిటీ సమీర్‌ను ఎంపికచేసింది. 48 ఏళ్ల సమీర్ 2000–2001 మధ్య కాలంలో భారత్‌కు 6 టెస్టులు, 23 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించారు. -
భారత్ కొత్త కోచ్ ఈయనేనా?
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లేల మధ్య వచ్చిన మనస్పర్ధలు టామ్ మూడీకి లాభం చేకూర్చుతాయా?. తాజా పరిణామాలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. టీమిండియా కోచ్‌కు అప్లికేషన్లు స్వీకరించడం బుధవారంతో ముగిసింది. భారత్ మాజీ క్రికెటర్లు చాలా మంది కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ.. దరఖాస్తు చేసుకున్న హై ప్రొఫైల్ వ్యక్తుల్లో టామ్ మూడి ఒకరని తెలిసింది. కొత్త కోచ్ ఎంపిక విషయంపై మాట్లాడిన ఓ బీసీసీఐ అధికారి టామ్ మూడీకి చాన్స్ ఎక్కువగా ఉందని తెలిపారు. గతంలో కూడ మూడీ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కోచ్ పదవికి చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మూడీ గతంలో శ్రీలంకకు కోచ్ వ్యవహరించారని ఆయనకు భారత్ క్రికెట్ పరిస్ధితులపై మంచి అవగాహన ఉందని అన్నారు. -
సెహ్వాగ్..నువ్వు కూడా దరఖాస్తు చేసుకో!
ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి ఎంతమంది రేసులో ఉంటారనేది అంచనా వేయడం కష్టంగా మారింది. ఈసారి దిగ్గజ క్రికెటర్ల నుంచి భారీ పోటీ ఉంటుందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అయితే కోచ్ రేసులో వీరేంద్ర సెహ్వాగ్ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటీవల సెహ్వాగ్ ను కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోమని బీసీసీఐలోని ఒక పెద్దాయన కోరినట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల)లో కింగ్స్ పంజాబ్ కు కోచ్ గా వ్యవహరించే సమయంలో సెహ్వాగ్ ను టీమిండియా కోచ్ దరఖాస్తు చేసుకోమని సలహా ఇచ్చారట. టీమిండియా కోచ్ గా అప్లై చేయమని సెహ్వాగ్ కు ఆశలు కల్పించడంతో మరి అతగాడు ఏం చేస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఏడాది కాలంగా ప్రధాన కోచ్ గా పని చేస్తున్న అనిల్ కుంబ్లే.. ఈసారి నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యే అవకాశాన్ని బీసీసీఐ కల్పించింది. -
కుంబ్లేకు ఇచ్చే గౌరవం ఇదేనా?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ నియామకానికి సంబంధించి బీసీసీఐ ఇటీవల దరఖాస్తుల్ని ఆహ్వానించడంపై లోథా కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో భారత క్రికెట్ జట్టుకు సక్సెస్ ఫుల్ గా కోచ్ గా ఏడాది పాటు పని చేసిన కుంబ్లేను ఉన్నపళంగా పక్కకు పెట్టడాన్ని సైతం తప్పుబట్టింది. భారత క్రికెట్ జట్టులో ఎంతో ముఖ్యమైన కోచ్ పదవిని ఏడాదికే పరిమితం చేయడం ఎంతమాత్రం సరికాదని లోథా కమిటీ సెక్రటరీ గోపాల్ శంకరనారాయణ విమర్శించారు. క్రికెట్ లో పారదర్శకత అనేది ముఖ్యమని, ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్బంగా ప్రస్తావించారు. 'బీసీసీఐ పరిపాలకులు సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే పని చేయాలి. ఏడాది పాటు కోచ్ ను నియమించే క్రమంలో సుప్రీం తీర్పును పూర్తిస్థాయిలో అమలు చేయలేదనే విషయం స్పష్టమైంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ కోచ్ కు దరఖాస్తుల్ని ఎందుకు కోరాల్సి వచ్చిందో అర్దం కావడం లేదు. కోచ్ గా విజయవంతమైన కుంబ్లే పదవీ కాలాన్ని ఎందుకు పొడిగించడం లేదు. ఒక జాతీయ కోచ్ కు ఇచ్చే గౌరవం ఇదేనా. ఏడాదిపాటు కోచ్ ను నియమించడం ఎంతవరకూ కరెక్ట్. ఇది క్రికెట్ ను ఎంతమాత్రం ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడదు అనే విషయం గుర్తించాలి.. మరొక ఏడాదికి ఎవరు కోచ్ గా వస్తారో చూద్దాం 'అని శంకరనారాయణ బీసీసీఐ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతేడాది కుంబ్లే ను భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలానికి కుంబ్లేను కోచ్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే అతని పదవి కాలాన్ని పొడిగించకుండా కొత్తగా కోచ్ అభ్యర్దికి దరఖాస్తులు కోరడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
కుంబ్లేకు పొడిగింపు లేదు!
-
కుంబ్లేకు పొడిగింపు లేదు!
►కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తుల ఆహ్వానం ►ఎంపిక చేయనున్న క్రికెట్ సలహా కమిటీ న్యూఢిల్లీ: కోచ్‌గా వ్యవహరించిన కాలంలో స్వదేశంలో భారత్ ఆడిన 13 టెస్టుల్లో 10 విజయాలు, ఒకటే పరాజయం. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ విజయంతో పాటు వన్డేల్లో కూడా మెరుగైన ప్రదర్శన. అయితే ఇవేవీ కూడా అనిల్ కుంబ్లేను కోచ్‌గా కొనసాగించేందుకు సరిపోలేదు. చాంపియన్స్ ట్రోఫీతో కుంబ్లే ఏడాది పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత ఉన్నవారు ఎవరైనా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుత కోచ్ హోదాలో మళ్లీ తన బయోడేటాను పంపించాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటర్వూ్యకు హాజరయ్యే వెసులుబాటు మాత్రం కుంబ్లేకు బోర్డు కల్పించింది. ఆసక్తి కలిగిన వారు ఈనెల 31లోగా అప్లై చేసుకోవాల్సిఉండగా, వీరిని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులైన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఇంటర్వూ్య చేస్తారు. ‘ఈ ఎంపిక వ్యవహారం పూర్తి పారదర్శకంగా ఉండేందుకు పరిపాలక కమిటీ (సీఓఏ)కి చెందిన నామినీ పర్యవేక్షకులుగా ఉంటారు. కుంబ్లే పనితీరు బాగానే ఉంది. అయితే వచ్చే నెల 20న ఆయనతో ఒప్పంద గడువు ముగుస్తుంది. ఆ తర్వాత సహజంగా జరగాల్సిన ప్రక్రియే ఇదంతా. కుంబ్లే కూడా మరోసారి ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీసీఐలోని ఏ ఒక్కరి నిర్ణయం వల్లో కోచ్ ఎంపిక జరగదు. గంగూలీ, సచిన్, లక్ష్మణ్ ఎంపిక చేస్తారు’ అని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. కుంబ్లేపై అసంతృప్తి... నిజానికి మైదానంలో జట్టు ప్రదర్శన బాగున్నా... ఇతర కారణాలు కుంబ్లేను ఆటోమెటిక్‌గా కొనసాగించేందుకు అడ్డు పడుతున్నాయి. కుంబ్లే వ్యవహార శైలిపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల వేతనాలతో పాటు తన వేతనాన్ని కూడా భారీగా పెంచాలనే విషయంలో ఈ దిగ్గజ స్పిన్నర్ దూకుడుగా వెళ్లడం బోర్డుకు రుచించలేదు. ఈ కారణంగానే చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు అటు ఇంగ్లండ్‌లో అడుగుపెట్టగానే ఇటు కొత్త కోచ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం కోరుతోంది. ప్రస్తుతం ‘ఎ’ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ.2 కోట్లు ఇస్తుండగా దీన్ని రూ.5 కోట్లకు పెంచాలని అలాగే కోచ్ వేతనం రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్లకు పెంచాలని కుంబ్లే సూచించారు. ‘కుంబ్లే ఆటగాళ్ల కోసమే కాకుండా తన కోసం కూడా బేరమాడుతున్నాడు. ఆయన చేస్తున్న డిమాండ్లు చాలా క్లిష్టంగా ఉన్నాయి. విరాట్ కోహ్లి కోసం 25 శాతం అదనంగా ‘కెప్టెన్సీ ఫీజు’ ఇవ్వాలని కూడా పట్టుబడుతున్నాడు. అంతేకాకుండా సెలక్షన్ కమిటీలో కెప్టెన్, కోచ్‌లకు కూడా సమానస్థాయిలో హోదా, ఓటింగ్ హక్కు కావాలంటున్నాడు. ఇవన్నీ ఆయనకు సంబంధం లేని విషయాలు’ అని బోర్డుకు చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అలాగే కుంబ్లే సూచనల్లో చాలా వాటిని అమలు చేసేందుకు బోర్డు ఇష్టపడడం లేదు. బీసీసీఐ ఆదాయంనుంచి ఆటగాళ్లకు ఇస్తున్న 26 శాతం మొత్తాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచేది లేదని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. ఆఫీస్ బేరర్ల వివరాలు పంపండి: సీఓఏ న్యూఢిల్లీ: బీసీసీఐ అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు తమ ఆఫీస్ బేరర్ల వివరాలను పంపించాలని బీసీసీఐ పరిపాలక కమిటీ (సీఓఏ) ఆదేశించింది. మే 6న జరిగిన సమావేశంలోనే సీఓఏ ఈ ప్రతిపాదనను తెచ్చినా అవగాహనా లోపంతో రాష్ట్ర సంఘాలు ఇప్పటివరకు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తాజాగా గురువారం సీఓఏ మరోసారి రాష్ట్ర సంఘాలకు లేఖ రాసింది. తమ పరిధిలోని ఆఫీస్ బేరర్ల పేర్లు, పదవీ కాలం, ఇతర వివరాలను పంపించాలని కోరింది. లోధా కమిటీ ప్రతిపాదనల అమలుపై త్వరలోనే మరోసారి రాష్ట్ర సంఘాలతో భేటీ అవుతామని ఆ లేఖలో పేర్కొంది. -
కొత్త కోచ్ కావలెను: బీసీసీఐ
-
కొత్త కోచ్ కావలెను: బీసీసీఐ
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ). దీనిలో భాగంగా ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలో ప్రస్తుత ప్రధాన కోచ్ గా ఉన్న అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగిసిపోతున్న తరుణంలో కొత్త కోచ్ కు సంబంధించి దరఖాస్తుల్ని ఆహ్వానించింది. 'పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కు కోసం ఆప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నాం. ఆసక్తిగల అభ్యర్ధులు ఆ పదవికి దరఖాస్తు చేసుకోవచ్చు'అని బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరి పేర్కొన్నారు. ఇంగ్లండ్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ వరకూ మాత్రమే అనిల్ కుంబ్లే ప్రధాన కోచ్ గా ఉండనున్నారు. అయితే ఆ తరువాత మరొకరికి కొత్తగా బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ యోచిస్తోంది. అదే క్రమంలో కుంబ్లేను టీమిండియా డైరెక్టర్ గా నియమించాలని చూస్తోంది. ఒకవేళ చాంపియన్స్ ట్రోఫీ ముగిసే నాటికి కొత్త కోచ్ నియమాకం జరకపోతే కుంబ్లేనే ఆ బాధ్యతల్లో కొనసాగుతాడు.కొత్త కోచ్ నియమాకాన్ని బీసీసీఐ పరిపాలన కమిటీ(సీఓఏ)తో పాటు క్రికెట్ అడ్వైజరీ కమిటీ పర్యవేక్షించనుంది. -
బాలిక డ్రెస్ ‘రెచ్చగొట్టేలా’ ఉందంటూ!
మలేషియాలో 12 ఏళ్ల చెస్ చాంపియన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ బాలిక మోకాళ్ల వరకు ఉన్న దుస్తులు వేసుకున్నప్పటికీ ఆమె డ్రెస్ ‘రెచ్చగొట్టేలా’ ఉందంటూ.. జాతీయ యువజన టోర్నమెంటులో ఆడనివ్వలేదని ఆమె కోచ్ వెల్లడించారు. మలేషియాలో గత నెల 14-16 తేదీల మధ్య జాతీయ పాఠశాల స్థాయి చెస్ చాంపియన్‌షిప్ జరిగింది. అయితే, ఈ పోటీలలో పాల్గొనేందుకు తన విద్యార్థిని పాల్గొంటుండగా.. తను దుస్తులు సరైనవిధంగా లేదంటూ టోర్నమెంటు డైరెక్టర్ మధ్యలోనే ఆమెను టోర్నమెంటు నుంచి గెంటేశారని, దీంతో తన విద్యార్థిని తీవ్ర ఆవేదనకు గురైందని కోచ్ కౌషల్ ఖందర్ చెప్పారు. చెస్ టోర్నమెంటులో డ్రెస్ కోడ్ ఉండటం మామూలు విషయమే. ఆటగాళ్లు హుందాగా పోటీలలో పాల్గొనేందుకు వీలుగా స్థానిక నిర్వాహకులకు ఇలాంటి నిబంధనలు విధించే అవకాశం ప్రపంచ చెస్ సమాఖ్య అయిన ఎఫ్ఐడీఈ కల్పిస్తుంది. అయితే, ఇరాన్ వంటి దేశాల్లోనే ఇలాంటి డ్రెస్‌కోడ్ అమలవుతుంది. మలేషియా ఇస్లామిక్ దేశమైన అక్కడ బహిరంగ ప్రదేశాల్లో స్కర్ట్స్, షార్ట్స్ వేసుకోవడం సర్వసాధారణం. అయితే, మొదటిరౌండులో తన విద్యార్థిని వేసుకున్న డ్రెస్ మీద ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, కానీ రెండోరౌండ్లో ఆమె బాగా ఆడుతున్న సమయంలోనే ఇలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ తనను ఆడకుండా చేశారని, ఇలా వ్యవహరించడం దారుణమని కోచ్ కౌషల్ తన ఫేస్బుక్ పేజీలో తెలిపారు. -
గంభీర్-కోచ్‌ల వివాదంపై కమిటీ
ఢిల్లీ: ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా ఢిల్లీ ఓపెనర్ గౌతం గంభీర్, కోచ్ క్రిష్ణన్ భాస్కరన్ పిళ్లై మధ్య చోటు చేసుకున్న వివాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో రాజేందర్ ఎస్ రాథోడ్, సోనీ సింగ్‌లు మిగిలిన ఇద్దరు సభ్యులు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఢిల్లీ పోరాటం ముగిసిన తరువాత తనను గంభీర్ తీవ్రంగా దూషించినట్లు బాస్కరన్ అనేకసార్లు మీడియా ముందు వాపోయాడు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ గంభీర్ అగౌరపరిచాడని భాస్కరన్ తెలిపాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీడీసీఏ.. ఆ ఘటనపై విచారణకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ డీడీసీఏ అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ విక్రమ్ జిత్ సేన్ తాజాగా ఒక సర్క్యులర్ ను జారీ చేశారు. -
పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్‌గా మన్హాస్
న్యూఢిల్లీ: ఐపీఎల్ పదో సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తమ అసిస్టెంట్ కోచ్‌గా మిథున్ మన్హాస్‌ను ఎంపిక చేసుకుంది. అతడు గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పుణే, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్లో ఆడాడు. అలాగే రంజీల్లో ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగాడు. అలాగే బ్యాటింగ్ కోచ్‌గా జె.అరుణ్ కుమార్ వ్యవహరించనున్నాడు. రంజీ ట్రోఫీలో అతను కర్ణాటక జట్టు కోచ్‌గా వ్యవహరించగా ఐపీఎల్లో బెంగళూరుకు ఆడిన అనుభవం ఉంది. వీరితో పాటు ఫిజియోథెరపిస్ట్‌గా అమిత్ త్యాగి, మనోజ్ కుమార్ యోగా శిక్షకుడిగా ఉండనున్నారు. ఆర్.శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతారు. వీరంతా టీమ్ మెంటార్‌గా ఉన్న సెహ్వాగ్ ఆధ్వర్యంలో పనిచేస్తారని జట్టు వర్గాలు తెలిపాయి. -
ఈ కోచ్ చాలా స్టైల్ గురూ
స్కూల్‌కి హాలీడేస్... చిన్నారులకు జాలీడేస్.... సమ్మర్ వస్తే పిల్లలకు మాంచి పండగ వచ్చినట్టే. స్కూల్లో గురువులు చెప్పే పాఠాలకు ఫుల్స్టాప్ పెట్టి కాస్త రిలాక్స్ అయ్యే ఆ టైమ్‌లో మరో గురువు వాళ్ల దగ్గరకి వస్తున్నాడు. ఆయనే ‘విక్టరీ’ వెంకటేశ్. స్కూల్లో గురువులు క్లాస్ రూముల్లో పాఠాలు చెబితే... వెంకీ ప్లే– గ్రౌండ్లో క్లాస్ తీసుకుంటారు. సమ్మర్ స్పెషల్ క్లాస్‌తో ఈ గురువు రెడీ అవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో వెంకటేశ్ బాక్సింగ్ కోచ్‌గా నటించిన సినిమా ‘గురు’. ఎస్. శశికాంత్ నిర్మించిన ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నెల 17న ‘ఏయ్ సక్కనోడ..’ పాట లిరికల్ వీడియో విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ కనిపించని సరికొత్త లుక్‌లో వెంకటేశ్ సై్టలిష్‌గా కనిపి స్తారు. ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాను దర్శకురాలు మలచిన విధానం అద్భుతం. మార్చిలో పాటల్ని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. రితికా సింగ్, ముంతాజ్ సర్కార్ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: హర్షవర్థన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, శ్రీమణి, ఫైట్స్: ‘స్టన్నర్’ శామ్, ‘రియల్’ సతీశ్, కళ: జాకీ, కూర్పు: సతీశ్ సూర్య, కెమేరా: కేఏ శక్తివేల్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర, సంగీతం: సంతోశ్ నారాయణన్. -
లాంగర్, గిలెస్పీ, పాంటింగ్..!
సిడ్నీ:ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు ఒక క్రికెట్ జట్టు పర్యవేక్షణ బాధ్యతలను చూస్తే ఎలా ఉంటుంది. అందులోనూ ఒకే తరం క్రికెటర్లు ఆ పర్యవేక్షణ బాధ్యత చూస్తే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది కదూ. ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) అదే పని చేసింది. ఒకే తరంలో దిగ్గజ ఆటగాళ్లుగా పేరు గాంచిన జస్టిన్ లాంగర్, జాసన్ గిలెస్పీ, రికీ పాంటింగ్‌లను ఆసీస్ ట్వంటీ 20 జట్టు పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్నారు. కొన్ని రోజుల క్రితం జస్టిన్ లాంగర్‌ను ఆసీస్ ట్వంటీ 20 జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా నియమించిన సీఏ.. ఆ తరువాత జాసన్ గిలెస్పీ ను అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. అయితే తాజాగా రికీ పాంటింగ్‌ను ఆసీస్ ట్వంటీ 20 జట్టుకు అసిస్టెంట్ కోచ్ నియమిస్తూ సీఏ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల్లో స్వదేశంలో శ్రీలంకతో ట్వంటీ 20 సిరీస్ నేపథ్యంలో ఈ దిగ్గజ త్రయానికి క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఫిబ్రవరి 17 వ తేదీన మెల్బోర్న్లో తొలి ట్వంటీ 20 జరుగనుండగా, ఫిబ్రవరి 20న గీలాంగ్‌లో రెండో టీ 20, ఫిబ్రవరి 23న అడిలైడ్‌లో మూడో ట్వంటీ 20 జరుగనుంది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు దాదాపు ఒకే సమయంలో రెండు సిరీస్‌లు ఆడుతున్న క్రమంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. త్వరలో భారత్ లో ఆసీస్ జట్టు పర్యటించనుండగా, అదే సమయంలో శ్రీలంక జట్టు ఆసీస్ పర్యటనకు రానుంది. కొంతమంది ప్రధాన ఆటగాళ్లు భారత్ పర్యటనకు వస్తుండగా, మరికొంతమంది టీ 20 స్పెషలిస్టు ఆటగాళ్లు మాత్రం స్వదేశంలో శ్రీలంకతో జరిగే సిరీస్ లో పాల్గొనున్నారు. భారత్ లో పర్యటించే ఆసీస్ జట్టుకు డారెన్ లీమన్ పర్యవేక్షన బాధ్యతలు నిర్వర్తించనుండగా, లాంగర్, గిలెస్పీ, రికీ పాంటింగ్ లో ఆసీస్ 'జూనియర్' జట్టుకు కోచింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. పాంటింగ్ తన అంతర్జాతీయ కెరీర్లో 27వేలకు పైగా పరుగులను సాధించాడు. దాంతో పాటు ఆస్ట్రేలియా సాధించిన వరుస మూడు వరల్డ్ కప్‌ల్లో(1999,2003, 07) పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు. అందులో 2003, 07 వన్డే వరల్డ్ కప్‌లను సాధించిన ఆసీస్ జట్టుకు పాంటింగ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆసీస్ క్రికెట్ చరిత్రలో పాంటింగ్ ఘనమైన రికార్డు కల్గి ఉండటమే అతనికి కొత్త బాధ్యతను అప్పజెప్పడానికి ప్రధాన కారణమైంది. గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం పాంటింగ్ కు ఉన్న సంగతి తెలిసిందే. -
అసిస్టెంట్ కోచ్‌గా గిలెస్పీ
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ జాసన్ గిలెస్పీ ఆ దేశ ట్వంటీ 20 జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగే మూడు ట్వంటీ 20ల సిరీస్ ద్వారా గిలెప్పీ తన పర్యవేక్షణ బాధ్యతలను తీసుకోనున్నాడు. ఇటీవల ఆసీస్ టీ 20 జట్టుకు జస్టిన్ లాంగర్‌ను కోచ్ గా ఎంపిక చేయగా, తాజాగా టీ 20 జట్టుకు గిలెస్పీకి అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆసీస్ జట్టు ఉన్నతిలో భాగంగా తనకు అప్పజెప్పిన బాధ్యతపై గిలెప్సీ హర్హం వ్యక్తం చేశాడు. ' ఆసీస్ జట్టుతో పాలుపంచుకునే అవకాశం కల్పించినందుకు నిజంగా సంతోషం. నా పాత్ర పోషించేందుకు చాలా ఆతృతగా ఉన్నాను'అని గిలెస్పీ పేర్కొన్నాడు. తన టెస్టు కెరీర్లో 71 మ్యాచ్‌లు ఆడిన గిలెస్పీ. 259 వికెట్లు సాధించగా, 97 వన్డేల్లో 142 వికెట్లు తీశాడు. -
భవిష్యత్‌కు దిక్సూచి!
• కోచ్ పాత్రలో విశేషంగా రాణిస్తున్న రాహుల్ ద్రవిడ్ • భారత యువ జట్లకు చక్కటి మార్గనిర్దేశనం • కుర్రాళ్ల వరుస విజయాల్లో కీలకపాత్ర దాదాపు ఏడాదిన్నర క్రితం బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్ సలహా కమిటీని ప్రకటించింది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ ఇందులో సభ్యులు. ఈ జాబితా చూసిన ప్రతి ఒక్కరికీ ఒకటే సందేహం.. ఇందులో రాహుల్ ద్రవిడ్ ఎక్కడ అని. అయితే నాలుగు గోడల మధ్య కూర్చుని ఏవో సలహాలు ఇవ్వడం ఈ మిస్టర్ డిపెండబుల్‌కు నచ్చని పని. అందుకే భారత క్రికెట్ భవిష్యత్ వెలిగిపోవాలంటే ఓ మాజీ ఆటగాడిగా తానేమి చేయగలనో బోర్డుకు స్పష్టంగా సంకేతాలు పంపారు. ఫలితంగా భారత్ ‘ఎ’, అండర్–19 కోచ్‌గా ద్రవిడ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. బరిలోకి దిగడమే ఆలస్యం యువ క్రికెటర్ల ఆటకు మెరుగులు దిద్దడమే కాకుండా మంచి ఫలితాలతో భారత క్రికెట్‌కు భరోసా ఇచ్చే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. కరుణ్ నాయర్‌పై ద్రవిడ్ ప్రభావం ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన చివరి టెస్టులో తన మూడో మ్యాచ్‌లోనే కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ అసమాన బ్యాటింగ్ తీరుపై రాహుల్ ద్రవిడ్ ప్రభావాన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే ఐపీఎల్లో నాయర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు. ఆ జట్టుకు మెంటార్‌గా ద్రవిడ్ వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఇండియా ‘ఎ’ తరఫున కూడా ఆడాడు. అక్కడా కోచ్ ద్రవిడే. దీంతో ఐపీఎల్లో కానీ, నెట్స్‌లో కానీ ద్రవిడ్‌తో ఎక్కువ సాన్నిహిత్యం నాయర్‌కు కలిగింది. తన బ్యాటింగ్ బలహీనతలను ఆయనతో పంచుకుని లోపాలను సరిదిద్దుకున్నాడు. తద్వారా ఈ కర్ణాటక ఆటగాడు ఐపీఎల్‌లోనూ మెరుగ్గా రాణించి అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్–19 ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు భారత ‘ఎ’ జట్టు ఆయన ఆధ్వర్యంలోనే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్లతో జరిగిన ముక్కోణపు సిరీస్‌ను కైవసం చేసుకుంది. నిజానికి ఈ ఆటగాళ్లలో చాలామందికి రంజీ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. వారికి శిక్షణపరంగా పెద్దగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ‘ప్రాథమిక స్థాయి శిక్షణ వారికి అవసరం లేదు. నా ఉద్దేశం కూడా వారికి పాఠాలు చెప్పడం కాదు. నిజానికి ఎలా ఆడాలో వారికి చెప్పాల్సిన అవసరం లేదు. వారు సమర్థులు కాబట్టే జట్టులో ఉన్నారు. కాకపోతే వారిని మరింత మెరుగైన స్థాయికి తీసుకొచ్చేందుకు తగిన మార్గనిర్దేశనం అవసరం’ అని ద్రవిడ్ అప్పట్లో చెప్పారు. అయితే ద్రవిడ్‌కు అసలు సిసలు పరీక్ష అండర్–19 ప్రపంచకప్‌లోనే ఎదురైంది. తన సత్తాకు ఈ టోర్నీ సవాల్‌గా నిలిచింది. ఎలాగైనా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆటగాళ్లు కలలు కనే వయస్సు అది. వీరిని అత్యంత నైపుణ్యం కలిగిన ఆటగాళ్లుగా తీర్చిదిద్దితేనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి బృహత్తర బాధ్యత తనపైనే ఉండగా దీనికి తగ్గట్టుగానే ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఆ జట్టు అద్భుత ఫలితాలు సాధించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు వెళ్లి రన్నరప్ కాగలిగింది. కుర్రాళ్ల ఆటతీరులోనూ గణనీయంగా మార్పు కనిపించింది. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, అర్మాన్ జాఫర్, అన్మోల్ప్రీత్ సింగ్ విశేషంగా ఆకట్టుకున్నారు. ‘పరాజయమనేదే లేకుండా ప్రతీసారి విజయం సాధించడం గురించి మనం ఆలోచించకూడదు. ఈ సమయంలో మీకు ఓటమి రావడం మంచిదే. అయితే మున్ముందు ఎదురయ్యే సవాళ్ల కోసం మాత్రం ఇప్పటి నుంచే సిద్ధం కండి’ ఇదీ అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి అనంతరం జట్టుకు ద్రవిడ్ చెప్పిన మాటలు. కొత్త కుర్రాళ్లతో బరిలోకి... శుక్రవారం శ్రీలంకలో ముగిసిన అండర్–19 ఆసియా కప్‌లో మాత్రం భారత్ పూర్తిగా కొత్త కుర్రాళ్లతో బరిలోకి దిగింది. ప్రతీ ఆటగాడికి ఆడే అవకాశం రావాలనే ముందుచూపుతో ఆలోచించిన కోచ్ ద్రవిడ్ సూచనల ప్రకారం సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆయన సలహాపైనే ఏ ఆటగాడు కూడా రెండు అండర్–19 ప్రపంచకప్‌లు ఆడకూడదని బీసీసీఐ ఈ ఏడాది జూన్‌లో నిర్ణయం తీసుకుంది. దీంతో 2018లో జరిగే ఈ మెగా టోర్నీకి సన్నద్ధం కావాలంటే ఆసియా కప్‌ను మంచి అవకాశంగా భావించారు. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో పాకిస్తాన్ కూడా ఇలాగే ప్రపంచకప్ ఆడిన అనుభవంలేని ఆటగాళ్లతోనే ఆడింది. అయితే పాక్ జట్టు అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడి లీగ్ దశలోనే వెనక్కి వెళ్లింది. అయితే కొత్త ఆటగాళ్లయినా భారత్ మాత్రం దుమ్ము రేపింది. 2012 నుంచి వరుసగా మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. పృథ్వీ షా, హిమాన్షు రాణా, అభిషేక్ శర్మ వెలుగులోకి వచ్చారు. అయితే దీనికి ముందు ద్రవిడ్ ఈ టోర్నీకి తగిన ప్రణాళికలతో సిద్ధమయ్యారు. ఇందుకు వీడియో విశ్లేషకుడు దేవరాజ్ రౌత్ సహాయం తీసుకున్నారు. భారత్ ఆడే మ్యాచ్ మొత్తాన్ని ఆయన చిత్రీకరించి అందులోంచి కొన్ని భాగాలను ఎడిట్ చేసి వారి ఆటతీరును పరిశీలించుకునేందుకు ప్రతీ ఆటగాడికి ఇచ్చేవారు. దీంతో తాము ఎక్కడ తప్పులు చేస్తున్నామనే విషయం వారికి బోధపడి దానికి అనుగుణంగా మార్పులు చేసుకున్నారు. అందుకే కొలంబో బయలుదేరడానికి కొద్ది రోజుల ముందు ఏడుగురు ఆటగాళ్ల వయస్సు విషయం వివాదాస్పదమై అప్పటికప్పుడు ఇతర ఆటగాళ్లు జట్టులో చేరినా ద్రవిడ్ పక్కా వ్యూహంతో వెళ్లడంతో ఇబ్బంది కాలేదు. అంతేకాకుండా ఈ టోర్నీ కోసం ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు ప్రతీ జోన్లో అండర్–16, 19 శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. వారి ఎంపిక ముగిశాక తగిన శిక్షణ ఇవ్వడం ఆరంభించారు. ఈ ఏడాది ఆరంభంలో క్రికెట్లో తగిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆటగాళ్లను డ్యూక్స్, ఎస్జీ, కూకాబుర్రా బంతులతో ఆడించారు. అక్టోబర్‌లో జరిగిన అండర్–19 చాలెంజర్ టోర్నీలోనూ ఈ జట్టు ఆడింది. ఇలాంటి ముందుచూపు ప్రణాళికలతో రాహుల్ ద్రవిడ్ బృందం ఆసియాకప్‌లో చాంపియన్‌గా నిలవగలిగింది. ప్రస్తుతానికి భారత క్రికెట్ జట్టు వన్టేల్లో, టెస్టుల్లో పటిష్టంగానే కనిపిస్తున్నా ఎప్పుడు అవసరమైతే అప్పుడు జట్టులో చేరేందుకు యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే పనిలో ద్రవిడ్ తీరికలేకుండా ఉండడం మన క్రికెట్‌కు మేలు చేకూర్చే అంశం. తన ఆటతో సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్‌కు వెన్నెముకలా నిలిచిన ద్రవిడ్... ఇప్పుడు తర్వాత తరాన్ని కూడా అదే రీతిలో వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ సరైన దిశగా నడిపిస్తున్నారు. -
ఆస్ట్రేలియా టి20 కోచ్‌గా మైక్ హస్సీ!
శ్రీలంకతో స్వదేశంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే టి20 సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు మాజీ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీ కోచ్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి. అదే నెలలో భారత్‌లో జరిగే టెస్టు సిరీస్ కోసం ప్రధాన కోచ్ డారెన్ లీమన్ జట్టు వెంట రానున్నారు. దాంతో శ్రీలంకతో జరిగే టి20 సిరీస్‌కు కోచ్ ఉండాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) హస్సీ పేరును పరిశీలిస్తోంది. 79 టెస్టులు ఆడిన హస్సీ ఈ ఏడాది భారత్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియా జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరించారు. -
హాకీ కోచ్‌గా వెంకటేశ్వర్లు
దేవనకొండ: ఆంధ్రప్రదేశ్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి హాకీ పోటీలకు తెర్నెకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెంకటశ్వర్లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం సునీలమ్మ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. గతంలో ఈయన దాదాపు ఐదుసార్లు జాతీయస్థాయి పోటీలకు కోచ్‌గా వ్యవహరించారన్నారు. గ్రామ సర్పంచు రాజన్న, ఉపసర్పంచు సత్యరాజు, ఎంఈఓ యోగానందం, ఎంపీడీఓ ఉమామహేశ్వరమ్మ, ఎంపీపీ రామచంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
టోక్యో ఒలింపిక్స్ వరకూ కోచ్‌గా ఓల్ట్‌మన్స్!
భారత హాకీ జట్టు ప్రధాన కోచ్‌గా ఓల్ట్‌మన్స్‌ను 2020 టోక్యో ఒలింపిక్స్ వరకు కొనసాగించే అవకాశాలు ఉన్నారుు. గత ఏడాది తను బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత జట్టు ప్రదర్శన మెరుగైంది. అజ్లాన్‌షా కప్‌లో రజతం, ఆసియా చాంపియన్స ట్రోఫీలో టైటిల్ లభించారుు. దీంతో తనని సుదీర్ఘకాలం జట్టుతో కొనసాగించాలని హాకీ ఇండియా భావించింది. ఈ మేరకు ఆయనకు కాంట్రాక్టు ఇవ్వాలంటూ భారత క్రీడాప్రాధికార సంస్థకు (సాయ్)కు లేఖ రాసింది. ఓల్ట్‌మన్స్ నియామకాన్ని క్రీడాశాఖ ఆమోదించాల్సి ఉంది. -
భారత్@ 137
న్యూఢిల్లీ: ఫిఫా ర్యాంకింగ్‌సలో భారత ఫుట్‌బాల్ జట్టు గత ఆరేళ్లలో అత్యుత్తమ ర్యాంకును అందుకుంది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్‌సలో భారత్ 11 స్థానాలను ఎగబాకి 137వ ర్యాంకును పొందింది. 2010 ఆగస్టులో తొలిసారిగా తమ కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకు (137)ను సాధించిన అనంతరం మరోసారి ఈ ర్యాంక్‌కు చేరింది. ఈ ర్యాంక్‌పై కోచ్ స్టీఫెన్ కాన్స్టాంటైన్ సంతోషం వ్యక్తం చేశారు. రెండో పర్యాయం తాను బాధ్యతలు తీసుకున్నప్పుడు జట్టు ర్యాంకింగ్‌సను మెరుగుపరచాలని భావించానని, ఇప్పుడు అది నెరవేరిందని చెప్పారు. గతేడాది ఫిబ్రవరిలో ఆయన కోచ్‌గా వచ్చినప్పుడు జట్టు ర్యాంకు 171గా ఉంది. -
ఇంతకీ సాక్షి మాలిక్ కోచ్ ఎవరు?
కోల్‌కతా: రియో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా రెజ్లర్ సాక్షి మాలిక్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విజయంలో కీలక పాత్ర పోషించిన కోచ్ కుల్దీప్ మాలిక్ కు హరియాణా ప్రభుత్వం రూ.10 లక్షల నజరానాను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ఓ సన్మాన కార్యక్రమం ఏర్పాటు అతనికి ఆ చెక్ ఫోటో కాపీని కూడా అందించింది. కాగా, ఆ చెక్ కు సంబంధించి ఇంతవరకూ అసలు చెక్ మాత్రం అందలేదు. ఇదంతా పక్కను పెడితే సాక్షి మాలిక్ 'రియల్'కోచ్ ఎవరు అనే దానిపై ఇప్పడు చర్చ నడుస్తోంది. తన కోచ్‌లు ఇశ్వర్ దాహియా, మన్ దీప్ సింగ్ లు అంటూ సాక్షి తెలియజేయడమే తాజా వివాదానికి కారణమైంది. మరోవైపు రజ్ బీర్ సింగ్ కూడా తానే సాక్షి కోచ్నంటూ పేర్కొనడంతో అసలు చెక్ ను ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు ఆలోచనలో పడ్డారు. దీనిపై తన కోచ్ ఎవరో, ఆ ప్రైజ్ మనీ ఎవ్వరికీ ఇవ్వాలో సాక్షినే స్పష్టం చేయాలని ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆ రాష్ట్ర క్రీడామంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. రియోలో సాక్షి మాలిక్ కాంస్య పతకం సాధించిన అనంతరం హరియాణా ప్రభుత్వం ఆమెకు రూ.2.5 కోట్ల నజరానా ప్రకటించింది. దానిలో భాగంగా ఆమె కోచ్ మన్ దీప్ కు రూ. 10లక్షలను ఇస్తామని వెల్లడించింది. అయితే సాక్షి కోరిక మేరకు రియోలో సాక్షితో ఆమెతోపాటు ఉన్న కోచ్ కుల్దీప్ కూడా రూ. 10 లక్షల ఇవ్వనున్నట్లు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖతర్ తెలిపారు. అయితే ఇప్పడు మరో ఇద్దరు కోచ్‌లు కూడా ఆమె విజయంలో ముఖ్య భూమిక పోషించామని, ఆ పది లక్షల రూపాయిలు తమకే ఇవ్వాలనడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. -
తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి
ఓరుగల్లు బిడ్డగా గర్విస్తున్నాను క్రీడలతో ఐదు ఖండాలు తిరిగాను ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ వరంగల్ స్పోర్ట్స్ : మా అమ్మ, నాన్న మల్లమ్మ, ఉప్పలయ్య స్ఫూర్తితోనే నేను ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించానని ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ అన్నారు. వరంగల్ అథ్లెటిక్స్ అసోసియేషన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నాగపురి రమేష్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రమేష్ మాట్లాడుతూ ఓరుగల్లు బిడ్డను అయినందుకే తాను ఉన్నతస్థాయికి చేరుకున్నానని తెలిపారు. తాను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉండేందుకు ముందు అమ్మ, నాన్నలు కారణమని, తర్వాత చిన్ననాటి స్నేహితులని చెప్పారు. ప్రభుత్వం అవకాశమిస్తే అథ్లెటిక్స్‌తో పాటు ఇతర క్రీడల కోసం జిల్లాలో అకాడమీ ఏర్పాటు చేస్తానని తెలిపారు. మూడంచెల క్రీడా విధానంతో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను ఇంటర్లో ఉన్నప్పుడు కనీసం హైదరాబాద్‌కు కూడా వెళ్లేవాడిని కాదని.. క్రీడాకారుడిగా ఇప్పటివరకు ఐదు ఖండాలు తిరిగానని.. క్రీడల గొప్పతనం ఇదేనని చెప్పారు. అర్జున అవార్డు గ్రహీత పిచ్చయ్య తర్వాత ద్రోణాచార్య అవార్డు తాను అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ వరంగల్ బిడ్డగా తెలంగాణ ప్రతిష్టను ఖండాంతరాలకు చాటి చెప్పాడన్నారు. ఆయన అకాడమీ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సాయం అందిస్తామన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో నూతన క్రీడాపాలసీని సీఎం కేసీఆర్ తీసుకు రానున్నారని చెప్పారు. అథ్లెటిక్స్ అసోసియేషన్జిల్లా కార్యదర్శి సారంగపాణి అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో డీఎస్డీఓ ఇందిర, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, సబియా సబహత్, బోడ అనయ్య, టీఆర్ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, ఇండ్ల నాగేశ్వర్రావు, మార్నేని రవీందర్రావు, కాంగ్రెస్ నాయకుడు బొద్డిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పింగిళి రమేష్‌రెడ్డి, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌బ్యాడ్మింటన్ జాతీయ అంపైర్ కొమ్ము రాజేందర్, నాగకిషన్, బరుపాటి గోపి, కోచ్‌లు శ్రీమాన్, శ్రీధర్, రమేష్, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
టీమిండియాకు బాస్ అతనే: అనిల్ కుంబ్లే
బెంగళూరు: టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఆయన. అంతేకాకుండా కెప్టెన్‌గా, జట్టు సభ్యుడిగా కూడా సేవలందించారు. 18 ఏళ్ల క్రికెట్లో కొనసాగి.. అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరొందిన ఆయనే అనిల్ కుంబ్లే. ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్‌గా కుంబ్లే సరికొత్త అవతారంలో జట్టుకు సేవలందిస్తున్నారు. కోచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా టీమిండియాతో కలిసి ఆయన వెస్టిండీస్‌లో పర్యటించారు. ఈ పర్యటన ముగించుకొని టీమిండియా భారత్ చేసుకున్న నేపథ్యంలో ఆయన ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కోచ్‌గా తన తొలి అసైన్మెంట్ ఫలప్రదంగా ముగిసిందని, వెస్టిండీస్‌లో టీమిండియా చక్కని ప్రదర్శన కనబర్చిందని కుంబ్లే ఆనందం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పర్యటనలతో పోల్చుకుంటే వెస్టిండీస్ పర్యటన అంత కష్టసాధ్యంగా ఉండదని, అయినప్పటికీ వెస్టిండీస్ తన అసైన్మెంట్ తొలి కావడం మంచిదేనని భావిస్తున్నట్టు చెప్పారు. ఇన్నాళ్ల తన కెరీర్లో చాలామంది కోచ్‌లను చూశానని, అయితే, ఎక్కువకాలం కలిసి పనిచేయడంతో కోచ్‌గా జాన్ రైట్ తనపై ప్రభావం చూపించారని, ఆయన స్ఫూర్తి తనపై ఉండొచ్చునని చెప్పారు. జాన్ రైట్ జట్టు వెనుక ఉండి చెప్పిన విషయాలను ఇప్పుడు తాను కూడా చెప్తున్నట్టు గుర్తుచేసుకున్నారు. టీమిండియాకు సంబంధించినంతవరకు బాసే కెప్టెన్ అని, అతనికి సహకారం అందించడం, నిర్ణయాలు తీసుకునేందుకు, వ్యూహాలు రచించేందుకు అండగా నిలబడటం కోచ్ బాధ్యత అని చెప్పారు. ప్రస్తుత జట్టు ఎంతో నిబద్ధతతో ఆడుతోందని, ఎంతో నైపుణ్యంతో జట్టు సభ్యులు అద్భుతంగా ఆడుతున్నారని, దీంతో కోచ్‌గా తనకు ఎంతో అనువైన వాతావరణం ఉందని వివరించారు. -
ఆస్ట్రేలియా కబడ్డీ కోచ్‌గా శ్రీనివాస్ రెడ్డి
సంగారెడ్డి: ఆస్టేల్రియా కబడ్డీ జట్టుకు తెలుగు వ్యక్తి కోచ్‌గా వ్యవహరించబోతున్నారు. మెదక్ జిల్లా ఉత్తర్‌పల్లికి చెందిన లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. అక్టోబర్‌లో అహ్మదాబాద్‌లో జరిగే కబడ్డీ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు పొల్గొంటుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించిన శ్రీనివాస్ రెడ్డి గతంలో దక్షిణ కొరియా జట్టుకు కూడా అసిస్టెంట్ కోచ్‌గా పని చేశారు. ‘ఈ అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరో రెండు రోజుల్లో ఆస్ట్రేలియా వెళుతున్నాను. ఆ దేశంలో కబడ్డీకి ఆదరణ పెంచేందుకు కృషి చేస్తాను’ అని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. -
ద్రోణాచార్యుడు రమేష్
-
గోపీ కష్టానికి ఫలితం దక్కింది
-
వచ్చే వరల్డ్‌కప్ వరకూ అతనే కోచ్!
మెల్బోర్న్: ప్రస్తుత ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ డారెన్ లీమన్ పదవీ కాలాన్ని పొడగించారు. 2019 వన్డే వరల్డ్ కప్ వరకూ లీమన్నే కోచ్ గా కొనసాగించాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(సీఏ) నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా లీమన్ దిశా నిర్దేశంలో ఆస్ట్రేలియా సిరీస్ విజయాలను సాధిస్తూ దూసుకుపోతోంది. గత వన్డే వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టుకు లీమన్ కోచ్ గా వ్యహరించాడు. దాంతో పాటు ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్ వంటి పటిష్ట దేశాలపై ఆసీస్ పలు విజయాలను నమోదు చేసి సిరీస్‌లను కైవసం చేసుకుంది. మరోవైపు టెస్టు, వన్డేల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆసీస్ కు లీమనే సరైన మార్గదర్శకుడిగా భావించిన ఆ జట్టు యాజమాన్యం అతనికే తిరిగి పర్యవేక్షక బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సీఏ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ పాట్ హోగార్డ్ తాజా ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.'ఆస్ట్రేలియా జట్టు కోచ్, అసిస్టెంట్ కోచ్‌లను మార్చే ఉద్దేశం ఇప్పట్లో లేదు. వచ్చే యాషెస్‌తో పాటు వన్డ్డే వరల్డ్ కప్ వరకూ లీమన్ కోచ్ గా కొనసాగుతాడు. మా జట్టులో విజయమంతమైన కోచ్‌గా లీమన్ గుర్తింపు సాధించాడు. అందుకు మరోసారి అతనికే కోచ్ పగ్గాలు అప్పజెప్పాలని జాతీయ సెలక్షన్ ప్యానెల్ నిర్ణయించింది' అని హోగార్డ్ తెలిపారు.