సాధారణంగా బరువు తగ్గడం అంటే సరైన డైట్ ప్లాన్, ఖరీదైన సప్లిమెంట్లు, జిమ్‌లో ఎక్కువ గంటలు గడపడం అని అనుకుంటుంటారు. సత్వరమే మంచి ఫలితం రావాలంటే మొత్తం లైఫ్‌స్టైల్‌నే మార్చితే చాలని కొందరు అనుకుంటారు. కానీ అసలైన వాస్తవం ఏంటంటే..రోజువారి అలవాట్ల నుంచి వస్తుందనేది విస్మరిస్తారని చెబుతోంది కంటెంట్ క్రియేటర్, వెయిట్ లాస్ కోచ్ అయిన నేహా పరిహార్. మనం అంతగా పట్టించుకోని చాలా చిన్న చిన్న బేసిక్ విషయాలతోనే అద్భుతం చేయొచ్చని అంటోందామె. మరి అదెలాగో సవివరంగా తెలుసుకుందామా..!
వెయిట్‌లాస్ కోచ్ నవంబ్‌కి సుమారు 22 కిలోలు బరువు తగ్గినట్లు నెట్టింట షేర్ చేశారు. అంతేగాదు తన వెయిట్ లాస్ జర్నీని కూడా షేర్ చేసుకుంది. తాను బరువు తగ్గడం కోసం ఎలాంటి కొలెస్ట్రాల్ బర్నర్‌లు, డీటాక్స్ పానీయాలను ఉపయోగించలేదని, అలాగే కఠినమైన కేలరీల లెక్కింపు వంటివి ఏమిలేవని స్పష్టం చేసింది. జస్ట్ కామెన్‌సెన్స్‌తో స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గే ప్రయంత్నం చేశానని పేర్కొంది. అదెలాగంటే..
ఎక్కువ లాగిస్తూనే..
నేహా తనను తాను ఆకలితో అలమటించే ప్రయత్నం చేయలేదని వెల్లడించింది. తాను అక్షరాల రోజుకు 3 ఫుల్ మీల్స్ + 1 స్నాక్ తినడం ప్రారంభించానని తెలిపింది. భోజనం దాటవేయడం వల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. అందుకు బదులుగా ఆమె తన ప్లేట్‌లో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా కేర్ తీసుకుంది.
ప్రతిరోజూ వాకింగ్
పదివేల అడుగులు నవడవ లేదు, అలాగే ట్రెడ్‌మిల్ సెషన్‌లు కూడా చేయలేదు. జస్ట్ రాత్రి భోజనం తర్వాత 30 నిమిషాల వాక్ మాత్రమే. దీంతోనే నేహ జీర్ణక్రియను, బొడ్డుకొవ్వుని మెరుగుపరిచింది. ఇది ఒకరకంగా వ్యాయామ ఒత్తిడిని దూరం చేసింది.
నూటికి నూరు శాతం హెల్దీగా తినడం మానేసింది..
ఎల్లప్పుడూ హెల్దీకి ప్రాధాన్యత ఇస్తే వారాంతంలో నచ్చిన ఐటెమ్స్ లాగించాలనే కోరిక కలుగుతుందట. అందుకు నేహా 80:20 రూల్‌ని పాటించిందట. అంటే 80% నిజమైన ఆహారం, 20% స్మార్ట్‌గా తినటం. అంటే అప్పడప్పుడు నచ్చిన రిలాక్స్డ్ భోజనం అది కూడా పరిమితంగా తీసుకునేదాన్ని అంటోంది
తేలికపాటి విందులు
రాత్రి 7:30 గంటలకు చీలా, క్వినోవా దోస, పప్పు-సబ్జీ వంటివి తీసుకునేది. ఇలా తేలికగా తినడం వల్ల ఆమె జీర్ణక్రియ, నిద్ర, మానసిక స్థితి మెరుగుపడటమే కాకుండా బొడ్డు కొవ్వు కూడా తగ్గింది.
బరువు తగ్గే ఖరీదైన సప్లిమెంట్లు, సంక్లిష్ట ఆహారాలను తీసుకోవాల్సిన పనిలేదని నేహా వెయిట్ లాస్ స్టోరీ చెబుతోంది. చాలా చిన్న చిన్న విషయాల్లో కేర్ తీసుకుంటే చాలు. ముఖ్యంగా వేళకు భోజనం, నిద్ర, కాస్త కదలిక ఉంటే చాలు. దీంతో పాటు టెన్షన్ లేని ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసుకుంటే బరువు తగ్గడం సులభమని చాలా సింపుల్‌గా చేసి చూపించారామె. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..! ఐక్యతతో ఏదైనా సాధ్యం..!)


