ఆసీస్ త‌ర‌ఫున క్రికెట్ ఆడ‌నున్న సంజ‌య్ బంగ‌ర్ కుమార్తె! | Anaya Bangar Gives Clarity-Will Play Cricket-For-Australia-Not India | Sakshi
Sakshi News home page

ఆసీస్ త‌ర‌ఫున క్రికెట్ ఆడ‌నున్న సంజ‌య్ బంగ‌ర్ కుమార్తె!

Aug 25 2026 6:26 PM | Updated on Aug 25 2026 6:50 PM

Anaya Bangar Gives Clarity-Will Play Cricket-For-Australia-Not India

Photo Credit: Twitter

భార‌త మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ బంగ‌ర్ కుమార్తె అన‌యా బంగ‌ర్ (ట్రాన్స్‌జెండ‌ర్‌) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. భార‌త్ త‌ర‌ఫున క్రికెట్ఆ డబోయేది లేదని, ఆస్ట్రేలియా త‌ర‌ఫునే ఫీమేల్ క‌మ్యూనిటీ క్రికెట్ ఆడాల‌నుకుంటున్న‌ట్లు మ‌నసులోని మాట‌ను బ‌య‌ట‌పె ట్టింది. మంగ‌ళ‌వారం ఒక మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అన‌యా బంగ‌ర్ మాట్లాడుతూ.. ఒక ద‌శ‌లో తాను క్రికెట్‌లోకి తిరిగి వ‌చ్చే ఆశ‌ల‌ను పూర్తిగా కోల్పోయాన‌ని, ఆ స‌మ‌యంలో క్రికెట్ ఆస్ట్రేలియా త‌న‌కు క్రికెట్ ఆడే అవ‌కాశం క‌ల్పించింద‌ని చెప్పుకొచ్చింది. 

ఆమె మాట్లాడుతూ.. "నేను క్రికెట్ ఆడగలనని తెలిసిన రోజు నాకు స్పెష‌ల్ డే. నేను మళ్లీ క్రికెట్ ఆడలేనేమో అనుకున్న రోజులున్నాయి. కానీ ఇవాళ ఫీమేల్ క‌మ్యూనిటీ క్రికెట్‌లో ఆడే అవ‌కాశం క‌ల్పించిన‌ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కు కృత‌జ్ఞ‌త‌లు. ఇది నాకు క‌చ్చితంగా మ‌రో అవ‌కాశం లాంటిది” అని చెప్పుకొచ్చింది.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో థాయ్‌లాండ్‌లో అన‌యా బంగ‌ర్ ట్రాన్స్‌జెండ‌ర్ మార్పిడి ఆప‌రేష‌న్ (వెగినోప్లాస్టీ) చేయించుకుని అబ్బాయి నుంచి అమ్మాయిగా మారింది. స‌ర్జ‌రీ పూర్త‌య్యి ఆరు నెల‌ల కావడంతో ఇప్పుడు అన‌యా బంగ‌ర్ క్రికెట్ ఆడేందుకు సిద్ధ‌మైంది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ష‌ర‌తుతో అన‌యా బంగ‌ర్ తమ దేశం తరఫున ఎలైట్ క్రికెట్ ఆడేందుకు ఒప్పుకుంది.

అయితే బీబీఎల్‌ (బిగ్‌బాష్‌ లీగ్‌) వంటి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలంటే మాత్రం టెస్టోసిరాన్ లెవెల్స్ త‌క్కువ ఉన్న‌ట్లు నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలైట్ క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్, లింగ వైవిధ్య ఆటగాళ్ల విధానం ప్రకారం, స‌ద‌రు ప్లేయ‌ర్ అర్హ‌త‌ పొందాలంటే ఒక ఆటగాడి సీరం టెస్టోస్టెరాన్ కనీసం 12 నెలల పాటు 10 nmol/L (నానోమోల్స్ పర్ లీటర్) కంటే తక్కువగా ఉండాలి.

ఇప్ప‌టికే అన‌యా బంగ‌ర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధ‌న‌ల‌కు సంబంధించిన లేఖ‌ను పంపించిన‌ట్లు తెలుస్తోంది. ఇదే విష‌య‌మై క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రెటీ హెడ్ జాక్వి పార్టిడ్జ్ మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ ఆస్ట్రేలియా త‌ర‌ఫున అన‌యా బంగ‌ర్‌ ఎలైట్ క్రికెట్‌లో ఆడాల‌నుకుంటే, మీ సీరం టెస్టోస్టెరాన్ గాఢ‌త 10 nmol/L (నానోమోల్స్ పర్ లీటర్) త‌క్కువ‌గా ఉన్నట్లు నిరూపిస్తూ వివ‌రాలు అందించాల‌ని కోరుతున్నాం. ఒక‌వేళ ష‌ర‌తుల‌కు లోబ‌డి నివేదిక ఉంటే అర్హ‌త ప్ర‌కారం ఆడేందుకు అనుమ‌తిస్తాం.’’ అని చెప్పుకొచ్చారు.  

ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవ‌కాశం లేద‌ని, 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో వారిపై నిషేధం విధించింది. దీంతో మ‌న దేశంలో ట్రాన్స్‌జెండ‌ర్ల క్రికెట‌ర్ల భ‌విష్య‌త్తుపై బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం  తీసుకోలేదు. అందుకే భార‌త్ త‌ర‌ఫున ఆడే అవ‌కాశం లేనందునే అన‌యా బంగ‌ర్ క్రికెట్ ఆస్ట్రేలియా త‌ర‌ఫున ఆడేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అయితే గ‌తంలో అన‌యా బంగ‌ర్‌.. స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, ముషీర్ ఖాన్ వంటి క్రికెటర్ల‌తో క‌లిసి ముంబై క్రికెట్‌కు ప్రాతినిధ్యం వ‌హించారు.

Read: వైఫల్యాలను దాచిపెట్టడానికి సిగ్గుండాలి: హాకీ దిగ్గజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement