రేసులో సునీల్‌ జోషి, రమేశ్‌ పవార్‌

Womens cricket team coach selected - Sakshi

 మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ ఎంపిక

న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవి కోసం టీమిండియా మాజీ స్పిన్నర్లు సునీల్‌ జోషి, రమేశ్‌ పవార్‌లు పోటీపడుతున్నారు. 2017 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చిన కోచ్‌ తుషార్‌ అరోథె... సీనియర్‌ క్రీడాకారిణులతో వచ్చిన విభేదాల కారణంగా తన పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో బీసీసీఐ కొత్త కోచ్‌ కోసం ప్రకటన విడుదల చేసింది. దీనికి 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాలో మాజీ వికెట్‌ కీపర్‌ అజయ్‌ రాత్రా, విజయ్‌ యాదవ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్‌ మమత మాబెన్, సుమన్‌ శర్మ, న్యూజిలాండ్‌ మాజీ ప్లేయర్‌ మారియా ఫహే తదితరులు ఉన్నారు.  
అయితే ప్రధాన పోటీ మాత్రం సునీల్‌ జోషి, రమేశ్‌ పవార్‌ల మధ్య ఉండనుంది.

జోషి టీమిండియా తరఫున 15 టెస్టులు, 69 వన్డేలు ఆడగా... పవార్‌ 2 టెస్టులు, 31 వన్డేల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. పవార్‌ ప్రస్తుతం మహిళా జట్టుకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తుండగా... జోషి మొన్నటి వరకు బంగ్లాందేశ్‌కు కోచ్‌గా పనిచేశాడు. శుక్రవారం ముంబైలో సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ, బీసీసీఐ క్రికెట్‌ ఆపరేషన్స్‌ జీఎం సబా కరీమ్, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top