'శ్రేయ‌స్‌ను చంపి.. అభిషేక్‌ను పెళ్లి చేసుకొని; గిల్‌తో జ‌త‌క‌డ‌తా' | Anaya Bangar-Plays-Funny-Game-Choose-one-Abhishek-Shreyas-Gill-Likes More | Sakshi
Sakshi News home page

'శ్రేయ‌స్‌ను చంపి.. అభిషేక్‌ను పెళ్లి చేసుకొని; గిల్‌తో జ‌త‌క‌డ‌తా'

Oct 19 2026 7:01 AM | Updated on Oct 19 2026 7:10 AM

Anaya Bangar-Plays-Funny-Game-Choose-one-Abhishek-Shreyas-Gill-Likes More

Photo Credit: Twitter

భారత మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ బంగ‌ర్ కుమార్తె అన‌యా బంగ‌ర్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. అయితే ఈసారి ఏ పోరాటంతోనో లేక మ్యాచ్‌ ఆడడం వల్లో కాదు. ఆమెను అడిగిన ఒక ఫ‌న్నీ ప్ర‌శ్న‌కు అదిరిపోయే జ‌వాబుతో అన‌యా పేరు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇటీవ‌ల కృష్ణంక్ ఆత్రే యూట్యూబ్ చానెల్‌కు అన‌యా బంగ‌ర్ ఇంట‌ర్య్వూ ఇచ్చింది. 

ఈ నేప‌థ్యంలో ఆ ఇంట‌ర్వ్యూలో భార‌త క్రికెట‌ర్లు శుబ్‌మ‌న్ గిల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, అభిషేక్ శ‌ర్మ‌ల‌ను ఆప్ష‌న్లుగా ఇచ్చి.. 'కిల్, మ్యారీ, హుకప్‌' అనే ఆట ఆడాల‌ని అడిగారు. దీంతో అన‌యా వెంట‌నే ఏం ఆలోచించకుండా.. శ్రేయ‌స్‌ను చంపి, అభిషేక్ శ‌ర్మ‌ను పెళ్లి చేసుకొని, గిల్‌తో జ‌త క‌డుతా అని ఫ‌న్నీగా స‌మాధాన‌మిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక అన‌యా బంగ‌ర్ 2022లో లింగ‌మార్పిడి ఆప‌రేష‌న్ చేయించుకొని అమ్మాయిగా మారింది. జెండ‌ర్ ఆప‌రేష‌న్‌కు ముందు అన‌యా ముంబై త‌ర‌ఫున పురుషుల క్రికెట్ ఆడింది. భార‌త్‌లో ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు క్రికెట్ ఆడే అవ‌కాశం లేక‌పోవ‌డంతో లింగ నిర్ధార‌ణ శ‌స్త్ర చికిత్స చేయించుకున్న త‌ర్వాత క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించేందుకు ఆస్ట్రేలియాను ఎంచుకుంది. 

ఆస్ట్రేలియా క్రికెట్ ట్రాన్స్ జెండ‌ర్ క్రీడాకారిణులు పోటీ ప‌డేందుకు వీలుగా ఒక మార్గాన్ని ప్ర‌వేశపెట్ట‌డంతో అన‌యా మొద‌ట తాను భార‌త్‌లో ఆడేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని బీసీసీఐని కోరింది. కానీ బీసీసీఐ అనుమ‌తి నిరాక‌రించ‌డంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. వ‌చ్చే బిగ్‌బాష్ మ‌హిళ‌ల లీగ్‌లో అన‌యా బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంది.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement