నీకసలు సంస్కారం ఉందా?.. అతడికి ఇచ్చే గౌరవం ఇదేనా? | Riyan Parag Loses Cool Scolds Jaiswal for Sloppy fielding Fans Slams Him | Sakshi
Sakshi News home page

IPL 2025: నీకసలు సంస్కారం ఉందా?.. అతడికి ఇచ్చే గౌరవం ఇదేనా?

May 4 2025 6:03 PM | Updated on May 4 2025 6:57 PM

Riyan Parag Loses Cool Scolds Jaiswal for Sloppy fielding Fans Slams Him

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా  కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ త‌న స‌హ‌నాన్ని కోల్పోయాడు. ప‌రాగ్ త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు య‌శ‌స్వి జైశ్వాల్‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించాడు.

కేకేఆర్ ఇన్నింగ్స్ 10 వ ఓవ‌ర్ వేసిన రియాన్ ప‌రాగ్‌.. అంగ్‌క్రిష్ రఘువంశీకి మూడో బంతిని ఔట్‌సైడ్ హాఫ్ దిశ‌గా సంధించాడు. ఆ బంతిని రఘువంశీ వైడ్ లాంగ్-ఆఫ్‌పై లాఫ్ట్ దిశ‌గా షాట్ ఆడాడు. ఈ క్ర‌మంలో జైశ్వాల్ త‌న ఎడ‌మ వైపున‌కు ప‌రిగెత్తి బంతిని హాఫ్ చేశాడు.

అయితే జైశ్వాల్ ఫీల్డ్‌లో కాస్త నెమ్మ‌దిగా క‌ద‌ల‌డంతో రఘువంశీ, ర‌స్సెల్ రెండు ప‌రుగులు పూర్తి చేసుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన ప‌రాగ్‌.. దుర్భాషలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఈ క్ర‌మంలో ప‌రాగ్‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. నీకసలు సంస్కారం ఉందా? సీనియ‌ర్ ఆట‌గాడికి ఇచ్చే గౌర‌వం ఇదేనా అంటూ మండిప‌డుతున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన  కేకేఆర్‌ నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో రస్సెల్‌ 25 బంతుల్లో 57 టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కెప్టెన్‌ అజింక్య రహానే (24 బంతుల్లో 30), అంగ్‌క్రిష్‌ రఘువన్షీ (31 బంతుల్లో 44) రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో మహీశ్‌ తీక్షణ, రియాన్‌ పరాగ్‌, జోఫ్రా ఆర్చర్‌, యుధ్‌వీర్‌ సింగ్‌ చరక్‌ ఒక్కో వికెట్‌ తీశారు.


 

 

Advertisement
 
Advertisement
Advertisement