విండీస్ కెప్టెన్‌కు జాక్‌పాట్‌? రేసులో ఆ మూడు జ‌ట్లు! | Shai Hope likely-Gets-Jackpot-3-Teams-Intrested-Could Sign-IPL 2027-Auction | Sakshi
Sakshi News home page

IPL 2027: విండీస్ కెప్టెన్‌కు జాక్‌పాట్‌? రేసులో ఆ మూడు జ‌ట్లు!

Oct 19 2026 8:21 AM | Updated on Oct 19 2026 8:43 AM

Shai Hope likely-Gets-Jackpot-3-Teams-Intrested-Could Sign-IPL 2027-Auction

Photo Credit: Twitter

భార‌త్‌తో వ‌న్డే, టీ20 సిరీస్‌లో త‌న బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టిన‌ వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్‌కు ఐపీఎల్ 2027 వేలంలో జాక్‌పాట్ త‌గిలే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. త‌న శైలికి విరుద్ధంగా భార‌త్‌తో సిరీస్‌లో బ్యాటింగ్‌లో దుమ్మురేపిన హోప్ మొత్తంగా నాలుగు సెంచ‌రీలు సాధించాడు. 

రెండు సిరీస్‌లు క‌లిపి 539 ప‌రుగులు సాధించిన షై హోప్ మూడు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుల‌తో పాటు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును కూడా కైవ‌సం చేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే డిసెంబ‌ర్‌లో ఐపీఎల్ వేలం జ‌రిగే అవకాశ‌ముండ‌డంతో అత‌డి కోసం ముఖ్యంగా మూడు ఫ్రాంచైజీలు పోటీ ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. 

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ హోప్‌ను ద‌క్కించుకునేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఓపెన‌ర్‌గా రాణించ‌డంతో పాటు వ‌న్‌డౌన్‌లోనూ అద‌ర‌గొట్ట‌డం షై హోప్ ప్ర‌త్యేక‌త కావ‌డంతో ఈ మూడు జ‌ట్లు త‌మ ఓపెనింగ్ స్లాట్‌కు లేదంటే వ‌న్‌డౌన్‌లో ఆడించే అవ‌కాశాలున్నాయి. 

మ‌రి హోప్ కోసం ఈ మూడు జ‌ట్లు పోటీ ప‌డి ఎంత ధ‌ర‌కు అత‌డిని ద‌క్కించుకుంటాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మూడు జ‌ట్ల‌తో పాటు సీఎస్‌కే కూడా హోప్ ప‌ట్ల ఆస‌క్తిక‌రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే  హోప్‌కు ఐపీఎల్ కొత్తేమి కాదు. గ‌తంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన హోప్ 9 మ్యాచ్‌లాడి 183 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచ‌రీ కూడా న‌మోదు చేయ‌లేక‌పోయాడు. 

కానీ ఈసారి ప‌రిస్థితి పూర్తి భిన్నంగా క‌నిపిస్తోంది. ఆరంభం నుంచే దంచికొట్ట‌డం నైజంగా మార్చుకున్న హోప్ భార‌త్ పాలిట కొర‌క‌రాని కొయ్య‌లా మారాడు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ హోప్‌ను ద‌క్కించుకునేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో క‌లిసి ఓపెనింగ్‌లో దింప‌డ‌మే ఢిల్లీ టార్గెట్‌గా పెట్టుకుంది. 

మ‌రోవైపు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కూడా త‌మ బ్యాక‌ప్ ఓపెన‌ర్‌గా హోప్‌ను ఎంపిక చేసుకునే అవ‌కాశ‌ముంది. వైభ‌వ్‌-జైస్వాల్ ఓపెన‌ర్లుగా ఆడితే, హోప్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. ఇక గుజ‌రాత్ టైటాన్స్ కూడా హోప్ కోసం పోటీ లో ఉంది. వ‌న్‌డౌన్ బ్యాట‌ర్ లేదా బ్యాక‌ప్ ఓపెన‌ర్‌గా హోప్ సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని భావిస్తోంది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement