breaking news
Anaya Bangar
-
‘ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.. బలమైన ఆధారాలున్నాయి’
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు అనయా బంగర్ (ట్రాన్స్‌జెండర్) క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున ఎలైట్ క్రికెట్లో ఆడేందుకు అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజనే కాప్ మాత్రం అనయా బంగర్ మహిళల క్రికెట్లో ఆడడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక ట్రాన్స్‌జెండర్‌కు మహిళల క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించిన ఆమె.. "ఇది పూర్తిగా హాస్యాస్పదం.. అనుమతించడానికి వీల్లేదు" అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. తాజాగా కాప్ విమర్శలపై అనయా బంగర్ స్పందించింది. "ఆమె (మరిజాన్ కాప్) వాదనలో ఉన్న బాధ నాకు అర్థమైంది. మాంచెస్టర్ యూనివర్శిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ నాకు పరీక్షలు నిర్వహించింది. ఒక సంవత్సరం పాటు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న తర్వాతే, నా శరీరం అథ్లెటిక్ సామర్థ్యాలకు సంబంధించి వాళ్లు నాకు 12 వారాల పాటు టెస్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిస్జెండర్ ఫీమేల్ అథ్లెట్ రేంజ్ పరిధికి లోబడే నా ఫిజికల్ పారామీటర్స్ ఉన్నాయి. నేను ప్రొఫెషనల్ మహిళల క్రికెట్లోకి అడుగుపెట్టడం వల్ల ఎవరికీ ఎలాంటి అన్యాయమైన ప్రయోజనం ఉండదు. అందుకు నా వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. మహిళల క్రీడల్లో సమ్మిళితత్వం, నిష్పక్షపాతం, గౌరవాన్ని కాపాడటంపై క్రికెట్ ఆస్ట్రేలియా సరైన విధానాలను రూపొందించింది. నేను ఇప్పటికే ఆ మార్గదర్శకాలను పాటిస్తున్నాను. అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు.శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి నా శరీరం టెస్టోస్టెరాన్ను ఉత్పత్తి చేయడం లేదు. నా టెస్టోస్టెరాన్ స్థాయి 0.6 నానోమోల్స్గా ఉన్నాయి. ఎవరినీ మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా నాకు అనుమతి ఇచ్చిందన్న వార్త వినడం, ప్రాథమికంగా మహిళల క్రికెట్ ఆడేందుకు నాకు ఒక మార్గాన్ని చూపించడం చాలా గొప్ప విషయం.’’ అని చెప్పుకొచ్చింది.చదవండి: ఎలా అనుమతిస్తారు? సంజయ్ బంగర్ కుమార్తెపై విమర్శలు! -
ఎలా అనుమతిస్తారు? సంజయ్ బంగర్ కుమార్తెపై విమర్శలు!
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్ తమ దేశం తరఫున క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్రాన్స్‌జెండర్ పాలసీ కింద అనయా బంగర్ తన టెస్టోస్టిరాన్ లెవెల్స్‌కు సంబంధించి రిపోర్ట్స్ పంపిస్తే ఎలైట్ క్రికెట్ ఆడడంతో పాటు మహిళల బిగ్‌బాష్ ఆడేందుకు అనుమతిస్తామని సీఏ ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజనే కాప్ బహిరంగంగా విమర్శలు వ్యక్తం చేసింది. "ట్రాన్స్‌జెండర్ అథ్లెట్‌గా అనయా బంగర్ క్రికెట్ ఆడేందుకు అనుమతించొద్దు. ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఆవలంబిస్తున్న వైఖరి పట్ల నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. అనయా బంగర్ మహిళా క్రికెటర్ ఎంతమాత్రం కాదు. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్ అథ్లెట్. ఇది పూర్తిగా హాస్యాస్పదం. ఆమె క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతించొద్దని బహిరంగంగా పేర్కొంటున్నా" అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.ఇక భారత మాజీ క్రికెటర్, కోచ్ అయిన సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్, ఈ ఏడాది మార్చిలో లింగ నిర్థారణ శస్త్రచికిత్స చేయించుకుంది. అనయా బంగర్‌కు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలైట్ క్రికెట్లో ట్రాన్స్‌జెండర్, లింగ వైవిధ్య క్రీడాకారుల చేరిక విధానంలో అనయా బంగర్‌కు తమ దేశం తరఫున క్రికెట్ ఆడేందుకు అనుమతి కల్పిస్తున్నట్లు తెలిపింది.క్రికెట్ ఆస్ట్రేలియా ఎలైట్ క్రికెట్లో ట్రాన్స్‌జెండర్, లింగ వైవిధ్య ఆటగాళ్ల విధానం ప్రకారం, సదరు ప్లేయర్ అర్హత పొందాలంటే ఒక ఆటగాడి సీరం టెస్టోస్టెరాన్ కనీసం 12 నెలల పాటు 10 nmol/L (నానోమోల్స్ పర్ లీటర్) కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ తాము కోరిన విధంగా ఆమె చేయించుకున్న పరీక్షల్లో రిపోర్ట్స్ అన్నీ అనుకూలంగా ఉంటే 2027 మార్చి నుంచి ఆస్ట్రేలియా ఎలైట్ స్థాయిలో క్రికెట్ ఆడేందుకు అనయా బంగర్‌కు అర్హత లభిస్తుంది అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. కాగా జాక్వి పార్ట్రిడ్జ్ (CA, హెడ్ ఆఫ్ ఇంటిగ్రిటీ), ఎమిలీ యేట్స్ (CA, ఇంటిగ్రిటీ పార్టనర్, లీగల్), పీటర్ రోచ్ (CA హెడ్ ఆఫ్ షెడ్యూలింగ్, ఆపరేషన్స్ అండ్ డొమెస్టిక్ క్రికెట్), డాక్టర్ పీటర్ హార్కోర్ట్ (CA, యాంటీ-డోపింగ్ మెడికల్ ఆఫీసర్), డాక్టర్ పిప్ ఇంగే (CA టీమ్ డాక్టర్)లతో కూడిన నిపుణుల ప్యానెల్ అనయా బంగర్ కేసుపై దృష్టి సారించి, మెడికల్ రిపోర్ట్స్ క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.ఇదే విషయంపై అనయా బంగర్ స్పందిస్తూ.. "అర్హత అనేది ఎంపిక కాదు. ట్రాన్స్జెండర్లకు ఎక్కడా ఆడే వీలు లేని సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. అంతమాత్రానా నాకు జట్టులో స్థానం లభించినట్లు కాదని గుర్తుంచుకోండి. వాళ్లు పెట్టిన షరతులన్నీ అంగీకరించడంతో పాటు టెస్టుల్లో అనుకూల ఫలితాలు వస్తేనే నేను విజయవంతమైనట్లుగా భావిస్తాను. అన్నీ సక్రమంగా జరిగి ఎంపికైనా గెలుపు సాధించినట్లు కాదు. స్థానం నిలబెట్టుకోవాలంటే నేను ఇంకా శిక్షణ పొందాలి, పోటీ పడాలి, రాణించాలి. ఒక క్రికెటర్‌గా నాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని నేను కోరుకుంటున్నా" అని చెప్పుకొచ్చింది. ట్రాన్స్జెండర్లకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం లేదని, 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో వారిపై నిషేధం విధించింది. అందుకే భారత్ తరఫున ఆడే అవకాశం లేనందునే అనయా బంగర్ క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు సిద్ధమవుతోంది.#WATCH | Mumbai, Maharashtra: On making a comeback in cricket, Anaya Bangar, a cricketer and the daughter of former Indian international cricketer and national batting coach, Sanjay Bangar, said, "...I am preparing to return to women's cricket in Australia with the aim of… pic.twitter.com/NVgrICOjgT— ANI (@ANI) August 27, 2026🚨South African cricketer Marizanne Kapp criticizes Anaya Bangar's inclusion in women's cricket🚨Marizanne Kapp:🗣️ I honestly don't think it's fair to the other women cricketers. Cricket Australia's decision to allow Anaya Bangar to play in the Women's Big Bash is hard to… pic.twitter.com/GodPoWTykc— Central Cricket (@arshdeep3444) August 28, 2026Read: ఆసీస్ తరఫున క్రికెట్ ఆడనున్న సంజయ్ బంగర్ కుమార్తె! -
ఆసీస్ తరఫున క్రికెట్ ఆడనున్న సంజయ్ బంగర్ కుమార్తె!
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్ (ట్రాన్స్‌జెండర్) సంచలన ప్రకటన విడుదల చేసింది. భారత్ తరఫున క్రికెట్ఆ డబోయేది లేదని, ఆస్ట్రేలియా తరఫునే ఫీమేల్ కమ్యూనిటీ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు మనసులోని మాటను బయటపె ట్టింది. మంగళవారం ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనయా బంగర్ మాట్లాడుతూ.. ఒక దశలో తాను క్రికెట్లోకి తిరిగి వచ్చే ఆశలను పూర్తిగా కోల్పోయానని, ఆ సమయంలో క్రికెట్ ఆస్ట్రేలియా తనకు క్రికెట్ ఆడే అవకాశం కల్పించిందని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. "నేను క్రికెట్ ఆడగలనని తెలిసిన రోజు నాకు స్పెషల్ డే. నేను మళ్లీ క్రికెట్ ఆడలేనేమో అనుకున్న రోజులున్నాయి. కానీ ఇవాళ ఫీమేల్ కమ్యూనిటీ క్రికెట్లో ఆడే అవకాశం కల్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కు కృతజ్ఞతలు. ఇది నాకు కచ్చితంగా మరో అవకాశం లాంటిది” అని చెప్పుకొచ్చింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌లో అనయా బంగర్ ట్రాన్స్‌జెండర్ మార్పిడి ఆపరేషన్ (వెగినోప్లాస్టీ) చేయించుకుని అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది. సర్జరీ పూర్తయ్యి ఆరు నెలల కావడంతో ఇప్పుడు అనయా బంగర్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైంది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఒక షరతుతో అనయా బంగర్ తమ దేశం తరఫున ఎలైట్ క్రికెట్ ఆడేందుకు ఒప్పుకుంది.అయితే బీబీఎల్ (బిగ్‌బాష్ లీగ్) వంటి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలంటే మాత్రం టెస్టోసిరాన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్లు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలైట్ క్రికెట్లో ట్రాన్స్‌జెండర్, లింగ వైవిధ్య ఆటగాళ్ల విధానం ప్రకారం, సదరు ప్లేయర్ అర్హత పొందాలంటే ఒక ఆటగాడి సీరం టెస్టోస్టెరాన్ కనీసం 12 నెలల పాటు 10 nmol/L (నానోమోల్స్ పర్ లీటర్) కంటే తక్కువగా ఉండాలి.ఇప్పటికే అనయా బంగర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలకు సంబంధించిన లేఖను పంపించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రెటీ హెడ్ జాక్వి పార్టిడ్జ్ మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున అనయా బంగర్ ఎలైట్ క్రికెట్లో ఆడాలనుకుంటే, మీ సీరం టెస్టోస్టెరాన్ గాఢత 10 nmol/L (నానోమోల్స్ పర్ లీటర్) తక్కువగా ఉన్నట్లు నిరూపిస్తూ వివరాలు అందించాలని కోరుతున్నాం. ఒకవేళ షరతులకు లోబడి నివేదిక ఉంటే అర్హత ప్రకారం ఆడేందుకు అనుమతిస్తాం.’’ అని చెప్పుకొచ్చారు. ట్రాన్స్జెండర్లకు అంతర్జాతీయ క్రికెట్లో ఆడే అవకాశం లేదని, 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో వారిపై నిషేధం విధించింది. దీంతో మన దేశంలో ట్రాన్స్జెండర్ల క్రికెటర్ల భవిష్యత్తుపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే భారత్ తరఫున ఆడే అవకాశం లేనందునే అనయా బంగర్ క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున ఆడేందుకు సిద్ధమవుతోంది. అయితే గతంలో అనయా బంగర్.. సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి క్రికెటర్లతో కలిసి ముంబై క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించారు.🔴ANAYA BANGAR CLEARED TO PLAY WOMEN’S CRICKET IN AUSTRALIA🤯- Anaya Bangar, daughter of former India cricketer Sanjay Bangar, has received clearance from Cricket Australia to play women’s community cricket.- She underwent gender-affirming surgery in March 2026 & had… pic.twitter.com/k9AIDzkLw5— Sam (@cricsam02) August 25, 2026🔴ANAYA BANGAR CLEARED TO PLAY WOMEN’S CRICKET IN AUSTRALIA🤯- Anaya Bangar, daughter of former India cricketer Sanjay Bangar, has received clearance from Cricket Australia to play women’s community cricket.- She underwent gender-affirming surgery in March 2026 & had… pic.twitter.com/k9AIDzkLw5— Sam (@cricsam02) August 25, 2026Read: వైఫల్యాలను దాచిపెట్టడానికి సిగ్గుండాలి: హాకీ దిగ్గజం -
సంజయ్ బంగర్ కూతురు సంచలన ప్రకటన
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు (ట్రాన్స్‌జెండర్) అనయ బంగర్ మరోసారి వార్తల్లో నిలిచింది. త్వరలో మహిళల క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా కొత్త చాప్టర్‌ను ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. ‘మీ అందరికీ ఒక శుభవార్త. నేను 2027లో మహిళల ఎలైట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. దీని గురించి చాలా విషయాలు పంచుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు చెప్పలేను. నాకు ఆ సంస్థ నుంచి అనుమతి వచ్చిందన్న విషయం మాత్రం స్పష్టం చేయగలను.’ అని చెప్పుకొచ్చింది.ట్రాన్స్జెండర్లను ఉమెన్స్ క్రికెట్లోకి అనుమంతించేది లేదంటూ వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలోనే ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే ఐసీసీ నిర్ణయాన్ని అనయ బంగర్ సవాల్ చేయడం సంచలనంగా మారింది. ట్రాన్స్జెండర్లకు మహిళల క్రికెట్లో ఆడే హక్కు ఎందుకు ఉండదో చెప్పాలని ఐసీసీని ప్రశ్నించింది. అంతేకాదు లింగమార్పిడి తర్వాత మహిళా క్రికెటర్లతో సమానంగా తన శారీరక స్థితి ఉందని పేర్కొన్న అనన్య బంగర్, తన రిపోర్టుల్లో మహిళా క్రికెటర్లకు ఉండే కండబలం, గ్లూకోస్, ఆక్సిజన్ లెవల్స్.. తనకు అలానే ఉన్నాయని నిరూపించుకుంటానని సవాల్ చేస్తూ బీసీసీఐ, ఐసీసీకి లేఖలు రాసింది. ఈ నేపథ్యంలోనే అనయ బంగర్ మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన ఆసుపత్రిలో చేయించుకున్న అదనపు రక్త పరీక్షలు, శస్త్ర చికిత్స వివరాలు సహా వైద్య, శారీరక సమాచారాన్ని ఒక సంస్థ (పేరు చెప్పలేని) పరిశీలించింది. ‘అనయ బంగర్ రిపోర్ట్స్‌ను సుశితంగా పరిశీలించాం. ట్రాన్స్‌జెండర్ అయినప్పటికీ, మహిళలతో సమానంగా శారీరక స్థితి ఉండడంతో అనయకు మహిళల క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇవ్వాల్సిందే’ అని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.అయితే అనయ బంగర్ తాను మహిళల ఎలైట్ క్రికెట్లో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, భారత మహిళల జట్టుకు ఆడడం మాత్రం కష్టమే. క్రికెట్ ఆడేందుకు ట్రాన్స్జెండర్లకు అనుమతి లేదనే ఐసీసీ నిబంధనలే ఇందుకు కారణం. పురుష దశ దాటిన తర్వాత లింగ మార్పిడి చేసుకున్న ట్రాన్స్జెండర్లు అంతర్జాతీయ మహిళల క్రికెట్లో పాల్గొనేందుకు అర్హులు కారు అని ఐసీసీ పేర్కొంది. ఇక అనయ తండ్రి సంజయ్ బంగర్ టీమిండియా తరఫున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. 2014 నుంచి 2019 వరకు సంజయ్ బంగర్ టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ తన కుటుంబం మద్దతుతో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారాడు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (HRT), జెండర్-అఫర్మింగ్ సర్జరీ పూర్తి చేసుకుని అనయా బంగర్గా గుర్తింపు పొందింది.😇 pic.twitter.com/pDOjd2B5mB— Anaya Bangar (@anayabangarbnxf) August 17, 2026Anaya Bangar gets candid on her upcoming debut in women’s cricket: I had given up on the hope of ever playing againFor Anaya Bangar, life has been a relentless battle of resilience, grit, and unwavering authenticity.Following her post-transition journey and a deeply personal… pic.twitter.com/h1xH292uAZ— Ritam English (@english_ritam) August 18, 2026Read: జడ్డూ చర్యపై గంభీర్ అసహనం!


