కోచ్‌.. లేడోచ్‌!

sports coach unvailable in combind districts - Sakshi

కొన్నిచోట్ల ఒక్కరూ లేని దైన్యం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8 మందే..

సీనియర్‌ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులే దిక్కు

ఔత్సాహిక క్రీడాకారులకు అందని ప్రోత్సాహం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: తెలంగాణలో క్రీడాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్నిరంగాల్లో అభివృద్ధికి పాలసీలతో ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంపై వివక్ష చూపుతుందనే విమర్శలు ఉన్నాయి. జిల్లాల్లో క్రీడాశాఖ(ప్రస్తుతం జిల్లా యువజన, క్రీడల కార్యాలయం) ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్టేడియాల్లో కోచ్‌ల కొరత ఉంది. కొన్నేళ్లుగా రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ద్వారా కోచ్‌లను నియమించలేదు. కేవలం స్పోర్ట్స్‌ హాస్టల్, స్కూళ్లలో మాత్రమే ఒకరిద్దని నియమించిన స్పోర్ట్‌ అథారిటీ.. జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్టేడియాల్లో సరిపడా కోచ్‌లను నియమించలేదు. దీంతో స్టేడియాలు ఉన్నా శిక్షకులు లేక ఔత్సాహిక క్రీడాకారులు ప్రోత్సాహం అందడం లేదు. కోచ్‌లు లేని కొన్ని స్టేడియాల్లో సీనియర్‌ క్రీడాకారులు, వ్యాయామ ఉపా«ధ్యాయులు స్వచ్ఛందంగా శిక్షణ ఇస్తున్నారు. 

13 స్టేడియాలు.. 8మంది శిక్షకులు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జిల్లా క్రీ డాశాఖ పరిధిలో 13 స్టేడియాలు ఉం డగా కేవలం 8మంది కోచ్‌లు మాత్రమే ఉన్నారు. క్రీడాశాఖ పరిధిలో మహబూబ్‌నగర్‌లో స్టేడియం, జడ్చర్ల, మక్తల్, నారాయణపేట, వనపర్తి జిల్లా వనపర్తిలో ఒకటి క్రీడాశాఖ, మరొకటి గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియం ఉన్నాయి. ఇక ఆత్మకూర్‌లో ఒ క స్టేడియం, నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి(గ్రీన్‌ఫీల్డ్‌), అచ్చంపేట, కొల్లాపూర్‌ (గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియం), గద్వాల జిల్లా కేంద్రంలో డీఎస్‌ఏ స్టేడియం, మరో గ్రీ న్‌ఫీల్డ్, అలంపూర్‌ (గ్రీన్‌ఫీల్డ్‌) సేŠ?ట్డయా లు ఉన్నాయి. వీటిలో మహబూబ్‌నగర్‌ స్టేడియంలో ఐదుగురు, జడ్చర్ల, వనప ర్తి, అచ్చంపేట, గద్వాల స్టేడియాల్లో ఒ క్కరి చొప్పున కోచ్‌లు ఉన్నారు. మిగతా స్టేడియాల్లో ఒక్కకోచ్‌ కూడా లేకపోవడంతో క్రీడలపై శిక్షణ ఇచ్చేవారే కరువయ్యారు. వెంటనే స్టేడియాలకు కోచ్‌ల ను నియమించాలని సీనియర్‌ క్రీడాకారులు కోరుతున్నారు.

ఎంత మంది ఉండాలి?
వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌ బాల్, ఫుట్‌బాల్, ఖోఖో, అథ్లెటిక్స్‌ క్రీడలను పాపుల ర్‌ గేమ్స్‌గా పేరుంది. ఈ క్రీడల్లో శిక్షణ పొందేందుకు ప్రతి జిల్లాలో ఔత్సాహిక క్రీడాకారులు వందల సంఖ్యలో ఉంటా రు. ఈ మేరకు వీటిలో శిక్షణ ఇచ్చేందుకు తప్పనిసరిగా ప్రతి జిల్లాలో కోచ్‌లను నియమించాలి. క్రీడాకారుల సంఖ్యను బట్టి ఒకరు లేదా అంతకు మించి ఎక్కువ సంఖ్యలోనూ కోచ్‌లను నియమించాల్సి ఉంటుంది. ఇక మిగతా క్రికెట్, సెపక్‌ త క్రా, బేస్‌బాల్‌ తదితర క్రీడాంశాలు కొన్ని జిల్లాల్లో ప్రాధాన్యతకు నోచుకుంటాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఏయే జిల్లాలో ఏయే క్రీడాంశానికి ఆదరణ ఉందో గుర్తించి కోచ్‌లను ప్రభుత్వం నియమించాలి. వీటికి కోచ్‌ల మాట దేవుడెరుగు పాపులర్‌ గేమ్స్‌కు సంబంధించి కూడా సరిపడా కోచ్‌లను నియమించకపోవడంతో జిల్లాల్లో ఔత్సాహిక క్రీడాకారులు నిరాదరణకు గురవుతున్నారు.

‘శాట్‌’ దృష్టికి తీసుకెళ్లాం
బడ్జెట్‌లో క్రీడా నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తున్నారు. కానీ నేరుగా కోచ్‌ల నియమాకాన్ని చేపట్టడం లేదు. అన్ని స్టేడియంల్లో ఎన్‌ఐఎస్‌ చేసిన వారిని రెగ్యులర్‌ కోచ్‌లుగా నియమిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ మేరకు గతంలో పలుసార్లు స్పోర్ట్స్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – రాజేంద్రప్రసాద్, జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి

ఫుట్‌బాల్‌ కోచ్‌ను నియమించాలి
జిల్లా స్టేడియంలో ఫుట్‌బాల్‌ కోచ్‌ను నియమించాలి. ఈ విషయమై పలు సార్లు శాట్‌ చైర్మన్, ఉన్నతాధికారులకు వినతులు అందజేశాం. జిల్లాలో నైపుణ్యమున్న పుట్‌బాల్‌ క్రీడాకారులు ఉన్నా కోచ్‌ లేకపోవడంతో మెరుగైన శిక్షణ అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాపులర్‌ గేమ్‌లకు కోచ్‌లను నియమించాలి. – నాగేశ్వర్, సీనియర్‌ క్రీడాకారుడు

ప్రతిపాదనలు పంపించాం..
స్టేడియాల్లో కోచ్‌ల నియామకంపై గతంలో స్పోర్ట్స్‌ అథారిటీకి ప్రతిపాదనలు పంపించాం. కనీసం పాపులర్‌ గేమ్‌లకు కోచ్‌లు వస్తే ఔత్సాహిక క్రీడాకారులకు మెరుగైన శిక్షణ లభిస్తుంది. అయితే, త్వరలోనే అన్ని స్టేడియాల్లో కోచ్‌లను నియమించే అవకాశం ఉందని మాకు సమాచారం ఉంది.    – టీవీఎల్‌ సత్యవాణి, డీవైఎస్‌ఓ, మహబూబ్‌నగర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top