గంభీర్-కోచ్ల వివాదంపై కమిటీ | Madan Lal To Head DDCA Inquiry Committee On Gautam Gambhir-Coach Fiasco | Sakshi
Sakshi News home page

గంభీర్-కోచ్ల వివాదంపై కమిటీ

Mar 13 2017 12:12 PM | Updated on Sep 5 2017 5:59 AM

గంభీర్-కోచ్ల వివాదంపై కమిటీ

గంభీర్-కోచ్ల వివాదంపై కమిటీ

గౌతం గంభీర్, కోచ్ క్రిష్ణన్ భాస్కరన్ పిళ్లై మధ్య చోటు చేసుకున్న వివాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు డీడీసీసీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

ఢిల్లీ: ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా ఢిల్లీ ఓపెనర్ గౌతం గంభీర్, కోచ్ క్రిష్ణన్ భాస్కరన్ పిళ్లై మధ్య చోటు చేసుకున్న వివాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో రాజేందర్ ఎస్ రాథోడ్, సోనీ సింగ్లు మిగిలిన ఇద్దరు సభ్యులు.


విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఢిల్లీ పోరాటం ముగిసిన తరువాత తనను గంభీర్ తీవ్రంగా దూషించినట్లు బాస్కరన్ అనేకసార్లు మీడియా ముందు వాపోయాడు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ గంభీర్ అగౌరపరిచాడని భాస్కరన్ తెలిపాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీడీసీఏ.. ఆ ఘటనపై విచారణకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు  ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ డీడీసీఏ అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ విక్రమ్ జిత్ సేన్ తాజాగా ఒక సర్క్యులర్ ను జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement