Rajasthan Royals
-
#SRHvsRR మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)
-
సన్‌రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత రియాన్ పరాగ్ వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమి రాయల్స్‌కు ఈ సీజన్లో మొదటిది. రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి, తాజా ఓటమి తర్వాత కూడా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఈ ఓటమి తర్వాత రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీజన్లో తొలి ఓటమి కావడంతో అతనిలో పెద్దగా సీరియస్‌నెస్ కనిపించలేదు. తప్పిదాలను ఒప్పుకుంటూనే ఓటమిని లైట్‌గా తీసుకున్నట్లు మాట్లాడాడు. సింగిల్ డిజిట్ స్కోర్‌కే సగం వికెట్లు కోల్పోయినా, బ్యాటింగ్ డెప్త్ అంటూ గొప్పలు పోయాడు. జడేజాకు బౌలింగ్ ఇవ్వకపోవడాన్ని, పిచ్‌ను అంచనా వేయలేకపోవడాన్ని సమర్దించుకునే ప్రయత్నం చేశాడు. సన్‌రైజర్స్ అరంగేట్రం సీమర్లను ప్రశంసించాడు.అతని మాటల్లో.. వికెట్లు త్వరగా కోల్పోవడం మేము వరుసగా వికెట్లు కోల్పోయాం. వారు బాగా బౌలింగ్ చేశారు. కొన్ని లెక్కలు తప్పాయి. దీన్ని ఒక చిన్న మినహాయింపుగా తీసుకుంటాం. ఎక్కువగా ఆలోచించం. 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా 159 పరుగులు చేయడం మా బ్యాటింగ్ లోతుకు నిదర్శనం.పిచ్ పరిస్థితులు కొత్త బంతి కాస్త స్టికిగా అనిపించింది. షైనింగ్ తగ్గాక స్లో అయ్యింది. ఓ రకంగా ఆలోచిస్తే, మొదట బ్యాటింగ్ చేయడం మంచిదై ఉండేది. ఏదిఏమైనా మేమే ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. కొత్త సీమర్లపై ప్రశంస సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన సీమర్లు ఫ్రఫుల్ హింజ్, సకిబ్ హుస్సేన్‌కు నా అభినందనలు. వారు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రేక్షకుల ఒత్తిడి ఉన్నప్పటికీ, మొదటి నాలుగు–ఐదు ఓవర్లలో చాలా బాగా బౌలింగ్ చేశారు. నేను వారిని ఎక్కువగా చూడలేదు. కానీ ఈ ప్రదర్శన అద్భుతం. జడేజాకు బౌలింగ్ ఇవ్వకపోవడం అప్పటికి ఇషాన్ బాగా ఆడుతున్నాడు. జడ్డూ భాయ్‌కి బౌలింగ్ ఇవ్వకపోవడానికి కారణాలు లేవు. బిష్ణోయిని నమ్మాను. వారు మేము అనుకున్న దానికంటే 30 పరుగులు ఎక్కువ చేశారు. ఈ ఓటమిని ఇక్కడితో వదిలిపెట్టి, తదుపరి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతాం. మొత్తంగా రియాన్ మాటలను బట్టి చూస్తే.. ఈ ఓటమిని లైట్‌గా తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. -
ఘోర ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ప్రఫుల్ హింజ్ (4-0-34-4), సకిబ్ హెస్సేన్ (4-0-24-4) అనే ఇద్దరు అరంగేట్రం పేసర్లు రాయల్స్ జైత్రయాత్రను బ్రేక్ చేసి సన్‌రైజర్స్‌కు అద్భుత విజయాన్నందించారు. ఈ క్రమంలో హింజ్ ఓ చారిత్రక రికార్డు నమోదు చేశాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.హింజ్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ తొలి ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయింది. అతనికి సకిబ్ కూడా జత కావడంతో రాయల్స్ 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి చారిత్రక పతనం దిశగా సాగింది. అయితే రవీంద్ర జడేజా (45), డొనొవన్ ఫెరియెరా (69) అనూహ్యంగా ప్రతిఘటించి ఆ పతనాన్ని వాయిదా వేశారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఓ చారిత్రక రికార్డు నెలకొల్పింది.ఐపీఎల్ చరిత్రలో మొదటి 5 వికెట్లు 20 పరుగుల లోపే కోల్పోయిన తర్వాత కూడా జట్టు స్కోర్ 150 పరుగుల మార్క్‌ను దాటిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్య ఛేదనలో జడేజా, ఫెరియెరా ప్రతిఘటించడంతో రాయల్స్ 159 పరుగులకు ఆలౌటై, 57 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ లెక్కన రాయల్స్ ఓటమిలోనూ చరిత్ర సృష్టించింది.ఈ సీజన్లో రాయల్స్‌కు ఇదే తొలి ఓటమి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ జట్టుకు సన్‌రైజర్స్ తమ సొంతగడ్డపై బ్రేకులు వేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ఇషాన్ కిషన్ (91) శివాలెత్తడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. క్లాసెస్ (40) ఓ మోస్తరుగా రాణించగా.. ఆఖర్లో సలీల్ అరోరా (24 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి (28) బ్యాట్ ఝులిపించారు.అనంతరం లక్ష్య ఛేదనలో హింజ్, సకిబ్ ధాటికి విలవిలలాడిపోయిన రాజస్థాన్ రాయల్స్ అతికష్టం మీద 19 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌటైంది. హింజ్, సకిబ్కు ఎషాన్ మలింగ (4-0-31-2) కూడా సహకరించాడు. రాయల్స్ తరఫున ఆఖర్లో తుషార్ దేశ్‌పాండే (25) సైతం బ్యాట్ ఝులిపించాడు. అయితే అప్పటికే రాయల్స్ ఓటమి ఖరారైపోయింది. -
హైదరాబాద్ : పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)
-
ప్రఫుల్ ప్రచండ రూపం
217 పరుగుల లక్ష్యఛేదన... అందరి కళ్లూ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే... ఎన్ని సిక్సర్లు కొడతాడు, రాజస్తాన్ ఎంత వేగంగా విజయం సాధిస్తుందనేదానిపైనే చర్చ... కానీ సన్‌రైజర్స్ పేసర్ ప్రఫుల్ హింగే ఒక్కసారిగా దూసుకొచ్చాడు. రెండో బంతికే వైభవ్ డకౌట్... నాలుగో బంతికి జురేల్ డకౌట్... చివరి బంతికి ప్రిటోరియస్ డకౌట్... ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడటం మొదటిసారి కాగా, అరంగేట్ర మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా ప్రఫుల్ చరిత్రకెక్కాడు. ఆపై రాజస్తాన్ స్కోరు 3 ఓవర్లలో 9 పరుగులకే 5 వికెట్లు. అంతే... అక్కడే సన్‌రైజర్స్ మ్యాచ్ గెలిచేసింది... మిగతా ఆటంతా ఇక లాంఛనంగానే మిగిలింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ తాజా సీజన్లో రెండు సార్లు 200కుపైగా స్కోరు చేసి కూడా ఓటమిని మూటగట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి భారీ స్కోరును కాపాడుకుంది. అయితే జట్టు బలహీనతగా కనిపించిన బౌలింగ్ విభాగం ఇప్పుడు మ్యాచ్‌ను గెలిపించింది. సోమవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన పోరులో ఇషాన్ కిషన్ బృందం 57 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగగా... హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. డొనొవాన్ ఫెరీరా (44 బంతుల్లో 69; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (32 బంతుల్లో 45; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 72 బంతుల్లో 118 పరుగులు జోడించి పోరాడినా అది సరిపోలేదు. కీలక భాగస్వామ్యం... అభిషేక్ శర్మ (0) వెనుదిరిగిన తర్వాత ట్రవిస్ హెడ్ (18) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే ఇషాన్ మెరుపు బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. ఆర్చర్ ఓవర్లో 4, 6 కొట్టిన అతను బర్గర్, సందీప్ ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదాడు. పవర్‌ప్లేలో జట్టు 51 పరుగులు చేయగలిగింది. ఇషాన్, క్లాసెన్ భాగస్వామ్యంలో రైజర్స్ ఇన్నింగ్స్ దూసుకుపోయింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 39 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు. బిష్ణోయ్ ఓవర్లో సిక్స్‌తో 30 బంతుల్లో కిషన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తుషార్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోయిన కిషన్... ఆ తర్వాత ఆర్చర్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే సెంచరీకి చేరువలో అతని ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత కొద్ది సేపటికే క్లాసెన్ కూడా అవుట్ కాగా, నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 28; 4 సిక్స్‌లు) దూకుడుతో స్కోరు 200కు చేరువైంది. చివర్లో సలీల్ అరోరా (13 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మరికొన్ని కీలక పరుగులు జోడించాడు. అభిషేక్ మళ్లీ డకౌట్... సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ హైదరాబాద్ అభిమానులను మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. సొంత మైదానంలో అతని మెరుపు బ్యాటింగ్‌ను చూసేందుకు ఎంతో ఉత్సాహంతో మైదానానికి వచ్చిన ఫ్యాన్స్ రెండో మ్యాచ్‌లోనూ డకౌట్‌ను చూడాల్సి వచ్చింది. లక్నోతో జరిగిన గత మ్యాచ్‌లో రెండో బంతికి సున్నా చుట్టిన అభిషేక్ ఈసారి తొలి బంతికే పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. నితీశ్ మళ్లీ మూడు సిక్స్‌ల మోత... హైదరాబాద్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో దిగ్వేశ్ రాఠీ వేసిన ఒకే ఓవర్లో మూడు సిక్స్‌లు బాదిన నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లోనూ అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు. సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో లాంగాన్ మీదుగా రెండు వరుస సిక్స్‌లు బాదిన అతను అదే ఓవర్ చివరి బంతికి డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్ దిశగా మరో సిక్స్‌తో తన ధాటిని ప్రదర్శించాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ శర్మ (సి) బిష్ణోయ్ (బి) ఆర్చర్ 0; హెడ్ (సి) ఫెరీరా (బి) పరాగ్ 18; ఇషాన్ కిషన్ (సి అండ్ బి) సందీప్ 91; క్లాసెన్ (సి) పరాగ్ (బి) తుషార్ 40; నితీశ్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 28; సలీల్ (నాటౌట్) 24; అనికేత్ (రనౌట్) 6; దూబే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 216. వికెట్ల పతనం: 1–0, 2–55, 3–143, 4–162, 5–195, 6–209. బౌలింగ్: ఆర్చర్ 4–0–37–2, బర్గర్ 4–0–31–0, సందీప్ 4–0–52–1, తుషార్ 4–0–55–1, పరాగ్ 1–0–5–1, బిష్ణోయ్ 3–0–35–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) నితీశ్ (బి) సాకిబ్ 1; వైభవ్ (సి) అరోరా (బి) ప్రఫుల్ హింగే 0; జురేల్ (బి) ప్రఫుల్ హింగే 0; ప్రిటోరియస్ (సి) నితీశ్ (బి) ప్రఫుల్ హింగే 0; పరాగ్ (సి) అభిషేక్ (బి) ప్రఫుల్ హింగే 4; జడేజా (సి) అరోరా (బి) ఇషాన్ మలింగ 45; ఫెరీరా (బి) సాకిబ్ 69; ఆర్చర్ (సి) ప్రఫుల్ హింగే (బి) సాకిబ్ 2; తుషార్ (సి) కిషన్ (బి) ఇషాన్ మలింగ 25; బిష్ణోయ్ (సి) కిషన్ (బి) సాకిబ్ 0; బర్గర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–1, 4–2, 5–9, 6–127, 7–129, 8–140, 9–140, 10–159. బౌలింగ్: ప్రఫుల్ హింగే 4–0–34–4, సాకిబ్ 4–0–24–4, ఇషాన్ మలింగ 4–0–31–2, శివాంగ్ 3–0–28–0, నితీశ్ 2–0–19–0, హర్ష్ దూబే 2–0–22–0. -
హడలెత్తించిన ప్రఫుల్, సాకిబ్.. ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస ఓటములకు చెక్ పెట్టింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రఫుల్ హెంగే, సాకిబ్ హుస్సేన్ సంచలన బౌలింగ్‌కు తోడు ఇషాన్ కిషన్ రాణించడంతో ఎస్ఆర్హెచ్ సునాయసంగా గెలుపొందింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (91) సెంచరీ చేజార్చుకున్నప్పటికీ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. క్లాసెన్ (40) పరుగులు చేశాడు. ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, తుషార్, పరాగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. డొనోవన్ ఫెరీరా (69) టాప్ స్కోరర్‌గా నిలవగా, జడేజా (45) పర్వాలేదనిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హెంగే, సాకిబ్ హుస్సేన్‌లు చెరో 4 వికెట్లు పడగొట్టి రాజస్తాన్‌ను శాసించారు. సంచలన బౌలింగ్‌తో మెరిసిన ప్రఫుల్ హెంగేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: తొలి బౌలర్‌గా రికార్డు.. ఎవరీ ప్రఫుల్ హింగే! -
తొలి బౌలర్‌గా రికార్డు.. ఎవరీ ప్రఫుల్ హింగే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో సంచలనం నమోదైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ప్రఫుల్ హింగే సంచలన ప్రదర్శనతో మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపిన ప్రఫుల్ నాలుగో బంతికి ధ్రువ్ జురేల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ చివరి బంతికి ప్రిటోరియస్‌ను వెనక్కి పంపాడు. తద్వారా ప్రఫుల్ హింగే అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకసారి వాటిని పరిశీలిద్దాం.ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీయడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా ప్రఫుల్ నిలిచాడు. గతంలో తొలి ఓవర్లో బౌలర్లు 32 సార్లు రెండు వికెట్లు తీసిన సందర్భాలున్నాయి. ఇక ఎస్ఆర్హెచ్ తరఫున 2024లో ఇదే రాజస్తాన్‌పై భువనేశ్వర్ కుమార్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా ప్రఫుల్ పటేల్ బౌలింగ్‌లో ఔటైన ముగ్గురు రాజస్తాన్ బ్యాటర్లు డకౌట్లుగానే వెనుదిరగడం విశేషం.ఐపీఎల్ చరిత్రలో తొలి ఆరు ఓవర్లలో నాలుగు అంతకంటే ఎక్కువ పడగొట్టిన బౌలర్ల జాబితాలోనూ ప్రఫుల్ హింగే చోటు దక్కించు కున్నాడు. ప్రఫుల్హింగే కంటే ముందు ఇషాంత్ శర్మ, షోయ్ అక్తర్, అజిత్ చండీలా, దావల్ కులకర్ణి, పాట్ కమిన్స్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ ఈ ఫీట్ సాధించారు.ఎవరీ ప్రఫుల్ హింగే?విదర్భకు చెందిన ప్రఫుల్ హింగే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. వేలంలో ఎస్ఆర్హెచ్ ప్రఫుల్ హింగేను రూ. 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్కు బ్యాకప్ బౌలర్‌గా వచ్చిన ప్రఫుల్ హింగే రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో సూపర్ ప్రదర్శన కనబరిచి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ప్రఫుల్ హింగే 10 ఫ్లస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 27 వికెట్లు తీశాడు. 6 లిస్ట్-ఏ మ్యాచ్‌లాడి 5 వికెట్లు తీశాడు. అయితే తన కెరీర్లో ఇప్పటివరకు ఒక టీ20 మ్యాచ్ మాత్రమే ఆడడం గమనార్హం.LADIES & GENTLEMEN - MEET PRAFUL HINGE:- The first bowler in history of the IPL to take 3 wickets in the opening over. 🥶🔥 pic.twitter.com/KuYFeai4HT— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2026🚨 HISTORY CREATED BY PRAFUL HINGE. 🚨- Hinge becomes the first bowler in 19 years of the IPL to claim 3 wickets in the opening over. 🤯🔥 pic.twitter.com/osukqE6HBg— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2026చదవండి: గోల్డెన్ డక్.. అభిషేక్ శర్మ చెత్త రికార్డు -
IPL 2026: రాజస్తాన్‌పై ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస ఓటములకు చెక్ పెట్టింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రఫుల్ హెంగే, షకీబ్ హుస్సేన్ సంచలన బౌలింగ్‌కు తోడు ఇషాన్ కిషన్ రాణించడంతో ఎస్ఆర్హెచ్ సునాయసంగా గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ప్రఫుల్ హెంగే, సాకిబ్‌లు చెరో 4 వికెట్లతో మెరిశారు.ఫెరీరా అర్థసెంచరీ..రాజస్తాన్ రాయల్స్ 14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. డొనోవన్ ఫెరీరా అర్థసెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఫెరీరా (63 బ్యాటింగ్), జడేజా (43 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో జడేజా (21 బ్యాటింగ్), ఫెరీరా (24 బ్యాటింగ్) ఉన్నారు. ఐదో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పేలవ ఆటతీరు కనబరుస్తోంది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్ 10 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఫ్రపుల్ హింగే బౌలింగ్‌లో 4 పరుగులు చేసిన పరాగ్ అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 4 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన షాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో జైస్వాల్ (1) నితీశ్‌రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.తొలి ఓవర్లోనే మూడు వికెట్లు..217 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ఆర్హెచ్ బౌలర్ ఫ్రపుల్ హెంగే తన తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్ కాగా.. ధ్రువ్ జురేల్,, ప్రిటోరియస్ డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో ఒక్క పరుగు వద్దే రాయల్స్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.రాజస్తాన్ లక్ష్యం 217 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్.. రాజస్తాన్ ముంగిట 217 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 91 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, క్లాసెన్ 40 పరుగులు చేశాడు.చివర్లో సాహిల్ అరోరా (24 నాటౌట్) మెరిశాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు పూర్తిగా నిరాశపరిచారు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు తీయగా, సందీప్ శర్మ, తుసషార్ దేశ్ పాండే, పరాగ్ తలా ఒక వికెట్ తీశారు.నాలుగో వికెట్ డౌన్‌హెన్రిచ్ క్లాసెన్ (40) రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్ పాండే బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన క్లాసెన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ ఔట్ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న ఇషాన్ కిషన్ (91) సందీప్ శర్మ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.13 ఓవర్లకు ఎస్ఆర్ఎస్ హెచ్ స్కోరు: 140/2హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్‌ఇషాన్ కిషన్ హఫ్ సెంచరీతో అదరొగట్టాడు. కేవలం 30 బంతుల్లో 50 పరుగుల చేశాడు. డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన ఇషాన్ కిషన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.హెడ్ ఔట్.. రెండో వికెట్ డౌన్రాజస్తాన్తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ రియాన్ పరాగ్ బౌలింగ్‌లో డొనొవన్ ఫెరీరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఆరు ఓవర్లలో ఎస్ఆర్హెచ్ స్కోరు 51/1రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ అయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ఇషాన్ (35 బ్యాటింగ్), హెడ్ (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన్ ఎస్ఆర్హెచ్రాజస్తాన్తో మ్యాచ్‌లో ఆదిలోనే ఎస్ఆర్హెచ్కు గట్టి షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అభిషేక్ శర్మ రవి బిష్ణోయ్ క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ఐపీఎల్ 2026 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. బ్రిజేష్ పటేల్ స్థానంలో తుషార్ దేశ్ పాండే, హెట్‌మైర్ స్థానంలో ప్రిటోరియస్ తుది జట్టులోకి వచ్చారు. కాగా ప్రిటోరియస్‌కు ఐపీఎల్లో ఇదే తొలి మ్యాచ్. మరోవైపు ఎస్ఆర్హెచ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఉనాద్కట్, హర్షల్ పటేల్‌లను తప్పించినట్లు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తెలిపాడు. ఇక ముఖాముఖి పోరులో ఎస్ఆర్హెచ్దే పైచేయి. ఇరుజట్ల మధ్య 21 మ్యాచ్‌లు జరగ్గా ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్‌ల్లో, రాజస్తాన్ 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్/ కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ.రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే. -
‘ఇదేనా మర్యాద.. నిన్ను చూస్తేనే అసహ్యమేస్తోంది’
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటర్ టిమ్ డేవిడ్ చేసిన ఒక పని చర్చనీయాంశమైంది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని టిమ్ డేవిడ్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్ కొట్టాడు. అయితే డేవిడ్ బలంగా బాదడంతో బంతి ఆకారం మారిపోయింది. దీంతో అంపైర్లు కొత్త బంతిని రీప్లేస్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బంతులున్న బాక్స్‌ను మైదానంలోకి తీసుకురాగా టిమ్ డేవిడ్ ఆ బాక్స్‌లో నుంచి ఒక బంతిని తీసుకొని చెక్ చేయడం ప్రారంభించాడు. అయితే అంపైర్ బంతిని తిరిగి ఇచ్చేయాలని పదే పదే అడిగినప్పటికీ టిమ్ డేవిడ్ అతడిని పట్టించుకోకుండా అదే పనిగా బంతిని గాల్లోకి విసురుతూ దానిని చెక్ చేస్తూనే పోయాడు. లెగ్ అంపైర్ వీరేందర్ శర్మ వచ్చి ఇలా చేయడం తగదని వార్నింగ్ ఇవ్వడం, ఇంతలో ముంబై ఆటగాడు రోహిత్ శర్మ జోక్యం చేసుకొని డేవిడ్ నుంచి బంతిని తీసుకొని అంపైర్‌కు ఇచ్చాడు. టిమ్ డేవిడ్ ఇదంతా ఫన్నీ మోడ్‌లోనే చేసినప్పటికీ చూసేవాళ్లకు మాత్రం అతడి ప్రవర్తన విసుగు తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు టిమ్ డేవిడ్‌ను ఏకిపారేశారు. ‘అంతర్జాతీయ క్రికెటర్ అయ్యుండి ఒక ఫీల్డ్ అంపైర్‌కు ఇచ్చే మర్యాద ఇదేనా?’ అంటూ ఒక అభిమాని ప్రశ్నించాడు. ‘అందుకే క్రికెట్లో యెల్లో, రెడ్ కార్డులు ప్రవేశపెట్టాల్సిన అవసరముంది’ అని మరొక అభిమాని కామెంట్ చేశాడు. ‘ఇలాంటి చిల్లర చేష్టలు చేయకుండా డీమెరిట్ పాయింట్ లేదా మ్యాచ్ నిషేధం విధిస్తే దారికొస్తాడని’ మరికొంతమంది కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లీ, ఫిల్ సాల్ట్, పటిదార్లు అర్థసెంచరీలతో మెరిశారు. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 222 పరుగులకు పరిమితమైంది.Casual inspection from Tim David after absolute destruction 🔥🥶#IPLRivalryWeek 2026 👉 #MIvRCB | LIVE NOW 👉https://t.co/gLbf9ggQbu | #TATAIPL pic.twitter.com/OumaLMDlYF— Star Sports (@StarSportsIndia) April 12, 2026చదవండి: ఈ లెక్కన ఎస్ఆర్హెచ్కు మూడినట్లే! -
ఈ లెక్కన ఎస్ఆర్హెచ్కు మూడినట్లే!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ భీకర ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. బరిలోకి దిగిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న ఈ బుల్లోడు 266.66 స్ట్రైక్‌రేట్‌తో 200 పరుగులకు పైగా సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో కొనసాగుతున్నాడు. తాను క్రీజులో ఉంటే బౌలర్ ఎవరైతే నాకేంటి.. బంతిపైనే తన దృష్టి ఉంటుందని ఇటీవలే ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం డైరెక్ట్ స్టేట్మెంట్ విడుదల చేయడం గమనార్హం. ఇప్పటివరకు రాజస్తాన్ ఆడిన ప్రతీ జట్టులో ఒక ప్రధాన బౌలర్‌ను వైభవ్ ఒక ఆట ఆడుకున్నాడు. చెన్నైతో మ్యాచ్‌లో మాట్ హెన్రీని, గుజరాత్‌తో మ్యాచ్‌లో రబాడను, ముంబైతో మ్యాచ్‌లో బుమ్రాను, ఆర్సీబీతో మ్యాచ్‌లో హాజిల్‌వుడ్‌ను లక్ష్యంగా చేసుకొని ఫోర్లు, సిక్సర్లు బాదాడు. ఇక ఇవాళ వైభవ్ సూర్యవంశీ ఎస్ఆర్హెచ్ను వారి సొంతగడ్డపైనే ఎదుర్కోనున్నాడు. బుమ్రా, హాజిల్‌వుడ్, రబాడ వంటి టాప్ బౌలర్లను ఉతికారేసిన వైభవ్ ముందు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చిన్నబోతోంది. కమిన్స్ లేకపోవడంతో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బలహీనంగా తయారయ్యింది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ బౌలర్ లేకపోవడం మైనస్‌గా మారింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఎస్ఆర్హెచ్ బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. యావరేజ్‌గా చూసుకుంటే ప్రతీ ఓవర్‌కు 10.42 పరుగులివ్వడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్లో బౌలింగ్ పరంగా అత్యంత చెత్త ప్రదర్శన ఎస్ఆర్హెచ్దే. ఇక పేసర్ల పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. హర్షల్ పటేల్, ఉనాద్కట్, ఇషాన్ మలింగలతో కూడిన పేస్ త్రయం ప్రతీ ఓవర్‌కు సగటున 11.47 పరుగులు సమర్పించుకున్నారు. ఈ లెక్కన ఇవాళ్టి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోమారు చెలరేగితే మాత్రం ఎస్ఆర్హెచ్ బౌలర్లకు మూడినట్లేనని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థి జట్ల బౌలర్లు హడలెత్తిపోయేలా చేస్తున్నాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఇక ఐపీఎల్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరుజట్లు 21 సార్లు తలపడితే ఎస్ఆర్హెచ్ 12 సార్లు, రాజస్తాన్ 9 సార్లు విజయాలు అందుకున్నాయి. సీజన్లో ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్ ఐదో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించిన ఎస్ఆర్హెచ్ సొంతగడ్డపై రెండో విజయాన్ని అందుకోవాలని చూస్తోంది.చదవండి: వైభవ్ సూర్యవంశీపై నిషేధం? -
ఫోన్ చూసిన రోమీ, వైభవ్ సూర్యవంశీ.. షాకిచ్చిన బీసీసీఐ!
రాజస్తాన్ రాయల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి భిందర్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అనినీతి వ్యతిరేక, భద్రతా విభాగం అతడికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.అగ్రస్థానంలోఐపీఎల్-2026లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న రాజస్తాన్ రాయల్స్.. శుక్రవారం నాటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ని చిత్తు చేసింది. తద్వారా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లు నాలుగూ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో రాయల్స్ ఓపెనర్, పదిహేనేళ్ల వైభవ్ సూర్యవంశీ పాత్ర కీలకం.అయితే, ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ చేసిన పని వివాదానికి దారితీసింది. డగౌట్లో కూర్చుని అతడు మొబైల్ ఫోన్‌ను చూశాడు. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ సైతం పక్కనే కూర్చుని ఫోన్లోకి చూసినట్లుగా ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి.రంగంలోకి బీసీసీఐకాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న వేళ డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం నిషిద్ధం. ఇలా చేయడం ద్వారా అవినీతి నిరోధక ప్రొటోకాల్ నిబంధనలను ఉల్లంఘించినట్లే లెక్క. ఈ నేపథ్యంలో బీసీసీఐ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఈ ఘటనపై విచారణలో భాగంగా బీసీసీఐలోని యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) రోమీ భిందర్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నలభై ఎనిమిది గంటల్లోగా.. తాను ఆరోజు ఫోన్ ఎందుకు ఉపయోగించానన్న విషయంపై రోమీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ విషయాన్ని ఐపీఎల్ పాలక మండలి చైర్మన్ అరుణ్ ధుమాల్ ధ్రువీకరించాడు. ‘‘ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరిపి.. నివేదిక ఇవ్వాల్సిందిగా మేము ACSUను ఆదేశించాము’’ అని ధుమాల్ తెలిపాడు.PC: BCCIఅందుకే ఫోన్ చూశాడా?ఈ విషయంపై రోమి భిందర్ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘అనారోగ్యం కారణంగా రోమీ దాదాపుగా పది కిలోల బరువు తగ్గిపోయాడు. అతడికి ఆస్తమా కూడా ఉంది. అందుకే దూరప్రయాణాలు చేయొద్దని, మెట్లు ఎక్కడం తగ్గించాలని వైద్యులు సూచించారు.అయితే, టీమ్ మేనేజర్‌గా ఫ్రాంఛైజీ తరపున అతడు ఎన్నెన్నో వ్యవహారాలు చక్కబెట్టాల్సి ఉంటుంది. అతడికి నిబంధనలు తెలుసు. ఆరోజు కూడా వైద్యపరమైన కారణాల వల్లే అతడు ఫోన్ చూశాడు. హెల్త్ ఎమర్జెన్సీ సమయాల్లో డగౌట్లో కూర్చుని ల్యాప్‌టాప్ లేదంటే మొబైల్‌తో కనిపించడం తప్పేమీ కాదు.నిజానికి అతడు ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే.. ఎవరికైనా ఫోన్ చేస్తున్నట్లుగానో కనిపించలేదు. కేవలం అతడు ఫోన్‌ను స్క్రోల్ చేశాడంతే. ACSU విచారణలో అతడు తాను చేసిన పని గురించి వివరణ ఇవ్వగలడు. అతడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ACSU విచారణ జరుపుతుందని భావిస్తున్నాం. డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ఫోన్ చూసుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్లాలంటే కనీసం 50 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అందుకే అతడు అక్కడే కూర్చుని ఫోన్ చూసి ఉంటాడు’’ అని పేర్కొన్నాయి.చదవండి: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా 1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026 -
వైభవ్ సూర్యవంశీకి భారీ షాక్..! ఒకవేళ అదే జరిగితే?
ఐపీఎల్-2026లో శుక్రవారం(ఏప్రిల్ 10) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ గెలుపొందినప్పటికి.. ఆ జట్టు మేనేజర్ రోమీ భిందర్ చేసిన ఒక చిన్న పొరాటు ఇప్పుడు వివాదానికి దారితీసింది.మ్యాచ్ జరుగుతుండగా రోమీ భిందర్ డగౌట్లో, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి మొబైల్ ఫోన్ వాడుతూ టీవీ కెమెరాలకు చిక్కాడు. ఇందుకు సబంధించిన వీడియోను తొలుత ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు డగౌట్లో మొబైల్ ఫోన్లు వాడటం పూర్తిగా నిషేధం. ఈ ఘటనపై ఐపీఎల్ ఫౌండర్, మాజీ చైర్మెన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించాడు. అవినీతి నిరోధక, భద్రతా విభాగం అధికారులు అప్పుడు ఏం చేస్తున్నారని అతడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు. తాజాగా ఇదే విషయంపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు.రోమీ భిందర్ 'ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా' నిబంధనలను ఉల్లంఘించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్లో సెల్ ఫోన్ వాడకం నిషేధం. ఇది పొరపాటున జరిగి ఉండవచ్చు. కానీ అతడు నిబంధనలు ఉల్లంఘించనందున చర్యలు తప్పవు. మ్యాచ్ రిఫరీ, అవినీతి నిరోధక విభాగం నివేదిక ఆధారంగా జరిమానా ఉంటుందా లేదా మ్యాచ్ నిషేధం ఉంటుందా అనేది ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయిస్తుంది" బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐ పేర్కొన్నారు. కాగా మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ తన "లోకల్ గార్డియన్" అని రోమీ భిందర్‌ను పేర్కొనడంతో, ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరిగే అవకాశం ఉంది. బీసీసీఐ యాంటి కరప్షన్ యూనిట్ నివేదిక ప్రకారం ఐపీఎల్ గవర్నింగ్ అతడిపై చర్యలు తీసుకోనుంది. నివేదిక ఆధారంగా భారీ జరిమానా లేదా కొన్ని మ్యాచ్‌ల పాటు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్‌లోకి రాకుండా నిషేధం విధించే ఛాన్స్ ఉంది.మరోవైపు రుమీ బిందర్ పక్కన ఉండి ఫోన్ చూసిన 15 వైభవ్ సూర్యవంశీపై కూడా బీసీసీఐ స్వల్ప జరిమానాను విధించే అవకాశం ఉందని టైమ్స్ ఇండియా తమ కథనంలో పేర్కొంది.చదవండి: Sanju Samson: చరిత్ర సృష్టించిన శాంసన్.. ధోని కూడా సాధ్యం కాలేదు -
చిక్కుల్లో వైభవ్ సూర్యవంశీ..?
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేసి రాయల్స్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ మధ్యలో వైభవ్ చేసిన ఓ పని అతన్ని చిక్కుల్లో పడేసేలా ఉంది.మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైభవ్ డగౌట్లో కూర్చొని జట్టు మేనేజర్ రోమీ భిందర్‌తో కలిసి మొబైల్ ఫోన్ చూస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. బీసీసీఐ నియమాల ప్రకారం ఆటగాళ్లు మ్యాచ్ జరుగుతుండగా మొబైల్ చూడరాదు, వాడరాదు. మేనేజర్‌కు ఈ విషయంలో వెసులుబాటు ఉన్నా, అతనికి కూడా డగౌట్లో మొబైల్ వాడే పర్మిషన్ లేదు. మేనేజర్‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రమే ఫోన్ వినియోగించే వెసులుబాటు ఉంది.ఇప్పుడు డగౌట్లో మొబైల్ వాడినందుకు మేనేజర్‌తో పాటు వైభవ్ కూడా చిక్కుల్లో పడినట్లైంది. వైభవ్ స్వతహాగా మొబైల్ వాడనప్పటికీ, దానివైపు చూస్తున్నట్లు సోషల్‌మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మేనేజర్‌తో పాటు వైభవ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాడేమో చూడాలి.ఈ అంశానికి సంబంధించి బీసీసీఐ నియమాలు (PMOA – Minimum Standards for Players and Match Officials Areas) ఇలా ఉన్నాయి.- మొబైల్ ఫోన్లు, కమ్యూనికేషన్ డివైజ్‌లు డగౌట్లో అనుమతించబడవు. - టీమ్ మేనేజర్ డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రమే ఫోన్ వాడవచ్చు, డగౌట్లో కాదు. - అనలిస్టులు కంప్యూటర్లు వాడవచ్చు, కానీ కేవలం ప్రత్యేకంగా కేటాయించిన అనలిస్ట్ టేబుల్ వద్ద మాత్రమే. - ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ స్టేడియంలోకి వచ్చిన వెంటనే తమ డివైజ్‌లను ఆఫ్ చేసి సురక్షితంగా భద్రపరచాలి. - అటెండెంట్స్, క్యాటరింగ్ వర్కర్స్ వంటి సిబ్బంది కూడా కమ్యూనికేషన్ డివైజ్‌లు తీసుకురావడానికి అనుమతి లేదు. -
1089 రోజుల రికార్డు పునరావృతం చేసిన బిష్ణోయ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన ఆసక్తికర సమరంలో ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తొలుత తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (63) ఆర్సీబీ పతనాన్ని అడ్డుకున్నాడు అతనికి రొమారియో షెపర్డ్ (22), వెంకటేశ్ అయ్యర్ (29 నాటౌట్) సహకరించారు. మిగతా బ్యాటర్లలో విరాట్ కోహ్లి (32) పర్వాలేదనిపించగా.. సాల్ట్ (0), పడిక్కల్ (14), కృనాల్ (1), జితేశ్ (5), టిమ్ డేవిడ్ (13) నిరాశపరిచారు. రాయల్స్ బౌలర్లలో బిష్ణోయ్ (4-0-32-2), బ్రిజేష్ శర్మ (4-0-32-2), ఆర్చర్ (3-0-33-2) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. సందీప్ శర్మ (4-0-47-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి పేట్రేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఆతర్వాత ధృవ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ఫలితంగా రాయల్స్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. ఈ ఓటమి ఆర్సీబీకి ఈ సీజన్లో మొదటిది కాగా.. ఈ గెలుపుతో రాయల్స్ తమ అజేయ యాత్రను కొనసాగించింది. ఈ సీజన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రాయల్స్ బౌలర్ రవి బిష్ణోయ్ ఓ ప్రత్యేక ఘనత సాధించాడు. విరాట్‌ను అద్భుతమైన గూగ్లీతో క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా.. 1089 కిందటి ఓ ఘట్టాన్ని పునరావృతం చేశాడు. విరాట్ ఐపీఎల్లో చివరిసారి 2023 ఎడిషన్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడే అతను ఈ తరహాలో వికెట్ సమర్పించుకున్నాడు. అంటే ఐపీఎల్లో విరాట్ 1089 రోజుల తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యాడన్న మాట. 2023 ఎడిషన్‌లో విరాట్ సీఎస్కే బౌలర్ ఆకాశ్ సింగ్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. -
వైభవ్ సూర్యవంశీ ఆటకు విరాట్ కోహ్లి ఫిదా
రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్‌లో అతడు విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. లక్ష్యం ఎంతైనా.. ప్రత్యర్థి ఎవరైనా బంతిని బాదడమే లక్ష్యంగా ముందుకు సాగిపోయాడు.26 బంతుల్లోనే 78 పరుగులతోబెంగళూరు విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లోనే 78 పరుగులతో దుమ్ములేపాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉండటం విశేషం. వైభవ్‌కు తోడు ధ్రువ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్) రాణిచండంతో రాయల్స్ 18 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026కోహ్లి సైతం ఫిదాఇక వైభవ్ ఆటను చూసి ఆర్సీబీ దిగ్గజం, టీమిండియా లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు. ఈ బిహారీ పిల్లాడిపై ప్రశంసలు కురిపిస్తూ అతడిని అభినందించాడు. అంతేకాదు.. వైభవ్ రాయల్స్ క్యాప్‌పై.. ‘‘ప్రియమైన వైభవ్.. అత్యద్భుతంగా ఆడావు’’ అని రాసి తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా సొంతమైదానం గువాహటి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. కోహ్లి (16 బంతుల్లో 32), కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 63) రాణించారు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్ (11 బంతుల్లో 22), వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 29 నాటౌట్) మెరుపులు మెరిపించారు.ఇక లక్ష్య ఛేదనలో వైభవ్, ధ్రువ్ జురెల్‌లతో పాటు రవీంద్ర జడేజా (25 బంతుల్లో 24) కూడా తన వంతు సహకారం అందించాడు. కాగా ఈ సీజన్లో వైభవ్ ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లలో కలిపి 200 పరుగులు పూర్తి చేసుకుని అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ విజేతగా కొనసాగుతున్నాడు. Player of the Match ✅Orange Cap ✅An autograph from Kohli 🐐✅Good night to everyone and remember to keep believing in yourself no matter what 💗 pic.twitter.com/Up2BZuYObM— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2026 -
చుక్కలు చూపించిన బుడోడు.. బిత్తరపోయిన కోహ్లి!
-
అమ్మ ఆశీర్వాదంతో బరిలోకి.. ఆపై దంచికొట్టి !
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ విధ్వంసం జోరుగా కొనసాగుతోంది. ముఖ్యంగా టాపార్డర్‌లో ఓపెనర్లు జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్లో ఎవరో ఒకరు ఇన్నింగ్స్ కడదాకా నిలిచి జట్టును గెలిపిస్తున్నారు. ఇక వైభవ్ సూర్యవంశీ మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు లీగ్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన వైభవ్ సూర్యవంశీ 266 స్ట్రైక్‌రేట్‌తో 200 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లోనూ వైభవ్ విధ్వంసం కొనసాగింది. కేవలం 26 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్ల సాయంతో 78 పరుగులు సాధించాడు. సీజన్లో అతడికి ఇది రెండో అర్థసెంచరీ. వైభవ్ విధ్వంసం ఇలాగే కొనసాగుతూ పోతే ఆరెంజ్ క్యాప్ గెలవడంతో పాటు రాజస్తాన్‌కు కప్ అందించినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ చేసిన ఒక పని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. వైభవ్ మ్యాచ్ ఆడేందుకు హోటల్ రూమ్ నుంచి బయల్దేరిన సమయంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తల్లి బయట నిలబడింది. పరాగ్ తల్లిని గమనించిన వైభవ్ వెంటనే ఆమె దగ్గరికి వచ్చి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. అయితే పరాగ్ తల్లి మాత్రం వైభవ్‌ను వద్దంటూ వారించి హగ్ చేసుకొని ‘ఆల్ ది బెస్ట్’ చెప్పడం వీడియోలో కనిపించింది. వైభవ్ చేసిన పనిని అభిమానులు మెచ్చుకున్నారు . ‘అమ్మ ఎవరికైనా అమ్మే’.. ‘పరాగ్ తల్లి పెద్ద మనసుతో వైభవ్‌ను ఆశీర్వదించడం గొప్ప విషయం’ అంటూ కామెంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పటిదార్ 63 పరుగులు చేశాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురేల్ (82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.చదవండి: ‘అతడు ఇలాగే రెచ్చిపోతే మా పని సులువు’ Vaibhav Sooryavanshi touched the feet of Riyan Parag's mother and took her blessings before the RCB vs RR match. ❤Vaibhav Sooryavanshi is a down-to-earth, pure desi boy. pic.twitter.com/Djgqn5mUiY— Sonu (@Cricket_live247) April 10, 2026 -
వైభవ్ విధ్వంసం.. బుడ్డోడు బాదుడే బాదుడు
-
‘అతడు ఇలాగే రెచ్చిపోతే మా పని సులువు’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో రాజస్తాన్ సునాయాసంగా గెలుపొందింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. వరుసగా నాలుగు విజయాలు సాధించడం సంతోషంగా అనిపిస్తున్నప్పటికీ బౌలింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. పరాగ్ మాట్లాడుతూ.. ‘గత కొన్నేళ్లుగా ఈ వేదికపై మా రికార్డు అంత ఆశాజనకంగా లేదు, కానీ ఈరోజు ఆట తీరు బాగుంది. అయితే బౌలర్లు ఇంకాస్త క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంది. ప్రత్యర్థి జట్టు 200 పరుగులు చేసేలా కనిపించినా.. మధ్య ఓవర్లలో వికెట్లు తీసి వారిని కట్టడి చేశాం. కానీ నిజానికి వారిని 170 పరుగుల లోపే నియంత్రించి ఉండాల్సింది. కెప్టెన్‌గా నేను కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. మా బౌలర్లు కొన్ని సందర్భాల్లో బ్యాటర్లకు అవకాశం ఇవ్వడం వారికి అనుకూలంగా మారింది. గౌహతి, జైపూర్లలో మేము చేసిన ముందస్తు సన్నద్ధత ఇక్కడ పనిచేసింది. గ్రౌండ్‌పై ఉన్న నల్లమట్టి పిచ్ ఎలా ప్రవర్తిస్తుందనేది మాకు ముందే తెలుసు. పరిస్థితులకు అనుగుణంగా మారడమే ఒక జట్టుగా మా లక్ష్యం. ఇప్పటివరకు మేము స్టిక్కీ పిచ్‌లపై ఆడాము, బ్యాటింగ్‌కు అనుకూలమైన 'బెల్టర్' పిచ్ లభిస్తే మా ఆట ఇంకా అద్భుతంగా ఉంటుంది. వైభవ్ జట్టులో అందరికీ ఇష్టమైన వ్యక్తి. అతను ఇంకా చిన్న పిల్లాడు, అతనికి బయట తిరగడం, రకరకాల ఆహార పదార్థాలు తినడం అంటే చాలా ఇష్టం. మేము అతనికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాము. అన్నింటికంటే ముఖ్యంగా అతనికి బ్యాటింగ్ అంటే పిచ్చి ప్రేమ. వైభవ్ విధ్వంసం ఇలాగే కొనసాగితే మా పని సులువైపోతుంది.’ అని చెప్పుకొచ్చాడు. 𝙐𝙣𝙗𝙚𝙖𝙩𝙚𝙣 & 𝙐𝙣𝙨𝙩𝙤𝙥𝙥𝙖𝙗𝙡𝙚 🫡A sensational win for #RR to sign off from Guwahati in style 🩷Scorecard ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/eNq8gglcrL— IndianPremierLeague (@IPL) April 10, 2026చదవండి: ‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’ -
‘బంతి మీదే దృష్టి.. బౌలర్ వైపు కన్నెత్తి చూడను!’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. క్రీజులోకి వచ్చిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 26 బంతుల్లోనే 78 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి రాజస్తాన్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. క్రీజులో ఉన్నప్పుడు బౌలర్‌వైపు కన్నెత్తి చూడనని, కేవలం బంతిపైనే తన దృష్టి ఉంటుందని వైభవ్ పేర్కొన్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ‘కేక్ కటింగ్ లాంటిది ఏమీ లేదు. ఈరోజు తొందరగా పడుకోవాలి, ఎందుకంటే తెల్లవారి ఉదయమే మేము ఫ్లైట్ ఎక్కాల్సి ఉంది. నాకు భయం లేదని అనుకోవద్దు. అయితే ప్రాక్టీస్‌లో ఏదైతే అనుసరిస్తున్నానో మ్యాచ్‌లోనూ అదే గేమ్‌ను ఆడుతున్నా తప్పిస్తే దానికి అదనంగా ఏమీ చేయడం లేదు. ఎదురుగా బుమ్రా, హాజిల్‌వుడ్ లాంటి అంతర్జాతీయ స్టార్ బౌలర్లు ఉన్నప్పటికీ వారిని ఎదుర్కోవడానికి నా ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. నా మైండ్‌లో ఒకటే ఫిక్స్ అయ్యా. బౌలర్ ఎవరయినా సరే బెరుకు లేకుండా ఆడుతూ షాట్స్ ఆడాలని నిర్ణయించుకున్నా. కనీసం బౌలర్ ఎవరన్నది కన్నెత్తి కూడా చూడను. కేవలం బౌలర్ వేసే బంతిపైనే ఫోకస్ ఉంటుంది. ఆ బంతి ఎలా వస్తుంది? ఏ షాట్ ఆడాలి అన్నదే మైండ్‌లో తిరుగుతుంది. అందుకే ఎదుట ఎంత పెద్ద బౌలర్ ఉన్నా భయపడకుండా నా గేమ్ నేను ఆడుకుంటాను. ఇక నన్ను గైడ్ చేస్తున్న వాళ్లలో నా తండ్రితో పాటు కోచ్‌లు ఉన్నారు. ముఖ్యంగా రోమీ సార్ నా గార్డియన్. వీళ్లంతా నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైందని, నువ్వు ఈ జర్నీలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుందని, అందుకు ఆటపైనే దృష్టి పెట్టాలని ఇతర ఆలోచనలు వదిలేయాలని పదే పదే నన్ను మోటివేట్ చేస్తుంటారు. ఔటవ్వడంపై పెద్దగా బాధ లేదు. ఎందుకంటే నేను ఉండుంటే నా నుంచి మరో 10 నుంచి 20 పరుగులు వచ్చేవి. టార్గెట్ కూడా రెండు ఓవర్ల ముందే ఫినిష్ అయిపోయేదేమో. ఒకవేళ తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే 10 నుంచి 20 పరుగులు ఎక్కువ చేసేవాళ్లమే. కాబట్టి నేను పేలవమైన షాట్ ఆడి ఔట్ అయితే జట్టుకు మైనస్ అయ్యేది అని బాధపడేవాడిని. కానీ ఆ చాన్స్ తీసుకోలేదు.’అని చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పటిదార్ 63 పరుగులు చేశాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీతో పాటు ధ్రువ్ జురేల్ (82) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026Never satisfied. Never settling for less 🫡🎥 THE VAIBHAV SOORYAVANSHI MINDSET ✨#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/rdwKH9eReH— IndianPremierLeague (@IPL) April 10, 2026చదవండి: మొన్న బుమ్రా.. నేడు హాజిల్‌వుడ్! ఎవరైతే నాకెంటి? -
వారెవ్వా వైభవ్
విజయలక్ష్యం ఎంతైతేనేమి... ప్రత్యర్థి ఎవరైతేనేమి... 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి లెక్కే లేదు... అతనికి తెలిసిందల్లా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటమే... ఐపీఎల్లో మరోసారి అతను తన విధ్వంసక రూపాన్ని ప్రదర్శించాడు. ఫలితంగా రాజస్తాన్ రాయల్స్‌కు వరుసగా నాలుగో విజయం దక్కగా, బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది. 202 పరుగుల ఛేదనలో వైభవ్ 78 పరుగుల సహాయంతో 49 బంతుల్లోనే 129కి చేరిన రాజస్తాన్‌కు మిగిలిన 73 పరుగులు రాబట్టడంలో ఇబ్బంది రాలేదు. ధ్రువ్ జురేల్ కూడా అర్ధ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. గువాహటి: ఐపీఎల్లో మాజీ విజేత రాజస్తాన్ రాయల్స్ దూసుకుపోతోంది. శుక్రవారం దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఆరు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్ నిర్ణీత సమయంకంటే 70 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.కెప్టెన్ రజత్ పాటీదార్ (40 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లి (16 బంతుల్లో 32; 7 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. అనంతరం రాజస్తాన్ 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలిచింది. వైభవ్ సూర్యవంశీ (26 బంతుల్లో 78; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) చెలరేగిపోగా, ధ్రువ్ జురేల్ (43 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. రాణించిన కోహ్లి... ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సాల్ట్ (0) వెనుదిరిగినా.... కోహ్లి కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. ఆర్చర్ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను సందీప్ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. పడిక్కల్ (14) విఫలం కాగా, చక్కటి బంతితో కోహ్లిని బౌల్డ్ చేసి బిష్ణోయ్ దెబ్బ తీశాడు. పవర్‌ప్లేలో ఆర్సీబీ 61 పరుగులు చేయగా, తక్కువ వ్యవధిలో కృనాల్ పాండ్యా (1), జితేశ్ శర్మ (5), టిమ్ డేవిడ్ (13) అవుటయ్యారు. షెఫర్డ్ (11 బంతుల్లో 22; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుకు జడేజా అడ్డుకట్ట వేశాడు. ఆఖరి 6 ఓవర్లలో 76 పరుగులు... ఆర్సీబీ స్కోరు 14 ఓవర్లలో 125/7... తడబడుతూ ఆడిన కెపె్టన్ పాటీదార్ 26 బంతుల్లో 27 పరుగులే చేయగా... తప్పనిసరి స్థితిలో బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను ఇంపాక్ట్ సబ్‌గా జట్టు బరిలోకి దిగింది. ఈ దశలో పాటీదార్ చెలరేగిపోయాడు. తర్వాతి 14 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో అతను 36 పరుగులు రాబట్టాడు. బర్గర్, బిష్ణోయ్ ఓవర్లలో అతను రెండేసి సిక్సర్లు బాది 35 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. అతను అవుటైన తర్వాత వెంకటేశ్ బాధ్యత తీసుకున్నాడు. సందీప్ వేసిన చివరి ఓవర్లో వెంకటేశ్ ఫోర్, 2 సిక్స్‌లు బాదడంతో స్కోరు 200 దాటింది. జురేల్ జోరు... భారీ ఛేదనలో రాజస్తాన్ వేగంగా దూసుకుపోయింది. సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన హాజల్‌వుడ్ ఓవర్లో 2 సిక్స్‌లు బాదిన యశస్వి జైస్వాల్ (13) అదే ఓవర్లోనే వెనుదిరిగాడు. అయితే మరో ఓపెనర్ వైభవ్ తనదైన శైలిలో చెలరేగిపోగా, జురేల్ కూడా దూకుడు ప్రదర్శించాడు. అభినందన్ ఓవర్లో జురేల్ వరుసగా 4, 6, 4, 0, 6, 4తో ఏకంగా 24 పరుగులు సాధించడంతో పవర్‌ప్లే ముగిసేసరికే స్కోరు 97కు చేరింది. ఎట్టకేలకు కృనాల్ వరుస బంతుల్లో వైభవ్, హెట్‌మైర్ (0)లను అవుట్ చేయగా, పరాగ్ (3) విఫలమయ్యాడు. ఈ దశలో రాయల్స్ కాస్త నెమ్మదించింది. వరుసగా 25 బంతుల పాటు బౌండరీనే రాలేదు. అయితే జురేల్, రవీంద్ర జడేజా (25 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్) సంయమనంతో ఆడి జట్టును గెలిపించారు. మళ్లీ అదే బాదుడు... వైభవ్ సూర్యవంశీ మరోసారి తన స్థాయిని, సత్తాను ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించాడు. భువీ వేసిన మొదటి ఓవర్లో 2 ఫోర్లతో మొదలు పెట్టిన అతను అభినందన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. గత మ్యాచ్‌లో బుమ్రాపై చెలరేగిన తరహాలోనే ఈసారి మరో అంతర్జాతీయ స్టార్ బౌలర్ హాజల్‌వుడ్ పని పట్టాడు. హాజల్‌వుడ్ ఓవర్లో వైభవ్ వరుసగా 4, 4, 4, 6తో చెలరేగిపోయాడు. భువీ వేసిన తర్వాతి ఓవర్లోనూ 2 సిక్స్‌లు, ఫోర్ బాదిన అతను 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాజస్తాన్‌ను నిలువరించే ప్రయత్నంలో పార్ట్‌టైమర్ డేవిడ్‌ను ఆర్సీబీ బౌలింగ్‌కు దింపగా, వైభవ్ వరుసగా రెండు సిక్సర్లతో దాడి చేశాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న అతడిని చివరకు కృనాల్ నిలువరించగలిగాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 0; కోహ్లి (బి) బిష్ణోయ్ 32; పడిక్కల్ (సి) హెట్‌మైర్ (బి) ఆర్చర్ 14; పాటీదార్ (సి) ఫెరీరా (బి) సందీప్ 63; కృనాల్ (సి) హెట్‌మైర్ (బి) బిష్ణోయ్ 1; జితేశ్ (ఎల్బీ) (బి) బ్రిజేశ్ 5; డేవిడ్ (సి) హెట్‌మైర్ (బి) బ్రిజేశ్ 13; షెఫర్డ్ (సి) బ్రిజేశ్ (బి) జడేజా 22; వెంకటేశ్ (నాటౌట్) 29; భువనేశ్వర్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–0, 2–45, 3–58, 4–62, 5–76, 6–94, 7–125, 8–166. బౌలింగ్: ఆర్చర్ 3–0–33–2, బర్గర్ 3–0–32–0, సందీప్ 4–0–47–1, రవి బిష్ణోయ్ 4–0–32–2, జడేజా 2–0–14–1, బ్రిజేశ్ 4–0–37–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) జితేశ్ (బి) హాజల్‌వుడ్ 13; వైభవ్ (సి) కోహ్లి (బి) కృనాల్ 78; జురేల్ (నాటౌట్) 81; హెట్‌మైర్ (సి) హాజల్‌వుడ్ (బి) కృనాల్ 0; పరాగ్ (సి) కృనాల్ (బి) హాజల్‌వుడ్ 3; జడేజా (నాటౌట్) 24 ; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో 4 వికెట్లకు) 202. వికెట్ల పతనం: 1–21, 2–129, 3–129, 4–134. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–37–0, హాజల్‌వుడ్ 4–0–44–2, అభినందన్ 3–0–54–0, కృనాల్ పాండ్యా 4–0–30–2, డేవిడ్ 1–0–18–0, షెఫర్డ్ 2–0–18–0. ఐపీఎల్లో నేడుపంజాబ్ X హైదరాబాద్ వేదిక: న్యూ చండీగఢ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచిచెన్నై X ఢిల్లీ వేదిక: చెన్నైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 26 బంతుల్లోనే
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ధనధాన్ లీగ్‌లో భాగంగా గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 202 పరుగుల లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ వంటి వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్లను సైతం ఈ బుడ్డోడు ఉతికారేశాడు. తొలిసారి హేజిల్‌వుడ్‌ను ఎదుర్కొన్న వైభవ్.. 4 ఓవర్లో వరసగా 4, 4, 4 ,6తో 19 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ ఓవర్లో వరసగా రెండు సిక్సర్లతో 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించడం ఇది రెండో సారి కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. వైభవ్ ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్‌ను తన సహచరుడు జైశ్వాల్ నుంచి సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ నాలుగు మ్యాచ్‌లు 266.67 స్ట్రైక్ రేటుతో 200 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: బిష్ణోయ్ సూపర్ డెలివరీ.. కోహ్లి ఫ్యూజ్‌లు ఔట్? వీడియో వైరల్Vaibhav Sooryavanshi in IPL1st ball v Bumrah - 61st ball v Bhuvi - 41st ball v Shardul - 61st ball v Washington- 61st ball v Arshdeep - 41st ball v Hazlewood - 4Unreal Talent, Unreal Hitting pic.twitter.com/XGQT8SnR4u— Cricketopia (@CricketopiaCom) April 10, 2026 -
వైభవ్, జురెల్ ఫిప్టీలు.. ఆర్సీబీపై రాజస్తాన్ ఘన విజయం
RCB vs RR Live Updates: ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. గౌహతి వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18 ఓవర్లలో చేధించింది.లక్ష్య చేధనలో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 78 పరుగులు చేశాడు. అతడితో పాటు ధ్రువ్ జురెల్(43 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 81 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్(40 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్‌లతో 63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(29), షెఫర్డ్(22), విరాట్ కోహ్లి(32) రాణించారు.విజయానికి చేరువలో రాజస్తాన్రాజస్తాన్ విజయానికి 24 బంతుల్లో 18 పరుగులు కావాలి. క్రీజులో ధ్రువ్ జురెల్(66), రవీంద్ర జడేజా(21) ఉన్నారు.రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్రాజస్తాన్ రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రాజస్తాన్ విజయానికి 62 బంతుల్లో 68 పరుగులు కావాలి.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో షెమ్రాన్ హెట్‌మైర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్వైభవ్ సూర్యవంశీ రూపంలో రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసిన వైభవ్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న వైభవ్, జురెల్6 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 97/1. క్రీజులో ధ్రువ్ జురెల్(27), వైభవ్ సూర్యవంశీ(57) ఉన్నారు.వైభవ్ విధ్వంసంవైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసం సృష్టిస్తున్నాడు. జోష్ హాజిల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్లో వైభవ్.. ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో 17 పరుగులు రాబట్టాడు. కేవలం 15 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 5 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 73/1దూకుడుగా ఆడుతున్న వైభవ్3 ఓవర్లకు రాజస్తాన్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో వైభవ్ సూర్యవంశీ(23), ధ్రువ్ జురెల్(1) ఉన్నారు.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దంచి కొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్(40 బంతుల్లో 4 ఫోర్లు,4 సిక్స్‌లతో 63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. వెంకటేశ్ అయ్యర్(29), షెఫర్డ్(22), విరాట్ కోహ్లి(32) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ, జోఫ్రా ఆర్చర్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు సందీప్ శర్మ, రవీంద్ర జడేజాతలా వికెట్ సాధించారు.ఆర్సీబీ ఎనిమిదో వికెట్ డౌన్ఆర్సీబీ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 63 పరుగులు చేసిన రజిత్ పాటిదార్.. సందీప్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఆర్సీబీ ఏడో వికెట్ డౌన్ఆర్సీబీ ఏడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన రోమారియో షెపర్డ్.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 150/7. పాటిదార్ 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు.ఆర్సీబీ ఆరో వికెట్ డౌన్ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన టిమ్ డేవిడ్.. బ్రిజేష్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 94/6ఆర్సీబీ ఐదో వికెట్ డౌన్ఆర్సీబీ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా ఔట్ కాగా.. 8 ఓవర్ లో బ్రిజేస్ బౌలింగ్‌లో జితేశ్ శర్మ ఔటయ్యాడు. 9 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 82/5ఆర్సీబీ మూడో వికెట్ డౌన్ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.ఆర్సీబీ రెండో వికెట్ డౌన్ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసి పడిక్కల్ జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 45-2ఆర్సీబీకీ భారీ షాక్టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే భారీ షాక్ తగిలింది. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో తొలి బంతికే ఫిల్ సాల్ట్ ఔటయ్యాడు. క్రీజులోకి దేవ్‌దత్త్ పడిక్కల్ వచ్చాడు. 2 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 32/1టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ఐపీఎల్-2026 సీజన్లో భాగంగా గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఓ మార్పుతో బరిలోకి దిగింది. తుషార్ దేశ్‌పాండే స్ధానంలో బ్రిజేశ్ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఆర్సీబీ స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఎట్టకేలకు పునరాగమనం చేశాడు. జాకబ్ డఫీ స్ధానంలో హాజిల్‌వుడ్ జట్టులోకి వచ్చాడు.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ : విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జోష్ హాజిల్వుడ్రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ తగ్గిన వర్షంఅభిమానులకు గుడ్ న్యూస్. గౌహతిలో వర్షం ఆగింది. దీంతో టాస్ 8:00 గంటలకు పడనుండగా.. మ్యాచ్ 8:15కు ప్రారంభం కానుంది.టాస్ ఆలస్యంఐపీఎల్-2026లో భాగంగా గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్లు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. పిచ్‌ను ప్రస్తుతం కవర్లతో కప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్రకారం 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఇప్పుడు ఆలస్యం కానుంది. -
బుమ్రాకే చుక్కలు చూపించాడు -వాడి బ్యాటింగ్ కు పిచ్చోళ్లయిపోయాం...
-
వైభవ్ సూర్యవంశీ చరిత్రాత్మక రికార్డు
రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ ఎడిషన్‌లో 3 మ్యాచ్‌ల్లోనే 11 సిక్సర్లు బాదిన అతను.. ఓ చరిత్రాత్మక రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 సిక్సర్లు బాదిన అనంతరం ఈ ఘనతను సాధించాడు.ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..?సూర్యవంశీ ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 10 ఇన్నింగ్స్‌ల్లో 171 బంతులు ఎదుర్కొని 35 సిక్స్‌లు బాదాడు. అంటే ప్రతి 4.88 బంతులకు ఓ సిక్సర్ బాదినట్లు లెక్క. ఇది ఐపీఎల్ చరిత్రలో కనీస బంతుల్లో సిక్స్ కొట్టిన రికార్డు. ఈ విభాగంలో రొమారియో షెపర్డ్, ఉర్విల్ పటేల్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, ఆండ్రీ రసెల్ లాంటి విధ్వంసకర బ్యాటర్లను సూర్యవంశీ అధిగమించాడు.- వైభవ్ సూర్యవంశీ – 4.88 - రొమారియో షెపర్డ్ – 5.1 - ఉర్విల్ పటేల్ – 5.3 - జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ – 6.4 - ఆండ్రీ రసెల్ – 6.8 ఆకాశమే హద్దుప్రస్తుత ఎడిషన్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్ సెంచరీ (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసిన అతను.. ఆతర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 31 పరుగులు చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై కూడా అదే జోరును కొనసాగించి 14 బంతుల్లో ఫోర్, 5 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు.ఈ సీజన్లో వైభవ్.. యశస్వి జైస్వాల్‌తో కలిసి అందిస్తున్న మెరుపు ఆరంభాలు రాజస్తాన్ రాయల్స్‌ను అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగిస్తున్నాయి. రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది.తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జైస్వాల్ (77 నాటౌట్) పరుగులతో సత్తా చాటగా.. వైభవ్ (39) రాణించాడు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ సైతం పోరాడినప్పటికీ.. లక్ష్యానికి 28 పరుగుల దూరంలో (123-9) నిలిచిపోయింది. -
జైస్వాల్ బ్యాట్ వెనుక ఇంత కథ దాగుందా!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ గురించి ఒక కీలక విషయం బయటకొచ్చింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు జైస్వాల్ క్రాక్ వచ్చిన బ్యాట్‌తోనే బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ పంచుకున్నాడు. నిజానికి ముంబైతో మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే జైస్వాల్ భారీ షాట్లు ఆడాడు. ఈ నేపథ్యంలో బ్యాట్‌కు చిన్న క్రాక్ వచ్చింది. బ్యాట్‌కు క్రాక్ వచ్చిన విషయాన్ని జైస్వాల్ కోచ్ విక్రమ్‌కు చూపించాడు. అయితే విక్రమ్ మాత్రం ఏం పర్లేదు.. విరిగిన బ్యాట్‌తో ఆడితే ఫలితం బాగుంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై విక్రమ్ రాథోర్ స్పందిస్తూ.. ‘నిజానికి జైస్వాల్ బ్యాట్‌కు చిన్న పగులు మాత్రమే వచ్చింది. ఎంత గట్టి షాట్లు ఆడినా బ్యాట్‌కు తట్టుకునే సామర్థ్యముంది. అందుకే నేను జైస్వాల్‌ను అదే బ్యాట్‌తో బరిలోకి దిగమని చెప్పాను. అతడి నమ్మకమే అతడి బలం.’ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్లో పుంచుకోవడంతో వైరల్‌గా మారింది. అలా జైస్వాల్ చిన్నపాటి క్రాక్ వచ్చిన బ్యాట్‌తోనే ముంబైతో మ్యాచ్‌లో బరిలోకి దిగి ఇరగదీశాడు. అసలే ముంబై ఇండియన్స్‌పై మంచి రికార్డు కలిగి ఉన్న జైస్వాల్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ విషయానికొస్తే వర్షం అంతరాయంతో 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జైస్వాల్ (77), సూర్యవంశీ (39), పరాగ్ (20) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితమైంది. View this post on Instagram A post shared by IPL (@iplt20) View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: సెలెక్షన్ కమిటీపై షమీ సంచలన వ్యాఖ్యలు! -
అనుభవం లేనోళ్లే ఎక్కువ.. అయినా కుమ్మేస్తున్నారు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ దూకుడు మాములుగా లేదు. అన్ని జట్లతో పోలిస్తే రాజస్తాన్ తుది జట్టులోని స్వదేశీ ఆటగాళ్లలో అనుభవం లేని ఆటగాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. జట్టు మొత్తం కుర్రాళ్లతో నిండిపోయినప్పటికీ యువరక్తం కావడంతో జోష్ రెండింతలు అయినట్లుంది. జట్టులో రవీంద్ర జడేజా మాత్రమే టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. జడేజాను మినహాయిస్తే మిగతా ఆటగాళ్లకు అనుభవం తక్కువే. కాగా ఈ సీజన్లో రాజస్తాన్ తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జట్టులో కూడా ఒకరిని మించి మరొకరు చెలరేగిపోతుండడం వారికి సానుకూలాంశంగా మారింది. జైస్వాల్ నుంచి ఆర్చర్ దాకా బ్యాటింగ్ చేసే వాళ్లే ఉండడం రాజస్తాన్‌కు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బౌలింగ్ కూడా సమతుల్యతతో ఉండడం కలిసొచ్చే అంశం.భయపెడుతున్న వైభవ్..52, 31, 39.. ఇవి ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ సాధించిన పరుగులు. చేసింది తక్కువ స్కోరే అయినప్పటికీ అతడి దనాధన్ బ్యాటింగ్ ప్రభావం ప్రత్యర్థి జట్లపై గట్టిగానే చూపిస్తోంది. క్రీజులో ఉన్నంతసేపు దంచుడే పరమావధిగా పెట్టుకున్నసూర్యవంశీ భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతున్నాడు. విధ్వంసకర స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించి తన తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించడంలో సక్సెస్ అయ్యాడు. ముంబైతో మ్యాచ్‌లో బుమ్రా, దీపక్ చాహర్ పదునైన బంతులను సిక్సర్లుగా మలిచిన తీరు అభినందనీయమని చెప్పొచ్చు.జైస్వాల్ మోత..సాధారణంగా యశస్వి జైస్వాల్ చూడ్డానికి బక్కపలుచగా ఉన్నప్పటికీ అతడి ఆటతీరు మాత్రం అసాధారణమని చెప్పొచ్చు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఇప్పటికే రెండు అర్థసెంచరీలు సాధించిన జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు. రాజస్తాన్‌కు ఓపెనర్లిద్దరే సగం బలం అని చెప్పొచ్చు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చే ధ్రువ్ జురేల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో జురేల్ 75 పరుగుల ఇన్నింగ్స్ రాజస్తాన్ గెలుపుకు కారణమైంది.పరాగ్ నాయకత్వం..జట్టు విజయాలు సాధిస్తుంటే తప్పులు పెద్దగా కనిపించవు. ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్‌లో మెరుపులు లేనప్పటికీ అతని కెప్టెన్సీలో రాయల్స్ చెలరేగిపోవడం అతని వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించడం లేదు. నాయకుడిగా మూడు మ్యాచ్‌ల్లో సక్సెస్ అయిన పరాగ్ బ్యాటింగ్‌లోనూ అదరగొడితే రాయల్స్‌కు తిరుగు లేనట్లే. హెట్‌మైర్, జడేజా వంటి అనుభవజ్ఞులు తమదైన రోజున ఎంత ప్రమాదకర ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.బౌలింగ్‌లోనూ అదుర్స్..బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ రాజస్తాన్ అదుర్స్ అనిపిస్తోంది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఫామ్‌లో ఉండడం, స్పిన్నర్లు రవి బిష్ణోయ్, జడేజాల స్పిన్ మాయజాలాం, నండ్రీ బర్గర్ సూపర్ బౌలింగ్, తుషార్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ముద్ర ఉండడంతో అంతా మ్యాచ్ విన్నర్లుగానే కనిపిస్తున్నారు.ఐపీఎల్ ఆరంభ సీజన్లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి తొలి టైటిల్ ఎగరేసుకుపోయిన రాజస్తాన్ ఆ తర్వాత మళ్లీ టైటిల్ సాధించలేకపోయింది. శాంసన్ వచ్చిన తర్వాత రాయల్స్ ఆటతీరు మారడమే గాక 2024లో ఫైనల్ వరకు చేరుకుంది. ఇప్పుడు శాంసన్ నుంచి నాయకత్వ బాధ్యతలు తీసుకున్న పరాగ్ అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న రాజస్తాన్ రాయల్స్ సీజన్ మొత్తం ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే కప్ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.A hat-trick of wins and yet to be beaten! 🩷#RR light up Guwahati with a phenomenal 2️⃣7️⃣ run win over #MI to take the top spot on the points table 👏Scorecard ▶️ https://t.co/BCCaxRwjYg#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/lLoKuuOZV4— IndianPremierLeague (@IPL) April 7, 2026చదవండి: కేకేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. దిగొచ్చిన అయ్యర్ సోదరి! -
ఏం గుండెరా బుడ్డోడు? బుమ్రానే చిత్తకొట్టేశావ్ కదరా..
-
హ్యాట్రిక్ కొట్టిన RR
-
ఒక్క మ్యాచ్‌తో ఇన్ని రికార్డులా.. మాములోడివి కాదు!
ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్థశతకాలతో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. వర్షం అంతరాయంతో 11 ఓవర్లకు కుదించిన ఆటలో జైస్వాల్ 32 బంతుల్లోనే 10 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో అలరించాడు. అయితే కేవలం ఒక్క మ్యాచ్‌లోనే జైస్వాల్ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.ఐపీఎల్ కెరీర్లో యశస్వి జైస్వాల్‌కు ఇది మూడో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ముంబైతో మ్యాచ్‌లో 23 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న జైస్వాల్ గతంలో 2023లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లో, 2021లో సీఎస్కేతో మ్యాచ్‌లో 19 బంతుల్లో హాఫ్‌సెంచరీలు సాధించాడు.ఇక రాజస్తాన్ రాయల్స్ తరఫున అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ చోటు సాధించాడు. 19 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేసిన జైస్వాల్ అజింక్యా రహానేతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 25 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లతో బట్లర్, సంజూ శాంసన్‌లు సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు.ఐపీఎల్లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో వంద సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ రికార్డులకెక్కాడు. వంద సిక్సర్లు కొట్టడానికి జైస్వాల్‌కు 69 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. జైస్వాల్ కంటే ముందు కేఎల్ రాహుల్ (68 ఇన్నింగ్స్‌లు), రిషబ్ పంత్ (68 ఇన్నింగ్స్‌లు), శివమ్ దూబే (59 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.ఐపీఎల్లో ఇప్పటివరకు 70 మ్యాచ్‌లాడిన జైస్వాల్ ఖాతాలో రెండు సెంచరీలు, 17 అర్థసెంచరీలున్నాయి. కాగా ముంబై ఇండియన్స్‌పై ఆడిన ఇన్నింగ్స్ జైస్వాల్ ఐపీఎల్ కెరీర్లో నాలుగో అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది.ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున వంద సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు షేన్ వాట్సన్ (109), బట్లర్ (135), శాంసన్ (192) ఉన్నారు.Guwahati still needs an umbrella! ☔️6️⃣🔥 pic.twitter.com/2oCGPHyP7O— Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2026చదవండి: ‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’ -
‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం జైస్వాల్ మాట్లాడాడు.‘పవర్ ప్లే మాకు మూడు ఓవర్లు మాత్రమే అన్న విషయం నా మైండ్‌లో ఉంది. అందుకే బౌలర్లు ఎవరొచ్చినా ధాటిగా ఆడాలని నిర్ణయించుకున్నా. తొలి ఓవర్ దీపక్ చాహర్ బౌలింగ్‌కు వస్తున్నాడని తెలుసుకొని అతడిని ఎదుర్కొనేందుకు ప్రణాళిక వేసుకున్నా. ఆ తర్వాత బుమ్రా బాయ్ బౌలింగ్‌కు వచ్చాడు. బుమ్రా సంగతి వైభవ్ సూర్యవంశీ చూసుకుంటాడులే అని మనసులో అనుకున్నా. ఆ తర్వాత ఎవరొచ్చినా ఇదే ప్లాన్ అమలు చేయాలని చూశాం. మూడు ఫార్మాట్లలో ఇదే తరహా ఆటతీరును ఆడొచ్చా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే నేను ఆడే ప్రతీ మ్యాచ్‌లో బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ప్రతీ మ్యాచ్‌లో వినూత్నమైన షాట్లను ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటగాడు. అతడు ఆడుతున్న తీరు అమోఘం. అతడు కష్టపడుతున్నాడు. వచ్చీ రాగానే భారీ సిక్సర్లు కొడుతూ ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి లోనయ్యేలా చేస్తున్నాడు. ఆటతీరు మార్చుకోమని చెప్పలేను కానీ భారీ ఇన్నింగ్స్ ఆడితే చూడాలని ఉంది. వైభవ్ సూర్యవంశీకి స్వేచ్ఛనిచ్చాం. ఆ స్వేచ్ఛను అతను చక్కగా ఆస్వాదిస్తూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ప్రతీసారి మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి ముందు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. ఈ సీజన్లో వరుసగా మూడు అర్థసెంచరీలు సాధించడం వెనుక నా సీక్రెట్ అదే. నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా.’ అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఫిక్సింగ్ కలకలం.. ఏడుగురు ఆటగాళ్లపై నిషేధం! -
యశస్వి, వైభవ్ మెరుపులు
గువాహటి: ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్తాన్ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆసల్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (32 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 39; 1 ఫోర్, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అనంతరం ముంబై తడబడింది. 11 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసి ఓడింది. రికెల్టన్ (8), రోహిత్ (5), సూర్యకుమార్ (6), తిలక్ (14), హార్దిక్ (9) విఫలమయ్యారు. దంచుడే... దంచుడు మ్యాచ్‌ను రాయల్స్ మెరుపులతో ఆరంభించింది. చహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో జైస్వాల్ 4, 6, 4, 4, 4 కొట్టడంతో 22 పరుగులు రాగా... బుమ్రా వేసిన మరుసటి ఓవర్లో వైభవ్ రెండు సిక్స్‌లు బాదాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో జైస్వాల్ రెండు, వైభవ్ ఒక సిక్స్ కొట్టడంతో మరోసారి 22 పరుగులు వచ్చాయి. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 58 పరుగులు చేసింది. 4వ ఓవర్లో హార్దిక్ నాలుగు పరుగులే ఇవ్వగా... శార్దుల్ వేసిన ఐదో ఓవర్లో 6, 4, 6 కొట్టిన వైభవ్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. దీంతో 80 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ధ్రువ్ జురేల్ (2) విఫలం కాగా... కెప్టెన్ రియాన్ పరాగ్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు.స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 77; వైభవ్ (సి) తిలక్ (బి) శార్దుల్ 39; జురేల్ (ఎల్బీ) ఘజన్ఫర్ 2; పరాగ్ (సి) తిలక్ (బి) ఘజన్ఫర్ 20; హెట్‌మైర్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (11 ఓవర్లలో 3 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–80, 2–84, 3–121. బౌలింగ్: దీపక్ చహర్ 1–0–22–0; బుమ్రా 3–0–32–0; బౌల్ట్ 1–0–22–0; హార్దిక్ 2–0–17–0; శార్దుల్ 2–0– 36–1; ఘజన్ఫర్ 2–0–21–2. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 8; రోహిత్ (సి) జురేల్ (బి) సందీప్ 5; సూర్యకుమార్ (సి) ఆర్చర్ (బి) బర్గర్ 6; తిలక్ (సి) హెట్‌మైర్ (బి) బిష్ణోయ్ 14; హార్దిక్ (సి) జైస్వాల్ (బి) బిష్ణోయ్ 9; నమన్ (సి) బిష్ణోయ్ (బి) బర్గర్ 25; రూథర్‌ఫోర్డ్ (సి) సందీప్ (బి) దేశ్‌పాండే 25; శార్దుల్ (సి) జురేల్ (బి) సందీప్ 8; దీపక్ (నాటౌట్) 5; బౌల్ట్ (రనౌట్) 1; బుమ్రా (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (11 ఓవర్లలో 9 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–10, 2–20, 3–22, 4–41, 5–46, 6–93, 7–103, 8–111, 9–116. బౌలింగ్: ఆర్చర్ 2–0–17–1; బర్గర్ 2–0–21–2; సందీప్ 3–0–26 –2; దేశ్‌పాండే 2–0–29–1; బిష్ణోయ్ 2–0–25–2. -
ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన రాజస్తాన్
ఐపీఎల్-2026 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ముంబై పరాజయం పాలైంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో జైశ్వాల్ విధ్వంసం సృష్టించాడు.జైశ్వాల్ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్, 5 సిక్సర్లతో 39), రియాన్ పరాగ్(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.అనంతరం 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(25), నమన్ ధీర్(25) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు, సందీప్ శర్మ, బర్గర్ తలా రెండు వికెట్లు సాధించారు. -
ముంబైపై రాజస్తాన్ ఘన విజయం
ముంబైపై రాజస్తాన్ ఘన విజయంగౌహతి వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్(25), నమన్ ధీర్(25) మినహా మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. రాజస్తాన్ బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు, సందీప్ శర్మ, బర్గర్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. ముంబై ఏడో వికెట్ డౌన్నమన్ ధీర్ రూపంలో ముంబై ఇండియన్స్ ఏడో వికెట్ కోల్పోయింది.ముంబై ఆరో వికెట్ డౌన్షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ రూపంలో ముంబై ఇండియన్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన రూథర్‌ఫోర్డ్.. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు ముంబై స్కోర్: 94/6కష్టాల్లో ముంబై ఇండియన్స్ముంబై ఇండియన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. రవిబిష్ణోయ్ వేసిన ఐదో ఓవర్లో మూడో బంతికిక్ పాండ్యా(9), ఆఖరి బంతికి తిలక్ వర్మ(1) ఔటయ్యాడు. 6 ఓవర్లు ముగిసే సరికి ముంబై 5 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. సందీప్ శర్మ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.ముంబై ఇండియన్స్ రెండో వికెట్ డౌన్‌ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. బర్గర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 8 పరుగులు చేసిన ర్యాన్ రికెల్టన్.. జోఫ్రా అర్చర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.ముంబై ముందు భారీ టార్గెట్ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న 11 ఓవర్ల మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్, 5 సిక్సర్లతో 39), రియాన్ పరాగ్(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.రాజస్తాన్ మూడో వికెట్ డౌన్రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. ఘజన్ఫర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 97/2.రాజస్తాన్ రెండో వికెట్ డౌన్84 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసిన ధ్రువ్ జురెల్.. ఘజన్ఫర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 7 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 97/2. జైశ్వాల్(47), రియాన్ పరాగ్(7) క్రీజులో ఉన్నారు.రాజస్తాన్ తొలి వికెట్ డౌన్80 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ.. శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.రాయల్స్ ఓపెనర్ల విధ్వంసంరాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(10 బంతుల్లో 36), వైభవ్ సూర్యవంశీ(7 బంతుల్లో20) దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది.ఒకే ఓవర్లో 22 పరుగులురాజస్తాన్ ఇన్నింగ్స్‌ను జైశ్వాల్ ఘనంగా ఆరంభించాడు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్లో జైశ్వాల్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు.మ్యాచ్ ఆరంభంఈ వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ముంబై రెండు మార్పులతో బరిలోకి దిగింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ తుది జట్టులోకి వచ్చారు. రాజస్తాన్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.తుది జట్లురాజస్థాన్ రాయల్స్ : వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఘజన్ఫర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రామరి కాసేపట్లో మ్యాచ్ ఆరంభం👉వర్షం కారణంగా రాజస్తాన్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. 9:55కు టాస్ పడనుండగా.. 10:10 నిమిషాలకు మ్యాచ్ ఆరంభం కానుంది.తగ్గిన వర్షంఅభిమానులకు గుడ్ న్యూస్. గౌహతిలో వర్షం ఎట్టకేలకు ఆగింది. దీంతో మైదానాన్ని సిద్దం చేసేందుకు గ్రౌండ్ స్టాప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.టాస్ ఆలస్యంఐపీఎల్-2026లో గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్- ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. గౌహతిలో ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. మైదానం మొత్తాన్ని గ్రౌండ్ స్టాప్ కవర్లతో కప్పి ఉంచారు. దీంతో షెడ్యూల్ ప్రకారం 7:00 గంటలకు పడాల్సిన టాస్ ఇప్పుడు ఆలస్యం కానుంది. కాగా సోమవారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కేకేఆర్-పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు అయింది. -
BCCI: ‘అమ్మిన మోడల్ ఇది కాదు.. ఏటా రూ. 2400 కోట్ల నష్టం’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపక చైర్మన్ లలిత్ మోదీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధానాలను విమర్శించాడు. బోర్డు అనుచిత నిర్ణయం కారణంగా ఏటా రూ. 2400 కోట్ల మేర ఐపీఎల్‌కు నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నాడు. కాగా 2008లో లలిత్ మోదీ ఆలోచనతో ఐపీఎల్ రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.రికార్డు స్థాయి అమ్మకాలుఅనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ టీ20 లీగ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందింది. ఇటీవలి కాలంలో ఐపీఎల్ (IPL) ప్రసార హక్కులు ఏకంగా రూ. 48,390 కోట్లకు అమ్ముడుపోయాయంటే దీనికున్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.అంతేకాదు ఇటీవల రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లను అమ్మకానికి పెట్టగా.. రికార్డు స్థాయిలో రాయల్స్ రూ. 15 వేల కోట్లు, బెంగళూరు జట్టు రూ. 16 వేల కోట్లకు పైగా అమ్ముడుపోయాయి. అయితే, బీసీసీఐ అనుసరిస్తున్న విధానం వల్ల ఐపీఎల్‌కు అదనంగా రావాల్సిన ఆదాయం రాకుండాపోతోందని లలిత్ మోదీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మోడల్‌ను మేము అమ్మలేదు‘‘ఐపీఎల్లో ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి యాభై శాతం, జట్లకు యాభై శాతం ఆదాయాన్ని పంచుతారు. అయితే, మొదట్లో ఎనిమిది జట్లు మాత్రమే ఉండేవి. ప్రతి జట్టు సొంతమైదానంతో పాటు బయటి గ్రౌండ్లో ఒకే ప్రత్యర్థితో రెండు మ్యాచ్‌లు తప్పనిసరిగా ఆడేది. కానీ ఇప్పుడు లీగ్‌లో పది జట్లు ఉన్నాయి.అయినప్పటికీ మ్యాచ్‌ల సంఖ్య 74గానే ఉంది. నిజానికి ఈ సంఖ్య 94కు చేరాల్సింది. ఇది కాంట్రాక్టు తప్పిదం. నిజానికి ఈ మోడల్‌ను మేము అమ్మలేదు. ప్రతి జట్టుకు హోం అండ్ అవే మ్యాచ్ ఆడేలా ఫార్మాట్ రూపొందించాము.రూ. 2400 కోట్ల నష్టంఒకవేళ 94 మ్యాచ్‌లు నిర్వహించేందుకు క్యాలెండర్ సహకరించకపోతే.. అప్పుడు జట్ల సంఖ్య పెంచుకుండా ఉండాల్సింది. నిజానికి 94 మ్యాచ్‌ల ఫార్మాట్ అమలైతే ఒక్కో మ్యాచ్‌కు అదనంగా రూ. 118 కోట్లు వస్తాయి.అంటే మీడియా హక్కుల ద్వారా అదనంగా మరో రూ. 2400 కోట్లు వస్తాయి. ఇందులో బీసీసీఐకి రూ. 1200 కోట్లు, జట్లకు రూ. 1200 కోట్ల వాటా దక్కుతుంది’’ అని లలిత్ మోదీ స్పోర్ట్స్‌స్టార్‌తో చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ రూపకర్తగా ప్రసిద్ది చెందిన లలిత్ మోదీ మనీ లాండరింగ్ ఆరోపణలతో.. ఆర్థిక నేరగాడిగా ముద్రపడి.. దేశం విడిచిపారిపోయాడు. చదవండి: ‘త్వరలోనే టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడు’ -
‘హ్యాట్రిక్’పై రాజస్తాన్ గురి
గువాహటి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన మాజీ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ ‘హ్యాట్రిక్’ విజయంపై గురి పెట్టింది. నేడు జరిగే పోరులో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో రియాన్ పరాగ్ బృందం తలపడనుంది. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చివరి వరకు పోరాడి గెలిచిన రాయల్స్... అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, కెపె్టన్ రియాన్ పరాగ్, హెట్‌మైర్, రవీంద్ర జడేజాతో రాయల్స్ బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్‌లో ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, జడేజా, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు. మరోవైపు సీజన్‌ను విజయంతో ఆరంభించిన ముంబై ఇండియన్స్ గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పరాజయం పాలైంది. ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మంచి టచ్‌లో ఉండగా... తిలక్ వర్మ, రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్ రాణించాల్సిన అవసరముంది. అస్వస్థతతో గత మ్యాచ్‌కు దూరమైన కెపె్టన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా చూడాలి. జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, కార్బిన్ బాష్, మయాంక్ మార్కండే బౌలింగ్ భారం మోయనున్నారు. ఐపీఎల్లో ముంబై, రాజస్తాన్ జట్ల మధ్య 31 మ్యాచ్‌లు జరిగాయి. 16 మ్యాచ్‌ల్లో ముంబై, 14 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ గెలిచాయి. ఒక మ్యాచ్ రద్దయింది. రాజస్తాన్‌పై ముంబై అత్యధిక స్కోరు 214 పరుగులుకాగా, అత్యల్ప స్కోరు 92. ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ అత్యధిక స్కోరు 212 పరుగులుకాగా, అత్యల్ప స్కోరు 90 పరుగులుగా ఉంది. -
‘ఇదే నా హెచ్చరిక.. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తార్ రాయల్స్ రెండు వరుస విజయాలతో జోష్ మీద ఉంది. రియాన్ పరాగ్ నేతృత్వంలోని జట్టులో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. తాజగా శనివారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. కాగా మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడాడు. 'ఈ విజయం అద్భుతంగా అనిపించింది. ఒక దశలో నేను రిస్క్ తీసుకుందామని భావించాను. మా ఆటగాళ్లు మేమనుకున్న ప్లాన్‌ను సక్రమంగా అమలు చేశారు. నా గొంతు కూడా మారిపోయేంతగా నేను అరిచాను. ప్లేయర్స్ నేను అనుకున్న విధంగా ఆడినందుకు సంతోషంగా అనిపించింది. 19వ, 20వ ఓవర్లు ఎవరు బౌలింగ్ చేయాలన్న విషయంలో నేను కాస్త అయోమయంలో ఉన్నా. ఆ సమయంలో 12 బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. దూకుడుగా బౌలింగ్ చేయాలనుకున్నాను. అది సక్సెస్ అయితే బాగుంటుంది, లేదంటే తర్వాత మళ్లీ ప్రయత్నిస్తాం అనుకున్నా. అయితే ధృవ్ జురెల్ వచ్చి అంతా సెట్ చేశాడు. 19వ ఓవర్‌ను ఆర్చర్‌కు ఇవ్వాలని సూచించాడు. అది సక్సెస్ అయింది. ధ్రువ్‌జురెల్ ప్రతిభకు ఇప్పటివరకు పూర్తిగా న్యాయం జరగలేదని నాకు అనిపిస్తుంది. అతను 6వ, 7వ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ కష్టమైన పాత్ర పోషించాడు. కానీ ఈసారి మూడో స్థానంలో అవకాశం ఇచ్చినప్పుడు తన సత్తా నిరూపించుకున్నాడు. జురెల్ 700-800 పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాలని ఆశిస్తున్నాను. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలవడం ఆనందంగా ఉంది. ఈ విజయంలో పూర్తి క్రెడిట్ బౌలర్లకే చెందుతుంది. ముంబైపై ఎలా ఆడాలనే దానిపై దృష్టి సారిస్తాం. ఈసారి గట్టిగా కొడతాం' అని పరాగ్ ధీమా వ్యక్తం చేశాడు.JOFRA ARCHER AND TUSHAR DESHPANDE MASTERCLASS SEALS THE MATCH FOR RR. - An aggressive celebration by captain Riyan Parag. 🥶🔥 pic.twitter.com/sqnwXamNqV— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2026చదవండి: సీఎస్కే అంటే కోహ్లీకి పూనకమే! -
మొదట్లో చితక్కొట్టినా చివర్లో వణికించాడు!
భారత్‌లో ఫాస్ట్ బౌలర్ల కన్నా మీడియం ఫాస్ట్ బౌలర్లే ఎక్కువగా ఉంటారు. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, కార్తిక్ త్యాగి వంటి ఫాస్ట్ బౌలర్లు అరుదుగా కనిపిస్తుంటారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ ద్వారా మరో ఫాస్ట్ బౌలర్ వెలుగులోకి వచ్చాడు. అతడే గుజరాత్ టైటాన్స్‌కు చెందిన అశోక్ శర్మ. శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ ఊహించని విధంగా గంటకు 154 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి నిప్పులు చెరిగాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతిని అశోక్ శర్మ 154.2 కి.మీ వేగంతో విసిరాడు. మెరుగు వేగంతో వచ్చిన బంతిని ధ్రువ్ జురేల్ భారీ షాట్ ఆడడంలో విఫలమై డిఫెన్స్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో అశోక్ శర్మ సంధించిన బంతి అత్యంత వేగవంతమైనదిగా రికార్డులకెక్కింది. అశోక్ శర్మ కంటే ముందు లక్నో సూపర్‌జెయింట్స్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే (150.9), కార్తిక్ త్యాగి (149.7), రబాడ (149.1) ఉన్నారు. అయితే తొలి స్పెల్‌లో అశోక్ శర్మను రాజస్తాన్ బ్యాటర్లు దంచికొట్టారు. 2 ఓవర్లు కలిపి 9 సగటుతో 18 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే రెండో స్పెల్‌లో మాత్రం అశోక్ శర్మ దుమ్మురేపాడు. ఒక వికెట్ తీయడంతో పాటు తన ఫాస్ట్ బౌలింగ్‌తో వణికించాడు. అంతేకాదు గుజరాత్ బౌలర్లలో అందరూ దాదాపు భారీగా పరుగులిచ్చుకోగా.. అశోక్ శర్మ మాత్రం మిగతా వాళ్లతో పోలిస్తే తక్కువ ఎకానమీ నమోదు చేయడం విశేషం. గుజరాత్ ఓడినప్పటికీ అశోక్ శర్మ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎవరీ అశోక్ శర్మ? ఎక్కడి నుంచి వచ్చాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఎవరీ అశోక్ శర్మ?రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చెందిన అశోక్ శర్మను ఐపీఎల్ 2026 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది. అశోక్ శర్మ తండ్రి హుకుమ్ చంద్ శర్మ.. రాజస్థాన్ పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. కొడుకును క్రికెటర్‌గా చూడాలనేది ఆయన కోరిక.తండ్రి ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగిన అశోక్ శర్మ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించడం అతని ప్రత్యేకత. కుడిచేతి వాటం పేసర్ అయిన అశోక్ శర్మ.. తనను తాను హార్డ్ లెంగ్త్ బౌలర్‌గా చెప్పుకుంటాడు.ముస్తాక్ అలీ ట్రోఫీతో వెలుగులోకిముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ తరఫున 19 వికెట్లతో అల్లాడించాడు. 12.10 సగటు, 8.84 ఎకానమీతో టాప్ బౌలర్‌గా నిలిచాడు. అశోక్ శర్మ తొలినాళ్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో నెట్ బౌలర్‌గా పనిచేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో ఇతనికి మంచి పట్టు ఉంది. 2022 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇతడిని రూ. 55 లక్షలకు కొనుగోలు చేయగా, 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్ళాడు. ఇక 2026 వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ. 90 లక్షలు వెచ్చించి అశోక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టిన ఈ యువ స్పీడ్‌స్టర్, ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మంచి రికార్డును కలిగి ఉన్నాడు.Ashok Sharma clocks the fastest ball of the season🚄#AshokSharma #IPL2026 #GTvsRR pic.twitter.com/wfyPT9UeC7— CREX (@Crex_live) April 4, 2026చదవండి: రవి బిష్ణోయ్ అరుదైన రికార్డు! -
రవి బిష్ణోయ్ అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. అయితే మొదట బ్యాటింగ్‌లో ధ్రువ్ జురేల్, జైస్వాల్ మెరిస్తే.. ఆ తర్వాత బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే సూపర్ బౌలింగ్‌తో రాజస్తాన్ థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. గుజరాత్ బ్యాటర్లు సాయి సుదర్శన్, గ్లెన్ పిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియాలు రవి బిష్ణోయ్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. అయితే గ్లెన్ పిలిప్స్ వికెట్ తీయడం ద్వారా రవి బిష్ణోయ్ టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అయితే భారత్ తరఫున ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (25 ఏళ్ల 211 రోజులు) బిష్ణోయ్ నిలిచాడు. 171 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు భారత్ తరఫున టీ20ల్లో 200 వికెట్లు తీసిన 19వ బౌలర్‌గా, 9వ స్పిన్ బౌలర్‌గా రవి బిష్ణోయ్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా చూసుకుంటే టీ20 క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రషీద్ ఖాన్ (23 ఏళ్ల 119 రోజులు) పేరిట రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇక ఐపీఎల్లో ప్రస్తుతం రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన రవి బిష్ణోయ్ గతలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్‌కు కూడా ఆడాడు. టీమిండియా తరఫున 44 టీ20లు ఆడిన రవి బిష్ణోయ్ 64 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. జురేల్ (75), జైస్వాల్ (55) రాణించారు. అనంతరం కడదాకా పోరాడిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులకు పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. View this post on Instagram A post shared by IPL (@iplt20)చదవండి: ‘ఆ తప్పిదం మా కొంపముంచింది’ -
‘ఆ తప్పిదం మా కొంపముంచింది’
ఐపీఎల్ 2026 సీజన్లో తొలిసారి థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరకు రాజస్తాన్ రాయల్స్‌నే విజయం వరించింది. గుజరాత్ టైటాన్స్ సీజన్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ తమ పోరాట పటిమతో అభిమానుల మనసులు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గిల్ స్థానంలో స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్ ఖాన్ మ్యాచ్ ఓటమిపై స్పందించాడు. రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘నిజానికి మేము మంచిగానే బౌలింగ్ చేశాం. తొలుత రాజస్తాన్ మరింత భారీ స్కోరు చేస్తుందని అనుకున్నాం. కానీ మా బౌలర్లు కట్టడి చేయడంతో 210 పరుగులకు కట్టడి చేశాం. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ మంచి ఆరంభమే దక్కింది. ముఖ్యంగా ఇద్దరు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. కానీ మిడిల్ ఓవర్లలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై పట్టు కోల్పోయాం. అయితే భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఒత్తిడి ఉండడం సహజం. ఇలాంటి పిచ్‌పై ఓవర్‌కు 9-10 పరుగులు చేయడం కష్టమేమీ కాదు. బౌండరీలు ఈజీగా వచ్చాయి. అయితే మిడిల్ ఓవర్లలో వరుసగా కొన్ని వికెట్లు కోల్పోవడంతో ఆఖరి వరకు దూకుడును కొనసాగించలేకపోయాం. ప్రతి ఆటగాడికి ఒక స్వంత ప్రణాళిక ఉంటుంది. పిచ్ పరిస్థితులు, జట్టు అవసరాలను అర్థం చేసుకుని ఆడటం ముఖ్యం. ఇది టోర్నీ ఆరంభం మాత్రమే, మేం చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా తిరిగి వస్తాం. ఆఖరి ఓవర్ లో మా మధ్య (రబాడతో) జరిగిన సంభాషణ ఒక్కటే... మాకు కేవలం ఒక బౌండరీ అవసరమైంది. తుషార్ దేశ్‌పాండే అద్భుతమైన యార్కర్లు వేశాడు. అయితే అతను మిస్ చేసిన ఆ ఒక్క బంతిని నేను సిక్సర్‌గా మలచాల్సింది. ఇలాంటి సమయాల్లో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ఇది సుదీర్ఘమైన టోర్నీ. మేం ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తదుపరి మ్యాచ్‌లో రాణిస్తాం. మా రెగ్యులర్ కెప్టెన్ గిల్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడు.’ అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.చదవండి: అంపైర్ తప్పిదం.. కసితీరా బాదిన ఆయుశ్! -
రాయల్స్ రైట్ రైట్
చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో రాజస్తాన్ రాయల్స్‌ను విజయం వరించింది. బంతి బంతికి ఆధిక్యం చేతులు మారుతూ ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో గుజరాత్‌కు పరాజయం తప్పలేదు. గిల్ గైర్హాజరీలో టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్ ఖాన్... బ్యాట్‌తో తుదికంటా పోరాడినా ఫలితం లేకపోయింది. అంతకుముందు జురేల్, జైస్వాల్ మెరుపులతో భారీ స్కోరు చేసిన రాయల్స్... బౌలింగ్‌లోనూ వైవిధ్యంతో ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. ఏడుగురు బౌలర్ల ప్రయోగంలో రవి బిష్ణోయ్ రఫ్ఫాడించడంతో... గుజరాత్ లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది!అహ్మదాబాద్: ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ రెండో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన ‘డబుల్ హెడర్’ రెండో పోరులో రాయల్స్ 6 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ (42 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 55; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకోగా... యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (18 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్) తనకు అలవాటైన శైలిలో రెచ్చిపోయాడు. లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 204 పరుగులకు పరిమితమైంది. సాయి సుదర్శన్ (44 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సత్తా చాటగా... ఆఖర్లో రషీద్ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు), రబాడ (16 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పోరాడినా పలితం లేకపోయింది. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా... అప్పటి వరకు ధాటిగా ఆడిన రషీద్, రబాడ భారీ షాట్లు ఆడటంలో విఫలమయ్యారు. రాయల్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు పడగొట్టాడు. జురేల్ జోరు... మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు శుభారంభం దక్కింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వైభవ్ రెండు ఫోర్లు కొట్టగా... అతడి తదుపరి ఓవర్లో జైస్వాల్ 6, 4, 4 బాదాడు. అశోక్ ఓవర్లో వైభవ్ 4, 6 కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ప్రసిద్‌కు జైస్వాల్ 6, 4తో స్వాగతం పలకడంతో పవర్‌ప్లే ముగిసే సరికి రాయల్స్ వికెట్ కోల్పోకుండా 69 పరుగులు చేసింది. రషీద్ ఖాన్ ఈ జోడీని విడదీశాడు. డీప్ మిడ్వికెట్లో ఫిలిప్స్ పట్టిన క్యాచ్‌కు వైభవ్ పెవిలియన్ బాటపట్టాడు. జైస్వాల్‌కు జురేల్ తోడవడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఈ క్రమంలో జైస్వాల్ 32 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటి వరకు నిధానంగా ఆడిన జురేల్ కూడా జోరు పెంచాడు. అర్ధ శతకం అనంతరం జైస్వాల్ అవుట్ కాగా... కెపె్టన్ రియాన్ పరాగ్ (8) విఫలమయ్యాడు. హెట్‌మైర్ (8 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొన్ని షాట్లు ఆడగా... జురేల్ జట్టు స్కోరును రెండొందలు దాటించాడు. రషీద్ ఖాన్ సారథ్యంలో... గుజరాత్ టైటాన్స్ రెగ్యులర్ కెపె్టన్ శుబ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టైటాన్స్‌కు సారథ్యం వహించాడు. కండరాలు పట్టేయడంతో గిల్ మ్యాచ్‌కు దూరమైనట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. అతడి స్థానంలో కుమార్ కుషాగ్రకు చోటు దక్కింది.అశోక్ అదుర్స్... 154.2గుజరాత్ టైటాన్స్ యువ పేసర్ అశోక్ శర్మ తన వేగంతో కట్టిపడేశాడు. నిలకడగా గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ఆకట్టుకుంటున్న అశోక్... ఈ సీజన్లోనే వేగవంతమైన బంతిని తన పేరిట లిఖించుకున్నాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతిని అతడు గంటకు 154.2 కిలోమీటర్ల వేగంతో సంధించాడు. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) రబాడ 55; వైభవ్ (సి) ఫిలిప్స్ (బి) రషీద్ 31; ధ్రువ్ జురేల్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 75; పరాగ్ (సి) కుషాగ్ర (బి) ప్రసిధ్ 8; హెట్‌మైర్ (సి) సిరాజ్ (బి) అశోక్ 18; డొనావన్ (సి) ఫిలిప్స్ (బి) రబాడ 1; జడేజా (నాటౌట్) 7; ఆర్చర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–70, 2–126, 3–135, 4–165, 5–166, 6–205. బౌలింగ్: సిరాజ్ 4–0–48–1; రబాడ 4–0–42–2; అశోక్ 4–0–37–1; ప్రసిధ్ కృష్ణ 4–0–43–1; రషీద్ ఖాన్ 4–0–39–1. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) దేశ్‌పాండే (బి) బిష్ణోయ్ 73; కుషాగ్ర (సి) హెట్‌మైర్ (బి) పరాగ్ 18; బట్లర్ (సి) సందీప్ (బి) బర్గర్ 26; ఫిలిప్స్ (సి) ఆర్చర్ (బి) బిష్ణోయ్ 3; సుందర్ (సి) జడేజా (బి) బిష్ణోయ్ 4; తెవాటియా (సి) జురేల్ (బి) బిష్ణోయ్ 12; షారుక్ ఖాన్ (రనౌట్) 11; రషీద్ (సి) ఆర్చర్ (బి) దేశ్‌పాండే 24; రబాడ (నాటౌట్) 23; అశోక్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–78, 2–107, 3–127, 4–131, 5–133, 6–155, 7–161, 8–204. బౌలింగ్: ఆర్చర్ 4–0–38–0; బర్గర్ 3–0–29–1; సందీప్ 3–0–34–0; దేశ్‌పాండే 3–0–24–1; జడేజా 2–0–25–0; పరాగ్ 1–0–11–1; బిష్ణోయ్ 4–0–41–4. -
ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై రాయల్స్ గెలుపు
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) రాత్రి (7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనను దూకుడుగా ప్రారంభించిన గుజరాత్.. మధ్యలో ఒక్కసారిగా లయ తప్పి స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రబాడ, రషీద్ ఖాన్ గుజరాత్‌కు గెలుపుపై ఆశలు కలిగించి, ఆఖర్లో చేతులెత్తేశారు. చివరి ఓవర్లో వీరు గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ.. తుషార్ దేశ్‌పాండే అద్భుతంగా బౌలింగ్ చేసి వీరిని కట్టడి చేశాడు. ఫలితంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి, లక్ష్యానికి 7 పరుగుల దూరంలో ఆగిపోయింది. రాయల్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి స్వల్ప వ్యవధిలో 4 వికెట్లతో గుజరాత్ నడ్డి విరిచాడు. ఫలితంగా గుజరాత్‌కు సొంతగడ్డపై పరాభవం తప్పలేదు.చెలరేగిన జురెల్, జైస్వాల్తొలుత బ్యాటింగ్‌లో ధృవ్ జురెల్ (75), యశస్వి జైస్వాల్ (55) అర్ద సెంచరీలతో చెలరేగడంతో రాయల్స్ భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ (31) సైతం మెరుపులు మెరిపించి ఔటయ్యాడు. మిగతా ఆటగాళ్లలో రియాన్ పరాగ్ 4, హెట్‌మైర్ 18, డొనొవన్ ఫెరియెరా ఒక పరుగు చేసి ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (7), జోఫ్రా ఆర్చర్ (1) అజేయంగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 2, సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.రాయల్స్‌ను భయపెట్టిన సాయి సుదర్శన్భారీ ఛేదనను గుజరాత్ ఓపెనర్ ధాటిగా ప్రారంభించాడు. 44 బంతుల్లో 73 పరుగులు చేసి రాయల్స్ శిబిరంలో భయాన్ని రేకెత్తించాడు. అయితే ఇతను ఔటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. బిష్ణోయ్ దెబ్బకు గుజరాత్ మిడిలార్డర్ పేకమేడలా కూలింది. బట్లర్ (26), రషీద్ ఖాన్ (24), రబాడ (23 నాటౌట్) పోరాడి చేతులెత్తేశారు. రాయల్స్ బౌలర్లలో బిష్ణోయ్ 4, బర్గర్, తుషార్ దేశ్‌పాండే, రియాన్ పరాగ్ తలో వికెట్ తీశారు. -
గుజరాత్‌పై రాయల్స్ గెలుపు
గుజరాత్‌పై రాయల్స్ గెలుపుఉత్కంఠగా సాగిన పోరులో గుజరాత్‌పై రాయల్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేయగా.. గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయిన గుజరాత్106 పరుగుల వరకు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపు దిశగా సాగిన గుజరాత్.. స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది. రవి బిష్ఱోయ్ (3-0-31-4) ఒక్కసారిగా చెలరేగి గుజరాత్‌ను దెబ్బకొట్టాడు. 15 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 161-7గా ఉంది. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్10.4వ ఓవర్- 107 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండేకు క్యాచ్ ఇచ్చి సాయి సుదర్శన్ (73) ఔటయ్యాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 8వ ఓవర్ చివరి బంతికి తొలి వికెట్ కోల్పోయింది. రియాన్ పరాగ్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి కుమార్ కుషాగ్రా (18) ఔటయ్యాడు.ధాటిగా ఆడుతున్న సాయి సుదర్శన్భారీ లక్ష్య ఛేదనను గుజరాత్ కూడా ధాటిగానే ప్రారంభించింది. 7.1 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47) చెలరేగి ఆడుతున్నాడు. అతనికి కుమార్ కుషాగ్రా (18) అండగా ఉన్నాడు. రాయల్స్ భారీ స్కోర్‌టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది.జురెల్ (75), జైస్వాల్ (55) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (31) పర్వాలేదనిపించాడు. నాలుగో వికెట్ కోల్పోయిన రాయల్స్15.3వ ఓవర్- 165 పరుగుల వద్ద రాయల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. అశోక్ శర్మ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి హెట్‌మైర్ (18) ఔటయ్యాడు. జైస్వాల్ (55) ఔట్12.3వ ఓవర్-126 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జురెల్‌కు (31) జతగా రియాన్ పరాగ్ క్రీజ్‌లోకి వచ్చాడు. వైభవ్ సూర్యవంశీ (31) ఔట్6.2వ ఓవర్- 70 పరుగుల వద్ద రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్‌కు క్యాచ్ ఇచ్చి వైభవ్ సూర్యవంశీ ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న జైస్వాల్, సూర్యవంశీటాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్స్ ధాటిగా ఆడుతుంది. పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) ఆ జట్టు 69 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (35), వైభవ్ సూర్యవంశీ (31) చెలరేగి ఆడుతున్నారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్స్ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు వేదిక అయిన నరేంద్ర మోదీ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలించనుండటమే రియాన్ నిర్ణయానికి కారణం. ఈ మ్యాచ్‌కు గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా అతను ఈ మ్యాచ్ ఆడటం లేదు. గిల్ స్థానంలో రషీద్ ఖాన్ టాస్కు వచ్చాడు. ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేసింది. బ్రిజేష్ శర్మ స్థానంలో తుషార్ దేశ్‌పాండే.. రవి బిష్ణోయ్ స్థానంలో శుభమ్ దూబే జట్టులోకి వచ్చారు. గుజరాత్ విషయానికొస్తే.. గిల్ స్థానంలో కుమార్ కుషాగ్రా తన తొలి మ్యాచ్ ఆడనున్నాడు. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగుతుంది. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్: కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, జోస్ బట్లర్(w), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్(c), కగిసో రబడ, అశోక్ శర్మ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణఇంపాక్ట్ సబ్స్: షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, మానవ్ సుతార్, అనుజ్ రావత్, జయంత్ యాదవ్రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మఇంపాక్ట్ సబ్స్: రవి బిష్ణోయ్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సుశాంత్ మిశ్రా, బ్రిజేష్ శర్మ, రవి సింగ్ -
‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’
గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్.. రాజస్తాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే దశాబ్దంలో వైభవ్ ప్రపంచ క్రికెట్‌ను శాసించే అవకాశముందని జోస్యం చెప్పాడు. 15 ఏళ్ల సూర్యవంశీ ఆటతీరుకు తాను ముగ్దుడినయ్యానని బట్లర్ పేర్కొన్నాడు. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బట్లర్ సూర్యవంశీతో సరదాగా సంభాషించిన వీడియోను రాజస్తాన్ యాజమాన్యం షేక్ చేసుకుంది. వీడియోలో బట్లర్ మాట్లాడుతూ.. ‘నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో వైభవ్ ఒకడు. వైభవ్‌కు 21 లేదా 25 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచం అతని పాదాల చెంత ఉంటుంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో మీరు మా ఇంగ్లండ్ జట్టు హృదయాన్ని ముక్కలు చేశారు. హరారే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నువ్వు ఆడిన 175 పరుగుల ప్రపంచ రికార్డు ఇన్నింగ్స్ ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆరోజు నువ్వు చాలా బాగా ఆడావు. నీ ఆట చాలా బాగుంది. ఇదే స్వేచ్ఛతో కష్టపడి ఆడే తత్వాన్ని కొనసాగించు. భవిష్యత్తులో నువ్వు గొప్ప క్రికెటర్ అవుతావు. అందులో ఎలాంటి సందేహం లేదు.’ వైభవ్‌ను పొగడ్తల్లో ముంచడంతో పాటు విలువైన సూచనలు కూడా ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు బట్లర్ పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు 122 మ్యాచ్‌లు ఆడిన బట్లర్, దాదాపు 40 సగటుతో, 149 స్ట్రైక్ రేట్‌తో 4,158 పరుగులు చేశాడు. బట్లర్ ఫామ్‌పై విమర్శలు వస్తున్న వేళ ఒక్క ఇన్నింగ్స్‌తో వాటికి సమాధానం చెబుతాడేమో చూడాలి.Two generations of the Royals 💗🥹 pic.twitter.com/d8y76RbGaT— Rajasthan Royals (@rajasthanroyals) April 3, 2026చదవండి: పంజాబ్ సిక్సర్ల మోత వెనుక రహస్యమిదే! -
ఐపీఎల్లో నేడు ‘డబుల్’ ధమాకా
న్యూఢిల్లీ: ఐపీఎల్ సీజన్లో తొలి ‘డబుల్ హెడర్’కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో జరిగే పోరులో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుండగా... అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఎదుర్కొంటుంది. తమ తొలి మ్యాచ్‌ల్లో నెగ్గి ముంబై, ఢిల్లీ జోరు మీదుండగా ... సొంత మైదానంలో లీగ్‌లో బోణీ చేయాలని గుజరాత్ పట్టుదలగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అదృష్టవశాత్తూ ఓటమి నుంచి తప్పించుకుంది. 142 పరుగుల ఛేదనలో 26/4తో కష్టాల్లో ఉన్న సమయంలో రిజ్వీ, స్టబ్స్ పట్టుదలగా ఆడి గెలిపించారు. ఈ నేపథ్యంలో టాపార్డర్ నుంచి జట్టు మంచి ప్రదర్శనను ఆశిస్తోంది. మరోవైపు కోల్‌కతాపై 221 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించిన ముంబై అదే దూకుడును కొనసాగించాలని భావిస్తోంది. రికెల్టన్, రోహిత్, సూర్య, తిలక్, పాండ్యాలతో టాప్–5 బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గుజరాత్ బోణీ చేసేనా! తొలి మ్యాచ్‌లో చెన్నైని చిత్తు చేసిన ఉత్సాహంతో రాజస్తాన్ రెండో పోరుకు సై అంటోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్ని అడ్డుకోవడమే గుజరాత్‌కు కీలకం కానుంది. సొంత మైదానంలో విజయంతో ఖాతా తెరవాలని ఆశిస్తున్న టైటాన్స్ తుది జట్టులో ఎలాంటి మార్పూ చేయకపోవచ్చు. గత పోరులో ఫలితం ప్రతికూలంగా వచి్చనా...టాప్–4 బ్యాటర్లు గిల్, సుదర్శన్, బట్లర్, ఫిలిప్స్‌పైనే జట్టు ఆధారపడి ఉంది. -
టీమిండియాలోకి వచ్చేస్తాడు.. భయంగా ఉంది: పాక్ మాజీ క్రికెటర్
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు ఐపీఎల్.. అటు భారత అండర్-19 జట్టు తరఫున ఈ చిచ్చరపిడుగు విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీకేవలం 35 బంతుల్లోనే శతక్కట్టిన వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అప్పటికి వైభవ్ వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే. ఇక భారత్ అండర్-19 వరల్డ్‌కప్ గెలవడంలోనూ వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులతో దుమ్ములేపాడు.ఇదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) శుభారంభం అందుకున్నాడు. ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన ఈ రాజస్తాన్ స్టార్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లుఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఐపీఎల్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ను ఈ టూర్‌కు పంపాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.టీమిండియాలోకి వచ్చేస్తాడుఇప్పుడు ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, బసిత్ అలీ కూడా చేరారు. గేమ్ ప్లాన్ షోలో అక్మల్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి కేవలం 8 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ పిల్లాడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. త్వరలోనే అతడు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జాతీయ జట్టు ఆడే సిరీస్‌ల సందర్భంగా అతడు టీమ్‌లోకి రావొచ్చు. అదే జరిగితే అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే తప్పకుండా అతడు టీమిండియాలోకి వచ్చేస్తాడు’’ అని అంచనా వేశాడు.నాకు భయం వేస్తోందిమరోవైపు బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఆట పట్ల అతడికి పూర్తి అవగాహన ఉంది. చిన్న వయసులోనే ఎంతో పరిణతి సాధించాడు. చెన్నైతో మ్యాచ్‌లో రాజస్తాన్ 128 పరుగులు చేధించాల్సి రావడం పెద్ద విషయం కాదు. అయితే, 15 బంతుల్లోనే వైభవ్ 50 పరుగులు చేయడం చర్చనీయాంశం.అతడి తండ్రి ఎంతగానో గర్వపడుతూ ఉంటాడు. కోచ్‌లు, క్రికెట్ క్లబ్ స్నేహితులు సంతోషిస్తూ ఉంటారు. ఇప్పుడే ఇలా ఉంటే.. అతడు పాతికేళ్ల వయసులోకి వస్తే బౌలర్ల పరిస్థితి ఏమిటోనన్న విషయం తలచుకుంటేనే నాకు భయం వేస్తోంది. ఈ పిల్లాడు అందరిపైనా ఆధిపత్యం చెలాయించగలడు’’ అంటూ వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తాడు.చదవండి: IPL 2026: పాపం అర్జున్ టెండూల్కర్.. జట్టు మారినా? -
IPL 2026: రాయల్స్ హీరోకు షాకిచ్చిన క్రికెట్ సౌతాఫ్రికా
రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ నండ్రే బర్గర్‌కు అతని సొంత దేశ క్రికెట్ బోర్డు (CSA) షాకిచ్చింది. తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల (2026–27 ) జాబితా నుంచి అతని పేరును తప్పించింది. బర్గర్తో పాటు మరికొంత మంది స్టార్ ఆటగాళ్లు కూడా ఈ జాబితా నుంచి తప్పించబడ్డారు. గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్ విలియమ్స్, డేవిడ్ మిల్లర్, రాసీ వాన్ డర్ డస్సెన్ లాంటి స్టార్లు కాంట్రాక్టులు కోల్పోయారు.కాంట్రాక్ట్‌ల విషయంలో క్రికెట్ సౌతాఫ్రికా ముందు నుంచి ఓ విషయం చెప్పుకుంటూ వచ్చింది. ఆటగాళ్లు ఎన్ని ప్రైవేట్ లీగ్‌ల్లో పాల్గొన్నా, జాతీయ జట్టు తరఫున వీలైనన్ని మ్యాచ్‌లు ఆడాలని కండీషన్ పెట్టింది. అయినా, చాలామంది ఆటగాళ్లు ప్రైవేట్ లీగ్‌లకే అధిక ప్రాధాన్యమిచ్చి జాతీయ విధులను నిర్లక్ష్యం చేశాడు. దీని ఫలితమే తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల జాబితాలో స్టార్ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం.తాజాగా కాంట్రాక్ట్ కోల్పోయిన ఆటగాళ్లు ప్రైవేట్ లీగ్‌ల్లో ఆడటం వల్ల గాయాలపాలై జాతీయ జట్టు తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయారు. అందుకే వీరిని కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించినట్లు క్రికెట్ సౌతాఫ్రికా వివరణ ఇచ్చింది. సౌతాఫ్రికా జట్టు గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 53 మ్యాచ్‌లు (7 టెస్టులు, 12 వన్డేలు, 34 టీ20లు) ఆడగా.. కొయెట్జీ 8 (టీ20లు), బర్గర్ 15 (9 వన్డేలు, 6 టీ20లు), విలియమ్స్ 6 (ఒక వన్డే, 5 టీ20లు) మ్యాచ్‌లు మాత్రమే ఆడారు.మిలర్ (36), డస్సెన్ (37) వయసు పైబడుతున్న కారణంగా కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. అయితే ఆశ్చర్యకరంగా మరో వెటరన్ సైమన్ హార్మర్‌కు (37) కాంట్రాక్ట్ దక్కింది. ఈసారి కొత్తగా కాంట్రాక్ట్‌లు పొందిన ఆటగాళ్ల జాబితాలో ఓట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్ తదితరులు ఉన్నారు.వార్షిక కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితా..టెంబా బవుమా, డేవిడ్ బెడింగ్హామ్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రీవిస్, టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రిన్, సైమన్ హార్మర్రాయల్స్ హీరోగా మారిన బర్గర్ ఐపీఎల్ 2026లో భాగంగా తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌తో నండ్రే బర్గర్ చెలరేగిపోయాడు. కీలకమైన సంజూ శాంసన్ వికెట్ సహా పొదుపుగా బౌలింగ్ చేసి, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో బర్గర్ రాయల్స్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. అతను సంజూ వికెట్ తీసిన తీరు రాయల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. -
రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో 17 ఏళ్ల తర్వాత తన సొంత గూటికి చేరాడు. తనను వెలుగులోకి తీసుకొచ్చిన రాజస్తాన్ రాయల్స్ జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా సోమవారం సీఎస్కేతో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే జడేజా అదుర్స్ అనిపించాడు. ఇన్నాళ్లు తాను ఆడిన జట్లే తనకు ప్రత్యర్థిగా మారిన వేళ బంతితో మెరిశాడు. మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసిన జడేజా 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ మ్యాచ్ గెలవడంలో తన వంతు పాత్రను సమర్థంగా పోషించాడు. ‘నాకు పింక్ జెర్సీ బాగుంటుందనిపిస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్కే జట్టుతో ఎన్నో ఏళ్ల అనుబంధముంది. ఆ జట్టులో ఏ ఆటగాడు ఎలా ఆడుతాడనే దానిపై స్పష్టత ఉంది. ముఖ్యంగా సీఎస్కే ఆల్రౌండర్శి శివమ్ దూబేకు నెట్స్‌లో చాలాసార్లు బౌలింగ్ చేశాను. కాబట్టి అతడు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటా డనేది నాకు తెలుసు. అందుకే సీఎస్కేకు బౌలింగ్ చేయడంలో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఆఫ్ స్టంప్ ఆవల బంతులు వేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. అలా అయితే దూబే భారీ షాట్లు ఆడతాడని నాకు తెలుసు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉందన్న మాట నిజమే,. పిచ్ కాస్త పచ్చికగా ఉండడం, బంతి టర్న్ అవుతుండడంతో బౌలింగ్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. మొత్తంగా 17 ఏళ్ల తర్వాత నన్ను తొలిసారి వెలుగులోకి తీసుకొచ్చిన జట్టుతో (రాజస్తాన్ రాయల్స్) కలవడం సంతోషంగా అనిపిస్తోంది. 128 పరుగుల టార్గెట్ తక్కువే కదా అని నిర్లక్ష్యం చేసి ఉంటే మొదటికే మోసం వచ్చేది. కానీ మా బ్యాటర్లు జైస్వాల్, సూర్యవంశీలు దూకుడైన బ్యాటింగ్‌తో పని సులువు చేశారు. లోస్కోరింగ్, హై స్కోరింగ్ ఏదైనా సరే మనం వంద శాతం కష్టపడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి.’ అని చెప్పుకొచ్చాడు. అయితే జడేజా కామెంట్స్‌పై అభిమానులు ఫన్నీ కామెంట్లు పెట్టారు. ‘జడేజా ఒక ఊసరవెల్లి.. జెర్సీ మారిందో లేదో వెంటనే మాట మార్చాడు’ అని పేర్కొన్నారు.ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన రవీంద్ర జడేజా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ సీజన్లో రాజస్తాన్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలవడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాతి సీజన్లోనూ ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు. 2010లో ఐపీఎల్‌కు దూరంగా ఉన్న జడేజాను 2011 సీజన్‌కు కొచ్చి టస్కర్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆ జట్టుపై నిషేధం పడడంతో జడేజా కోసం 2012 వేలంలో ఎస్ఆర్హెచ్, చెన్నై పోటీ పడ్డాయి. చివరికి చెన్నై సూపర్‌కింగ్స్ అప్పట్లోనే రూ. 9.8 కోట్లకు జడేజాను దక్కించుకుంది. మధ్యలో చెన్నైపై రెండేళ్ల నిషేదం పడడంతో గుజరాత్ లయన్స్‌కు ఆడిన జడేజా ఆ తర్వాత 2025 సీజన్ వరకు మళ్లీ చెన్నై జట్టుతోనే కొనసాగాడు. తాజాగా 2026 సీజన్‌కు ముందు ట్రేడింగ్‌లో శాంసన్‌ను దక్కించుకున్న సీఎస్కే జడేజాను రాజస్తాన్‌కు బదలాయింపు చేసింది. ధోని కెప్టెన్సీలో 2018, 2021, 2023లో టైటిల్ గెలిచిన సీఎస్కే జట్టులో జడేజా సభ్యుడిగా ఉన్నాడు.జడ్డూ ఎమెషనల్2012 నుంచి 2025 వరకు సీఎస్కే జట్టులో కొనసాగిన రవీంద్ర జడేజా సోమవారం మ్యాచ్‌లో భాగంగా సీఎస్కే ఇన్నింగ్స్ సమయంలో ఎమెషనల్ అయినట్లు తెలుస్తోంది. 9వ ఓవర్లో బౌండరీ లైన్ వద్ద నిలబడిన జడేజాను చూస్తూ అభిమానులు సీఎస్కే.. సీఎస్కే అంటూ అరవడం కనిపించింది. ఇదే సమయంలో కెమెరాలు జడేజా వైపు తిప్పగా, జడ్డూ ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నట్లుగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు జడేజా సీఎస్కే వదిలి వెళ్లినప్పటికీ తమ మనసులో మాత్రం ఎప్పటికీ ఉంటాడు* అని కామెంట్లు పెట్టారు. ఓవరాల్‌గా జడేజా ఐపీఎల్లో 255 మ్యాచ్‌లాడి 3,260 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 172 వికెట్లు పడగొట్టాడు.Jadeja was seen emotional when crowd starts to chant CSK...CSK pic.twitter.com/oPRvmU2wAm— rocket.jadeja (@sherjedeja) March 30, 2026చదవండి: ‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’ -
‘మ్యాచ్ ఓటమి బాధ కలిగించలేదు’
ఐపీఎల్ 19వ సీజన్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) ఓటమితో ప్రారంభించింది. పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో రాజస్తాన్ రాయల్స్ చేతిలో సీఎస్కే 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. అయితే రాజస్తాన్‌తో మ్యాచ్ ఓటమి మాకు గుణపాఠం లాంటిదని, తప్పులతో సీజన్‌ను ప్రారంభించినప్పుడే రాబోయే మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలన్న దానిపై స్పష్టత వస్తుందని సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రుతురాజ్ మీడియాతో మాట్లాడాడు. ‘మ్యాచ్ ఓటమి పెద్దగా నిరాశ కలిగించలేదు. అయితే మా ఇన్నింగ్స్ ఆరంభంలో రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, నండ్రీ బర్గర్లను ఎదుర్కొన్నప్పుడు పరిస్థితులు కఠినంగా ఉన్నాయనిపించింది. నిజానికి రాజస్తాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశారు. ఆరంభంలో పేసర్లు, మధ్యలో స్పిన్నర్లకు పిచ్ సహకరించినట్లు అనిపించింది. కానీ మేము బ్యాటింగ్ మరింత మెరుగ్గా చేసినట్లయితే 150 నుంచి 160 స్కోరు చేసేవాళ్లం. వికెట్ కఠినంగా ఉన్నప్పుడు పరుగులు రావడం కష్టమైపోతుంది. అందుకే ఫలితంపై పెద్దగా నిరాశ చెందడం లేదు. ఈ మ్యాచ్ గురించి ఇక్కడే మరిచిపోయి ముందుకు సాగుతాము. మరో మూడు రోజుల్లో ఇంకో మ్యాచ్ ఉందని, దీంతో జట్టులో అందరూ సానుకూల దృక్పథంతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మా జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. మ్యాచ్‌లో చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటాం. మాది బలమైన బ్యాటింగ్ లైనప్. భారీ స్కోర్లు చేయగల సత్తా మాకు ఉంది.’ అని చెప్పుకొచ్చాడు. అయితే సీఎస్కే భారీ అంచనాలు పెట్టుకున్న సంజూ శాంసన్, శివమ్ దూబే పూర్తిగా విఫలం కావడం, గాయాలతో ధోని, డెవాల్డ్ బ్రెవిస్ దూరం కావడం కూడా సీఎస్కేను ఒత్తిడిలోకి నెట్టేసింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. జేమీ ఓవర్టన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.చదవండి: ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురికి చెక్! -
‘దొరికితే అంతే సంగతి.. అందుకే తప్పించుకున్నా’
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ శుభారంభం చేసింది. సోమవారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లోస్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ రాజస్తాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర ఆటతీరుతో అభిమానుల్లో జోష్ నింపాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సూర్యవంశీ సీఎస్కేతో మ్యాచ్ ముగిసిన అనంతరం దూకుడైన బ్యాటింగ్ వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ..‘ నా బర్త్ డే సెలబ్రేషన్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే కేక్ కటింగ్ నుంచి తప్పించుకోవడానికి త్వరగా నిద్రపోయాను. ఇక సీఎస్కేతో మ్యాచ్ విషయానికొస్తే పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను. అయితే మొదట్లో బ్యాటింగ్ కాస్త కష్టమనిపించింది. కానీ బంతి పాతబడేకొద్దీ నా పని సులువయింది. డిఫెన్స్ గురించి ఆలోచిస్తాను కానీ సీఎస్కే విధించిన లక్ష్యం చిన్నది కావడంతో పవర్ ప్లేలో వీలైనంత స్కోర్ చేయాలని భావించాం. ఒకవేళ స్కోర్ ఎక్కువగా ఉండి ప్రత్యర్థి బౌలర్లు మమ్మల్ని కట్టడి చేసి ఉంటే పరిస్థితి ప్రమాదకరంగా మారి ఉండేది. కానీ నేను ఎక్కడా ఆ అవకాశం తీసుకోలేదు. మా కోచ్‌లు కూడా ప్రతి బౌలర్పైనా అటాకింగ్ గేమ్ ఆడమని చెప్పారు. నేను వాళ్ల మాటలను తూచా తప్పకుండా పాటించాను. ఇక ప్రతీ బంతి తర్వాత జైస్వాల్‌తో మాట్లాడుతూనే వచ్చాను. అతను ఎక్కువగా సింగిల్స్ తీసి నాకు స్ట్రైకింగ్ ఇచ్చి ప్రోత్సహించడంతో స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడగలిగాను’ అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది.చదవండి: ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురికి చెక్! -
ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురికి చెక్!
ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ తన ఆట మొదలుపెట్టేశాడు. అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫామ్‌ను కంటిన్యూ చేసిన సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున తన తొలి మ్యాచ్‌లోనే ఫాస్టెస్ట్ అర్థసెంచరీ సాధించాడు. తద్వారా ఒక్క ఇన్నింగ్స్‌తో నలుగురి రికార్డులకు చెక్ పెట్టాడు ఈ బీహార్ చిన్నోడు. మ్యాచ్‌లో 15 బంతుల్లోనే అర్థసెంచరీ సాధించిన సూర్యవంశీ 17 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో గత ఐపీఎల్ సీజన్లలో 16 బంతుల్లో అర్థసెంచరీలు సాధించిన సురేశ్ రైనా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ల రికార్డులు కనుమరుగయ్యాయి. చెన్నై విధించిన టార్గెట్ చిన్నది కావడంతో చప్పగా సాగుతున్నమ్యాచ్ను సూర్యవంశీ తన ఇన్నింగ్స్‌తో అభిమానుల్లో జోష్ నింపాడు. అంతేకాదు ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున తక్కువ బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించిన జాబితాలో రెండు సూర్యవంశీ పేరిటే ఉండడం విశేషం. 2025లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 17 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ అందుకున్న వైభవ్.. తాజాగా సీఎస్కేపై 15 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకొని తన రికార్డును తానే సవరించుకున్నాడు. కాగా 2023లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే అర్థశతకం సాధించిన జైస్వాల్ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. 2018లో జాస్ బట్లర్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 18 బంతుల్లో అర్థశతకం సాధించాడు. అంతేకాదు లోస్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ మరికొన్ని రికార్డులు కూడా మ్యాచ్‌లో నమోదయ్యాయి. First ball of IPL 2025: SIX 😮💨Second ball of IPL 2026: SIX 😮💨pic.twitter.com/oJjCeUhf5p— Rajasthan Royals (@rajasthanroyals) March 30, 2026మ్యాచ్‌లో నమోదైన రికార్డులు..ఐపీఎల్లో సీఎస్కేపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్లలో రాజస్తాన్ రెండో స్థానానికి చేరుకుంది. పంజాబ్ కింగ్స్‌తో కలిసి సంయుక్తంగా ఉన్న రాజస్తాన్ సీఎస్కేపై తాజా దానితో కలిపి 16 విజయాలు నమోదు చేసింది. తొలి స్థానంలో ముంబై (21 విజయాలు) ఉంది. 13 విజయాలతో ఆర్సీబీ మూడో స్థానంలో, 12 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో స్థానంలో, 11 విజయాలతో కేకేఆర్ ఐదో స్థానంలో ఉన్నాయి.2020 నుంచి చూసుకుంటే సీఎస్కేతో ఆడిన 11 మ్యాచ్‌ల్లో రాజస్తాన్ రాయల్స్ 9 విజయాలు సాధించి స్పష్టమైన ఆధిక్యంలో నిలవడం విశేషం.ఐపీఎల్లో 120 ప్లస్ స్కోర్లను అత్యంత తక్కువ ఓవర్లలో ఛేదించిన నాలుగో జట్టుగా రాజస్తాన్ నిలిచింది. గతంలో ఎస్ఆర్హెచ్ (9.4 ఓవర్లలో), పంజాబ్ కింగ్స్ (11.1 ఓవర్లలో), డెక్కన్ చార్జర్స్ (12 ఓవర్లలో) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.చదవండి: రాయల్స్ రాజసం -
రాయల్స్ రాజసం
ఐపీఎల్లో గత ఏడాది రాజస్తాన్, చెన్నై జట్లు చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. తాజా సీజన్లో పలు మార్పులతో కొత్తగా మొదలు పెట్టేందుకు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. ఈ పోరులో చివరకు రాజస్తాన్‌దే పైచేయి అయింది. బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో చెన్నైని స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన రాయల్స్ ఆ తర్వాత మరో 47 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాది మరో సీజన్‌ను ఘనంగా మొదలు పెట్టడం విశేషం. గువాహటి: ఐపీఎల్లో రెండు భారీ స్కోర్ల మ్యాచ్‌ల తర్వాత మూడో మ్యాచ్‌లో బౌలర్ల ప్రభావం కనిపించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. పవర్‌ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయిన టీమ్ ఒకదశలో 82/8 వద్ద నిలిచింది. అయితే జేమీ ఒవర్టన్ (36 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్స్) జట్టు స్కోరును 100 దాటించాడు. అనంతరం రాజస్తాన్ 12.1 ఓవర్లలో 2 వికెట్లకు 128 పరుగులు చేసి గెలిచింది. వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో రాయల్స్ గెలుపు లాంఛనంగా మారిపోయింది. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రెండు కీలక వికెట్లు తీసిన బర్గర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. వరల్డ్ కప్ స్టార్లు విఫలం... భారత్‌కు టి20 ప్రపంచ కప్ అందించిన జోష్‌లో ఉన్న సంజు సామ్సన్‌కు ఐపీఎల్ కొత్త జట్టుతో సరైన ఆరంభం లభించలేదు. 11 సీజన్ల పాటు రాజస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన సామ్సన్ ఇప్పుడు తొలిసారి చెన్నై తరఫున తన పాత జట్టుపై ప్రత్యరి్థగా బరిలోకి దిగాడు. అయితే బర్గర్ అద్భుత బంతికి సామ్సన్ (6) బౌల్డ్ కాగా, మరో వరల్డ్ కప్ విజేత శివమ్ దూబే (6) ఆట ఒక సిక్స్‌కే ముగిసింది. ఈ ఏడాది భారత్‌కు కెప్టెన్‌గా అండర్–19 వరల్డ్ కప్ అందించిన ఆయుశ్ మాత్రే (0) తొలి బంతికే అవుటయ్యాడు. గత రెండు సీజన్లు ఐపీఎల్లో ఆడే అవకాశం రాని సర్ఫరాజ్ ఖాన్ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇప్పుడు బరిలోకి దిగినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కార్తీక్ శర్మ అరంగేట్రం... ఐపీఎల్ వేలంలో రూ.14.20 కోట్లకు అమ్ముడుపోయి అందరి దృష్టినీ ఆకర్షించిన 20 ఏళ్ల కార్తీక్ శర్మకు చెన్నై తొలి మ్యాచ్‌లో అవకాశం కలి్పంచింది. అయితే కార్తీక్ (15 బంతుల్లో 18; 1 సిక్స్) కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. చెన్నై టీమ్‌లోనే ఉన్న మరో రూ.14.20 కోట్ల ప్లేయర్ ప్రశాంత్ వీర్‌కు మ్యాచ్ చాన్స్ లభించలేదు. మరోవైపు బెంగాల్ ప్రొ టి20 లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన పేసర్ బ్రిజేశ్ శర్మతో రాజస్తాన్ ఐపీఎల్లో అరంగేట్రం చేయించింది. ఏ స్థాయిలోనైనా ప్రొఫెషనల్ క్రికెట్లో అతనికి ఇదే తొలి మ్యాచ్. 277 మ్యాచ్‌ల అనంతరం... చెన్నై జట్టుకు కర్త, కర్మ, క్రియవంటి ధోని మాత్రమే కాకుండా సురేశ్ రైనాకు కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. ధోని, రైనాలు రామలక్ష్మణుల్లా సుదీర్ఘ కాలం ఆ జట్టును నడిపించారు. అయితే ధోని, రైనాలలో ఏ ఒక్కరు కూడా తుది జట్టులో లేకుండా 277 మ్యాచ్‌ల తర్వాత చెన్నై టీమ్ బరిలోకి దిగడం (చాంపియన్స్ లీగ్‌తో కలిపి) విశేషం. వైభవ్ సూపర్... తనపై ఉన్న అంచనాలను అందుకుంటూ వైభవ్ సూర్యవంశీ మళ్లీ చెలరేగిపోయాడు. ‘సున్నా’ వద్ద కార్తీక్ కష్టసాధ్యమైన క్యాచ్‌ను వదిలేయడంతో బతికిపోయిన అతను ఆ తర్వాత దూసుకుపోయాడు. కంబోజ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన వైభవ్... నూర్ బౌలింగ్‌లో వరుసగా 2 సిక్స్‌లతో అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 6158 రోజుల తర్వాత... భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 17 ఏళ్ల తర్వాత తన మొదటి ఐపీఎల్ జట్టు రాజస్తాన్ తరఫున మ్యాచ్ ఆడాడు. 2008లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి 20 మే, 2009న చివరిసారిగా ఆ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహించాడు. 6158 రోజుల తర్వాత అతను మళ్లీ రాజస్తాన్‌కు ఆడటం విశేషం. ఈ మధ్య కాలంలో అతను కొచ్చి తరఫున ఒక సీజన్, గుజరాత్ లయన్స్ తరఫున రెండు సీజన్లు, చెన్నై తరఫున 12 సీజన్ల పాటు ఆడాడు.స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) బర్గర్ 6; రుతురాజ్ (బి) ఆర్చర్ 6; మాత్రే (సి) జురేల్ (బి) బర్గర్ 0; షార్ట్ (సి) జైస్వాల్ (బి) సందీప్ 2; సర్ఫరాజ్ (ఎల్బీ) (బి) జడేజా 17; కార్తీక్ (ఎల్బీ) (బి) బ్రిజేశ్ 18; దూబే (సి) బిష్ణోయ్ (బి) జడేజా 6; ఒవర్టన్ (రనౌట్) 43; నూర్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 1; హెన్రీ (సి అండ్ బి) బిష్ణోయ్ 5; కంబోజ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 127. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–38, 5–51, 6–57, 7–74, 8–82, 9–94, 10–127. బౌలింగ్: ఆర్చర్ 4–0–19–2, బర్గర్ 4–0–26–2, బ్రిజేశ్ 3–0–17–1, సందీప్ 2.4–0–22–1, రవి బిష్ణోయ్ 3–0–16–1, జడేజా 3–0–18–2. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 38; వైభవ్ (సి) సర్ఫరాజ్ (బి) కంబోజ్ 52; జురేల్ (బి) కంబోజ్ 18; పరాగ్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (12.1 ఓవర్లలో 2 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–75, 2–99. బౌలింగ్: హెన్రీ 3–0–40–0, ఖలీల్ 3–0–17–0, కంబోజ్ 3–0–27–2, నూర్ 2–0–24–0, ఒవర్టన్ 1–0–14–0, షార్ట్ 0.1–0–1–0.ఐపీఎల్లో ఇప్పటి వరకు 254 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కేవలం 12 సార్లు మాత్రమే ఆలౌటైంది. ముంబై ఇండియన్స్ అత్యధికంగా 5 సార్లు చెన్నైను (2012, 2013, 2015, 2019, 2022లో) ఆలౌట్ చేయగా... రాజస్తాన్ రాయల్స్ (2008, 2026లో), పంజాబ్ కింగ్స్ (2022, 2025లో) రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ (2009లో), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2009లో), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2025లో) ఒక్కోసారి చెన్నైను ఆలౌట్ చేశాయి.ఆరు ఐపీఎల్ సీజన్ల తర్వాత (2020లో 74; 2021లో 119; 2022లో 55; 2023లో 55; 2024లో 82 నాటౌట్; 2025లో 66) సంజూ సామ్సన్ తన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో రెండంకెల స్కోరు చేయకుండా సింగిల్ డిజిట్‌కే అవుటయ్యాడు. -
వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. సీఎస్కేను చిత్తు చేసిన రాయల్స్
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే, రాయల్స్ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఆర్చర్, బర్గర్, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసి సీఎస్కే ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్ (43), కార్తీక్ శర్మ (18, సర్ఫరాజ్ ఖాన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో ఓవర్టన్ పోరాడటంతో సీఎస్కే ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్ కేవలం 12.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. వైభవ్ సూర్యవంశీ (17 బంతుల్లో 52; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర అర్ద సెంచరీతో ఆదిలోనే రాయల్స్ గెలుపును ఖరారు చేశాడు. యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ రియాన్ పరాగ్ (11 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. మధ్యలో జురెల్ (9 బంతుల్లో 18; 4 ఫోర్లు) సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. -
రాయల్స్ బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన సీఎస్కే
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ (మార్చి 30) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చెలరేగిపోయారు. వీరి ధాటికి సీఎస్కే బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కుప్పకూలింది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రాయల్స్ సీఎస్కేను 19.4 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ చేసింది.తొలి బంతి నుంచే రాయల్స్ బౌలర్లను ఎదుర్కొనేందుకు సీఎస్కే బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. ఆరంభ ఓవర్లలో నండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగారు. రెండో ఓవర్ చివరి బంతికి తొలిసారి సీఎస్కే తరఫున ఆడుతున్న సంజూ శాంసన్‌ను (6) బర్గర్.. మూడో ఓవర్ చివరి బంతికి సీఎస్కే సారధి రుతురాజ్ గైక్వాడ్‌ను (6) ఆర్చర్ అద్భుతమైన బంతులతో క్లీన్ బౌల్డ్ చేశారు. ఆమరుసటి బంతికే (3.1 ఓవర్) యువ ఆటగాడు ఆయుశ్ మాత్రేను బర్గర్ మరో అద్భుతమైన బంతితో డకౌట్ చేశాడు.ఆతర్వాత మాథ్యూ షార్ట్‌ను (2) సందీప్ శర్మ.. సర్ఫరాజ్ ఖాన్ (17), శివమ్ దూబేను (6) రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపారు. కొద్ది సేపటికే కార్తీక్ శర్మను (18) బ్రిజేశ్ శర్మ.. నూర్ అహ్మద్‌ను (1) జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశారు. మరి కొద్ది సేపటికి మ్యాట్ హెన్రీని (5) రవి బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపగా.. ఓవర్టన్ (43) ఔట్ కావడంతో సీఎస్కే ఇన్నింగ్స్‌కు ఎండ్ కార్డ్ పడింది.చివర్లో ఓవర్టన్ అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించడంతో సీఎస్కే 100 పరుగుల మార్కును దాటగలిగింది. అతనికి అన్షుల్ కంబోజ్ (7 నాటౌట్) సహకరించాడు. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్తో పాటు కార్తీక్ శర్మ (18, సర్ఫరాజ్ ఖాన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే తలో 6, మాథ్యూ షార్ట్ 2, నూర్ అహ్మద్ 1, మ్యాట్ హెన్రీ 5, ఆయుశ్ మాత్రే డకౌటయ్యారు. -
సీఎస్కేపై రాయల్స్ ఘన విజయం
సీఎస్కేపై రాయల్స్ ఘన విజయంఐపీఎల్ 2026లో భాగంగా సీఎస్కేతో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే, రాయల్స్ బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలగా.. రాయల్స్ 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్.. జురెల్ ఔట్8.3వ ఓవర్- 99 పరుగుల వద్ద రాయల్స్ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో ధృవ్ జురెల్ (18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వైభవ్ ఔట్17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ ఔటయ్యాడు. అన్షుల్ కంబోజ్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.127 పరుగులకు సీఎస్కే ఆలౌట్సీఎస్కే ఇన్నింగ్స్ 127 పరుగుల వద్ద ముగిసింది. ఓవర్టన్ (43) అనూహ్యమైన పోరాటాన్ని ప్రదర్శించడంతో సీఎస్కే 100 పరుగుల మార్కును దాటగలిగింది. ఓవర్టన్కు (7 నాటౌట్) అన్షుల్ కంబోజ్ సహకరించాడు. రాయల్స్ బౌలర్లలో ఆర్చర్, బర్గర్, రవీంద్ర జడేజా తలో 2.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. సీఎస్కే ఇన్నింగ్స్‌లో ఓవర్టన్తో పాటు కార్తీక్ శర్మ (18, సర్ఫరాజ్ ఖాన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో వికెట్ డౌన్12.5వ ఓవర్- 82 పరుగుల వద్ద సీఎస్కే ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి నూర్ అహ్మద్ (1) ఔటయ్యాడు.ఏడో వికెట్ కోల్పోయిన సీఎస్కేబ్రిజేశ్ శర్మ బౌలింగ్‌లో కార్తిక్ శర్మ (18) ఎల్బీడబ్ల్యూ. బ్రిజేశ్ ఖాతాలో తొలి ఐపీఎల్ వికెట్. స్కోరు: 74-7(11). ఓవర్టన్ తొమ్మిది పరుగులతో ఉండగా.. నూర్ అహ్మద్ క్రీజులోకి వచ్చాడు.ఆరో వికెట్ డౌన్జడేజా బౌలింగ్‌లో శివం దూబే రవి బిష్ణోయికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు చేసి నిష్క్రమించాడు. స్కోరు: 57-6 (8). కార్తిక్ శర్మ 14 పరుగులతో ఉండగా.. జేమీ ఓవర్టన్ క్రీజులోకి వచ్చాడు.సగం వికెట్లు కోల్పోయిన సీఎస్కేరవీంద్ర జడేజా బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. 12 బంతుల్లో 17 పరుగులతో ఆడుతున్న సర్ఫరాజ్‌ను జడ్డూ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. శివం దూబే క్రీజులోకి రాగా.. కార్తిక్ శర్మ 11 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 57-5(7.5).కుప్పకూలిన సీఎస్కే టాపార్డర్రాజస్థాన్ పేసర్ల ధాటికి సీఎస్కే టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. బర్గర్.. సంజూ శాంసన్ (6), మాత్రే (0)ను ఔట్ చేయగా.. ఆర్చర్ రుతురాజ్‌ను (6), సందీప్ శర్మ షార్ట్‌ను (2) పెవిలియన్‌కు పంపారు. 6 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 41-4గా ఉంది. కార్తీక్ శర్మ (3), సర్ఫరాజ్ ఖాన్ (15) క్రీజ్‌లో ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో సీఎస్కేటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న సీఎస్కే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 19 పరుగులకే 3 వికెట్లు (3.1 ఓవర్లలో) కోల్పోయింది. ఆర్చర్, బర్గర్ వరుస బంతుల్లో రుతురాజ్ (6), ఆయుశ్ మాత్రేను (0) ఔట్ చేశారు. సంజూ క్లీన్ బౌల్డ్1.6వ ఓవర్- నండ్రే బర్గర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మార్చి 30) రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్కు ముందు వర్షం పడటంతో 5 నిమిషాలు ఆలస్యమైంది. మ్యాచ్ సమయంలో కూడా వరుణుడి ఆటంకాలు తప్పకపోవచ్చు. ప్రస్తుతానికి వాతావరణం క్లియర్‌గా ఉంది.తుది జట్లు..సీఎస్కే: సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(సి), ఆయుష్ మ్హత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ(w), జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్ఇంపాక్ట్ ప్లేయర్స్ ఆప్షన్స్: సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, రాహుల్ చాహర్, గుర్జప్నీత్ సింగ్, రామకృష్ణ ఘోష్రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మఇంపాక్ట్ ప్లేయర్స్ ఆప్షన్స్: డొనొవన్ ఫెరియెరా, లుహాన్ డ్రి ప్రిటోరియస్, సుషాంత్ మిశ్రా, రవి సింగ్ -
IPL 2026: రాజస్థాన్-సీఎస్కే మ్యాచ్ జరిగేనా..? గౌహతిలో వర్షం
ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాల్టి (మార్చి 30) మ్యాచ్ జరగాల్సి ఉంది. గౌహతిలోని బర్సపరా వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 🚨 ITS RAINING AT GUWAHATI 🚨 pic.twitter.com/kMxhiDENqx— Johns. (@CricCrazyJohns) March 30, 2026ఎందుకంటే, మ్యాచ్ ప్రారంభానికి ముందు గౌహతిలో వర్షం మొదలైంది. పిచ్‌ను, కొంత భాగం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరలవడంతో, నేటి మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. వాతావరణ సమాచారం ప్రకారం, మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం 20 శాతంగా ఉంది. ఇప్పటికే వర్షం మొదలైన నేపథ్యంలో టాస్ కూడా ఆలస్యమవ్వవచ్చు. కాగా, రాజస్థాన్ రాయల్స్ తమ మూడు హోం మ్యాచ్‌లను గౌహతిలో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ రద్దైతే ఇరు జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. కానీ, పరిస్థితి అంత వరకు వెళ్లకపోవచ్చని అంచనా. మ్యాచ్ సమయానికి వాతావరణం కుదురుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. హీన పక్షంలో కొన్ని ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని అనుకుంటున్నారు. మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాకూడదని ఇరు ఫ్రాంచైజీల అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. -
IPL: ఈ ఐదు రికార్డులను ఎవరూ బ్రేక్ చేయలేరు!?
గత ఏడాది కాలంగా రికార్డుల మోత మోగిస్తున్నాడు భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు ఈ బిహారీ పిల్లాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి అత్యంత పిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. ముఖ్యంగా వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 80 బంతుల్లోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 175 పరుగులు సాధించడం విశేషం. తద్వారా భారత్ మరోసారి ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్-2026లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇక క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటి వరకు ఓ ఐదు ప్రధాన రికార్డులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. మరి వైభవ్ సూర్యవంశీ వాటిని ఈసారి బ్రేక్ చేయగలడా?అత్యధిక వ్యక్తిగత స్కోరుఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా క్రిస్ గేల్ కొనసాగుతున్నాడు. ఈ వెస్టిండీస్ దిగ్గజం ఆర్సీబీ తరఫున పుణె వారియర్స్‌తో మ్యాచ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు.ఐపీఎల్ 2013 ఎడిషన్‌లో కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక ఇటీవలే వైభవ్ సూర్యవంశీ ఈసారి తన టార్గెట్ గేల్ రికార్డు బద్దలు కొట్టడమే అని తెలిపిన సంగతి తెలిసిందే. మరి ఈ సీజన్లోనే ఈ కుర్రాడు గేల్‌ను అధిగమిస్తాడో? లేదో? చూడాలి.ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డుయూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ విధ్వంసకర ఆట తీరుకు పెట్టింది పేరు. ఆర్సీబీ తరఫున పుణెపై 2013 నాటి మ్యాచ్‌లో అతడు ఏకంగా 17 సిక్సర్లు బాదాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.ఇక వైభవ్ సూర్యవంశీ ఇటీవల అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో, యూత్ టీ20 మ్యాచ్‌లో ఏకంగా 15 సిక్సర్లు బాదాడు. గేల్ రికార్డును వైభవ్ ఈసారి బ్రేక్ చేసే అవకాశాలు లేకపోలేదు.ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లుఐపీఎల్లో ఒక ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగానూ క్రిస్ గేల్ నిలిచాడు. 2012 సీజన్లో ఈ విండీస్ లెజెండ్ 59 సిక్సర్లు బాదాడు. ఇక 2019లో ఆండ్రీ రసెల్ 52 సిక్స్‌లు బాదాడు. ఈ రికార్డులను వైభవ్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. గతేడాది ఐపీఎల్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్ 24 సిక్సర్లు బాదాడు.సీజన్లో అత్యధిక స్ట్రైక్రేటుఐపీఎల్ 2024 సీజన్లో ఆస్ట్రేలియా స్టార్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెగర్క్ తొమ్మిది మ్యాచ్‌లలో కలిపి 141 బంతులు ఎదుర్కొని 234.34 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. తద్వారా ఓ సీజన్లో అత్యధిక స్ట్రైక్‌రేటు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతేడాది వైభవ్ 122 బంతులు ఎదుర్కొని 206కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు.ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లుఫస్ట్ క్లాస్, లిస్ట్-ఎ, టీ20 మ్యాచ్‌లలో ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారు. అయితే, ఐపీఎల్లో మాత్రం ఇంత వరకు ఏ ఆటగాడికీ ఈ ఘనత సాధ్యం కాలేదు. క్రిస్‌గేల్, రాహుల్ శర్మ, రాహుల్ తెవాటియా, రవీంద్ర జడేజా, రింకూ సింగ్, రియాన్ పరాగ్ ఇప్పటి వరకు ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదగలిగారు.చదవండి: జడ్డూ, సందీప్ శర్మను కాదని అతడికే పగ్గాలు.. ఎందుకంటే?: సంగక్కర -
జడ్డూ, సందీప్ శర్మను కాదని అతడికే పగ్గాలు.. ఎందుకంటే?
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ ఎంపిక పట్ల విమర్శలు కొనసాగుతున్నాయి. టీమిండియా స్టార్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ పేర్లు కెప్టెన్సీ రేసులో బలంగా వినిపించినా యాజమాన్యం మాత్రం ఆఖరికి పరాగ్‌కే పగ్గాలు అప్పగించింది. ఈ అసోం ఆల్‌రౌండర్ గతేడాది తాత్కాలిక కెప్టెన్‌గా నిరాశపరిచినా అతడిపై మేనేజ్మెంట్ మరోసారి నమ్మకం ఉంచింది.ఇక ఐపీఎల్-2026లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్ సోమవారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రాజస్తాన్ హెడ్‌కోచ్, క్రికెట్ డైరెక్టర్ కుమార్ సంగక్కర రియాన్ పరాగ్ (Riyan Parag)ను కెప్టెన్ చేయడానికి గల కారణాలు వెల్లడించాడు.కఠినమైన పరీక్షలు‘‘రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్సీ రేసులో సందీప్ శర్మ (Sandeep Sharma), రవీంద్ర జడేజాతో కలిపి ఐదుగురు పోటీదారులు ఉన్నారు. వీరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు మేము ఎంతగానో శ్రమించాము. కఠినమైన పరీక్షలు పెట్టాము.వీరితో జరిగిన సంభాషణల్లో భాగంగా ప్రతి ఒక్కరు కెప్టెన్ క్యాండిడేట్ అని నిరూపించుకున్నారు. అయితే, అందరిలోకెల్లా రియాన్ అగ్రస్థానంలో నిలిచాడు. కఠినమైన ప్రశ్నలకు అతడు జవాబు ఇచ్చిన తీరు అమోఘం. అతడు ఎంతగానో పరిణతి చెందాడు.అత్యంత పరిణతి చెందిన ఆటగాడిగాకెప్టెన్సీ, నాయకత్వం మధ్య సన్నని గీత ఉంటుంది. ఈ రెండూ అంత తేలికైన విషయాలేమీ కాదు. ఇతరులతో పోల్చి చూసినపుడు అతడు అత్యంత పరిణతి చెందిన ఆటగాడిగా కనిపించాడు. ఏదేమైనా ఏ కెప్టెన్, నాయకుడు పరిపూర్ణంగా ఉండరు.ఆటలో గెలుపు- ఓటములు సహజం. నేను కూడా పొరపాట్ల నుంచి నేర్చుకుని ఎదిగిన వాడినే. రియాన్ పరాగ్‌కు క్లిష్ట సమయాల్లో సాయం చేసేందుకు జట్టులో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు.వారి మద్దతు ఉంటుందికష్ట సమయంలో రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, సందీప్ శర్మ, షిమ్రన్ హెట్మెయిర్, జోఫ్రా ఆర్చర్, దసున్ షనక.. తదితరులపై అతడు ఆధారపడగలడు’’ అని సంగక్కర చెప్పుకొచ్చాడు. కాగా సుదీర్ఘకాలంగా తమ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్ చేసిన రాజస్తాన్.. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులో చేర్చుకుంది.చదవండి: అతడొక అద్భుతమైన ఫీల్డర్.. ఎందుకిలా చేశారు?: మాజీ కెప్టెన్ ఫైర్ -
కింగ్స్ X రాయల్స్
గువాహటి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. సీజన్ ఆరంభానికి ముందే ప్లేయర్ల బదిలీతో వార్తల్లో నిలిచిన మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ సోమవారం గువాహటి వేదికగా తలపడనున్నాయి. గతేడాది ఇరు జట్లు పేలవ ఆటతీరు కనబర్చాయి. చెన్నై పట్టికలో అట్టడుగున నిలవగా... రాయల్స్ తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. దశాబ్ద కాలానికి పైగా రాయల్స్‌కు కీలక ఆటగాడిగా ఉన్న సంజూ సామ్సన్ ఈసారి చెన్నై ఓపెనర్‌గా దర్శనమివ్వనుండగా... చెన్నై స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన పాత జట్టు రాజస్తాన్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల టి20 ప్రపంచకప్‌లో దంచికొట్టిన సామ్సన్ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. గాయం కారణంగా ధోనీ రెండు వారాల పాటు అందుబాటులో లేకపోవడంతో... వికెట్ల వెనుక పెద్దన్న పాత్ర పోషించాల్సిన బాధ్యత కూడా సామ్సన్‌పై ఉంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి సంజూ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా... శివమ్ దూబే, ఆయుశ్ మాత్రే, కార్తీక్ శర్మతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉంది. హిట్టర్ బ్రెవిస్ గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. వేలంలో రూ. 14.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న 20 ఏళ్ల స్పిన్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బౌలింగ్‌లో ఖలీల్, నూర్ అహ్మద్, అకీల్ హుసేన్, హెన్రీ కీలకం కానున్నారు. మరోవైపు రాజస్తాన్ జట్టుకు రియాన్ పరాగ్ సారథ్యం వహించనున్నాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, హెట్‌మైర్, ధ్రువ్ జురెల్ రూపంలో జట్టు నిండా హిట్టర్లు ఉన్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో జడేజా అనుభవం అక్కరకు రానుంది. ఆర్చర్ ప్రధాన పేసర్ కాగా... జడ్డూతో కలిసి రవి బిష్ణోయ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. మ్యాచ్‌కు వర్ష సూచన ఉంది. -
సంచలనాల సూర్యవంశీ!
అతడు కూడా అందరిలా సాధారణంగా క్రికెట్ ఆడుకుంటూ పోతే పెద్దగా గుర్తింపు వచ్చేది కాదేమో. కానీ 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి ఆడకముందే రికార్డు సృష్టించాడు. ఇక బ్యాట్ పట్టి కదనరంగంలోకి దూకిన తర్వాత బ్యాట్‌కు అలుపొచ్చిందేమో కానీ అతడి పరుగుల దాహం కొనసాగుతూనే వస్తోంది.14 ఏళ్లకే ఐపీఎల్లో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన ఆ బుడతడు ఇటీవలే ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లోనూ తన ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 55 బంతుల్లోనే 175 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే పవర్‌హిట్టింగ్‌తో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు బీహార్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ.ఇవాళ వైభవ్ సూర్యవంశీ 15వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సచిన్ లాగే 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాలని తహతహలాడుతున్న వైభవ్ సూర్యవంశీ కోరిక నెరవేరాలని ఆశిద్దాం. హ్యాపీ బర్త్‌డే టూ వైభవ్ సూర్యవంశీ..క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ మార్చి 27తో మరో మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు వైభవ్ తన 15వ పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. గతేడాది 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బీహార్ కుర్రాడు, ఇప్పుడు 15వ ఏట అడుగుపెడుతూ మరింత జోరు చూపించడానికి సిద్ధమయ్యాడు.15వ పుట్టినరోజు సందర్భంగా వైభవ్ సూర్యవంశీ తన లక్ష్యాలను పంచుకున్నాడు. ఈసారి రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించడమే తన ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ పేరిట ఉన్న 175 పరుగుల రికార్డును బద్దలు కొట్టాలనేది తన చిరకాల కోరిక అని వైభవ్ పేర్కొన్నాడు. త్వరలో జాతీయ జట్టులోకి..ఇప్పటికే అండర్-19 జూనియర్ స్థాయి క్రికెట్లో టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనే 175 పరుగుల ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ ఆడి బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు సీనియర్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు కనీసం 15 ఏళ్లు ఉండాలన్నది నిబంధన. తాజాగా వైభవ్ సూర్యవంశీ 15వ ఏట అడుగుపెట్టడంతో సీనియర్ జట్టు లోకి తొందర్లోనే పిలుపు వచ్చే అవకాశముంది. అండర్-19 క్రికెట్లో ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ 18 మ్యాచ్‌లు ఆడి 701 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక అర్థసెంచరీ ఉన్నాయి.హోంగ్రౌండ్లో వేడుకలు..ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తన మొదటి మ్యాచ్‌ను మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్‌కు ఇది రెండో హోమ్ గ్రౌండ్ కావడంతో జట్టు సభ్యులందరూ ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వైభవ్ సూర్యవంశీ కూడా టీమ్‌తోనే ఉన్నాడు. దీంతో తన 15వ పుట్టినరోజు వేడుకలు తన జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ సొంత ఊరైన గౌహతిలోనే జరగనున్నాయి. వరుసగా రెండో ఏడాది వైభవ్ తన పుట్టినరోజును ఐపీఎల్ ఫ్రాంచైజీతో జరుపుకోవడం విశేషం.ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జరిగిన వేలంలోకి వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఇవ్వడంతోనే రికార్డు లిఖించాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అతడిని రూ. 1.1 కోట్లకు దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున 7 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, ఏకంగా 252 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువగా ఉండటం విశేషం.ద్రవిడ్ పర్యవేక్షణలో..రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రస్తుతం వైభవ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. టీమ్ మెంటార్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో వైభవ్ తన ఆటను మెరుగుపరుచుకుంటున్నాడు. రియాన్ పరాగ్ వంటి యువ కెప్టెన్ తోడుండటంతో వైభవ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. బర్త్‌డే వేడుకల అనంతరం వైభవ్ తిరిగి నెట్స్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. రైతు కొడుకు నుంచి క్రికెటర్ దాకా..2011 మార్చి 27న బీహార్‌లోని తాజ్పూర్ అనే ఓ మారుమూల గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. నాలుగేళ్ల వయసులోనే క్రికెట్‌పై వైభవ్ పెంచుకున్న మక్కువ అతని తండ్రి సంజీవ్‌కి అర్థమైంది. వెంటనే తన ఇంటి వెనుక భాగంలో వైభవ్ కోసం ఒక చిన్న ఆట స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనే స్వయంగా రోజంతా కష్టపడి ఆ స్థలం అంతా చదును చేసి కొడుకు కోసం చిన్న ప్లే గ్రౌండ్ తయారు చేసి ఇచ్చాడు. అలా ఇంటి వెనుక వైభవ్ ఆడుకునే వాడు. అతనికి తొమ్మిది సంవత్సరాలు నిండగానే క్రికెట్ కోచింగ్ కోసం తమ ఊరికి దగ్గర్లోని సమస్తిపూర్ పట్టణంలోని క్రికెట్ అకాడమీలో వైభవ్‌ను చేర్పాడు వాళ్ల నాన్న. తొమ్మిదేళ్ల కొడుకు క్రికెటర్‌గా ఎదుగుతాడనే నమ్మకంతో.. సంజీవ్ చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. వైభవ్ క్రికెట్ కోచింగ్ కోసం తన పొలం అమ్మాలని నిర్ణయించుకున్నాడు.కొడుకు కోసం పొలం అమ్మి..ఆ పొలంపై తన కుటుంబం ఆధారపడి జీవిస్తుందనే విషయాన్ని కూడా పక్కనపెట్టి.. కొడుకు ఎదుగుదలనే నమ్మాడు. తన కొడుకు క్రికెట్ కలలను సాకారం చేసుకోవడానికి మోతీపూర్‌లోని తన పొలాన్ని అమ్మేశాడు. తండ్రి పొలం అమ్మిన విషయం తెలిసి వైభవ్ క్రికెట్‌ను ప్రాణం పెట్టి నేర్చుకున్నాడు. సమస్తిపూర్‌లో రెండున్నర సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం అండర్-16 ట్రయల్స్ ఇచ్చాడు వైభవ్. అదే సమయంలో మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా ఆధ్వర్యంలో వైభవ్‌కు మంచి క్వాలిటీ కోచింగ్ కూడా అందింది. ఆయన కోచింగ్ వైభవ్‌కు ఎంతో ప్లస్ అయింది. ఆ తర్వాతి చరిత్ర అందరికీ తెలిసిందే.A boy with a dream who picked up a bat and has made it his mission to achieve it all 🔥Today is your day, Vaibhav Sooryavanshi 💗🎂 pic.twitter.com/oEJWupOgXp— Rajasthan Royals (@rajasthanroyals) March 26, 2026Wishing a very happy birthday to our very own Boss Baby, Vaibhav Suryavanshi. He consistently delivers explosive performances and lights up the field with his dynamic play. All the very best for IPL 2026 Vaibhav.#Vaibhavsooryavanshi #happybirthdayVaibhavSooryavanshi pic.twitter.com/8yyl49eZTq— 𝐈𝐂𝐓 ᴬᵁᴿᴬ🇮🇳 (@AURAICTT) March 26, 2026చదవండి: భారత ఫుట్‌బాల్ జట్టుకు అవమానం! -
రూ. 15 వేల కోట్లు.. షేన్ వార్న్ వాటా ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి ముందే రెండు ఫ్రాంఛైజీల అమ్మకం జరిగిపోయింది. ఆరంభ సీజన్ 2008 విజేత రాజస్తాన్ రాయల్స్ అనూహ్య రీతిలో 1.63 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15, 341 కోట్లు)కు అమ్ముడుపోగా.. డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ సుమారు రూ. 16,753 కోట్ల ధర పలికినట్లు సమాచారం.రాజస్తాన్ రాయల్స్ జట్టులలో వంద శాతం వాటాను అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కాల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం కొనుగోలు చేసింది. ఇందులో రాబ్ వాల్టన్, హ్యాంప్ కుటుంబం వాటాదారులు.షేన్ వార్న్ కుటుంబానికి భారీ లాభంఇక ఈ భారీ ఒప్పందం కారణంగా ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్ కుటుంబం కూడా భారీగా లాభపడినట్లు సమాచారం. రాజస్తాన్ రాయల్స్ తొలి కెప్టెన్‌గా.. అరంగేట్ర సీజన్లోనే జట్టును విజేతగా నిలిపిన ఘనత వార్న్‌కు ఉంది. కేవలం బంతితో మాయాజాలం చేయడమే కాకుండా.. పెట్టుబడుల విషయంలోనూ షేన్ వార్న్ ముందు చూపు వల్లే ఇప్పుడు అతడి ఫ్యామిలీకి వందల కోట్ల ప్రయోజనం చేకూరినట్లు తెలుస్తోంది.ఆ ఒప్పందం ప్రకారంఐపీఎల్ ఆరంభ సీజన్లో రాజస్తాన్ జట్టుతో చేరిన సమయంలోనే వార్న్ ఓ కండిషన్ పెట్టినట్లు గతంలో వెల్లడించాడు. ‘‘మా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. వాళ్లు నన్ను కెప్టెన్‌గా, కోచ్‌గా సేవలు అందించమన్నారు. నాకు నచ్చినట్లుగా జట్టును నడిపించమన్నారు. అంతా నన్నే చూసుకోమన్నారు’’ అని వార్న్ గతంలో ది హెరాల్డ్ సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.ఇక ఆ ఒప్పందం ప్రకారం జట్టుతో కొనసాగిన కాలంలో ఏడాదికి 0.75 శాతం వాటా వార్న్‌కు దక్కినట్లు తెలుస్తోంది. వార్న్ రాజస్తాన్‌తో నాలుగేళ్లు కొనసాగినందున మొత్తంగా అతడి వాటా మూడు శాతానికి చేరినట్లు సమాచారం. రూ. 450- రూ. 460 కోట్ల మేర వాటాఈ క్రమంలో తాజా ఒప్పందం ప్రకారం.. వార్న్ కుటుంబానికి రూ. 450- రూ. 460 కోట్ల మేర వాటా లభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 తర్వాత వార్న్ కుటుంబం తమ వాటా అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశం ఉంది.నాడు రూ. 320 కోట్లు మాత్రమేఅయితే, ఇందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమోదం తప్పనిసరి. కాగా 2008లోఎమర్జింగ్ మీడియా యజమాని మనోజ్ బదాలే 65%, రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్ 15%, లక్లాన్ మర్డోక్ 13%, ఇతరులు 7% వాటాలతో రాజస్తాన్ రాయల్స్‌ను సొంతం చేసుకున్నారు. నాడు ఆ జట్టు విలువ రూ. 320 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కాగా తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత కొత్త యాజమాన్యానికి రాయల్స్ హక్కులు లభిస్తాయి. కాగా 2022లో షేన్ వార్న్ హఠాన్మరణం చెందిన విషయం విదితమే. అయితే, పద్దెమినిదేళ్ల క్రితం ఈ స్పిన్ లెజెండ్ పెట్టిన పెట్టుబడి అతడి కుటుంబానికి ఈ మేర లాభం చేకూర్చడం విశేషం.చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే? -
‘ఈ దెబ్బతో మరో స్థాయికి ఐపీఎల్’
ఐపీఎల్లో ఫ్రాంచైజీలుగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రికార్డు ధరకు అమ్ముడుపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2008లో ఆరంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌లుగా పేరు పొందిన ఎన్బీఏ, ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ స్థాయికి సమానంగా నిలిచిందని వ్యాఖ్యానించాడు.ఇది ఐపీఎల్‌కు దక్కిన అరుదైన గౌరవమని చెప్పుకొచ్చాడు. గంగూలీ మాట్లాడుతూ.. ‘ఇది ఐపీఎల్‌కు నిజంగా శుభవార్త. 2008లో తొలిసారి నేను ఐపీఎల్ మ్యాచ్ ఆడేటప్పుడే రానున్న కాలంలో ఈ లీగ్ అత్యంత ఖరీదైనగా మారుతుందని చెప్పాను. ఇప్పుడు నా మాటలు అక్షరాల నిజమయ్యాయి. 18 సీజన్లు ముగించుకొని 19వ సీజన్‌కు విజయవంతంగా అడుగుపెట్టిన ఐపీఎల్ ఈ స్థాయికి చేరుకోవడం గొప్ప విషయం. నా దృష్టిలో ఐపీఎల్ కూడా ఎన్బీఏతో సమానం. ఐపీఎల్ ప్రసార హక్కులు ఇప్పుడు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) కూడా దాటేశాయి. సంవత్సరానికి కేవలం రెండున్నర నుంచి మూడు నెలలు మాత్రమే ఆడే ఒక స్పోర్ట్స్ ఫ్రాంచైజీని ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి.’ అని గంగూలీ పేర్కొన్నాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పెరిగిందో సూచించే అసాధారణ యాజమాన్య మార్పు చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన కాల్ సోమాని కన్సార్టియమ్ దీనిని సొంతం చేసుకుంది. 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.15,341 కోట్లు) రాయల్స్ టీమ్‌లో 100 శాతం వాటాను దక్కించుకుంది. మరోవైపు లీగ్ ఆరంభం నుంచి ఆర్సీబీని నడిపిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) సంస్థ నుంచి రూ. 16,706 కోట్ల ధరకు ఆదిత్యా బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్డ్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు దక్కించుకున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యాలు తాజా ఒప్పందంలో భాగంగా తమ 100 శాతం వాటాను అమ్ముకోగా... రెండు వేర్వేరు కన్సార్టియంలు వీటిని సొంతం చేసుకున్నాయి. 2026 సీజన్ తర్వాత ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తాయి. చదవండి: పోల్‌వాల్ట్‌లో జాతీయ రికార్డు -
రాయల్ ‘బిర్లా’ బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్థాయి ప్రపంచవ్యాప్తంగా ఎంతగా పెరిగిందో సూచించే అసాధారణ యాజమాన్య మార్పు చోటు చేసుకుంది. లీగ్ విలువను చూపిస్తూ రెండు ఐపీఎల్ జట్లు కలిపి ఏకంగా సుమారు రూ.32 వేల కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. క్రికెట్‌తో పరిచయం లేని అమెరికా వ్యాపార సంస్థలు, ఇన్వెస్టర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా లీగ్‌తో జత కట్టేందుకు భారీ మొత్తాలతో ముందుకు వచ్చారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యాలు తాజా ఒప్పందంలో భాగంగా తమ 100 శాతం వాటాను అమ్ముకోగా... రెండు వేర్వేరు కన్సార్టియంలు వీటిని సొంతం చేసుకున్నాయి. 2026 సీజన్ తర్వాత ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తాయి. న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆరంభమైన 2008 నుంచి లీగ్‌లో ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం తమ జట్టును అమ్మకానికి ఉంచగా... అమెరికాకు చెందిన కాల్ సోమాని కన్సార్టియమ్ దీనిని సొంతం చేసుకుంది. 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.15,341 కోట్లు) రాయల్స్ టీమ్‌లో 100 శాతం వాటాను దక్కించుకుంది. ఈ కన్సార్టియంలో ఆరిజోనాకు చెందిన వ్యాపారవేత్త కాల్ సోమానితో పాటు రాబ్ వాల్టన్, హ్యాంప్ ఫ్యామిలీ వాటాదారులుగా ఉన్నారు. టెక్నాలజీ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్, డేటా ప్రైవసీ, ఏఐ గవర్నెన్స్, ఎడ్యుటెక్ సర్వీసెస్ రంగాల్లో ఇన్ట్రా ఎడ్జ్, ట్రూయో.ఏఐ, అకడమియన్ వంటి సంస్థలకు అధిపతిగా సోమాని ఉన్నారు. రాబ్ వాల్టన్ ప్రఖ్యాత వాల్‌మార్ట్ కంపెనీ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా, ఫోర్డ్ మోటార్ కంపెనీకి హ్యాంప్ ఫ్యామిలీ యజమానిగా ఉంది. సోమాని రాజస్తాన్ జట్టులో 2021 నుంచి చిన్న వాటాదారుడిగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో దానిని సొంతం చేసుకోవడం విశేషం. ఈ ఒప్పందానికి బీసీసీఐ అధికారికంగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఐపీఎల్–2026 ముగిసిన తర్వాత కొత్త యాజమాన్యానికి జట్టుపై హక్కులు లభిస్తాయి. అసాధారణ పెరుగుదల... నిజానికి ఐపీఎల్లో ఆట, అభిమానులపరంగా చూస్తే రాజస్తాన్ రాయల్స్ జట్టుకే చివరి స్థానం దక్కుతుంది. 2008లో తొలిసారి టోర్నీ గెలవడం మినహా ఆ తర్వాత ఎప్పుడూ చెప్పుకోదగ్గ మెరుపులు లేవు. ఎలాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే టీమ్ సాగుతూ వచ్చింది. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా 2016, 2017 సీజన్లలో టీమ్‌పై నిషేధం కూడా పడింది. 2008లో 67 మిలియన్ డాలర్లకు ఈ జట్టు అమ్ముడుపోయింది. నాటి రూపాయి విలువ ప్రకారం జట్టు విలువ రూ. 320 కోట్లు మాత్రమే! ఇతర ఏడు జట్లతో పోలిస్తే రాజస్తాన్ అన్నింటికంటే తక్కువ ధరకు అమ్ముడుపోయింది. రాజస్తాన్ రాయల్స్ యాజమాన్య హక్కులు (ఇప్పటి వరకు) మనోజ్ బదాలే (ఎమర్జింగ్ మీడియా) 65%, రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్ 15%, లక్లాన్ మర్డోక్ 13%, ఇతరులు 7% ఎవరు కొన్నారు? కాల్ సోమాని: అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, ఇన్ట్రా ఎడ్జ్ కంపెనీ సీఈఓ రాబ్ వాల్టన్: వాల్‌మార్ట్ కుటుంబ వారసుడు, అమెరికాలోని నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్)లో డెన్వర్ బ్రోంకోస్ జట్టు యజమాని. హ్యాంప్ ఫ్యామిలీ: ఫోర్డ్ కంపెనీ మరియు ఫైర్‌స్టోన్ కుటుంబానికి చెందిన షీలా ఫోర్డ్... హ్యాంప్ ఫ్యామిలీ కోడలిగా మొత్తం వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఎన్ఎఫ్ఎల్లో డెట్రాయిట్ లయన్స్ జట్టుకు యజమాని. ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమ్మకం కూడా పూర్తయినట్లు సమాచారం. 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,753 కోట్లు) ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం జట్టును సొంతం చేసుకుంది. ఐపీఎల్ టీమ్‌తో పాటు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లోని ఆర్సీబీ జట్టు కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. ఆర్సీబీని కొన్న కన్సార్టియంలో నలుగురు భాగస్వాములుగా ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్స్ (బీఎక్స్‌పీఈ) కలిసి భారీ మొత్తానికి బెంగళూరు జట్టును తమదిగా మార్చుకున్నాయి. 2008 తొలి ఐపీఎల్ సమయంలో విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ గ్రూప్ 111.6 మిలియన్ డాలర్లకు (నాటి విలువ ప్రకారం సుమారు రూ.485 కోట్లు) సొంతం చేసుకుంది. బోల్ట్ వెంచర్స్ తరఫున ప్రముఖ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్స్, బీఎక్స్‌పీఈ తరఫున విరాల్ పటేల్ టీమ్ యాజమాన్యంలో భాగస్వాములు కానుండగా... ఆర్యమాన్ బిర్లా చైర్మన్‌గా, టైమ్స్ గ్రూప్ నుంచి సత్యన్ గాజ్వాని వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. -
RR సంచలనం.. రూ. 15 వేల కోట్లకు సొంతం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సరికొత్త సంచలనం.. ఆరంభ సీజన్-2008 విజేత రాజస్తాన్ రాయల్స్ (RR) రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. రాజస్తాన్ ఫ్రాంఛైజీని అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.రూ. 15 వేల కోట్లకు సొంతం!జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దాదాపు 1.63 బిలియన్ అమెరికన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ. 15 వేల కోట్లు) మొత్తానికి ఈ కన్సార్టియం రాయల్స్‌ను కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా వ్యాపారవేత్తలు.. వాల్‌మార్ట్ కుటుంబానికి చెందిన రాబ్ వాల్టన్, హ్యాంప్ కుటుంబం సోమానితో కలిసి ఈ డీల్‌లో భాగమైనట్లు తెలుస్తోంది.ఐపీఎల్-2026 ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజస్తాన్ రాయల్స్ యాజమాన్య మార్పు జరుగనున్నట్లు సమాచారం. కాగా మనోజ్ బదాలే సారథ్యంలోని ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ రాజస్తాన్ రాయల్స్‌కు యజమానిగా ఉంది. రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్, లాచ్లాన్ ముర్దోచ్ తదితర సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.అయితే, ఫ్రాంఛైజీని అమ్మేయాలని గతేడాది యాజమాన్యం నిర్ణయానికి రాగా.. ఆదిత్య బిర్లా గ్రూప్, అమెరికాకు చెందిన స్పోర్ట్స్ ఇన్వెస్టర్ డేవిడ్ బిల్ట్జర్ రాయల్స్‌ను కొనేందుకు పోటీపడ్డారు. అయితే, ఆఖరికి ఇది సోమాని నేతృత్వంలోని కన్సార్టియానికి సొంతమైనట్లు తెలుస్తోంది.ఎవరీ కల్ సోమానీ?ఎడ్ టెక్, కృత్రిమ మేధ, క్రీడా సాంకేతికత, సమాచార గోప్యత తదితర రంగాల్లో పదిహేనేళ్లకు పైగా అనుభవం ఉన్న అమెరికాకు చెందిన వ్యాపారవేత్త. అరిజోనాలోని సర్వీస్ సంస్థలు ఇంట్రాఎడ్జ్, ట్రూయో వంటి సంస్థలను సోమానీ స్థాపించినట్లు సమాచారం. 2021లోనే అతడు రాజస్తాన్ రాయల్స్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు కన్సార్టియంతో కలిసి ఏకంగా ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్నట్లు సమాచారం.కాగా తాజాగా యాజమాన్యం మార్పు నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలో రాజస్తాన్ రాయల్స్ అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచింది. అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆర్సీబీని కూడా అమ్మకానికి పెట్టగా.. దాదాపు రెండు బిలియన్ల యూఎస్ డాలర్లకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాపార వర్గాల్లో చర్చ నడుస్తోంది.చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్ దిగ్గజం -
రాజస్థాన్‌లోకి షనక.. కీలక సూత్రధారి అతడే!
న్యూఢిల్లీ: శ్రీలంక ఆల్‌రౌండర్ దసున్ షనక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ గాయంతో జట్టుకు దూరమవడంతో... అతడి స్థానంలో ఫ్రాంచైజీ షనకను ఎంపిక చేసుకుంది. షనకను రూ. 2 కోట్లకు రాజస్తాన్ తీసుకుంది. దీంతో అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి తప్పుకొని ఐపీఎల్ ఆడనున్నాడు. ఇప్పటికే జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబాని పీఎస్ఎల్ను వీడి ఐపీఎల్లో చేరగా... ఇప్పుడా జాబితాలో షనక చేరనున్నాడు. ఐపీఎల్ మినీ వేలంలో షనకను ఏ ఫ్రాంచైజీ తీసుకోక పోగా... పీఎస్ఎల్లో లాహోర్ ఖలందర్స్ జట్టు అతడిని ఎంపిక చేసుకుంది. ఇప్పుడు రాజస్తాన్ కోచ్ సంగక్కర ప్రోత్సాహంతో అతడు ఐపీఎల్‌లోకి రానున్నాడు. ఐపీఎల్లో బరిలోకి దిగడం షనకకిది రెండోసారి. 2023లో అతను గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇటీవల జరిగిన టి20 ప్రపంచకప్‌లో 34 ఏళ్ల షనక శ్రీలంక జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించాడు. శ్రీలంక తరఫున షనక ఇప్పటి వరకు 6 టెస్టులు, 71 వన్డేలు, 131 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: శతక్కొట్టిన జార్జియా వోల్.. సిరీస్ క్లీన్‌స్వీప్ -
IPL 2026: ‘పరాగ్‌కు అంత సీన్ లేదు’
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్ ఎంపికవడం వెనుక ఫ్రాంచైజీ పెద్దల నుంచి ప్రత్యేక మద్దతు గట్టిగా ఉందంటూ భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నప్పటికీ కెప్టెన్‌గా పరాగ్ ఎంపిక తనను ఆశ్చర్చపరిచిందన్నాడు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘అతడు కెప్టెన్ ఎలా అయ్యాడో అందరికీ తెలుసు. ఎందుకంటే అది రాజస్థాన్ ప్రాంచైజీ పెద్దల నిర్ణయం. అక్కడ రియాన్ పరాగ్‌ను వాళ్లు రాజులా చూసుకుంటారు. రాజస్థాన్ పరాగ్‌ను ఆకాశానికెత్తుతోంది కానీ అతడికి అంత సీన్ లేదు. గతేడాది పరాగ్‌కు అంతగా కలిసిరాలేదు. సంజూ శాంసన్ గైర్హాజరీలో కెప్టెన్‌గా సేవలందించిన పరాగ్‌లో నాయకత్వ ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. కానీ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కాదని ఈ సీజన్లోనూ అతడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు. సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్లకు చెన్నై ట్రేడింగ్ చేసుకున్నప్పటికీ అతడి స్థానంలో రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లు రాజస్థాన్‌కు బదిలీ అయ్యారు. జడేజా, జైస్వాల్, ధ్రువ్ జురేల్ లాంటి నాయకత్వ సామర్థ్యం కలిగిన ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదో చెప్పాలి’ అని పేర్కొన్నారు. ఇక ఈ సీజన్లో రాజస్థాన్ విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయనే ప్రశ్నకు శ్రీకాంత్ సమాధానమిచ్చాడు.‘గత సీజన్‌తో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ మెరుగ్గానే కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లను ఓడించే సత్తా వీరికి ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు. టాప్ ఐదుగురిలో ఇద్దరు రాణించినా రాజస్థాన్‌కు తిరుగుండదు. జైస్వాల్-వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ జోడీ జట్టుకు పెద్ద బలం కానుంది. హెట్‌మైర్, జడేజా, షనక, ధ్రువ్ జురేల్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. రాజస్థాన్‌కు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు 50-50 శాతమే’ అని తెలిపాడు. ఇక రియాన్ పరాగ్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్‌ల్లో 393 పరుగులు సాధించాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. 2017 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కే ఆడుతున్న రియాన్ పరాగ్ ఇప్పటివరకు 84 మ్యాచ్‌ల్లో ఏడు అర్థశతకాలతో 1566 పరుగులు సాధించాడు. అయితే పరాగ్‌లో నిలకడలేమి అతనికి పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆడనుంది.చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలివే! -
‘వైభవ్ సూర్యవంశీ.. చెప్పిన మాట అసలే వినడు’
పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో అద్భుతాలు చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఇటు ఐపీఎల్లో.. అటు భారత అండర్-19 క్రికెట్ జట్టు తరఫునా సత్తా చాటాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో విధ్వంసకర శతకంతో అతి పిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఈ బిహారీ పిల్లాడు.. అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు.తద్వారా భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన వైభవ్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన వైభవ్.. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ తరఫున మరోసారి సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యాడు.అతడొక గొప్ప ఆటగాడుఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) గురించి సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు.. అందుకు ప్రతిగా టీమిండియా స్టార్, ఆర్సీబీ ఆటగాడు జితేశ్ శర్మ (Jitesh Sharma) బదులిచ్చిన తీరు వైరల్‌గా మారింది. ‘‘అతడొక గొప్ప ఆటగాడు. అండర్-19 క్రికెట్లో అతడి ఆట తీరును నేను గమనించాను.ఐపీఎల్‌లాంటి పెద్ద టోర్నీలో ఆడిన తర్వాత అదే స్థాయిలో.. అవే ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగడం అందరికీ సాధ్యం కాదు. అయితే, వైభవ్ సూర్యవంశీ మాత్రం వరల్డ్‌కప్ టోర్నీలో అంతే ప్రొఫెషనల్‌గా, భయం లేకుండా ఆడటం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రొఫెషనల్‌గా ఎదుగుతాడుఆ వయసుకే అతడు అంతగా పరిణతి చెందిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. ఎక్కడ ఆడుతున్నా తన గేమ్‌ప్లాన్‌కు కట్టుబడి ఉంటాడు. తను తనలాగే ఆడతాడు. వేరే వాళ్లను అనుకరించే ప్రయత్నం చేయడు. బౌలర్లను గౌరవిస్తాడు. చెత్త బంతుల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టడు. అతడొక గొప్ప ప్రొఫెషనల్‌గా ఎదుగుతాడు’’ అని డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు.అయితే, ఇందుకు జితేశ్ శర్మ బదులిస్తూ.. ‘‘అతడు అస్సలు ప్రొఫెషనల్ కాదు. నేను ఈ మాట కచ్చితంగా చెప్పగలను’’ అంటూ సరాదాగా కామెంట్ చేశాడు. ‘‘అందరూ అతడిని ప్రొఫెషనల్ అనుకుంటారు. మైదానంలో అతడు ఎలా ఉంటాడన్నది పక్కనపెడితే.. మైదానం వెలుపల మాత్రం అస్సలు చెప్పిన మాట వినడు. రాత్రివేళ ఐస్‌క్రీమ్ తినొద్దని నేను ఎంతగానో మొత్తుకున్నా.చెప్పిన మాట అసలే వినడుఅయినా అతడు నా మాట వినలేదు. ఈ విషయంలో అతడు ఎప్పుడూ ఎవరి మాటా వినడు’’ అని జితేశ్ శర్మ వైభవ్‌కు ఉన్న అలవాటు గురించి డివిలియర్స్‌కు చెప్పాడు. కాగా చిన్న వయసు కాబట్టి ఐస్‌క్రీమ్ పట్ల వైభవ్‌కు ఆ మాత్రం ఇష్టం ఉండటం సహజమే. అయితే, ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో డైట్ పాటిస్తూ జీవనశైలిని మెరుగుపరచుకుంటేనే ఫిట్‌గా ఉండి.. అనుకున్న శిఖరాలకు చేరుకోగలడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో భారత జట్టుకు జితేశ్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించగా.. వైభవ్ సూర్యవంశీ అందులో సభ్యుడిగా ఉన్నాడు.చదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్! -
సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేసేటోడు ఇంకా పుట్టలే..! రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.
-
భారత స్టార్‌కు మొండిచేయి.. అశ్విన్ తుది జట్టు ఇదే!
ఐపీఎల్ 2026 సీజన్‌కు మరో ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో టోర్నీలోని అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. కొన్ని జట్లలోని ఆటగాళ్లు ఇంట్రాస్వ్కాడ్లుగా విడిపోయి మ్యాచ్‌లు కూడా ఆడుతున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఆటగాళ్లు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ లీగ్‌కు ఊపు తెస్తున్నారు. ఆయా ఫ్రాంచైజీలకు సంబంధించి తుది జట్టులో ఎవరెవరికీ చోటు దక్కుతుందనే దానిపై మాజీ క్రికెటర్లు జోరుగా ఊహాగానాలు వ్యక్తం చేస్తూ తమ ప్రాబబుల్ ఎలెవెన్‌ను ప్రకటించే పనిలో పడ్డారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన రాజస్థాన్ రాయల్స్ ప్రాబబుల్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే తాను ప్రకటించిన జట్టులో భారత బౌలర్ తుషార్ దేశ్‌పాండేకు చోటు కల్పించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. రాజస్థాన్ రాయల్స్ తుషార్ దేశ్‌పాండేను రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా అశ్విన్ ప్రకటించిన జట్టులో ఓపెనర్లుగా వైభవ్ సూర్యశంశీ, జైశ్వాల్‌లు, మూడో స్థానంలో కెప్టెన్ రియాన్ పరాగ్‌కు చోటు కల్పించాడు. మిడిలార్డర్లో హెట్‌మైర్, ధ్రువ్ జురేల్, ఫెరీరాలకు అవకాశమిచ్చాడు. జడేజాను ఆల్‌రౌండర్‌గా ఎంచుకున్నాడు. బౌలింగ్ విభాగంలో ఆర్చర్, బిష్ణోయి, సందీప్ శర్మలకు చోటు కల్పించాడు. ‘నా దృష్టిలో హెట్‌మైర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం ఉత్తమం. టీ20 ప్రపంచకప్‌లో విండీస్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి దుమ్మురేపాడు. అందుకే నాలుగోస్థానం అతడికి సరైనది. ఫినిషింగ్ బాధ్యతలు జడేజా, ఫెరీరాలు చూసుకుంటారు. నా వరకు ఇది బెస్ట్ టీం. నేను ప్రకటించిన జట్టులో ఒకటి, రెండు మార్పులుండే అవకాశముంది.’అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో రాజ స్థాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 30న గౌహతి వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఆడనుంది. ఇక అశ్విన్ ఐపీఎల్లో 221 మ్యాచ్‌లాడి 833 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 187 వికెట్లు పడగొట్టాడు.అశ్విన్ రాజస్థాన్ ఎలెవెన్ జట్టు: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైశ్వాల్, రియాన్ పరాగ్, షిమ్రోన్ హెట్‌మైర్, ధ్రువ్ జురేల్, శుభమ్ దూబే, డొనొవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయి, సందీప్ శర్మచదవండి: కోర్డా సంచలనం.. ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్! -
పీఎస్ఎల్ వద్దు.. ఐపీఎల్ ముద్దు!
శ్రీలంక ఆల్‌రౌండర్ దాసున్ షనకను అదృష్టం వరించింది. తంతే బూరల బుట్టలో పడ్డట్టుగా ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన షనక తాజాగా ఐపీఎల్ 2026 సీజన్ ఆడేందుకు సమాయత్తమవుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతని స్థానాన్ని షనకతో భర్తీ చేయాలని రాజస్థాన్ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో షనక తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. అందుకే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి షనక వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ కూడా షనకను సంప్రదించిందని, జట్టులో జాయిన్ అయ్యేందుకు అన్ని లాంఛనాలు పూర్తయ్యాయని, సంతకాలు మాత్రమే మిగిలాయని రాజస్థాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్‌కు స్విచ్ అవుతున్న రెండో ఆటగాడు దాసున్ షనక. ముజరబానీ కూడా..గతంలో జింబాబ్వే ఆటగాడు బ్లెసింగ్ ముజరబానీ కూడా పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్‌కు షిఫ్ట్ అవ్వనున్నాడు. ముజరబానీ పీఎస్ఎల్లో షమర్ జోసెఫ్ స్థానంలో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ఆడేందుకు 1.10 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ అనూహ్యంగా కేకేఆర్ నుంచి పిలుపు రావడంతో ఐపీఎల్ ఆడేందుకే మొగ్గుచూపాడు. వాస్తవానికి గతేడాది అబుదాబి వేదికగా జరిగిన మినీ వేలంలో షనకను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ మొగ్గు చూపలేదు. దీంతో షనక అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) వేలంలో పాల్గొన్నాడు. అయితే షనకను లాహోర్ ఖలండర్స్ 75 లక్షలకు దక్కించుకుంది.షనక దారిలోనే స్పెన్సర్..ఇక స్పెన్సర్ జాన్సర్ కూడా పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్‌కు రానున్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్ నాథన్ ఎల్లిస్ గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో స్పెన్సర్ జాన్సన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎస్కే అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అయితే షనక, స్పెన్సర్లు పీఎస్ఎల్ నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు రావడంతో ఆయా ఫ్రాంచైజీలు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యాయి. కానీ విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్‌కు షిఫ్ట్ అవ్వడం ఇదేమీ కొత్త కాదు. గతేడాది కార్బిన్ బోష్ కూడా ఇదే విధంగా పీఎస్ఎల్ నుంచి తప్పుకొని ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 4న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. పరాగ్ సారథ్యంలో..రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించిన సంజూ శాంసన్ ట్రేడింగ్‌లో చెన్నైకి వెళ్లిపోవడంతో రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. బదులుగా సీఎస్కే వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్థాన్‌కు బదలాయించింది. కాగా జడేజా 2008 ఐపీఎల్ తొలి టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.చదవండి: పంత్‌ను తీసేద్దామనుకున్నారా? -
ఈ సారి 2000-3000 పరుగులు చేస్తా: వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్-2026 సీజన్‌కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. ఈ ధనధాన్ క్రికెట్ పండగ మార్చి 28 నుంచి మొదలు కానుంది. అయితే ప్రస్తుతం అందరి కళ్లు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. గత సీజన్లో ఊహకందని విధంగా విధ్వంసం సృష్టించిన వైభవ్.. ఈ ఏడాది ఎలా రాణిస్తాడో అని అందరూ వెయ్యి కళ్లతో ఎదరుచూస్తున్నారు. ఐపీఎల్-2025 సీజన్‌తో పాటు అండర్-19 క్రికెట్ స్ధాయిలో వైభవ్ దుమ్ములేపాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026ను భారత్ సొంతం చేసుకోవడంలో వైభవ్‌ది కీలక పాత్ర. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో వైభవ్ కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.ఇప్పుడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ సత్తాచాటేందుకు వైభవ్ సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల వైభవ్ తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైభవ్‌కు రిపోర్టర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైంది.ఐపీఎల్ 2026 కోసం మీ ప్లాన్స్ ఏంటి? ఆరెంజ్ క్యాప్ కోసం ఎన్ని పరుగులు చేయాలనుకుంటున్నారు? అని సదరు విలేఖరి ప్రశ్నించాడు.అందుకు వైభవ్ నవ్వుతూ.. మీరు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగితే, రెండు నుండి మూడు వేల పరుగులు చేస్తానని చెబుతా అని బదులిచ్చాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ ఎక్స్‌లో షేర్ చేసింది.అయితే ఇదే ప్రశ్నకు వైభవ్ తర్వాత సీరియస్‌గా సమాధనమిచ్చాడు. నేను ఇన్ని పరుగులు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకోలేదు. నేను సహజశైలిలోనే బ్యాటింగ్ చేస్తాను. నా వ్యక్తిగత మైలురాయిల కంటే జట్టుకు ట్రోఫీ అందించడమే నా ప్రధాన లక్ష్యం" అని అతడు చెప్పుకొచ్చాడు.చదవండి: IPL 2026: ఇషాన్ కిషన్‌పై యువ ప్లేయర్ సీరియస్.. -
రాయల్స్ నిరీక్షణ ముగిసేనా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్ (2008)లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... సంచలన ప్రదర్శనతో ట్రోఫీ చేజిక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్... రెండో టైటిల్ కోసం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉంది. ప్లేయర్లు మారినా, సారథులు మారినా జట్టు తలరాత మాత్రం మారడం లేదు. ఈ సీజన్‌కు ముందు 11 ఏళ్లు జట్టుతో ఉన్న కెప్టెన్ సంజూ సామ్సన్ను వదిలేసుకొని వార్తల్లో నిలిచిన రాజస్తాన్... రియాన్ పరాగ్ సారథ్యంలో కొత్త సీజన్‌కు ‘సై’ అంటోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడు... యశస్వి జైస్వాల్ నిలకడ... హెట్‌మైర్ మెరుపులు... రవీంద్ర జడేజా ప్రవేశం... రాయల్స్‌కు రెండో కప్ అందిస్తుందా లేదా వేచి చూడాలి! – సాక్షి క్రీడా విభాగంప్రధాన ఆటగాళ్లను తిరిగి తీసుకోకుండా గతేడాది పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్... ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే తమ రెగ్యులర్ కెప్టెన్ సంజూ సామ్సన్ను చెన్నై సూపర్ కింగ్స్‌కు బదిలీ చేసుకొని... అతడి స్థానంలో రవీంద్ర జడేజాను తెచ్చుకుంది. గత సీజన్లో కొన్ని కారణాల వల్ల సామ్సన్ కొన్ని మ్యాచ్‌ల్లో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగగా... అతడి స్థానంలో జట్టుకు నాయకత్వం వహించిన రియాన్ పరాగ్‌కు ఈసారి పూర్తిస్థాయి సారథ్య బాధ్యతలు అప్పగించింది. పెద్దగా అంతర్జాతీయ స్టార్లు లేని జట్టును అతడు ఎలా నడిపిస్తాడనేది కీలకంగా మారింది. రాహుల్ ద్రవిడ్ స్థానంలో కుమార సంగక్కర జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఒకవైపు జట్టును అమ్మేందుకు ఫ్రాంచైజీ ప్రయతి్నస్తుంటే... మైదానంలో మెరుగైన ప్రదర్శనతో ఇతరత్రా వార్తల నుంచి దృష్టి మరల్చాలని టీమ్ భావిస్తోంది. వైభవ్పైనే అందరి దృష్టి... పద్నాలుగేళ్ల వయసులోనే అంతర్జాతీయ బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ... గత సీజన్లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి నిలవనుంది. ఐపీఎల్ ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు 15వ పడిలో అడుగు పెట్టనున్న ఈ పాలబుగ్గల బుడ్డోడు... ఈ ఏడాది ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది ఆసక్తికరం. ఐపీఎల్లో రాణించిన అనంతరం దేశవాళీలో, ఏజ్ గ్రూప్ క్రికెట్లో సైతం అదే దూకుడు కొనసాగిస్తూ ఆకట్టుకున్న సూర్యవంశీపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బౌలర్‌తో సంబంధం లేకుండా తొలి బంతి నుంచే దంచికొట్టే వైభవ్ అదే జోరు కొనసాగిస్తే ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అతడితో పాటు యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. భారత టి20 జట్టులో సుస్థిర స్థానం దక్కించుకోవాలని చూస్తున్న జైస్వాల్‌కు ఈ సీజన్ మరింత కీలకం కానుంది. వీరిద్దరితో పాటు రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ కీలకం కానున్నారు. విదేశీ ఆటగాళ్ల కోటాలో... విండీస్ విధ్వంసక వీరుడు హెట్‌మైర్, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, ప్రిటోరియస్, ఫెరీరా, ఎంఫకా, ఆడమ్ మిల్నే, బర్గర్ అందుబాటులో ఉన్నారు. గతంలో పంజాబ్, చెన్నై జట్లకు ప్రాతినిధ్యం వహించిన స్యామ్ కరన్ ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతడు అందుబాటులో లేకుంటే ఫ్రాంచైజీ వద్ద తగిన ప్రత్యామ్నాయాలు కూడా లేవు. రవీంద్ర జడేజా తప్ప చెప్పుకోదగ్గ ఆల్‌రౌండర్ లేకపోవడం కాస్త ఇబ్బందే అయినా... సమష్టితత్వంతో ఫలితాలు సాధించాలని రాయల్స్ యోచిస్తోంది. గెలిపించేది ఎవరో? ప్రత్యర్థి జట్లన్నీ స్టార్ ఆటగాళ్లపై ఆధారపడుతుంటే... రాయల్స్ మాత్రం మ్యాచ్‌లు గెలిపించే ఆటగాడి కోసం చూస్తోంది. ముఖ్యంగా 12 మంది బౌలర్లు అందుబాటులో ఉన్నా... వారిలో మ్యాచ్ విన్నర్లు కనిపించడం లేదు. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే ఏమాత్రం సహకరిస్తారో చూడాలి. ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న సందీప్ శర్మ రాణించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. రవీంద్ర జడేజాతో పాటు రవి బిష్ణోయ్ స్పిన్ భారం మోయనున్నారు. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంతో పాటు... గువాహటిలోనూ రాయల్స్ తమ సొంతగడ్డ మ్యాచ్‌లు ఆడనుంది. తుది జట్టు ఎంపిక నుంచి ... జట్టులో సమష్టితత్వం వరకు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న రాజస్తాన్... మైదానంలో దుమ్మురేపి వాటన్నిటిని అధిగమించాలని ఆశిస్తోంది. ఇదే జరగాలంటే ఎవరో ఒకరు జట్టును గెలిపించే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. రాజస్తాన్ రాయల్స్ జట్టు: పరాగ్ (కెప్టెన్), శుభమ్ దూబే, వైభవ్, ఫెరీరా, ప్రిటోరియస్, రవి సింగ్, అమన్ రావు, హెట్‌మైర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, యుధ్వీర్, జడేజా, స్యామ్ కరన్, ఆర్చర్, తుషార్, ఎంఫకా, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యశ్ రాజ్, విఘ్నేశ్ పుతుర్, బ్రిజేశ్ శర్మ, మిల్నే, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, బర్గర్.రాజస్తాన్ రాయల్స్ గణాంకాలుఆడిన మ్యాచ్‌లు 236 గెలిచినవి 116 ఓడినవి 117 రద్దు 3 అత్యుత్తమ ప్రదర్శన: చాంపియన్ (2008), రన్నరప్ (2022). -
'వైభవ్ అతిగా ఆలోచించకు.. జైస్వాల్ చూసుకుంటాడు'
ఐపీఎల్-2026 సీజన్లో సత్తా చాటేందుకు రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సిద్దమవుతున్నాడు. గత సీజన్లో తన అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని అకర్షించిన ఈ బిహార్ ఆటగాడు.. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.ఇప్పటికే రాయల్స్ ట్రైనింగ్ క్యాంపులో చేరిన 14 ఏళ్ల సూర్యవంశీ .. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాయల్స్ కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది వైభవ్‌పై భారీ అంచనాలతో పాటు ఒత్తడి కూడా ఉంటుందని పరాగ్ తెలిపాడు.వైభవ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో అతడిపై ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ కెప్టెన్‌గా ఒక్క విషయం అతడికి చెప్పాలనుకుంటున్నాను. ఆ ఒత్తిడిని యశస్వి జైస్వాల్‌కు వదిలేయమని చెబుతా. ఎందుకంటే జైశ్వాల్‌కు అనుభవం ఎక్కువగా ఉంది. ఒత్తిడిని తట్టుకుని ఆడే సత్తా జైశూ వద్ద ఉంది. కాబట్టి వైభవ్ క్రీజులోకి వెళ్లి తన సహజ సిద్ధమైన ఆటను ఆడితే చాలు. బయట విషయాలను అతడు పట్టించుకోకూడదు. అతడి దృష్టింతా కేవలం ఆటపైనే ఉండాలి. అందుకే అతడిని మీడియా దృష్టికి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు హాజరుకావద్దని, ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడవద్దని చెబుతాను అని పరాగ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025 సీజన్లో వైభవ్ దుమ్ములేపాడు. కేవలం 7 మ్యాచ్‌లలో 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు.చదవండి: IPL 2026: లైంగిక ఆరోపణలు.. స్టార్ ప్లేయర్‌పై వేటు వేసిన ఆర్సీబీ!? -
IPL 2026: వేలకోట్లు వదులుకున్న రాజస్థాన్
ఐపీఎల్ ప్రారంభ సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలను అమ్మకాలకు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్ రాయల్స్ కొలంబియా పసిఫిక్ క్యాపిటల్స్ పార్టనర్స్ (సీపీసీసీ) కన్సార్టియం నుంచి వచ్చిన 16 వేల కోట్లు (1.7 బిలియన్ డాలర్ల) బిడ్డింగ్‌ను వదులుకోవడం ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి రాజస్థాన్‌కు ఇప్పుడొచ్చిన బిడ్ మంచి ధరే అని చెప్పొచ్చు. కానీ ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తూ పెద్ద మొత్తంలో వచ్చిన బిడ్‌ను కాదనుకొని రాజస్థాన్ చేతులు కాల్చుకుంటుందని పలువురు క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా, కెనడాలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన సీపీసీసీ రాజస్థాన్ రాయల్స్ కోసం పెద్ద మొత్తంలో బిడ్‌ను దాఖలు చేయడం కొంత ఆశ్చర్యపరిచింది.రాజస్థాన్ ఫ్రాంచైజీలో ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ అధినేత మనోజ్ బదాలె వాటా 65 శాతం కాగా మిగతా వాటా రెడ్‌బర్డ్ క్యాపిటల్‌కు ఉంది. మరోవైపు ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ముందు వరుసలో ఉండే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విలువ మాత్రం 20వేల కోట్లు దాటే అవకాశముంది. ఇప్పటికే ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రంజన్ పై సారథ్యంలోని కన్సార్టియం దాదాపు 2 బిలియన్ డాలర్లకు పైగానే బిడ్‌ను దాఖలు చేసింది. ఇక 2008లో ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టైటిల్ గెలుచుకుంది. షేన్ వార్న్ సారధ్యంలోని జట్టులో రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, యూసఫ్ పఠాన్ సహా కీలక క్రికెటర్లు ఎందరో ఉన్నారు. ఇక ఆ తర్వాత రాజస్థాన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతూనే వచ్చింది. అయితే 2013 తర్వాత నుంచి రాజస్థాన్ కాస్త గాడిన పడింది. 2013లో ప్లేఆఫ్స్ చేరిన రాజస్థాన్ ఆ తర్వాత 2015, 2018 సీజన్లోనూ ప్లేఆఫ్స్ చేరింది. 2022లో శాంసన్ సారథ్యంలో రన్నరప్‌గా నిలిచింది. 2025 సీజన్లో రాజస్థాన్ 9వ స్థానంలో నిలిచి లీగ్ దశకే పరిమితమైంది.చదవండి: ‘మానసిక వేదన అనుభవిస్తున్నా’ -
‘అతడి వెంటపడొద్దు.. స్వేచ్ఛనివ్వండి’
వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. పసిప్రాయంలోనే దూకుడైన ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులను వణికించిన 15 ఏళ్ల సూర్యవంశీ ఏడాది కాలంగా అండర్-19 క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవలే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో 175 పరుగుల సంచలన ఇన్నింగ్స్ అతడి అసాధారణ ప్రతిభకు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంతకాలం అండర్-19 క్రికెట్లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ ఇక ఐపీఎల్లో తన మెరుపులు చూపించేందుకు సమాయ త్తమవుతున్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సూర్యవంశీపై ఈసారి భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన రియాన్ పరాగ్ వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.‘ఏడాది కాలంగా తిరుగులేని ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిలో పడ్డాడు. ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడ భారీ స్కోర్లు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ ద్వారా వైభవ్ కొత్తగా నిరూపించుకోవాల్సిన పని లేదు. అలాంటి యంగ్ ఓపెనర్ మా జట్టులో ఉండడం మాకు కొండంత బలం. ఇటీవలే అండర్-19 ప్రపంచకప్‌లో సూర్యవంశీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్‌లే అందుకు నిదర్శనం. ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీపై భారీ అంచనాలు ఉండడం సహజమే. కానీ కెప్టెన్‌గా వైభవ్‌కు నేను ఇచ్చే సలహా ఒక్కటే. అందరి దృష్టి తన మీదే ఉండడంతో మీడియా అటెన్షన్ ఉంటుంది. అందుకే మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ అతడు తన ఆటను ఎంజాయ్ చేస్తూ ఆడితే బాగుంటుంది. అతడికింకా 15-16 ఏళ్లు మాత్రమే. అందుకే సూర్యవంశీని తన ఆటను స్వేచ్ఛగా ఆడనిద్దాం. జట్టుగా అతడిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవడం మా బాధ్యత. సంచలన ఇన్నింగ్స్‌లతో దేశానికి గర్వకారణంగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాలని ఆశిస్తున్నా’ అని పరాగ్ చెప్పుకొచ్చాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర మాట్లాడుతూ.. ‘బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్ల సమతూకంతో మా జట్టు అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తోంది. ఈసారి కచ్చితంగా టైటిల్ కొట్టేందుకే అహర్నిశలు శ్రమించనున్నాం’ అని తెలిపాడు. కాగా గతేడాది వరకు రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన సంజూ శాంసన్ ట్రేడింగ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు వెళ్లిపోవడంతో రియాన్ పరాగ్ రాజస్థాన్ నూతన కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. శాంసన్ స్థానంలో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లు చెన్నై నుంచి రాజస్థాన్‌కు వచ్చారు.చదవండి: ఇరాన్‌కు షాకిచ్చిన ఫిఫా! -
అక్కడ ముగింపు.. ఇక్కడ ప్రారంభం!
టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సంగతి తెలిసిందే. 2018 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న సంజూ శాంసన్ 2025 నవంబర్‌లో ట్రేడింగ్‌లో భాగంగా జడేజా, సామ్ కరన్‌లను రిలీజ్ చేసిన చెన్నై శాంసన్‌ను దక్కించుకుంది. మరో 10 రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా రాజస్థాన్‌తో బంధం ముగిసిందని, ఈ సీజన్ ద్వారా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ప్రయాణం ప్రారంభమైందని పేర్కొ న్నాడు. శాంసన్ మాట్లాడుతూ..‘నేను ఆ జట్టులో సమయం ముగిసిందని భావించా.. అందుకే రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వచ్చా. నేను రాజస్థాన్ రాయల్స్‌కు ప్రత్యర్థిగా ఆడడం ఇదే తొలిసారి అనుకుంటా. ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. కానీ ఒకసారి మైదానంలోకి వచ్చాక మ్యాచ్ గురించే తప్ప వేరే దాని గురించి ఆలోచించను. రాజస్థాన్ జట్టులో చాలా మంది ఆటగాళ్లతో కలిసి నేను ఆడాను. మేనేజ్మెంట్, సపోర్ట్ స్టాఫ్ అంతా తెలిసినవాళ్లే. వారు ప్రేమ, గౌరవభావాలు కలిగి ఉన్నారు. కానీ ప్రతీ ఒక్కరికీ ఒక సమయం అనేది ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్‌తో నా సమయం ముగిసింది. నేను ముందుకు సాగాను. ఇది నాకు కొత్త ప్రయాణం. ప్రస్తుతం నేను రాజస్థాన్‌పై కూడా చాలా ఆనందంగా ఆడాలనుకుంటున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నాటి నుంచి ఎక్కువగా రాజస్థాన్ రాయల్స్‌కే ఆడాడు. మధ్యలో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడినప్పటికీ రాజస్థాన్‌తోనే శాంసన్‌కు అనుబంధమెక్కువ అని చెప్పొచ్చు. 2022లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన శాంసన్ ఆ సీజన్లో రాజస్థాన్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. 2023 సీజన్లో రాజస్థాన్ ప్లేఆఫ్‌కు చేరడంలో విఫలమైనప్పటికీ బ్యాటర్‌గా మాత్రం శాంసన్ విజయవంతమయ్యాడు. ఆ తర్వాత 2024లో శాంసన్ నేతృత్వంలో రాజస్థాన్ జట్టు మరోసారి రెచ్చిపోయింది. తొలి 9 మ్యాచ్‌ల్లో ఎనిమిదింట గెలిచిన రాజస్థాన్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్‌చేతిలో ఓటమిపాలైంది. ఈ సీజన్ సంజూ శాంసన్ బెస్ట్ అని చెప్పొచ్చు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 5 హాఫ్‌సెంచరీల సాయంతో 531 పరుగులు సాధించి కెరీర్ బెస్ట్ ప్రదర్శన చేశాడు. 2025 సీజన్లో గాయాల సమస్యలతో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ జట్టును నడిపించాడు.Sanju Samson just casually dropped a reality check for the professional language warriors.Knowing Hindi and Tamil along with Malayalam didn't make him less of a South Indian, it made him a better teammate. While the keyboard activists are busy gatekeeping, Sanju is busy winning… pic.twitter.com/AsggCsz7fP— Smita Deshmukh🇮🇳 (@smitadeshmukh) March 17, 2026చదవండి: సౌతాఫ్రికా అమ్మాయిలదే పైచేయి -
'రెహ్మాన్ దకైత్' స్టయిల్లో ఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజా
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ తమ కొత్త ఆటగాడు రవీంద్ర జడేజాకు ప్రత్యేక స్వాగతం పలికింది. ఇటీవల సంచలనం సృష్టించిన బాలీవుడ్ చిత్రం 'ధురంధర్'లో అక్షయ్ ఖన్నా పోషించిన ‘రెహ్మాన్ దకైత్’ పాత్రను పోలి ఉండేలా ఓ స్పెషల్ వీడియోను రూపొందించి సోషల్‌మీడియాలో రిలీజ్ చేసింది. 𝐊𝐡𝐚𝐦𝐦𝐚 𝐆𝐡𝐚𝐧𝐢, 𝐑𝐚𝐣𝐚𝐬𝐭𝐡𝐚𝐧 🔥⚔️Ravindrasinh Jadeja has arrived for IPL 2026 💗 pic.twitter.com/fVUVl5zTjZ— Rajasthan Royals (@rajasthanroyals) March 10, 202684 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో జడేజా సంప్రదాయ రాజస్థానీ వేషధారణలో కనిపించాడు. 'ఖమ్మా ఘనీ, రాజస్థాన్' అంటూ అభిమానులను పలకరించాడు. ఇది ధురంధర్ సినిమాలో రెహ్మాన్ దకైత్ 'అస్సలాం వాలేకుం, లియారీ' అన్న సన్నివేశాన్ని గుర్తు చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్‌మీడియాలో వైరలవుతుంది.జడేజాను 2026 ఐపీఎల్ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ రూ. 14 కోట్లకు సీఎస్కే నుంచి ట్రేడ్ చేసుకుంది. ఈ మూవ్ జడేజాకు హోం కమింగ్ లాంటిది. జడ్డూ తన ఐపీఎల్ కెరీర్‌ను 2008లో రాజస్థాన్ రాయల్స్‌తోనే ప్రారంభించాడు. ఆతర్వాత సీఎస్కేతో 12 సీజన్లు, గుజరాత్ లయన్స్‌తో 2 సీజన్లు ఆడి తిరిగి రాయల్స్ గూటికే చేరాడు. 2008లో షేన్ వార్న్ నేతృత్వంలో రాయల్స్ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు జడేజా కీలక సభ్యుడు. రెండు సీజన్ల పాటు రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన జడ్డూ.. 22 ఇన్నింగ్స్‌ల్లో 430 పరుగులు చేసి, 6 వికెట్లు తీశాడు. ప్రస్తుత రాయల్స్ జట్టు జడేజా చేరికతో మరింత బలపడింది. సంజూ శాంసన్ రాయల్స్‌ను వీడటంతో ఈ సీజన్‌తో రియాన్ పరాగ్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. జడేజాతో పాటు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ కూడా సీఎస్కే నుంచి రాయల్స్‌కు ట్రేడ్ అయ్యాడు. మరో ఆల్‌రౌండర్ డొనొవన్ ఫెరియెరా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రాయల్స్‌లోకి వచ్చాడు.అప్పటికే యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, షిమ్రోన్ హెట్‌మైర్, లుహాన్ డ్రి ప్రిటోరియస్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్ లాంటి విధ్వంసకర వీరులతో రాయల్స్ బ్యాటింగ్ విభాగం కలకలలాడుతుండింది. జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ, క్వేనా మఫాకా లాంటి బౌలర్లతో సమతూకంగా ఉంది. -
కుమార సంగక్కర ఇంట తీవ్ర విషాదం
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార్ సంగక్కర ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి, ప్రముఖ న్యాయవాది ఎస్కే సంగక్కర వయోభారంతో నిన్న (మార్చి 3) సాయంత్రం తదిశ్వాస విడిచారు. ఎస్కే సంగక్కర మరణవార్త లంక క్రికెట్ సర్కిల్స్‌తో పాటు న్యాయ, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సోషల్‌మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్కే సంగక్కర అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 6 గంటలకు క్యాండీలోని మహాయావా స్మశానంలో జరగనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఎస్కే సంగక్కరకు భార్య కుమారి, కుమార సంగక్కర సహా మరో ముగ్గురు తోబుట్టువులు (తుషారి, సురంగ, వెమింద్రా) ఉన్నారు.Saddened to hear the demise of Mr. Kshema Sangakkara, a well known Civil Lawyer, father and first coach of Kumar Sangakkara. RIP sir, your contribution to the law and cricket will not be forgotten🙏 pic.twitter.com/qJfIqNv6Zr— Akhila Seneviratne (@AkhilaSene97) March 3, 2026కాగా, కుమార సంగక్కరకు తొలి గురువు తండ్రే. సంగక్కర దిగ్గజ క్రికెటర్‌గా ఎదగడంలో ఎస్కే సంగక్కర పాత్ర చాలా కీలకం. ఎస్కే సంగక్కర వృత్తిరిత్యా బిజీ న్యాయవాది అయినప్పటికీ.. కొడుకు క్రికెట్ కెరీర్ కోసం సమయం వెచ్చించే వారు. ఈ విషయాన్ని సంగక్కర తన రిటైర్మెంట్ సందర్భంగా ప్రస్తావించాడు. కుమార సంగక్కర ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. -
గంభీర్‌కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్‌కోచ్ పదవికి గుడ్‌బై?
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ త్వరలోనే తప్పుకోనున్నాడా? తన కాంట్రాక్టు ముగిసేంత వరకు కూడా అతడు పదవిలో కొనసాగడా?... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో మళ్లీ అతడి బంధం బలపడనుందా?..భారత క్రికెట్ వర్గాల్లో ఈ సందేహాలు తలెత్తడానికి ప్రధాన కారణం దైనిక్ జాగరణ్‌లో వచ్చిన కథనం. ఈ జాతీయ మీడియా అందించిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ రాయల్స్ గంభీర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. తమ యాజమాన్యంలో మార్పులు చోటు చేసుకోనున్న వేళ.. గంభీర్‌కు ఆ ఫ్రాంఛైజీ బంపరాఫర్ ఇచ్చినట్లు సమాచారం.వాటా ఇస్తారా?.. ట్రిపుల్ ధమాకా!ఫ్రాంఛైజీలో 2-3 శాతం వాటా ఇవ్వడంతో పాటు సీఈఓ పోస్టు కూడా ఇస్తామని గంభీర్ (Gautam Gambhir)కు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా జట్టు మెంటార్‌గానూ అతడికి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే రాజస్తాన్ రాయల్స్ జట్టు మొత్తం గంభీర్ కనుసన్నల్లోనే నడుస్తుంది. సర్వం తానై జట్టును నడిపించే బాధ్యత ఈ మాజీ వరల్డ్‌కప్ విన్నర్‌కు దక్కుతుంది.ఒకవేళ గంభీర్ గనుక ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపితే టీమిండియా హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం భారత క్రికెట్లో ఓ పదవిలో ఉన్న వ్యక్తి.. ఐపీఎల్ ఫ్రాంఛైజీలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండరాదు. రెండుచోట్లా సదరు వ్యక్తి పనిచేసినట్లయితే అయితే ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్’ కిందకు వస్తుంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఆ వ్యక్తిపై వేటు పడుతుంది.టెస్టులలో ఫ్లాప్‌అయితే, రాజస్తాన్ ఆఫర్‌ను గంభీర్ అంగీకరించే అవకాశాలు దాదాపుగా శూన్యమనే చెప్పవచ్చు. టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడు మిశ్రమ ఫలితాలు అందుకుంటున్నాడు. టెస్టుల్లో గౌతీ మార్గదర్శనంలో భారత్ ఘోర పరాభవాలు చవిచూసింది. స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్, పాతికేళ్ల తర్వాత సౌతాఫ్రికా చేతిలో 2-0తో క్లీన్‌స్వీప్ అయింది.అదే విధంగా ఆస్ట్రేలియాకు పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోయింది. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం గంభీర్‌కు వరుస విజయాలు దక్కుతున్నాయి. 2025లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆసియా టీ20 కప్ 2025ని కూడా కైవసం చేసుకుంది.పరిమిత ఓవర్ల క్రికెట్లో హిట్‌ప్రస్తుతం డిఫెండింగ్ చాంపియన్‌గా టీ20 ప్రపంచకప్-2026 బరిలో దిగిన టీమిండియా ఈసారీ టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇక 2024లో టీమిండియా హెడ్‌కోచ్‌గా పదవి చేపట్టిన గంభీర్ పదవీ కాలం 2027 వరల్డ్‌కప్ వరకు ఉంది. ఇలాంటి తరుణంలో గంభీర్ టీమిండియా విధులను కాదని.. రాజస్తాన్ రాయల్స్ ఆఫర్‌కి అంగీకరించే అవకాశం లేదని చెప్పవచ్చు. పట్టుదలకు మారుపేరుగా పేరొందిన గంభీర్ భారత్‌కు మరో ఐసీసీ టైటిల్ అందించిన తర్వాతే హెడ్‌కోచ్‌గా వైదొలిగే అంశంపై ఆలోచిస్తాడని అతడి అభిమానులు అంటున్నారు.ఐపీఎల్ వీరుడుటీమిండియా ఓపెనర్‌గా ఉన్నత శిఖరాలు అధిరోహించిన గౌతం గంభీర్ ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా రెండు టైటిళ్లు అందించాడు. అంతేకాదు.. 2024లో అదే జట్టుకు మెంటార్‌గా పనిచేసి మరోసారి ట్రోఫీని ముద్దాడేలా చేశాడు. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు కూడా గంభీర్ మెంటార్‌గా పనిచేశాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఐపీఎల్లో మొత్తంగా 154 మ్యాచ్‌లు ఆడి 4218 పరుగులు సాధించాడు.చదవండి: గెలిచి నిలిచిన అఫ్గానిస్తాన్ -
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ పేరు ప్రకటన
ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ ఓ కీలక ప్రకటన చేసింది. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లిపోవడంతో, నూతన కెప్టెన్‌గా యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారకంగా ప్రకటించింది.కెప్టెన్సీ రేసులో రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్ పేర్లు వినిపించినప్పటికీ, యాజమాన్యం రియాన్వైపే మొగ్గు చూపింది. 2019లో రాయల్స్ తరఫునే ఐపీఎల్ అరంగేట్రం చేసిన రియాన్ నాటి నుంచి ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నాడు. మొత్తం 7 సీజన్లలో 84 మ్యాచ్‌లు ఆడి 141.84 స్ట్రయిక్‌రేట్‌తో 1566 పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కూడా అయిన రియాన్ 7 వికెట్లు కూడా తీశాడు. రియాన్ అత్యుత్తమ ప్రదర్శన 2024 సీజన్లో వచ్చింది. ఆ సీజన్లో అతను 149.21 స్ట్రయిక్‌రేట్‌తో 573 పరుగులు చేశాడు. గత సీజన్లో రియాన్ ఓ మోస్తరు ప్రదర్శనలు (166.52 స్ట్రయిక్‌రేట్‌తో 393 పరుగులు) చేశాడు.గత సీజన్లో సంజూ గైర్హాజరీలో రియాన్ 8 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అయితే అతనికి కెప్టెన్సీ పెద్దగా కలిసి రాలేదు. 8 మ్యాచ్‌ల్లో 6 పరాజయాలు మూటగట్టుకొని, కేవలం రెండే విజయాలు సాధించాడు. తదుపరి సీజన్లో రియాన్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా ఏమేరకు రాణిస్తాడో చూడాలి. కాగా, తదుపరి సీజన్‌కు రాయల్స్‌కు కెప్టెన్‌తో పాటు నూతన హెడ్ కోచ్ కూడా రానున్నాడు. గత సీజన్ తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్ వదవిని వదిలేయడంతో, ఆ స్థానంలో కుమార సంగక్కర బాధ్యతలు చేపట్టాడు. సంగక్కర-రియాన్ కలిసి 2026 ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను నడిపిస్తారు.2008లో తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన రాయల్స్ అప్పటి నుంచి రెండో టైటిల్ కోసం ఎదురుచూస్తుంది. ఈసారి కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌తో పాటు చాలామంది కొత్త ఆటగాళ్లతో రాయల్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు..రియాన్ పరాగ్ (కెప్టెన్), శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, డొనొవన్ ఫెరియెరా, లుహాన్ డ్రి ప్రిటోరియస్, రవి సింగ్, అమన్ రావు పేరాల, షిమ్రోన్ హెట్‌మైర్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, యుద్ద్‌వీర్ సింగ్ చరక్, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, క్వేనా మఫాకా, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, యశ్ రాజ్ పంజా, విజ్ఞేశ్ పుతుర్, బ్రిజేశ్ శర్మ, ఆడమ్ మిల్నే, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, నండ్రే బర్గర్ -
IPL కంటే ముందే ఆ టీ20 లీగ్‌లో వైభవ్ సూర్యవంశీ!
ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 ఫైనల్లో సత్తా చాటి మరోసారి ప్రశంసలు అందుకుంటున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇంగ్లండ్‌తో టైటిల్ పోరులో ఈ పద్నాలుగేళ్ల బాలుడు కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించాడు. తద్వారా భారత్ ఆరోసారి ప్రపంచకప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.ఈ నేపథ్యంలో ఈ భారత యువ క్రికెట్ తరంగాన్ని ఏకంగా దిగ్గజ గ్యారీ సోబర్స్‌తో పోల్చాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మార్క్ బుచర్. ఇక ఈ మెగా టోర్నీ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో వైభవ్ సూర్యవంశీ బిజీ కానున్నాడు. అయితే, అంతకంటే ముందే మరో దేశీ టీ20 లీగ్‌లో అతడు భాగం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.IPL కంటే ముందే ఆ టీ20 లీగ్లోక్రిక్బజ్ కథనం ప్రకారం.. దేశీ కార్పొరేట్ టీ20 ఈవెంట్ డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో వైభవ్ పాల్గొననున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఇందుకు సంబంధించి నిర్వాహకులతో చర్చలు తుదిదశకు చేరినట్లు సమాచారం. కాగా ఈ కాంపిటిషన్ ఫిబ్రవరి 23న మొదలుకానుంది.హార్దిక్ పాండ్యా సైతందేశీ ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా డీవై పాటిల్ టీ20 టోర్నమెంట్లో ఆడతారు. ఐపీఎల్ కంటే ముందే పొట్టి క్రికెట్ వైబ్ ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా క్యాష్ రిచ్ లీగ్ కంటే ముందు ఈ టోర్నీలో ఆడటం యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది. నవీ ముంబై వేదికగా జరిగే గతేడాది ఈ టోర్నీలో హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు ఆడారు. శివం దూబే, నేహాల్ వధేరా, దీపక్ చహర్ తదితరులు కూడా భాగమయ్యారు.పైసా వసూల్ ప్రదర్శనకాగా దేశీ క్రికెట్లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ దృష్టిని ఆకర్షించాడు వైభవ్ సూర్యవంశీ. ఈ చిచ్చరపిడుగు కోసం రాయల్స్ ఏకంగా 1.10 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అందుకు తగినట్లుగానే ఈ బిహారీ పిల్లాడు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు. సంజూ శాంసన్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌కు జోడీగా ఓపెనర్‌గా వచ్చి.. తానేంటో నిరూపించుకున్నాడు.గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేయడంతో వైభవ్ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో అదరగొట్టి యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో ధనాధన్ శతకాలతో ఆకట్టుకున్నాడు వైభవ్. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 సన్నాహకాల్లో భాగంగా ఫిబ్రవరి 21 వరకు ట్రెయినింగ్ సెషన్లో వైభవ్ పాల్గొనున్నాడు. చదవండి: ENG vs WI: నేపాల్ మీదైనా గెలిచాం.. సంతోషం: హ్యారీ బ్రూక్ -
ఎన్నికల ప్రకటన తర్వాతే... ఐపీఎల్ షెడ్యూల్: రాజీవ్ శుక్లా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-19వ సీజన్ షెడ్యూల్‌కు కసరత్తులు జరుగుతున్నాయి. మార్చి 26 నుంచి మే 31 వరకు ఐపీఎల్ జరగనుండగా... దానికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాతేఈ వేసవిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ప్రభుత్వం ఎన్నికల తేదీలు ఖరారు చేసిన అనంతరం షెడ్యూల్ రూపొందించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఎదురుచూస్తోంది.పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ ఆలస్యమవుతోందని బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) వెల్లడించారు. రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీలు ఈ వారంలోనే తమ ‘హోం గ్రౌండ్’ను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.అపుడే షెడ్యూల్ విడుదల‘ఐపీఎల్ షెడ్యూల్ రూపొందించే పనిలో ఉన్నాం. అయితే ఎన్నికల తేదీలపై ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూస్తున్నాం. అది విడుదలైన వెంటనే షెడ్యూల్ ప్రకటిస్తాం. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఆ ప్రక్రియకు ఇబ్బంది కలగకుండా మ్యాచ్‌లు నిర్వహిస్తాం. బెంగళూరు, రాజస్తాన్ జట్లకు తమ ‘హోమ్ గ్రౌండ్’ను నిర్ణయించుకునే అవకాశం ఇస్తున్నాం. వీలైనంత త్వరగా వివరాలు అందిస్తే... దానికి తగ్గట్లు మ్యాచ్‌లను షెడ్యూల్ చేస్తాం’ అని రాజీవ్ శుక్లా తెలిపారు. చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు -
ఏంటి తమ్ముడూ ఇది!.. సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఫిక్స్!
భారత క్రికెట్లోకి దూసుకువచ్చిన సరికొత్త సంచలనం పేరు వైభవ్ సూర్యవంశీ. తోటి పిల్లలంతా స్కూల్ చదువుతో బిజీగా ఉంటే.. అతడు మాత్రం అద్భుత బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేస్తున్నాడు. పద్నాలుగేళ్ల వయసుకే ఇప్పటికే ఆరు దేశాల్లో ఆరు సెంచరీలు చేసి మరో ‘మాస్టర్ బ్లాస్టర్’గా నీరాజనాలు అందుకుంటున్నాడు.దూకుడైన ఆటకు మారుపేరైన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. భారత అండర్-19 జట్టు కెప్టెన్‌గానూ అరంగేట్రంలోనే అదరగొట్టాడు. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశాడు. ఆఖరి వన్డేలో విధ్వంసకర శతకం బాది.. మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు.సెంచరీల మోతచెన్నై వేదికగా 2024లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టు (104)తో యూత్ టెస్టులో శతక్కట్టిన వైభవ్.. ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫున గుజరాత్ టైటాన్స్(101)పై సెంచరీ సాధించాడు. గతేడాది ఇంగ్లండ్ గడ్డ మీద యూత్ వన్డేలో శతకం (143) నమోదు చేసిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్... ఆస్ట్రేలియాలో యూత్ టెస్టులోనూ (113) శతక్కొట్టాడు.ఇక ఇండియా-ఎ తరఫున దోహా వేదికగా యూఏఈపై టీ20 సెంచరీ (144) సాధించిన వైభవ్ సూర్యవంశీ.. తన సొంతజట్టు బిహార్ తరఫున దేశీ క్రికెట్లో మహారాష్ట్రపై టీ20 శతకం (108*) సాధించాడు. అనంతరం దుబాయ్‌లో యూఏఈ అండర్-19 జట్టుతో యూత్ వన్డేలో (171)లోనూ శతక్కొట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో అరుణాచల్ ప్రదేశ్‌పై (190) భారీ శతకం సాధించాడు. తాజాగా సౌతాఫ్రికాతో మూడో యూత్ వన్డేలో 127 పరుగులతో సత్తా చాటాడు.ఆరు దేశాల్లో ఆరు సెంచరీలుఇలా భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఖతార్, యూఏఈ, సౌతాఫ్రికా దేశాల్లో సెంచరీలు చేసి.. తాను ఎక్కడైనా బ్యాట్ ఝులిపించగలనని నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే వైభవ్ టీమిండియాలో అరంగేట్రం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. ‘‘171(95), 50(26), 190(84), 68(24), 108*(61), 46(25) & 127(74)... గత ముప్పై రోజులుగా దేశీ, అండర్-19 క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ సాధించిన స్కోర్లు ఇవి.ఏంటి తమ్ముడూ ఇది!ఇదంతా ఏంటి తమ్ముడు?... శాంపిల్ చూపించావా? మున్ముందు ఇంతకంటే గొప్పగా చెలరేగిపోతావా?.. 14 ఏళ్ల వయసున్న పిల్లాడు ఇలా ఆడుతున్నాడంటే నమ్మబుద్ధికావడమే లేదు. అతడి ఆటను వర్ణించేందుకు మాటలు రావడం లేదు.సంజూ శాంసన్ స్థానంలోఅండర్-19 వరల్డ్‌కప్-2026లో అతడు షోటాపర్ కాబోతున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్.. రాజస్తాన్ రాయల్స్‌లో సంజూ శాంసన్ స్థానంలో పూర్తి స్థాయి ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. వచ్చే నాలుగు నెలలు మనకు వైభవ్ జాతరే!అతడి పట్టుదల, టెంపర్మెంట్, పరుగుల దాహం.. మనకు సరికొత్త అనుభూతి పంచబోతోంది’’ అంటూ అశూ.. వైభవ్‌ను ఆకాశానికెత్తాడు. ఐపీఎల్-2026లో రాజస్తాన్ ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఈ చిచ్చరపిడుగు భర్తీ చేస్తాడని అంచనా వేశాడు. కాగా సంజూ శాంసన్‌ను రాజస్తాన్.. చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ చేసిన విషయం తెలిసిందే.ఓపెనింగ్ స్థానానికి ఎసరుఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు మరో అడుగు ముందుకు వేసి.. భారత టీ20 జట్టులోనూ సంజూ ఓపెనింగ్ స్థానానికి వైభవ్ ఎసరుపెట్టబోతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్-2026లో సత్తా చాటితేనే సంజూ స్థానం పదిలంగా ఉంటుందని పేర్కొంటున్నారు.ఒకవేళ అన్నీ కలిసివచ్చి ఈ ఏడాదే గనుక వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడితే.. క్రికెట్ దేవుడు, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలవడం ఖాయం. సచిన్ పదహారేళ్లకు టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తే.. వైభవ్ పద్నాలుగు- పదిహేనేళ్ల వయసులోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. కాగా బిహార్‌లో 2011, మార్చి 27న వైభవ్ సూర్యవంశీ జన్మించాడు.చదవండి: శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. ఒక్క పరుగు తేడాతో.. -
IPL 2026: రాజస్తాన్ రాయల్స్ ‘ఫ్యాన్స్’కి భారీ షాక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొట్టమొదటి సీజన్ విజేతగా రాజస్తాన్ రాయల్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 2008లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడిన రాజస్తాన్.. ఆ తర్వాత జైపూర్‌లోని సొంత మైదానం సవాయ్ మాన్సింగ్ స్టేడియం(SMS)లో తదుపరి మ్యాచ్ ఆడింది.సుదీర్ఘ బంధానికి వీడ్కోలుక్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచి ఈ మైదానాన్ని తమ హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న రాజస్తాన్ జట్టు.. ఇప్పుడు ఈ సుదీర్ఘ బంధానికి వీడ్కోలు పలికేందుకు సిద్ధమైంది. రెవ్‌స్పోర్ట్స్ కథనం ప్రకారం.. ఐపీఎల్-2026 సీజన్ నుంచి రాజస్తాన్ రాయల్స్ హోం గ్రౌండ్ మారనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియాన్ని తమ సొంత మైదానంగా రాయల్స్ ఎంచుకుంది.కారణం ఇదేజైపూర్లోని ‘SMS’ గ్రౌండ్లో భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవని ఇప్పటికే రాయల్స్ యాజమాన్యం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ విషయంలో వారి నుంచి సరైన స్పందన కరువైంది. ఈ సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయన్న అంశంపై కూడా సదరు అధికార వర్గాలు కచ్చితమైన సమాచారం ఇవ్వలేదట. దీంతో రాయల్స్ తమ హోం గ్రౌండ్ మార్పు గురించి తుదినిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.పుణెలోఇప్పటికే రాయల్స్ ఆపరేషన్ టీమ్ పుణెకి వెళ్లి.. అక్కడి పిచ్ పరిస్థితులు, సీటింగ్ సామర్థ్యం, ఆటగాళ్ల సౌకర్యాలు, మంచి హోటళ్లు అందుబాటులో ఉన్నాయా? లేవా?, రవాణా తదితర అంశాల గురించి పరిశీలించినట్లు సమాచారం. ఈ క్రమంలో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియాన్ని (MCA) హోం గ్రౌండ్‌గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో హోం గ్రౌండ్‌గా అసోంలోని గువాహటి యథావిధిగా కొనసాగనుంది.కాగా MCA స్టేడియంలో గతం (2016-17)లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కు సొంత మైదానంగా ఉండేది. ఇక చెన్నూ సూపర్ కింగ్స్ 2018లో తమ తాత్కాలిక సొంత మైదానంగా MCAను ఎంచుకుంది. ఆర్సీబీని ఓడించి..ఇదిలా ఉంటే.. ఈ ఏడాది రాయల్స్‌తో పాటు ఆర్సీబీ కూడా ఈ మైదానం కోసం సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే, చివరగా రాయల్స్‌కే ఇది హోం గ్రౌండ్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే SMSలో ఇన్నాళ్లు రాయల్స్ మ్యాచ్ వీక్షించిన స్థానిక ‘ఫ్యాన్స్’కు భారీ షాక్ తగిలినట్లే!!ఇక 2008లో విజేతగా నిలిచిన రాయల్స్.. మళ్లీ ఫైనల్ చేరడానికి దాదాపు పద్నాలుగేళ్లు పట్టింది. సంజూ శాంసన్ కెప్టెన్సీలో 2022లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక 2026 వేలానికి ముందే సంజూ శాంసన్‌ను చెన్నైకి ట్రేడ్ చేసిన రాయల్స్ యాజమాన్యం.. రవీంద్ర జడేజాను తమ జట్టులో చేర్చుకుంది. ఇంతవరకు తమ కెప్టెన్‌ను మాత్రం ప్రకటించలేదు.చదవండి: KKR: అతడొక ద్రోహి.. కేకేఆర్ ఇలాంటి పనిచేస్తుందా?.. బీసీసీఐ స్పందన ఇదే -
ఐపీఎల్‌కు కరీంనగర్ కుర్రాడు
కరీంనగర్ కుర్రాడు ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్‌రావును మంగళవారం అబుదాబీలో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30లక్షలకు దక్కించుకుంది. టాప్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్‌మన్ అయిన పేరాల అమన్ రావు ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, అండర్–19, అండర్–23లో గొప్ప నైపుణ్యం ప్రదర్శించారు. వేలంలో పాల్గొనేందుకు అమన్‌రావుకు పాస్‌పోర్టు లేకపోవడంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ అప్పటికప్పుడు స్పందించి పాస్‌పోర్టు జారీ చేయించారని సునీల్‌రావు తెలిపారు. మొట్టమొదటిసారిగా జిల్లాకు చెందిన కుర్రాడు ఐపీఎల్‌కు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. -
సంజూ ఎంట్రీ.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన సీఎస్కే
టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘన స్వాగతం పలికింది. అదిరిపోయే వీడియోతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తమ జట్టులోకి ఆహ్వానించింది. ఇందులో మలయాళీ డైరెక్టర్, నటుడు బాసిల్ జోసెఫ్ (Basil Joseph) కూడా కనిపించడం విశేషం.రూ. 18 కోట్లు చెల్లించిఐపీఎల్-2026 వేలానికి ముందే సీఎస్కే సంజూ శాంసన్ (Sanju Samson)ను తమ ఫ్రాంఛైజీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. రూ. 18 కోట్లు చెల్లించి మరీ రాజస్తాన్ రాయల్స్ నుంచి సంజూను సీఎస్కే సొంతం చేసుకుంది. రాయల్స్ కెప్టెన్‌ను తమ జట్టులో చేర్చుకునేందుకు.. దాదాపు పదమూడేళ్లుగా తమతో కలిసి ప్రయాణం చేస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై వదులుకుంది.వైస్ కెప్టెన్‌గా సంజూ!జడ్డూతో పాటు.. సామ్ కర్రాన్‌ను కూడా రాజస్తాన్ రాయల్స్‌కు ఇచ్చేసి.. సంజూను ట్రేడ్ చేసుకుంది సీఎస్కే. అంతేకాదు.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు డిప్యూటీగా.. వైస్ కెప్టెన్‌గా సంజూను నియమించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. ఇక సంజూకు స్వాగతం పలుకుతూ.. ‘‘చేటా ఈజ్ హియర్ (అన్న వచ్చేశాడు)’’ సీఎస్కే షేర్ చేసిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది.భారీ కటౌట్ఇందులో బాసిల్ జోసెఫ్.. ‘‘సోదరా.. సమయం వచ్చింది. పని మొదలుపెట్టండి.. ఎలాంటి తప్పిదాలు జరగకూడదు. మన వాళ్లందరినీ తీసుకురండి. సమయానికల్లా అంతా సిద్ధమైపోవాలి’’ అని చెప్పగా ఓ బృందమంతా కలిసి రాత్రీపగలు కష్టపడి సంజూ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తాయి. ఈ క్రమంలోనే సంజూ కూడా ఎల్లో జెర్సీ వేసుకుని రెడీ అయిపోతాడు. ఆఖర్లో విక్రమ్ మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సంజూ ఎంట్రీకి మరింత హైప్ ఇచ్చారు. ‘‘రావాలనుకున్నపుడే.. సరైన సమయంలోనే వచ్చా’’ అన్న క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా సంజూ శాంసన్ చాలా ఏళ్లుగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2022లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే, గతేడాది ఫిట్నెస్ సమస్యల వల్ల ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇందుకు తోడు మేనేజ్మెంట్తో విభేదాలు తలెత్తాయనే వార్తలు రాగా.. సంజూ సీఎస్కేకు మారడం గమనార్హం. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు 172 ఇన్నింగ్స్ ఆడిన సంజూ 4704 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.చదవండి: IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. వీళ్లతో మామూలుగా ఉండదు! View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
IPL 2026: ఎనిమిది మంది కెప్టెన్లు ఫిక్స్!.. మరి ఆ రెండు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్‌కు ఫ్రాంఛైజీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అట్టిపెట్టుకునే, విడిచిపెట్టిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన పది జట్లు.. వేలానికి సన్నద్ధమయ్యాయి. ఖరీదు అనుకున్న ఆటగాళ్లను ఆక్షన్‌లోకి వదిలి.. తిరిగి తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని కొన్ని ఫ్రాంఛైజీలు భావిస్తుండగా.. భారం అనుకున్న ఆటగాళ్లను మరికొన్ని ఫ్రాంఛైజీలు ట్రేడ్ చేసుకున్నాయి.జడ్డూకు బదులుగా సంజూఇక ట్రేడింగ్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాజస్తాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన ఒప్పందం హైలైట్‌గా నిలిచింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్తాన్‌కు ఇచ్చేసిన సీఎస్కే.. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌ను తమ ఫ్రాంఛైజీలోకి ఆహ్వానించింది. సంజూ రిటైన్ ధర రూ. 18 కోట్లు చెల్లించి మరీ రాజస్తాన్ నుంచి అతడిని చెన్నై ట్రేడ్ చేసుకుంది.రుతురాజ్ గైక్వాడ్‌కే ఓటుఈ నేపథ్యంలో సంజూకు సీఎస్కే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగగా.. చెన్నై మాత్రం రుతురాజ్ గైక్వాడ్‌కే ఓటు వేసింది. రిటెన్షన్, రిలీజ్ జాబితా విడుదల చేసిన వెంటనే రుతును తమ కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తాజాగా అదే బాటలో నడువగా.. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలు కూడా తమ పాత కెప్టెన్లనే 2026లోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.ఇంకా సారథిని ప్రకటించని ఆ రెండు జట్లుఅయితే, కెప్టెన్ సంజూను సీఎస్కేకు ట్రేడ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ మాత్రం కొత్త సారథి పేరును ఇంకా ప్రకటించలేదు. మరోవైపు.. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా తమ కెప్టెన్‌గా అజింక్య రహానేను కొనసాగిస్తారా? లేదా? అన్న విషయం గురించి స్పష్టతనివ్వలేదు. కాగా డిసెంబరు 16న అబుదాబి వేదికగా ఐపీఎల్-2026 మినీ వేలం జరుగనుంది.ఐపీఎల్-2026లో జట్ల కెప్టెన్లు వీరే👑చెన్నై సూపర్ కింగ్స్- రుతురాజ్ గైక్వాడ్👑సన్‌రైజర్స్ హైదరాబాద్- ప్యాట్ కమిన్స్👑గుజరాత్ టైటాన్స్- శుబ్‌మన్ గిల్👑లక్నో సూపర్ జెయింట్స్- రిషభ్ పంత్👑రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రజత్ పాటిదార్👑ఢిల్లీ క్యాపిటల్స్- అక్షర్ పటేల్👑పంజాబ్ కింగ్స్- శ్రేయస్ అయ్యర్👑ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా.చదవండి: వెంకటేశ్ అయ్యర్‌కు భారీ షాక్.. పది ఫ్రాంఛైజీలు విడిచిపెట్టిన ఆటగాళ్లు వీరే -
IPL 2026: జడేజా జెర్సీ మారింది
ముంబై: ఐపీఎల్ ‘ఫైవ్ స్టార్’ చాంపియన్లలో ఒకటైన చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) పెనుమార్పే చేసింది. గత రెండు సీజన్లుగా చెత్త ప్రదర్శనతో చతికిలబడిన ఈ జట్టు వచ్చే సీజన్‌కు ముందు పతాక శీర్షికలకెక్కే నిర్ణయం తీసుకుంది. అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను అనూహ్యంగా బదిలీ చేసేసింది. సీఎస్కే దిగ్గజ కెప్టెన్ ధోని స్వయంగా ‘సర్ రవీంద్ర జడేజా’ అంటూ నెత్తిన పెట్టుకున్న సహచరుణ్ని... టాపార్డర్ డాషింగ్ బ్యాటర్ సంజూ సామ్సన్ కోసం రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ ట్రాన్స్ఫర్ చేసింది. రాయల్స్ జడేజాను తీసుకోగా, సామ్సన్ చెన్నై చెంత చేరాడు. మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తమ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్‌ను విడుదల చేసింది. రెండుసార్లు రిటెయిన్ చేసుకున్న ఫ్రాంచైజీ ఎట్టకేలకు కరీబియన్ ఆల్‌రౌండర్‌తో 11 ఏళ్ల బంధాన్ని తెంచుకుంది. రూ.23.75 కోట్లు వేలంలో పాడి మరీ కొనుక్కొన్న వెంకటేశ్ అయ్యర్‌ను వెంటనే ఒక సీజన్‌కే సాగనంపింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వెటరన్ సీమర్ మొహహ్మద్ షమీని లక్నో సూపర్ జెయంట్స్ ట్రేడ్‌లో తీసుకుంది. మొత్తం పది ఫ్రాంచైజీల్లో అత్యధిక పర్స్ మొత్తం కోల్‌కతా వద్దే ఉంది. కేకేఆర్ పర్స్‌లో రూ. 64.30 కోట్లుండగా, 6 విదేశీ ఆటగాళ్లు సహా 13 మందిని వేలంలో కొనాలి. అత్యల్ప పర్స్ ముంబై జట్టులో ఉంది. ముంబై ఇండియన్స్ వద్ద కనీసం మూడు కోట్లయినా లేవు. చేతిలో ఉన్న రూ.2.75 కోట్లతో ఒక విదేశీ ప్లేయర్ సహా ఐదు మందిని కొనుగోలు చేయాలి. చెప్పుకోదగ్గ మార్పులు చెన్నై ఒక్క జడేజాతో సరిపెట్టలేదు. విదేశీ స్టార్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, స్యామ్ కరన్లాంటి హిట్టర్లతో పాటు ‘యార్కర్ స్పెషలిస్ట్’ పతిరణను వదులుకుంది. కేకేఆర్ రసెల్, అయ్యర్, డికాక్, మొయిన్ అలీలాంటి బ్యాటర్లతో పాటు సఫారీ పేసర్ నోర్జేని సాగనంపింది. పంజాబ్ కింగ్స్ మేటి విదేశీ హిట్టర్లను విడుదల చేసింది. మ్యాక్స్‌వెల్, ఇన్గ్లిస్లను వదిలేసుకుంది. తొలి సీజన్ చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ తమ తురుపుముక్క, నాలుగు సీజన్లు జట్టును నడిపించిన సంజూ సామ్సన్‌నే కాదు హసరంగ, తీక్షణ, నితీశ్ రాణాలను వద్దనుకుంది. భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను వేలంలో ఏ జట్టు కన్నెత్తి చూడకపోయినా ప్రాథమిక ధరకే కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ ఈసారి అర్జున్ను లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడింగ్‌లో కొనేందుకు సమ్మతించింది.పాత గూటికి... సీఎస్కేతో జడేజా బంధం సుదీర్ఘమైందే కానీ... మొదలైంది మాత్రం రాజస్తాన్ రాయల్స్‌తోనే! లీగ్ మొదలైన ఏడాదే (2008) తొలి చాంపియన్‌గా నిలిచిన రాయల్స్ జట్టు సభ్యుడు జడేజా ఆ మరుసటి ఏడాది కూడా రాజస్తాన్తోనే ఉన్నాడు. కానీ కాంట్రాక్టు ఒప్పందం ఉల్లంఘన కారణంతో 2010లో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతనిపై ఏడాది నిషేధం విధించింది. 2011లో కొత్తగా వచ్చిన ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ కేరళ (ఇప్పుడు లేదు)కు ఆడాడు. 2012 నుంచి ఈ సీజన్ వరకు మధ్యలో రెండేళ్లు (2016, 2017లో సీఎస్కేపై నిషేధం కారణంగా గుజరాత్ లయన్స్) తప్ప సూపర్‌కింగ్స్‌లో విజయవంతమైన ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు.ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాచెన్నై: రవీంద్ర జడేజా, ఆండ్రీ సిద్ధార్్థ, దీపక్ హుడా, కాన్వే, రచిన్ రవీంద్ర, పతిరణ, స్యామ్ కరన్, కమలేశ్ నాగర్కోటి, రాహుల్ త్రిపాఠి, షేక్ రషీద్, వంశ్ బేడీ, విజయ్ శంకర్. ఢిల్లీ: డొనోవాన్ ఫెరీరా, దర్శన్, డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్, మన్వంత్, మోహిత్ శర్మ, సిద్దీఖుల్లా. గుజరాత్: రూథర్‌ఫర్డ్, షనక, కొయెట్జీ, కరీమ్, కుల్వంత్, మహిపాల్ లామ్రోర్. కోల్‌కతా: రసెల్, వెంకటేశ్ అయ్యర్, నోర్జే, చేతన్ సకారియా, సిసోడియా, మొయిన్ అలీ, డికాక్, గుర్బాజ్, జాన్సన్. లక్నో: శార్దుల్ ఠాకూర్, డేవిడ్ మిల్లర్, రవి బిష్ణోయ్, ఆకాశ్‌దీప్, షామర్ జోసెఫ్, ఆర్యన్, యువరాజ్, రాజ్యవర్ధన్. ముంబై: అర్జున్ టెండూల్కర్, జాకబ్స్, కరణ్ శర్మ, లిజాద్, ముజీబుర్ రహ్మాన్, టోప్లీ, శ్రీజిత్, సత్యనారాయణ రాజు, విఘ్నేశ్. పంజాబ్: మ్యాక్స్‌వెల్, ఇన్‌గ్లిస్, ఆరోన్, జేమీసన్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే. రాజస్తాన్: సామ్సన్, నితీశ్ రాణా, ఆకాశ్, అశోక్, ఫజల్హక్, కార్తీకేయ, కునాల్ రాథోడ్, తీక్షణ, హసరంగ. బెంగళూరు: లివింగ్‌స్టోన్, ఇన్‌గిడి, మయాంక్ అగర్వాల్, మనోజ్, స్వస్తిక్ చికారా, మోహిత్ రాఠి. హైదరాబాద్: షమీ, అథర్వ, సచిన్ బేబీ, అభినవ్ మనోహర్, ముల్డర్, ఆడమ్ జంపా, సిమర్జీత్, రాహుల్ చహర్. -
అందుకే రాజస్తాన్‌ను వీడాను: సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీ ట్రేడ్ డీల్స్ పూర్తి చేసుకున్నాయి. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసేందుకు శనివారమే (నవంబరు 15) ఆఖరి తేదీ కావడంతో తాము ట్రేడ్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడిస్తున్నాయి.జడ్డూ అటు.. సంజూ ఇటుఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాజస్తాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన భారీ ట్రేడ్ వార్తల్లో నిలిచింది. ముందుగా ఊహించినట్లే సీఎస్కే.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను.. రాజస్తాన్‌కు ఇచ్చేసి.. ఆ జట్టు సారథి సంజూ శాంసన్‌ను తమ చెంతకు చేర్చుకుంది.ధరలో మార్పుఅయితే, ఈ ఒప్పందంలో భాగంగా సీఎస్కే సంజూకు రాజస్తాన్ గతంలో చెల్లించిన మొత్తాన్ని ఇచ్చి రూ. 18 కోట్లకు తీసుకోగా.. రాజస్తాన్ మాత్రం జడ్డూ ధరను రూ. 18 కోట్ల నుంచి రూ. 14 కోట్లకు తగ్గించింది. జడ్డూతో పాటు సామ్ కర్రన్ (రూ. 2.4 కోట్లు)ను కూడా సీఎస్కే నుంచి తీసుకుంది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్‌ను వీడిన నేపథ్యంలో సంజూ శాంసన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. సమయం వచ్చింది గనుకే తాను జట్టును వీడానంటూ అతడు స్పష్టతనిచ్చాడు.నా సర్వస్వం ధారబోశానుఈ మేరకు.. ‘‘మనం ఇక్కడ (ప్రపంచంలో) కొన్నాళ్ల పాటే ఉంటాము. ఫ్రాంఛైజీ కోసం నా సర్వస్వం ధారబోశాను. క్రికెట్‌ను గొప్పగా ఆస్వాదించాను. జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, బంధాలు పోగు చేసుకున్నాను. ఫ్రాంఛైజీలోని ప్రతి ఒక్కరిని నా కుటుంబ సభ్యుడిగానే భావించాను. ఇప్పుడు సమయం వచ్చింది.. అందుకే నేను ఈ జట్టును వీడి వెళ్తున్నా.నాకు ఇక్కడ లభించిన దానికి నేను ఎల్లప్పుడూ రుణపడే ఉంటాను’’ అంటూ సంజూ శాంసన్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా రాయల్స్‌తో చేరిన తొలి నాళ్లలో దిగిన ఫొటోను సంజూ షేర్ చేశాడు. కాగా 2013లో రాజస్తాన్ రాయల్స్ జట్టులో చేరిన కేరళ స్టార్ సంజూ.. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారాడు. రెండేళ్లు అదే జట్టుకు ఆడాడు.ఫైనల్‌కు చేర్చిన సారథిఆ తర్వాత మళ్లీ 2018లో రాయల్స్‌లోకి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 2025 వరకు జట్టుతో కొనసాగాడు. కెప్టెన్‌గా రాజస్తాన్‌ను ముందుకు నడిపించిన సంజూ 2022 సీజన్లో ఫైనల్‌కు చేర్చాడు. అయితే, గుజరాత్ టైటాన్స్‌తో టైటిల్ పోరులో ఓడిన రాజస్తాన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 176 మ్యాచ్‌లు ఆడిన సంజూ.. 4704 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు ఉండటం విశేషం.చదవండి: IPL 2026: సచిన్ తనయుడికి ముంబై ఇండియన్స్ షాక్ -
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు..!
ఐపీఎల్ 2026కి ముందు సంచలన ట్రేడ్ డీల్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను దక్కించుకునేందుకు ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌ను వదులుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఫార్మాలిటీస్ కూడా పూర్తైనట్లు సమాచారం. డీల్‌లో భాగంగా సంజూ సీఎస్కేలో చేరేందుకు.. జడేజా, కర్రన్ రాయల్స్‌లో తరఫున ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారట.అయితే చివరి నిమిషంలో రవీంద్ర జడేజా ఓ మెలిక పెట్టినట్లు ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి. రాయల్స్‌లో చేరితే తనకు కెప్టెన్సీ ఇవ్వాలని జడ్డూ కండీషన్ పెట్టాడట. ఇందుకు రాయల్స్ యాజమాన్యంలోని కొందరు అంగీకరించినప్పటికీ.. ఓ కీలక వ్యక్తి అడ్డు పడినట్లు సమాచారం.సంజూ ఫ్రాంచైజీని వీడాలనుకున్నప్పుడు సదరు వ్యక్తి అప్పటికే జట్టులో ఉన్న ఇద్దరి పేర్లను కెప్టెన్సీ కోసం పరిశీలిస్తానని మాట ఇచ్చాడట. ఇప్పుడు కొత్తగా జడ్డూ కెప్టెన్సీ కోసం డిమాండ్ చేయడంతో యాజమాన్యంలో భేదాభిప్రాయాలు వచ్చాయని సమాచారం. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే సీఎస్కేతో ట్రేడ్ డీల్ క్యాన్సల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా, సంజూ రాయల్స్‌ను వీడే విషయం ఖరారైన తర్వాత యాజమాన్యం ధృవ్ జురెల్, యశస్వి జైస్వాల్ పేర్లను కెప్టెన్సీ కోసం పరిశీలిస్తుంది. గత సీజన్లో సంజూ గైర్హాజరీలో రియాన్ పరాగ్ నాయకుడిగా వ్యవహరించినా.. అతని పేరు ప్రస్తావనకు రాలేదు. కొత్తగా జడేజా పేరు తెరపైకి రావడంతో రాయల్స్ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఐపీఎల్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.జడ్డూ ప్రొఫైల్‌ని బట్టి చూస్తే.. రాయల్స్ కెప్టెన్‌గా నియమించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అతని ఐపీఎల్ కెరీర్ ఈ ఫ్రాంచైజీతోనే మొదలైంది. అతనికి ఐపీఎల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. పైగా ఇటీవలికాలంలో అతను టీమిండియా విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు.సంజూ విషయానికొస్తే.. డీల్ కుదిరి అతను సీఎస్కేలో చేరినా కెప్టెన్సీ దక్కే అవకాశం మాత్రం లేదు. సీఎస్కేలో సంజూ సాధారణ ఆటగాడిగా కొనసాగాల్సి ఉంటుంది. రుతురాజ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే యోచనలో సీఎస్కే యాజమాన్యం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. పై విషయాలపై క్లారిటీ రావాలంటే నవంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజులోపు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంది. చదవండి: ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ -
రాజస్తాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా అతడే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్‌తో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson) బంధం ముగిసినట్లు తెలుస్తోంది. పదకొండు సీజన్లుగా రాజస్తాన్ జట్టుతో కొనసాగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. కెప్టెన్‌గానూ సేవలు అందించాడు.ఐపీఎల్లో మొట్టమొదటి విజేత అయిన రాజస్తాన్‌ను.. పద్నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన సారథ్యంలో రెండోసారి ఫైనల్ (2022)కు చేర్చాడు సంజూ. అయితే దురదృష్టవశాత్తూ గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో ఓడిపోవడంతో రాజస్తాన్‌తో పాటు కెప్టెన్‌గా కప్పు గెలవాలన్న సంజూ ఆశలకు గండిపడింది.యాజమాన్యంతో విభేదాలుకాగా గత కొంతకాలంగా సంజూకు.. రాజస్తాన్ జట్టు యాజమాన్యంతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 వేలానికి ముందే ట్రేడింగ్ ద్వారా జట్టు మారేందుకు సంజూ నిశ్చియించుకున్నాడనే ప్రచారం తాజాగా జోరందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సంజూను రాజస్తాన్ నుంచి ట్రేడింగ్ (స్వాప్ డీల్) ద్వారా దక్కించుకోవడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను రాజస్తాన్‌కు ఇచ్చి.. అందుకు బదులుగా సంజూను సీఎస్కే దక్కించుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. రాజస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. రియాన్ పరాగ్ కాదు!కాగా సంజూ గైర్హాజరీలో అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ జట్టును ముందుకు నడిపించాడు. ఐపీఎల్-2025లో సంజూ ఫిట్నెస్ సమస్యల వల్ల కెప్టెన్సీని దూరంగా ఉండగా.. పరాగ్ సారథిగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.ఈసారి రాజస్తాన్ మరీ దారుణంగా పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పరాగ్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా... టీమిండియా నయా సంచలనం ధ్రువ్ జురెల్ పేరు తెర మీదకు వచ్చింది.కెప్టెన్సీ రేసులో ఇద్దరురూ. 20 లక్షల కనీస ధరతో రాజస్తాన్ క్యాంపులోకి వచ్చిన జురెల్ అనతికాలంలోనే.. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ క్రమంలోనే అతడిని ఫ్రాంఛైజీ రూ. 14 కోట్ల భారీ మొత్తానికి గతేడాది రిటైన్ చేసుకుంది. గత కొంతకాలంగా అతడు సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియాలోనూ కీలక సభ్యుడిగా మారాడు.అంతేకాదు.. అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా జురెల్‌కు ఉంది. అదే విధంగా.. అండర్-19 స్థాయిలో 2020 వరల్డ్‌కప్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గానూ జురెల్ సేవలు అందించాడు. ఇక యూపీ టీ20 లీగ్‌లో గోరఖ్‌పూర్ లయన్స్ జట్టుకు సారథి కూడా జురెలే!ఈ నేపథ్యంలో పరాగ్‌ను కాదని.. మేనేజ్మెంట్ జురెల్ వైపే మొగ్గుచూపుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, మరికొందరు విశ్లేషకులు మాత్రం టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్కే రాజస్తాన్ పగ్గాలు అప్పగిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.కాగా 2020లో రాజస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన జైస్వాల్.. ఇప్పటికి 66 మ్యాచ్‌లలో కలిపి 2166 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ ఖాతాలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే, 23 ఏళ్ల జైసూకు ఏ స్థాయిలోనూ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం మాత్రం లేదు. అయితే, అతడి అవకాశాలను మాత్రం కొట్టిపడేయలేము.రాయల్స్ కొత్త కెప్టెన్‌గా అతడే!రాజస్తాన్ రాయల్స్ కొత్త హెడ్‌కోచ్ కుమార్ సంగక్కర.. జురెల్‌తో పాటు జైస్వాల్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడని చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొనడం గమనార్హం. అయితే, ఇంపాక్ట్ రూల్ ప్రకారం ఓపెనర్‌గా జైసూకు ప్రత్యామ్నాయం ఉంటుంది. కానీ వికెట్ కీపర్‌గా 24 ఏళ్ల జురెల్ కొనసాగుతాడు! కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్‌లో తప్పకుండా ఉంటాడు. అందుకే అతడికే కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’ -
సీఎస్కే కెప్టెన్‌గా సంజూ శాంసన్..! రాజస్తాన్‌లోకి జడేజా?
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య సంచలన ట్రేడ్ డీల్ జరగనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ సంజూ శాంస్న్ను రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు సీఎస్కే సిద్దమైనట్లు సమాచారం.ఐపీఎల్-2025 నుంచి శాంసన్, రాయల్స్ మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో రాజస్తాన్ ఫ్రాంచైజీని వీడాలని సంజూ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులోకి తీసుకోవాలని భావించింది. కానీ రాజస్తాన్, ఢిల్లీ మధ్య ట్రేడ్ డీల్ కుదరకపోయినట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు సీఎస్కే ఎంట్రీ ఇచ్చింది. సంజూ శాంసన్‌కు బదులుగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఇచ్చేందుకు సీఎస్కే ప్రాంఛైజీ అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ అందుకు రాజస్తాన్ ఒప్పుకోలేదంట. జడేజాతో పాటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను కూడా ఇవ్వాలని రాయల్స్ యాజమాన్యం డిమాండ్ చేసింది.అందుకు సీఎస్కే కూడా అంగీకరించింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే రాజస్తాన్ తమ మనసు మార్చుకుంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్రకారం.. రాజస్తాన్ ఇప్పుడు బ్రెవిస్‌ను కాకుండా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను జడేజాతో పాటు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.రాజస్తాన్ మాస్టర్ ప్లాన్..ఒకే దెబ్బకు ఇద్దరు వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్లను సొంతం చేసుకోవాలని రాజస్తాన్ ప్లాన్ చేసింది. అయితే అందుకోసం సీఎస్కే రూ. 2.40 కోట్లు చెల్లాంచాల్సి ఉంటుంది. శాంసన్, జడేజా ఇద్దరూ జీతం కూడా రూ. 18 కోట్లే. కాబట్టి ఇది సరిసమాన ట్రేడ్(స్వాప్ డీల్) అవుతోంది. కానీ కుర్రాన్ సీఎస్కే నుంచి రూ. 2.40 కోట్లు అందుకుంటున్నాడు. దీంతో ఆ మొత్తాన్ని రాజస్తాన్ సీఎస్కే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీఎస్కే-రాజస్తాన్ మధ్య డీల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. అంతేకాకుండా సీఎస్కే యాజమాన్యం తమ జట్టు పగ్గాలను శాంసన్‌కు అప్పగించే యోచనలో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇక ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ ఆఖరిలో జరిగే ఛాన్స్ ఉంది. ఆయా ఫ్రాంచైజీలు నవంబర్ 15 లోపు తమ రిటెన్షన్ జాబితాను బీసీసీఐ సమర్పించాల్సి ఉంది.ఐపీఎల్ చరిత్రలో భారీ ట్రేడ్ డీల్స్ ఇవే..కామెరూన్ గ్రీన్-2024 సీజన్- ముంబై ఇండియన్స్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ. 17.5 కోట్లుహార్దిక్ పాండ్యా- 2024 సీజన్- గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ (MI)-రూ. 17.5 కోట్లుశిఖర్ ధావన్- 2019 సీజన్- సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ (DC)- రూ. 12.5 కోట్లుచదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వరల్డ్ కప్ ట్రోఫీనా? -
ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంజూ శాంసన్..!
ఐపీఎల్ 2026 వేలానికి ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీని వీడనున్నాడా? అంటే అవునానే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. రాజస్తాన్ నుంచి శాంసన్‌ను ట్రేడ్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్ నుంచి రాయల్స్, సంజు శాంసన్ మధ్య విభేదాలు తలెత్తాయి.దీంతో సంజూను రాజస్తాన్ మెనెజ్‌మెంట్ విడిచిపెట్టేందుకు ఆసక్తిగా ఉందంట. ప్రస్తుతం కెప్టెన్‌గా ఉన్న శాంసన్ సైతం రాజస్తాన్ నుంచి బయటకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. వచ్చే సీజన్లో శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నట్లు సమాచారం.రాజస్తాన్‌లోకి స్టబ్స్..రాజస్తాన్ ఫ్రాంచైజీ శాంసన్‌కు బదులుగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను ఇవ్వాలని ఢిల్లీని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు ఢిల్లీ యాజమాన్యం ఒప్పుకోలేదని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కానీ రాహుల్‌కు బదులుగా దక్షిణాఫ్రికా బ్యాటర్ అయిన ట్రిస్టన్ స్టబ్స్‌ను ఇచ్చేందుకు తాము సిద్దమని ఢిల్లీ తెలిపినట్లు తెలుస్తోంది. అందుకు రాజస్తాన్ అంగీకరించినట్లు వినికిడి. స్టబ్స్‌తో పాటు ఓ అన్క్యాప్డ్ భారత ఆటగాడిని పంపమని ఆర్ఆర్ కోరిందంట.ఎందుంకంటే సంజు శాంసన్ ధర రూ.18 కోట్లు కాగా, స్టబ్స్ విలువ రూ.10 కోట్లు. ఎనిమిది కోట్లు వ్యత్యాసం రావడంతో ఓ అన్క్యాప్డ్ ఆటగాడిని తీసుకోవాలని రాజస్తాన్ భావిస్తోంది. ఆర్ఆర్కు మంచి ఫినిషర్ లేని లోటును స్టబ్స్ తీర్చగలడు. ఒకవేళ అన్క్యాప్డ్ ఆటగాడిని ఢిల్లీ ట్రేడ్ చేయకపోతే, మిగిలిన మొత్తాన్ని (సుమారు రూ.8 కోట్లు) రాజస్తాన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఐపీఎల్-2026 వేలంలో రాజస్తాన్ పర్స్ విలువ పెరుగుతుంది. కాగా సంజూ శాంసన్ తన ఐపీఎల్ అరంగేట్రం ఢిల్లీ క్యాపిటల్స్(అప్పటిలో ఢిల్లీ డేర్‌డేవిల్స్) తరపునే చేశాడు. -
‘వైభవ్ సూర్యవంశీ గురించి ఆ మాట అస్సలు నమ్మను’
భారత్‌తో పాటు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఓ సంచలనం. పదమూడేళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ. 1.10 కోట్లకు అమ్ముడు పోయిన ఈ బిహారీ పిల్లాడు.. పద్నాలుగేళ్ల వయసులోనే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్.. కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టి అతిపిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత భారత అండర్-19 క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సత్తా చాటాడు.బిహార్ జట్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ఇక వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. బిహార్ జట్టు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేసిన వైభవ్.. ప్లేట్ గ్రూప్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో విఫలమయ్యాడు.టీ20 తరహాలో చెలరేగి.. నిరాశపరిచిరంజీలోనూ టీ20 తరహా విధ్వంసకర బ్యాటింగ్‌కు దిగిన వైభవ్.. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ యాబ్ నియా బౌలింగ్‌లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది.. ఆ వెంటనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తద్వారా ఐదు బంతుల్లో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆశ్చర్యపోయాఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా తెరమీదకు వచ్చాయి. టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నిజంగా నేను ఆశ్చర్యపోయా. జైపూర్‌లో కామెంట్రీ చేస్తున్నా.నాలుగో ఓవర్లో లైవ్‌లోకి వెళ్లా. అయితే, ఆ సమయంలో మాకు ఓ కామెంటేటర్ తక్కువగా ఉన్నారు. తొమ్మిది, పదో ఓవర్.. అప్పుడే వైభవ్ సెంచరీ చేశాడు. తనదైన శైలిలో శతక్కొట్టేశాడు. మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి మేటి బౌలర్లను చితక్కొడుతూ.. ఎక్స్ట్రా కవర్, మిడ్ వికెట్ మీదుగా షాట్లు బాదాడు.అతడి వయసు పద్నాలుగే అంటే నమ్మనుఆ సమయంలో హైడోస్ (మాథ్యూ హెడెన్) అక్కడే ఉన్నాడు. అప్పుడు తను.. ‘ఓహ్.. అతడి వయసు పద్నాలుగే అంటే నేను అస్సలు నమ్మను’ అంటూ ఎగ్జైట్ అయ్యాడు. ఇందుకు నేను బదులిస్తూ.. ‘కమాన్.. కామ్‌డౌన్’ అన్నాను’’ అంటూ విల్లో టాక్ షోలో రవిశాస్త్రి పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.చదవండి: అతడు టీమిండియాకు ఆడనే లేదా?.. నేను సెలక్టర్‌నే.. నువ్వు చైర్మన్‌వి కదా! -
రాజస్థాన్ రాయల్స్‌కు మరో బిగ్ షాక్
తదుపరి ఐపీఎల్ సీజన్ (2026) ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి నుంచే మార్పులు చేర్పుల ప్రక్రియ మొదలుపెట్టింది. తొలుత కెప్టెన్ సంజూ శాంసన్ ఫ్రాంచైజీ వీడతాడని అనుకున్నా.. అతని కంటే ముందే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. తాజాగా రాయల్స్‌కు మరో కీలక వ్యక్తి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది.ఆ ఫ్రాంచైజీ CEO జేక్ లష్ మెక్‌క్రమ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. వచ్చే నెలలో అతను అధికారికంగా వైదొలగనున్నట్లు తెలుస్తుంది. జోహన్నెస్‌బర్గ్‌లో నిన్న (సెప్టెంబర్ 9) జరిగిన SA20 వేలంలో రాజస్థాన్ రాయల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన Paarl Royals టేబుల్ వద్ద జేక్ కనిపించలేదు. జేక్ 2021లో కేవలం 28 ఏళ్ల వయసులో రాయల్స్ CEOగా బాధ్యతలు చేపట్టి వార్తల్లో నిలిచాడు. కాగా, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం గత సీజన్ పేలవ ప్రదర్శన అనంతరం ఫ్రాంచైజీలో సమూల ప్రక్షాళన చేపట్టాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే కీలక పదవుల్లో వారికి పొమ్మనలేక పొగ పెట్టింది. ఈ క్రమంలో తొలుత ఫ్రాంచైజీ మార్కెటింగ్ హెడ్, ఆతర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, తాజాగా సీఈఓ నిష్క్రమణ జరిగాయి.త్వరలో కెప్టెన్ సంజూ శాంసన్ కూడా రాయల్స్‌కు గుడ్ బై చెప్పడం దాదాపుగా ఖరారైంది. రాయల్స్ యాజమాన్యం ఇంత మంది తప్పిస్తున్నా, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న కుమార సంగక్కరను మాత్రం కొనసాగించనున్నట్లు తెలుస్తుంది. రాయల్స్ 2025 సీజన్లో 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.గత సీజన్లో ఆ జట్టు తరఫున అద్బుతమైన ప్రదర్శనలు నమోదైనా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. చాలావరకు గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఒత్తిడిలోనై పరాజయాలపాలైంది. గత సీజన్లో రాయల్స్‌కు వైభవ్ సూర్యవంశీ రూపంలో ఆణిముత్యం దొరికాడు. వైభవ్ గత సీజన్లో ఎలా పేట్రేగిపోయాడో అందరం చూశాం. -
సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?: రాజస్తాన్ రాయల్స్ స్టార్
రాజస్తాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మ (Sandeep Sharma) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా రాణించినంత ఉన్నంత మాత్రాన.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను టీమిండియా సారథిని చేయాల్సిన అవసరం లేదన్నాడు. సెన్స్‌లేని వాళ్లే అతడిని కెప్టెన్‌ను చేయాలని మాట్లాడతారని పేర్కొన్నాడు.పరుగుల వరద.. అయినా కనికరించని సెలక్టర్లుకాగా దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించాడు ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. గతేడాది ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)ను విజేతగా నిలిపిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వచ్చి.. జట్టును ఫైనల్‌కు చేర్చాడు.అంతేకాదు బ్యాటర్‌గానూ శ్రేయస్ అయ్యర్ మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. అయినప్పటికీ ఆసియా కప్-2025 టోర్నీకి ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. దాదాపు ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న శుబ్‌మన్ గిల్‌ను పిలిపించిన బీసీసీఐ.. అతడికి మరోసారి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది.శ్రేయస్‌ను కెప్టెన్ చేయాలి ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ అన్యాయం చేస్తోందనే విమర్శలు వచ్చాయి. ఓ ఆటగాడిగా తాను చేయాల్సిందింతా చేసినా అయ్యర్‌ను పక్కనపెట్టడం సరికాదని మాజీ క్రికెటర్లు సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరికొంత మంది టీమిండియా టీ20 భవిష్య కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ సరైనోడని అభిప్రాయపడ్డారు.సెన్స్ ఉందా?.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఏంటి?ఈ విషయంపై రాజస్తాన్ రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ తాజాగా స్పందించాడు. క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐకి సొంత డొమెస్టిక్ లీగ్ ఉంది కదా!.. ఎంతో మంది అక్కడ ఆడుతూ ఉంటారు. అయితే, అంతర్జాతీయ స్థాయి జట్టును ఎంపిక చేసినపుడు కేవలం 15 మంది పేర్లనే పరిగణనలోకి తీసుకుంటారు.ఆ పదిహేను మందిని మేనేజ్ చేయగల ఆటగాడినే కెప్టెన్‌గా ఎంపిక చేస్తారు. ఇక ఇక్కడ.. అంటే ఐపీఎల్లో చాలా మంది దేశీ క్రికెటర్లతో పాటు.. యువకులు, విదేశీ ప్లేయర్లు ఉంటారు. ఇక్కడ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం వేరు.టీమిండియాను మేనేజ్ చేయగల వ్యక్తి మాత్రమే మంచి కెప్టెన్ అవుతాడు. మరి ఈ చర్చ ఎందుకు? ఇలాంటివి సెన్స్‌లెస్ అని అనిపిస్తుంది. ఓ ఆటగాడు ఐపీఎల్లో కెప్టెన్‌గా రాణిస్తే.. టీమిండియా కెప్టెన్ అయిపోలేడు’’ అని సందీప్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.రెండే మ్యాచ్‌లు.. ఒక వికెట్‌కాగా చాలా మంది ఆటగాళ్లలాగే.. పంజాబ్‌కు చెందిన సందీప్ శర్మ కూడా ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. 2015లో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అడుగుపెట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కేవలం రెండు మ్యాచ్‌లు ఆడి ఒక వికెట్ మాత్రమే తీశాడు. కానీ ఐపీఎల్లో ఆడితే టీమిండియాలోకి రావడం అంతతేలిక కాదంటూ సందీప్ వ్యాఖ్యానించడం విశేషం. లీగ్ క్రికెట్ జట్టుకు, అంతర్జాతీయ జట్టుకు తేడా ఉంటుందని.. శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్ చేయాలనడం సరికాదంటూ అభిప్రాయపడటం గమనార్హం.చదవండి: రూ. 4 వేల కోట్ల ప్యాలెస్.. 560 కిలోల బంగారం, వెండి రైలు, రథం.. ఇంకా.. -
రాజస్థాన్ రాయల్స్ కు బిగ్ షాక్..! ద్రవిడ్ గుడ్ బై
-
రాజస్తాన్ రాయల్స్ కీలక ప్రకటన.. ద్రవిడ్ గుడ్‌బై
ఐపీఎల్-2026 (IPL 2026) టోర్నమెంట్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ కీలక ప్రకటన విడుదల చేసింది. తమ జట్టు హెడ్‌కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తప్పుకొంటున్నట్లు తెలిపింది. రాహుల్‌కు ధన్యవాదాలుఈ మేరకు.. ‘‘ఎన్నో ఏళ్లుగా రాయల్స్ ప్రయాణంలో రాహుల్ భాగంగా ఉన్నారు. ఆయన నాయకత్వం, అనుభవం యువ ఆటగాళ్లను ఎంతగానో ప్రభావితం చేశాయి. జట్టును విలువలతో కూడినదిగా.. పటిష్టంగా మార్చడంలో ఆయన ముద్ర ఉంది.కోచ్‌గా ఈ ఫ్రాంఛైజీ మీద రాహుల్ బలమైన ముద్ర వేశారు. జట్టు నిర్మాణంలో భాగంగా రాహుల్‌కు మరో పదవిని ఫ్రాంఛైజీ ఆఫర్ చేసింది. కానీ ఆయన దానిని స్వీకరించేందుకు సిద్ధంగా లేరు.రాజస్తాన్ రాయల్స్, మా జట్టు ఆటగాళ్లు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది రాయల్స్ అభిమానుల తరఫున రాహుల్‌కు ధన్యవాదాలు. ఈ ఫ్రాంఛైజీ కోసం ఎనలేని సేవలు అందించిన రాహుల్‌కు కృతజ్ఞతలు’’ అంటూ రాజస్తాన్ రాయల్స్ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.కెప్టెన్‌గానూ...ఐపీఎల్లో 2012, 2013 సీజన్లలో రాహుల్ ద్రవిడ్ రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా పనిచేశాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం అదే ఫ్రాంఛైజీకి రెండేళ్లు మెంటార్‌నూ వ్యవహరించాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో జట్టు కట్టిన ద్రవిడ్.. అనంతరం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా వెళ్లడంతో క్యాష్ రిచ్ లీగ్‌కు దూరమయ్యాడు.ప్రధాన కోచ్గాఈ క్రమంలోనే టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. 2024లో భారత్‌ను టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం హెడ్‌కోచ్ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్న ద్రవిడ్.. ఈ ఏడాది రాజస్తాన్ రాయల్స్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.అయితే, ద్రవిడ్ మార్గదర్శనంలో రాయల్స్ ఈసారి అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.సంజూ- ద్రవిడ్ మధ్య విభేదాలు?కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్నెస్ సమస్యల కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడం.. అతడి స్థానంలో వచ్చిన రియాన్ పరాగ్ సారథిగా సక్సెస్ కాకపోవడం తీవ్ర ప్రభావం చూపాయి. అంతేకాదు.. సంజూ- ద్రవిడ్ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే సంజూ రాయల్స్‌ను వీడి వేరే ఫ్రాంఛైజీలో చేరనున్నాడనే వదంతులు పుట్టుకొచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో ద్రవిడ్ తన పదవి నుంచి వైదొలగడం గమనార్హం. తాము ఆఫర్ చేసిన పదవిని ద్రవిడ్ కాదన్నాడని.. అందుకే తప్పుకొన్నాడని రాయల్స్ స్వయంగా చెప్పడం విశేషం.చదవండి: 'నా కెరీర్లో సెహ్వాగ్ త్యాగం మరువలేనిది.. ఎప్పుడూ రుణపడి ఉంటా' -
ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభ వేడక.. ప్రత్యేక ఆకర్షణగా వైభవ్ సూర్యవంశీ
ప్రో కబడ్డీ లీగ్ (PKL) సీజన్ 12 నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇవాళ (ఆగస్టు 29) ఘనంగా ప్రారంభమైంది. వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేడుకకు భారత క్రికెట్ యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు.Vaibhav Sooryavanshi is all set for tonight’s PKL opening clash on National Sports Day! 💪🏽🔥 pic.twitter.com/ypXp0JcWRB— Johns. (@CricCrazyJohns) August 29, 2025ఇవాళ సాయంత్రమే వైభవ్ విశాఖ నగరానికి చేరుకున్నాడు. నిర్వహకులు అతడికి ఘన స్వాగతం పలికారు. వేడక ప్రారంభానికి ముందు వైభవ్ కాసేపు కబడ్డీ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత కొద్ది సేపు కబడ్డీ కూడా ఆడాడు. అనంతరం వైభవ్ చేతుల మీదుగా ఈవెంట్ లాంచ్ అయ్యింది. View this post on Instagram A post shared by Pro Kabaddi (@prokabaddi)ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ.. క్రీడలు మనకు క్రమశిక్షణ, టీమ్‌వర్క్ నేర్పిస్తాయి. నేషనల్ స్పోర్ట్స్ డే నాకు స్పూర్తిదాయకం అని వ్యాఖ్యానించాడు. ఈ వేడుకలో కబడ్డీ దిగ్గజం పర్దీప్ నర్వాల్‌కు (డుబ్కీ కింగ్) ప్రత్యేక సన్మానం జరిగింది. డుబ్కీ కింగ్ PKL చరిత్రలో అత్యధిక రైడ్ పాయింట్లు (1801) సాధించిన ఆటగాడు.సిక్సర్ల వీరుడు వైభవ్ సూర్యవంశీ, కబడ్డీ కింగ్ పర్దీప్ నర్వాల్‌ను ఒకే వేదికపై కనిపించడంతో క్రికెట్, కబడ్డీ అభిమానులు చాలా ఎంజాయ్ చేశారు. అతి చిన్న వయసులోనే వైభవ్ కబడ్డీని ప్రమోట్ చేయడం చాలామందికి నచ్చింది. వైభవ్‌ను చూసేందుకు విశాఖ వాసులు ఎగబడ్డారు. 8 గంటలకు ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ పోటీపడుతున్నాయి. అనంతరం 9 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, పుణేరీ పల్టన్ తలపడతాయి.ఈ సీజన్లో టైబ్రేకర్ విధానం, ప్లే-ఇన్ దశ, నాలుగు నగరాల్లో మ్యాచ్‌లు వంటి కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి.వైభవ్ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో సంచలనాలు సృష్టించి, క్రికెట్‌తో పాటు యావత్ క్రీడా ప్రపంచాన్నంతా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విషయం తెలిసిందే. 2025 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 101 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ సీజన్ మొత్తం మెరుపులు మెరిపించిన వైభవ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు. -
ప్రో కబడ్డీ లీగ్‌ను ప్రారంభించనున్న భారత క్రికెట్ యువ సంచలనం
ప్రో కబడ్డీ లీగ్ (PKL) సీజన్ 12 ఆగస్టు 29న వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఆరంభ వేడుకలో భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు. వైభవ్ చేతల మీదుగా ఈ కబడ్డీ పండుగ లాంచ్ కానుంది.ఈ వేడుకలో కబడ్డీ దిగ్గజం పర్దీప్ నర్వాల్‌కు (డుబ్కీ కింగ్) ప్రత్యేక సన్మానం జరగనుంది. PKL చరిత్రలో అత్యధిక రైడ్ పాయింట్లు (1801) సాధించిన నర్వాల్.. తన ఆటతీరుతో కబడ్డీకి కొత్త ఒరవడి తీసుకొచ్చాడు. అతని సేవలకు గుర్తుగా ప్రారంభ వేడుకలో ఘనంగా సత్కరించనున్నారు.ఈ వేడుకలు ఆగస్టు 29వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. రైడర్ల జంప్లా, ఈ వేడుకపై అభిమానుల అంచనాలు కూడా అంబారాన్ని అంటుతున్నాయి. వైభవ్ సూర్యవంశీ, పర్దీప్ నర్వాల్‌ను ఒకే వేదికపై చూసేందుకు క్రికెట్, కబడ్డీ అభిమానులు తహతహలాడుతున్నారు. కబడ్డీ అభిమానుల దృష్టంతా వైభవ్పైనే ఉంది. వైభవ్ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో సంచలనాలు సృష్టించి, క్రికెట్‌తో పాటు యావత్ క్రీడా ప్రపంచాన్నంతా సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. 2025 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 101 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ సీజన్ మొత్తం మెరుపులు మెరిపించిన వైభవ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు.తొలి రోజు మ్యాచ్లుతెలుగు టైటాన్స్ vs తమిళ తలైవాస్బెంగళూరు బుల్స్ vs పునేరి పల్టన్ -
వేలానికి సంజూ శాంసన్..?
రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ఫ్రాంచైజీ మారే అంశం ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తుంది. సంజూకు రాయల్స్‌లో కొనసాగే ఉద్దేశం లేదని ప్రచారం జరుగుతున్న వేల.. ఐపీఎల్ ట్రేడింగ్ విండో తెరుచుకుంది. ట్రేడింగ్ ద్వారా సంజూను దక్కించుకునేందుకు సీఎస్కే, కేకేఆర్ పోటీపడుతున్నట్లు సమాచారం.అయితే సంజూ విషయంలో రాయల్స్ డిమాండ్లకు ఆ ఫ్రాంచైజీలు ససేమిరా అంటున్నట్లు తెలుస్తుంది. క్యాష్ డీల్ వరకు ఓకే కానీ, తమ ఆటగాళ్లను వదులుకునే ప్రసక్తే లేదని సదరు ఫ్రాంచైజీలు చెప్పినట్లు సమాచారం.సంజూను సీఎస్కే కోరుకున్నట్లైతే ప్రతిగా నగదుతో పాటు ఇద్దరు ఆటగాళ్లను రాయల్స్ డిమాండ్ చేసిందట. రవీంద్ర జడేజా, శివమ్ దూబేలను తమకు ఇవ్వాలని రాయల్స్ కోరినట్లు సమాచారం. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ సంజూను ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే బదులుగా అంగ్క్రిష్ రఘువంశీ, రమన్‌దీప్ సింగ్‌లను ఇవ్వాలని రాయల్స్ డిమాండ్ చేసిందట.సంజూ ట్రేడింగ్ విషయంలో రాయల్స్ డిమాండ్లను ఇరు ఫ్రాంచైజీలు తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో రాయల్స్ సంజూను వేలానికి వదిలేస్తుందని మరో ప్రచారం మొదలైంది. ఇదే జరిగితే సంజూ కోసం సీఎస్కే, కేకేఆర్‌తో పాటు మరిన్ని ఫ్రాంచైజీలు పోటీపడవచ్చు.ఇది ఓ రకంగా సంజూకు లాభదాయకమే అని చెప్పాలి. ప్రస్తుతమున్న ధరతో (రూ. 18 కోట్లు) పోలిస్తే అతనికి మరింత ధర లభించే అవకాశముంటుంది. అయితే సంజూ లాంటి ఆటగాడిని వేలం వరకు పోనివ్వకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎస్కే, కేకేఆర్ లాంటి ఫ్రాంచైజీలకు సంజూ లాంటి ఆటగాడి అవసరం చాలా ఉందని, ఈ ఫ్రాంచైజీలు రాయల్స్‌తో సయోధ్యకు రావచ్చని అంచనా వేస్తున్నారు.ట్రేడింగ్ ద్వారా సంజూ ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్ పడితే ఓకే కానీ, వేలం వరకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఏమైనా జరగవచ్చు. సంజూకు పంత్‌కు మించిన ధర కంటే ఎక్కువ లభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగని అంత మొత్తం లభిస్తుందని కూడా చెప్పలేని పరిస్థితి. పర్సుల విషయంలో ఫ్రాంచైజీలకు పరిమితులు ఉన్నాయి.కాగా, జోస్ బట్లర్ విషయంలో సంజూ శాంసన్‌కు, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తుంది. తాను వద్దని చెప్పినా రాయల్స్ బట్లర్‌ను వేలానికి వదిలేసిందని సంజూ అలకపూనాడని ప్రచారం జరుగుతుంది. అంతే కాక జట్టులో తన ప్రాధాన్యత కూడా తగ్గిందని సంజూ భావిస్తున్నట్లు సమాచారం. ధృవ్ జురెల్ (వికెట్‌కీపింగ్), వైభవ్ సూర్యవంశీ (ఓపెనర్) రూపంలో తన స్థానానికి ప్రమాదం పొంచి ఉందని సంజూ భావిస్తుండవచ్చు.ఇలాంటి ఎన్ని ప్రచారాలు సాగినా సంజూ ఐపీఎల్ భవితవ్యంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
సంజూ రాయల్స్ నుంచి వైదొలగాలనుకోవడానికి అతడే ప్రధాన కారణం..?
ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో సంజూ శాంసన్ ట్రేడ్ డీల్‌కు సంబంధించిన చర్చలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. అసలు కారణాలు తెలియరానప్పటికీ సంజూ రాజస్థాన్ రాయల్స్‌ను వీడాలనుకుంటున్న విషయం స్పష్టమైపోయింది. రాయల్స్ సైతం సంజూ అభిమతాన్ని గౌరవమిస్తూ, అతన్ని వదిలేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఎస్కేతో ట్రేడ్ డీల్ గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.సంజూకు బదులుగా రాయల్స్ సీఎస్కే నుంచి ఇద్దరిని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సీఎస్కే యాజమాన్యం ఇందుకు సమ్మతిస్తున్నట్లు లేదు. సంజూను తాము తీసుకుంటే కేవలం క్యాష్ డీల్ మాత్రమే ఉంటుందని, తమ ఆటగాళ్లను ఎవరినీ వదిలిపెట్టుకునే ప్రసక్తే లేదని సీఎస్కే స్పష్టం చేసినట్లు సమాచారం.ఈ ప్రచారాల నడుమ సంజూ రాయల్స్‌ను వీడాలనుకోవడానికి కారణమిదే అంటూ ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. సంజూ రాయల్స్‌ను వద్దనుకోవడానికి జోస్ బట్లర్ ప్రధాన కారణమన్నది ఆ వార్త సారాంశం. రాయల్స్ యాజమాన్యం 2025 మెగా వేలానికి ముందు బట్లర్‌ను రీటైన్ చేసుకోలేదు. ఇది సంజూకు అస్సలు మింగుడు పడలేదంట. జోస్ 2018-2024 వరకు రాయల్స్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించినప్పటికీ అతన్ని రీటైన్ చేసుకోకపోవడం సంజూకు అస్సలు నచ్చలేదట. ఈ కారణంగానే అతను మేనేజ్మెంట్తో విభేదించినట్లు సమాచారం. సంజూ రాయల్స్‌ను వద్దనుకోవడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మొదటిది.. గత సీజన్లో అతని గైర్హాజరీలో (గాయం కారణంగా) వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా పాతుకుపోవడం. రెండవది.. యాజమాన్యం అతని ప్రత్యామ్నాయంగా ధృవ్ జురెల్‌కు ప్రాధాన్యత ఇవ్వడం. ఈ కారణాల వల్ల సంజూకు రాయల్స్ యాజమాన్యానికి గ్యాప్ పెరిగిందని తెలుస్తుంది.తన మాట చెల్లని చోట, తన స్థానం యాజమాన్యానికి భారమైన చోట ఉండటం ఇష్టం లేకనే సంజూ రాయల్స్‌ను వీడాలని అనుకున్నాడని పలు నివేదికలు చెబుతున్నాయి. 2013లో రాయల్స్‌లో జాయిన్ అయిన సంజూ.. 2021 సీజన్ నంచి ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సంజూ నేతృత్వంలో రాయల్స్ 2022 సీజన్లో రన్నరప్‌గా నిలిచింది. సంజూ, జోస్ బట్లర్ కలిసి రాయల్స్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు.ఇంత చేసినా తన మాట చెల్లకుండా బట్లర్‌ను వదిలేయడం సంజూను చాలా బాధించినట్లు తెలుస్తుంది. బట్లర్‌ను కాదని రాయల్స్ యాజమాన్యం తనతో సహా యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, జురెల్, హెట్‌మైర్, సందీప్ శర్మను అట్టిపెట్టుకుంది. రాయల్స్ వద్దనుకున్నా బట్లర్‌ను గుజరాత్ టైటాన్స్ వేలంలో రూ. 15.75 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. -
సంజూకు బదులు జడ్డూ, రుతురాజ్.. సీఎస్కే నిర్ణయం ఇదే..!
ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో సంజూ శాంసన్ ట్రేడ్ డీల్‌కు సంబంధించిన అంశం హాట్‌హాట్‌గా నడుస్తుంది. సంజూ రాజస్థాన్ రాయల్స్‌ను వీడటం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో సీఎస్కే అతన్ని ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ట్రేడ్ డీల్‌లో భాగంగా రాయల్స్ సంజూకు బదులు సీఎస్కేకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లను అడిగినట్లు సమాచారం. కొంత నగదుతో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ లేదా శివమ్ దూబేలలో ఎవరో ఒకరిని డిమాండ్ చేసిందని తెలుస్తుంది. అయితే ఈ డీల్‌కు సీఎస్కే యాజమాన్యం ససేమిరా అనిందని క్రిక్‌బజ్ పేర్కొంది.సంజూకు బదులు నగదు డీల్ జరుగుతుందే కానీ, తమ ఆటగాళ్లలో ఏ ఒక్కరిని వదులుకునేది లేదని సీఎస్కే రాయల్స్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ రాయల్స్, సీఎస్కే మధ్య డీల్ కుదరకపోతే సంజూను ట్రేడ్ డీల్ ద్వారా దక్కించుకునేందుకు వేరే ఫ్రాంచైజీలు కూడా పోటీపడవచ్చు. ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోతే సంజూ ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం 2027 సీజన్ వరకు రాయల్స్‌తోనే కొనసాగాల్సి వస్తుంది.సీఎస్కేకు వెళ్లాలన్నది సంజూ వ్యక్తిగత ఆప్షన్‌గా తెలుస్తుంది. రాయల్స్‌లో ఇమడలేకపోవడంతో అతను సీఎస్కే వైపు చూస్తున్నట్లు సమాచారం. ఫ్రాంచైజీ మారాలనుకున్న విషయాన్ని సంజూ చాలా గోప్యంగా ఉంచుతూనే లోలోపల పావులు కదుపుతున్నట్లు వినికిడి. మొత్తానికి సంజూ తమతో అసౌకర్యంగా ఉన్నాడన్న విషయాన్ని రాయల్స్ యాజమాన్యం గ్రహించింది. సంజూ నిర్ణయాన్ని ఫ్రాంచైజీ గౌరవించే అవకాశం ఉంది. ఏ ఫ్రాంచైజీతో ట్రేడ్ డీల్ కుదరకపోతే సంజూను వేలానికి వదిలేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే సంజూకు రికార్డు ధర లభించే అవకాశం ఉంటుంది. సీఎస్కేతో పాటు కేకేఆర్, గుజరాత్ ఫ్రాంచైజీలు సంజూ కోసం ఎగబడవచ్చు. -
IPL 2026: నన్ను విడిచిపెట్టండి.. వెళ్లిపోతా!.. సీఎస్కేకు గుడ్‌బై?
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే ట్రేడింగ్ రూపంలో జట్లలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సంజూ శాంసన్ (Sanju Samson). రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా రాణించిన ఈ కేరళ బ్యాటర్.. వచ్చే ఎడిషన్‌లో ఈ ఫ్రాంఛైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.తాను ఫిట్‌గా ఉన్నా రియాన్ పరాగ్ (Riyan Parag)కు కెప్టెన్సీ ఇవ్వడం, మెగా వేలంలో జోస్ బట్లర్‌ను విడిచిపెట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో సంజూ.. రాయల్స్‌ను వీడేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.సీఎస్కేకు అశ్విన్ గుడ్‌బై?ఈ క్రమంలో తెరమీదకు వచ్చిన మరో ఆసక్తికర వార్త ఇందుకు బలం చేకూరుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. తనను విడిచిపెట్టమని సీఎస్కేను కోరాడని దాని సారాంశం. దీనిని బట్టి సీఎస్కే అశూను రాయల్స్‌కు ఇచ్చి.. వారి నుంచి సంజూను ట్రేడ్ చేసుకోనుందనే ప్రచారం ఊపందుకుంది.కాగా 2009లో అశ్విన్ సీఎస్కేతోనే తన ఐపీఎల్ కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ (ఇప్పుడు మనుగడలో లేదు), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. ఇక 2022లో రాజస్తాన్ రాయల్స్‌లో చేరిన అశ్విన్.. గతేడాది వరకు అక్కడే విజయవంతంగా కొనసాగాడు.రూ. 9.75 కోట్లకు కొనుగోలుఅయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని విడుదల చేయగా.. సీఎస్కే రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ.. ఈ సీజన్లో అశ్విన్‌కు తొమ్మిది మ్యాచ్‌లలో ఆడే అవకాశం మాత్రమే దక్కింది. అయితే, అందులోనూ అతడు నిలకడగా రాణించలేకపోయాడు. కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వేరే జట్టుకు మారతాడా?యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇచ్చే క్రమంలో మేనేజ్మెంట్ అశూను పలు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ సీఎస్కేను వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, రాయల్స్ అతడిని తిరిగి తీసుకుంటుందా? లేదంటే వేరే జట్టుకు మారతాడా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా ఐపీఎల్లో అశ్విన్ మొత్తంగా 220 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు కూల్చాడు.ఇక గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడే అశూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియా తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ చెన్నై ప్లేయర్.. టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు కూల్చాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3503, 707, 184 పరుగులు సాధించాడు.చదవండి: అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. ఆసియాకప్‌లో ఆడాల్సిందే: గంగూలీ -
సంజూ శాంసన్‌కు మీకిస్తే బదులుగా ఇద్దరిని ఇవ్వండి.. రాయల్స్ డిమాండ్..!
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ను వీడాలని అనుకుంటున్నట్లు సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఈ ప్రచారం నిజమేనని తాజాగా పరిణామాలు సూచిస్తున్నాయి.ఏ ఫ్రాంచైజీ అయినా సంజూను ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని అనుకున్నట్లైతే బదులుగా ఇద్దరు ఆటగాళ్లతో పాటు నగదును కూడా ఇవ్వాలని రాయల్స్ మేనేజ్మెంట్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.ఈ విషయం ప్రచారంలోకి వచ్చిన తర్వాత రాయల్స్ యాజమాన్యం సంజూను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది. వాస్తవానికి ఈ డీల్‌ను రాయల్స్ యాజమాన్యం సంజూపై అమితాసక్తి ప్రదర్శిస్తున్న సీఎస్కే కోసం తీసుకొచ్చిందట.సంజూను వారికిస్తే బదులుగా ఓ విదేశీ ప్లేయర్‌ను, ఓ దేశీయ ఆటగాడిని ఇవ్వాలని ప్రతిపాదన పెట్టిందట. ఈ డీల్‌పై సీఎస్కే సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాయల్స్ యాజమ్యానం ఎవరిని కోరుకుంటుందనే దానిపై ఆ ఫ్రాంచైజీ తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది.ఈ ప్రక్రియ పూర్తివడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సంజూకు రాయల్స్‌తో 2027 సీజన్ వరకు ఒప్పందం ఉంది. వారు రిలీజ్ చేస్తే తప్ప అతను వేరే ఫ్రాంచైజీకి వెళ్లలేడు.వాస్తవానికి సంజూకు యాజమాన్యంతో చాలా మంది సంబంధాలు ఉన్నాయి. పైగా కోచ్ ద్రవిడ్‌కు సంజూ ప్రియ శిష్యుడు. మరి ఏ విషయంలో వీరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయో తెలియడం లేదు.2025 సీజన్‌కు ముందు మార్పులు చేర్పుల విషయంలో యాజమాన్యానికి-సంజూకు మధ్య గ్యాప్ ఏర్పడినట్లు వినికిడి. ఆ గ్యాప్ సీజన్ పూర్తయ్యే సరికి తారాస్థాయికి చేరింది. మొత్తానికి సంజూ రాయల్స్‌ను వీడాలని గట్టిగా అనుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్కే అతన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది.గత ఐపీఎల్ సీజన్ ముగిసాక సీఎస్కే సీఈవో, ఆ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ సంజూను అమెరికాలో కలిసారని సమాచారం. వారి మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగి సంజూ సీఎస్కేకు వస్తే, సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడా లేక రుతురాజ్‌ను తప్పించి అతనికి కెప్టెన్సీ అప్పగిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.రుతురాజ్ ఇప్పుడిప్పుడే ధోని అండర్లో కెప్టెన్‌గా ఓనమాలు దిద్దుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో సంజూ కోసం అతన్ని కెప్టెన్సీ త్యాగం చేయమని సీఎస్కే మేనేజ్మెంట్ ఆడగకపోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.2013లో రాయల్స్‌తోనే ఐపీఎల్ జర్నీ ప్రారంభించిన సంజూ.. మధ్యలో రెండేళ్లు మినహా ఐపీఎల్ కెరీర్ మొత్తం ఆ ఫ్రాంచైజీతోనే కొనసాగాడు. 2019, 2020 సీజన్లలో అదిరిపోయే ప్రదర్శనలు చేసిన అతను.. 2021 సీజన్లో రాయల్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సంజూ నేతృత్వంలో ఆ జట్టు 2022 సీజన్ ఫైనల్స్‌కు చేరింది. -
‘నేను వెళ్లిపోతా...వదిలేయండి’
జైపూర్: ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్‌కు, టీమ్ యాజమాన్యానికి మధ్య విభేదాలు ఉన్నట్లు తాజా పరిణామంతో స్పష్టమైంది. రాజస్తాన్ టీమ్‌లో సుదీర్ఘ కాలంగా భాగమైన సంజు సామ్సన్ జట్టు నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్–2026 సీజన్‌కు ముందు తనను విడుదల చేయాలని అతను ఫ్రాంచైజీని కోరినట్లు సమాచారం. నిజానికి ఈ ఏడాది లీగ్ ముగియగానే సామ్సన్ తన మనసులో మాటకు మేనేజ్మెంట్కు వెల్లడించాడు. అయితే దీనిపై రాయల్స్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు.2025లో రూ.18 కోట్లతో సామ్సన్ను జట్టు అట్టి పెట్టుకుంది. అయితే గాయం కారణంగా సామ్సన్ 9 మ్యాచ్‌లే ఆడాడు. 14 మ్యాచ్‌లలో 4 మాత్రమే గెలిచిన రాయల్స్ 9వ స్థానంతో ముగించింది. తాను కోలుకున్నా రియాన్ పరాగ్‌కే కెపె్టన్సీ కొనసాగించడంతో పాటు సీజన్‌కు ముందు జోస్ బట్లర్‌ను టీమ్ వదిలేసుకోవడంపై కూడా యాజమాన్యంతో సామ్సన్‌కు విభేదాలు వచ్చాయి. 2013 నుంచి 2015 వరకు రాజస్తాన్ తరఫున ఆడిన సంజు ఆ తర్వాత రెండు సీజన్లు ఢిల్లీకి ఆడి 2018లో మళ్లీ రాయల్స్‌కే వచ్చాడు. 2021లో అతనికి కెప్టెన్సీ ఇవ్వగా తర్వాతి ఏడాదే జట్టు ఫైనల్‌కు కూడా చేరింది. మొత్తం జట్టు తరఫున 11 సీజన్లలో కలిపి అతను 149 మ్యాచ్‌లు ఆడి 4027 పరుగులు చేశాడు. -
‘అతడిని చూడగానే ఫిక్సయిపోయాం.. వైభవ్ ఒక అద్భుతం’
చిన్న వయసులోనే భారత క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పై శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర (Kumar Sangakkara) ప్రశంసలు కురిపించాడు. అతడి బ్యాటింగ్ గన్‌షాట్‌లా ఉంటుందంటూ ఈ చిచ్చరపిడుగు ప్రతిభను కొనియాడాడు. కాగా బిహార్‌కు చెందిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ దేశీ క్రికెట్లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ దృష్టిని ఆకర్షించిన ఈ పిల్లాడిపై.. ఈ ఏడాది మెగా వేలంలో కాసుల వర్షం కురిసింది. రాయల్స్ జట్టు ఏకంగా రూ. 1.1 కోట్లు ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వైభవ్ వమ్ము చేయలేదు.38 బంతుల్లోనే శతకంగుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే శతకం సాధించి.. ఈ ఘనత సాధించిన భారత అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్లో మొత్తంగా ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం భారత అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్ గడ్డ మీదా వైభవ్ ఇరగదీస్తున్నాడు.ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార్ సంగక్కర వైభవ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘తనొక స్పెషల్ టాలెంట్ అని వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే నిరూపించుకున్నాడు. 2023లో.. ‘ఓ ప్రత్యేకమైన ఆటగాడు ఉన్నాడు. అతడి బ్యాటింగ్ చూడాల్సిందే’ అని రాజస్తాన్ అనలిస్టులకు సందేశం వచ్చింది.నేనైతే ఆశ్చర్యపోయా..అప్పుడే మేమే వైభవ్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావించాము. తొలిసారి అతడి బ్యాటింగ్‌ను నేరుగా చూసినపుడు నేనైతే ఆశ్చర్యపోయా. వీడియోల్లో చూసినదాని కంటే ప్రత్యక్షంగా చూడటం థ్రిల్లింగ్‌గా అనిపించింది.ఇక గువాహటిలో అనుకుంటా.. నెట్స్‌లో జోఫ్రా ఆర్చర్‌తో పాటు ఇతర సీమర్లను అతడు ఎదుర్కొన్న తీరు అమోఘం. మంచినీళ్లప్రాయంగా షాట్లు బాదేశాడు. అతడి బ్యాటింగ్ గన్‌షాట్‌లా ఉంటుంది. ప్రతీ బంతిని అతడు ఆడేందుకు ప్రయత్నిస్తాడు’’ అంటూ కుమార్ సంగక్కర ప్రశంసల వర్షం కురిపించాడు.అదే విధంగా.. ‘‘అతడి బ్యాట్ స్వింగ్ అవుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా వైడ్ అవుట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా ఈజీగా షాట్లు బాదేస్తాడు. క్రీజు నుంచి కదలడం కూడా అరుదే. షాట్ల ఎంపికలో కచ్చితత్వం ఉంటుంది.టీ20 బ్యాటర్ ఆడే ప్రతీ షాట్‌ను అతడు ఆడతాడు. అయితే, ఇది ఇంకా ఆరంభం మాత్రమే. అతడు అంచెంలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సంగక్కర స్కై స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు.చదవండి: అరంగేట్రంలోనే ఆసీస్ బ్యాటర్ విధ్వంసం.. విండీస్ చిత్తు -
కేకేఆర్‌లోకి సంజూ శాంసన్..? ఆసక్తి రేపుతున్న సోషల్‌మీడియా పోస్ట్
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసి కొద్ది రోజులు కూడా గడవకముందే తదుపరి సీజన్‌పై చర్చ మొదలైంది. పలానా ఆటగాడు పలానా ఫ్రాంచైజీకి మారతాడు, పలానా ఫ్రాంచైజీ కెప్టెన్‌ను మారుస్తుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ చర్చల్లో ట్రేడింగ్ విండో అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడింగ్ విండో ఆప్షన్ ద్వారా చేజిక్కించుకోనుందని ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపై సంజూ శాంసన్ కానీ, ఇరు ఫ్రాంచైజీలు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా సంజూ సీఎస్కే చేరతాడంటూ సోషల్‌మీడియా కోడై కూస్తుంది.సంజూకు సంబంధించి తాజాగా మరో ప్రచారం మొదలైంది. ఈ కేరలైట్ వచ్చే సీజన్లో కేకేఆర్‌కు ఆడబోతున్నాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారానికి కేకేఆర్ స్కౌటింగ్ హెడ్ బిజూ జార్జ్ బీజం వేశాడు. బిజూ తాజాగా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో సంజూ అతను చాలాకాలం క్రితం కలిసి దిగిన ఫోటో ఉంది. ఈ ఫోటోకు బిజూ "కొన్ని జ్ఞాపకాలు ప్రత్యేకమైనవి" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసి నెటిజన్లు సంజూ కోసం కేకేఆర్ పావులు కదుపుతుందని ప్రచారం మొదలుపెట్టారు.వాస్తవానికి కేకేఆర్‌కు వచ్చే సీజన్ కోసం వికెట్‌కీపర్‌తో పాటు కెప్టెన్ అవసరం ఉంది. సంజూ శాంసన్ ఈ రెండు పాత్రలను న్యాయం చేస్తాడని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం తప్పక భావించవచ్చు. గత సీజన్లో కేకేఆర్ అజింక్య రహానే కెప్టెన్సీలో చాలా ఇబ్బంది పడింది. దీంతో శాంసన్ లాంటి విజవంతమైన నాయకుడు తమ కష్టాలు తీరుస్తాడని కేకేఆర్ అనుకోవడంలో తప్పులేదు. ఎలాగూ ట్రేడింగ్ విండో ఆప్షన్ ఉంది కాబట్టి కేకేఆర్ శాంసన్ కోసం ఎంత డబ్బైనా వెచ్చించవచ్చు. ఏం జరుగుందో తెలియాలంటే మరి కొద్ది రోజుల వెయిట్ చేయాల్సిందే.కాగా, సంజూ శాంసన్ 2013లో రాజస్థాన్ రాయల్స్‌తో తన జర్నీని ప్రారంభించాడు. అతి కొద్ది కాలంలో శాంసన్ రాయల్స్‌లో కీలక ఆటగాడిగా మారిపోయాడు. మధ్యలో రాజస్థాన్ రాయల్స్ సస్పెండ్ కావడంతో శాంసన్ రెండేళ్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు మారాడు. 2018లో అతని తిరిగి రాయల్స్ గూటికి చేరాడు. 2021 సీజన్లో శాంసన్ రాయల్స్ కెప్టెన్సీని చేపట్టాడు. అతని సారథ్యంలో రాయల్స్ 2022 సీజన్లో ఫైనల్‌కు చేరింది. తాజాగా ముగిసిన సీజన్లో శాంసన్ గాయం కారణంగా పెద్దగా కనిపించలేదు. అతని స్థానంలో రియాన్ పరాగ్ మెజార్టీ మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేశాడు. ఈ సీజన్లో రాయల్స్ చాలావరకు గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది.రికార్డు ధరసంజూ శాంసన్ ఐపీఎల్ తర్వాత ఖాళీగా ఉన్నాడు. ఇటీవల జరిగిన కేరళ క్రికెట్ లీగ్ వేలంలో సంజూ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. కొచ్చి బ్లూ టైగర్స్ ఫ్రాంచైజీ సంజూను రూ. 26.8 లక్షలకు సొంతం చేసుకుంది. కేరళ క్రికెట్ లీగ్ చరిత్రలో ఇదే భారీ డీల్. -
వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా!.. టీనేజ్ స్టార్ కోసం ఏకంగా..
భారత క్రికెట్ వర్గాల్లో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో పాటు అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు మారుమ్రోగిపోతోంది. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలు బాదుతూ ఎడ్జ్‌బాస్టన్‌లో తొలిసారి జట్టును గెలిపించి గిల్ చరిత్ర సృష్టించగా.. అండర్-19 యూత్ వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకోవడంలో వైభవ్‌ది కీలక పాత్ర.ఇంగ్లండ్ గడ్డపై యాభై ఓవర్ల ఫార్మాట్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. టీ20 మాదిరి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 48 పరుగులు సాధించిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్ రాబట్టాడు.సునామీ శతకంఇక మూడో యూత్ వన్డేల్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, ఆ తర్వాతి వన్డేలో మాత్రం వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ బౌలింగ్‌ను చిత్తు చేశాడు. వోర్సెస్టర్ వేదికగా కేవలం 52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకుని.. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్ల వంద రోజుల వయసు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు.అయితే, ఆఖరిదైన ఐదో వన్డేలో మాత్రం వైభవ్ 42 బంతుల్లో 33 పరుగులే చేయగలిగాడు. అయితేనేం.. ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల్లో ఓవరాల్‌గా 29 సిక్సర్లు బాది.. 355 పరుగులు సాధించాడు. దీంతో క్రికెట్ ప్రేమికుల్లో ఎక్కడ చూసినా వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ గురించే చర్చ.వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా!ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద వైభవ్ సూర్యవంశీ మేనియా ఏ రేంజ్లో ఉందో తెలిపేలా.. అతడి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఆరు గంటల పాటు కారులో ప్రయాణించి వోర్సెస్టర్‌కు చేరుకున్నారు. పింక్ జెర్సీ ధరించి వచ్చి వైభవ్‌తో పాటు టీమ్ ఇండియాకు మద్దతు పలికారు.ఆన్య, రివా.. వైభవ్ వయసు వారే. తమ అభిమాన ఆటగాడి కోసం వారు ఇంత దూరం వచ్చి.. మధురజ్ఞాపకాలు పోగు చేసుకున్నారు’’ అంటూ వైభవ్‌తో ఇద్దరమ్మాయిలు దిగిన ఫొటోలను రాజస్తాన్ రాయల్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.ఐపీఎల్‌లోనూ సరికొత్త చరిత్రకాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ బిహార్‌కు చెందిన వైభవ్‌ను.. రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్‌నెస్‌లేమి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులోకి వచ్చాడు వైభవ్. రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఆకాశమే హద్దుగా చెలరేగి క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యంత పిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల 32 రోజుల వయసులో వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు యూత్ వన్డేల సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకుంది. చదవండి: IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటుProof why we have the best fans 🫡🚗 Drove for 6 hours to Worcester👚 Wore their Pink🇮🇳 Cheered for Vaibhav & Team IndiaAanya and Rivaa, as old as Vaibhav himself, had a day to remember 💗 pic.twitter.com/9XnxswYalE— Rajasthan Royals (@rajasthanroyals) July 9, 2025 -
IPL 2026: సీఎస్కేలోకి సంజూ.. బదులుగా రాజస్తాన్‌కు రుతురాజ్?!
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) వచ్చే ఏడాది ఐపీఎల్ జట్టు మారనున్నాడా? రాజస్తాన్ రాయల్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరనున్నాడా? అంటే అందుకు అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌పై సీఎస్కే ఒక్కటే కాదు.. ఇంకో రెండు-మూడు ఫ్రాంఛైజీలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.కేరళ స్టార్ సంజూ శాంసన్ 2013లో ఐపీఎల్ (IPL)లో అరంగేట్రం చేశాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో అడుగుపెట్టిన అతడు.. ఆ తర్వాత జట్టుపై నిషేధం పడటంతో 2016-17 సీజన్లలో ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారాడు. అయితే, 2018లో తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు.ఫైనల్ చేర్చిన సారథిఈ క్రమంలో అంచెలంచెలుగా ఎదిగిన సంజూ.. 2021లో కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. సారథిగా అత్యుత్తమంగా 2022లో రాజస్తాన్‌ను అతడు ఫైనల్‌కు చేర్చాడు. 2008లో షేన్ వార్న్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచిన రాజస్తాన్.. మళ్లీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఇక 2023లో ఐదోస్థానంతో ముగించిన సంజూ సేన.. 2024లో ప్లే ఆఫ్స్ చేరినా ఫైనల్‌కు వెళ్లలేకపోయింది.ఇక ఈ ఏడాది సంజూ ఫిట్నెస్ సమస్యల కారణంగా ఎక్కువసార్లు ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగగా.. రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి రాజస్తాన్ మరీ దారుణంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే... కొత్త హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సంజూకు మధ్య విభేదాలు ఉన్నట్లు గతంలో వార్తలు రాగా.. ద్రవిడ్ వాటిని ఖండించాడు. మరోవైపు.. రియాన్ పరాగ్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌ను చేయాలనే యోచనలో రాజస్తాన్ మేనేజ్మెంట్ ఉందనే రూమర్లు వస్తున్నాయి.సంజూపై సీఎస్కే ఆసక్తి నిజమేఇలాంటి తరుణంలో సంజూ శాంసన్ రాజస్తాన్‌ను వీడే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు క్రిక్‌బజ్ కథనం పేర్కొంది. సీఎస్కే ఈ రేసులో ముందున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎస్కే వర్గాలు మాట్లాడుతూ.. ‘‘సంజూ భారత బ్యాటర్. వికెట్ కీపర్. ఓపెనింగ్ కూడా చేయగలడు.కాబట్టి కచ్చితంగా అతడిని జట్టులో చేర్చుకోవాలని మాకూ ఆసక్తి ఉంది. ఒకవేళ అతడు అందుబాటులో ఉంటే కచ్చితంగా తీసుకుంటాం. ట్రేడ్ చేసుకునైనా అతడిని దక్కించుకుంటాం. అయితే, విషయం అంతవరకు రాలేదు కానీ మాకు మాత్రం అతడిని తీసుకోవడం పట్ల కచ్చితంగా ఆసక్తి ఉంది’’ అని పేర్కొన్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది.రుతును ఇచ్చేస్తారా?ఒకవేళ చెన్నై జట్టు గనుక సంజూను దక్కించుకోవాలంటే రాజస్తాన్ ప్లేయర్-టు- ప్లేయర్ ట్రేడ్ వైపే మొగ్గు చూపవచ్చు. అలా అయితే, 2025 మెగా వేలానికి ముందు రాజస్తాన్ సంజూను రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. జట్టుకు అతడే కెప్టెన్.మరోవైపు.. సీఎస్కే తమ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను అట్టిపెట్టుకునేందుకు రూ. 18 కోట్లు కేటాయించింది. కాబట్టి ఒకేస్థాయి ఆటగాళ్ల మార్పిడి జరగాలంటే సంజూ- రుతులను ఎక్స్చేంచ్ చేసుకోవాల్సి ఉంటుంది.అయితే, సీఎస్కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇప్పటికే చాలాసార్లు రుతు గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అతడిని సారథిగా నియమించినట్లు తెలిపాడు. మరి అలాంటపుడు సంజూను ఎవరితో మార్చుకుంటారు?.. అసలు అతడిని వదులుకునేందుకు రాజస్తాన్ సిద్ధంగా ఉందా??.. అంటే మినీ వేలం సమయంలోనే తేలుతుంది. -
వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు.. భారీ శతకంతో విరుచుకుపడ్డాడు
ఐపీఎల్ 2025 ద్వారా పరిచయమై (రాజస్తాన్ రాయల్స్ తరఫున), 14 ఏళ్ల వయసులోనే క్యాష్ రిచ్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో) బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన వైభవ్ సూర్యవంశీ.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో మరోసారి చెలరేగిపోయాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో (ఎన్సీఏ) జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేవలం 90 బంతుల్లోనే 190 పరుగులు చేశాడు. వైభవ్ విధ్వంసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. వైభవ్ విధ్వంసం చూసి క్రికెట్ అభిమానులు అబ్బురపడుతున్నారు. VAIBHAV SURYAVANSHI MADNESS..!! 🥶🔥Vaibhav Suryavanshi smashed 190 off just 90 balls in a practice match during the India U-19 team's camp at the BCCI Centre of Excellence in Bengaluru. [Gaurav Gupta]pic.twitter.com/QFsVSWyZeQ— Sports Culture (@SportsCulture24) June 10, 202514 ఏళ్ల వయసులో ఈ కుర్రాడు ఇంత భారీ షాట్లు ఆడుతూ, ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఎలా ఆడగలుగుతున్నాడని ఆశ్చర్యపోతున్నారు. పొట్టి క్రికెట్ భవిష్యత్తు ఇతడే అంటూ కీర్తిస్తున్నారు. భారత క్రికెట్లో వైభవ్ పెను సంచలనమని కొనియాడుతున్నారు. వైభవ్ టాలెంట్‌కు నీరాజనాలు పలుకుతున్నారు.కాగా, వైభవ్ త్వరలో ఇంగ్లండ్‌లో పర్యటించబోయే భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత్ ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఓ 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్, 5 వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు (టెస్ట్‌లు) ఆడుతుంది. ఈ సిరీస్‌లకు భారత కెప్టెన్‌గా మరో ఐపీఎల్ హీరో ఆయుశ్ మాత్రే (సీఎస్కే) కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లలో వైభవ్.. మాత్రేతో కలిసి భారత ఇన్నింగ్స్‌లు ప్రారంభిస్తాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఎన్సీఏలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలోనే వైభవ్ 90 బంతుల్లో 190 పరుగులు చేశాడు.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత అండర్-19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్-కెప్టెన్ & వికెట్‌కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్‌కీపర్), ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుద్దజిత్ గుహా, ప్రణవ్ రాఘవేంద్ర, మొహమ్మద్ ఎనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్స్టాండ్బై ప్లేయర్స్: నమన్ పుష్పక్, డి దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్‌కీపర్)ఇంగ్లండ్ పర్యటనలో భారత అండర్-19 జట్టు షెడ్యూల్..జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ (లోగ్‌బరో యూనివర్శిటీ)జూన్ 27- తొలి వన్డే (హోవ్)జూన్ 30- రెండో వన్డే (నార్తంప్టన్)జులై 2- మూడో వన్డే (నార్తంప్టన్)జులై 5- నాలుగో వన్డే (వార్సెస్టర్)జులై 7- ఐదో వన్డే (వార్సెస్టర్)జులై 12-15: తొలి మల్టీ డే మ్యాచ్ (బెకెన్హమ్)జులై 20-23: రెండో మల్టీ డే మ్యాచ్ (చెమ్స్‌ఫోర్డ్) -
వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం..! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో విధ్వంసం సృష్టించిన రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న సూర్యవంశీ.. భారత అండర్-19 జట్టుతో కలిసి ఇంగ్లండ్ పర్యటనకు సన్నద్దమవుతున్నాడు.తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో 14 ఏళ్ల చిచ్చరపిడుగు సిక్సర్ల వర్షం కురిపించాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. అద్బుతమైన షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టాడు. అతడి బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక తన ఐపీఎల్ అరంగేట్రంలో సూర్యవంశీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి ఔరా అన్పించాడు. ఇక గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసిన సూర్యవంశీ.. ఈ ఘనత అందుకున్న అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా 7 మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ.. 206.55 స్ట్రైక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు.ఇందులో ఓ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. ఇక భారత అండర్-19 జట్టు ఈ నెల ఆఖరిలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ అండర్-19 టీమ్‌తో కలిసి ఐదు వన్డే, రెండు మల్టీ- డే మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 24 నుంచి భారత యువ జట్టు ఇంగ్లండ్ టూర్ ప్రారంభం కానుంది. ఈ జట్టుకు సీఎస్కే యువ ఆటగాడు ఆయూష్ మాత్రే సారథ్యం వహించనుండగా.. సూర్యవంశీ సభ్యునిగా చోటు దక్కించుకున్నాడు.ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 పురుషుల జట్టుఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్జీత్ సింగ్.స్టాండ్ బై ప్లేయర్లు: నమన్ పుష్కక్, డి. దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).భారత్ అండర్-19 వర్సెస్ ఇంగ్లండ్ అండర్-19: 2025 షెడ్యూల్👉జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ గేమ్- లోబోరో యూనివర్సిటీ👉జూన్ 27- తొలి వన్డే- హోవ్👉జూన్ 30- రెండో వన్డే- నార్తాంప్టన్👉జూలై 2- మూడో వన్డే- నార్తాంప్టన్👉జూలై 5- నాలుగో వన్డే- వోర్సెస్టర్👉జూలై 7- ఐదో వన్డే- వోర్సెస్టర్👉జూలై 12- తొలి మల్టీ డే మ్యాచ్- బెకింగ్‌హామ్👉జూలై 20- రెండో మల్టీ డే మ్యాచ్- చెమ్స్‌ఫోర్డ్.Vaibhav Suryavanshi is smashing bowler at U19 HP NCA camp.🔥He is high on confidence after successful IPL stint pic.twitter.com/ZyLkNJrVy9— Varun Giri (@Varungiri0) June 6, 2025 -
సంజూ శాంసన్ ఉదారత
టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ ఉదారత చాటుకున్నాడు. తన ఫౌండేషన్ (SSF) తరఫున రానున్న విద్యా సంవత్సరం కోసం 100 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు, బూట్లు డొనేట్ చేశాడు. తన తల్లి లిజి శాంసన్ ఆథ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు స్కూల్ సామాగ్రిని ప్రదానం చేయించాడు. పేద విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంజూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్రికెట్ అభిమానులు అభినందిస్తున్నారు. సంజూ గతంలో కూడా తన ఫౌండేషన్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేపట్టాడు. 🚨 A LOVELY GESTURE BY SANJU SAMSON 🚨- Sanju Samson Foundation has donated school bags & shoes to 100 students as they start their new academic year. 🫡 pic.twitter.com/o7kMc2zCSM— Johns. (@CricCrazyJohns) June 5, 2025ఇదిలా ఉంటే, సంజూ శాంసన్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్లో రాయల్స్ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో సంజూ వ్యక్తిగతంగానూ ఆకట్టుకోలేకపోయాడు. గాయం కారణంగా చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతను.. ఆడిన మ్యాచ్‌ల్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వలేకపోయాడు.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్ జట్టులో సంజూ చోటు దక్కించుకోలేకపోయాడు. యువ వికెట్కీపర్లు రిషబ్ పంత్, ధృవ్ జురెల్, కేఎల్ రాహుల్ ఈ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించారు. పంత్, రాహుల్ జట్టులో పాతుకుపోయిన నేపథ్యంలో సంజూ టెస్ట్ కెరీర్ దాదాపుగా ముగిసిందనే చెప్పుకోవాలి. ఈ కేరళ వికెట్‌కీపర్ బ్యాటర్ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. -
Vaibhav Suryavanshi: ఫోన్ ఆన్ చేయగానే 500 మిస్స్డ్ కాల్స్
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్ నుంచి రాజస్తాన్ రాయల్స్ నిష్క్రమించి ఉండొచ్చు. కానీ ఒక కుర్రాడి ఆగమనం మాత్రం అద్వితీయంగా మలిచింది ఆ ఫ్రాంచైజీ! 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం రాజస్తాన్‌కు కోచింగ్ ఇవ్వడం... ముఖ్యంగా కుర్రాళ్లను సానబెట్టడంతో దిట్టయిన ద్రవిడ్ సూచనలు, హెచ్చరికలు వైభవ్‌పై మంచి ప్రభావమే చూపాయి. బ్యాటింగ్‌పైనే ధ్యాస పెట్టమని, ఎప్పుడైనా సరే చురుకుదనంతో అందుబాటులో ఉండాలనే హెచ్చరికలు తనను ఆటపైనే దృష్టి కేంద్రీకరించేలా చేశాయని స్వయంగా వైభవ్ చెప్పుకొచ్చాడు. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేసిన సందర్భంలో తన ఫోన్‌కు ఏకంగా 500 పైచిలుకు మిస్స్డ్ కాల్స్ వచ్చాయని చెప్పాడు. ద్రవిడ్ సూచనలతో ఆటపై ఫోకస్ చేసేందుకు ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయగా సెంచరీ తర్వాత ప్రశంసించేందుకు అన్ని కాల్స్ వచ్చినట్లు వైభవ్ చెప్పాడు. ‘మూణ్నాలుగు నెలలుగా నేను పడుతున్న కష్టానికి ఫలితం వచ్చింది. అదేపనిగా ప్రాక్టీస్‌లో నా బలహీనతల్ని అధిగమించడం వల్లే మ్యాచ్‌ల్లో ఆడటం సులువైంది. ముఖ్యంగా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడటం ఎలాగో నేర్చుకున్నాను. జట్టు విజయానికి అవసరమైన బ్యాటింగ్ శైలీని అలవర్చుకున్నా. నా బలమెంటో నాకు తెలుసు. జట్టుకేం కావాలనేది అప్పటి పరిస్థితులకు తెలుసు. వీటిని దృష్టిలో ఉంచుకొని రాణించాలి’ అని రాయల్స్ హెడ్‌కోచ్ ద్రవిడ్‌తో పాల్గొన్న వీడియోలో వైభవ్ చెప్పాడు. ఈ వీడియోను ఐపీఎల్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీనేజ్ సంచలనాన్ని అభినందించిన ద్రవిడ్ అసలైన సవాళ్లు ముందున్నాయని అతనికి గుర్తు చేశాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్‌లాడిన సూర్యవంశీ 252 పరుగులు సాధించాడు. 206.56 స్ట్రయిక్ రేట్‌తో 36 సగటును నమోదు చేశాడు. -
IPL 2025: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
సంజూ శాంసన్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 4000 పరుగుల మార్కును తాకిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంజూ ఈ ఫ్రాంచైజీ తరఫున 148 మ్యాచ్‌లు ఆడి 141.24 స్ట్రయిక్‌రేట్‌తో 4027 పరుగులు చేశాడు. సంజూ తర్వాత జోస్ బట్లర్ (3055), అజింక్య రహానే (2810), షేన్ వాట్సన్ (2372) రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 20) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసిన సంజూ ఈ ఘనత సాధించాడు. మధ్యలో రెండు సీజన్లు (2016, 2017) మినహాయించి ఐపీఎల్ కెరీర్ మొత్తం రాజస్థాన్‌కే ఆడిన సంజూ ఇప్పటివరకు 176 మ్యాచ్‌లు ఆడి 139.05 స్ట్రయిక్‌రేట్‌తో 4704 పరుగులు చేశాడు. ఇందులో 26 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు ఉన్నాయి.2016, 2017 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌పై వేటు పడటంతో ఆ రెండు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సంజూ, ఆ ఫ్రాంచైజీ తరఫున 28 మ్యాచ్‌లు ఆడి ఓ శతకం సాయంతో 677 పరుగులు చేశాడు. 2021 సీజన్లో రాజస్థాన్ కెప్టెన్‌గా నియమితుడైన సంజూ ఐదు సీజన్లలో ఆ జట్టుకు సారధిగా వ్యవహరించాడు.ఈ సీజన్లో సంజూ గాయం కారణంగా చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో అతని స్థానంలో రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. మొత్తంగా ఈ సీజన్లో రాజస్థాన్ పేలవ ప్రదర్శన కనబర్చి లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు కేవలం నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నిన్న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఊరట పొందే విజయం సాధించి సీజన్‌ను ముగించింది.నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (43), డెవాల్డ్ బ్రెవిస్ (42), శివమ్ దూబే (39) ఓ మోస్తరు స్కోర్లు చేసి సీఎస్కేకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. రాయల్స్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్, యుద్ద్‌వీర్ సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్‌పాండే, హసరంగ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం నామమాత్రపు లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్..యశస్వి జైస్వాల్ (36), వైభవ్ సూర్యవంశీ (57), సంజూ శాంసన్ (41), ధృవ్ జురెల్ (31 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. -
నా వల్ల కాదని చెప్పి.. వెంటనే రిటైర్ అయిపో!
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) స్థాయికి తగ్గట్లు ఆకట్టులేకపోతున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో కలిపి ధోని కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 30 నాటౌట్.ఇక రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం కారణంగా దూరం కావడంతో ఐదు మ్యాచ్‌ల తర్వాత పగ్గాలు చేపట్టిన ధోని.. సీఎస్కేను మునుపటి విధంగా ముందుకు తీసుకువెళ్లలేకపోయాడు. ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకుంది సీఎస్కే.అంతేకాదు.. ఆడిన పదమూడు మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచి తమ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమయ్యే దుస్థితిలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ధోనిని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.నా వల్ల కాదు.. అని చెప్పి వెళ్లిపో‘‘ధోని వయసు పెరుగుతోంది. కాబట్టి ఆటగాడిగా అతడి నుంచి మనం ఎక్కువగా ఆశించడం కూడా తప్పే. అయితే, ఒక్కోసారి అతడి వల్ల బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు కూడా దెబ్బతింటోంది.ఒకవేళ నీకు హిట్టింగ్ ఆడటం కుదరకపోతే.. ‘ఇక నా వల్ల కాదు.. నేనిది చేయలేను’ అని జట్టును వీడిపోతే మంచిది. ధోని ఇలా చేయడమే మంచిది. ఒకవేళ అతడు ఇంకా ఇంకా కొనసాగుతూ... ఉంటే జట్టులో ఏ పాత్ర పోషిస్తాడు?మోకాలి నొప్పులు కూడాకెప్టెన్గా ఉంటాడా? వికెట్ కీపరా లేదంటా ఫినిషర్గానా?.. నిజాయితీ చెప్పాలంటే ధోనిలో క్రికెట్ ఆడే సత్తువ తగ్గిపోయింది. అతడిని మోకాలి నొప్పులు వేధిస్తున్నాయి. ఇకనైనా ధోని తప్పుకొంటే మంచిది’’ అని చిక్కా.. తలాకు సూచించాడు. 43 ఏళ్ల ధోని వీలైనంత త్వరగా ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సేన ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 16 పరుగులు చేశాడు. రాజస్తాన్ ధనాధన్‌ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దంచికొట్టిన రాజస్తాన్.. 17.1 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36), వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57), సంజూ శాంసన్ (31 బంతుల్లో 41), ధ్రువ్ జురెల్ (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు. కాగా ఐపీఎల్లో సీఎస్కేను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనిది. కానీ ఈసారి మాత్రం అతడికి సారథిగా ఘోర పరాభవం ఎదురైంది.చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?.. సమీకరణలు ఇలా..Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) యువ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి లేకుండా నిర్భయంగా ఆడితే అనుకున్న ఫలితాలు అవే వస్తాయని పేర్కొన్నాడు. వైభవ్, ఆయుశ్లాంటి యువ ఆటగాళ్లకు తానిచ్చే సలహా ఇదే అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ.. చెన్నై జట్టు తరఫున ఆయుశ్ మాత్రే అరంగేట్రం చేశారు. హర్యానాకు చెందిన వైభవ్ ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడి 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ విధ్వంసకర శతకం ఉంది.చెన్నైపై మెరుపు హాఫ్ సెంచరీఅదే విధంగా.. మంగళవారం నాటి మ్యాచ్‌లో చెన్నై (CSK vs RR)పై ఈ చిచ్చర పిడుగు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 57 పరుగులతో పద్నాలుగేళ్ల వైభవ్ రాణించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నైపై రాజస్తాన్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయుశ్ కూడా అదరగొట్టాడుమరోవైపు.. ఆయుశ్ మాత్రే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో 20 బంతుల్లో 43 పరుగులుతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆయుశ్ మాత్రే 206 పరుగులు సాధించాడు. ఇక చెన్నై- రాజస్తాన్ మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు.ఒత్తిడికి లోనుకావద్దుఇదిలా ఉంటే.. రాజస్తాన్ చేతిలో ఓటమి తర్వాత సీఎస్కే సారథి ధోని మాట్లాడుతున్న సమయంలో వైభవ్, ఆయుశ్ వంటి యువ ఆటగాళ్లకు మీరిచ్చే సలహా ఏమిటనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నిలకడగా ఆడేందుకు వారు ప్రయత్నం చేయాలి.అయితే, 200కు పైగా స్ట్రైక్ రేటు మెయింటెన్ చేయాలని భావిస్తే నిలకడైన ఆట కాస్త కష్టమే. ఎలాంటి దశలోనైనా భారీ సిక్సర్లు బాదగల సత్తా వారికి ఉంది. అంచనాలు కచ్చితంగా ఉంటాయి. రోజురోజుకీ మరింత పెరుగుతాయి కూడా!కానీ ఎప్పుడూ ఒత్తిడికి లోనుకావద్దు. సీనియర్ ఆటగాళ్లు, శిక్షణా సిబ్బంది నుంచి సలహాలు తీసుకోండి. మ్యాచ్ సాగుతున్న తీరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. అద్భుతంగా ఆడుతున్న యువ ఆటగాళ్లందరికీ ఇదే నేనిచ్చే సలహా’’ అని ధోని పేర్కొన్నాడు.అందుకు ఓటమిఇక తమ ఓటమిపై స్పందిస్తూ.. మెరుగైన స్కోరు సాధించినప్పటికీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామని ధోని విచారం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్ విఫలమైతే ఆ ప్రభావం లోయర్ ఆర్డర్‌పై పడుతుందని.. ఏదేమైనా ఒకటీ రెండు వికెట్లు అనవసరపు షాట్లతో పారేసుకోవడం వల్ల మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నాడు. తమ ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (25 బంతుల్లో 42) మరోసారి అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు.ఐపీఎల్-2025: చెన్నై వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు👉వేదిక: అరుణ్‌జైట్లీ స్టేడియం, ఢిల్లీ👉టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్👉చెన్నై స్కోరు: 187/8 (20)👉రాజస్తాన్ స్కోరు: 188/4 (17.1)👉ఫలితం: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై రాజస్తాన్ గెలుపు.చదవండి: MI vs DC: వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దైపోతే.. ప్లే ఆఫ్స్ చేరేదెవరు?Jurel says that's how it's done 😎@rajasthanroyals sign off from #TATAIPL 2025 in an emphatic way 🩷Updates ▶ https://t.co/hKuQlLxjIZ #CSKvRR pic.twitter.com/F5H5AbcIVu— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్ హిస్టరీలోనే తొలి ప్లేయర్‌గా..
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఓ సీజన్లో అత్యంత పిన్న వయసులోనే అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మంగళవారం నాటి మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన వైభవ్ సూర్యవంశీని రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్, ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ గాయం కారణంగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది.విధ్వంసకర శతకంతొలి మ్యాచ్‌లో 20 బంతుల్లో 34 పరుగులతో అలరించిన పద్నాలుగేళ్ల వైభవ్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో సత్తా చాటాడు. కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించి.. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆ తర్వాతి మ్యాచ్‌లో డకౌట్ అయిన వైభవ్.. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. తాజాగా సీఎస్కేపై చితక్కొట్టిన ఈ హర్యానా కుర్రాడు 33 బంతుల్లో 57 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఏడు మ్యాచ్‌లు ఆడి ఓ శతకం, ఓ అర్ద శతకం సాయంతో 252 పరుగులు సాధించాడు.తద్వారా ఐపీఎల్లో ఒకే సీజన్లో అత్యధికసార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. అది కూడా 18 ఏళ్ల వయసులోపే ఈ ఘనత సాధించి.. తన పేరిట చెక్కు చెదరని రికార్డు లిఖించుకున్నాడు. ఇక ఐపీఎల్-2025లో తమ ఆఖరి మ్యాచ్‌లో చెన్నైతో తలపడ్డ రాజస్తాన్.. ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఓవరాల్‌గా సీజన్ మొత్తంలో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలుపొందింది.18 ఏళ్ల వయసు నిండక ముందే ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు👉వైభవ్ సూర్యవంశీ- మొత్తం పరుగులు- 252 (రెండు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు)👉ఆయుశ్ మాత్రే- మొత్తం పరుగులు- 206 (ఒక ఫిఫ్టీ ప్లస్ స్కోరు)👉రియాన్ పరాగ్- మొత్తం పరుగులు- 160 (ఒక ఫిఫ్టీ ప్లస్ స్కోరు)👉సర్ఫరాజ్ ఖాన్- మొత్తం పరుగులు- 111 (ఫిఫ్టీ ప్లస్ స్కోరు-0)👉అభిషేక్ శర్మ- 63 (ఫిఫ్టీ ప్లస్ స్కోరు-0).చదవండి: ఆ యంగ్ క్రికెటర్‌కు నేను హాగ్ ఇవ్వలేదు: ప్రీతి జింటాNo fear and pressure 🙅Just pure finesse 😎Vaibhav Suryavanshi with a scintillating fifty in the chase 🔥Updates ▶ https://t.co/hKuQlLxjIZ #TATAIPL | #CSKvRR | @rajasthanroyals pic.twitter.com/YUsYYeCQC0— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆటలోనే కాదు.. పెద్దలను గౌరవించడంలోనూ ముందే ఉంటానని నిరూపించాడు. ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs RR)తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) పాదాలకు నమస్కరించడం ఇందుకు నిదర్శనం. కాగా ఈ సీజన్లో తమ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్ సీఎస్కేతో మంగళవారం తలపడింది.ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై గెలుపొంది.. విజయంతో ముగించింది. మరోవైపు.. ధోని జట్టుకిది పదో పరాజయం కావడం గమనార్హం. టాస్ ఓడిన చెన్నై మొదట నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.ఆయుశ్ మాత్రే (20 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్), బ్రెవిస్ (25 బంతుల్లో 42; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆకాశ్ మధ్వాల్, యుద్వీర్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసి గెలిచింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరోసారి మెరిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (31 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు. ఆరంభంలో కుదేలైనా... చెన్నై ఆరంభంలోనే కాన్వే (10), ఉర్విల్ పటేల్ (0) వికెట్లను కోల్పోయింది. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే బౌండరీలతో అలరించాడు. పవర్‌ప్లేలో జట్టు పుంజుకుంటున్న తరుణంలో... ఆయుశ్ దూకుడుకు తుషార్ చెక్ పెట్టాడు. స్వల్ప వ్యవధిలో అశ్విన్ (13), జడేజా (1) వికెట్లను కోల్పోయిన చెన్నై 78/5 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఈ దశలో బ్రెవిస్, శివమ్ దూబే (32 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.వైభవ్ ధనాధన్లక్ష్య ఛేదనలో మొదట యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 36; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే దంచేశాడు. అతను అవుటైనప్పడు జట్టు స్కోరు 37/1. అందులో 36 జైస్వాల్‌వే! శాంసన్ వచ్చాకే వైభవ్ బ్యాట్‌కు పనిచెప్పాడు. భారీ సిక్సర్లతో విరుచుకు పడి 27 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే అశ్విన్ ఒకే ఓవర్లో శాంసన్, వైభవ్‌లను అవుట్ చేశాడు. పరాగ్ (3)ను నూర్ అహ్మద్ బౌల్తా కొట్టించాడు. అయితే చెన్నై పట్టుబిగించకుండా జురేల్ (12 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేయడంతో ఇంకా 2.5 ఓవర్లు మిగిలుండగానే రాజస్తాన్ గెలిచింది. మిస్టర్ కూల్ రియాక్షన్ ఇదీఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆనవాయితీ ప్రకారం చెన్నై- రాజస్తాన్ ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అయితే, వైభవ్ మాత్రం ఇందుకు భిన్నంగా.. చెన్నై సారథి ధోని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మిస్టర్ కూల్ కూడా వైభవ్ వెన్నుతట్టి బాగా ఆడావు అన్నట్లుగా ప్రశంసించాడు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు చేదు అనుభవాలే మిగిలినా.. వైభవ్ రూపంలో ప్రతిభ గల ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో ఓ సెంచరీ సాయంతో ఈ హర్యానా కుర్రాడు 252 పరుగులు సాధించాడు. ఈ సీజన్లో పద్నాలుగు మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది.చదవండి: IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు.. లక్నో వేదికగా ఆర్సీబీ మ్యాచ్‌లు 𝙈𝙤𝙢𝙚𝙣𝙩𝙨 𝙩𝙤 𝙘𝙝𝙚𝙧𝙞𝙨𝙝 😊This is what #TATAIPL is all about 💛🩷#CSKvRR | @ChennaiIPL | @rajasthanroyals pic.twitter.com/hI9oHcHav1— IndianPremierLeague (@IPL) May 20, 2025 -
ధోనికి ఒకటి.. సంజూకు రెండు.. ఒకే మ్యాచ్‌లో భారీ మైలురాయిపై కన్నేసిన సీఎస్కే, రాజస్థాన్ కెప్టెన్లు
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 20) నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు ధోని, సంజూ శాంసన్ ఓ భారీ మైలురాయిపై కన్నేశారు.ధోని ఓ సిక్సర్, సంజూ రెండు సిక్సర్లు బాదితే టీ20ల్లో 350 సిక్సర్ల మార్కును తాకుతారు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 33 మంది మాత్రమే ఈ మైలురాయిని తాకారు. పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు (1056) బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ తర్వాతి స్థానాల్లో పోలార్డ్ (908), రసెల్ (747), పూరన్ (634), అలెక్స్ హేల్స్ (560), మున్రో (557), రోహిత్ (542), జోస్ బట్లర్ (537), మ్యాక్స్‌వెల్ (530) ఉన్నారు (టాప్-10లో).ఇదిలా ఉంటే, నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజస్థాన్ ఆటగాళ్లు ఆకాశమే హద్దు అన్న రీతిలో బ్యాటింగ్ చేయవచ్చు. ఈ సీజన్లో ఆ జట్టు బ్యాటర్లు మొదటి నుంచి విధ్వంసం సృష్టిస్తున్నప్పటికీ లక్ కలిసి రాలేదు. యశస్వి జైస్వాల్, కుర్ర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరో సారి తెగబడి ఆడే ఛాన్స్ ఉంది. కొత్తగా జట్టులోకి వచ్చిన ప్రిటోరియస్ కూడా బ్యాట్‌కు పని చెప్పవచ్చుఈ సీజన్లో చాలా మ్యాచ్‌ల్లో రాయల్స్ గెలుపు వాకిట బోల్తా పడింది. ఇలా జరిగినందుకు ఈ సీజన్లో ఆ జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సీజన్లో రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. నేడు సీఎస్కేతో జరుగబోయే మ్యాచ్ రాయల్స్‌కు ఈ సీజన్లో చివరిది. కాబట్టి సీజన్‌ను గెలుపుతో ముగించి పరువు కాపాడుకోవాలని రాయల్స్ భావిస్తుంది.సీఎస్కే విషయానికొస్తే.. ఈ జట్టు బ్యాటర్లు కూడా నేటి మ్యాచ్‌లో విజృంభించే అవకాశం ఉంది. ఈ జట్టు బ్యాటర్లు ఎదురుదాడి చేస్తే పోయేదేముందన్న రీతిలో బ్యాటింగ్ చేయవచ్చు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఉంది. కుర్ర బ్యాటర్లు ఆయుశ్ మాత్రే, ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్ నుంచి రికార్డు విన్యాసాలు ఆశించవచ్చు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇరు జట్లు ఐపీఎల్లో ఇప్పటివరకు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే 16, రాయల్స్ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. 2020 నుంచి ఇరు జట్ల మధ్య జరిగిన 9 మ్యాచ్‌ల్లో రాయల్స్ ఏడింట విజయాలు సాధించింది. నేటి మ్యాచ్ నామమాత్రం కావడంతో ఇరు జట్లు ప్రయోగాల బాటపట్టవచ్చు.తుది జట్లు (అంచనా)..సీఎస్కే: ఆయుష్ మ్హత్రే, డెవాన్ కాన్వే, ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, శివమ్ దూబే, MS ధోని (కెప్టెన్), ఆర్ అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్/మతీషా పతిరానారాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, లువాన్-డ్రే ప్రిటోరియస్, వనిందు హసరంగా, క్వేనా మఫాకా, తుషార్ దేశ్‌పాండే, కుమార్ కార్తికేయ, నాంద్రే బర్గర్, అశోక్ శర్మ/శుభమ్ దూబే -
IPL 2025: పంజాబ్ 11 ఏళ్ల తర్వాత...
జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ జట్టు నెగ్గడంతో... పంజాబ్ కింగ్స్ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ ఖరారైంది. చివరిసారి పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్ జురేల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీశాడు. ధనాధన్ ఆరంభం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు 4, 0, 4, 4, 6, 4లతో జైస్వాల్ తొలి ఓవర్లోనే దీటైన ఆరంభమిచ్చాడు. రెండో ఓవర్‌ను వైభవ్ బౌండరీ, రెండు సిక్స్‌లతో చితగ్గొట్టాడు. దీంతో 2.5 ఓవర్లోనే రాజస్తాన్ 50 స్కోరు చేసేసింది. వైభవ్ చేసిన 40 పరుగులు 4 ఫోర్లు, 4 సిక్స్‌లతోనే సాధించడం విశేషం. ఐదో ఓవర్లో వైభవ్ అవుటవడంతో 76 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత యశస్వి ధాటిగా ఆడుతున్నా... సామ్సన్ (20), పరాగ్ (13) వికెట్లు పారేసుకోవడం ప్రతికూలమైంది. అయినా ధ్రువ్ జురేల్ భారీషాట్లతో ఆశలు రేపాడు. కానీ ఇంపాక్ట్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ కీలక వికెట్లను తీసి రాజస్తాన్‌ను దెబ్బకొట్టాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్‡్ష (సి) హెట్‌మైర్ (బి) తుషార్ 9; ప్రభ్‌సిమ్రన్ (సి) సామ్సన్ (బి) తుషార్ 21; ఒవెన్ (సి) సామ్సన్ (బి) క్వెనా మఫాక 0; నేహల్ (సి) హెట్‌మైర్ (బి) ఆకాశ్ 70; శ్రేయస్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 30; శశాంక్ (నాటౌట్) 59; అజ్మతుల్లా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–19, 2–34, 3–34, 4–101, 5–159. బౌలింగ్: ఫజల్హక్ 3–0–39–0, తుషార్ దేశ్‌పాండే 4–0–37–2, క్వెనా మఫాక 3–0–32 –1, పరాగ్ 3–0–26–1, హసరంగ 3–0–33–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఒవెన్ (బి) హర్‌ప్రీత్ 50; వైభవ్ (సి) బార్ట్లెట్ (బి) హర్‌ప్రీత్ 40; సామ్సన్ (సి) యాన్సెన్ (బి) అజ్మతుల్లా 20; పరాగ్ (బి) హర్‌ప్రీత్ 13; జురేల్ (సి) ఒవెన్ (బి) యాన్సెన్ 53; హెట్‌మైర్ (సి) బార్ట్లెట్ (బి) అజ్మతుల్లా 11; దూబే (నాటౌట్) 7; హసరంగ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) యాన్సెన్ 0; క్వెన మఫాక (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–109, 3–114, 4–144, 5–181, 6–200, 7–200. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–60–0, యాన్సెన్ 3–0–41–2, బార్ట్లెట్ 1–0–12–0, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–22–3, చహల్ 4–0–30–0, అజ్మతుల్లా 4–0–44–2. -
రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్(17 పాయింట్లు) రెండో స్ధానానికి చేరుకుంది. ఈ ఏడాది సీజన్లో శ్రేయస్ టీమ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. రెండింటిలో ఓ మ్యాచ్‌లో విజయం సాధించినా చాలు పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది.వధేరా, శశాంక్ మెరుపులుఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70), శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు, మఫాక, పరాగ్, మధ్వాల్ తలా వికెట్ సాధించారు.ఆరంభం వచ్చినా..అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేయగల్గింది. లక్ష్య చేధనలో రాజస్తాన్ ఓపెనర్లు(50), వైభవ్ సూర్యవంశీ(40) అద్బుతమైన ఆరంభం ఆందించారు.తొలి వికెట్‌కు 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ధ్రువ్‌జురెల్(53) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్ బౌలర్లలో హార్ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ఒమర్జాయ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే' -
IPL 2025: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్.. తుది జట్లు ఇవే..!
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 18) మధ్యాహ్నం సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో (జైపూర్) జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా శాంసన్ గత కొన్ని మ్యాచ్‌లుగా దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేసింది. గాయపడ్డ నితీశ్ రాణా స్థానంలో సంజూ శాంసన్.. జోఫ్రా ఆర్చర్ స్థానంలో క్వేనా మపాకా తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్ విషయానికొస్తే.. ఈ జట్టు మూడు మార్పులు చేసింది. మిచెల్ ఓవెన్, మార్కో జన్సెన్, ఒమర్జాయ్ తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ ఆ జట్టుకు నామమాత్రమే. మరోవైపు పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో ముందువరుసలో ఉంది. ఆ జట్లు ఈ మ్యాచ్ గెలిస్తే, ప్లే ఆఫ్స్ రేసులో ముందుకెళ్తుంది.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(wk), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్హాక్ ఫరూఖీ, క్వేనా మఫాకా.ఇంపాక్ట్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, అశోక్ శర్మ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (WK), ప్రియాంష్ ఆర్య, మిచ్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్ (c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్లెట్.ఇంపాక్ట్ సబ్స్: విజయ్‌కుమార్ వైషాక్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్ -
‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా పంజాబ్ కింగ్స్
జైపూర్: ఐపీఎల్లో అనూహ్యంగా ఆగిపోయిన తమ ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా శుభారంభం చేసిన తర్వాత మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో పంజాబ్ గెలుపు అవకాశం చేజార్చుకుంది. ఇప్పుడు లీగ్‌లో బలహీన జట్టుపై గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు మరింత చేరువ కావాలని జట్టు భావిస్తోంది. నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో పంజాబ్ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు ఇప్పటికే కోల్పోయిన రాజస్తాన్ లీగ్‌లో చివరి స్థానంలో నిలవకుండా ఉండాలని కోరుకుంటోంది. తొలిసారి మిచ్ ఓవెన్... ఐపీఎల్ వాయిదా పడటంతో పంజాబ్ ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఆసీస్ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్‌గ్లిస్ తిరిగి రావడానికి విముఖత చూపారు. దాంతో ఇప్పుడు తప్పనిసరి స్థితిలో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాక్స్‌వెల్ గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన మిచెల్ ఒవెన్ తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగడం ఖాయమైంది. విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒవెన్ గత ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు హోబర్ట్ హరికేన్స్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టాపార్డర్ బ్యాటర్ అయిన ఒవెన్... ప్రస్తుతం పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్‡్ష ఆర్య అద్భుతంగా ఆడుతుండటంతో మిడిలార్డర్లో ఆడాల్సి రావచ్చు. బౌలింగ్‌ను పటిష్టపర్చుకోవడంలో భాగంగా కివీస్ పేసర్ కైల్ జేమీసన్‌ను పంజాబ్ ఆడించే అవకాశం ఉంది. శ్రేయస్, వధేరా, శశాంక్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. చహల్, అర్‡్షదీప్ ఫామ్‌లో ఉండటంతో పాటు మార్కో యాన్సెన్ కూడా మెరుగ్గా రాణిస్తుండటం పంజాబ్‌కు సానుకూలాంశం. బరిలోకి సంజు సామ్సన్... రాజస్తాన్ పేలవ ఆటతో చాలా ముందే ప్లే ఆఫ్స్ అవకాశాలు చేజార్చుకుంది. జట్టు 12 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లే గెలిచింది. మిగిలిన మ్యాచ్‌లలోనైనా రాణించి పరువు కాపాడుకోవాలని టీమ్ భావిస్తోంది. నెల రోజుల క్రితం తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సంజు సామ్సన్ కోలుకొని ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా రాణిస్తుండటంతో అతను మూడో స్థానంలో ఆడతాడు. పరాగ్, జురేల్ కూడా రాణిస్తే రాయల్స్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. విదేశీ ఆటగాళ్లు హెట్‌మైర్, హసరంగ, తీక్షణ జట్టుతో చేరారు. అయితే టోర్నీ ఆరంభంనుంచి చాలా బలహీనంగా ఉన్న రాజస్తాన్ పేస్ బృందం ఆర్చర్, సందీప్ శర్మ దూరం కావడంతో ఇప్పుడు మరింత బలహీనంగా మారింది. తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వాల్, నాండ్రే బర్గర్ పంజాబ్ బ్యాటర్లను ఎలా నిలువరిస్తారో చూడాలి. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ హోం గ్రౌండ్‌కు బాంబు బెదిరింపు
'అపరేషన్ సిందూర్' తర్వాత భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సజావుగా కొనసాగడం అనుమానంగా మారింది. షెడ్యూల్ ప్రకారం లీగ్ కొనసాగుతుందని బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చెబుతున్నా.. అభిమానుల్లో ఏదో తెలీని గందరగోళం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు జరగాలంటే జట్లు వేర్వేరు వేదికలు తిరుగుతూ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే పాక్ దాడులకు పాల్పడవచ్చన్న అనుమానంతో భారత ప్రభుత్వం దేశంలో పలు విమానాశ్రయాలను మూసి వేయించింది. ఇందులో ఐపీఎల్ మ్యాచ్‌లకు వేదికలైన చండీఘడ్, ధర్మశాల ఉన్నాయి. ఈ క్రమంలో మే 11న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ అహ్మదాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది.తాజాగా ఓ వార్త ఐపీఎల్ వర్గాల్లో కలకలం రేపుతుంది. మే 16న జైపూర్‌లోని సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగాల్సిన పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. సువాయ్ మాన్ సింగ్ స్టేడియంను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. ఈ ఈ-మెయిల్ ఇవాళ (మే 8) ఉదయం 9:13 గంటల సమయంలో వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన రాజస్థాన్ స్పోర్ట్స్ కౌన్సిల్ పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు స్టేడియంను ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్లు, తనిఖీ యూనిట్లతో స్టేడియంను జల్లెడ పట్టారు. స్టేడియంలో ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కాగా, నిన్న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు కూడా ఇలాంటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. స్టేడియంను పేల్చి వేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. అయితే పోలీసులు వెంటనే అలర్టై మ్యాచ్‌ను సజావుగా సాగేలా చూశారు. నిన్న ఈడెన్ గార్డెన్లో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్, సీఎస్కే తలపడ్డాయి. వరుసగా రెండు రోజులు ఐపీఎల్ వేదికలకు బాంబు బెదిరింపులు రావడాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సీరియస్‌గా తీసుకుంది. మ్యాచ్‌లకు ఎలాంటి ఆటంకం కలగకుండా సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంది.మరోవైపు భారత దళాలు పాక్‌లోని రావల్పిండి స్టేడియంపై చేసిన డ్రోన్ దాడి కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. లీగ్‌లో భాగంగా ఇవాళ బాబర్ ఆజం కెప్టెన్సీలోని పెషావర్ జల్మీ- డేవిడ్ వార్నర్ సారథ్యంలోని కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. డ్రోన్ దాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. పాక్ క్రికెట్ బోర్డు క్రికెటర్లను రావల్పిండి విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలుస్తుంది.కాగా, పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి బదులుగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భారత దళాలు పాక్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేస్తున్నాయి. మంగళవారం జరిగిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తుంది. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతూ ఉంది. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌లో మరో కీలక మార్పు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ రాయల్స్.. తమ జట్టులో గాయపడిన ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను ప్రకటించింది. తొలుత నితీశ్ రాణాకు ప్రత్యామ్నాయంగా సౌతాఫ్రికా బ్యాటర్ లువాన్ డ్రి ప్రిటోరియస్‌ను జట్టులోకి తీసుకున్న రాయల్స్.. తాజాగా మరో గాయపడిన ఆటగాడు సందీప్ శర్మకు ప్రత్యామ్నాయంగా సౌతాఫ్రికాకే చెందిన నండ్రే బర్గర్‌ను ఎంపిక చేసుకుంది. బర్గర్‌ను రాయల్స్ రూ. 3.5 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ సీజన్లో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉన్నా బర్గర్‌పై రాయల్స్ భారీ మొత్తాన్ని వెచ్చించింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన బర్గర్ గత ఐపీఎల్ సీజన్లో కూడా రాయల్స్‌కే ఆడాడు. ఆ సీజన్లో అతను 6 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. సందీప్ శర్మ విషయానికొస్తే.. ఈ సీజన్లో ఓ మోస్తరు ఫామ్‌లో ఉండిన సందీప్ చేతి వేలి గాయం కారణంగా రెండు మ్యాచ్‌ల ముందే వైదొలిగాడు. సందీప్ ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీశాడు. రాజస్తాన్ రాయల్స్‌కు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్ అనే సిస్టర్ ఫ్రాంచైజీ ఉండటంతో ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా ఆ దేశ ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. నితీశ్‌కు ప్రత్యామ్నాయంగా రాయల్స్ జట్టులోకి వచ్చిన లువాన్ డ్రి ప్రిటోరియస్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతన్ని రాజస్థాన్ రాయల్స్ సీజన్లో మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌ల కోసం రూ. 30 లక్షల కనీస ధరకు సొంతం చేసుకుంది. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ప్రిటోరియస్‌కు విధ్వంసకర వీరుడిగా పేరుంది. అతను వికెట్‌కీపింగ్ కూడా చేయగలడు.ఇదిలా ఉంటే, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆది నుంచే షాకులు తగులుతున్నాయి. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయం కారణంగా వీల్‌చైర్ నుంచే మార్గదర్శనం చేస్తుండగా.. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా కొన్ని మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. ఈ సీజన్లో రాజస్థాన్ సీఎస్కే (మే 12), పంజాబ్ కింగ్స్‌తో (మే 16) మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ 3 విజయాలు, 9 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. -
నితీశ్ రాణా అవుట్.. రాజస్తాన్ జట్టులోకి చిచ్చర పిడుగు
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన రాజస్తాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ నితీశ్ రాణా (Nitish Rana) గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లన్నిటికీ దూరమయ్యాడు. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ ఈ విషయాన్ని గురువారం ధ్రువీకరించింది.నితీశ్ రాణా స్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్ లువాన్ డ్రి ప్రిటోరియస్ (Lhuan-dre Pretorius)ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. రూ. 30 లక్షల కనీస ధరతో అతడిని సొంతం చేసుకున్నట్లు తెలిపింది. కాగా 19 ఏళ్ల ప్రిటోరియస్ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడి.. 911 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఇప్పటి వరకు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు 97.చిచ్చర పిడుగేఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ప్రిటోరియస్.. వికెట్ కీపర్‌గా కూడా! సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో రాజస్తాన్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఈ ఏడాది లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.ఎస్ఏటీ20- 2025లో ప్రిటోరియస్ 12 మ్యాచ్‌లలో కలిపి 166కు పైగా స్ట్రైక్‌రేటుతో 397 పరుగులు సాధించాడు. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ జట్టుపై 51 బంతుల్లో 97 పరుగులు సాధించిన తీరు అతడి కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. ఇక కౌంటీల్లో విటలిటి బ్లాస్ట్‌తో కూడా అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా గతేడాది అండర్-19 ప్రపంచకప్ టోర్నమెంట్లోనూ సౌతాఫ్రికా తరఫున ప్రిటోరియస్ టాప్ రన్ స్కోరర్‌గా నిలవడం విశేషం.ఆది నుంచే షాకులుఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో రాజస్తాన్ రాయల్స్‌కు ఆది నుంచే షాకులు తగులుతున్నాయి. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ గాయం కారణంగా వీల్‌చైర్ నుంచే మార్గదర్శనం చేస్తున్నాడు. ఇక తొలి మూడు మ్యాచ్‌లకు కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్నెస్ లేని కారణంగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే బరిలోకి దిగాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా గాయంతో మళ్లీ జట్టుకు దూరమయ్యాడు.ఇక సంజూ గైర్హాజరీలో రియాన్ పరాగ్ రాజస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. ఇప్పటికి రాయల్స్ ఆడిన 12 మ్యాచ్‌లలో ఏకంగా తొమ్మిది ఓడి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సీజన్లో జట్టుకు ఇంకా రెండు మ్యాచ్ (చెన్నై, పంజాబ్)లు మిగిలి ఉన్నాయి. కాగా నితీశ్ రాణా ఈ సీజన్లో పదకొండు మ్యాచ్‌లు ఆడి 217 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 81.పడిక్కల్ స్థానంలో మయాంక్ అగర్వాల్గాయం కారణగా ఐపీఎల్‌కు దూరమైన దేవదత్ పడిక్కల్ స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు... భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసుకుంది. తాజా సీజన్లో 10 మ్యాచ్‌లాడి 247 పరుగులు చేసిన పడిక్కల్ కండరాలు పట్టేయడంతో మిగిలిన సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో కర్ణాటకకే చెందిన మయాంక్‌ను 1 కోటి రూపాయల ధరతో ఆర్సీబీ తీసుకుంది.మరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అఫ్గానిస్తాన్ ప్లేయర్ సాదిఖుల్లాను జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ స్థానంలో 23 ఏళ్ల సాదిఖ్‌ను ఎంపిక చేసుకుంది. అతను 49 టి20ల్లో 1507 పరుగులు చేశాడు. వేలంలో అమ్ముడుపోయిన తర్వాత ఐపీఎల్లో ఆడేందుకు నిరాకరించడంతో బ్రూక్‌పై బీసీసీఐ నిషేధం విధించింది. చదవండి: అతడికి థాంక్యూ.. అద్భుతంగా ఆడాడు.. ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాతే..: ధోని -
‘కళ్లుచెదిరే ప్రదర్శన.. వైభవ్ ఆట ఆకట్టుకుంది’
ఐపీఎల్-2025 (IPL 2025)లో సంచలన బ్యాటింగ్‌తో అందరికంటా పడిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసలతో ముంచెత్తారు. అతడు పడిన కష్టం, ఆడిన తీరు తనని అమితంగా ఆకట్టుకుందని అన్నారు. బిహార్‌లో ‘ఖేలో ఇండియా’ గేమ్స్ ఆరంభోత్సవం సందర్భంగా మోదీ వీడియో సందేశం ఇచ్చారు. కళ్లుచెదిరే ప్రదర్శనఈ సందర్భంగా క్రీడాకారుల కష్టాన్ని కొనియాడిన ఆయన వైభవ్ విధ్వంసక శతకాన్ని ఆ వీడియో సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ‘బిహార్ ముద్దుబిడ్డ వైభవ్ సూర్యవంశీ. అతను ఆడిన మ్యాచ్‌ను చూశాను. 14 ఏళ్ల కౌమార ప్రాయంలోనే కళ్లుచెదిరే ప్రదర్శన కనబరిచాడు.ఇన్నాళ్లు ఏ భారత బ్యాటర్‌కు సాధ్యంకానీ రికార్డును సాధించిన ఘనత వైభవ్‌కే దక్కుతుంది. ఇంతచిన్న వయసులో అంతటి ఇన్నింగ్స్ ఆడటం మాటలు కాదు. దీనికోసం అతనెంతో కష్టపడ్డాడు. ఆటకోసం తపించాడు. అంకితభావంతో ముందడుగు వేశాడు. అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అని ఆ సందేశంలో ప్రశంసల మోదీ వర్షం కురిపించారు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమంతో తమ ప్రభుత్వం క్రీడాకారుల సాఫల్యం కోసం కృషిచేస్తోందని చెప్పారు. అన్ని రకాలుగా అండదండలు అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.కొత్తకొత్త క్రీడలపై కూడా కసరత్తు చేయాలిమన భారత అథ్లెట్లు క్రికెట్, హాకీలే కాదు కొత్తకొత్త క్రీడలపై కూడా కసరత్తు చేయాలని ప్రధాని సూచించారు. గ్రామీణ క్రీడ ఖో–ఖోతో పాటు గట్కా, మల్లకంభ, యోగాసన తదితర కొత్త క్రీడల్ని ‘ఖేలో–ఇండియా’లో భాగం చేశామని చెప్పారు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో వైభవ్‌ను రాజస్తాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది.వేగవంతమైన సెంచరీఈ టీనేజ్ కుర్రాడు వైభవ్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో విధ్వంసరచన చేశాడు. కేవలం 35 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. 30 బంతుల్లో గేల్ చేసిన సెంచరీ మొదటి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. గుజరాత్‌పై సెంచరీ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. గత రెండు మ్యాచ్‌లలో ఈ కుర్రాడు విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో డకౌట్ అయిన వైభవ్.. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో నాలుగు పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే, వైభవ్ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉన్నాడని.. తప్పక తన పొరపాట్లను సరిచేసుకుంటాడని పలువురు మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలుస్తున్నారు.చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ జట్టులో చరిత్ర సృష్టించిన బౌలర్ -
కోల్‌కతా బతికిపోయింది!
వరుసగా రెండో రోజు మరో ఉత్కంఠ భరిత పోరు. ఆఖరి బంతిదాకా విజయం కోసం రెండు జట్ల సమరం. చివరకు పరుగు తేడాతో ఒక జట్టు గట్టెక్కితే... మరో జట్టు పోరాడి ఓడింది. 6 బంతుల్లో 22 పరుగులు చేస్తేనే రాజస్తాన్ రాయల్స్‌ను విజయం వరిస్తుంది. ఇది రాయల్స్‌కు క్లిష్టమైంది. కోల్‌కతాకు కలిసొచ్చేది. వైభవ్ అరోరా వేసిన ఈ ఓవర్లో 5 బంతులు ముగిసేసరికి 2, 1, 6, 4, 6లతో 19 పరుగులు వచ్చేశాయి. ఇక 1 బంతి 3 పరుగులు... ఇది ఇరుజట్లను మునికాళ్లపై నిలబెట్టేసింది. అప్పటిదాకా సిక్స్‌లు, ఫోర్ బాదిన శుభమ్ దూబే భారీషాట్ ఆడలేకపోయాడు. ‘టై’ కోసం రెండు పరుగులు తీసే ప్రయత్నం కూడా ఆర్చర్ రనౌట్‌తో వృథా ప్రయాసే అయ్యింది. చివరకు ఒకే ఒక్క పరుగుతేడాతో నైట్‌రైడర్స్ ఊపిరి పీల్చుకుంది. కోల్‌కతా: ఇకపై ప్రతీ మ్యాచ్ నెగ్గితేనే ముందుకెళ్లే పరిస్థితుల్లో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిచి ‘ప్లే ఆఫ్స్’ రేసులో నిలిచింది. ఆదివారం ఉత్కంఠరేపిన ఐపీఎల్ మ్యాచ్‌లో రహానే సారథ్యంలోని కోల్‌కతా ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రీ రసెల్ (25 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఫిఫ్టీ సాధించాడు. అంగ్క్రిష్ రఘువంశీ (31 బంతుల్లో 44; 5 ఫోర్లు), గుర్బాజ్ (25 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్), రహానే (24 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు.ఆర్చర్, పరాగ్, తీక్షణ, యుధ్వీర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (21 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) జోరు కనబరిచాడు. టాపార్డర్‌లో వైభవ్ సూర్యవంశీ (4), కునాల్ రాథోడ్ (0), మిడిలార్డర్లో ధ్రువ్ జురేల్ (0), హసరంగ (0) నిరాశపరిచినా... కెపె్టన్ రియాన్ పరాగ్ (45 బంతుల్లో 95; 6 ఫోర్లు, 8 సిక్స్‌లు) వీరోచిత పోరాటం చేశాడు. హెట్‌మైర్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) కీలక దశలో షరామామూలుగా చేతు లెత్తేశాడు. శుభమ్ దూబే (14 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఆఖరి బంతిదాకా జట్టు గెలిచేందుకు నిలిచినా... ఆర్చర్ (12) రనౌట్‌తో ఆశలు కూలాయి. మొయిన్ అలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) హెట్‌మైర్ (బి) తీక్షణ 35; నరైన్ (బి) యు«ద్వీర్ 11; రహానే (సి) జురేల్ (బి) పరాగ్ 30; రఘువంశీ (సి) సబ్–అశోక్ (బి) ఆర్చర్ 44; రసెల్ (నాటౌట్) 57; రింకూ సింగ్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 206. వికెట్ల పతనం: 1–13, 2–69, 3–111, 4–172. బౌలింగ్: ఆర్చర్ 4–0–30–1, యు«ద్వీర్ 2–0– 26–1, తీక్షణ 4–0–41–1, ఆకాశ్ 3–0– 50–0, హసరంగ 4–0–35–0, పరాగ్ 3–0–21–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) రింకూ సింగ్ (బి) మొయిన్ అలీ 34; వైభవ్ (సి) రహానే (బి) వైభవ్ అరోరా 4; కునాల్ (సి) రసెల్ (బి) మొయిన్ అలీ 0; పరాగ్ (సి) వైభవ్ అరోరా (బి) హర్షిత్ 95; ధ్రువ్ జురేల్ (బి) వరుణ్ 0; హసరంగ (బి) వరుణ్ 0; హెట్‌మైర్ (సి) నరైన్ (బి) హర్షిత్ 29; శుభమ్ దూబే (నాటౌట్) 25; ఆర్చర్ (రనౌట్) 12; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–5, 2–8, 3–66, 4–71, 5–71, 6–163, 7–173, 8–205. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–50–1, మొయిన్ అలీ 3–0–43–2, హర్షిత్ రాణా 4–0–41–2, వరుణ్ చక్రవర్తి 4–0–32–2, సునీల్ నరైన్ 4–0–27–0, రసెల్ 1–0–11–0. పరాగ్... 6 బంతుల్లో 6 సిక్స్‌లు ఒకే ఓవర్ కాకపోయినా... పరాగ్ తానెదుర్కొన్న వరుస ఆరు బంతుల్లో (వైడ్ మినహా) ఆరు సిక్సర్లతో చెలరేగాడు. ముందుగా మొయిన్ అలీ 12వ ఓవర్లో తొలి బంతికి హెట్‌మైర్ పరుగు తీశాడు. 2వ బంతి నుంచి స్ట్రయిక్ తీసుకున్న పరాగ్ 6, 6, 6, 6, వైడ్, 6లతో ఆ ఓవర్లో 32 పరుగులు వచ్చాయి. మళ్లీ మరుసటి ఓవర్లో హెట్‌మైర్ సింగిల్ తీయగా, పరాగ్ 6 బాదడంతో రెండు ఓవర్లలో వరుసగా 6 బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. ఈ 8 బంతుల్లో సాధించిన 39 పరుగులతోనే జట్టు లక్ష్యఛేదనలో ఆశలుపెంచింది. -
IPL 2025: చరిత్ర సృష్టించిన రియాన్ పరాగ్.. ఐపీఎల్ హిస్టరీలోనే
ఐపీఎల్-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్.. ఆఖరి బంతి వరకు పోరాడింది. చివరి ఓవర్లో రాజస్తాన్ రాయల్స్ విజయానికి 22 పరుగులు అవసరమవ్వగా.. శుభమ్ దూబే వరుసగా బౌండరీలు బాది గెలుపునకు చేరువ చేశాడు.కానీ ఆఖరి బంతికి నాన్‌స్ట్రైక్‌లో జోఫ్రా అర రనౌట్ కావడంతో రాజస్తాన్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఓటమి పాలైనప్పటికి.. ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ తన అద్బుత ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ఓ దశలో రాజస్తాన్‌ను ఈజీగా గెలిపించేలా కన్పించిన పరాగ్.. కీలక సమయంలో ఔట్ కావడంతో మ్యాచ్ ఫలితం తారుమారైంది. పరాగ్ తృటిలో తొలి ఐపీఎల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 45 బంతులు ఎదుర్కొన్న పరాగ్.. 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో పరాగ్ వరుస ఆరు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన స్పిన్నర్ మోయిన్ అలీ బౌలింగ్‌లో తొలి బంతికి షిమ్రన్ హెట్మెయిర్ సింగిల్ తీసి పరాగ్‌కు స్టైక్ ఇచ్చాడు. ఆ తర్వాతి ఐదు బంతులను రియాన్ సిక్సర్లగా మలిచాడు. ఆ తర్వాత 14 ఓవర్ తొలి బంతికి ఓ పరుగు తీసి మళ్లీ పరాగ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. పరాగ్ ఆ బంతిని కూడా స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో వరుసగా తను ఎదర్కొన్న ఆరు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో వరుసగా ఆరు సిక్స్‌లు బాదిన తొలి ప్లేయర్‌గా పరాగ్ రికార్డులకెక్కాడు.చదవండి: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు.. హృదయం ముక్కలైంది!𝙍𝙖𝙢𝙥𝙖𝙣𝙩 𝙍𝙞𝙮𝙖𝙣 🔥The #RR captain is in the mood tonight 😎He keeps @rajasthanroyals in the game 🩷Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @rajasthanroyals | @ParagRiyan pic.twitter.com/zwGdrP3yMB— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
శెభాష్ రియాన్!.. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు.. కానీ పాపం..
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్ (KKR vs RR) కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆరంభంలోనే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న వేళ తానున్నానంటూ బ్యాట్ ఝులిపించాడు.ఓ వైపు వికెట్లు పడుతున్నా ఏకాగ్రత చెదరనీయకుండా నిలకడగా ఆడిన రియాన్ పరాగ్.. 27 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కసారిగా గేరు మార్చేశాడు. అప్పటికి రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు ముగియగా స్కోరు 102-5గా ఉంది.పూనకం వచ్చినట్లుగా ఆ మరుసటి ఓవర్లో రియాన్ పరాగ్ పూనకం వచ్చినట్లుగా బ్యాట్‌తో బంతిని బాదేశాడు. పదమూడో ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన కేకేఆర్ స్పిన్నర్ మొయిన్ అలీకి చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో తొలి బంతిని షిమ్రన్ హెట్మెయిర్ (29) ఎదుర్కొని సింగిల్ తీశాడు.ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ ఆ తర్వాతి ఐదు బంతుల్లో వరుసగా సిక్సర్లు బాదాడు. ఇందుకు తోడు ఈ ఓవర్లో మొయిన్ అలీ ఓ వైడ్ కూడా వేశాడు. ఫలితంగా పదమూడో ఓవర్లో రాజస్తాన్‌కు ఏకంగా 32 పరుగులు వచ్చాయి. రియాన్ పరాగ్ స్కోరు 75 పరుగులకు చేరింది.సెంచరీకి ఐదు పరుగుల దూరంలో కాగా ఇలా ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం ద్వారా రియాన్ పరాగ్ చరిత్రకెక్కాడు. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన రియాన్ పరాగ్ దురదృష్టవశాత్తూ.. సెంచరీకి ఐదు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.పద్దెనిమిదవ ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో నాలుగో బంతికి షాట్ ఆడేందుకు బాల్‌ను గాల్లోకి లేపగా.. లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్ అరోరా క్యాచ్ పట్టాడు. దీంతో రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న అతడు ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్- రాజస్తాన్ ఆదివారం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడిన రాజస్తాన్ రాయల్స్ ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ చేతిలో ఓటమిపాలైంది.ఐపీఎల్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే👉క్రిస్ గేల్ 2012లో రాహుల్ శర్మ బౌలింగ్‌లో👉రాహుల్ తెవాటియా 2020లో కాటెరెల్ బౌలింగ్‌లో👉రవీంద్ర జడేజా 2021లో హర్షల్ పటేల్ బౌలింగ్‌లో👉రింకూ సింగ్ 2023లో యశ్ దయాళ్ బౌలింగ్‌లో👉రియాన్ పరాగ్ 2025లో మొయిన్ అలీ బౌలింగ్‌లో..ఐపీఎల్ 2025: కోల్‌కతా వర్సెస్ రాజస్తాన్👉కోల్‌కతా స్కోరు: 206/4 (20)👉రాజస్తాన్ స్కోరు: 205/8 (20)చదవండి: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు.. హృదయం ముక్కలైంది!𝙍𝙖𝙢𝙥𝙖𝙣𝙩 𝙍𝙞𝙮𝙖𝙣 🔥The #RR captain is in the mood tonight 😎He keeps @rajasthanroyals in the game 🩷Updates ▶ https://t.co/wg00ni9CQE#TATAIPL | #KKRvRR | @rajasthanroyals | @ParagRiyan pic.twitter.com/zwGdrP3yMB— IndianPremierLeague (@IPL) May 4, 2025 -
వారెవ్వా రహానే.. కళ్లు చెదిరే క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే సంచలన క్యాచ్‌తో మెరిశాడు. రహానే అద్భుత క్యాచ్‌తో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని పెవిలియన్‌కు పంపాడు.తొలి ఓవర్ వేసిన వైభవ్ ఆరోరా.. నాలుగో బంతిని షార్ట్ బాల్ సంధించాడు. ఆ బంతిని వైభవ్ సూర్యవంశీ పుల్ షాట్ కోసం ప్రయత్నించాడు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి మిడ్-వికెట్ వైపు గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్ వికెట్లో ఉన్న రహానే పరిగెత్తుకుంటూ వెళ్లి చివరి వరకు బంతిపై దృష్టికోల్పోకుండా అద్భుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 4 పరుగులు చేసిన సూర్యవంశీ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది.కేకేఆర్ బ్యాటర్లలో రస్సెల్ 25 బంతుల్లో 57 టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ అజింక్య రహానే (24 బంతుల్లో 30), అంగ్క్రిష్ రఘువన్షీ (31 బంతుల్లో 44) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్ చరక్ ఒక్కో వికెట్ తీశారు. A M A Z I N G C A T C H! 💜🙌🏻A dream start for #KKR as #AjinkyaRahane pulls off a stunner, sending #VaibhavSuryavanshi back early in this must-win #IPLRace2Playoffs fixture! 🙌🏻Watch the LIVE action ➡ https://t.co/jVhilCKHmy#IPLonJioStar 👉 #KKRvRR | LIVE NOW on Star… pic.twitter.com/sOnQKFaLnT— Star Sports (@StarSportsIndia) May 4, 2025 -
నీకసలు సంస్కారం ఉందా?.. అతడికి ఇచ్చే గౌరవం ఇదేనా?
ఐపీఎల్-2025లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన సహనాన్ని కోల్పోయాడు. పరాగ్ తన సహచర ఆటగాడు యశస్వి జైశ్వాల్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు.కేకేఆర్ ఇన్నింగ్స్ 10 వ ఓవర్ వేసిన రియాన్ పరాగ్.. అంగ్క్రిష్ రఘువంశీకి మూడో బంతిని ఔట్‌సైడ్ హాఫ్ దిశగా సంధించాడు. ఆ బంతిని రఘువంశీ వైడ్ లాంగ్-ఆఫ్‌పై లాఫ్ట్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో జైశ్వాల్ తన ఎడమ వైపునకు పరిగెత్తి బంతిని హాఫ్ చేశాడు.అయితే జైశ్వాల్ ఫీల్డ్‌లో కాస్త నెమ్మదిగా కదలడంతో రఘువంశీ, రస్సెల్ రెండు పరుగులు పూర్తి చేసుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన పరాగ్.. దుర్భాషలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో పరాగ్‌పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నీకసలు సంస్కారం ఉందా? సీనియర్ ఆటగాడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు.ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో రస్సెల్ 25 బంతుల్లో 57 టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ అజింక్య రహానే (24 బంతుల్లో 30), అంగ్క్రిష్ రఘువన్షీ (31 బంతుల్లో 44) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, యుధ్వీర్ సింగ్ చరక్ ఒక్కో వికెట్ తీశారు.pic.twitter.com/7UIZbqs72F— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) May 4, 2025 Watch out for your heads, it's raining sixes! 😮💨🙌🏻#AndreRussell steps up when it matters as he brings up a crucial fifty right on cue for #KKR in this crunch #Race2Playoffs clash! 💪🏻🔥Watch the LIVE action ➡ https://t.co/jVhilCLfc6#IPLonJioStar 👉 #KKRvRR | LIVE NOW on… pic.twitter.com/UQLXfiQzEm— Star Sports (@StarSportsIndia) May 4, 2025 -
IPL 2025: వైభవ్ సూర్యవంశీపై సీఎస్కే మాజీ ఓపెనర్ సంచలన కామెంట్స్
ఐపీఎల్లో తన మూడో ఇన్నింగ్స్‌లోనే విధ్వంసకర శతకం (35 బంతుల్లో) బాది బేబీ బాస్‌గా గుర్తింపు తెచ్చుకున్న 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ అభినవ్ ముకుంద్ సంచలన కామెంట్స్ చేశాడు. రాయల్స్ సూర్యవంశీని వేలంలో కొనుగోలు చేయాల్సింది కాదని అభినవ్ అభిప్రాయపడ్డాడు. రాయల్స్ యాజమాన్యం సూర్యవంశీతో పాటు నితీశ్ రాణాపై అనవసర పెట్టుబడి పెట్టిందని అన్నాడు. తానైతే సూర్యవంశీని రూ. 1.1 కోట్లకు, నితీశ్ రాణాను రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసేవాడిని కాదని తెలిపాడు.వైభవ్, నితీశ్‌పై పెట్టిన పెట్టుబడిని మంచి బౌలర్ల కోసం వినియోగించుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. రాయల్స్ మేనేజ్మెంట్ బ్యాటర్ల మోజులో పడి బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అన్నాడు. ఈ సీజన్లో ఆర్చర్ ఒక్కడే తీసుకున్న డబ్బుకు న్యాయం చేశాడని పేర్కొన్నాడు. రాయల్స్ యాజమాన్యం ఎంపిక చేసుకున్న భారత్ బౌలర్లలో (తుషార్ దేశ్‌పాండే, యుద్ద్‌వీర్ సింగ్, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ) ఒక్కరు కూడా సత్తా చాటలేకపోయారని అన్నాడు. తుషార్ దేశ్‌పాండేపై రూ. 6.75 కోట్ల పెట్టుబడి పెట్టి అనవసరంగా డబ్బును వృధా చేసుకున్నారని అన్నాడు. గత సీజన్లో తమ పంచన ఉన్న బౌల్ట్, చహల్, ఆవేశ్ ఖాన్, అశ్విన్‌ను వదిలేసి రాయల్స్ యాజమాన్యం మూల్యం చెల్లించుకుందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా మెగా వేలంలో రాయల్స్ ఎంపికలను తప్పుబట్టాడు.కాగా, ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇదివరకే సత్తా చాటిన ఆటగాళ్లను వేలానికి వదిలేసి పెద్ద తప్పిదం చేసింది. బ్యాటింగ్‌లో బట్లర్, బౌలింగ్‌లో చహల్, బౌల్ట్ ఆ జట్టుకు ఎన్నో అపురూప విజయాలు అందించారు. వీరిని కాదని రాయల్స్ యాజమాన్యం యువ ఆటగాళ్లపై పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టి కొనుగోలు చేసిన లంక స్పిన్ ద్వయం హసరంగ, తీక్షణ ఆశించిన ప్రభావం చూపలేకపోయారు. రిటైన్ చేసుకున్న వారిలో కెప్టెన్ శాంసన్ గాయంతో సైడ్ అయిపోగా.. జురెల్, హెట్‌మైర్ దారుణంగా విఫలమయ్యారు. నితీశ్ రాణా ఒక్క మంచి ఇన్నింగ్స్‌కే పరిమితమయ్యాడు. పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పి అతడి కాస్తో కూస్తో ఫామ్‌ను చెడగొట్టుకున్నారు. సూర్యవంశీ ఫేట్‌ను నాలుగు మ్యాచ్‌లకే డిసైడ్ చేయలేని పరిస్థితి.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. నిన్న (మే 1) ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో ఆ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ ఏకంగా 8 పరాజయాలు మూటగట్టుకుంది. కేవలం మూడే విజయాలు సాధించింది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ సీజన్లో రాయల్స్ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తమ తదుపరి మ్యాచ్‌ల్లో కేకేఆర్ (మే 4), సీఎస్కే (మే 12), పంజాబ్ (మే 16) జట్లను ఢీకొట్టనుంది. -
వైభవ్ వయసు పిల్లలంతా హ్యాపీ!.. ఎందుకింత ఓర్వలేనితనం?
రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌తో గత మ్యాచ్‌లో శతక్కొట్టిన పద్నాలుగేళ్ల ఈ పిల్లాడు.. గురువారం ముంబై ఇండియన్స్ (RR vs MI)తో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ముంబై పేసర్ దీపక్ చహర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చిన వైభవ్ పెవిలియన్ చేరకతప్పలేదు. ఫలితంగా 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఇలా ఆరంభంలోనే షాక్ తగిలింది.ముంబై బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో రాజస్తాన్ 16.1 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వారా ఏకంగా 100 పరుగుల భారీ తేడాతో ముంబై చేతిలో చిత్తుగా ఓడి.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.వైభవ్ వయసు పిల్లలంతా హ్యాపీ!.. ఎందుకింత ఓర్వలేనితనం?ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ బ్యాటర్లంతా విఫలమైనా సోషల్ మీడియా మాత్రం వైభవ్ సూర్యవంశీపైనే ఎక్కువగా దృష్టి సారించింది. ఆటలో ఇవన్నీ సహజమేనని కొంత మంది అతడికి అండగా నిలుస్తుంటే.. మరికొంత మంది మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.‘‘చిన్న వయసులో విజయవంతం కావడం బాగానే ఉంటుంది. కానీ ప్రతిసారీ అదృష్టం కలిసి రాదు.. ఈరోజు వైభవ్ వయసు పిల్లలంతా సంతోషపడి ఉంటారు.. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు అతడిని చూపించి వారి పిల్లలకు గట్టిగా క్లాసులు ఇస్తున్నారు.. అందుకే ఈ ఒక్కరోజు వారికి ఉపశమనం కలిగి ఉంటుంది.. ఇక చాలు వైభవ్ నువ్వు కూడా వెళ్లి హోం వర్క్ చేసుకో’’ అంటూ పద్నాలుగేళ్ల వయసులోనే సంచలనాలు సృష్టించిన అతడిని ఓర్వలేక విద్వేషం చిమ్ముతున్నారు.వైభవ్‌ను ఓదార్చిన రోహిత్మరోవైపు.. వైభవ్ అవుట్ కాగానే ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అతడిని ఓదార్చిన తీరు మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. వైభవ్ వెన్నుతట్టి మరేం పర్లేదు అన్నట్లుగా రోహిత్ అతడి పట్ల సానుభూతి కనబరిచాడు.తప్పక పాఠాలు నేర్చుకుంటాడుఈ విషయం గురించి కామెంటేటర్ రవిశాస్త్రి లైవ్‌లో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ కచ్చితంగా తన పొరపాట్లను సరిచేసుకుంటాడు. రోహిత్ శర్మ అతడిలో ఆత్మవిశ్వాసం నింపేలా మంచి మాటలు చెప్పాడు.ముంబై జట్టులోని చాలా మంది ఆటగాళ్లు అతడికి అండగా నిలిచారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాంటి గొప్ప సన్నివేశాలు చూడలేము. 14 ఏళ్ల పిల్లాడు సెంచరీ చేసిన మరుసటి మ్యాచ్‌లోనే ఇలా డకౌట్ అయ్యాడు. క్రికెట్ అంటే అంతే మరి!.. అతడు తప్పక ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటాడు’’ అని వైభవ్ సూర్యవంశీకి మద్దతు ప్రకటించాడు.కాగా ఐపీఎల్-2025 ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా మరెన్నో రికార్డులు సొంతం చేసుకుని.. క్రికెట్ ప్రపంచం దృష్టిని తన వైపునకు తిప్పుకొన్నాడు.ఐపీఎల్-2025: రాజస్తాన్ వర్సెస్ ముంబైవేదిక: సవాయ్ మాన్సింగ్ స్టేడియం, జైపూర్టాస్: రాజస్తాన్.. తొలుత బౌలింగ్ముంబై స్కోరు: 217/2 (20)రాజస్తాన్ స్కోరు: 117 (16.1)ఫలితం: వంద పరుగుల తేడాతో రాజస్తాన్‌పై ముంబై గెలుపు.చదవండి: RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్ 6️⃣ on the trot & now they’re on 🔝A massive 1⃣0⃣0⃣-run win for #MI to sit right where they want to 👊Scorecard ▶ https://t.co/t4j49gXHDu#TATAIPL | #RRvMI | @mipaltan pic.twitter.com/20KEle7S6n— IndianPremierLeague (@IPL) May 1, 2025Deepak Chahar saved lacs of children from getting embarassed in front of their parents tonight pic.twitter.com/fOiMFV4XzZ— Sagar (@sagarcasm) May 1, 2025Rohit Sharma appreciating Vaibhav Suryavanshi after the match win last night.❤️The true leader @ImRo45 🐐 pic.twitter.com/t0iFGnBLOG— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 2, 2025 -
RR VS MI: చాలా తప్పులు చేశాం.. నిజాయితీగా ఒప్పుకున్న రాజస్థాన్ కెప్టెన్
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. నిన్న (మే 1) ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమితో ఆ జట్లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాయల్స్ ఏకంగా 8 పరాజయాలు మూటగట్టుకుంది. కేవలం మూడే విజయాలు సాధించింది. కొన్ని గెలవాల్సిన మ్యాచ్‌ల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఆ జట్టు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు గెలిచినా, ఓడినా రాయల్స్‌కు ఒరిగేది ఏమీ లేదు. అయితే ప్రత్యర్థి జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కేకేఆర్ (మే 4), సీఎస్కే (మే 12), పంజాబ్ (మే 16) జట్లను ఢీకొట్టనుంది.ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి అనంతరం రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ నిజాయితీగా తమ తప్పిదాలను ఒప్పుకున్నాడు. ఈ సీజన్లో చాలా పొరపాట్లు చేశామని అంగీకరించాడు. తప్పిదాలపై దృష్టి సారిస్తామని చెప్పాడు. తప్పులతో పాటు కొన్ని మంచి పనులు కూడా చేశామని అన్నాడు. తదుపరి మూడు మ్యాచ్‌ల్లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు.ముంబై ఇండియన్స్‌కు క్రెడిట్ ఇచ్చాడు. వారు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతమని కొనియాడాడు. ఓవర్‌కు 10 పరుగుల చొప్పున రన్‌రేట్ మెయిన్టైన్ చేస్తూ చివర్లో చెలరేగారని అన్నాడు. తమ జట్టు బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. ఈ రోజు మాది కాదని అన్నాడు. పిచ్‌పై స్పందిస్తూ.. 190-200 ఛేజింగ్‌కు అనువైన స్కోర్ అని తెలిపాడు. ముంబై అదనపు పరుగులు సాధించినందుకు హార్దిక్, సూర్యకుమార్‌కు క్రెడిట్ ఇచ్చాడు. తమ ఆటతీరు మెరుగ్గా ఉండాల్సిందని ఒప్పుకున్నాడు.ఈ సీజన్లో బ్యాటింగ్‌లో మంచి ఆరంభాలు లభించినా మిడిలార్డర్ సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయిందని తెలిపాడు. తాను, జురెల్ మిడిలార్డర్లో బాధ్యత తీసుకోవాల్సిందని అన్నాడు. ఈ రోజు వచ్చిన అవకాశం మరోసారి వస్తే తమ సత్తా చాటుతామని తెలిపాడు.కాగా, నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ముంబై ఇండియన్స్ చేతిలో 100 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలుత ముంబై బ్యాటర్లను కట్టడి చేయలేకపోయిన ఆ జట్టు.. ఆతర్వాత బ్యాటింగ్‌లో తొలి బంతి నుంచే చేతులెత్తేసింది. గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించిన 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. బౌల్ట్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాది జోష్‌గా కనిపించిన జైస్వాల్ అదే ఓవర్లో ఔటయ్యాడు. ముంబై బౌలర్లు చెలరేగడంతో రాణా, పరాగ్, జురెల్, హెట్‌మైర్ వికెట్లు కోల్పోయారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో రాయల్స్ తమ స్థాయి ఆటతీరు ప్రదర్శించలేక చిత్తుగా ఓడింది. -
RR vs MI: ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’ మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’
ఐపీఎల్–2025లో ‘ప్లే ఆఫ్స్’ రేసుకు దూరమైన రెండో జట్టుగా రాజస్తాన్ రాయల్స్ నిలిచింది. సీజన్లో ఎనిమిదో పరాజయంతో ఆ జట్టు కథ ముగియగా, టాప్–4 బ్యాటర్లంతా చెలరేగడంతో ముంబై పట్టికలో ‘టాప్’కు దూసుకెళ్లిపోయింది. ముందుగా పేలవ బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్‌కు భారీ స్కోరు చేసే అవకాశం కల్పించిన రాయల్స్... ఆ తర్వాత చెత్త బ్యాటింగ్‌తో పూర్తిగా చేతులెత్తేసింది. తిరుగులేని ఆటతో చెలరేగుతున్న హార్దిక్ పాండ్యా బృందం ఖాతాలో ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.జైపూర్: ఐపీఎల్ సీజన్లో చెన్నై తర్వాత ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్ అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు చేజార్చుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రికెల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో శుభారంభం అందించగా... సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అదే జోరును కొనసాగించారు. రికెల్టన్, రోహిత్ తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 116 పరుగులు జోడించగా... సూర్య, పాండ్యా మూడో వికెట్‌కు 44 బంతుల్లో అభేద్యంగా 94 పరుగులు జత చేశారు. అనంతరం రాజస్తాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. జోఫ్రా ఆర్చర్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ మేనేజ్మెంట్ ‘పింక్ ప్రామిస్’ పేరుతో సౌరశక్తికి సంబంధించి ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించింది. దీని ప్రకారం ఆటగాళ్లంతా పూర్తిగా ‘పింక్’ కిట్ ధరించగా... బ్యాటర్ కొట్టే ఒక్కో సిక్స్‌కు ఆరు ఇళ్లకు సౌరశక్తి సదుపాయాన్ని కల్పిస్తారు. టాప్–4 విధ్వంసం... ముంబై బ్యాటింగ్ మొదటి నుంచీ దూకుడుగా సాగింది. ఫారుఖీ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన రికెల్టెన్... ఆర్చర్ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. తీక్షణ ఓవర్లో రోహిత్ 3 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 58 పరుగులకు చేరింది. కార్తికేయ ఓవర్లో భారీ సిక్స్‌తో 29 బంతుల్లో రికెల్టన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 31 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వీరిద్దరు 7 పరుగుల తేడాతో వెనుదిరిగిన తర్వాత సూర్య, పాండ్యా ధాటి మొదలైంది. ఫారుఖీ ఓవర్లో పాండ్యా 3 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోవడంతో 21 పరుగులు వచ్చాయి. ఆర్చర్ ఓవర్లో సిక్స్‌తో స్కోరును 200 దాటించిన సూర్య...ఆఖరి బంతికి సిక్స్‌తో ఇన్నింగ్స్ ముగించాడు. టపటపా... ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలోపే 5 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్ గెలుపు అవకాశాలు అక్కడే ముగిసిపోగా, ఆ తర్వాత లాంఛనమే మిగిలింది. గత మ్యాచ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (0) ఈసారి డకౌట్ కావడంతో రాయల్స్ పతనం మొదలైంది. బౌల్ట్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన యశస్వి జైస్వాల్ (13) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌల్ట్ తర్వాతి ఓవర్లో నితీశ్ రాణా (9) అవుట్ కాగా... బుమ్రా తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో పరాగ్ (16), హెట్‌మైర్ (0)లను వెనక్కి పంపించాడు. ధ్రువ్ జురేల్ (11) ప్రభావం చూపలేకపోవడంతో రాజస్తాన్ కుప్పకూలింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (బి) తీక్షణ 61; రోహిత్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 53; సూర్యకుమార్ (నాటౌట్) 48; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 48; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–116, 2–123. బౌలింగ్: ఆర్చర్ 4–0–42–0, ఫారుఖీ 4–0–54–0, తీక్షణ 4–0–47–1, కార్తికేయ 2–0–22–0, మధ్వాల్ 4–0–39–0, పరాగ్ 2–0–12–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) బౌల్ట్ 13; వైభవ్ (సి) జాక్స్ (బి) చహర్ 0; నితీశ్ రాణా (సి) తిలక్ (బి) బౌల్ట్ 9; పరాగ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 16; జురేల్ (సి అండ్ బి) కరణ్ శర్మ 11; హెట్‌మైర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 0; శుభమ్ దూబే (సి) బౌల్ట్ (బి) పాండ్యా 15; ఆర్చర్ (సి) బుమ్రా (బి) బౌల్ట్ 30; తీక్షణ (సి) సూర్య (బి) కరణ్ శర్మ 2; కార్తికేయ (సి) చహర్ (బి) కరణ్ శర్మ 2; మధ్వాల్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 117. వికెట్ల పతనం: 1–1, 2–18, 3–41, 4–47, 5–47, 6–64, 7–76, 8–87, 9–91, 10–117. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–13–1, బౌల్ట్ 2.1–0–28–3, బుమ్రా 4–0–15–2, బాష్ 3–0–29–0, హార్దిక్ పాండ్యా 1–0–2–1, కరణ్ శర్మ 4–0–23–3. ఐపీఎల్లో నేడుగుజరాత్ X హైదరాబాద్ వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2025: ముంబై డబుల్ హ్యాట్రిక్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 1) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాయల్స్ బౌలరల్లో రియాన్ పరాగ్, తీక్షణ తలో వికెట్ తీశారు.అనంతరం 218 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్ ముంబై బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. యశస్వి జైస్వాల్ (13), రియాన్ పరాగ్ (16), ధృవ్ జురెల్ (11), శుభమ్ దూబే (15) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన చరిత్ర సృష్టించిన రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ, బౌల్ట్ తలో మూడు వికెట్లు తీయగా.. బుమ్రా 2, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకుపోయింది. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్
మినుకు మినుకు మంటూ ప్లే ఆఫ్స్ అవకాశాలు కలిగిన దశలో రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ సందీప్ శర్మ గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరమ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్ సందర్భంగా సందీప్ వేలు ఫ్రాక్చర్ అయినట్లు రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు.సందీప్ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడన్న విషయాన్ని ఆర్ఆర్ యాజమాన్యం అధికారికంగా దృవీకరించింది. సందీప్ గుజరాత్ మ్యాచ్‌లో వేలుకు ఫ్రాక్చర్ అయినప్పటికీ బౌలింగ్‌ను కొనసాగించాడు. ఆ మ్యాచ్‌లో అతను తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి వాషింగ్టన్ సుందర్ వికెట్ తీశాడు. సందీప్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని రాయల్స్ యాజమాన్యం ఇంకా ప్రకటించలేదు. సందీప్‌కు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్‌గా మంచి పేరుంది. లీగ్ కీలక దశలో సాగుతున్న వేల సందీప్ వైదొలగడం రాయల్స్‌కు పెద్ద మైనస్సే. ప్రస్తుత సీజన్లో సందీప్ 10 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు తీశాడు. ముంబైతో ఇవాళ (మే 1) జరుగతున్న మ్యాచ్‌లో సందీప్‌కు ప్రత్యామ్నాయంగా ఆకాశ్ మధ్వాల్ చోటు దక్కించుకున్నాడు. మధ్వాల్‌కు ఈ సీజన్లో ఇదే తొలి మ్యాచ్.రాయల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిదానంగా ఆడుతుంది. రాయల్స్ బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఓపెనర్లు రికెల్టన్ (27), రోహిత్ శర్మ (17) ఆచితూచి ఆడుతున్నారు. ఒమర్జాయ్ బౌలింగ్ రోహిత్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 45/0గా ఉంది.ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేయగా.. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది. హసరంగ, సందీప్ శర్మ గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్ రాయల్స్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వాల్, ఫజల్హక్ ఫరూఖీముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకాగా, ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రాయల్స్ తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. -
IPL 2025: రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం
రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయంఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 1) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేయగా.. రాజస్థాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. 76 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్8.6వ ఓవర్- 76 పరుగుల వద్ద రాజస్థాన్ రాయల్స్ ఏడో వికెట్ కోల్పోయింది. కర్ణ్ శర్మ బౌలింగ్‌లో దృవ్ జురెల్ (11) క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు.64 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్7.1వ ఓవర్- 64 పరుగుల వద్ద రాజస్థాన్ ఆరో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి శుభమ్ దూబే (15) ఔటయ్యాడు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ఇన్నింగ్స్ 5వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో రాజస్తాన్ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. ఐదో ఓవర్ ఐదో బంతికి బుమ్రా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో హెట్‌మైర్ డకౌటయ్యాడు. దీంతో రాజస్థాన్ 47 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్4.4వ ఓవర్- 217 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (16) ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన రాజస్థాన్3.6వ ఓవర్- 41 పరుగుల వద్ద రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో నితీశ్ రాణా (9) ఔటయ్యాడు. రియానప పరాగ్ (11), జురెల్ క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 218.. 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్1.4వ ఓవర్: 218 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 18 పరుగులకే ఓపెనర్లు ఇద్దరి వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లో బౌల్ట్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన అనంతరం యశస్వి జైస్వాల్ అదే ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డకౌటైన బేబీ బాస్గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతక్కొట్టిన బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. తానెదుర్కొన్న రెండో బంతికే పెవిలియన్‌కు చేరాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో విల్ జాక్స్ వైభవ్ క్యాచ్ పట్టాడు. రెచ్చిపోయిన బ్యాటర్లు.. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రాయల్స్ బౌలరల్లో రియాన్ పరాగ్, తీక్షణ తలో వికెట్ తీశారు. భారీ స్కోర్ దిశగా ముంబై ఇండియన్స్టాస్ ఓడి తొలుత బ్యాటంగ్ చేస్తున్నముంబై ఇండియన్స్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 16 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 161/2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (25), హార్దిక్ పాండ్యా (16) ధాటిగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ ఔట్12.4వ ఓవర్- 123 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. రియాన పరాగ్ బౌలింగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (53) ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్11.5వ ఓవర్- 116 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. తీక్షణ బౌలింగ్‌లో రికెల్టన్ (61) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్‌కు (52) జతగా సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లోకి వచ్చాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మతీక్షణ బౌలింగ్‌లో బౌండరీ బాది రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ 31 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. 11.2 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 113/0గా ఉంది. రోహిత్ 51, రికెల్టన్ 60 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రికెల్టన్కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో సిక్సర్ బాది రికెల్టన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రికెల్టన్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 90/0గా ఉంది. రికెల్టన్‌తో పాటు రోహిత్ శర్మ (37) కూడా జోరుమీదున్నాడు. ఆచితూచి ఆడుతున్న ముంబై ఓపెనర్లుటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిదానంగా ఆడుతుంది. రాయల్స్ బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. ముంబై ఓపెనర్లు రికెల్టన్ (27), రోహిత్ శర్మ (17) ఆచితూచి ఆడుతున్నారు. రోహిత్ ఓసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 45/0గా ఉంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 1) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. వరుస విజయాలతో (5) దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్‌ను రాజస్థాన్ రాయల్స్ సొంత మైదానంలో ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం రాయల్స్ రెండు మార్పులు చేయగా.. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది. హసరంగ, సందీప్ శర్మ గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కానున్నారు. వీరి స్థానాల్లో కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వాల్ రాయల్స్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్(సి), ధృవ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, ఫజల్హక్ ఫరూఖీముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకాగా, ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రాయల్స్ తప్పనిసరిగా గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. -
RR VS MI: బుమ్రా, బౌల్ట్ లాంటి హేమాహేమీల ముందు కుర్ర వైభవ్ ఆటలు సాగుతాయా..?
ఐపీఎల్ 2025లో ఇవాళ (మే 1) రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాయల్స్ హోం గ్రౌండ్ సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ముంబై ఇండియన్స్‌పై వైభవ్ ఎలా ఆడతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పటిష్టమైన ముంబై బౌలింగ్ లైనప్‌ను 14 ఏళ్ల కుర్ర వైభవ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అని చర్చించుకుంటున్నారు.ప్రపంచంలోనే అరివీర భయంకరులైన బుమ్రా, బౌల్ట్ ముందు నిలబడగలడా అని సందేహిస్తున్నారు. వైభవ్ జోరు చూస్తే బుమ్రా, బౌల్ట్‌కు కూడా బడిత పూజ తప్పదని అనిపిస్తుంది. ఊహకందని శతకంతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన వైభవ్ దుర్భేధ్యమైన ముంబై ఇండియన్స్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోగలడో చూడాలి మరి.14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రెండు రోజుల కిందట గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ కొట్టి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసకర ప్రదర్శనతో వైభవ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అతడిపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తు పెరిగాయి. ఒక్క ఇన్నింగ్స్‌తోనే క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఈ బేబీ బాస్.. నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలని కోరుకుందాం. వైభవ్ తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి 215.72 స్ట్రయిక్ రేట్‌తో 151 పరుగులు చేశాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో (లక్నో) కూడా వైభవ్ చిన్నపాటి విధ్వంసమే సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు.ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్‌పై రాయల్స్ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఖర్చీఫ్ వేసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. తుది జట్లు (అంచనా)..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (c), ధృవ్ జురెల్ (wk), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఆకాష్ మధ్వల్/శుభమ్ దూబేముంబై ఇండియన్స్: ర్యాన్ రికిల్టన్ (wk), రోహిత్ శర్మ (c), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా -
ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. ఐపీఎల్ నుంచి అతడు అవుట్
రాజస్తాన్ రాయల్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన చేసింది. తమ యువ స్పిన్నర్ విఘ్నేశ్ పుతూర్ (Vignesh Puthur) ఐపీఎల్-2025 (IPL 2025)లో మిగిలిన మొత్తం మ్యాచ్‌లకు దూరమైనట్లు తెలిపింది. అతడి స్థానంలో రఘు శర్మ (Raghu Sharma)ను జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది.చెన్నైతో మ్యాచ్‌లో అరంగేట్రంకాగా ఐపీఎల్ తాజా ఎడిషన్ మార్చి 22న ప్రారంభం కాగా.. ఆ మరుసటి రోజు ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ఆడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా కేరళకు చెందిన విఘ్నేశ్ పుతూర్ ముంబై తరఫున అరంగేట్రం చేశాడు.రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు శివం దూబే, దీపక్ హుడా వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడినా 24 ఏళ్ల ఈ లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన విఘ్నేశ్ పుతూర్ మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టాడు.గాయం కారణంగా దూరంఅయితే, ఇటీవల విఘ్నేశ్ గాయపడ్డాడు. అతడి రెండు కాళ్ల ఎముకల్లోనూ నొప్పి రావడంతో ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ రఘు శర్మను తీసుకుంది.ఇక మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ విఘ్నేశ్ పుతూర్ మాత్రం జట్టుతో కలిసి ప్రయాణం చేయనున్నాడు. ముంబై ఇండియన్స్ వైద్య బృందం పర్యవేక్షణలో అతడు చికిత్స తీసుకుంటాడని ఫ్రాంఛైజీ తమ ప్రకటనలో వెల్లడించింది.రఘు శర్మ ధర రూ. 30 లక్షలుకాగా ముంబై నెట్ బౌలర్లలో ఒకడైన రఘు శర్మ కనీస ధర రూ. 30 లక్షలతో విఘ్నేశ్ పుతూర్ స్థానాన్ని భర్తీ చేశాడు. 32 ఏళ్ల రఘు దేశవాళీ క్రికెట్లో పంజాబ్, పుదుచ్చేరి జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటికి 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 57 వికెట్లు తీసిన రఘు శర్మ.. లిస్ట్-ఎ క్రికెట్లో తొమ్మిది మ్యాచ్‌లలో 14 వికెట్లు.. మూడు టీ20లలో మూడు వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌ను పరాజయాలతో ఆరంభించిన ముంబై ఇండియన్స్... ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. వరుసగా గత ఐదు మ్యాచ్‌లు గెలిచి సత్తా చాటిన హార్దిక్ సేన.. ఇప్పటికి పది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మొత్తం ఆరు విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: గెలుపు జోష్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు షాక్! -
ఇప్పుడే జడ్జిమెంట్లు వద్దు.. మున్ముందు కఠిన సవాళ్లు: టీమిండియా మాజీ కోచ్
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అతడి గురించే చర్చ. పద్నాలుగేళ్ల వయసులోనే టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఈ చిచ్చర పిడుగును చూసి దిగ్గజ ఆటగాళ్లే ఆశ్చర్యపోతున్నారు. ఏమాత్రం భయం లేకుండా అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొన తీరు తనకు ముచ్చటగొలిపిందని భారత లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ వైభవ్‌ను కొనియాడాడు.అసలు పద్నాలుగేళ్ల వయసులో ఇలాంటి ఆటను అస్సలు ఊహించలేమని.. వైభవ్ మాత్రం బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అబ్బురపడ్డాడు. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాహుల్ ద్రవిడ్, మైకేల్ హస్సీ వంటి వారంతా రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు.అయితే, టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. ఇప్పడే వైభవ్ సూర్యవంశీపై ఓ అంచనాకు రాకూడదని.. భవిష్యత్తులో అతడు కఠిన సవాళ్లు ఎదుర్కోబోతున్నాడని పేర్కొన్నాడు. వైఫల్యాలు, ఒత్తిడిని అధిగమించే తీరుపైనే అతడి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించాడు.ఈ మేరకు ఐసీసీ రివ్యూ షోలో భాగంగా రవిశాస్త్రి.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో మాట్లాడుతూ.. వైభవ్ అరంగేట్రంలో ఆడిన తీరు తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. అతడికి అసాధారణ నైపుణ్యాలు ఉన్నాయని కొనియాడాడు. ‘‘లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అతడు కొట్టిన మొదటి షాట్ ప్రేక్షకులను ఊపిరి బిగపట్టేలా చేసింది.అయితే, అతడు ఇంకా చిన్న పిల్లాడే. ఈ వయసులో వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటాడో కూడా చూడాలి. ముఖ్యంగా తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన వైభవ్ పట్ల బౌలర్లు ఇకపై కనికరం చూపబోరు.అతడి వయసు 14 లేదంటే 12, 20 ఏళ్లా అని చూడరు. అతడి ఆటకు తగ్గట్లుగా సరైన వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు వస్తారు. అలాంటి వారిని వైభవ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. అప్పుడే అతడి ఆట తీరుపై సరైన అవగాహన, అంచనాకు రాగలము’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. క్రమశిక్షణతో ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైభవ్‌కు ఈ సందర్భంగా సలహా ఇచ్చాడు.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ 1.10 కోట్లకు బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీని కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా అతడికి రాజస్తాన్ ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి రికార్డులకెక్కాడు.ఆడిన తొలి మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొని 34 పరుగులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. చివరగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముప్పై ఐదు బంతుల్లోనే శతక్కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌పై ప్రశంసలు కురిపిస్తూనే.. ఇక ముందు మరింత జాగ్రత్తగా ఆడాలంటూ రవిశాస్త్రి హెచ్చరించాడు. In case you missed it… 🍿🔥pic.twitter.com/rOXwTuxgyX— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2025 -
Vaibhav Suryavanshi: ఈ ‘వైభవం’ కొనసాగాలి!
క్రికెట్ బ్యాట్ పట్టడం కూడా తెలియని వ్యక్తి నుంచి మొదలుకొని... ఆటలో తలపండిన మేధావుల వరకు ఎక్కడ చూసినా ఒకటే చర్చ! ఊరు, వాడా, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఒకే పేరు! ‘ఏం కొట్టాడ్రా బాబు’ అని సాధారణ అభిమానులు కొనియాడుతుంటే... ఫ్లిక్, లాఫ్ట్, పుల్ అంటూ విశ్లేషకులు అతడి షాట్లను వర్ణిస్తున్నారు. ఒక్క ఇన్నింగ్స్‌తో యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న ఆ కుర్రాడే... బిహార్‌కు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌తో సరిసమానంగా ఒత్తిడి ఉండే ఐపీఎల్లో అతడు బాదిన బాదుడు క్రీడాలోకాన్ని నివ్వెరపరిచింది. అతని దూకుడుకు అపార అనుభవం ఉన్న బౌలర్లు సైతం స్కూలు కుర్రాళ్లలా కనిపించారనడంలో రవ్వంత అతిశయోక్తి లేదు. ఐపీఎల్లో ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్... మూడో ఇన్నింగ్స్‌లోనే రికార్డు సెంచరీ... మరో సచిన్ టెండూల్కర్ దొరికాడు అనే ప్రశంసలతో ఆ పాలబుగ్గల పసివాడు ప్రస్తుతానికి శిఖరమంత ఎత్తులో ఉన్నాడు! ఇదంతా నాణేనికి ఒకవైపే! మన దేశంలో ఇలా ఒక్క ఇన్నింగ్స్‌తో సంచలనాలు రేకెత్తించిన వాళ్లు కోకొల్లలు. దేశవాళీ, అంతర్జాతీయ, ఐపీఎల్ వేదికలపై తళుక్కున మెరిసి... అంతే త్వరగా కనుమరుగై పోయిన వారికి కొదవే లేదు. అంచనాలకు మించి వచ్చే పేరు ప్రతిష్టలు... అవసరానికి మించి వచ్చి పడే డబ్బు ప్రవాహం... అప్పనంగా వచ్చే ప్రచార ఆర్బాటం ఇలా ఆటగాళ్ల దృష్టి మరల్చేవి ఎన్నో. పిన్న వయసులోనే విశేష గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సొదిలోనే లేకుండా పోయిన వాళ్లు ఎందరో! సదానంద్ విశ్వనాథ్, వినోద్ కాంబ్లీ, పృథ్వీ షా ఈ కోవలోకే వస్తారు. ప్రతిభకు క్రమశిక్షణ తోడైతేనే సుదీర్ఘ కాలం కెరీర్ కొనసాగించగలం అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిరూపిస్తే... ఒక్కసారిగా వచ్చిన గుర్తింపుతో ఉక్కిరిబిక్కిరై కెరీర్‌ను నాశనం చేసుకున్న వాళ్లూ ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ కూడా ఇలా ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ కాకుండా ఉండాలంటే నిరంతర సాధన ముఖ్యమని మాజీలు సూచిస్తున్నారు. –సాక్షి క్రీడావిభాగం వయసుకు మించిన పరిణతితో అతడు బంతిని బాదుతుంటే... యావత్ ప్రపంచం విస్మయానికి గురైంది! బౌలర్‌తో సంబంధం లేకుండా అతడు విరుచుకుపడుతుంటే... అభిమాన గణం మైమరిచిపోయింది! ముఖంపై పసితనపు ఛాయలు కూడా పోని ఆ చిన్నోడు చిందేస్తుంటే... క్రీడా లోకం తన్మయత్వానికి లోనైంది! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జైపూర్‌లో జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లోనే సెంచరీ సాధించి రికార్డులు తిరగరాశాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారతీయుడిగా... ఓవరాల్‌గా టి20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయసు్కడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ప్రసిధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ ఈ నలుగురు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన వారే. ఇక టి20 లీగ్‌ల్లో రికార్డులు తిరగరాసే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సరేసరి. ఇలాంటి బౌలర్లను ఎదుర్కొంటూ వైభవ్ సాగించిన ఊచకోత మాటలకందనిది! క్లాస్, మాస్, ఊరమాస్ ఇలా అతడి ఇన్నింగ్స్‌ను వర్ణించడానికి విశేషణాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. అతడి బాదుడుకు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం హోరెత్తింది. డగౌట్లో కూర్చున్న ప్రతి ఆటగాడు ఊగిపోతుంటే... మ్యాచ్ చూస్తున్న అభిమానులు బ్యాటింగ్ చేసేది తామే అన్నంతగా లీనమై పోయి ఆ ‘బుడ్డోడి’ ప్రతిభకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. రాహుల్ ద్రవిడ్ చొరవతో... ఐపీఎల్ ప్రారంభమైన మూడేళ్ల తర్వాత బిహార్‌లోని సమస్తీపూర్‌లో జని్మంచిన వైభవ్... కఠోర సాధన, పట్టువదలని తత్వంతో అంచలెంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నాడు. సహచరుడి తప్పిదం వల్ల రనౌట్ అయి బెంచ్‌మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్న వైభవ్‌ను చూసిన వీవీఎస్ లక్ష్మణ్... అతడిలో ఆత్మవిశ్వాసం నింపి రాహుల్ ద్రవిడ్ దృష్టికి తీసుకెళ్లడంతో వైభవ్ దశ తిరిగింది. ప్రతిభాన్వేషణ సమయంలో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, రాజస్తాన్ టీమ్ మేనేజర్ రోమి... వైభవ్ షాట్ల ఎంపికకు ముగ్ధులయ్యారు. దీంతో వారు వైభవ్‌ను ద్రవిడ్‌కు పరిచయం చేయడంతో అతడి జీవితం మారిపోయింది. ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుండే రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం గతేడాది ఐపీఎల్ వేలంలో రూ. 1 కోటీ 10 లక్షలకు వైభవ్‌ను కొనుగోలు చేసుకుంది. ద్రవిడ్ పర్యవేక్షణలో మరింత రాటుదేలిన వైభవ్... దాన్నే మైదానంలో చాటాడు. అప్పటికే భారత అండర్–19 జట్టుకు ఎంపికైన వైభవ్... గతేడాది జనవరిలోనే ముంబై జట్టుపై ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం, కోచ్ చెప్పిన అంశాలను ఆచరణలో పెట్టడం. ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవడం వంటి సానుకూల లక్షణాలు అతడిని మూడో మ్యాచ్‌లోనే సెంచరీ హీరోగా నిలిపాయి. పొలం అమ్ముకున్న తండ్రి.. వైభవ్ విజయం వెనక... తాను సాధించలేకపోయిన దాన్ని కుమారుడైనా అందుకోవాలని తపన పడ్డ ఓ మధ్యతరగతి తండ్రి ఆశయం ఉంది. కుమారుడికి మెరుగైన శిక్షణ అందించేందుకు ఉన్న కాస్త పొలం అమ్ముకున్న ఆ తండ్రి ఇప్పుడు అత్యంత ఆనంద క్షణాలు అనుభవిస్తున్నాడు. గతంలో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ చేయగా... ఇప్పుడు ఈ ఎడంచేతి వాటం బ్యాటర్ 35 బంతుల్లోనే మూడంకెల స్కోరు చేసి కొత్త చరిత్ర లిఖించాడు. దీని వెనక రాయల్స్ యాజమాన్య ప్రోత్సాహం ఉందని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు. ‘వైభవ్ మెరుపుల వెనక బిహార్ క్రికెట్ సంఘం చీఫ్ రాకేశ్ తివారీ, రాజస్తాన్ రాయల్స్ జట్టు కృషి ఎంతో ఉంది. ఇక రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గత మూడు, నాలుగు నెలలుగా పడ్డ కష్టానికి దక్కిన ఫలితమిది. వారికి జీవితాంతం రుణపడి ఉంటాం’ అని సంజీవ్ అన్నాడు. అయితే ఈ మెరుపులు కేవలం ఒకటీ అరా మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం కాకుండా ఉండాలంటే... ఇదే సాధన కొనసాగించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పేరు, డబ్బు తలకెక్కనివ్వకుండా క్రమశిక్షణతో ముందుకు సాగితే దేశానికి సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించగల ప్రతిభావంతుడు లభించినట్లే! అమ్మ, నాన్న కృషి వల్లే... తొలి బంతికి సిక్స్ కొట్టడం నాకు పెద్ద విషయం కాదన్న వైభవ్... అమ్మానాన్న కృషి వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నాడు. ‘నేను ఇప్పటికే భారత అండర్–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించా. దేశవాళీల్లో తొలి బంతికి చాలాసార్లు సిక్స్ కొట్టా. మొదటి 10 బంతులు ఎదుర్కొనేటప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాను. బంతి నా పరిధిలో ఉంటే దాన్ని బలంగా కొట్టాలనే చూస్తా. తల్లిదండ్రుల సహకారం లేకుంటే నేను లేను. నా కోసం వాళ్లు ఎంతగానో కష్టపడ్డారు. తెల్లవారుజామను 3 గంటలకే నిద్రలేచే మా అమ్మ... మళ్లీ నేను పడుకున్న తర్వాత ఏ 11 గంటలకో గానీ నిద్రపోదు. వారు అలా నా కోసం అన్నీ వదిలేసుకొని శ్రమించడం వల్లే నేను ఆటపై దృష్టి సారించగలిగా. నాన్న నా వెంట ఉండటం వల్లే మరింత స్వేచ్ఛగా ఆడుతున్నా. కష్టానికి ఫలితం ఉంటుందని రుజువైంది. వారి కష్టానికి ప్రతిఫలమే ఇది’ అని వైభవ్ పేర్కొన్నాడు. మరో ఒకటీ రెండేళ్లలో వైభవ్ భారత టి20 జట్టులో చోటు దక్కించుకుంటాడని అతడి చిన్ననాటి కోచ్ మనీశ్ ఓఝా ఆశాభాహం వ్యక్తం చేశాడు. ‘కోచ్‌గా వైభవ్‌ను చూస్తే గర్వంగా ఉంది. బిహార్‌లో ఆటలకు పెద్దగా ఆదరణ ఉండదు. అలాంటి చోట నుంచి వచ్చి క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు వైభవ్ ఎందరికో స్ఫూర్తి’ అని మనీశ్ ఓఝా అన్నాడు. రూ. 10 లక్షల నజరానా ఐపీఎల్లో సెంచరీతో రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీకి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భారీ నజరానా ప్రకటించారు. 14 ఏళ్ల వైభవ్‌కు రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. ‘గతేడాది వైభవ్‌తో మాట్లాడా. అతడిలో అపార ప్రతిభ ఉంది. తీవ్ర పోటీ ఉండే ఐపీఎల్లో 35 బంతుల్లో సెంచరీ చేయడం మామూలు విషయం కాదు. ఫోన్ ద్వారా అతడిని అభినందించా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైభవ్ సూర్యవంశీకి రూ. 10 లక్షల నజరానా అందిస్తాం. భవిష్యత్తులోనూ అతడు ఇదే ఆటతీరు కొనసాగించాలని కోరుకుంటున్నాం. వైభవ్ దేశం తరఫున కూడా రాణించి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తాడని ఆశిస్తున్నాం’ అని నితీశ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వైభవ్ ఆటతీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది. అతడిలో భయం ఏ కోశాన కనిపించడం లేదు. బ్యాట్ వేగం, బంతిని అంచనా వేసే తీరు చాలా బాగున్నాయి. 38 బంతుల్లో 101 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్ ఆసాంతం అలరించింది. –సచిన్ టెండూల్కర్14 ఏళ్ల వయసులో మీరేం చేశారో గుర్తు చేసుకొండి. ఈ కుర్రాడు మాత్రం అంతర్జాతీయ బౌలర్ల భరతం పట్టాడు. భయమన్నదే లేకుండా బౌలర్లకు నిద్రలేని రాత్రి మిగిల్చాడు. భవిష్యత్తుపై మరింత భరోసా పెంచుతున్న ఇలాంటి ప్లేయర్లను చూస్తే గర్వంగా ఉంది. –యువరాజ్ సింగ్ -
IPL 2025: పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టాడు, ఇదెంత: వైభవ్ కోచ్ ఓఝా
14 ఏళ్ల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను గడగడలాడిస్తూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన వైభవ్ సూర్యవంశీవైపు ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూస్తుంది. ఈ కుర్రాడు ఎవరు..? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని తెలుసుకునే పనిలో పడ్డారు క్రికెట్ అభిమానులు. ఈ క్రమంలో వైభవ్‌కు సంబంధించిన చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియా టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ చిన్ననాటి కోచ్ మనీశ్ ఓఝా చాలా విషయాలు చెప్పాడు. బ్రియాన్ లారాకు వీరాభిమాని అయిన వైభవ్‌లో నమ్మశక్యంకాని సిక్స్ హిట్టింగ్ ప్రతిభ ఉందని వెల్లడించాడు. వైభవ్ టాలెంట్ ముందు ఈ సెంచరీ చిన్నది అన్ని అన్నాడు. వైభవ్ పదేళ్ల వయసులోనే 90 మీటర్ల భారీ సిక్సర్లు కొట్టేవాడని.. రోజూ నెట్స్‌లో 350–400 బంతులు ఎదుర్కొనేవాడని తెలిపాడు.వైభవ్ గురించి అతడి ఓఝా మాటల్లో.. వైభవ్‌కు శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక్కసారి కూడా తిట్టాల్సిన అవసరం రాలేదు. వైభవ్‌కు ఏ షాట్ నేర్పించినా, ఏ టెక్నిక్‌ను వివరించినా దాన్ని పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. అతను వెంటనే గ్రహిస్తాడు. వైభవ్‌ను పదిన్నరేళ్ల వయసులో తొలిసారి చూశాను.ఆ వయసులోనే అతను ప్రపంచ స్థాయి బ్యాటర్ల సామర్థ్యం కలిగి ఉన్నాడు. 2022లో ఓఝా కోచింగ్ సెంటర్లో నిర్వహించిన ఓ మ్యాచ్‌లో వైభవ్ 118 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను కొట్టిన సిక్సర్లు ఇప్పుడు ప్రజలు చూస్తున్న సిక్సర్ల మాదిరిగానే ఉన్నాయి. ప్రతి సిక్సర్ 90 మీటర్లపైనే ఉండింది. ఆ సమయంలోనే వైభవ్ శక్తి, ఖచ్చితత్వం అసాధారణంగా ఉండేది. ఆ రోజే వైభవ్ అద్భుతాలు చేయగలడని నమ్మాను.14 ఏళ్ల పిల్లాడిలో ఇంత శక్తి ఎలా వస్తుందనే దానిపై స్పందిస్తూ.. వైభవ్‌లో ఈ అబ్బురపరిచే శక్తి ప్రమాదవశాత్తు వచ్చింది కాదు. అతను భారీ సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేయబట్టి నాలుగేళ్లవుతుంది. వైభవ్‌లో ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. అదే కాన్ఫిడెన్స్‌తో అతను భారీ షాట్లు ఆడుతాడు. వైభవ్‌కు ఈ స్థాయి సిక్స్ హిట్టింగ్ సామర్థ్యం రావడానికి అతని కఠోర ప్రాక్టీస్ కూడా ఓ కారణం. వైభవ్ టైమింగ్, టెక్నిక్ కూడా అద్భుతంగా ఉంటుంది. అతడికి ప్రాక్టీస్‌లో రోబోలతో త్రోలు వేయించేవాడిని. వైభవ్ ఎక్కువగా ఫుల్ టాస్ బంతులకు షాట్లు ప్రాక్టీస్ చేసేవాడు. రికార్డు సెంచరీకి ముందు రోజు కూడా వైభవ్‌తో మాట్లాడినట్లు ఓఝా తెలిపాడు.కాగా, ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, పొట్టి క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా, ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు.ఈ మ్యాచ్‌లో వైభవ్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లపై 11 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇందులో మూడు సిక్సర్లు 85 మీటర్లకు పైబడినవి కాగా.. రెండు 90 మీటర్లు దాటి ప్రయాణించాయి. కొన్ని సిక్సర్లు స్టేడియంలోని స్టాండ్స్ పైకప్పుపై కూడా పడ్డాయి. -
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) వైభవ్ చాలా రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్ 15.5 ఓవర్లలోనే గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది.వైభవ్ సాధించిన రికార్డులు..ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఆటగాడు (35 బంతుల్లో)ఐపీఎల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడు (క్రిస్ గేల్ (30 బంతుల్లో) తర్వాత)ఐపీఎల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (11) కొట్టిన ఆటగాడు (మురళీ విజయ్‌తో కలిసి)టీ20 క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్లో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (17 బంతుల్లో)ఐపీఎల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడుమ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. వైభవ్ రికార్డు సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) చెలరేగడంతో మరో 25 మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాయల్స్ గెలుపులో వైభవ్‌తో పాటు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు.మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇది చాలా మంచి అనుభూతి. ఐపీఎల్లో సెంచరీ సాధించాలనేది నా కల. దీన్ని నా మూడో మ్యాచ్‌లోనే సాకారం చేసుకున్నాను. సీజన్ ప్రారంభానికి ముందు చేసిన కఠోర సాధనకు ఈ మ్యాచ్‌లో ఫలితం పొందాను. నేను బంతిని బాగా గమనించి ఆడతాను. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాను. జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. అతను నాకు ప్రతి విషయంలో గైడ్ చేస్తాడు. ఏమి చేయాలో, ఎలా ఆడాలో చెబుతాడు. నాలో సానుకూల విషయాలను నింపుతాడు.కాగా, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం వైభవ్‌ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ సీజన్ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్ తొలి మ్యాచ్‌లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ తొలి బంతికే సిక్సర్ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్‌లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్లో మూడో మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. -
RR VS GT: వైభవ్ సృష్టించిన బీభత్సం మాటల్లో వర్ణించలేనిది: రాజస్థాన్ కెప్టెన్
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ సెంచరీతో వైభవ్ చాలా రికార్డులను కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్ 15.5 ఓవర్లలోనే గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది. రాయల్స్ గెలుపులో వైభవ్‌లో పాటు (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు.అంతకుముందు శుభ్‌మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.ఈ మ్యాచ్‌లో వైభవ్ సృష్టించిన బీభత్సం పొట్టి క్రికెట్ బ్రతికున్నంతవరకు గుర్తుంటుంది. వైభవ్ కేవలం 14 ఏళ్ల 32 రోజుల వయసులో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ చేసిన విలయ తాండవాన్ని క్రికెట్ అభిమానులు ఎన్నటికి మర్చిపోరు. ఈ ఇన్నింగ్స్ తర్వాత వైభవ్‌పై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. పాల బుగ్గల కుర్రాడు ఇలాంటి విలయాన్ని సృష్టించడమేంటని జనాలు ఆశ్చర్యపోతున్నారు.నిన్నటి మ్యాచ్ తర్వాత అందరి లాగే రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. పరాగ్ మాటల్లో.. ఇది చాలా అద్భుతంగా ఉంది. మేము వైభవ్‌తో 2 నెలలు గడిపాము. అతను ఏమి చేయగలడో చూశాము. మాకందరికీ తెలుసు వైభవ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ వస్తుందని. ప్రపంచ స్థాయి బౌలర్లైన గుజరాత్ బౌలర్లపై వైభవ్ సృష్టించిన బీభత్సకాండను మాటల్లో వర్ణించలేను.గత మూడు మ్యాచ్‌ల్లో స్వయంకృతాపరాధాల చేత చివరి నిమిషంలో మ్యాచ్‌లు కోల్పోయాము. ఈ మ్యాచ్‌లో అలా జరగకూడదనే మా ఆటతీరును మార్చాము. వీలైనంత త్వరగా మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నాము. ఈ ఫలితం కోసం మేము చాలా కష్టపడ్డాము. మా ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలిగాము. ఐపీఎల్లో ప్రతి రోజు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఈ సీజన్లో ఆర్సీబీ ప్రయాణం. సూర్య భాయ్ ఆటతీరు. ఇలా చాలా విషయాలను గమనిస్తున్నాము. ఈ విజయం చాలా పెద్దది. ఇలాంటి విజయాల కోసమే మేము అన్వేషిస్తున్నాము. ఈ విజయం ఏకపక్షంగా వచ్చింది. ఇది చాలా సంతోషాన్నిస్తుంది. తదుపరి మ్యాచ్‌లో ఎలాంటి వికెట్ లభిస్తుందో చూడాలి. -
IPLలో గుజరాత్ పై రాజస్థాన్ ఘన విజయం
-
RR VS GT: ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగా, జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు
ఐపీఎల్ 2025లో నిన్న (ఏప్రిల్ 28) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వైభవ్ విధ్వంసకాండ ఓ పక్క కొనసాగుతుండగానే రాయల్స్ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డుల్లోకెక్కాడు.ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసిన జైస్వాల్.. రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చడంతో పాటు ఆ జట్టు తరఫున 2000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా, ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాటర్‌గా, రాజస్థాన్ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ అరంగేట్రం నుంచి (2020) రాజస్థాన్ రాయల్స్‌కే ఆడుతున్న జైస్వాల్.. 62 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు ముందు రాయల్స్ తరఫున సంజూ శాంసన్ (3966), జోస్ బట్లర్ (3055), అజింక్య రహానే (2810), షేన్ వాట్సన్ (2372) 2000 పరుగులు పూర్తి చేశారు.ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లుక్రిస్ గేల్- 48 ఇన్నింగ్స్ల్లోషాన్ మార్ష్- 52రుతురాజ్ గైక్వాడ్- 57కేఎల్ రాహుల్- 60యశస్వి జైస్వాల్- 62మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో రాయల్స్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓ పక్క వైభవ్ విధ్వంసకాండ కొనసాగుతుండగానే జైస్వాల్ తన సహజ శైలిలో చెలరేగుతూ రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రియాన్ పరాగ్ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అంతకుముందు శుభ్‌మన్ గిల్ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్ బట్లర్ (26 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సాయి సుదర్శన్ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) సత్తా చాటడంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.


