
కోచ్ గా షేన్ వార్న్?
వచ్చే ఏడాది నాటికి రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని తిరిగి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బరిలో అడుగుపెట్టబోతున్న జట్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నాటికి రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని తిరిగి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) బరిలో అడుగుపెట్టబోతున్న జట్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్. ఈ రెండు జట్లు మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని 2016లో బహిష్కరణకు గురయ్యాయి.అయితే తమ పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవాలని భావిస్తున్న ఇరు జట్లు తమ ప్రయత్నాలను ఇప్పట్నుంచే ఆరంభించాయి. దీనిలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్ అభ్యర్ధి కోసం అన్వేషణ చేపట్టింది.
గతంలో తమ జట్టుకు కెప్టెన్ గా చేసిన షేన్ వార్న్ను కోచ్ గా ఎంపిక చేసేందుకు కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వార్న్ తో చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. షేన్ వార్న్ వైపు రాజస్థాన్ రాయల్స్ మొగ్గుచూపడానికి ప్రధాన కారణం అతని సక్సెస్. 2008 ఐపీఎల్ ఆరంభపు టైటిల్ ను రాజస్థాన్ సాధించడంలో షేన్ వార్న్ పాత్ర వెలకట్టలేనిది. అతను సారథిగా జట్టును ముందుండి నడిపించి యాజమాన్యం విశ్వాసాన్ని చూరగొన్నాడు. ఆ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ మరోసారి వార్న్ సేవల్ని వినియోగించుకోవాలనే యోచనలో ఉన్నట్లు కనబడుతోంది.
కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను ఎంపిక చేయాలని రాయల్స్ యాజమాన్యం తొలుత భావించిందట. గతంలో రాజస్థాన్ తరపున ఆడిన ద్రవిడ్ ను కోచ్ గా తీసుకొస్తే బాగుంటుందని అనుకున్నారు. కాగా, అండర్-19, భారత-ఎ జట్లకు కోచ్ గా రెండేళ్ల మొత్తం సమయం ఉండేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)తో ద్రవిడ్ ఇటీవల ఒప్పందం చేసుకున్నాడు. అదే సమయంలో ఐపీఎల్ జట్లతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. అంతకుముందు రెండేళ్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ గా పని చేసిన ద్రవిడ్ పాత్ర ఇక నుంచి ఐపీఎల్ కనిపించదు