
సాక్షి, అన్నమయ్య జిల్లా: నందలూరు- హస్తవరం మధ్యన జయంతి ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలో పొగలు రావడంతో వెంటనే ట్రైన్‌ను నిలిపివేశారు. ముంబై నుంచి కన్యాకుమారి వెళ్తుతుండగా ఘటన జరిగింది. రైల్లోని ఏసీ ఎస్-2 బోగీలో పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఏసీ బోగీ వీల్స్ బ్రేక్ బైండింగ్ కావడంతో పొగలు వచ్చినట్లు రైల్వే సిబ్బంది తెలిపారు. సమస్యను పరిష్కరించి రైలును పంపించారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.